🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
. *🌹వేమన పద్యములు🌹*
. *అర్థము - తాత్పర్యము*
. *Part - 19*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*💥వేమన పద్యాలు-- 52*
*అక్షయాత్మకంబు నర్థింప గురిగని*
*నిశ్చయంబుగాను నిలిపి మనసు*
*రక్ష గట్టినట్లు రట్టడి మాన్చరా*
*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*
*🌹తాత్పర్యము --*
మనసు నిబ్బరము చేసుకుని , చక్కని లక్ష్యముతో ముందుకు సాగువాడే వివేకిగా చెప్పబడును.
*💥వేమన పద్యాలు -- 53*
*అక్షరంబు జదివి యందున గనలేక*
*హెచ్చు తక్కువనుచు యేపుమీరి*
*యక్షరాత్ముడన్న యతనికి ఫలమేమి*
*నిశ్చయంబు దెలుపు నీవు వేమా*
*🌹తాత్పర్యము --*
ఎన్ని అక్షరాలు చదివినా , ఎంత పండితుడైనా దైవమును చూడలేనివాడు అక్షరాత్ముడు కాలేడని తెలియవలెను.
*💥వేమన పద్యాలు -- 54*
*అక్షరంబెరుగని యాచార మదియేల*
*తాను దినని యట్టి ధన మదేల*
*నొరుల మేలుజూచి యోర్వని తనువేల*
*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*
*🌹తాత్పర్యము --*
చదువు అన్నిటికిని ఆచార సాంప్రదాయములకును మూలము.
ఆ చదువే లేనిచో ఇక ఆచారమేమిటి ?
సాంప్రదాయమేమిటి ?
ధనవంతుడైన తాను తిని , ఇతరులకింత పెట్టవలెను.
కుదువబెట్టిన , నేలపాలో , దొంగపాలోయగును.
మనిషన్న తరువాత ఇతరులకు ఉపయోగపడాలి.
ఉపకారం చేయాలి.
ఇతరుల బాగోగులు చూసి ఈర్షపడు వాడు నిరర్ధకుడుగా నుండును.
*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి*
*సర్వేజనా సుఖినోభవంతు*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి