*యత్రాస్థి భోగో న చ తత్ర మోక్షః*
*యత్రాస్థి మోక్షో న చ తత్ర భోగః*
*శ్రీ సుందరీసేవనతత్పరాణాం*
*భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ*
అర్థము:
*యత్ర అస్తి భోగః* = ఎక్కడైతే భోగములను అనుభవించుట ఉంటుందో...
*న చ తత్ర మోక్షః* = అక్కడ మోక్షము ఉండదు.
*యత్ర అస్తి మోక్షః* = ఎక్కడైతే మోక్షము ఉంటుందో...
*న చ తత్ర భోగః* = అక్కడ భోగములు అనుభవించుట ఉండదు.
కానీ....
*శ్రీ సుందరీ సేవన తత్పరాణాం* = అమ్మవారిని సేవించుకొనుటలోనే మునిగి ఉండే వారికి...
*భోగః చ మోక్షః చ* =భోగము, మోక్షము రెండూ కూడా....
*కరస్థ ఏవ* = అరిచేతిలోనే ఉంటాయి (అందుబాటులో ఉంటాయి. )
తా॥
ఎక్కడైతే భోగములను అనుభవించుట ఉంటుందో... అక్కడ మోక్షము ఉండదు. ఎక్కడైతే మోక్షము ఉంటుందో... అక్కడ భోగములు అనుభవించుట ఉండదు. కానీ.... అమ్మవారిని సేవించుకొనుటలోనే మునిగి ఉండే వారికి... భోగము, మోక్షము రెండూ కూడా.... అరిచేతిలోనే ఉంటాయి (అందుబాటులో ఉంటాయి.)
*~శ్రీశర్మద*
8333844664
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి