8, జూన్ 2025, ఆదివారం

వివాహమెందుకు

 *🙏వివాహమెందుకు?*🙏


*ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది.*

*దీనికి సమాధానం* *ప్రతివారూ* *తెలుసుకోవాలి.* 

*ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.*

1. ఋషిఋణం, 

2. దేవఋణం, 

3. పితృ ఋణం.


ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు - "బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః" అని.


1. ఋషి ఋణం: 


బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.


2. దేవఋణం: 


యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.🙏


3. పితౄణం: 


సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! "ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు.


🌳🙏సేకరణ🙏🌳

*డెత్ సర్టిఫికెట్

 *డెత్ సర్టిఫికెట్:*

       ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. 


     ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.

  

     “చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. 

                                                                                                            అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.


     ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్నె౦ట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను" 

"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది అయినా ఒకటే. 


     అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే. 

ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 


       మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. 

చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము. 


     ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..

 

     మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. 

అదే డెత్ సర్టిఫికేట్.



*గౌ.శ్రీ. జస్టిస్ ఎన్.వి.రమణ*

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి


          *సేకరణ*✒️

యుద్ధ క్షేత్రం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹అది యుద్ధ క్షేత్రం. ఇటు పాండవులు, అటు కౌరవులు వారి వారి సైన్యాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ క్షేత్రంలోని విశేషాలు చెబుతున్నాడు. దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణుని వద్దకు వచ్చి ఏమన్నాడో ఈ ఎపిసోడ్ లో సునీల్ ఆకెళ్ల వివరిస్తున్నారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

మణిపూరక చక్రం.

 మణిపూరక చక్రం.

 

మనవ శరీరం లొ ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది నాభి కి కుడివైపు ఒక అంగుళం దూరం లొ వెన్నుని ఆనుకొని ఉంటుంది. ఇది గతి తప్పినా అనగా సరిగ్గా శక్తి సంచాలనం చేయక పోయినా లేక స్థితి తప్పినా అనగా ఉండాల్సిన చోట ఉండకుండా కొంచెం కదిలినా శక్తి హీనం అయినా మనిషి చాలా రోగాలుకి గురి అవుతాడు.


మణిపూరక చక్రం పరీక్ష - 

 

 మణిపూరక చక్రం సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి 2 పరిక్షలు ఉన్నాయి .

 

* పరగడుపున అనగా ఏమీ తిననప్పుడు వెల్లికిలా పడుకొని నాభిలో వేలుపెట్టి కొద్ది గా అదిమితే గుండె చప్పుడు లాంటిది వినపడుతుంది.అలా వినపడితే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.


 * నాభి స్థానం నుండి కుడి ఎడమ స్థనగ్రముల వరకు దూరాలు కొలవండి. ఈ రెండు దూరములు సమానం గా ఉంటే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.

 

మణిపూరక చక్రం కదలడానికి గల కారణాలు - 

 

     మూలాధారం నుండి ప్రారంబించి ఆ చక్రాలు ఒక నిర్ణిత స్థానం లొ ఉంటాయి. ఈ చక్రాలు ఒక నిర్ణీత స్థానం లొ వెన్నుని ఆనుకుని ఉంటాయి.వీటి సంభందం శరిరం లొని నాడీ కేంద్రాలతో అన్నిటితో ఉంటుంది . ఈ నాడి కేంద్రాలలో ని అయస్కాంత శక్తి తగ్గినప్పుడు వాటికి అనుగుణం గా చక్రాల స్థితులలో మార్పు రావోచ్చును కారణం ఇవన్ని జివయస్కాంత శక్తి కేంద్రాలు.కనుక 


 శరీరం లొ జీవయస్కాంత శక్తి తగ్గడానికి గల కారణాలు - 


 * చాలా ఎక్కువ సమయం ఇనప వస్తువులపై కూర్చోవడం.


 * ఎక్కువుగా ఇనప గ్రిల్ల్స్ మొదలయినవి ఉండే ఇంట్లో నివసించడం.


 * అత్యధిక ఉష్ణం కలిగించె ఆహరం తరుచుగా తినడం.


 * అయస్కాంత శక్తి తగ్గిపోయిన స్త్రీ తొ కాని పురుషుడు తో కాని సంభందం పెట్టుకొవడం.


 * ఉప్పు, కారం లు అదికం గా తినడం


 * మాంసాహారం హద్దు దాటి తినడం .

 

* ఎక్కువ సమయం స్కూటరు, కార్ మొదలయిన వాహనాలు గాని లేక రోడ్ రోలర్ , ప్రొక్లియన్ వంటి వాహనాలు నడపడం.


 * అయస్కాంత విదుతయస్కాంత యంత్రాలకు సంభందించిన ఉద్యోగాలు.


 * చాలా శక్తి వంతమైన విధ్యుత్ తో నడిచే యంత్రాల వద్ద పని చేయడం .

 

మణిపూరక స్థానభ్రంశం వలన కలుగు రోగాలు - 


 " ఉదార విథానం " ( Diaphram ) అనేది కడుపుని పై భాగాన్ని వేరు చేస్తూంది .ఈ ఉదార వితానం క్రింది భాగం లొ ముఖ్యం గా నాభి నుండి క్రిందికి గల భాగం లొ ఏ రోగమైన రావొచ్చు. 

 

* జీర్ణకోశ వ్యాదులు , అల్సర్, apendisitees , డయారియా , డిసెంత్రీ , లైంగిక సమస్యలు, నడుంనొప్పి, పైల్స్ , phiistula , కడుపు నొప్పి ఇటువంటివి రావొచ్చు.

 

 మణిపూరక చక్రం శక్తి హీనం అయ్యి స్థానబ్రంశం పొందినా కాలేయం పాంక్రియాస్ పాడు అయ్యి మదుమేహం రావొచ్చు .పెద్ద ప్రేవులలో, పురీష నాళం కాన్సర్ రావొచ్చు .

 

మణిపూరక చక్రాన్ని సరి చేయు విధానం -


. వెల్లికిలా పడుకోండి . నాభి పైన ఒక రూపాయి బిళ్ళ ఉంచండి.దానిపైన ఒక కొవ్వొత్తి ఉంచండి.దానిపై ఒక స్టీల్ గ్లాస్ బోర్లించి పట్టుకోండి.వేడి వలన గ్లాస్ లొ ప్రాణ వాయువు

 ఖర్చు అయిపోయి శూన్యం ఏర్పడుతుంది.లేదా వాయువు వ్యాకోచించి ఒత్తిడి ఎర్పడుతుంది. ఆ వత్తిడి వలన మణిపూరక చక్రం సరి అయిన స్థానం లొ కి వస్తుంది. ఈ ప్రక్రియను నాలుగు , అయిదు సార్లు చేసి మణి పూరకానికి పైన చెప్పిన పరీక్షలు నిర్వహించాలి. అది సరి అయిన స్థానానికి వచ్చినపుడు గుండె చప్పుడు వినిపిస్తుంది.


 * అరచేతి కేంద్ర స్థానాన్ని గాని అరకాలి కేంద్ర స్థానాన్ని బొటన వ్రేలితో నొక్కండి.(sound వినపడే వరకు ) .


 * వెల్లికిలా పడుకొని గాలి పీల్చి కడుపుని ఉబ్బించి పెట్టండి అలా మణిపూరక చక్రం తన స్థానం వచ్చె వరకు చేయండి .


 * సూర్య యంత్రం మెడలో ధరించండి.

 

* సూర్య నమస్కారాలు చేయండి .


 * కుడి చేతి మద్య వేలికి మాణిక్యం ధరించండి. 

  

            మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.

   

  గమనిక -

    

  నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                 

. కాళహస్తి వేంకటేశ్వరరావు .

              

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                         

. 9885030034

ఇంటి ముందు చెట్టు

 ఇంటి ముందు చెట్టు పోయి ఇంట్లో A.C వచ్చింది.

ఇంటి బయట పొయ్యి పోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది.

ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది.

ఇంటి ఆవరణలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది.

ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది.

ఒంట్లో బద్దకం చేరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అయింది.

ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయింది.

ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయింది.

ఇంటిముందు రంగవల్లులు పోయి పెయింటింగ్ లు వచ్చాయి.

ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాధలయ్యారు.

ఇంటి బయట మరుగుదొడ్లు ఇంట్లో ఎటాచ్ బాత్రూమ్స్ అయ్యాయి.

అమ్మ,నాన్న,అత్త,మామ,బాబాయ్,పిన్ని పిలుపులు మామ్, డాడ్,అంటీ,అంకుల్ గా మారాయి.

శరీరానికి రాసే సున్ని పిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి.

జుట్టుకు పెట్టుకొనే కుంకుడుకాయలు పోయి షాంపూలు అయ్యాయి.

గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి.

వంట చేసుకొనే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్,ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి.

ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరచి పోయి వీధిలో 

మెడికల్ షాపులకు వలసకట్టాము.

శరీరాన్ని కప్పుకొనే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి.

ముఖానికి రాసుకొనే పసుపు,మీగడ పోయి మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి.

పొడుగైన వాలుజాడలు కొత్తిమీర కట్టలయ్యాయి.

చేతికి అందంగా పెట్టుకొనే గోరింటాకు పోయి మెహిందీ కోనులయ్యాయి.

కుటుంబం కలిసి జరుపుకొనే పండుగలు,పబ్బాలు 

వాట్సప్ స్టేటస్ గా మారాయి.

సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు పోయి డెస్టినేషన్ పెళ్ళిళ్ళు వచ్చాయి..

ఎడ్లబండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి..

పచ్చని పొలాలు ఫ్యాక్టరీలు,భవంతులయ్యాయి.

కుటుంబంలో అనుబంధాలు ఆర్ధిక సంబంధాలయ్యాయి...

ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి.

మనిషిలో మంచి,మానవత్వం పోయి మోసం,ద్వేషం పెరిగాయి.

సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది.

డబ్బే పరమావధిగా,వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షసుడయ్యాడు.

నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా,ఆనందంగా సాగేది..

నేటి మనిషి జీవితం ఒత్తిడి,ఆందోళనలు,

అనారోగ్యంతో సాగుతుంది..

ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి 

మన గొయ్యిని మనమే తవ్వుకున్నాము.

"పెరుగుట విరుగుట కొరకే" అంటే ఇదే మరి.

5, జూన్ 2025, గురువారం

గ్రీష్మము హెచ్చుగా ప్రబల

 ఉ॥

గ్రీష్మము హెచ్చుగా ప్రబల ప్రీతిని జెందెనొ మేఘమాలికల్ 

శ్లేష్మము హెచ్చుగా ప్రబల జీవుల దేహములందు చెచ్చెరన్ 

రశ్మిని నడ్డుకొంచు భువి వ్రాలి ప్రచండసమీరముల్ సనన్ 

యుష్మదు లస్మదుల్ గనక నుప్పెన వంటి మహోగ్రవర్ష మిచ్చెడిన్ 

*~శ్రీశర్మద*

ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే

 *ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమి వస్తుంది...?*


రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లోనో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెడుతూ కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా.. వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...


మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???

నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేముని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహాపాపం...

ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు(ట). కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. 


తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు...

మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యమైపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు..

మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే.. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కసారి ఆలోచించండి

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో||     *ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా విద్వాన్ విరాగీ ప్రమదా సుశీలా।*

           *తురఙ్గమః శస్త్రనిపాతధీరః భూమణ్డలస్యాభరణాని పఞ్చ॥* 


తా|| *తెలివైన రాజు, దానగుణంకల ధనవంతుడు, పేరుప్రతిష్టలయందు కోరిక లేనట్టి విద్వాంసుడు, సత్ప్రవర్తనగల స్త్రీ, శత్రుసమూహమునందు ధైర్యంగా నిలిచే గుఱ్ఱం* - ఈ అయిదుగురు భూమికి ఆభరణములు."

         

 ✍️VKS ©️ MSV🙏

విజయం సాధించాలి"

 పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తొలగించుకోవచ్చా? యోగ వాసిష్ఠ గ్రంథం ఏమని చెబుతున్నది?


జవాబు


వాల్మీకి రచించిన యోగ వాసిష్ఠగ్రంథం ఈ విషయంలో మనకు చక్కటి హామీ ఇచ్చింది.


యోగ వాసిష్ఠములోని ఈ రెండు శ్లోకాలు మానవ ప్రయత్నం (పురుషార్థం) మరియు విధి ( పూర్వ జన్మ కర్మ ) మధ్య ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాయి.


శ్లోకం 02-05-05:


ద్వౌ హుడావివ యుధ్యేతే పురుషార్థౌ సమాసమౌ |

ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్రాల్పవీర్యవాన్ ||


 "రెండు పొట్టేళ్లు ఒకదానితో ఒకటి తలపడినట్లు, ప్రాక్తనం (గత కర్మల ఫలితం లేదా విధి) మరియు ఐహికం (ప్రస్తుత మానవ ప్రయత్నం) అనే రెండు పురుషార్థాలు సమానంగా పోరాడుతాయి" అని చెబుతుంది. 


ఈ రెండింటిలో ఏది బలహీనంగా ఉంటుందో అది శమిస్తుంది, అంటే ఓడిపోతుంది.


 మన జీవితంలో జరిగే పుణ్య సంఘటనలు గత కర్మల ప్రభావం రెండూ ఒకదానితో ఒకటి నిరంతరం ప్రభావితం చేసుకుంటూ పొట్టేళ్లలా పోరాడుతుంటాయి. 


ఈ పోరాటంలో, ఏది తక్కువ శక్తివంతంగా ఉంటుందో, అది పైచేయి సాధించలేదు. 


అంటే, మనం బలహీనమైన పుణ్య ప్రయత్నం చేస్తే, విధి ప్రభావం ఎక్కువ అవుతుంది; 


అదే మనం దృఢమైన ప్రయత్నం చేస్తే, విధి ప్రభావం తగ్గవచ్చు.


ఇంకొకటి ఎదుటి పొట్టేలు చచ్చేదాక రెండవ పొట్టేలు పోరాటం మానదు. పారిపోదు. 


ఇది మన పుణ్య కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకం.


శ్లోకం 02-05-06:


అతః పురుషయత్నేన యతితవ్యం యథా తథా |

పుంసా తన్త్రేణ సద్యోగాద్యేనాశ్వద్యతనో జయేత్ ||


 "కాబట్టి, మనిషి తన ప్రయత్నంతో ఎలాగైనా సరే, పూర్తి శక్తితో పుణ్య కార్యక్రమాలు చేస్తూ కష్టపడాలి" . "తంత్రం ద్వారా మంచి యోగంతో, ఈనాటి ప్రయత్నం (ప్రస్తుత పురుషార్థం) త్వరగా విజయం సాధించాలి" అని చెబుతుంది.


 మనిషి కేవలం ప్రయత్నం చేస్తే సరిపోదు, సరైన పద్ధతిలో, సరైన వ్యూహంతో, పూర్తి శక్తితో ప్రయత్నం చేయాలి. 


అప్పుడే ప్రస్తుత ప్రయత్నం గత కర్మల ప్రభావంపై పైచేయి సాధించి, త్వరగా విజయం పొందగలదు. 


మనం చేసే ప్రయత్నం ఎంత పటిష్టంగా ఉంటే, మన భవిష్యత్తును మనం అంతగా తీర్చిదిద్దుకోగలం అనే సందేశాన్ని ఈ శ్లోకం ఇస్తుంది.

వేద ఆశీర్వచనం


 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ నవమి - ఉత్తరాఫల్గుని -‌‌ సౌమ్య వాసరే* (04.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మకరందము

 18-04-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇట్లు కర్మను గూర్చి భిన్నమతములను దెలిపి శ్రీకృష్ణమూర్తి అవ్విషయమున తన నిశ్చయమును తెలియజేయుచున్నారు–


నిశ్చయం శృణు వేు తత్ర 

త్యాగే భరత సత్తమ! |

త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధస్సమ్ప్రకీర్తితః || 


తాత్పర్యము:- భరతకులోత్తముడవును, పురుషశ్రేష్ఠుడవునగు ఓ అర్జునా! అట్టి కర్మత్యాగవిషయమున నా యొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము. త్యాగము మూడువిధములుగా చెప్పబడియున్నది కదా!


వ్యాఖ్య:- (1) కర్మలను బొత్తిగా వదలివేయవలెను. (2) తపోయజ్ఞదానాది కర్మలను మాత్రము వదలరాదు - అను రెండు వాదములను జెప్పి భగవానుడు ఆ విషయమున తన తీర్పును చెప్పుచున్నాడు -


"నిశ్చయం శృణు మే' - అని చెప్పినందువలన భగవానుడు తాను పూర్ణముగ స్థిరపఱచుకొని, నిశ్చయించుకొనినదానినే వచించుచున్నారని అర్థము. ఆహా! ఇట్టి భగవన్నిశ్చయమందు జనుల కేల విశ్వాసము యుండరాదు?! సామాన్యులు ప్రకృతికి, మాయకు లోబడినవారుకావున వారి నిశ్చయములం దేవేని లోపములుండవచ్చును. కాని ప్రకృతికి అతీతుడై మాయాదోషములేని (చైతన్యరూపుడగు) పరమాత్మయొక్క భావములు అతినిర్దుష్టములై యుండును. అట్టి మహనీయుడు " నా నిశ్చయము వినుడు' అని చెప్పినపుడు ఇక జీవులు ఎన్ని చెవులతో దానిని వినవలయునో యోచించుకొనుడు! కావున భగవాను డిపుడు చెప్పబోవు త్యాగము మున్నగువానిని గూర్చిన ఉదాత్తభావములను, నిశ్చయములను కడు జాగరూకతతో విని తదనురీతి యనుష్ఠించి తరించవలెను.

ప్రశ్న:- త్యాగ మెన్నివిధములని భగవానుడు తెలియజేసిరి?

ఉత్తరము: - మూడు విధములని.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*


*397 వ రోజు*


*భీమసేనుని మనోగతము*


అప్పటికి వారు రణరంగం సమీపించారు. యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఇరుపక్షముల వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కర్ణుడి కుమారులలో ఒకడు ఉత్తమౌజుడి చేతిలో మరణించాడు. అది చూసిన కర్ణుడు ఉత్తమౌజుని రధాశ్వములను, కేతనమును నరికాడు. ఉత్తమౌజుడు కత్తి తీసుకొని తనకు అడ్డంగా వచ్చిన కృపాచార్యుడి రధాశ్వములను నరికి వెంటనే శిఖండి రధము ఎక్కాడు. ఇంతలో అశ్వత్థామ కృపాచార్యుని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీమసేనుడి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవ సేనలు పారిపోసాగాయి. అది చూసి భీముడు తన సారధి విశోకుడితో " విశోకా ! అన్న ధర్మజుడు రణభూమి నుండి తొలగి పోయాడు. అన్న క్షేమం కనుగొనుటకు వెళ్ళిన అర్జునుడు కూడా రాలేదు. వారిరువురికి ఏమి జరిగిందో తెలియరాలేదు. వారికి కీడు కలిగిన ఈ యుద్ధముతో ప్రయోజనమేముంది. అయినా నేను శత్రు వినాశనం చేయక తప్పదు. అది సరే మనకు సరిపడా బాణములు ఉన్నాయి కదా! విశోకా అటు చూడు ఆ కేతనమును చూసి అందు ఉన్న రథికులను పోల్చగలవా ! " అన్నాడు. బదులుగా విశోకుడు " భీమసేనా ! మనకు అస్త్రశస్త్రల గురించి చింత లేదు. అవి విస్తారంగా ఉన్నాయి. మన వెనుక వచ్చు బండిలో ఆయుధములు ఇసుమంతైనా తరగ లేదు. నీ చేత గద ఉండగా నీకు ఈ ఆయుధములతో పని లేదు కదా ! నీ చేతి గద చాలదా శత్రు నిర్మూలనకు " అన్నాడు. ఆ మాటలకు భీముడు సంతోషించాడు. అంతలో విశోకుడు " భీమసేనా ! అటు చూడు నీ తమ్ముడు అర్జునుడు ఏనుగుల సమూహాన్ని తరుముతున్నాడు " అన్నాడు. అది విని భీముడు సంతోషంతో ఉప్పొంగి పోయి " విశొకా ! మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము " అన్నాడు. వెంటనే విశోకుడు రధమును అర్జునుడి వైపు పోనిచ్చాడు. రణరంగ ప్రవేశం చేసిన అర్జునుడు కౌరవసేనలను దునుమాడి తన పరాక్రమంతో వాటిని తరముతున్నాడు. మరొక వైపు భీముడు కూడా శత్రు సైన్యములను దునుమాడుతున్నాడు. అది చూసి సుయోధనుడు " భీముడు చస్తే కాని పాండవసేన పారిపోదు. ముందు వీడిని చుట్టుముట్టి చంపండి " అన్నాడు. కౌరవసేనలోని ప్రముఖవీరులు భీముని చుట్టుముట్టి ఎదుర్కొన్నారు. భీముడు విచక్షణారహితంగా శత్రుసేనను చంపుతున్నాడు. శకుని భీముని ఎదుర్కొని అతడి వక్షస్థలానికి గురిపెట్టి బాణంతో కొట్టాడు. భీముడు శకుని విల్లు విరిచాడు. శకుని వేరొక విల్లందుకుని భీముని సారధిని, రధాశ్వములను పదునారు బాణములతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. భీముడు కోపించి శక్తి ఆయుధమును శకుని మీద ప్రయోగించాడు. శకుని లాఘవంగా శక్తి ఆయుధమును పట్టుకుని తిరిగి భీముని మీదకు విసిరాడు. అది భీముని చేతిని గాయపరిచింది. అది చూసి కౌరవసేనలు ఆనందించాయి. వెంటనే భీముడు విల్లందుకుని శకుని శరీరం అంతా శరములతో నింపాడు. శకుని రధము మీద కూలిపోయి మూర్ఛిల్లాడు. అది చూసిన సుయోధనుడు శకునిని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

చాతుర్మాస్యము

 శ్రీమాత్రేనమః           

            |చాతుర్మాస్యము |

            నాలుగునెలలకాలము చేయు కృత్యము చాతుర్మాస్యము అని తెలుసు కొనవచ్చును. వైదిక యుగమునందు నాలుగు మాసాలకు ఒక ఋతువు చొప్పున మూడు ఋతువులే పరిగణించే వారని పురాసాహిత్యము ద్వారా తెలుస్తుంది. అవి 1- వర్ష ఋతువు 2- హేమంత ఋతువు 3- వసంత ఋతువు. సంవత్సరము వానకాలమునుండి ప్రారంభించబడుచుండెను. 

అందులకే సంవత్సరానికి వర్షమని కూడా వ్యవహారములోనికి వచ్చింది. ప్రతి ఋతువు ఆరంభంలో ప్రత్యేక యజ్ఞాలు నిర్వహింపబడుచుండెను. ఫాల్గుణ పౌర్ణమి నాడు వైశ్వదేవయజ్ఞం. ఆషాఢ పౌర్ణమి నాడు వరుణ ప్రఘాసయజ్ఞం 3- కార్తీక పౌర్ణమి నాడు పాకమేoధ యజ్ఞము జరపాలని శతపథ బ్రహ్మణంలో చెప్పబడినది. క్రమంగా వర్ష ఋతువునే చాతుర్మాస్యంగా నడుపుట ప్రజల ఆచారంగా నెలకొని ఉంది. 

              ఆషాఢ శుక్ల ఏకాదశి ఈ చాతుర్మాస్యము ఆరంభించి కార్తీక శుక్ల ద్వాదశి తో పూర్తి చేయబడును. ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రథమ ఏకాదశి. దీనిని బట్టి వర్ష ఋతువు వర్ష ప్రారంభమని. పురాణములననుసరించి మహావిష్ణువు పాలసంద్రములో శేషపర్యంకంపై నిద్రిస్తాడని సంప్రదాయం. ఈ వ్రతాన్ని ఏకాదశి నుండికాని కటకసంక్రాంతి నుండి గాని , ఆషాఢ పౌర్ణమి నుండి గాని కొనసాగించ వచ్చును. ఇలా వ్రతమాచరించిన సంవత్సరంలో చేసిన పాపాలు తొలుగునని భారత యితిహాసము పేర్కొన్నది. 

            ఈ చాతుర్మాస్య విధానం గూర్చి స్కాందపురాణం , భవిష్య పురాణం మొదలగు పురాణాలు వివరంగాతెలిపినాయి. శ్రావణంలో కూరలను , భద్రపదమాసంలో పెరుగును , ఆశ్వయుజ మాసంలో పాలను , కార్తీక మాసంలో పప్పు పదార్థాలను భోజనం నుండి వదలి పెట్టాలి. చాతుర్మాస్యము అందరికీ నిత్యవ్రతం. నిమ్మ. రాజమాషాలు , ముల్లంగి , ఎర్రముల్లంగి , గుమ్మడి , చెరుకు వాడరాదు. అని స్కాంద పురాణం ఉవాచ. కొత్త ఉసిరిక చింత , గుమ్మడి మున్నగు వాటిని వదలి పెట్టాలి. పాత ఉసిరికను వెదకి సంపాదించి వాడాలి. దీనినిఅనుసరించి వర్షాకాలంలోఆపత్యాహారం నుండి ఆరోగ్య ఆహారం తీసుకొని ఆరోవ్య పరిరక్షణార్థం ఈవ్రత పరమార్థO Ani తెలుస్తుంది వర్షాకాలమంతా నేల బురదతో కూడియుండును. క్రీమీ కీటకాలకు బురద నెలవు. రోగాలు వ్యాపించడం సహజం కదా ! 

         పైన తెలుపబడిన పదార్థాలన్నీ వర్జములే ఇవి త్రిదోష ప్రకోపాలు. బయట తిరుగకుండ తమ ఉనికి పట్టులోనే ఉండి మిత పధ్యాహారముతో కాలము గడుపుటయే శ్కరమని తెలుపుటకే ఈ వ్రతం నిర్ణయించ బడింది. ఈ క్రమం అందరు ఆశ్రమవాసులకునూ ముఖ్యమని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధానముగా సన్యాసులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.  

                బుద్ధుడు చాతుర్మాస్యం ఆచరించినట్లు జాతక కథల్లో పేర్కొనబడింది. ఈ బౌద్దులు చాతుర్మాస్య ముగింపు కార్తీక మాసములో పున్నమినాడు. బ్రహ్మానందంగా ఉత్సాహం నిర్వహించు కొనేవారని బౌద్ధసాహిత్యం తెలుపుతుంది. వారణాసి ఆవ o తికా మొదలగు ప్రదేశాల్లో ఈ చాతుర్మాస్య ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేదివారని రాత్రులందు దీపాలను వెలిగించెడి వారు తమ కస్టాలు తొలగి ఆరోగ్యం చూడనందుకు యక్షుడై చిత్తుని పూజించేవారు. 

           అందమైన వస్త్రాలఅలంకారంతో రాజమార్గంలో సంచరించెడి వారు అనితెలుస్తూనేఉంది. జైనులుకూడా ఈ వ్రతాన్ని కొనసాగించేవారని జైన సాహిత్యంలో విపులముగా ఉంది. 

           సహజంగజైనులు అహింసావ్రత నిష్టులు. నేటికీ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆషాఢం కార్తీకం ఫాల్గుణ మాసంలో అష్టాగ్నికి ఆనుపూజలు నిర్వహించేడి వారని జైనీయ సాహిత్యం తెలుపుతుంది ఈ చాతుర్మాస్య మును జైనులు స్నానోత్సవముగా మిగుల వైభవం గా కొనసాగించే వారని. దీనిని చాతుర్మాసీయ మజ్జణాదు ఉత్సవం అని నేటికిని వ్యవహరిస్తారు.

బాబుదేవీదాస్ రావు.

Panchaag


 

గద్దెదించాలని

 అది 1998వ సంవత్సరం బీజేపీ ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్, CPMలు చేతులు కలిపి, లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ, పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు. అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు. 


సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ బీజేపీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ ఇలా అన్నాడు... "స్పీకర్ సార్, కాంగ్రెస్ పార్టీపై ఒక గొప్పసంస్థ తమ పుస్తకంలో ఏమి చెప్పిందో మీకు చదివి వినిపిస్తాను" అంటూ ఒక పుస్తకాన్ని  తీసి ఇలా చదవడం మొదలుపెట్టాడు....

"కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఫౌంటైన్ హెడ్ లాంటిది. (కాంగ్రెస్+ సిపీఎం బెంచీల నుండి పెద్దగా అరవడం మొదలైంది). బ్రిటీష్ వాళ్ళు వదిలిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో గత 50 ఏళ్ళుగా, కొత్త రికార్డులు నెలకొల్పింది. ముంద్రా స్కామ్, చౌరత్ లాటరీ స్కామ్, బోఫోర్స్ స్కామ్, సుఖ్రం స్కామ్, హర్షద్ మెహతా స్కామ్, JMM ముడుపుల స్కామ్, హవాలా స్కామ్ వంటి స్కామ్స్ లో కాంగ్రెస్ మంత్రులు చిక్కుకున్నారు. భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి సంస్థను అవినీతి కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది"

ఆ స్పీచ్ ని తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సభలో ఒక్కసారిగా లేచి "స్పీకర్ సర్, ఊరు పేరు లేని పుస్తకాలలోని అసత్యాలని ఫెర్నాండేజ్ గారు చదవడానికి మేం ఒప్పుకోము" అంటూ గోల చేశారు.


జార్జి ఫెర్నాండెజ్ మాట్లాడుతూ "దయచేసి నన్ను చదవనీయండి. పుస్తకం పేరును చివర్లో నేనే చెప్తాను" అంటూ, మళ్ళీ చదవ సాగాడు.

"సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ పార్టీ వివిధ సమయాల్లో దేశంలో అల్లర్లు సృష్టించింది. తమ గూండాలతో ఢిల్లీలో 3000 సిక్కుల్ని ఊచకోత కోయించింది. ఇలాంటి హానికరమైన కాంగ్రెసుని భూమి నుండి తుడిచిపెట్టడం ముఖ్యం". ఇక  తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎంలు ఫెర్నాండేజ్ పై అరుస్తూ, ఆ పుస్తకం పేరు చెప్పకుండా, చదవనీయమని పట్టుబట్టారు.


అప్పుడు పెర్నాండెజ్ గారు  "సరే, స్పీకర్ సర్! గౌరవ CPM సభ్యులు ఇంతగా పట్టుబట్టారు కాబట్టి, చెబుతున్నాను...

ఈ పుస్తకం మరేదో కాదు, లోక్‌సభ ఎలక్షన్స్ ముందు ఇదే  CPM వాళ్ళు జారీచేసిన CPI(M) మేనిఫెస్టో". అంతే సభలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. కమ్యూనిస్టులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఫెర్నాండేజ్ గారు అందుకుంటూ, "ఏం జరిగింది, ఎందుకీ నిశ్శబ్దం...??  మీరేగా పుస్తకం పేరు చెప్పమన్నారు, పేరు వినగానే, మీ గొంతులు మూగ పోయాయెందుకు....?? సిగ్గు పోయిందా మీకు....?? మీ సొంత మానిఫెస్టోని మీరే చదవలేదా...?? చదివినా, మీ భావజాలం మీకే నచ్చలేదా...?? ఇలాంటి భావజాలం గల మీరు, మళ్ళీ అదే కాంగ్రెసుతో సెక్యూలరిజం పేరుతో, చేతులు కలిపినందుకు మీరంతా సిగ్గుతో చచ్చిపోవాలి. ఆ పార్టీ అవినీతిలో ఉన్న అన్ని రికార్డులు చేరిపేసింది. ఇకనైనా మీరు ఆలోచించి, మీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకవేళ మీరు మీ మార్గాన్ని చక్కదిద్దుకోకపోతే, మీ పార్టీ ఓ గత చరిత్రగా మిగిలిపోతుంది" ...... అంటూ ముగించారు.

⛔ ఆయన చెప్పినట్లుగానే తర్వాతి కాలంలో నిజంగానే కమ్యూనిస్టులు చాలా రాష్ట్రాల్లో అంతమవడం మనం చూశాం. 

ఈ రోజు జాతీయవాది, దేశ భక్తుడు, మాజీ భారత రక్షణ శాఖ మంత్రి కీర్తిశేషులు జార్జి ఫెర్నాండెజ్ గారి పుట్టినరోజు సందర్భంగా నివాళులు 🙏🙏💐.....

(సేకరణ)