https://youtube.com/shorts/6lLBWzDI9UA?si=F_8NjBKy_XLbQWtw
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
30, సెప్టెంబర్ 2023, శనివారం
పితృదేవతా స్తుతి
🌿🌼🙏పితృదేవతా స్తుతి🙏🌼🌿 చిన్న స్తోత్రమే దయచేసి పఠించి, పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి🙏🌼🌿సాక్షాత్తూ బ్రహ్మదేవుడే చెప్పిన పితృదేవతా స్తుతి🙏🌼🌿
🌿🌼🙏మహాలయ పక్షాలు ప్రారంభం. ఈ పితృస్థుతిని అందరూ రాసుకొని భద్ర పరచుకొండి. ప్రతీ రోజూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే, జన్యుదేవతలు. బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి.🙏🌼🌿
🌿🌼🙏ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.🙏🌼🌿
బ్రహ్మ ఉవాచ:
౧. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!
౨. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!
౩. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
౪. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!
౫. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!
౬. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!
*ఫలశ్రుతి:*
ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!
🌿🌼🙏స్తోత్రం యొక్క భావము :🙏🌼🌿
ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.
సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు.
సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.
ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.
ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.
ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము
పితృదేవతా నమోస్తుతే
ఆర్ధిక సహాయం*
*అత్వవసర ఆర్ధిక సహాయం*
*బ్రాహ్మణ సేవా వాహిని అభ్యర్థన*
*నదిహిల్స్ మీర్పేట లో ఉంటున్న లక్కరాజు గారి 18 రోజుల కూతురు సురక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది.ఇప్పటి వరకు 1 లక్ష రూపాయల సహాయం కోసం 68000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అందినది..*
*ఇంకా కొంత అవసరం ఉన్నది కావున రేపు సాయంత్రం లోగా సహాయం చేసే వారు మీ శక్తి కొలది సహాయం అందజేస్తారని ఆశిస్తున్నాము..*
*సహాయం అందజేయాల్సి నంబర్*
బ్రాహ్మణ సేవా వాహిని
9966967598
Gpay/phone PAY
ACCOUNT NUMBER
:50200058258642
IFsc code:HDFC0004348
*ఎల్లప్పుడూ బ్రాహ్మణ సేవలో ముందుండే*
మీ
*బ్రాహ్మణ సేవా వాహిని - BSV*
రాష్ట్ర అధ్యక్షులు
రఘుకిరణా చార్యులు
8328490238
Disclaimer. This blogger is not responsible for the above request.
Before donating make proper enquiry. V
పితృ తర్పణము
పితృ తర్పణము, మీకు మీరే ఎలా చేసుకోవచ్చో తెలుసుకోండి...!!
ఆచమ్య:-....
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా |ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః |ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీ కేశాయ నమః | ఓం పద్మ నాభయ నమః| ఓం దామోదరాయ నమః |ఓం సంకర్షణాయ నమః |ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః| ఓం అనిరుద్దాయ నమః |ఓం పురుషోత్తమాయ నమ|| ఓం అధొక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః| ఓం జనార్దనాయనమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీ కృష్ణాయ నమః ||
పవిత్రం దృత్వా || (దర్భ పవిత్రమును ధరించాలి)
ఓం పవిత్ర వంతః...... తత్సమాశత | (మంత్రం వచ్చిన వారు చదువుకోండి )
పునరాచమ్య || (మరల ఆచమనము చేయాలి )
*భూతోచ్చాటన ఉత్తిష్ఠంతు భూత పిశాచా, యేతే భూమి భారకాః | యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే | | | అని చెప్పి నీటిని వాసన చూసి వెనుకకు వేయాలి,
(సాధారణ తర్పణాలకు నీరు,ప్రత్యేక తర్పణాలకు తిలలు వాసన చూడాలి)
*ప్రాణా యామము (ముక్కు. బొటనవేలు,చిటికెన వేలుతొ పట్టుకొని)
ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః ఓం మహః ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యం | ఓంతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్పు వస్సువరోమ్ || (అని మనసులో జపిస్తూ ప్రాణా యామము చేయాలి )
*సంకల్పం:-
హైదరాబాద్లో ఉండే వారికి మాత్రమే ఈ సంకల్పం పనికి వస్తుంది.క్రింద ఉన్నవి మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి మారతాయి.కనుక సంకల్పాన్ని మిగతా ప్రదేశాల వారు మీ ప్రాంత పురోహితులని సంప్రదించగలరు)
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య - శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, శ్రీ గోవింద గోవింద గోవింద |
శ్రీ మహా విష్ణొరాజయా ! ప్రవర్తమానస్య | అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే! స్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే | కలియుగే|ప్రధమ పాదే! జంబూ ద్వీపే, భరత వర్షే | భరత ఖండే! మేరోదక్షిణ దిగ్బాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే,కృిష్ణా
గోదావర్యోర్మద్యదేశే| సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన - వ్యావహారిక చాంద్రమానేన -. శ్రీప్లవ నామ సంవత్సరే దక్షిణాయనే*.... *వర్షఋతౌ*.... *భాద్రపద మాసే కృష్ణపక్షే......తిదౌ........వాసరే.| శ్రీవిష్ణు నక్షత్రే.! శ్రీవిష్ణు యోగే | శ్రీవిష్ణు కరణ | ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిధౌ|
ప్రాచీనావీతి:- (యజ్ఞోపవీతమును ఎడమ నుండి కుడి భుజము పైకి మార్చుకొనవలెను)
*మహాలయము పితృణాం మాతామహాదీనాం సర్వీకారుణ్యానాంచ అక్షయ్య పుణ్యలోకా వాప్త్యర్దం కన్యాగతే సవితరి ఆషాడ్యాది పంచమాపరపక్షొ కర్తవ్య సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ద ప్రతినిధి సద్య, తిల తర్పణం కరిష్యే ||
సవ్యం:-
సవ్యమనగా ఎడమబుజము పైకి యజ్ఞోపవీతమును మార్చవలెను. సవ్యం చేసుకుని నీరు వదలాలి.
ప్రాచీనావీతి:- || మరల ప్రాచీనావీతి చేసుకొనవలెను.
ముందుగా తూర్పు కొసలుగా మూడు ధర్బలు, వాటిపై దక్షిణ కొసలుగా రెండు కూర్చలుపరిచి వాటి పై పితృదేవతలను ఓం ఆగచ్చంతు మే పితర ఇమం గృహ్ణాంతు జలాంజలిమ్ ||" అని చదువుతూ తిలలు వేసి ఆహ్వానించవలెను. దక్షిణముఖముగా తిరిగి, ఎడమ మోకాలు క్రింద ఆన్చి తర్పణ విడువవలెను.
"స్వధానమిస్తర్పయామి' అన్నప్పుడల్లా మూడుసార్లు తిలోదకము పితృతీర్ధముగాఇవ్వవలెను. వారి భార్య కూడా లేనిట్లైతే సవిత్నీకం అని, స్త్రీల విషయమున భర్త కూడా లేనట్లైతే సభర్తకం అని చేర్చుకొనవచ్చును.
క్రింద మొదటిఖాళీలో గోత్రమును, రెండవ చోట వారి పేరును చెప్పి తర్పణ చేయాలి. ప్రతి దానికి ముందు "అస్మత్" అను శబ్దాన్ని చేర్చ వలెను. బ్రాహ్మణులైతే శర్మాణం అన్నది పనికొస్తుంది. కానీ రాజులైతే వర్మాణాం .వైశ్యులైతే గుప్తం, ఇతరులు దాసం అని మార్చి పలకాలి.
(ప్రాచీనావీతి) అస్మత్ పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని (సవ్యం)కరిష్యే.....(ప్రాచీనావీతి) దక్షిణాభిముఖో భూత్వా
1) పితరం..(తండ్రి పేరు చెప్పి) అస్మత్ .....గోత్రం, ..........శర్మాణం..వసురూపం..స్వధానమస్తర్పయామి..3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
2) పితామహం..(తాత)అస్మత్ ...... గోత్రం, ....... శర్మాణం.. రుద్రరూపం.. స్వధానమస్తర్పయామి3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి..
3)ప్రపితామహం.(ముత్తాత)అస్మత్ ......గోత్రం, .........శర్మాణం... ఆదిత్య రూపం..స్వధానమస్తర్పయామి 3మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
4) మాతరం (తల్లి) గోత్రాం...దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
5) పితామహీం (నానమ్మ) గోత్రాం..దాయీం..రుద్రరూపాం స్వధానమస్తర్పయామి3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
6) ప్రపితామహీం (నానమ్మ గారి అత్త) గోత్రాం.. దాయీం..ఆదిత్యరూపాంస్వధానమస్తర్పయామి3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
7) సాపత్నిమాతరం (సవితి తల్లి) గోత్రాం....దాయీం...వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
8)మాతామహం (తాత . అనగా తల్లి గారి తండ్రి)గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
9) మాతుః పితామహం (తల్లి గారి తాత)గోత్రం..శర్మాణం... రుద్రరూపంవసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
10)మాతుఃప్రపితామహం(తల్లి యొక్క తాతగారి తండ్రి) గోత్రం...శర్మాణం.. ఆదిత్య రూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
11) మాతామహీం.(అమ్మ మ్మ) గోత్రాం..దాయీం. వసురూపాం స్వధానమస్తర్పయామి...3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
12) మాతుః పితామహీం.(తల్లి యొక్క నానమ్మ)గోత్రాం.. దాయీం.. రుద్రరూపాం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి..
13)మాతుః ప్రపితామహీం (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) గోత్రాం... దాయీం.. ఆదిత్య రూపాం..వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి..
14) ఆత్మ పత్నీం (భార్య) గోత్రాం.. దాయీం.. వసురూపాం.. వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
15) సుతం (కుమారుడు)గోత్రం..శర్మాణం.. వసురూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
16) జ్యేష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు) గోత్రం..శర్మాణం.. వసురూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
17) కనిష్ఠ భ్రాతరం (స్వంత చిన్నసోదరుడు)గోత్రం..శర్మాణం.. వసురూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
18)తత్పత్నీం (సోదరుని భార్య.. వదిన)గోత్రాం..దాయీం వసురూపాం. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
20)తత్పత్నీం.. (పెద్దమ్మ/ చిన్న మ్మ లు) గోత్రాం..దాయీంవసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
21)తత్ పుత్రం (పెదనాన్న & చిన్నాన్న కుమారుడు.. గోత్రం... శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
22) తత్పత్నీం (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య) గోత్రాం..దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
23)మాతులం (మేనమామ.. తల్లి సోదరుడు) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
24) తత్పత్నీం (మేనమామ భార్య) గోత్రాం..దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
25) దుహితరం (కూతురు) గోత్రాం..దాయీం.వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
25) ఆత్మ భగినీం (సోదరి. అక్క&చెల్లెలు) గోత్రాం.. దాయీంవసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
26)తద్భర్తారం (కూతురి భర్త & అల్లుడు) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
27)దౌహిత్రం (కూతురి కొడుకు & మనుమడు) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
28) తత్పత్నీం (కూతురు యొక్క కొడుకు భార్య) గోత్రాం..దాయీం.వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
29)భాగినేయకం (మేనల్లుడు) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
30) తత్పత్నీం (మేనల్లుడి భార్య) గోత్రాం.దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
31) పితృ భగినీం (మేనత్త & తండ్రి సోదరి) గోత్రాం..దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
32) తద్భర్తారం (మేనత్త భర్త) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
33)మాతృ భగినీం (తల్లి సోదరి . చిన్న మ్మ. పెద్దమ్మ) గోత్రాం..దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
34) తద్భర్తారం (తల్లి సోదరి యొక్క భర్త) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
35) జామాతరం (అల్లుడు కూతురి భర్త) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
36)స్నుషాం (కోడలు) గోత్రాం.దాయీం..వసురూపాం. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
37)శ్వశురం (పిల్లనిచ్చిన మామ) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
38)శ్వశ్రూం (పిల్లనిచ్చిన మామ భార్య.. అత్త) గోత్రాం..దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి
39)శ్యాలకం (బావమరిది) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
40) తత్పత్నీం (బావమరిది భార్య) గోత్రాం..దాయీం.వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
41) ఆత్మ పత్నీం (భార్య) గోత్రాం...దాయీంవసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
42)గురుం .. గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...
43)రిక్థినం .. గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....అని 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి........
యే బాంధవాః యే బాంధవాః యేయే అన్య జన్మని బాంధవాః |తే సర్వే తృప్తి మాయాన్తు మయా దత్తేన. వారిణా ||
ఆ బ్రాహ్మ స్తంబ పర్యన్తం దేవర్షి పితృ మానవాః |తృప్యంతు పితర స్సర్వే మాతృ మతామహాదయః ||
అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |ఆ బ్రహ్మ భువనాల్లోకా దిదమస్తు తిలోదకం || (యజ్ణోపవీత నిష్పీడనం)
యజ్జోపవీతమును నివీతిగా (దండలాగా) మెడలో వేసుకుని ముడిని నీటిలో ముంచి నేలపై పిండుతూ ఈ క్రింది విధంగా చదువవలెను.
||శ్లొ|| యేకే దాస్మత కులే జాతాః ఆపుత్రా గోత్రిణొ మృతాః | తే గృహ్ణంతు మయాదత్తం సూత్ర నిప్పిడనొదకం ||
(నా కులములోను, గోత్రమునందును పుత్రులు లేక మరణించిన వారందరూ నేను వదిలే ఈ ఉదకమును స్వీకరించెదరు గాక! ]
శ్రీరామ రామ రామ | | అనుచూ యజ్ఞోపవీతపు ముళ్లను కళ్లకద్దుకుని సవ్యము చేసుకొనవలెను.
స్వస్థి...
స్తుతి" అని పిలువబడే అమ్మాయి
శ్లోకం:☝️
*అద్యాపి దుర్నివారం స్తుతికన్యా*
*వహతి నామ కౌమారం l*
*సద్భయో న రోచతే సా*
*అసన్త అపి అస్యై న రోచన్తే ॥*
భావం: "స్తుతి" అని పిలువబడే అమ్మాయి ఈ రోజుకీ "కుమారి"గానే మిగిలిపోయిందిట! ఎందుకంటే వినయ సంపన్నులైన మంచి వ్యక్తులకు ఆమె నచ్చదు మరియు ఆమె స్వయంగా చెడ్డవారిని ఇష్టపడదు!
పంచాంగం 30.09.2023 Saturday,
ఈ రోజు పంచాంగం 30.09.2023 Saturday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: ప్రతిపత్తి తిధి స్థిర వాసర: రేవతి నక్షత్రం ధ్రువ యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం.
పాడ్యమి మధ్యాహ్నం 12:24 వరకు.
రేవతి రాత్రి 09:11 వరకు.
సూర్యోదయం : 06:09
సూర్యాస్తమయం : 06:02
వర్జ్యం : పగలు 10:15 నుండి 11:43 వరకు.
దుర్ముహూర్తం : ఉదయం 06:09 నుండి 07:44 వరకు.
రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.
యమగండం : మద్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
సుభాషితమ్
🕉️ *_-|¦¦|¦¦|-_* 🕉️
*_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*
*వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం౹*
*వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం౹*
*వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం౹*
*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*
*శివస్తుతి - 1*
ఆనందానికి మూలము (శంభు), ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైన వాడు, సర్పములు ఆభరణములుగా కలవాడు, జింకను చేత కలవాడు, జీవ గణములకు అధిపతి (పశుపతి), సూర్య చంద్రులు, అగ్ని మూడు నేత్రములుగా కలవాడు, విష్ణువునకు ప్రియుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.
జగదంబను రుక్మిణి వేడుట!
జగదంబను రుక్మిణి వేడుట!
ఉ: నమ్మితి నామనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము , పురాణ దంపతుల మేలుభజింతు గదమ్మ ! మేటి పె
ద్దమ్మ ! దయాంబురాసివి గదమ్మ! హరిం బతిసేయుమమ్మ! నిన్
నమ్మిన వారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ !
శ్రీ భాగవతము- దశమస్కంధము- 1741 పద్యం: బమ్మెఱపోతన;
తెలుగు వారి పుణ్యాల పేటి శ్రీ మహాభాగవత గ్రంధము. ఇది 18 పురాణములకు మించిన నహాపురాణముగా
ప్రసిధ్ధి గాంచినది. శ్రీకృష్ణ పరమాత్ముడే నాయకుడుగా వెలసిన యీగ్రంధమున నతని లీలా వినోదములే యనేక రసవద్ఘట్టములుగా , తీరిచి దిద్ద బడినవి. రక్తికి , భక్తికి , ముక్తికి ,యీగ్రంధము మూలమై యాంధ్ర సాహిత్యమున కొక వెలలేని యలంకారమై భాసించు చున్నది. భాగవతమునందలి రసవద్ఘట్టములలో రుక్మణీకళ్యాణము ప్రముఖమైనది.
పెండ్లి కుమార్తెయగు రుక్మణి శిశుపాలుని వరింప నిష్టపడక తాను మనసిచ్చిన కృష్ణ పరమాత్మకు తనహృదయమును నివేదించి యతనిని దోడ్కొని వచ్చుటకు అగ్నిద్సోతనుడను బ్రహ్మణ వర్యుని ద్వారకకు పంపినది.తడవైనది యతడురాడాయెను.ముహూర్తము దరియు చున్నది. గౌరీ పూజయు ,ప్రారంభమైనది. డోలాయమాన చిత్తయగు రుక్మిణి సర్వమునకు ఆపరమేశ్వరిపైననే భారముంచి ఆజగ దంబ నిట్లని ప్రస్తుతింప సాగినది.
పోతన కవి చాతుర్యమంతము పద్యము యెత్తుగడలోనే ప్రదర్శించినాడు." నమ్మితి నామనంబున సనాతనులైన యుమామహేశులన్ మిమ్ము"- అమ్మా! నేను మిమ్మల్నే నమ్ము కొన్నాను. మీరు సనాతన దంపతులు. మీకన్న నాకు దిక్కెవ్వరు?అనుచున్నది. ఆమాటతో భారమంతయు పార్వతీ పరమేశ్వరులపై నుంచినట్లయినది.
పార్వతీ పరమేశ్వరులనే గోరనేల? వారును ప్రేమ జంటలే !వారినిగూడ పెద్దలు వారించినారు. అయినను వారిరువురు సతీపతులైనారు. ఎన్ని యుగములైనదో వారిదాంపత్య మారంభమై,కావున వారు పురాణదంపతులు. అట్టి దంపతులదీవెనలే పెండ్లికుమార్తెకు కావలసినది. నచ్చినవరుతో కళ్యాణము ఆడుదానికి ఒక అమూల్యమైన వరముగదా! ఆవరము నీయగల
శక్తి శివ పార్వతులకేగలదు. కాబట్టే రుక్మిణి వారినాశ్రయించుట. గౌరీ పూజలోని ఆంతర్యమిదే !
మిమ్ము పురాణదంపతుల మేలుభజింతు గదమ్మ" ఆది దంపతులగు మిమ్ము నెల్లవేళల పూజింతునుగదా!
నాచేపూజలందెడు మీరే నాకోర్కెదీర్పవలె. వేరెవ్వరు దీర్పగలరు.?
మేట్టి పెద్దమ్మ! అమ్మలకు అమ్మలున్నారు కాని మేటియైన పెద్దమ్మల నెక్కడ గాంచగలము. ఆతల్లి పార్వతియే!" ఆకీట,
బ్రహ్మపర్యంతం ,ఆమెయే జనని. జగజ్జనని. కావున నందరకు పెద్దమ్మ ఆమెయే! పెద్దలే పిల్లలకోరికలు దీర్చాలి. లేకున్న వారి పెద్దరికమునకే అవమానము.
"దయాంబురాశివి గదమ్మ" ఆమె దయా సముద్ర. సువిశాలమై అగాధమై యనంతమైన సముద్రముతో నామెదయకు పోలిక. ఆహా! యెంత చక్కని యుపమానము.భక్తులయెడ తరుగని దయగలది యాతల్లి.కావున ఆమెదయకు నోచుకొన్నవారి కోరికలు దీరక పోవునా?
చివరకు చెప్పుచున్నది అసలుమాట."హరింబతిసేయుమమ్మ" శ్రీకృష్ణుని నాకు భర్తగా చేయవమ్మా! యెవరు కాదన్నాసరే,నీవు అవునంటే చాలు మావివాహం జరిగితీరుతుంది. అమ్మా! నేవలచిన కృష్ణుని భర్తగా ననుగ్రహించు.
నిన్ నమ్మిన వారి కెన్నటికి నాశము లేదుగదమ్మ యీశ్వరీ!"- నిను నమ్మిన వారు చెడగా నేనెక్కడా చూడలేదమ్మా!
కాన నాకోరిక ఫలింప జేసి మానమ్మకము నిలబెట్టు మని రుక్మిణి గౌరీ ప్రార్ధనము!
చక్కని నుడికారముతో బహు చక్కని భావజాలముతో రుక్మిణి కోరిక ఫలించు రీతిగా గౌరీ ప్రార్ధనా ఘట్టమును
కేవల మొకేయొక్కపద్యమున సయుక్తికముగ, సముచితముగ రచియించిన పోతన మహాకవికి సాటి యగువారెవ్వరు?
స్వస్తి!!🌷🙏🙏🙏🌷🌷🌷🌷🙏🙏🙏🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷
కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు
*మహాలయ పక్ష ప్రారంభం / శ్రాద్ధ పూర్ణిమ పితృ ( 30/9/23 నుండి* )
*వరుసగా పదిహేను రోజులు14/10/23* వరకు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు.
మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ద తో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపం లో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథి గా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షం లో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు.
శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మ లో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.
ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారం గా తెలుసుకోవచ్చు.
పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది
ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది
తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు
చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు
పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.
షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తి కి సమాజం లో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.
సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.
అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ది, ధనం, బుద్ది ప్రాప్తిస్తాయి
నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారం గా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది
దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది
ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది , కుటుంబం వృద్ది చెందుతుంది
ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అబివృద్ది చెందుతుంది. శ్రాద్ధ కర్త కు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది
త్రయోదశి నాడు శ్రద్ద కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం , బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి
చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.
💥అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తి కి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు,అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
*సేకరణ : - నిమ్మగడ్డ శ్రీధర్*

