9, మార్చి 2025, ఆదివారం

ఐదువారాల నిద్ర..*

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*ఐదువారాల నిద్ర..*


"నేను చాలా ఇబ్బందుల్లో వున్నాను..దిక్కు తోచడం లేదు..నువ్వు కొద్దిగా డబ్బు సర్దుబాటు చేస్తే..మళ్లీ నేను కోలుకున్నాక నీ డబ్బు నీకు వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేస్తా..కాదనకు.. ఇవి చేతులు కావు, కాళ్లనుకో.." అంటూ ఆ వ్యక్తి శ్రీ మీరాశెట్టి గారి వద్ద ప్రాధేయపడసాగాడు..మీరాశెట్టి గారు అతనిని అనునయించాలని చూస్తున్నారు గానీ వీలు కుదరటం లేదు..ఇప్పటికిప్పుడు ఎంతో కొంత డబ్బు అతని చేతిలో పెడితేగానీ వదిలేటట్లు కనిపించడం లేదు..


ఆ వచ్చిన వ్యక్తి పేరు వెంకటేశ్వర్లు..మీరాశెట్టి గారికి బాగా తెలిసిన వాడే..వ్యాపారం చేసి అందులో నష్టపోయాడు.. అప్పులపాలయ్యాడు..నిజానికి అతను వ్యాపారం మొదలుపెట్టిన నాడు ఏ ఇబ్బందీ లేదు..ఉన్నంతలో సర్దుకొని అలానే కొనసాగించి వుంటే..ఈ పరిస్థితి దాపురించేది కాదు..అత్యాశకు పోయి..అప్పులు తెచ్చి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసాడు..తాను పెట్టిన పెట్టుబడి కి, రాబడికి వ్యత్యాసం పెరిగిపోయి..అప్పుల్లో పడ్డాడు..ఇక దిక్కుతోచక మీరాశెట్టి గారి వద్దకు వచ్చాడు..


"నువ్వంతగా బాధ పడుతున్నావు కాబట్టి..నేను నీకు పదివేల రూపాయలు సహాయం చేస్తాను..అదికూడా నువ్వొక మాట ఇస్తేనే.." అన్నారు మీరాశెట్టి గారు..ఏమిటో చెప్పామన్నాడు వెంకటేశ్వర్లు..ఐదు వారాల పాటు, వారానికి ఒకరోజు లెక్కన.. భార్యతో కలిసి..మొగలిచెర్ల గ్రామం వద్ద ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద నిద్ర చేయాలని..తన సమస్యలు తీరిన తరువాత..శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేయాలని..షరతులు పెట్టారు మీరాశెట్టి గారు..సరే అన్నాడు వెంకటేశ్వర్లు..


అనుకున్న ప్రకారం..వెంకటేశ్వర్లు కు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసారు మీరాశెట్టి గారు..(1980 ప్రాంతంలో పల్లెటూరులో..పదివేల రూపాయాలంటే పెద్ద మొత్తం క్రిందే లెఖ్ఖ!). వెంకటేశ్వర్లు ఆ డబ్బును వెంటనే ఖర్చు పెట్టలేదు..ముందుగా మీరాశెట్టి గారికి మాట ఇచ్చిన ప్రకారం..ఆరోజు సాయంత్రమే బయలుదేరి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి భార్యతో సహా వెళ్ళాడు..ఆరోజు రాత్రి శ్రీ స్వామివారి మందిరం లో నిద్ర చేశారు వెంకటేశ్వర్లు దంపతులు..తెల్లవారి లేచి..శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకొని..తిరిగి తన ఊరికి వచ్చేశాడు..మీరాశెట్టి గారిని కలిసి, తాను మొగలిచెర్ల వెళ్లొచ్చిన సంగతి చెప్పాడు..


మరో వారం గడిచేసరికి మీరాశెట్టి గారు వెంకటేశ్వర్లు సంగతి దాదాపుగా మర్చిపోయారు..అతని బాధ అతను పడుతున్నాడు..పదే పదే అతని వెంటపడటం ఎందుకని మీరాశెట్టి గారి భావన..పైగా వెంకటేశ్వర్లు సమస్యను  ను మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి కి అప్పచెప్పాము కదా..ఆ స్వామే అన్నీ చూసుకుంటాడు అనే నమ్మకం మీరాశెట్టి గారిది..


మరో రెండువారాలు గడిచాయి..మొత్తం మూడువారాలు వెంకటేశ్వర్లు మొగలిచెర్ల వెళ్లి, శ్రీ స్వామివారి సమాధి మందిరం లో నిద్ర చేసి వచ్చాడు..అతని ఆర్ధిక పరిస్థితి లో మార్పు రాసాగింది..అప్పుల వాళ్ల వత్తిళ్ళు కొద్దిగా తగ్గడమే కాదు, తనకు రావాల్సిన పైకం కూడా వసూలు అవడం జరిగింది..మీరాశెట్టి గారి వద్ద తీసుకున్న పదివేల రూపాయల లో ఏమీ ఖర్చు కాలేదు..అలానే ఉండిపోయింది..వెంకటేశ్వర్లు కు శ్రీ స్వామివారి మీద నమ్మకం ఏర్పడింది..నాలుగో వారం కూడా మొగలిచెర్ల వెళ్లి, నిద్ర చేసి వచ్చాడు..ఐదు వారాలు పూర్తయ్యే సరికి..వెంకటేశ్వర్లు లో మునుపటి నైరాశ్యం లేదు..ఉత్సాహంగా వున్నాడు..ఇంకో రెండు నెలల కల్లా..వ్యాపారం గాడిలో పడింది..అనవసరపు ఆర్భాటాలు తగ్గించుకున్నాడు..ఉన్నంతలో వ్యాపారం చేసుకోసాగాడు..చిత్రమేమిటంటే..ఐదు వారాల పాటు శ్రీ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయాలనుకున్న వెంకటేశ్వర్లు..ప్రతి వారం మొగలిచెర్ల వచ్చి, మందిరం వద్ద నిద్ర చేసి వెళ్లసాగాడు..


మీరాశెట్టి గారి వద్ద తాను అప్పుగా తెచ్చిన పదివేల రూపాయలను తిరిగి ఇవ్వడానికి ఆయన వద్దకు వెళ్లి.."నువ్వు ఇచ్చిన ఈ డబ్బు ఖర్చు పెట్టలేదు..ఇంట్లోనే ఉంచుకున్నాను..తీవ్రమైన అవసరం వస్తేనే ఖర్చుపెట్టాలని అనుకున్నాను..కానీ ఈలోపలే ఆ దత్తాత్రేయ స్వామి దయ వల్ల నా ఇబ్బందులు తొలిగాయి..చిన్న చిన్న సమస్యలను నేను పరిష్కరించుకోగలను..నువ్వు ఆరోజు మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వద్ద నిద్ర చేయాలని నాచేత ప్రమాణం చేయించుకున్నావు..నువ్వు చెప్పినట్లే చేసాను..ఆ స్వామి కరుణించాడు.. ఇంకెప్పుడూ అత్యాశకు పోను..ఉన్నంతలో వ్యాపారం చేసుకుంటాను..ఇదిగో నువ్విచ్చిన డబ్బు..వడ్డీ తో కలిపి తెచ్చాను.." అన్నాడు..


మీరాశెట్టి గారు వడ్డీ తీసుకోకుండా తానిచ్చిన పదివేల రూపాయలు మాత్రం తీసుకున్నారు..మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి పాదాలను నమ్ముకోమని..వాటిని విడవకుండా పట్టుకోమని..వెంకటేశ్వర్లు కు మళ్లీ సలహా ఇచ్చారు..


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో మీరాశెట్టి గారిదే మరో అనుభవం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*ప్రతిభ..పరీక్ష..*


"శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మానండీ..శ్రీ స్వామివారి కృప వల్ల నాకు ఈరోజే మేలు జరిగింది..మీరు రోజూ భక్తులు పొందిన అనుభవాలను పోస్ట్ చేస్తున్నారు కదా..నేను చదువుతూ ఉన్నానండీ..నాకూ కొన్ని అనుభవాలు కలిగాయి..నిజంగా మొగలిచెర్ల అవధూత  దత్తాత్రేయుడే నాకు మేలు చేశాడండీ..మీతో చెప్పుకోవాలని అనిపించి మీకు ఫోన్ చేస్తున్నాను..ఈ అనుభవాన్ని కూడా మీరు తప్పకుండా వ్రాయండి.."


వరంగల్ లో లాయర్ గా పనిచేస్తున్న శ్రీమతి ప్రతిభ గారు నాకు ఫోన్ చేసి ఎంతో ఉద్వేగంతో చెప్పిన మాటలివి..ప్రతిభ గారు ఫోన్ చేసే క్షణం దాకా వారెవరో నాకు తెలీదు..నిజానికి ఈరోజు దాకా వారిని నేను కలుసుకోలేదు..ఆవిడ గారు తనను మొగలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారే దగ్గరుండి అన్నివిధాలా ఆదుకున్నారని త్రికరణ శుద్ధిగా నమ్మారు..


శ్రీమతి ప్రతిభ గారు వరంగల్ లో వుంటారు..ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు..వృత్తి పరమైన పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిసి..తాను కూడా ఆ పరీక్ష వ్రాయాలని సంకల్పించారు..దరఖాస్తు చేసుకున్నారు..కానీ ఆ పరీక్షకు ముందురోజు దాకా హాల్ టికెట్ రాలేదు..ప్రతిభ గారు పూర్తిగా ఆందోళన చెందారు..రాత్రి తొమ్మిది గంటల దాకా ఎదురు చూశారు..హాల్ టికెట్ రాలేదు..ప్రక్కరోజు ఉదయం పది గంటలకు హైదరాబాద్ లో పరీక్ష వ్రాయాలి..ఆవిడకు దిక్కు తోచలేదు..

"స్వామీ దత్తాత్రేయా..నువ్వే దిక్కు..నేను పరీక్ష వ్రాయడానికి మార్గం చూపించు తండ్రీ!.." అని మనసులో పదే పదే ప్రార్ధన చేసుకోవడం మొదలుపెట్టారు..


తెల్లవారింది..ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రతిభ గారు పరీక్ష గురించి ఆశ వదులుకున్నారు..కానీ చిత్రంగా ఆ సమయం లో హాల్ టికెట్ ఇంటర్నెట్ ద్వారా వచ్చింది..తన కళ్ళను తానే నమ్మలేక పోయారు..కానీ మరో సమస్య ఉన్నది.. ఇప్పటికిప్పుడు బైలుదేరినా.. పరీక్ష కు సమయానికి అందుకోవడం చాలా కష్టం..వరంగల్ నుంచి హైదరాబాద్ మూడు గంటల ప్రయాణం ఉన్నది..అయినా ప్రతిభ గారు..భారం అంతా శ్రీ స్వామివారి మీద వేసి..తాను తయారయ్యి..కారు మాట్లాడుకుని..ఉదయం ఎనిమిది గంటలప్పుడు హైదరాబాద్ బయలుదేరారు..ఆ మూడుగంటల ప్రయాణం లో ఆవిడ శ్రీ స్వామివారినే ధ్యానం చేస్తూ వున్నారు..పరీక్ష వ్రాసే చోటుకు చేరేసరికి..సుమారు పదకొండు గంటల సమయం అయింది..నిజానికి అంత ఆలస్యం అయితే..అధికారులు పరీక్ష వ్రాయడానికి ఒప్పుకోరు..ప్రతిభ గారు అధికారులను కలిసి..తాను వరంగల్ నుంచి వస్తున్నాననీ..హాల్ టికెట్ ఆలస్యంగా రావడం వలన..ఈ జాప్యం జరిగిందని తెలిపారు..అధికారులు ప్రతిభ గారిని పరీక్షకు అనుమతించారు..పరీక్ష వ్రాసి బైటకు వచ్చిన ప్రతిభ గారికి..శ్రీ స్వామివారు చూపిన దయ వల్లే..తనకు ఈరోజు ఇలా అన్నీ కలిసొచ్చాయని నమ్మి..శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కారాలు చేసుకున్నారు..


పై విషయాన్ని స్వయంగా ప్రతిభ గారు ఫోన్ చేసి తెలుపుతూ..తనకు శ్రీ స్వామివారి విభూతి పంపమని కోరారు..పంపించాము..మళ్లీ ఒక పది రోజులకు ఫోన్ చేశారు..ఎన్నాళ్ల నుంచో తాము ఇంటి ఋణం గురించి ప్రయత్నాలు చేస్తున్నామనీ..bank అధికారులు మంజూరు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని..శ్రీ స్వామివారిని శరణు వేడు కున్నాననీ..రెండురోజుల్లో ఆ ఋణం మంజూరు చేసినట్లు తెలిపారనీ..చెప్పారు..మొదటిరోజు ఎంత ఉద్వేగంతో మాట్లాడారో..అదే ఉద్వేగం..అదే సంతోషం..ఆవిడ మాటల్లో మళ్లీ వినిపించాయి..


ప్రతిభ గారు ఇంతవరకూ మొగలిచెర్ల రాలేదు..శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించనూ లేదు.. కేవలం శ్రీ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మారు....ప్రస్తుతం ప్రతిభ గారికి మొగలిచెర్ల లో సిద్ధిపొందిన దత్తాత్రేయుడే సర్వస్వం..నమ్మకం తో కూడిన భక్తి ఎక్కడ ఉంటుందో..అక్కడ దైవం తప్పక ఉంటాడు..అది మరొక్కసారి ఋజువయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

ఎండలు ముదురుతున్నాయ్

 *జై శ్రీమన్నారాయణ* 

09.03.2025,ఆదివారం




*ఎండలు ముదురుతున్నాయ్.. జర జాగ్రత్త...* 


ఈ ఏడాది దేశంలో మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచి కొట్టుతున్నాయి.. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు.


ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది. రాష్ట్రంలోని 301 మండలాలు 'హేట్ వేవ్స్' నమోదయ్యే ప్రాంతంలో ఉన్నాయని, వడగాలుల ముప్పు సైతం పొంచి ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. తెలంగాణ ప్రాంతం మెట్ట నేలలతో కూడుకుని ఉండటంతో భూమి త్వరగా వేడెక్కుతుందని వాతావరణ  నిపుణులు చెబుతున్నారు...


 *ఇలా ముదురుతున్న ఎండలకు - మనం తీసుకోవల్సిన జాగ్రత్తలు..* 


* శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే.. జ్వరం వస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌‌కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే మెదడు దెబ్బతింటుంది. అంతర్గత అవయవాల పనితీరును కూడా పాడవుతుంది.


* ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.


* ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.


* తగినన్ని నీళ్లు తాగుతూ డి హైడ్రేట్ కాకుండా ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి.


* అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.


* తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్లు ధరించాలి.


* మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి. సాయంత్రం పూట బయటికి వెళ్ళాలి. (ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకూడదు.)


* కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.


* కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.


* ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ


* చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగిపోతాయి.


* ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.


* ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి..

దేవుడు సృష్టించిన అద్భుతం

 Men ను కలుపుకొని women అయింది 

He ను నింపుకొని she అయింది 

మహిళ అనే పదంలోనే "మహి"(ప్రపంచం) ఉంది 


దేవుడు సృష్టించిన అద్భుతం- జీవజాతులలో అపూర్వం 

అణుకువ ఆమె సొంతం-అందం ఆమె పాదక్రాంతం 

ఆకలేస్తే అన్నపూర్ణ -అరాచకం చేస్తే ఆదిశక్తి 

కష్టం వస్తే కన్నతల్లి- ఓపికలో నేలతల్లి 


పేగు బంధాన్ని పంచే అమ్మ-కొత్త బంధాల్ని పెంచే భార్య 

అనురాగంలో అక్క- చిలిపిదనంలో చెల్లి 

ఆమె చేసిన బొమ్మలం-ఆమె కన్నా ఎక్కువ అని ఎలా అనగలం?

ఆమె చేయని పాత్ర లేదు-నెరవేర్చని ఘనతలేదు 

ఉద్యోగం లో రానించగలదు-రాజ్యాన్ని సైతం పాలించగలదు.

ఎంత గొప్పవాడైనా ఆమె గర్బాన గడపాల్సిందే!

ఎంత మొనగాడైనా ఆమె ప్రేమను పొందాల్సిందే!


*మహిళామనులందరికీ మరియు మహిళ నడిపించే మనుషులందరికి "మహిళా" దినోత్సవ శుభాకాంక్షలు* 

          ఇట్లు  

ఓ మహిళ మలిచిన మనిషి

స్వార్థ పూరిత చర్యలు.

 *


దేశ గణ తంత్ర దినోత్సవము/స్వపరిపాలన (26-1-1947) నాటికి అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల పట్టిక ప్రకారం అమెరికా దేశపు డాలర్ తో పోల్చినప్పుడు ఒక డాలర్ విలువ 4 రూపాయల 76 పైసలు. నేడు అనగా 2025 సంవత్సరంలో ఒక డాలర్ విలువ 87 రూపాయల 81 పైసలు. రూపాయి మారకం విలువ తగ్గిపోయినందుకు కారణం...అమెరికన్ డాలర్ బలపడటమే అని తేలికగా చెప్పేసి, నెపాన్ని ఇతర దేశాలపై రుద్దేస్తున్నాము. కాని, వాస్తవానికి రూపాయి మారకం విలువ ఇంతగా దిగజారడానికి ముఖ్య కారణం నీతిమాలిన వ్యక్తుల యొక్క స్వార్థ పూరిత చర్యలు. 


ఈ తగ్గుదలను ద్రవ్యోల్బణము అని వ్యవహరిస్తూ ఉంటాము. ఈ ద్రవ్యోల్బణము వలన క్రమంగా కొనుగోలు శక్తి నశిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి నానాటికీ అధిక శాతం ప్రజలను బీదరికం వైపు నెట్టుతుంది. *ఈ పరిస్థితి ఆందోళనకరమే గాకుండా అభివృద్ధి చెందాలనుకున్న దేశాలన్నిటికీ హానికరము గూడా*. 


ముందు మన దేశంలోని నల్ల బజారు బడా బాబులను మరియు అక్రమ రవాణా దురంధరుల విషయం సమాలోచించుదాము. ప్రభుత్వ పరిధులు, పరిమితులు, చట్టాలకు లోబడని క్రయ విక్రయాల లావాదేవీలను నల్ల బజారు వ్యవహారంగా పరిగణించ వచ్చును. ఉదాహరణకు బియ్యం, గంజాయి, ఎర్ర చందనం, కలప అక్రమ, అక్రమ ఇసుక రవాణా. ఆపత్కాలంలో ప్రాణ రక్షణ మందులు, నాసి రకం వస్తువులు అధిక ధరలకు విక్రయించడం. విదేశీ మాదక, మత్తు మందులు (Drugs), పొగాకు, నకిలీ ఆయుధాలు, మానవ అవయవాలు చట్టం విరుద్ధంగా అమ్మడం. జనరంజక సినిమా టికెట్లు, జనాకర్షక బంగారం నల్ల బజారులో ఉంచడం. అక్రమ వెంచర్లు, దొంగ నోట్లు ముద్రణ ఇత్యాది.


దేశంలో ఇన్ని రకాల మోసాలు, అక్రమాలు జరుగుతూ ఉంటే ఇప్పుడేమయ్యిందని గగ్గోలు పెట్టేవారికి సమాధానం ఏమని చెప్పాలి? ఎవరు చెప్పాలి. ?

మళ్ళీ మన వాళ్ళే అంటారు...ఇవన్నీ చూడడం చట్టం మరియు భద్రతా అధికారుల బాధ్యత, మాకేమీ సంబంధం అని. *సమాజంలో ఉంటూ దేశద్రోహ మరియు ఆర్థిక క్షీణత కార్యక్రమాలు జరుగుచుంటే ఉదాసీనంగా ఉండడం నాగరికం కాదు*.


ధన్యవాదములు

*(సశేషం)*

భారతీ

 చ.పరులకుఁ జెప్పు సూక్తులవి వర్ధిలుచుండు వినోద హేతువై

నిరతము శ్రీ ప్రతిష్ఠలననేక విధమ్ములఁ బెంచుఁ గాని యా

విరచిత భాషణమ్ములు వివేకముఁ గూర్చును చిత్త శుధ్ధితో

నరయుచు ధర్మ మార్గమున నాచరణమ్మునఁ జూప భారతీ!౹౹73


శా.శంభో శంకర భక్త రక్షక మహేశా యంచు సర్వజ్ఞు హే

రంబున్ పట్టిగ గాంచి నట్టి భవు నీలగ్రీవు ప్రార్థించి సం

రంభమ్మొప్పగ రక్ష సేయగల సర్వాత్మున్ సదా గొల్చెదన్ 

దంభమ్మేమియు లేని రీతి మదిలో ధ్యానించుచున్  భారతీ!౹౹ 74

🔥స్వప్నం ఎంత అందంగా ఉన్నా

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏           🔥స్వప్నం ఎంత అందంగా ఉన్నా నిద్ర లేవక తప్పదు.. బాధ ఎంత పెద్దది అయినా దాటుకుని వెళ్లక తప్పదు..జీవితం నీదైనప్పుడు  దాని కోసం చేయాల్సిన కష్టం కూడా నీదే... ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు..నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు..కానీ ఏదో ఒక రోజు ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది🔥మన జీవితం ప్రతీ రోజు మనకు పాఠాలను నేర్పుతూ ఉంటుంది.. కానీ మనం ఆ పాఠాలను నేర్చుకుంటున్నామా లేదా ఉరికనే  పేజీలు తిప్పుతున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది..సమయం విలువైనది తెలివిగా ఉపయోగించుకోవాలి🔥ప్రేరణ అనేది ఒక పనిని ప్రారంభించడానికి పనికొస్తుంది.. కానీ అలవాటు అనేది దాన్ని కొనసాగించడానికి పనికొస్తుంది...నిజమైన జ్ఞానం గొప్ప మాటలు చెప్పడంలో లేదు.. గొప్ప సందేశాలు రాయడంలో కూడా లేదు.. ఒకరి మనసును గాయపరచకుండా ఉండగలిగినప్పుడే దైవత్వం సిద్దిస్తుంది... అలా ఉండాలని మనసుకు తోచినప్పుడు అద్భుతమైన జ్ఞానం మనకు సొంతమవుతుంది🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును * 🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం  - దశమి - పునర్వసు -‌‌ భాను వాసరే* (09.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

భగవంతుడు పూర్ణుడు

 ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే… ఓం శాంతి శాంతి శాంతిహి…ఈ శ్లోక అర్థము చెప్పగలరా?

ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే


పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే...


ఓం శాంతి శాంతి శాంతి హి


భగవంతుడు పూర్ణుడు...పూర్ణానికి పూర్ణం కలిపినా....పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా....మిగిలేది పూర్ణమే.


ఇదే శృతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే ....జీవితమంతా ఇందులోనే దాగుంది. మోక్ష మార్గం ఇందులోనే దాగుంది....సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.


0 + 0 = 0....


0౼0 = 0


కానీ...


0+1 = ఎంత అంటే.....


మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.


0+2 =2...సున్నా 2 తో కలవగానే సున్న మాయమై....అది రెండుగా మారిపోయింది. అంటే....సున్న దేనితో కలిస్తే అది గా మారిపోతూంది.


గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం.మనకప్పుడు ఏ ఎమోషన్స్ ఉండవు. ఎప్పుడైతే సున్నలాంటి మనం నిద్రలేవగానే ప్రకృతితో కలుస్తామో ...మనం ప్రకృతే ఐపోతున్నాం.


మనం దేనితో కలుస్తామో ....దానిగా మారిపోతున్నాం...


బాగా గమనించు....నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు....అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు....ఆ వ్యక్తి ని చూడగానే ...నీలో అతనిపట్ల ఆత్మీయత కలుగుతుంది. నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావ్.


ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు....అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావ్....


ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే....నీకూ అతనిపట్ల ప్రేమ కలుగుతోంది...


ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే ...నీకూ అతనిపట్ల గౌరవం కలుగుతుంది...


అంటే....మనం ఎదుటి వ్యక్తిలో ని ఏ గుణాన్నాయితే గమనిస్తున్నామో...మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి...ఆ గుణంగానే మారిపోతున్నాం...


" మనం దేనితో కలుస్తున్నామో...అది గా మారిపోతున్నాం. "


మనలో సున్న( 0) లా ఉన్న పరమాత్మ తత్వం....ఎదుటి వ్యక్తీలోని కోపం తో కలవాగానే ....అది కోపంగా మారిపోయి...మనకు కోపం వస్తుంది.


నువ్వు ప్రేమతో...కలిస్తే ప్రేమగా.....ద్వేషం తో కలిస్తే ద్వేషం గా మారిపోతావ్.


ఎదుటివారిలోని అహంకారాన్ని చూస్తే....నీలో కూడా అహంకారం మొలుస్తుంది.


అందుకే....ప్రతి జీవిలోనూ...మనిషిలోనూ...పరమాత్మ ఉన్నాడని గ్రహించి....ఆయనతో అనుసంధానం అవ్వు.


అంటే నీలోని పూర్ణాన్ని....ఎదుటి వ్యక్తీలోని పూర్ణం తో కలుపు....వచ్చేది పూర్ణమే.


ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే...మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో....మనం అది గా మారిపోతామన్న


మహా సత్యాన్ని గమనించాలి.


అందుకే ఎలాంటి వారిలోనైనా ...భగవంతుణ్ణి చూడగల్గి.... ఆయనతో కలిస్తే...మనం కూడా భగవత్ తత్వంగా మారిపోవాలి.


సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునీతో...అనుసంధానమవుతూ....ఆయనలా మారిపోదాం!....

ఔషధాలు లేని జీవితం

 *`ఔషధాలు లేని జీవితం`* *1.త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.* *2. ఓం జపించడం ఔషధం.* *3.యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.* *4. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.* *5.ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.* *6. సూర్యకాంతి కూడా ఒక ఔషధం.* *7.కుండ నీరు తాగడం కూడా ఔషధమే.* *8.చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.* *9.ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.* *10. ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.* *11.ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.* *12.సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.* *13.కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.* *14.నవ్వు మరియు జోకులు ఔషధం.* *15. సంతృప్తి కూడా ఔషధం.* *16.మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.* *17.నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.* *18. నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.* *19.అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.* *20.ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.* *21.అందరితో కలిసి జీవించడం ఔషధం.* *22.తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.* *23.మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.* *24.సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.* *25.ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.* *26.చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.* *ప్రకృతి యొక్క "గొప్పతనం"ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.* *`ఈ ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.`*

ఆదివారం

 *ఆదివారం సెలవువద్దు...*

ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం! ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం..


అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||


స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||


*తాత్పర్యం:*


మాంసం తినడం..! మద్యం తాగడం..!

స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!

తలకు నూనె పెట్టుకోవడం..!


ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! ఈ కర్మలు చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు..

కుటుంబ సౌఖ్యం లేకపోవటం...

ఆనారోగ్యం కూడా..!!


ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు

ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!


ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!


అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!


ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు..


అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!


అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు

(Thomas Babington Macaulay,

ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే)

ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు..

మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!!

ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!


పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!


కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!


ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!


ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి.! .స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి..!


యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.!

సూర్యనమస్కారాలు చేయండి.!

సూర్యోపాసన చేయండి.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి.!!


ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు

కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ

దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!


ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ

క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే

కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.

మొమ్మాయి

 ఆయుర్వేద వైద్యంలో పేరుగాంచిన గొప్ప ఔషధం మొమ్మాయి గురించి సంపూర్ణ వివరణ -


       మొమ్మాయి అనే ఈ ఔషధానికి ఆయుర్వేదంలో చాలా గొప్ప పేరు ఉంది. ఈ ఔషదానికి మరొక పేరు "గోమూత్ర శిలజిత్" మార్కెట్ లో పచారీషాపుల్లో అమ్ముతుంటారు కాని అది అంత స్వచ్ఛమైనది కాదు. ఇది అసలైనది తెప్పించి నేను ప్రయోగించాను . చాలా జబ్బులలో మంచి ఫలితాలు ఇచ్చినది. మనకి దొరికిన మొమ్మాయి అసలైనదా కాదా అని తెలుసుకొవడానికి ఒక చిన్న పరీక్ష ఉన్నది.


               మొమ్మాయిని ఒక కందిగింజ అంత ఒక చిన్నగ్లాస్ నీటిలో వేయాలి . అప్పుడు నీరు ఎర్రగా మారుతుంది. అందులో ఒక పొడవాటి గుడ్డముక్కని వేసి నానబెట్టి ఒక కోడి కాలు విరగగొట్టి విరిగిన కాలుకు దీనిని చుట్టవలెను . కేవలం 15 నిమిషాలలో కాలు అతుక్కొని అది పరిగెత్తును . ఈ విధంగా పరీక్షించిన తరువాత మాత్రమే మొమ్మాయిని ఔషధంగా వాడవలెను .


           ఒకసారి ఈ మొమ్మాయిని వాడితే అది శరీరంలో 44 సంవత్సరాలపాటు నిలిచి ఉంటుంది. ఇది ఎక్కువుగా ఇరాన్ దేశములోని కొండలలో దొరుకుతుంది. శిలాజిత్ కీలువలే నల్లగా కాంతి వలే మైనము వలే కొంచం ఎర్రగా ఉంటుంది . ఇది శరీరంలో అత్యంత త్వరితముగా వ్యాపించి తన ప్రభావాన్ని చూపును . దీని మోతాదు ఒక వడ్లగింజ నుంచి రెండు వడ్లగింజల ఎత్తువరకు వాడవచ్చు . శిలాజిత్ చూర్ణములలో కలుపవలసి వచ్చినపుడు పన్నీటితో ఎండబెట్టి కలుపుకొనవలెను. లేహ్యములలో కలుపవలసివచ్చినప్పుడు ఆవునేతితో శిలజిత్ ని కలిపి కాచి చల్లార్చి కలుపవలెను గాని ప్రత్యేకంగా కలుపకూడదు.


  మొమ్మాయి ఉపయోగాలు -


 * హృదయానికి బలమును ఇస్తుంది.


 * మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది.


 * పొట్ట, జీర్ణకోశం , రక్తం తదితర వాటిని శుభ్రపరచును .


 * శరీరంలోని సమస్త అవయవాలకు , నరాలకు బలాన్ని ఇస్తుంది.


 * శ్లేష్మాన్ని హరించును .


 * విరిగిన ఎముకలను , కీళ్ళని బాగుచేయును .


 * గాయములను మాన్పును .


 * వ్రణాలను నయంచేయును .


 * ఎక్కిళ్లు , కడుపులో మంట, గుండెల్లో దడ నివారించును.


 * అజీర్ణం , పరిణామశూల మొదలగు శూలలను తగ్గించును .


 * కీళ్లనొప్పులు హరించును .


 * అన్నిరకాల జ్వరాలను తగ్గించును .


 * పక్షఘాతము , పక్షవాతము , సర్వాంగవాతములను హరించును .


 * అతిమూత్రవ్యాది మరియు సమస్త మూత్రవ్యాధులను హరించును .


 * ఉబ్బు , శ్వాస సంబంధ సమస్యలు , మతిచాంచల్యం , మూర్చ, ముక్కుకి వాసన తెలియకపోవడం , ముక్కులోపల పుట్టెడు వ్రణం నివారించును.


 * జీర్ణకోశమును అంటి ఉండే పేగు గట్టిపడు రోగం కూడా తగ్గును.


 * ఒక చెయ్యి , ఒక కాలి యొక్క కీలులో పుట్టి అలా నిలిచి ఎంతకీ తగ్గని నొప్పిని కూడా తగ్గించును .


 * స్త్రీల గర్భాశయం నందు జనించెడి పురుగులను చంపును.


 * సుఖరోగాలను , చర్మవ్యాధులను నయం చేయును .


 * బోధకాలు వ్యాధి , నాలిక మందం అయ్యే సమస్య , గొంతుకవ్యాధులను నయం చేయును .


 * దవడనొప్పి , నాలుకలో నొప్పి సమస్యలకు వడ్లగింజ అంత మొమ్మాయి నీళ్లతో కలిపి ఆయా స్థలముల యందు పట్టువేసిన బాగు అగును.


 * పిచ్చితనం ప్రారంభదశలో ఉండగా వడ్లగింజ ఎత్తు మొమ్మాయి గాడిదపాలతో కలిపి అరగదీసి లోపలికి ఇచ్చిన పిచ్చి తగ్గును.


 * కొండనాలుక వాపుకు కాని గొంతుక వాపుకు మొమ్మాయి ఇప్పపువ్వు సారాయి తో కలిపి అంగిట పట్టించిన పై సమస్యలు తగ్గును. ఇప్పపువ్వు సారాయి దొరకనప్పుడు పెసరపప్పు కషాయం వాడవచ్చు .


         పైనచెప్పినవే కాకుండా మరెన్నో రోగములకు ఈ మొమ్మాయి అమృతం వలే పనిచేయును . ఈ మొమ్మాయి వాడే సమయమున బెండకాయ కూర, ఆవాలు వాడకూడదు. అదే విధముగా మొమ్మాయి అవునేయ్యితో కలిపి ఇచ్చేప్పుడు స్వచ్చమైన దేశవాళీ ఆవునెయ్యిని మాత్రమే వాడవలెను. మార్కెట్లో దొరికే మొమ్మాయిని పరీక్షించి మాత్రమే వాడవలెను. నకిలీలు చాలా ఉన్నాయి .


         మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం . 


. ఈ గ్రంధాలు కావలసిన వారు 9885030034 నెంబర్ నందు సంప్రదించగలరు. 


. కాళహస్తి వేంకటేశ్వరరావు 

.        

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

 

. 9885030034

ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం

 🌹🌷🌞🪔🛕🪔🌞🌷🌹


*🌞ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం🌞*


      *🌞సూర్యమంత్రం🌞*


*నమః సూర్యాయ శాంతాయ* 

*సర్వరోగ నివారిణే!*

*ఆయురారోగ్య ఐశ్వర్యo* 

*దేహి దేహిదేవః జగత్పతే!!*


             *🙏అర్థం🙏*


ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా  నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు.  శాంతిని వొసంగువాడవు.

మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము. 


*సూర్యనారాయణుడు* ప్రత్యక్ష దైవం సూర్యుడుకి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం, అలా నమస్కారం చేస్తూ *12 సూర్య నామాలు* చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన *ఈ శ్లోకం కనీసం 12 సార్లు* అయినా జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు.. అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ  అధికంగా ఉంటుంది.. ఈ రెండు వాక్యల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది.. పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు..


        *🙏సూర్య ద్వాదశ నామాలు🙏*


1. ఓం మిత్రాయనమః

2. ఓం రవయేనమః

3. ఓం సూర్యాయనమః

4. ఓం భానువేనమః

5. ఓం ఖగాయనమః

6. ఓం పూష్ణేనమః

   7.  ఓం హిరణ్య 

        గర్భాయనమః

   8.  ఓం మరీచయేనమః

9. ఓం ఆదిత్యా యనమః

10. ఓం సవిత్రేనమః

11. ఓం అర్కాయనమః

12. ఓం భాస్కరాయనమః


ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.


         *🙏🌞సేకరణ🌞🙏*

*🌹న్యాయపతి నరసింహారావు🌹*

ఆదివారం*🌞 *🌹09, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

 *🌹09, మార్చి, 2025🌹*      

     *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం - శుక్లపక్షం*


*తిథి      : దశమి* ఉ 07.45 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    :ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : పునర్వసు* రా 11.55 వరకు ఉపరి *పుష్యమి*


*యోగం  : సౌభాగ్య* మ 02.59 వరకు ఉపరి *శోభన*

*కరణం   : గరజి* ఉ 07.45 *వణజి* రా 07.41 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 07.00 - 10.00 మ 02.00 - 04.30*

అమృత కాలం  : *రా 09.28 - 11.06*

అభిజిత్ కాలం  : *ప 11.54 - 12.42*

*వర్జ్యం             : *ప 11.42 - 01.19*

*దుర్ముహూర్తం  : సా  04.41 - 05.28*

*రాహు కాలం   : సా 04.47 - 06.16*

గుళికకాళం      :  *మ 03.17 - 04.47*

యమగండం    : *మ 12.18 - 01.48*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.20* 

సూర్యాస్తమయం :*సా 06.16*


*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.20 - 08.43*

సంగవ కాలం         :      *08.43 - 11.06*

మధ్యాహ్న కాలం    :      *11.06 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ ఏకాదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.16*

ప్రదోష కాలం         :  *సా 06.16 - 08.41*

రాత్రి కాలం           :  *రా 08.41 - 11.54*

నిశీధి కాలం          :*రా 11.54 - 12.42*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.43 - 05.31*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞||సూర్యమండలాష్టకం||🌞*


*యన్మణ్డలం జ్ఞానఘనం త్వగమ్యం త్రైలోక్యపూజ్యం* *త్రిగుణాత్మరూపమ్ ।*

*సమస్త తేజోమయ దివ్యరూపం పునాతు* 

*మాం తత్సవితుర్వరేణ్యమ్*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

ఇతరులకు సహాయం

 దయచేసి పూర్తిగా చదవండి🙏

ఇతరులకు సహాయం చేసిన వారిమి అవుతాం

🤝

హైదరాబాద్ లోని 

ఈ సి ఐ ల్ లో 

అత్యాదునిక సదుపాయలతో  300 పడకల  హాస్పటల్  ఉంది ...

కనుక  ఈ సి ఐ ల్ 

దిగీ ఎవరిని అడిగినా 

తులసి హాస్పటల్  

అడ్రస్ చెబుతారు 

అలాగే 15 సంవత్సరాల పై 

నుండి 80 సంవత్ష రాల  వరకు cardio(గుండె ) & ortho(విరిగిన ఎముకలు ) &Urology(కిడ్నీ రాళ్లు ) 

వైద్యమైనా సరే అంటే   

10 లక్షలు అయ్యే హార్ట్ సంబంధిత వ్యాదులైనా  ఉచితమే

సదుపాయాలు కార్పోరేట్   తరహాలో ఉంటాయి

కనుక  

మనలో మన పక్కన  

ఎంతో మంది పేదవాళ్ళు  జీవితంలో సంపాదించిందంతా  వైద్యానికే ఖర్చుచేసే మద్యతరగతి వారు ఉంటారు  

అలాంటి వారికి  

ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి 

మనమంతా కలసి 

ఒక్క  ప్రాణాన్పి కాపాడినా చాలు    

ఎ ఒక్కరు కూడ 

టెన్షన్  పడకూడదనే 

నేను నా పోన్లో ఉన్న 550 వాట్సప్ మెంబర్స్‌కి 

ఈ మెసేజ్  పంపుతున్నాను

మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్‌కు పంపితే  185000 మందికి 

ఈ విషయం తెలుస్తుంది

కనీసం 50 మంది  ప్రాణాలు కాపాడుదాం

తీసుకుని రావలసింది ఆరోగ్య శ్రీ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ 


Contact number 

040-49336699

9505108108

Hospital name 

Tulasi hospitals Ecil Hyderabad 

*Just forward please*🙏🏻