🌺🍃 *----------------* 🍃🌺
*అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 356*
*( అందరిలోనా ఎక్కుడు హనుమంతుడు ... )*
🌺🍃 *----------------* 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 356 కి శుభ స్వాగతం ..🙏
*ప్రార్థన ః--*🌹🙏
*అధికుండందరిలోనన్*
*బ్రధాన పూజ్యుండు హనుమ బంటుతనములో !*
*బుధుడితడె దాస భక్తికి ,*
*మధురముగా రాముని దన మదిలో నిలిపెన్ !*
🌹🙏🌹
✍️ *--స్వీయపద్యము ( కందము )*
🌹🌹
( ఎవ్వరూ ఇతనికి సాటిలేని రీతిలో అధికుడైన వాడు ,
ప్రధానముగా రామునికి బంట్లలో సర్వశ్రేష్టుడని పేరు గాంచినవాడు ఈ *హముమంతుడు .*🙏
*శ్రీ రామునికి* దాసులమని చెప్పుకునేవారికందరికీ , ఇతడే గురువు .🙏
ఎంతో మధురముగా సతతము ఆ రామ నామమునే జపించుచూ , శ్రీ రామచంద్ర మూర్తిని తన మనస్సులో స్థిరముగా నిలుపుకున్న వాడు ఈ *హనుమంతుడు .*🙏
అటువంటి హనుమంతునకు సదా మంగళములు )🙏
🌹🙏🌹
🌺🍃 *----------------* 🍃🌺
అన్నమాచార్యుల వారు అనేకమైన సంకీర్తనలను హనుమంతుని వైభవాన్ని , అతని దాస్య గరిమనూ , పరాక్రమాలనూ అతి సుందరముగా కీర్తించుచూ రచించినారు .🙏
అటువంటి ఒక చక్కని హనుమ సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
🌺🍃 *----------------* 🍃🌺
🌹🌹
ఇదిగో ఇతడే అందరిలోకెల్లా గొప్పవాడు .ఇతడే *హనుమంతుడు .*🙏
గురుతుగా అదిగో ఆ మతంగ పర్వతము వద్ద తన ఉనికిని చక్కగా చాటి ప్రకాశిస్తున్నాడు ఈ *హనుమంతుడు .*🙏
🌹🌹
పుట్టుకతోనే మహిమాన్వితమైన కవచకుండలాలతో ,
అతి పవిత్రమగు అంగవస్త్రమును కవచముగా పొంది జన్మించాడు ఈ *హముమంతుడు .*🙏
అమితమైన పరాక్రమ శాలియై ,
బలిష్టమైన పిడికిలి గల చేతులతో ,భుజాలతో ,
తన పెద్దదైన తోకను విశేషముగా పైకి ఎత్తి అలరియున్నాడు ఈ *హనుమంతుడు .*🙏
🌹🌹
కావాలని తానే యత్నించి ఆ సముద్రమును దాటి మరీ ఆ లంకకు చేరి నిప్పుపెట్టి , ఆ లంకను చిందరవందర చేసి ,
అందరూ అటూ ఇటూ గందరగోళముగా భీతితో పరుగెత్తునట్లు చేసెను .🙏
చక్కగా సీతమ్మ వారి వద్దకు చేరి , బుద్ధి కుశలతతో పరిస్థితిని అంతా చక్కగా చెప్పి ,
ఆమెలో నిబ్బరము సడలకుండా ,తనపై నమ్మకము కలుగు రీతిన , తన మేనును విశ్వమంతా వ్యాపింప చేసి , చివరకు ధ్రువ మండలాన్ని కూడా తాకునట్లు చేసెను ఈ *పెద్ద హనుమంతుడు .*🙏
🌹🌹
స్థిరముగా తన మహిమలను ఎన్నో చూపి ,
దివ్యమైన ప్రకాశముతో , శౌర్య పరాక్రమములతో ఉన్నవాడై ,
తనకు తానే విచారించి మరీ భగవద్భక్తులకు సదా అండగా ఉంటూ రక్షించి కాపాడుకొనుచున్నాడు ఈ *హనుమంతుడు.*🙏
అంతటా వ్యాపించి ఇదిగో ఈ తిరుమల గిరిపై *శ్రీ వేంకటేశ్వరునకు* దాసుడై సదా అతని సేవలోనే నిలిచి యున్నాడు .
అట్టి *పొడవైన హనుమంతుడు* భక్తులకందరికీ వరములను ప్రసాదించుచున్నాడు .🙏
🌹🙏🌹
*ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
*( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 356)*
✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏
🌹🌹 *సంకీర్తన* 🌹🌹
అందరిలోనా ఎక్కుడు హనుమంతుఁడు
కందువ మతంగగిరి కాడి హనుమంతుఁడు
*|| పల్లవి ॥*
కనక కుండలాలతో కౌపీనముతోడ
జనియించినాఁడు యీ హనుమంతుఁడు
ఘన ప్రతాపముతోడ కఠిన హస్తాల తోడ
పెనుతోఁక యెత్తినాఁడు పెద్ద హనుమంతుఁడు
*|| చరణం ॥*
తివిరి జలధి దాఁటి దీపించి లంక యెల్లా
అవల యివల సేసె హనుమంతుఁడు
వివరించి సీతకు విశ్వరూపము చూపుతా
ధ్రువమండలము మోచె దొడ్డ హనుమంతుఁడు
*|| చరణం ॥*
తిరమైన మహిమతో దివ్య తేజముతోడ
అరసి దాసులఁ గాచీ హనుమంతుఁడు
పరగ శ్రీవేంకటేశు బంటై సేవింపుచు
వరములిచ్చీఁ బొడవాటి హనుమంతుఁడు
*|| చరణం ॥*
🌹🙏🌹🙏🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి