25, ఫిబ్రవరి 2024, ఆదివారం

అంతర్వేది ఏకాదశి

 *గోదావరి తీరాన.....* *నరహరి రూపాన!*

✍️ కడియం త్రినాథస్వామి,  

      చింతా నరసింహస్వామి.     

(నేడు అంతర్వేది ఏకాదశి - లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య రథోత్సవ వేళ... )

🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏

*వశిష్ఠ గలగలలు... సాగరం సవ్వళ్లు... వాటిని మరిపించేలా గోవింద© నామస్మరణ. ఇది ప్రఖ్యాత నృసింహ క్షేత్రం అంతర్వేది వైభవం. దేవదేవుడి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైన తరుణాన తూర్పుగోదావరి జిల్లాలోని ఈ క్షేత్రం వేలాది మంది భక్తులతో ఇల వైకుంఠంగా మారనుంది.*

🕉️┅━❀꧁꧂❀┅━🕉️

✳️‌ *స్తంభంలో నుంచి ఆవిర్భవించి ప్రహ్లాదుని రక్షించినా...* 


✳️ *శ్రీశైల మహారణ్యంలో సింహగర్జనలు చేస్తూ ఆదిశంకరులను కాపాడినా...* 


✳️‌ *సర్వకాల సర్వావస్థల్లోనూ సరహరి భక్తులవెంట తానున్నానని చాటుతూనే ఉన్నారు.*


✳️ అలాంటి నృసింహుడు వెలసిన ప్రఖ్యాత క్షేత్రాల్లో *అంతర్వేది* ఒకటి. నిత్య హోమాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే స్వామివారి వైభవం ఇక్కడ చూసి తరించాల్సిందే. 


✳️‌ ప్రస్తుతం అంతర్వేది ఆలయం ఉన్న ప్రాంతంలో బ్రహ్మ, యజ్ఞం చేశాడని చెబుతారు. అఖండగోదావరి నుంచి ఓ పాయను తెచ్చి సాగరంలో కలిపిన పశిష్ట మహర్షి తపస్సు చేస్తుండగా హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవిలోచనుడు ఆయన సంతానాన్ని నాశనం చేశాడని, మహర్షి ప్రార్ధనతో ప్రత్యక్షమైన నారసింహుడు రాక్షస సంహారం చేశాడని^... వశిష్టుడి అభ్యర్ధన మేరకు లక్ష్మీనృసింహస్వామిగా ఇక్కడ వెలిశాడని పురాణ కథనం. 


✳️‌ స్వామి ఇక్కడ పశ్చిమాభిముఖుడై ఉంటారు. ఇక్కడికి సమీపంలోని కేశవదాసుపాలేనికి చెందిన మందపాటి కేశవదాసు అనే యాదవుడు కర్రలతో పందిరిని నిర్మించాడు. కొంతకాలానికి సప్తసాగర యాత్రకొచ్చిన రెడ్డిరాజులు చెక్కతో ఆలయాన్ని నిర్మించారు. క్రీ.శ. 1823లో ఓడలరేవుకు చెందిన *^కొపనాతి కృష్ణమ్మ^*అ ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల్లో ఉంది. పెద్దాపురం సంస్థానాదీశులు, మొగల్తూరు రాజవంశీయులు ఆలయాన్ని పరిరక్షించారు. ఏటా మాఘ మాసంలో స్వామివారి దివ్య కల్యాణోత్సవాలు జరగుతాయి. ఆగమోక్తంగా పది రోజుల పాటు జరిగే పరిణయోత్సవాలు నేత్రపర్వం కలిగిస్తాయి.


✳️ కల్యాణోత్సవాల అంకురార్పణలో భాగంగా తొమ్మిది పాళికల్లో నవధాన్యాలు పోసి అవి బాగా చిగురించాలని మంత్రోచ్ఛరణతో పూజలు చేస్తారు. అదే రోజు ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద గరుడపటాన్ని ఆవిష్కరించి సకల దేవతాగణాన్ని కల్యాణానికి ఆహ్వానం పలుకుతారు.


✳️ నాలుగో రోజు దశమినాటి రాత్రి ఆరుద్రా నక్షత్ర యుక్త తులాలగ్న పుష్కరాంశలో స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆలయానికి ఎదురుగా ఉండే వేదికపై ఈ క్రతువును నిర్వహిస్తారు.


✳️ ఏడో రోజు పండిత సదస్యం అనంతరం రాత్రి స్వామివారిని అశ్వవాహనం పై ఊరేగిస్తారు. ఉత్సవమూర్తులను 16 కాళ్లమంపడం వద్దకు తీసుకువస్తారు అక్కడ ఆలయంలోని అర్చకులు, పేరూరు బ్రాహ్మణులకు మధ్య *చోర సంవాద మట్టం* ఆసక్తిదాయకంగా జరుగుతుంది.


✳️ ఆలయంలోని సుదర్శన పెరుమాళ్ విగ్రహం ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. 15 చేతులు, 16 ఆయుధాలతో చుట్టూ జ్వాలలు, వెనుక సుదర్శన యంత్రం, కింద గురుడ వాహనంతో ఉన్న దీనిని *∆బలిబేరం∆* గా సంబోధిస్తారు. 


✳️ కల్యాణోత్సవాల్లో సాగర జలాల్లో స్వామివారికి ఏటా సుదర్శన పెరుమాళ్ కు చక్రస్నానోత్సవాన్ని నిర్వహిస్తారు. తొమ్మిదో రోజు *మాఘ పౌర్ణమి* నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది.


✳️ పదో రోజున ఆలయానికి సమీపంలో దక్షిణ దిశగా ఉన్న తటాకంలో తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది. 


✳️ రోజూ ఉదయం, సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులకు వాహన సేవ జరుగుతుంది. *సింహ, హనుము, శేష, హంస, గరుడ, ఆశ్వ, గజ, పొన్న, రాజాధిరాజు వాహనాల* పై లక్ష్మీ నృసింహస్వామి ఊరేగుతారు.

🕉️┅━❀꧁꧂❀┅┉🕉️

✳️ కల్యాణం జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం *దివ్య రథయాత్ర* జరుగుతుంది. స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి దిక్కులన్నీ పిక్కటిల్లేలా భక్తులంతా గోవింద నామస్మరణలు చేస్తుండగా రథాన్ని ముందుకు కదుపుతారు. రధం స్వామివారి సోదరి ఆయిన *గుర్రాలక్కమ్మ* ఆలయం చెంతకు చేరుతుంది. ఆమెకు చీర, సారె సమర్పించే ఘట్టాన్ని మంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తారు. 


✳️ నృసింహస్వామి రక్తవిలోచనుణ్ణి చంపుతున్నప్పుడు అతని శరీరం నుంచి నేలపై పడిన ప్రతి రక్త బిందువు నుంచి ఒక్కో రాక్షస రూపం రావడంతో ప్రత్యక్షమైన *అశ్వరూఢాంబిక* తన నాలుక రాసి అసురుడి రక్తం నేలపై పడకుండా చేసిందని చెబుతారు. ఆ అశ్వరూపంబినే గుర్రాలక్కమ్మగా ఆరాధిస్తుంటారు. పసుపు, కుంకుమలతో పూజలు చేసి ప్రసాదాలను అందజేస్తారు.


🙏 *శ్రీ లక్ష్మీనారసింహాయనమః* 🙏



🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🚩

కామెంట్‌లు లేవు: