పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
ద్వితీయ స్కంధము
రామ! గుణాభిరామ! దినరాజ కులోంబుధి సోమ! తోయద
శ్యామ! దశాననప్రబలసైన్య విరామ! సురారి గోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని
ష్కామ! కుభృల్ల లామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా!
శ్రీరామా! నీగుణాలన్నీ చాలా మనోహరములయినవయ్యా! సూర్యదేవుని కులం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడవు నీవు. నీలమేఘం వంటి మేనిఛాయతో అలరారుతూ ఉంటావు. పదితలల రక్కసుని పిక్కటిల్లిన బలం కల సేనలను రూపుమాపినవాడవు. దేవతల పగవారు అనే కొండలకు ఇంద్రుడవు. సుబాహువు ఆనే రాక్షసుని బాహువుల బలం వలన కలిగిన పొగరు ఒక చీకటి అయితే దానికి నీవు సూర్యుడవు. నీకు ఏ కోరికలూ లేవు. భూమిని పాలించేవారిలో మేలుబంతి అయినవాడవు. పరమేశ్వరుని యిల్లాలు పార్వతీదేవి నీ నామాన్ని నిరంతరమూ జపిస్తూ ఉంటుంది. రఘువంశం నీ వలన మహిమను పొందిందయ్యా.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
20, జనవరి 2024, శనివారం
భాగవతము
రాశిఫలాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
*20-01-2024 / శనివారం / రాశిఫలాలు*
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
మేషం
ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుం. కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంభందించి కీలక సమాచారం సేకరిస్తారు.
---------------------------------------
వృషభం
చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది.
---------------------------------------
మిధునం
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మంచి లాభాలు అందుతాయి.
---------------------------------------
కర్కాటకం
కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
---------------------------------------
సింహం
వృత్తి, వ్యాపారాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు.
---------------------------------------
కన్య
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
---------------------------------------
తుల
వ్యాపారస్థులకు ప్రభుత్వ సంభంధిత ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
---------------------------------------
వృశ్చికం
నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి.
---------------------------------------
ధనస్సు
ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.
---------------------------------------
మకరం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
---------------------------------------
కుంభం
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.
---------------------------------------
మీనం
వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. బందు వర్గంతో మాటపట్టింపులుంటాయి.
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🍁 *శుభం భూయాత్* 🍀
17, జనవరి 2024, బుధవారం
రహస్య గ్రంథాలు
ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు - వాటి గురించి విశేషాలు .
మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు . నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను .
* బృహద్యంత్ర సర్వస్వము -
ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు
ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.
ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు.
అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.
* ఆగతత్వలహరీ -
ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .
* అవతత్వ ప్రకరణం -
ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు .
* అండ కౌస్తభం -
ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర
జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.
* అంశు బోధిని -
ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.
* ఆకాశ తంత్రం -
ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.
* ఋక్ హృదయ తంత్రం -
ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.
* ఔషధీ కల్పం -
ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.
* కరక ప్రకరణము -
ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.
* కర్మాబ్దిసారము -
ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.
* కౌముదీ -
ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.
* ఖేట సర్వస్వము -
ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.
* ధాతు సర్వస్వము -
ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి
లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు .
* ధూమ ప్రకరణం -
ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.
* నామార్థ కల్పం -
ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.
* ప్రపంచ లహరీ -
ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.
* బ్రహ్మాండ సారం -
ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.
* మేఘోత్పత్తి ప్రకరణం -
ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.
* లోక సంగ్రహము -
ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.
* లోహ తంత్రము -
ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.
* వాయుతత్వ ప్రకరణము -
ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు.
* వైశ్వనర తంత్రము -
ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.
* శక్తి తంత్రము -
ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా .
* శుద్ద విద్యాకల్పం -
ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.
* సమరాంగణ సూత్రధారము -
ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.
పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము , యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ, గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో 1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది. ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి.
మరెన్నో విలువయిన విషయాలు గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
నీవే స్త్రీవి
శ్లోకం:☝️
*త్వం స్త్రీ త్వం పుమానసి*
*త్వం కుమార ఉత వా కుమారీ |*
*త్వం జీర్ణో దణ్డేన వఞ్చసి*
*త్వం జాతో భవసి విశ్వతోముఖః ||*
- శ్వేతాశ్వతరోపనిషద్ 4.3
భావం: నీవే స్త్రీవి, నీవే పురుషుడవు; నువ్వే బాలుడివి మరియు నీవే కుమారివి, కన్యవు; నీవు కర్ర సహాయంతో వంగి నడిచే వృద్ధుడివి. ఇదుగో, నువ్వే జన్మించావు మరియు విశ్వమంతా నీ యెక్క నానా రూపాలతో నిండిపోయింది. ఇక్కడ *నీవు* అంటే *పరమాత్మ*. విశ్వమంతా పరమాత్మ యెక్క వివిధ రూపాలతో నిండిపోయింది అని భావం.🙏
పంచాంగం 17.01.2024
ఈ రోజు పంచాంగం 17.01.2024
Wednesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస శుక్ల పక్ష: సప్తమి తిధి సౌమ్య వాసర: రేవతి నక్షత్రం శివ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
సప్తమి రాత్రి 10:10 వరకు.
రేవతి రాత్రి 03:34 వరకు.
సూర్యోదయం : 06:53
సూర్యాస్తమయం : 05:59
వర్జ్యం : సాయంత్రం 04:06 నుండి 05:37 వరకు.
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:04 నుండి 12:48 వరకు.
అమృత ఘడియలు : రాత్రి 01:16 నుండి 02:48 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
అయోధ్యలో నేటి నుంచే
*అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు*🚩🚩
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు..
*మొదటి రోజు (జనవరి 16)*
నేటి నుంచి రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
*రెండవ రోజు (జనవరి 17)*
రామ్‌లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి, వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు.
*మూడవ రోజు (జనవరి 18)*
గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి.
*నాల్గవ రోజు (జనవరి 19)*
పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. తర్వాత ‘నవగ్రహ’ స్థాపన చేయనున్నారు.
*ఐదవ రోజు (జనవరి 20)*
రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో సంప్రోక్షణ చేసి, ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు.
*ఆరవ రోజు (21 జనవరి 21)*
రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, పవళింపజేస్తారు.
*ఏడవ రోజు (జనవరి 22)*
ప్రధాన ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. జనవరి 21, 22 తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు.
🙏🔰🙏🔰🙏🔰🙏🔰🙏🔰
