8, ఫిబ్రవరి 2025, శనివారం

ఒకటి వదిలితే చాలు okati vadilite chaalu

 ఒకటి వదిలితే చాలు 

ఒకసారి రామారావుకు  కాళ్ళు, చేతులు తిమ్మిరులు ఎక్కటం, అప్పుడప్పుడు కళ్ళుతిరగటం అవుతుంటే ఎందుకైనా మంచిదని ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్లి చుపెట్టుకుందాం అనుకోని సమీపంలో ఉన్న ఒక డాక్టారు వద్దకు వెళ్ళాడుడాక్టరు పరీక్షించినతరువాత నాకు అనుమానంగా వున్నదండి మీ లక్షణాలు చూస్తుంటే మీకు షుగర్ ఉన్నట్లు వున్నది ఒకసారి రక్త పరీక్ష చేయించండి అని సలహా ఇచ్చాడువెంటనే ఆయన రక్త పరీక్ష చేయించుకున్నాడు. అతని ధీమా ఏమిటంటే నాకు షుగరు ఎందుకు వస్తుందినేనేమయినా రోజు స్వీట్లు తింటానా ఏమన్ననా  నేను ఎప్పుడో కానీ స్వీట్ తినను. స్వీట్ తినేవాళ్లకు వస్తుంది కానీ నాకెందుకు షుగరు వ్యాధి వస్తుంది అని అనుకున్నాడు. రక్త  పరీక్ష రిపోర్ట్ ఇవ్వగానే అనుమాన నివృత్తి చేసుకోవటానికి అక్కడి టెక్నీషియన్ని అడిగాడునాకు షుగర్ ఉన్నదా  అని. దానికి అతను మీరు వెళ్లి మీ డాక్టరుకు చూపించండి ఆయన చెపుతాడు అని అన్నాడు. . మనసులో ఏదో తెలియని గుబులునిజంగా నాకు షుగరు వ్యాధి వచ్చిందా రాలేదా రాకుంటే అతను అలా ఎందుకు చెపుతాడు అని ఇంటికి వెళ్ళాడురేపు ఉదయం డాక్టరు వద్దకు వెళ్ళాలిరాత్రంతా నిద్ర రాలేదు. ఏదో తెలియని గుబులుఉదయం లేచి ముఖ ప్రక్షాళన చేసుకొని గడియారం వైపే చేస్త్తున్నాడు. అతని ప్రవర్తన చిత్రంగా తోచిన ఆయన శ్రీమతి రేణుక  ఏమైనదండి మీకు ఏదో చిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అడిగింది. అప్పుడు గత దినం డాక్టరు వద్దకు వెళ్లిన దగ్గరినుండి ల్యాబ్ టెక్నీషన్ చెప్పిన మాట దాకా పూసగుచ్చినట్లు చెప్పాడు.రామారావు.   రేణుక  మంచి సమయస్పూర్తి, సద్బుద్ధి కల ఇల్లాలు . ఆమెకు వెంటనే తన భర్త మానసిక స్థితి అర్ధం అయ్యింది. అందుకు ఆమె ఆయనను అనునయిస్తూ మీకైమైఅన చాదస్తమా ఏమిటి మీకు షుగరు రావటం ఏమిటి మన ఇంట వంట అటువంటి దరిద్రపు జబ్బు లేదుమీరు నిశ్చింతగా వుండండి. టిఫిను చేసి డాక్టరు వద్దకు వెళ్ళండిఆయనకూడా మీకు షుగరు లేదని అంటాడు అని భర్తకు ధెర్యం చెప్పింది. నిజానికి భర్త యెంత పిరికివాడు అయినా కూడా భార్య మాటలే ధెరియాన్ని ఇస్తాయి. అప్పుడు కానీ మన రామారావుకు పూర్తిగా ధెర్యం వచ్చింది. తృప్తిగా ఇడ్లిలు తిని బట్టలు కట్టుకొని మోటారు సైకిలు మీద డాక్టారు దగ్గరకు వెళ్ళాడు. డాక్టరు దగ్గరకు వెళుతున్న కూడా మనసులో ఏవో తెలియని సందేహాలుడాక్టరు ఏమి చెపుతాడో ఏమో అనే గుబులు ఇంకా వేధిస్తూ వున్నది. ఒకవైపు భార్య ఇచ్చిన భరోసా వున్నా కూడా తన్ను తానూ నిభాయించుకోలేక పోతున్నాడు. చిన్నగా డాక్టరు వద్దకు కాంపౌండరు పిలవగానే చేతులు కళ్ళు వణుకుతూ లోపలి వెళ్ళాడు

రండి రామారావు గారు ఎలావున్నారు అని మంచి ఉత్సాహంగా పలకరించాడు  డాక్టరు. తనకు తెలుసు డాక్టర్ల మాటలకే రోగుల సగం రోగాలు  తగ్గుతాయని ఇంకొక గంటలో చనిపోతాడన్న పేషంటుని కూడా నేప్పించకుండా మీకేమి భయంలేదు ఇంకొక గంటదాకా అని ప్రోత్సాహకరంగా భయంలేదు అనే మాటను పెద్దగా ఇంకొక గంటదాకా అనే మాటలు చిన్నగా చెప్పటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్యఏమిటీ నాకు రోజు అనేక విధాలుగా ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటుంటే రామారావు గారు అనే డాక్టరు పిలుపుతో లోకానికి వచ్చాడుఏమండీ ఇంతకు  ముందు కూడా ఇట్లా మీరు బాధపడే వారలేదండి అన్నాడుసరే ఎన్నాళ్ళనుండి మీకు ప్రాబ్లమ్ వుంది అని మరలా  ప్రశ్నించాడు. ఇటీవలే బహుశా రెండు మూడు నెలలనుండి అని జవాబు చెప్పాడు రామారావుఅదేమిటి డాక్టారు నాకు షుగరు ఉందా లేదా అని చెప్పకుండా అనవసరపు ప్రశ్నలు వేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని మనసులో అనుకోనిఇక ఆలస్యం చేస్తే తట్టుకునేటట్లు లేదని తానే ధెర్యం చేసి డాక్టరుగారు ఇంతకూ నాకు షుగరు ఉన్నట్లా లేనట్లా అని ఓపెనుగా అడిగేశాడు. రామారావు అవస్ధచూసి డాక్టరు చావు వార్త చల్లగా చెప్పాడుచూడండి  మీకు షుగరు చాలా వుంది మీరు ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేశారుఇంకా నయం ఇట్లానే మీరు మందులు వాడకుండా ఉంటే చాలా ప్రమాదములోకి వెళ్లేవారు అని అన్నాడు. మాటలు వింటుంటే ఒక్కసారి తన క్రింద వున్న భూమి మొత్తం మాయమైనట్లుగా తోచింది తాను ఆధారము లేకుండా గాలిలో ఉన్నానా అని అనిపించిందిభగవంతుడా నాకే ఎందుకు ఇల్లాంటి పరీక్షలు  పెడతావు. అవును పొద్దున నా భార్య నాకు యెంత ధెర్యం చెప్పింది మీకు షుగరు ఎందుకు వస్తుంది అని అన్నదే డాక్టరు ఏమైనా డబ్బులు గుంజాతానికి అబద్దం చెపుతున్నాడా అని మనసులో అనుకున్నాడుఅప్పుడు రామారావు మోహంలో కత్తివాటుకి రక్తపు చుక్కలేదు

రామారావు గారు మీకు కొన్ని మందులు వ్రాసిస్తున్నాను. వాటిని నిర్లక్ష్యం చేయకుండా రోజు ఉదయం రాత్రి భోజంనం చేసిన తరువాత వేసుకోండిఒక వారం చూద్దాంఅప్పుడు మరలా రక్త పరీక్ష చేయిద్దాము రిజల్టు పట్టి మందులు  నిర్ణయిద్దాం. మీరేమి భయపడనవసరం లేదు రోజుల్లో షుగరు వ్యాధి చాలా కామను అని ధెర్యం చెప్పాడుడాక్టరు గారు మందులు ఎన్నాళ్ళు వాడాలి అని అడిగాడు  అమాయకంగా. . షుగరు వ్యాధి రావటమే కానీ పోవటం అనేది ఉండదుమందులతో కేవలం దానిని  నియంత్రించటమే. ఇంకా మీరు అదృష్టవంతులు ఇంకా  ఆలస్యం చేస్తే ఇన్సూలీను ఇంజక్షన్ మొదలు పెట్టవలసి వచ్చేది అని అన్నాడు. నా అదృష్టం అడుక్కొని తిన్నట్లే ఉందిలే అని గోనుకుంటూ మందులు కొనుక్కొని ఇంటిదారి పట్టాడు

అప్పటినుండి రామారావు కనపడ్డ ప్రతిమనిషిని  షుగరు ఎలా తగ్గించుకోవాలని  అడిగేవాడు. గూగుల్ సర్చి చేసి చిట్కాలు, వెతకటం మొదలు పెట్టాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. రోగం వచ్చిన నెలరోజులకు సగం అయ్యాడు  రామారావు. ఇప్పుడు రామారావు మదిలో ఎప్పుడు ఒకటే ఆలోచన షుగరు ఎలా తగ్గిచుకోవాలి. అసలు భగవంతుడు షుగరు ఎందుకు మనుషులకు పెట్టాడు అది నా లాంటి మంచివాళ్లకుదేముడా ఎందుకయ్యా నామీద ఇంత  కోపం. నేనేమైన తప్పు చేస్తే క్షమించు స్వామి షుగరు కనక పూర్తిగా తగ్గితే వచ్చే శనివారం నీకు కొబ్బరికాయ కొడతాను అని మొక్కుకున్నాడుఅందులో లాజిక్ ఏమిటంటే చెప్పకుండానే దేముడికి తనకు షుగరు వచ్చే శనివారం లోగా తగ్గాలని కోరుకున్నాడన్న మాటకానీ దేముడు ఇలాంటి రామారావుని ఎంతమందిని చూసాడునాయనా అది నీ ప్రలబ్దమ్ అనుభవించక తప్పదు అని దేముడు నవ్వుకున్నాడు

రామారావు డాక్టరు వద్దకు వెళ్లిన అది తినకు ఇది తినకు అని తినే వాటి లిస్టు తినని వాటి లిస్టు చెప్పేవారు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే తినని వాటి లిస్టు చాంతాడంట తినే వాటి లిస్టు చిటికెన వేలంత ఉండేదిఇక డాక్టర్ల మాటలు వినాలంటే చికాకు వేసిందిఆలా అలా తిరుగుతుంటే ఎవరో చెప్పారు మిత్రమా కుక్కుటేశ్వరరావు అనే డాక్టరు  షుగరుకు మంచి డాక్టరు ఆయన తినని పదార్ధాల లిస్టు పెద్దగా చెప్పాడు కేవలం "ఒక్కటి తినకుండా ఉంటే చాలు" అంటాడట అని ఒక ఆశాకిరణాన్ని  వదిలాడు. బతుకు జీవుడా అని ఆఘమేఘాలమీద వెతుకుంటూ డాక్టరు కుక్కుటేశ్వర రావుగారి వద్దకు వెళ్ళాడు

రామారావుని చూడంగానే కుక్కుటేశ్వరరావు చిన్నగా  నవ్వాడు. నవ్వుకు అర్ధం ఏమిటి ఒరే అమాయకుడా నా దగ్గరకు వచ్చావు ఇక నీ సంగతి చూస్తాను అనా లేక ఇంకేమన్నానా అని అనుకున్నాడురామాయణంలో లక్ష్మణుడి నవ్వులాగ తోచిందినమస్కారం డాక్టారు గారు నాకు షుగరు వుంది అన్నాడు సంగతి మీరు చెప్పక్కర్లేదు మీ మొఖం చూస్తేనే తెలుస్తున్నది అని అన్నాడు

అయ్యా ప్రతి డాక్టరు షుగరు పేషంట్లు అది తినకూడదు ఇది తినకూడదు అని పెద్ద లిస్టు చెపుతారు, కానీ మీరు ఒక్కటి తినకుండా ఉంటే చాలు అంటారని ఎవరో చెపితే వచ్చాను అని రామారావు అన్నాడుదానికి డాక్టరు పెద్దగా ఒక వెకిలి నవ్వు నవ్వి అదేనండి అందరు  అంటుంటారు. నేను వెరీ సింపులుగా చెపుతాను. ఏమిటి సింపులుగా చెపుతావా ఇక్కడ ప్రాణాలు ఉగ్గపట్టుకొని నేను చస్తుంటే అని మనసులో అనుకున్నాడు మన హీరో రామారావుఏమీలేదండి మీకు ఇష్టమైనవి తినటం మానండి చాలు అని అన్నాడు. ఇదేదో బాగుందే అవును తనకు ఇష్టమైనవి తినటం మానితే షుగరు తగ్గుతుందా డాక్టరుగారు అని అడిగాడు పసివానివలెఅవునండి అంతే మీరేమి కంగారు పడనవసరం లేదు అని యేవో మందులు వ్రాసి ఇచ్చాడు

మందు బిళ్ళలు కొనుక్కొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడుసంతోషంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి రాగిణి అడిగింది ఏమిటండి ఇంత సంతోషంగా వున్నారు ఏమైంది మీకు వేళ అని అడిగింది జరిగిందంతా చెప్పి ఇకనుంచి నేను అది తినకూడదు ఇది తినకూడదు అని నేను తిండి మానవలసిన పనిలేదు డాక్టరుగారు నాకు కేవలం నాకు ఇష్టమైనది మాత్రమే తిననవసరం లేదు అని చెప్పాడు అని అన్నాడుబాగుంది మీ తెలివి తెల్లారినట్లే వుంది డాక్టరు మిమ్మలిని పిచ్చివాడిని చేసాడండి అని అన్నది. . అదెట్లా అన్నాడుఇప్పుడు చెప్పండి మీకు చామగడ్డల వేపుడు ఇష్టమా కాదా ఇష్టం కదా అని అన్నదిఇష్టం కాకపోవటం ఏమిటి ఎప్పుడు నీకు కూడా మిగల్చకుండా నేనే తింటాను అని  అంటావుగా. అయితే చెప్పండి ఆలుచిప్స్, గుత్తి వంకాయ కూర, కంద కూర, ఆవకాయ పచ్చడి, నీళ్లవకాయ, మాగాయ, మిరపకాయ బజ్జిలు, ఆలు  బొండాలు,అరటికాయ బజ్జిలు, జిలెబీలు, మైసూరుపాకులు, జహాంగీరీలు, కోవా, కిశ్మిష్, జీడిపప్పు, ఇలా మన రామారావుకు ఇష్టమైన తినుబండారాల లిస్టు మొత్తం చెప్పిందిఅబ్బా అబ్బా ఇలా నన్ను ఊరించకే ఇవన్నీరేపు పండగకు చేసే ప్రొపోజలు ఏమైనా ఉన్నదా చెప్పు అని అన్నాడు. మాట అంటుంటే రామారావు మొహం వెయ్యి వాట్ల బలుపు వెలిగినట్లుగా వున్నది. నా మొహం అవన్నీ నేనెందుకు చేస్తానండి మీకే మీ డాక్టరు అవన్నీ తినకూడదని చెప్పాడని ఇప్పుడే చెప్పారుగా అని అనే సరికి రామారావు ట్యూబులైటు మెదడు టుపుకు టుపుకు అని  వెలిగిందిఅదా సంగతి అని అనుకోని అప్పుడు కానీ రామారావుకు అది చెప్పేటప్పుడు డాక్టరు పెద్దగా వెకిలి నవ్వు ఎందుకు నవ్వడో తెలియలేదు. . 

ఇది సాధారణంగా సమాజంలో సగటు మనిషి షుగరు వ్యాధి సోకినప్పుడు కలిగే ఆవేదన, మనలో చాలామందికి రామారావుకు కలిగినటువంటి అనుభవాలు ఉండి ఉండవచ్చు  వక్కసారి వెనుకకు తిరిగి చూసి చెప్పండిఅయ్యా వెనుకకు అంటే మీ వెనుకకు కాదు మీ గతంలోకి తెలిసిందా

ఇక అసలు విషయానికి వద్దాము. రకంగా అయితే ఒక షుగరు వ్యాధి గ్రస్తుడు తనకు షుగరు వ్యాధి జీవితాంతం ఉంటుండదని తెలుసుకొని కూడా షుగరు తగ్గుతుందనే ఆశతో ఉంటాడో అదే విధంగా ప్రతి సాధకుడు కూడా భవ బంధాలు జీవితాంతం వుంటాయని తెలుసుకొని నిత్యం తన సాధనతో వాటిని తెంచుకోవాలని చూస్తాడు. ఒక గుర్రం రౌతు తానూ గుర్రం దిగిన తరువాత రోజు దానికి తాడు కట్టి ఒక గుంజకు కట్టి వేసే వాడట ఒకరోజు తాను రోజు కట్టే తాడు తెగి ముక్కలు అయ్యిందట ఇప్పుడు యెట్లా గుర్రాన్ని కట్టివేయాలి అని  ఆలోచించాడు. అప్పటి కప్పుడు ఇంకొక తాడు తేవాలంటే అది జరిగే పని కాదు. అప్పడు అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే గుర్రం మేస్తున్న గడ్డి పరకలను కొన్నిటిని తీసుకొని దాని మేడవద్ద తాడుతో కట్టినట్లు దానిమీద నిమిరాడట అంటే గుఱ్ఱం తన యజమాని తనను తాటితో కట్టాడని అనుకోని రోజులాగే అక్కేదే వుండినదటమరుసటి రోజు రౌతు గుర్రాన్ని తీసుకొని వెళ్ళటానికి అదిలిస్తే అది గుంజ చుట్టే తిరుగుతున్నది కానీ దానిని వదిలి రావటం లేదు అప్పుడు మరల రౌతు కొన్ని గడ్డి పరకాలలో దాని మెడను నిమిరితే అప్పుడు అది అక్కడినుండి కదిలినదటఅంటే నిజానికి దాని మేడలో పలుపు (తాడు) లేదు కానీ అది వున్నట్లుగా భావించి తనకు తాను బందించినట్లుగా భావిస్తున్నది. సాధక నీవు కూడా గుర్రం వలెనె నిజానికి ఎటువంటి బంధనాలు లేకుండా  వున్నావు.

కానీ సంసారం ఒక బంధనం అనుకోని దానికి నీవు కట్టివేయబడినట్లు నీ యంతట నీవె ఊహలలో  ఉంటున్నావు. సత్యాన్ని తెలుసుకుంటే సంసార బంధనాలను వీడటం ఏమి సమస్య కాదు. గృహస్ట జీవనం చేస్తూకూడా మోక్షాన్ని చేరుకోవచ్చు మనకు అనేకమంది సాధకులు ఉదాహరణగా వున్నారు

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మన మహర్షులు ఏమన్నారంటే "మనః ఏవ కారణాయ మనుష్యాణాం బంధః ఏవ మోక్ష" అందువలన మనస్సును సదా పరమేశ్వరుని మీద లగ్నాత చేసి మన దైనందిక కార్యక్రమాలను మన ధర్మంగా భావించి సాధకుడైతే నిరంతర సాధన చేస్తాడో తప్పకుండ అతడు మోక్షాన్ని పొందగలడు. అందులో ఇసుమంతకూడా అసత్యం లేదు. కేవలము దృఢ సంకల్పము, అకుంఠిత దీక్ష నిరంతర కృషి ఉండాలి. "సాధనేన సాధ్యతే సర్వం" ఇంకా ఎందుకు ఆల్సస్యం ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు మోక్షపదాన్ని జన్మలోనే పొందు

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పరాధీనమైనట్టి బ్రతుకు,

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో* 𝕝𝕝 *పరాధీనం వృథా జన్మ*

            *పరస్త్రీషు వృథా సుఖం।*

            *పరగేహే వృథా లక్ష్మీః*

            *విద్యా యా పుస్తకే వృథా॥*


*తాత్పర్యము 𝕝𝕝 పరాధీనమైనట్టి బ్రతుకు, పరస్త్రీల వలన సుఖము, పరుల యింట‌ నున్న ధనము, పుస్తకముల యందలి జ్ఞానము సమయమునకు అక్కరకు వచ్చునవి గావు.... అందుచేత, మన దగ్గర ఎన్ని పుస్తకాలను పోగు చేసుకున్నామన్నది కాదు, ఎన్నింటిని పూర్తిగా చదివి ఆకళింపు చేసుకున్నామన్నదే గమనించాల్సిన విషయం.....*

 

 ✍️🪷💐🌸🙏

విద్య నేర్చినవాడు

 సీ॥

విద్య నేర్చినవాడు విర్రవీగుచునుండు 

నాదుప్రతిభయంచు నవ్వుకొనుచు 

ధనము గూడినవాడు దర్పమ్ము జూపించు 

నాదుప్రతిభయంచు నవ్వుకొనుచు 

తెలివి గలుగువాడు ధృతితోడ వర్తిల్లి 

నాదుప్రతిభయంచు నవ్వుకొనుచు 

బలము గలుగువాడు బంధువుల్ గలవాడు 

నాదుప్రతిభయంచు నవ్వుకొనుచు 

తే.గీ॥ చెలగి చెలరేగి యందఱూ చిన్నవోవ 

దుష్టమార్గముల చరించి దోగు గాని 

దైవశక్తియిదియటంచు దలుపబోరు 

దైవ మొల్లమి నీవెందు? తలచవలదె? 

~"కవితాభారతి" 

*~శ్రీశర్మద* 

ది:08-02-2025

మూత్రపిండములలో రాళ్లు

 మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు  - 


 *  కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .


 *  యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.


 *  వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .


 *  రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.


 *  పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.


 *  పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.


 *  పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .


  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసిన ఆహారపదార్దాలు  -


  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .


 తినకూడని ఆహార పదార్ధాలు  -


    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 


         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .


      ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

Panchaag