18, నవంబర్ 2024, సోమవారం

కార్తీక పురాణం*_🚩 _*18

 🕉️🌹🪔🛕🪔🌹🕉️

       🌹 *సోమవారం*🌹

🕉️ *నవంబరు 18, 2024*🕉️


🚩 _*కార్తీక పురాణం*_🚩    

   _*18 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*


☘☘☘☘☘☘☘☘☘


ఓ మునిశ్రేష్ఠులారా ! ఓ ధనలోభీ ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.


కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున , శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక , కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ  శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ' యనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా


*"ఓ మునీంద్రా ! నేనింత వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక , ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన , *'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"* యని ధనలోభుడు కోరెను.


అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే , *'నేను - నాది'* అని చెప్పబడు జీవత్మాయే  *'అహం'* అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా *' నః '* అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై ఎల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే *"ఆత్మ"* యనబడను. *"నేను"* అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక , ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ *"నేను", "నాది"* అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.


ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర , ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ . అట్లే , అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరెంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి , మేల్కొన్న తర్వాత *'నేను సుఖనిద్రపోతిని , సుఖంగావుంది'* అనుకోనునదియే ఆత్మ.  


దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును , ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన , దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే *'పరమాత్మ'* అని గ్రహింపుము. *'తత్వమసి'* మొదలైన వాక్యములందలి *'త్వం'* అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం *'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి"* అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే *"ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షిణించుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము , ఉపదేశము , సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే "ఆత్మ".* ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో , అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.


జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు , జీవులు కర్మ ఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై  గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు , దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.


*ఇతి స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.*


             🌷 *సేకరణ*🌷

          🌹🪔🕉️🕉️🪔🌹

                *న్యాయపతి*

             *నరసింహా రావు*

          🙏🙏🕉️🕉️🙏🙏

కామెంట్‌లు లేవు: