🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
**తృతీయ స్కంధము*
*భరమగుచున్న దుర్వ్యసనభాజనమై, ఘనదుఃఖ మూలమై*
*యరయగ పెక్కుతూంట్లు గలదై క్రిమిసంభవమైన యట్టిదు*
*స్తరబహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్*
*సరసిజనాభ భూరిభవసాగరతారక పాదపద్మముల్*
అయ్యయ్యో! తల్లిగర్భంలో ఉండటం ఎంత ఘోరమైన విషయం! ఎందుకంటే దానిని భరించటం చాలాకష్టం. అది చాలాచాలా వ్యసనాలకు పాదు. గొప్పదుఃఖాలకు మూలం. అన్నీ చిల్లులే. అంతేనా అక్కడ అసహ్యమైన సూక్ష్మజీవులు పుట్టి తనచుట్టూ తిరుగుతూ బాధిస్తూ ఉంటాయి. దానినుండి తప్పించుకోవటం తేలిక పని కాదు. పైగా అటువంటవి లెక్కపెట్టటానికి కూడా సాధ్యంకానివి. అటువంటి మహాభయంకరమైన దుఃఖాన్ని తొలగించుకోవటంకోసం శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను నిరంతరంగా సేవించుకొంటూ ఉంటాను. అవేకదా చాలా పెద్దది అయిన సంసారమనే సముద్రంనుండి జీవుణ్ణి తరింపజేసేవి!
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి