17, మార్చి 2024, ఆదివారం

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 57*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 166*


*అన్ని జాతులకును నాధారమైనట్టు*

*లున్న సామగాది మిన్న ఋషుల*

*నెన్ని జన్మములకు నెక్కడ గానము* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అన్ని జాతులకు ఆధారమైన ఋషుల జన్మమును ఎక్కడను చూడలేము.

ఋషితత్వమలవడుట పురాకృతసుకృతము.


*💥వేమన పద్యాలు -- 167*


*అన్ని జాతులందు నధికుల మనుచును*

*యజ్ఞ పశువు జంపి యగ్ని నిడుచు*

*మల్ల మందు బెట్టి మాంసంబు దిందురు*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

బ్రాహ్మణులు అన్ని జాతులకంటే తమ జాతే గొప్పదని పలుకుచు యజ్ఞయాగాదుల అగ్నిలో కాల్చి ప్రసాదముగా

తిందురు.


*💥వేమన పద్యాలు -- 168*


*అన్ని జాడ లుడుగ నానందకాముడై*

*నిన్ను నమ్మ జాలు నిష్ఠతోడ*

*నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

ఆశలన్ని తీరిపోయాక దేవుని గూర్చి నమ్మబలికి , మానవుడు ముక్తి కాముకు డౌతాడని భ్రమపడుదురు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: