18, నవంబర్ 2024, సోమవారం

తండ్రి సమానులు

 *మనకు తండ్రి సమానులు ఎంత మంది ?* 


శ్లో॥ జనితా చోపనీ తాచ త్క యశ్చ విద్యాం ప్రయచ్చతి, అన్నదాతా, భయత్రాతా సచైతే పితర స్మృతాః.


(1) జన్మనిచ్చినవాడు, (2)విద్యనేర్పిన గురువు, (3) ఆకలితోవున్నపుడు అన్నంపెట్టి ఆదరించినవాడు, (4) ఉపనయనం చేసినవాడు,

(5) ఆపదలో వున్నపుడు రక్షించివాడు

 ఈ ఐదుమంది  తండ్రులతో సమానమని భర్త్రహరి పై శ్లోకం ద్వారా తెలియచేస్తున్నాడు.

ఉపనయనం చేయడమంటే బ్రహ్మజ్ఞానానికి తెరువు చూపడమన్నమాట.


శ్లో॥ భార్యా వియోగశ్చజనాపవాదో ఋణస్య శేషః కుజనస్య సేవా,

దారిద్ర్యకాలేప్రియదర్శనంచ  వినాగ్నినా పంచ దహంతికాయమ్ (చిత్తమ్)


అంటే.. (1) భార్యావియోగం అనగా భార్య చనిపోవడం, (2) జనుల నుండి అనవసర అపవాదులు ఎదుర్కొవడం, (3) బుుణశేషం వుండిపోవడం, అంటే తీర్చాల్సిన అప్పులు అలాగే వుండిపోవడం, (4) దుర్మార్గుడైన ప్రభువు (బాస్) వద్ద కొలువు చేయాల్సిరావడం, (5) దారిద్ర్యకాలంలో  ఇంటికి బంధువులు రావడం,

అనే ఈ ఐదును అగ్ని లేకుండానే మనిషిని దహించివేస్తాయి.

కామెంట్‌లు లేవు: