🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*షష్ఠ స్కంధం*
*సతతము కృష్ణ పాదజలజంబులయందు మనంబు నిల్పు సు*
*వ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని యుగ్రపాశ సం*
*హతుల ధరించు తత్సుభటవర్గములం గలలోన గానరే*
*గతులను దుష్టకర్మములు గైకొని వారల జెందనేర్చునే?*
రాజా ! శ్రీకృష్ణుడు పరమాత్మ. నామరూపాలులేని పరమాత్మ లోకాలను అనుగ్రహించటం పనిగా శ్రీకృష్ణమూర్తియై భూమికి దిగివచ్చాడు. ఆయన పాదపద్మాలయందు నిరంతరం మనస్సును నిక్షేపించాలి. అలా చేసేవారిని ‘సువ్రతులు’ అంటారు. ఆ మహాత్ముడు మానవులను ఉద్ధరించటంకోసం భూమిపై సంచరించిన కాలంలో కొన్ని గుణాలను లీలలుగా ప్రకటించాడు. మనం అట్టి అతని శుద్ధగుణాలయందు చెదరని అనురాగం కలవారమైపోవాలి. అలా అయిన వారు భయంకర పాశాల దెబ్బలను వడ్డించే యమభటుల గుంపులను కలలో కూడా చూడరు. ఎటువంటి ఘోరమైన కర్మముల చేయగల అధికార పురుషులైనా కృష్ణభక్తుల దాపునకు ఏవిధంగానూ రాలేరు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి