21, ఏప్రిల్ 2024, ఆదివారం

కాశీ యాత్ర (ఐదవ భాగము)

 

కాశీ యాత్ర (ఐదవ భాగము

7 తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి రూముకు తాళం వేసి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు  మీదకు)వెళ్ళాము మేము అక్కడకు చేరుకోగానే  మా కారు సిద్ధంగా వుంది డ్రైవరు పేరు యాదవ్. మేము ఫోను చేసి కారుదగ్గరకు వెళ్లి మా లగేజీని డిక్కీలో పెట్టి కూర్చున్నాము. అది మారుతి డిజైర్ తెల్ల కారు. డ్రైవరు చిన్నగా కారు నడిపి ఒక అర్థగంటకు కాశీ పట్టణాన్ని వదలి గయావైపు వెళ్లే రోడ్డు ఎక్కించాడు. . మధ్యలో బనారస్ హిందూ యూనివర్శిటీ  గేట్లను దాటుతూ మా కారు వెళ్ళింది. అందులో ఒక గేటు పేరు హైదరాబాదు గేటు అని డ్రైవరు చెప్పాడు. కొంతదూరం వెళ్లిన తరువాత కారును ఒక డాబా ముందు ఆపి మీరు ఇక్కడ టిఫిన్ చేయవచ్చు అన్నాడు. మేము టిఫిన్ చేసాముఅక్కడ కూడా మన టిఫిన్లే వున్నాయి. దోశ 70 రూపాయలు, ఇడ్లీ ప్లేటు (4 చిన్నవి) 50 రూపాయలు, టి  10 రూపాయలు. తరువాత ఎక్కడ ఆగకుండా మాకారు మధ్యాన్నం 12 గంటల సమయంలో గయను చేరింది. ముందుగా విష్ణు పాద ఆలయూయాన్ని చూసాము. అక్కడ క్యూ పద్దతి లేదు సెల్ఫోనులు లోపలి అనుమతించరుఒక్కసారిగా ఒక గుంపు గుంపుగా భక్తులను గుడిలోకి వదులుతారునాకు పద్ధతి మంచిగా అనిపించలేదు. ఎట్లాగో మేము గుంపులోవెళ్లి విష్ణుపాదాన్ని దర్శించుకొని వంటిగంటకల్లా బయటకు వచ్చాము. మా డ్రైవరు తిరిగి మమ్మలను ఊళ్లోకి తీసుకొని వచ్చాడు. ఊర్లో తెలుగులో ఆంధ్ర భోజనం అని వ్రాసి ఉన్న ఒక హోటలులో భోజనం చేసాము. మాత్రం రుచిగా లేదు ప్లేటుకు 120 తీసుకున్నారు. అక్కడినుంచి మేము అక్కడి శక్తిపీఠం అయినా మాంగల్యగౌరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. దేవాలయం ఒక చిన్న కొండ మీద  వున్నది. మేము వెళుతుంటే ఎవరో భక్తులు అక్కడ ఇప్పుడు దర్శనం కావటం లేదు అందుకే మేము తిరిగి వెళుతున్నాము అని అన్నారు. వారి మాటలు మాకు కొంత నిరుత్సాహం కలుగ చేసింది. మేము అమ్మవారిని తలుచుకొని కొండ  ఎక్కాము అక్కడ క్యూ చాలా పెద్దగా వుంది. అక్కడ ఒక టేబులు ముందు ఒక ముగ్గురు కూర్చొని వున్నారు. మేము వారలను విచారిస్తే కొంత సేపు లాగండి ఇక్కడికి డిప్యూటీ సీఎం వస్తున్నారుఆయన వెళ్లిన తరువాత మీరు ఒక్కొక్కరు రూ 250 కడితే ప్రత్యేక దర్శనం లభిస్తుందని అన్నారు. మేము రూ 750 ఇచ్చి టికెట్లు తీసుకున్నాము. ఒక ఆర్ గంటలోనే మాకు దర్శనమ్ అయ్యింది. నేను అమ్మవారు అంటే మన దేవాలయాలలో మాదిరిగా తల్లి విగ్రహం ఉంటుందని అనుకున్నా కానీ ఆలా లేదు ఒక చిన్న గది మధ్యలో ఒక చిన్న గద్దెమీద దీరఘాచేతురస్రాకారంలో వెండితాపడం చేసిఉంది. దానిమీద ఒక దీపం వెలుగుతున్నది. మేము కొండదిగి క్రిందికి రాగానే మా డ్రైవరు మమ్మలను బుద్ధగయాకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మా కారు వెళ్ళటానికి పర్మిషన్ ఉండదట అక్కడి వాహనాలలోనే వెళ్ళాలట. మేము ఒక ఈరీక్షను 400 రూపాయలకు మాట్లాడుకొని అన్ని బుద్ధ దేవాలయాలను చూసాము. ఎండ మండిపోతున్నది. మేము కారులో గొడుగులు తెచ్చాము కానీ వాటిని అక్కడే వదలటం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. 3-4 గంటల సమయంలో తిరుగు ప్రయాణం చేసాము. సాయంత్రం 5 గంటల సమయంలో ఉదయం టిఫిన్ చేసిన హోటలులో మళ్ళి వెళ్లి టీ  తాగి ప్రయాణం కొనసాగించాము. డాబా హోటలు చుట్టూ గోధుమ పంట కోతకు సిద్ధంగా ఉండి వుంది. నేను మొదటిసారి గోధుమ పంటను చూడటం. రాత్రి 7 గంటల సమయంకల్లా మమ్మలను వారణాసిలో బెంగాలీ టోలి వద్ద దింపాడు దారిలో ఒక పార్ధవ శరీరాన్ని ఊరేగిస్తూ తీసుకొని  వెళుతున్నారు. బాడీని మణికంటిక గాటుకే తీసుకొని వెళతారు అని డ్రైవరు చెప్పాడు. నేను నా కాళ్ళ చెప్పులు కారులోనే విప్పి మోక్షప్రాప్తి పొందిన జీవికి నమస్కరించాను. ప్రతి రోజు రాత్రి 12 గంటల సమయంలో మణికంటిక గాటులో జ్వలించే చితి భస్మాన్ని తీసుకొని వచ్చి కాశీ విశ్వనాధునికి అభిషేకం చేస్తారని డ్రైవర్ చెప్పాడురాత్రి రూముకు చేరుకోగానే మేము ఆశ్రమంలో పెట్టిన టిఫిన్ తిని విశ్రాన్తి తీసుకున్నాము. మరుసటి రోజు ప్రయాగ వెళ్ళటానికి అదే డ్రైవరుతో మాట్లాడుకున్నాము ట్రిప్ ఖరీదు 3,400/- 

 7 తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి రూముకు తాళం వేసి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు  మీదకు)వెళ్ళాము. మా డ్రైవరు సిద్ధంగా వున్నాడు. రోజు మనం తొందరగానే వస్తాము ప్రయాగ 110 కిలోమీటర్లే అని అన్నాడు. 8 గంటల సమయంలో ఒక హోటలు ముందు కారుని ఆపి టిఫిన్ చేయమన్నాడు. మేము టిఫిన్ చేసాము. అక్కడినుంచి దాదాపు 9-30 కల్లా ప్రయాగ గంగా బ్రిడ్జి మీదుగా ప్రయాగరాజ్కు తీసుకొని వెళ్ళాడు. బ్రిడ్జిమీద కారువున్నప్పుడు దూరంగా ఒక వంతెనను చూపించి అది యమునా నదిమీద వున్నదని చెప్పాడు. మమ్మలను యమునా నదీ తీరానికి తీసుకొని వెళ్లి మీరు బోటులో త్రివేణి సంగమంకు వెళ్లి స్నానాలు చేయమని చెప్పాడు. మేము ఒక చిన్నపడవను 1600 రూపాయలకు మాట్లాడుకొని వెళ్ళాము. అక్కడకు వెళ్లి స్నానాలు చేసి తిరిగి వడ్డుకు వచ్చాము. అక్కడే వున్న హనుమంతుని దేవాలయానికి వెళ్ళమని చెపితే మేము వెళ్ళాము. అక్కడ స్వామి పడుకొని వుంటారు. "లేటేహుయే బడా హనుమాన్ దేవల్ " అని చెప్పాడు. తొందరలోనే స్వామీ దర్శనం అయ్యింది. అక్కడినుంచి మమ్ములను ఇంకొక శక్తీ పీఠం అయిన మాతా మాధవేశ్వరి దేవాలయంకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మన దేవాలయాల్లో మాదిరిగానే బారికేట్లు వున్నాయి కానీ జనం ఎక్కువ లేక పోవటం వలన దర్శనం త్వరగానే అయ్యింది. అక్కడ అమ్మవారు ఒక ఉయ్యాల కట్టి క్రింద ఒక నాలుగు పలకల ఫలకం వుంది. విగ్రహం లేదు. అమ్మవారి దర్శనం అవ్వగానే మేము తిరోన్ముకులం అయ్యాము. రోజు సోమవారం కాబట్టి మ్యూజియంకు సెలవు అని చెప్పి మమ్మలను మ్యూజియంకు తీసుకొని వెళ్ళలేదు. మధ్యాన్నం 2-30కు రూముకు చేరుకొని సత్రంలో భోజనం చేసి విశ్రమించి మరుసటి రోజు హైదరాబాదు ప్రయాణానికి సంసిద్ధులం అయ్యాము. డ్రైవరుకు తిరిగి ఉదయం 5 గంటలకు వచ్చి మమ్మలను విమానాశ్రయంలో విడవాలని చెప్పాము. రాత్రే రూము రెంటు 1500 చెల్లించి రసీదు తీసుకున్నాము. ఆంధ్రశ్రమంలో సాయంత్రం 7ఇంటికి ఒక డాక్టరు రూము 1 లో వస్తారు అన్నారు. నేను నాకు కొంత జలుబుగా ఉంటే డాక్టరు దగ్గరకు వెళ్లి మందులు తీసుకున్నాను. మందులు కూడా ఉచితంగా ఇస్తారు

9 .తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి సామానులన్నీ తీసుకొని  రూముకు తాళం వేసి గేటుదగ్గర వాచిమనుకు రసీదు చూపించి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు  మీదకు)వెళ్ళాము. మా కారు మాకోసం సిద్ధంగా వుంది. కారులో కూర్చోగానే ఒక 40 నిముషాలలో మమ్ములను విమానాశ్రయంలో దింపాడు. నేను డ్రైవరుకు 700 రూపాయలను ఇచ్చాను. టైము ప్రకారం మా విమానం 7-40 కి వచ్చింది. వారణాసిలో చెకింగ్ మన హైదరాబాదుకన్నా ఎక్కువగా వుందిమా సూటుకేసును కాబిన్లో వేయక తప్పదన్నారు. దానికి ట్యాగ్ వేయించుకొని మిగిలిన రెండు బ్యాగులు నేనొకటి నా కుమారుడు ఒకటి పట్టుకొని విమానం ఎక్కాము. మా విమానం యెరిండియా ఎక్ష్ప్రెస్స్ మేము హైదరాబాదులో 10 గంటలకల్లా దిగాము. ఒక టాక్సీ మాట్లాడుకొని ఇంటికి చేరాము. దానితో మా యాత్ర పరిసమాప్తం ఐయ్యింది

శుభం బురియత్ 

సర్వజన సుఖుఇనోభవంతు 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

 

కామెంట్‌లు లేవు: