19, జులై 2025, శనివారం

వకుళమాత ఆలయం

 వకుళమాత ఆలయం


తిరుపతిలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళామాత ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) పెంపుడు తల్లి వకుళా దేవికి అంకితం చేయబడింది.


 వకుళా దేవి తన కొడుకు వివాహాన్ని చూడాలని కోరుకుందని మరియు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పెంపుడు తల్లిగా జన్మించిందని నమ్ముతారు. 


ఈ ఆలయం దేవత ముఖం శ్రీ వెంకటేశ్వర స్వామి నివసించే ఏడు కొండల వైపు మళ్ళించబడేలా ఉంది.


 ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆచారం ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి మొదట శ్రీ వకుళామాతకు మరియు తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలు సమర్పించబడతాయి.


ప్రాముఖ్యత:


ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి పెంపుడు తల్లిగా శ్రీ వెంకటేశ్వర స్వామి జీవితంలో కీలక పాత్ర పోషించిన వకుళా దేవికి గౌరవప్రదమైన ప్రదేశం.


స్థానం:


ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సమీపంలోని పేరూరు అనే గ్రామంలో ఉంది.


ఆలయ రూపకల్పన:


దేవుని ముఖం వెంకటేశ్వరుడు నివసించే ఏడు కొండల వైపు ఉండేలా ఆలయం రూపొందించబడింది, ఇది తల్లి తన కొడుకుపై చూపే శ్రద్ధగల దృష్టిని సూచిస్తుంది. 


సంప్రదాయం:


తిరుమలలోని వకుళమాతకు మరియు తరువాత వెంకటేశ్వరుడికి నైవేద్యాలు సమర్పించే ప్రత్యేక ఆచారం అనుసరించబడుతుంది, ఇది తల్లీకొడుకుల బంధాన్ని హైలైట్ చేస్తుంది.

మరింత శ్రేష్ఠుడు..

 శ్లో𝕝𝕝 *అజ్ఞేభ్యోగ్రంథిన: శ్రేష్ఠా:!* 

            *గ్రంథిభ్యో ధారనో వరా:!*

            *ధారిభ్యో జ్ఞానిన: శ్రేష్ఠా:!*

            *జ్ఞానిభ్యో వ్యవసాయన:!!*


         _ *మనుస్మ్రతి* _


తా𝕝𝕝 అజ్ఞానికంటే ఏదో ఒకగ్రంథం చదివినవాడు శ్రేష్ఠుడు.... 

గ్రంథం చదివినవాడికంటే దానిని కంఠస్థం చేసినవాడు శ్రేష్ఠుడు..... 

కంఠస్థం చేసినవాడి కంటే అందులోని *మంచితనాన్ని ఆచరణలో పెట్టినవాడు మరింత శ్రేష్ఠుడు....*

కృష్ణపరమాత్మ చెప్పిన మోక్షప్రాప్తి

 *కృష్ణపరమాత్మ చెప్పిన మోక్షప్రాప్తి ఎపుడు కలుగుతుంది?*

     

శ్రీ కృష్ణుడు రెండు విషయాలు చెప్పారు.


ఒకటి ఇంద్రియ నిగ్రహము. 


రెండవది మనస్సును ఆత్మయందు లగ్నం చేయడం.


మొదటిది బాహ్యంగా చేయవలసినది. రెండవది అంతర్గతంగా చేయాల్సిన పని.


ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది.

బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు, లోపల మనసును కూడా ఆత్మయందు లగ్నం చేస్తేనే గానీ, బుద్ధి స్థిరంగా ఉండదు అని అర్థము.


కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి, వాసనలు పోవాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి, మనస్సు ఆత్మయందు లగ్నం కావాలి.


అప్పుడే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు.


ఇంద్రియ నిగ్రహము, నిరంతర సాధన, శాస్త్రజ్ఞానము, సత్సంగము వీటితో వస్తుంది.


ఇవి సాధిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది. మనస్సు ఆత్మలో లీనం అవుతుంది.


అప్పుడే పరమానందం కలుగుతుంది. కాబట్టి అన్నింటికంటే ఇంద్రియ నిగ్రహము ముఖ్యము అని చెబుతున్నాడు పరమాత్మ.


ఎందుకంటే, ఈ ఇంద్రియములు బాగా శాస్త్ర జ్ఞానము, బుద్ధికల వాడిని కూడా పడగొడతాయి. ఇంద్రియములు రథానికి కట్టిన గుర్రాల వంటివి. గుర్రాలు తమ దారిన తాము రథాన్ని లాక్కుపోతుంటే, రథం గోతుల్లో ప్రయాణం చేస్తుంది. ప్రమాదానికి గురి అవుతుంది.


అలాగే ఇంద్రియాలు, బుద్ధి చెప్పినట్టు వినకుండా తమ దారిన తాము పోతుంటే, వాడు ఎన్నటికీ పరమాత్మను తెలుసుకోలేడు.


ఇంద్రియములను వశంలో ఉంచుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది.


కాబట్టి సాధకుడు ఇంద్రియములను తన వశంలో ఉంచుకోవాలి. అవి తాను చెప్పినట్టు నడుచుకునేలా చేయాలి.


ఇది సాధించడానికి ఏమి చెయ్యాలి అంటే…


ధ్యానం చేయాలి!


ముందు మన మనస్సు పరమాత్మ యందు ఉంచాలి. పరమాత్మ గురించి ఆలోచించాలి. ముందు సగుణారాధనతో మొదలుపెట్టి, ఏదో ఒక రూపంలో ఉన్న విగ్రహమును పూజించి, ఆ తరువాత ఆ విగ్రహమును కూడా వదిలిపెట్టి నిర్గుణ ఆరాధన చెయ్యాలి. దానిని ధ్యానం అంటారు.


ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసును పరమాత్మయందు లగ్నం చేయాలి.


*అప్పుడు మోక్షప్రాప్తి కలుగుతుంది అని బోధించాడు పరమాత్మ.*


🚩 *స్వస్తి* 🚩

సాధన చేస్తూ ఉంటే

 సాధన చేస్తూ ఉంటే ముక్తి లభించక పోతే ఎన్నో జన్మలు గడిచిపోయాయి కదా అనే మీ ప్రశ్నకు సమాధానం - భగవద్గీత 6/40 శ్లోకం చూడండి. న హి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాక గచ్ఛతి - సాధన చేస్తూ చేస్తూ ఉండగా ఏ సాధకుని శరీర పతనం అవుతుందో అతణ్ణి యోగ భ్రష్టుడు అంటారు.అటువంటి యోగ భ్రష్టునికి దుర్గతి ఎన్నటికీ లేదు.అటువంటి యోగ భ్రష్టుడు శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే।యోగ భ్రష్టుడు వేదవేదాంగాల అధ్యయనంతో శుచి ఐన ఇంక పైగా శ్రీమంతుల ఇంట్లో జన్మిస్తాడు.లేకపోతే యోగుల ఇంట్లోనే జన్మిస్తాడు.అప్పుడు పూర్వ జన్మలో చేసిన శ్రవణ మనన నిదిధ్యాసల వల్ల తిరిగి ఈ జన్మలో సాధన మరింతగా చేసి ముక్తిని పొందుతాడు,అని పరమాత్మే చెప్పాడు కదా!కాబట్టి మన సాధన ఎక్కడికి పోదు.అది మనల్ని ముక్తి పథం దిశగానే నడిపిస్తుంది.ఎన్ని జన్మలకు అంటే అది మనం చేసుకునే సాధన పైనే ఆధారపడి ఉంటుంది.

భాగవతము- అంతరార్ధము

 🙏భాగవతము- అంతరార్ధము - తత్త్వము🙏


భాగవతము కలియుగమున మానవ కోటికి ఏకైక ముక్తి సోపానము. అందుకే పెద్దలు అంటారు “చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం”. ఇంతటి వరేణ్యానికి మూల కారణం, అది గాయత్రిని అధికరించిన మహా మంత్ర స్వరూపం కావటం. ఇక్కడ అధికరించిన అంటే అధికం చేయబడిన, వ్యాహృతి గావింపబడిన అని గ్రహించ వచ్చును. గాయత్రి మహా మంత్రం ఓంకార రూపం కనుక సాక్షాత్ శక్తి స్వరూపం. పర బ్రహ్మ తత్వం అని చెప్పబడుతుంది. ఓంకారం త్రైవర్ణాత్మకం. అకార, ఉకార, పూర్ణానుస్వరములు (మకారము) అనే మూడు వర్ణాలు లేదా శబ్దాల సమన్వితం. అకారం ఆరంభానికి, సృష్టికి, సృష్టికర్తకు ప్రతీక అనవచ్చు. . పూర్ణం (మకారము) ఇది లయానికి, ప్రళయానికి, శివునికి ప్రతీక అనవచ్చు. పూర్ణత్వం. ఉన్నది అనుకున్నది ఖాళీ కావటం అదే అనంతంతో నిండిపోవటం. ఉకారం స్థితికి, విశ్వానికి, సర్వ వ్యాపకానికి, విష్ణునికి ప్రతీక అనవచ్చు. ఇది త్రి మాత్ర పరిమితం. కార్య, కారణ, కర్తృత్వ ఆదుల సమన్వితం.

అలాగే శ్రీకారంలో శకార రకార ఈ కారములు

మూడు బీజాక్షరాలు శకారం శివ బీజం, రకారం అగ్ని బీజము ( శక్తీ బీజము ) ఈ కారము తురీయము అంటారు అంతకంటే వ్యక్తం చేయకూడదు.


భాగవతము ఒక మంత్ర శాస్త్రము బీజాక్షరముల అర్ధం కూడా చెప్పబడినది

ఓంకారం నకు వైదిక ప్రణవం అని పేరు వివరణ ఇవ్వవచ్చు శ్రీం మంత్ర శాస్త్ర ప్రణవం మంత్ర శాస్త్ర ప్రణవాలు ఐదు, వాటిని వ్రాయకూడదు వైదిక ప్రణవాలు ఐదు అవి వ్యక్తం చేయవచ్చును 

ఓం, నమః, స్వాహా, స్వదా, వ్ఔషట్ అనేవి.

అనేక సందర్భాలలో వీటిని ఉపయోగిస్తున్నాము.

    ఓంకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులకు, సత్వరజస్తమములనే త్రిగుణాలకి, భూఃభువస్సువః అనే త్రిలోకాలకు, బ్రహ్మచర్య గృహస్త వానప్రస్తలనే ఆశ్రమ త్రయానికి, బ్రహ్మణ, క్షత్రియ, శూద్ర అనే త్రైవర్ణికానికి, ఋగ్యజుస్సామములనే త్రయి రూప వేదానికి, త్రికోణాత్మకమైన శక్తి స్వరూపికి, జాగృతి నిద్రా సుషుప్తులనే అవస్థా త్రయానికి మున్నగు వానికి అధిదేవత. ఇవి గాయత్రీ మహా మంత్రానికి, భాగవత మహా పురాణానికి సంపూర్ణంగా అన్వయిస్తాయి.


వీటికి అతీతమైనది తురీయం, నాలుగవది. గాయత్రీ మంత్రంలో మూడు పాదాలు వరకు సామాన్యులకు అర్హం. తురీయ పాదం, తురీయాశ్రమం సన్యాసంలో పరిణితి అందుకున్న వారికి, పాదుకాంత దీక్షా పరులకు అర్హం అయింది. ఆ తురీయావస్థ ముక్తి, మోక్షం, వైకుంఠం. . . అంటుంది భాగవతం. ఈ త్రయీ మార్గం దృష్టితో ఓంకారం, గాయత్రీ మహా మంత్రం, భాగవతం మధ్య సమత్వ ముంది.గాయత్రి మంత్రం యొక్క తురీయా పద భాష్యమే భాగవతం.

నాంది పద్యములో గాయిత్రి మంత్ర చతుష్పాద లక్ష్యమే భాగవతం అని గూఢముగా చెప్పినాడు గాయిత్రి మంత్ర చతుష్పాదము చెప్పకూడదు కావున చెప్పుట లేదు అది మోక్షదాయిని. ఈ పద్యమే సూక్ష్మ కామకళతో ప్రారంభం అయినది.ఇది మంత్ర శాస్త్రములోని రహస్య విషయం.

శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర

క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో

ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా

నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌

మోక్ష సాధనే భాగవత పరమప్రయోజనమని చాటి చెప్పాడు.

ఈ పద్యములో సృష్టి, స్థితి సంహారములు ఉన్నాయి గాయిత్రి చతుష్పాద లక్ష్యం ఉన్నది కావున ఇది చతుష్పాదములతో ఉన్న గాయిత్రి మంత్రము కావున ఈ పద్యం చదివితే నాలుగు పాదాల గాయిత్రి చేసినట్లే.

పోతన గారు జీవన్ముక్తుడైన తరువాత వ్రాశారు గాని భాగవతము రచించిన తరువాత కాదు.

ఎప్పుడైతే శ్రీ మహా విష్ణువు పోతన గారిని భాగవతము వ్రాయమన్నాడో అప్పటికే జీవన్ముక్తుడు. మనలను ఉద్దరించడానికి భాగవతము వ్రాశారు.అందువల్లనే భారతీయ భాషలలో ఏ భాగవతమునకు దక్కని గౌరవం పోతనగారి భాగవతానికి దక్కింది.

మరొక్క మాట

సాధారణంగా సంస్కృత శ్లోకాలు మాత్రమే పారాయణమునకు అర్హము. ఎందువల్లనంటే

సంస్కృత శ్లోకాలలో అంతర్లీనముగా బీజాక్షరాలు ఉంటాయి లలితా సహస్రము, విష్ణు సహస్రము ఉదాహరణముగా తీసుకోవచ్చు. ఇక తెలుగు భాగవతము విషయంలో పారాయణమునకు పూర్తి అర్హత కలిగినది. వివాహము కొరకు రుక్మిణి కల్యాణము, అలాగే వివిధ విషయాలకు గజేంద్ర మోక్షం వంటివి పారాయణమునకు అర్హత కలిగినవే. ఎందువల్లనంటే ఈ తెలుగు భాగవతములో కూడా అంతర్లీనముగా బీజాక్షరాల అర్ధము ఉంది.ఉదాహరణమునకు శ్రీమాత్రేనమః

శ్రీమాత్రేనమః అను నామము ఉచ్చరించాలి అంటే శుచియై ఉండాలి కాని పోతన గారి ఈ పద్యము చదవడానికి భక్తి ఒక్కటే అర్హత.

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.


భావము: ఇక్కడ దుర్గమ్మయే లలితమ్మ, మహా కామేశ్వరి.మరియు శ్రీమాత 

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; దైత్యులను నాశనము చేసి వారి తల్లియైన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో మహత్వము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

ఇదే శ్రీమాత్రేనమః నామానికి అర్ధము ఇంకా అనేక భాష్యార్ధాలు ఉన్నాయి ఇక్కడ అప్రస్తుతము.


బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు అధ్యయనం చేస్తేకాని భాగవతాన్ని చేబట్టే సామర్ధ్యం చేకూరదు .కాని పోతన భాగవతం అలాంటిది కాదు .అడుగడుగునా హరినామ స్తుతి అలరారుతుంది .అవకాశం ఉన్నప్పుడే కాదు ,అవకాశం కల్పించుకొని హరినామ స్తుతి చేస్తాడు భక్తకవి పోతన .

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! 

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! 

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

              శ్రీకృష్ణా అంటూ ఎంత చక్కని పద్యం చెప్పాడు స్మరణ భక్తికి ఇంతకంటే ఇంకా ఏ ఉదాహరణ కావాలి మహాభాగవతము అంతా ఇటువంటి పద్యాలే కదా

వ్యాసము పెద్దది అవుతోంది కాబట్టి ముగిస్తున్నాను

                   స్వస్తి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం -‌ నవమి - భరణి -‌‌ స్థిర వాసరే* (19.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వకార పంచకం

 *"వకార పంచకం - వస్త్రధారణ"*

                   

మనకు కేవలం చదువు, డబ్బు ఉంటే చాలు అనుకుంటాం.కానీ అలా కాదు. వీటితోపాటు "వకార పంచకం" ఉండాలి. వకార పంచకం అంటే "వస్త్రము, వపుష్షు, వాక్కు, విద్య,వినయం" అనే ఐదింటిని "వకార పంచకం" అని ఉంటారు. ప్రతి మనిషికి ఈ ఐదు ఉండాలి. లేకపోతే ఈ లోకంలో మనిషికి గౌరవం ఉండదు. వస్త్రధారణ ఈ ఐదింటిలో ఇంకా ముఖ్యం. సరియైన వస్త్రధారణ లేకపోతే అందరూ చిన్న చూపు చూస్తారు. ఇదిగో ఈ కథ చదవండి మీకే అర్థమవుతుంది.పూర్వం ధర్మపురి అనే గ్రామంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు.అతడు తాను సంపాదించిన ధనమంతా దానధర్మాలకే ఉపయోగించేవాడు. "ధర్మో రక్షతి రక్షితః" అని పెద్దలు చెప్పినట్లుగా అతని దానధర్మాలను గురించి ప్రజలంతా గొప్పగా చెప్పుకునేవారు. అలా అలా అతని పేరు దేశమంతా వ్యాపించింది. ఒకనాడు ఒక పండితుడు ధనపాలుని గురించి విన్నాడు. పండితుడు ఎంతో పేదవాడు. అందుకే ప్రతిరోజు భిక్షాటన చేయటం కంటే ఒకసారి ధనపాలుడులాంటి దాతను అర్ధిస్తే తన దరిద్రమంతా పోతుందని భావించాడు. ధనపాలుని దర్శనం కోసం అతని భవనానికి వెళ్ళాడు. బీదవాడు కావడంతో చినిగిపోయిన, మాసిపోయిన బట్టలతో బాగా పెరిగిన గడ్డంతో ఉన్నాడు. ద్వారపాలకులు అతనిని పిచ్చివాడిగా భావించారే గాని పండితుడిగా గుర్తించలేదు. ద్వారపాలకులు ఎంతసేపైనా అతనిని ధనపాలుని దర్శనం కోసం లోనికి వెళ్ళనివ్వలేదు. నేను వేద వేదాంగాలు,సకల శాస్త్రాలు చదివిన పండితుడిని. పండితులంటే మీ యజమానికి ఎంతో గౌరవం. కాబట్టి నన్ను లోనికి వెళ్ళనివ్వండి.మీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమాలాడు. అయినా సరే వారు "నీవు పండితుడివా" అంటూ హేళన చేశారే గాని లోనికి పోనివ్వలేదు.పండితుడు నిరాశతో ఇంటికి చేరుకున్నాడు. ద్వారపాలకులు ఎటువంటి వారికి మర్యాదిస్తున్నారో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తాను ఎలాగైనా ధనపాలుని దర్శనం చేసుకోగలిగితే చాలు. తన దరిద్రం తీరినట్లే అనుకున్నాడు. మరుసటి రోజు అంతా తన గ్రామంలో భిక్షాటన చేయగా వచ్చిన ధనంతో ఇంట్లోకి వస్తువులు కొనకుండా తళ తళమెరిసే మంచి వస్త్రాలు కొన్నాడు. క్షురకర్మ చేయించుకున్నాడు. ఒక సెంటు బుడ్డి కొన్నాడు. ఆ మెరిసే వస్త్రాలు ధరించి,సెంటు రాసుకుని ముఖాన పెద్ద నామం పెట్టుకుని ఎంతో ఆర్భాటంగా ధనపాలుని భవనానికి చేరుకున్నాడు.అతనిని చూసింది తడవుగా ద్వార పాలకులు ఇతను ఎవరో గొప్పగా పండితుడిలా ఉన్నాడు అనుకుంటూ వినయంతో అతనికి వంగి వంగి నమస్కారం చేస్తూ ధనపాలుని భవనంలోనికి పంపారు. ధనపాలుడు పండితునితో చాలాసేపు మాట్లాడాడు. తన ధర్మసందేహాలకు పండితుడిచ్చిన సమాధానాలు విని ఎంతో ఆనందపడ్డాడు. అతనికి ఎంతో ధనాన్ని ఇచ్చాడు. అంతేకాక ఈరోజు మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాలని కోరాడు. పంచభక్ష్య పరమాన్నాలతో అతనికి విందు భోజనం ఏర్పాటు చేశాడు. తన ప్రక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. ఇలా పండితుని ఎంతో గౌరవించాడు. పండితుడు భోజన సమయంలో అన్ని పదార్థాలను కొంచెం కొంచెం అన్నంతో కలిపి ఒక పెద్ద ముద్దగా చేశాడు. తన వస్త్రాన్ని కిందపరిచి దానిలో అన్నాన్ని మూటగట్ట సాగాడు. ధనపాలుడు పండితుని చూసి" ఓ పండితోత్తమా! ఇదేమిటి ఆహారాన్ని మీరు తినకుండా ఇలా మూట కడుతున్నారేమిటి?"అని అడిగాడు. అప్పుడు పండితుడు "ఓ ధార్మిక! నేను మీ దర్శనం కోసం ఈ రోజే కాదు. నిన్న కూడా వచ్చాను. అయితే మాసిన గడ్డంతో,చినిగిన వస్త్రాలతో వచ్చాను. నా వేషం చూసి మీ ద్వారపాలకులు నన్ను లోనికి పంపలేదు. ఈరోజు తళతళలాడే ఈ వస్త్రాలతో వచ్చాను. నా వేషధారణ చూసి మీ సేవకులు లోనికి పంపారు. మీరు నన్ను ఎంతో గౌరవించారు. ఎంతో ధనం ఇచ్చారు. మంచి విందు భోజనం పెట్టారు. నిజం చెప్పాలంటే నా విద్య వలన కాకుండా ఈ వస్త్రాల వల్లనే ఈ రోజు నాకింత గౌరవం లభించింది. మరి నేను ఈ వస్త్రాలకు కృతజ్ఞతలు చెప్పవద్దా! అందుకే లభించిన ఆహారంలో కొంత ఆహారాన్ని ఈ వస్త్రాలకు పెడుతున్నానని తెలిపాడు. తన సేవకులు విద్యకు కాకుండా వేషానికి గౌరవిస్తున్నారని తెలిసిన ధనపాలుడు చాలా బాధపడ్డాడు. తన సేవకులు చేసిన తప్పుకు తాను క్షమాపణ కోరుతున్నానని క్షమించమని కోరాడు. అప్పుడు పండితుడు "ఓ ధార్మిక! ఇందులో మీ దోషం ఏమీ లేదు. మీ సేవకుల దోషం కూడా లేదు.

" వస్త్రేణ వపుషా వాచా,

   విద్యయా వినయేన చ

   వకారైఃపంచభిర్హీనః 

   నరో నాయాతి గౌరవం"

అని పెద్దలు చెబుతారు.

వస్త్రము( వేషధారణ )వపుష్షు( శారీరక సౌందర్యంతో/ అందం) వాక్కు, విద్య, వినయం అనే వకార పంచకం లేనిదే ఏ మనిషికి విలువ ఉండదు. ఇది తెలిసి కూడా నేను నా వేషధారణకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంత ఎందుకు మంచి వేషధారణ చేయని వారి ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు. అనగా దరిద్రం వస్తుందన్నమాట. పూర్వం సముద్రుడు కూడా పట్టు పీతాంబరాలు, (పచ్చని వస్త్రాలు) బంగారు ఆభరణాలు ధరించి వచ్చిన శ్రీమహావిష్ణువును చూసి ఇతడు చాలా బాగున్నాడు అనుకుని తన కుమార్తె అయిన లక్ష్మీదేవిని ఇచ్చి వివాహం చేశాడు. ఒంటికి బూడిద రాసుకొని, గజ చర్మాన్ని వస్త్రంగా ధరించి, మెడలో పాములను, కపాలా(పుర్రె)లను ధరించి వచ్చిన పరమేశ్వరుని చూసి కాలకూట విషం ఇచ్చాడట.

ఇలా ఒక్కొక్కరికి చూస్తే ఒక్కొక్కటి ఇవ్వబుద్ధి అవుతుంది.మన వేషధారణనుబట్టి మనకు ఇతరులు గౌరవం ఇస్తారు" అంటూ పండితుడు ధనపాలునికి వస్త్రధారణకు ఉన్న విలువ ఏమిటో తెలిపాడు.

ధనం ఉంటే చాలదు. మన అందంగా ఉండాలి. అందం ఉంటే చాలదు. మంచి మాట తీరు ఉండాలి. మాట తీరు చాలదు. మంచి చదువు చదవాలి. చదువు ఉంటే మాత్రమే చాలదు. వాటికి తోడు వినయం ఉండాలి. ఇవన్నీ ఉన్నా మంచి వస్త్రధారణ లేకుంటే మనిషికి సరియైన విలువ లభించదు.

అజ్ఞానికంటే

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *అజ్ఞేభ్యోగ్రంథిన: శ్రేష్ఠా:!* 

            *గ్రంథిభ్యో ధారనో వరా:!*

            *ధారిభ్యో జ్ఞానిన: శ్రేష్ఠా:!*

            *జ్ఞానిభ్యో వ్యవసాయన:!!*


         ___ *మనుస్మ్రతి* ___


తా𝕝𝕝 అజ్ఞానికంటే ఏదో ఒకగ్రంథం చదివినవాడు శ్రేష్ఠుడు.... 

గ్రంథం చదివినవాడికంటే దానిని కంఠస్థం చేసినవాడు శ్రేష్ఠుడు..... 

కంఠస్థం చేసినవాడి కంటే అందులోని *మంచితనాన్ని ఆచరణలో పెట్టినవాడు మరింత శ్రేష్ఠుడు....*


 ✍️VKS ©️ MSV🙏

18, జులై 2025, శుక్రవారం

అతిగా వెంబడి

 *2176*

*కం*

అతిగా వెంబడి నప్పుడు

నతివిలువగు వారు కూడ నలతుల తలపున్.

అతి తక్కువగా నగుపడ

నుతులగునలతులు సహితము నుర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అతి గా వెంటబడితే అత్యంత విలువైన వారు కూడా అల్పులుగా అనిపించెదరు. అతి తక్కువ గా కనబడుతూ ఉంటే అల్పులు కూడా గొప్ప వారి గా కీర్తింపబడెదరు.

*సందేశం*:-- అతిగా అందుబాటులో ఉంటే ఎంతటి గొప్ప వాడైననూ అల్పునిగా అనిపిస్తాడు. మన విలువ గొప్పగా ఉండాలంటే మనం తక్కువ గా అందుబాటులో ఉండాలి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సుభాషితము

 శు భో ద యం 🙏


సుభాషితము

                                                     ------------------------ 


               చ: అతనికి వార్ధి కుల్య యగు; నగ్ని జలంబగు మేరుశైల మం


చ మంచిత శిల లీలనుండు, మదసింహము జిక తెఱంగుఁ దాల్చుఁ గో


                    పిత ఫణి పూలదండ యగు , భీష్మ విషంబు సుధారసంబగున్


                   క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వరియందు శోభిలున్ ;


                     భర్తృహరి సుభాషితములు: సజ్జన పధ్ధతి: ఏనుఁగు లక్ష్మణ కవి;


                                లోకం మెచ్చే మంచి నడవడి కలవానికి అన్నీ వశ్యమే! యెలాగంటే, సముద్రం కూడా అతనికి పిల్లకాలువే, సునాయాసంగా దాటఁగలడు. భయంకరమైన అగ్నిగూడా చల్లబడి జలంగా మారిపోతుంది. మేరుపర్వతంగూడా చిన్న గండశిలగా

మారుతుంది. మదించిన సింహంకూడా జింకపిల్ల అయిపోతుంది. కోపంతో బుసలుగొట్టే పాము పూలదండగా మారి పోతుంది. ప్రా

ణహానికలిగించే విషంకూడా అమృతమైపోతుంది. వీటి యన్నింటికీ కారణం ,అతనిలోని సజ్జనత్వమే!


                           సముద్రం పిల్లకాలువ అవటం , అగ్ని జలంగామారటం, మేరుపర్వతం చిరు శిలగామారటం , సింహం జింకగావటం, 

పాము పూలదండ యవటం, విషం అమృతంగా మారటం; మొ:వి: పరస్పర విరుధ్దములు. మంచితనంతో విరుధ్ధమైన విషయాలను

కూడా మానవుడు సాధింప వచ్చును. కాబట్టి మంచితనంవైపు మరలండి! జనులందరితో సఖ్యంగా ఉండండి! అదే సర్వార్ధ సాధకమని

ఉపదేశం!


                                                               స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కనిపెట్టడం కష్టం...*

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *అపి శక్త్యా గతిర్ జ్ఞాతుం*

            *పతతాం ఖే పతత్రిణామ్।*

            *న తు ప్రచ్ఛన్న భావానాం*

           *యుక్తానాం చరతాం గతిమ్॥*


           *--- _చాణక్యనీతిః_ ---*


తా𝕝𝕝 అకాశంలో ఎగిరే పక్షుల గమనాన్నైనా గుర్తించవచ్చేమోగానీ 

*పైకి ఏమాత్రం కనబడకుండా మోసపూరిత మైన భావాలు ఉన్న ఖలుని కనిపెట్టడం కష్టం...*


 ✍️🌹💐🙏

ప్రోస్టేటు గ్రంథి

 ప్రోస్టేటు గ్రంథి వాపు గురించి వివరణ  - 

      

మూత్రకోశ ద్వారమున ఒక చిన్న గ్రంథి ఉన్నది. దీనిని ప్రొస్టేటు గ్రంథి అంటారు. దీనికి కామగ్రంధి అని మరొక పేరు కూడా కలదు. దీని ముఖ్యమైన పని ఏమిటంటే సంభోగ ప్రారంభములో ఇది ఒక పలచటి ద్రవాన్ని , చివరి దశలో చిక్కటి పాల వంటి ద్రవాన్ని ప్రసరింపచేస్తుంది . దీని వలన సంభోగం చివరి దశలో వీర్యము పురుషావయవము గుండా స్త్రీ యోనిలోకి ప్రవేశించగలదు. కాని కొన్ని కారణాల వలన ఈ గ్రంథి వాచి వ్యాధిని కలిగిస్తుంది . ఈ వ్యాధి 45 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువుగా వస్తుంది. 

 

*  లక్షణాలు  - 

      

.      ప్రొస్టేటు గ్రంథి వాచుట వలన మూత్రనాళము యొక్క ద్వారము నొక్కబడును . తత్ఫలితముగా మూత్రవిసర్జన సమయాన మంట , నొప్పి కలుగును. పదేపదే మూత్రవిసర్జన చేయరావలసివచ్చును . మూత్రం ధారాళముగా వెలువడదు. నెమ్మదిగా వెలువడును. ఇంతేకాక పొత్తికడుపు , నడుము , గజ్జల యందు కొద్దిగా నొప్పి ఉంటుంది. 

  

ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు  - 

 

*  అధిక నూనె , నెయ్యితో చేసిన ఆహారపదార్థాలు సేవించటం . 


 *  ఒక గ్రాము వీర్యములో 7 mg జింక్  ఉంటుందని కనుగొనబడినది. కావున ఆహారంలో జింక్ లోపము వలన గాని అధికసంభోగము వలన గాని జింక్ నష్టం అగుట వలన ప్రోస్టేట్ గ్రంథి వ్యాధికి గురగును.


  నివారణా మార్గాలు  - 

       

     ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం శరీరం నందలి జింక్ పరిణామము పైన ఆధారపడి ఉండును. జింక్ ఎక్కువ కలిగిన ఆహారపదార్థాలు అయిన wheat germ brewers yeast , pumpkin seeds ప్రతిరోజూ వాడాలి . లేదా విటమిన్లు , ఖనిజలవణాలు మరియు జింక్ అధికంగా కలిగిన ఔషధాలు సేవించవలెను . 

             

 ఆరోగ్యరీత్యా సంభోగం విషయములో మితముగా ఉండటం మంచిది . ఆయుర్వేదం ప్రకారం "సంగమం దినత్రయంచ " అనే సూత్ర ప్రకారం మూడురోజులకు ఒకసారి భార్యాభర్తలు  కలియుట మంచిది . 

     

.         ప్రొస్టేట్ గ్రంధిని ఆరోగ్యముగా ఉండుటకు , సక్రమముగా పనిచేయుటకు సూర్యనమస్కారములు , ఆసనాలు వేయుట చాలా అవసరము . ఈ ఆసనాలు గ్రంథిని ఉత్తేజిత పరిచి దాని ఆరోగ్యం పెంచును .  


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *అర్థానామార్జానే దుఃఖం*

             *ఆర్జితానాం చ రక్షణేl*

             *ఆయే దుఃఖం వ్యయే దుఃఖం*

             *ధిగర్థం దుఃఖభాజనమ్ll*


తా𝕝𝕝 *ధనమును సంపాదించుట కష్టముతో కూడుకున్నది*.

సంపాదించిన ధనమును రక్షించుటయూ కష్టముతో కూడుకున్నది. రక్షించుకున్న ధనమును ఖర్చు చేయునప్పుడుయూ దుఃఖమే.

ఛీ..*ఏవిధముగా చూచిననూ ధనము మనిషికి ప్రతి దశలోనూ దుఃఖమునే కలిగించుచున్నదిగదా!*


 ✍️VKS ©️ MSV🙏

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

_(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_


కార్యే కర్మణి నిర్దిష్టే 

యో బహూన్యపి సాధయేత్.

పూర్వకార్యావిరోధేన 

స కార్యం కర్తుమర్హతి

(5.41.5)

*అర్థం:*

సాధించిన లక్ష్యాన్ని ప్రభావితం చేయకుండా, దానికి అదనంగా పనులు చేయగలవాడు నిజంగా విలువైనవాడు.


_శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం తో శుభోదయం_


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష* 

ధర్మో రక్షతి రక్షితః

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం  -‌ అష్టమి -  అశ్వనీ -‌‌ భృగు వాసరే* (18.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*