🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
**తృతీయ స్కంధము*
*కటి విరాజిత పీత కౌశేయ శాటితో; వితత కాంచీగుణ ద్యుతి నటింప*
*ఆలంబి కంఠహారావళి ప్రభలతోఁ; గౌస్తుభ రోచులు గ్రందు కొనఁగ*
*నిజ కాంతి జిత తటిద్ర్జ కర్ణకుండల; రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ*
*మహనీయ నవ రత్నమయ కిరీటప్రభా; నిచయంబు దిక్కుల నిండఁ బర్వ*
నడుముమీద మెరిసిపోతున్న పట్టుపీతాంబరం మీద మొలత్రాడు దీప్తి చిందులు త్రొక్కుతున్నది. చాలా పొడవుగా వ్రేలాడుతున్న హారాల కాంతులను కౌస్తుభమణి కాంతులు మించిపోతున్నాయి. తన కాంతులనే మెరపుల గుంపులను జయించిన చెవులకు ఆభరణాలైన కుండలాల కాంతులను చెక్కిళ్ళ వెలుగులు మరింత పెంపొందిస్తున్నాయి. చాలా గొప్పవి అయిన తొమ్మిది రకాల రత్నాలు పొదిగిన కిరీటం ప్రభలు దిక్కులందంతటా వ్యాపిస్తున్నాయి. విలాసంగా ఆస్వామి తన పాదాలదగ్గర ఉన్న గరుత్మంతుడి భుజంమీద ఎడమ చేతిని ఉంచాడు. ఆ చేతికున్న వలయాలు, కంకణాలు, కేయూరాలూ వెలుగులను వెదజల్లు తున్నాయి. రెండవ చేతితో ఒక సుందరమైన పద్మాన్ని విలాసంగా త్రిప్పుతూ ప్రకాశిస్తున్నాడు ఆ స్వామి.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి