👆శ్లోకం
యుగాదికృద్యుగావర్తో.
నైకమాయో మహాశనః|
అదృశ్యోవ్యక్తరూపశ్చ
సహస్రజిత్ అనన్తజిత్||.
ప్రతిపదార్థ:
యుగాదికృత్ --యుగమును ఆరంభించువాడు; యుగములను సృష్టించి యుగారంభమున సృష్టికార్యము చేయువాడు; వటపత్రశాయి.
యుగావర్తః --యుగములను ప్రవర్తింపజేయువాడు, కాల చక్రమును నడుపువాడు; కాల స్వరూపుడు.
నైకమాయః --అనేకములైన అద్భుతములకు ఆలవాలమైనవాడు; ఎన్నోవిధములైన మాయా స్వరూపములను ధరించువాడు.
మహాశనః --విపరీతమైన ఆకలి గలవాడు, కల్పాంతమున సమస్తమును భక్షించువాడు; ప్రళయకాలమున అంతటిని తనయందు లయమొనర్చుకొనువాడు; గొప్పగా వ్యాపించినవాడు.
అదృశ్యః --కానరానివాడు; ఇంద్రియ, మనోబుద్ధులకు కనరాని, ఊహింప శక్యము గాని చరిత్ర గలవాడు (ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా? ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా?).
వ్యక్తరూపః--స్పష్టమైన రూపము కలవాడు, భక్తులకు దర్శనమొసగువాడు; స్వయంప్రకాశకుడు, అవతార మూర్తి, ప్రత్యక్షదైవము; యోగముచే కనుపించు రూపము కలవాడు.
అవ్యక్తరూపః -- తెలియరానివాడు.
సహస్రజిత్ --వేలాది యుగములను జయించువాడు; వేలాది రాక్షసులను జయించువాడు (రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః)
అనంతజిత్ --అంతులేని విజయములు కలిగినవాడు; అవధులు లేకుండా ప్రకాశించేవాడు; తన అనంత మహిమలను ఇతరులెరుగజాల నట్టివాడు.
యుగావర్త: - యుగములను త్రిప్పువాడు.
నైకమాయ: - తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి, ప్రదర్శించువాడు.
మహాశన: - సర్వమును కబళించువాడు.
అదృశ్య: - దృశ్యము కానివాడు.
వ్యక్తరూప: - భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు.
సహస్రజిత్ - వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు.
అనంతజిత్ - అనూహ్యమైన శక్తి సామర్ద్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి