4, ఆగస్టు 2025, సోమవారం

మనం ఎదుగుతున్నామా?...

 *నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం.*

ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం.. 




 *అమ్మ అరగంట కనబడ కుంటేనే అల్లాడిపోయిన మనం..* 

అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం..


 *నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...* 

నేనే హీరో”... నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం..


 *నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం...* 

చిల్లరబుద్ధులతో,సంపాదనలో, అవే చిల్లర కూడా, .....తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచు కుంటున్నాం..


 *చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం..* 

ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం...


 *బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం..* 

ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక కుటుంబాన్ని చిన్నదిగా మల్చు కుంటున్నాం..


 *చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం...* 

ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..!


*మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి.., కొన్నాళ్ళు మనిషిలానే పెరుగు తున్నాం.*..

కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...


 *మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం..!* 

మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం.!!


*నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం.!!!*

ఎందుకంటే... 

మనం ఎదుగుతున్నాం..!


మనం మనకే అందనంతగా...

మనం ఎదుగుతున్నాం..!


మనం,మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం అని కూడా తెలియనంతగా...


నిజంగా మనం ఎదుగుతున్నామా?...


........ ఆలోచన చేయండి.....🙏

2, ఆగస్టు 2025, శనివారం

లటానుప్రాసము

 1 🙏🙏🙏లటానుప్రాసము

అర్ద భేదము లేకుండా తాత్పర్యభేదము కలిగి వర్ణముల యొక్క జంట గాని సమూహము గాని అవ్యధానముగా ఆవృత్తి అయిన లాటాను ప్రాసము ఉదాహరణ

కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాధు వర్ణించు జిహ్వజిహ్వ

లటానుప్రాసము అనేటప్పటికి గుర్తుకు వచ్చే ఏకైక పద్యం ఇక్కడ "కరములు కరములు "  "జిహ్వ జిహ్వ "అవ్యధానముగా ఆవృత్తి అయినది. .కరములు అనగా చేతులు అని అర్ధము జిహ్వ అనగా నాలుక ఇక్కడ అర్ధభేదము లేదు కాని కమలాక్షుని అర్చన చేయు చేతులే చేతులు అని శ్రీనాధుని వర్ణించునట్టి నాలుకయే నాలుక అని తాత్పర్యభేదము కనబడుచున్నది కావున లటానుప్రాసము.

శ్రీనాధుడు అంటే గుర్తు వచ్చింది అయన వ్రాసిన లటానుప్రాస పద్యం

"శ్రీ భీమ నాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ

దక్షవాటీ పురాధ్యక్ష మోహన మూర్తి చూడంగ నేర్చిన చూపు చూపు " ముందుగా శ్రీనాధుడు వ్రాశారు.ఈ పద్యమును బట్టి పోతన గారు కమలాక్షు నర్చించు కరములు కరములు పద్యం సాన బట్టి ఎంతో రమ్యముగా వ్రాసి జనుల జిహ్వలపై నాట్యమాడించారు శ్రీనాధుని పద్యం పండిత లోకమునకు తప్ప సామాన్య జనులకు తెలియదు.( ఇది భీమేశ్వర పురాణము లోనిది )

అటులనే "తల్లిదండ్రులను సేవించు సుతుడు సుతుడు " "విద్యాబుద్దులు నేర్పు గురువు గురువు " ఇల్లా ఎన్నైనా తయారుజేయవచ్చు.

ఆచార్య ఆత్రేయ గారు లాటాను ప్రాసములో

" అడగక ఇచ్చిన ముద్దు ముద్దు "అని లాటాను ప్రాసానుగుణముగా వ్రాశారు. అయితే స్వర కల్పనకు అనుకూలముగా లేదు మార్చాలి అని పట్టు పడితే అప్పుడు "అడగక ఇచ్చిన ముద్దే ముద్దు అని మార్చవలసి వచ్చింది అప్పుడు తాత్పర్యార్థము వ్రాసి ఇచ్చారు అయినా లాటాను ప్రాసము అవుతుంది 

2 యమకము

యమకము అంటే సంస్కృతంలో  " జత " అని అర్ధము కాని సమూహం కూడా గ్రహిస్తున్నారు 

వర్ణముల జంట గాని సమూహము గాని అర్ద భేదము కలిగి వ్యవధానముగా ఆవృత్తి అయిన

యమకము అనెడి శబ్దాలంకార�

శబ్ద ప్రధానములైనవి శబ్దాలంకారములు

 🙏🙏🙏శబ్ద ప్రధానములైనవి శబ్దాలంకారములు

శబ్దాలంకారములు అనగానే దండి మహాకవి గుర్తుకు వస్తాడు. అన్ని అలంకారాలు ఆయన గద్య కావ్యము దశకుమార చరిత్రలో ఉన్నాయి ప్రారంభమే శబ్దాలంకారములు " అస్తి సమస్త నగరి నికషాయమాణ శశ్వదగణ్య పుణ్యవిస్తారిత మణిగణాదివస్తు జాత 

అద్భుతమైనకావ్యం.అట్లే బాణుని కాదంబరి కావ్యం కూడా గొప్ప గద్య కావ్యము 

1 వృత్త్యను ప్రాసము :

ఒక అక్షరము లేదా రెండు మూడు అక్షరాలు వ్యవధానముతో ఆహ్లాదము, చమత్కృతి కలిగించుచు అవృత్తియైన వృత్త్యను ప్రాసము.

ఉదాహరణ : విరూపాక్షండు రూక్షాక్ష రంబుల నధి క్షేపించి ఇక్కడ" క్ష " అనే అక్షరం వ్యవధానముతో ఆవృత్తి అయినది.(రూక్షాక్ష అనునపుడు అ వ్యవధానం అనుకోవచ్చు రూక్ష +అక్షర మధ్యలో అ ఉన్నది )

కలుగడే నాపాలి కలిమి సందేహింప

కలిమి లేములు లేక కలుగు వాడు

ఇక్కడ కకారము, లకారము వ్యవధానముతో ఆవృత్తి అయినది

"అడిగెదనని కడువడిcజను

నడిగినcదను మగుడ నుడువడని నడయుడుగున్ "పద్యంలో ఎన్నో డకార నకార ములు వ్యవధానముతో ఆవృత్తి చేసినాడు "రవిరధ తురంగ శృంగార చారు చామర ఛటా...." ఇక్కడ రకార చకారములు వ్యవధానముతో ఆవృత్తి అయినవి. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుcగృష్ణు ఇక్కడ ష్ణు అనేక పర్యాయములు వ్యవధానముతో ఆవృత్తి అయినది. ఇది వృత్త్యను ప్రాసము సినిమా పాటలలో ఈ అలంకారమునకు ఉదాహరణలు కోకొల్లలు.

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగనఝగనసొగసుల లనవె

సినీ కవులు అందరు వృత్త్యను ప్రాసముతోనే పాటలు వ్రాశారు దీనివల్ల పాటకి ఆకర్షణ చామత్కారము వస్తుంది.లేకపోతే ఉడకపెట్టి ఉప్పు కారం చల్లినట్టు ఉంటుంది.

2 ఛేకానుప్రాసము

అర్ద భేదము కలిగి వర్ణముల యొక్క జంట గాని సమూహము గాని అవ్యవధానముగా ఆవృత్తియైన ఛేకానుప్రాసము

ఉదాహరణ : జఠర క్షుధావ్యధా దూయమాన మానసుండు ఇక్కడ మాన - మాన అనే వర్ణముల జంట అవ్యవధానము

Panchaag

 


29, జులై 2025, మంగళవారం

పరమాచార్య వైభవమ్…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

114a;307e2.    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0282.పరమాచార్య పావన గాధలు…


*పరమాచార్య స్వామి*– 

                 *ఉప్పు వ్యాపారి*

                    ➖➖➖✍️

```

అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. నాలుగు నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నాకోసం కబురు పంపారు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. 


అప్పుడు రాత్రి పది గంటలు.... 

కటిక చీకటి.... కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది. 


“...నిపుణౌ”, మహాస్వామి వారు మెల్లిగా చెప్పారు, “చెప్పు”. 


“తవ హి చరణావేవ నిపుణౌ... సౌందర్యలహరి లోని నాలుగవ శ్లోకం

త్వదన్యః పాణిభ్యాం...”


పరమాచార్య స్వామి వారు చిన్నగా అన్నారు, “అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు.”


అంతా నిశ్శబ్ధం.... “సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా?”


“తెలుసు పెరియవ. చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తూంటారు.”


“నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా?”


“అవును. వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం.”


“అవును. అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూసారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి “రేయ్ రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి.” వారు ఒక పథకం వేసారు. 


“ఇంకా, వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా?”


“దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారుచేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దము చేస్తూ పేలుతుంది.”


“అవును. ఆ దొంగల పథకము కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే 

ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టీ నుండి డబ్బు తస్కరించవచ్చు.”


“ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోసాడు. కాని ఆరోజు బాగా వర్షం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆరోజు వ్యాపారం లో నష్టము, మనస్సుకు కష్టము కలిగింది. బుద్దికి తోచినట్టుగా మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు. అతని కోపం ఏంటంటే డబ్బులేకుండా ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెనుతిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తి గుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కాని పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున్న పడిన వర్షానికి. వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు. “దేవుడు నిన్ను కాపాడాడు. నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి దేవున్ని ప్రార్థించు”


ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడయ్యాడు. “అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను. కాని అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లీ. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు.”


కావున మనకి ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలినది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చెయ్యడమే. 


మహాస్వామి వారు చిన్న గొంతుకతో, తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే సరికి రాత్రి 2:30 అయ్యింది.


అప్పుడు నేను “నా తల పైన ఉన్న వెయ్యి టన్నుల బరువు తీసేసినట్టు అయ్యింది” అని అన్నాను. 


పరమాచార్య స్వామి వారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా! 


తరువాత మహాస్వామి వారు “క్రమం తప్పకుండా ప్రతిరోజూ రామాయణం చదువు. నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.” అని అన్నారు.


ఈనాటికీ నాకు రామాయణ పారాయణ - మనస్సుకు ప్రశాంతత ఒకేసారి వస్తుంది. ✍️```

*--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్,* శ్రీమఠం విద్వాన్. మహాపెరియావళ్ దరిశన అనుభవంగళ్-1

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*

```

#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏

.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

            🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁మంగళవారం 29 జూలై 2025🍁*

                       1️⃣5️⃣

                   *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


          *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

``

*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``



*పరీక్షిత్తుకు ముక్తి మార్గాన్ని*                  

    *తెలియచేసిన శుకుడు*               

```

ప్రాయోపవేశం చేసి, శ్రీహరి కథలను వినాలనీ, తనకు హరిమీద భక్తి కలగాలనీ, తద్వారా ముక్తి పొందాలనీ ఆసక్తితో ఉన్న పరీక్షిత్తు దగ్గరకు వచ్చిన అవధూతమూర్తి, వేదవ్యాస మహర్షి కొడుకు, శుక మహర్షిని,``` 'కాలం చెల్లిపోతున్నవారు భగత్పాప్తిని పొందాలంటే ఉపాయం ఏమిటి? వారి కర్తవ్యాకర్తవ్యాలు ఏమిటి'``` అని ప్రశ్నించిన పరీక్షిత్తుకు సమాధానం చెప్తాడు శుకుడు వివరంగా...

``` 

*'ముక్తిని కోరుకునేవాడు విష్ణువును గురించే ఆలకించాలి. ఆరాధించాలి. స్తుతించాలి. తలచాలి. సర్వం ఈశ్వరమయంగా భావించినప్పుడే మోక్షం కలుగుతుంది. సాంఖ్య యోగం వల్ల స్వధర్మాచరణ ద్వారా జీవులందరూ తమ ఆయువు తీరేదాకా విష్ణువును ధ్యానించగలుగుతారు. నా తండ్రి వ్యాస భగవానుడు ద్వాపరయుగంలో భాగవతాన్ని అధ్యయనం చేయించాడు. భాగవతం మోక్షమార్గాన్ని ప్రతిపాదించే శాస్త్రం. భాగవతంలోని భగవంతుడి అవతార లీలలు నా మనస్సును ఆకట్టుకున్నాయి. ఆ ఆనందమే నన్ను చదివించేలా చేసింది. నీకు ఆ భాగవత తత్త్వాన్ని తెలియచేస్తాను శ్రద్ధతో విను. భాగవతాన్ని వినడం వల్ల నీకు భగవంతుడి మీద ప్రేమ కలిగి, విష్ణువును సేవించాలనే బుద్ధి పుడుతుంది. రెప్పపాటు కాలం హరినామ స్మరణ చేసినా చాలు, ముక్తి కలుగుతుంది'*``` అని ఖట్వాంగ మహారాజు వృత్తాంతాన్ని చెప్పాడు శుక మహర్షి పరీక్షిత్తుకు.

```

*“పూర్వం ఖట్వాంగుడు అనే రాజు ఏడు దీవులకు ఏలిక. ఒకనాడు రాక్షసుల చేతిలో ఓడిపోయిన ఇంద్రుడు, సహాయం చేయమని ఖట్వాంగుడి దగ్గరకు వచ్చి అడిగాడు. వెంటనే ఖట్వాంగుడు భూలోకం నుండి స్వర్గలోకం వెళ్ళి రాక్షసులను అంతం చేశాడు. దేవతలు ఆనందించి, ఆయన్ను వరం కోరుకొమ్మని అడగ్గా, తనెంత కాలం బతుకుతానో చెప్పమని కోరాడు. ముహూర్త కాలం అంటే, రెండు గడియలు మాత్రమే అని చెప్పారు దేవతలు. రాజు క్షణాల మీద భూలోకానికి తిరిగి వచ్చాడు. అన్నిటినీ తక్షణమే త్యజించి విరాగి అయ్యాడు. వెంటనే గోవింద నామాన్ని ధ్యానించాడు. స్థిర చిత్తంతో రెండు గడియల్లోనే ముక్తి పొందాడు.”*


ఈ కథ చెప్పి, పరీక్షిత్తుకు ఏడు రోజులు దాటిన తరువాత కానీ ఆయువు తీరదు కాబట్టి, అంతవరకు విష్ణు ధ్యానం చేస్తే, మోక్షపథం పొందే వీలుంది అని అన్నాడు శుకుడు. భగవంతుడిని ధ్యానం చేసే విధానం వివరంగా చెప్పాడు శుకుడు…


*ఓంకారాన్ని స్మరిస్తూ యోగనిష్ఠతో ప్రాణవాయువును స్వాధీనంలోకి తెచ్చుకోవడం, మనస్సు అనే పగ్గాన్ని చేజారనీయకుండా గట్టిగా పట్టి ఉంచడం. భక్తే లక్షణంగా కల యోగాన్ని ఆశ్రయించడం, తద్వారా విష్ణు పథాన్ని చేరుకోవడం గురించి చెప్పాడు. ధారణ అంటే ఏమిటి, ఎలాంటి సాధనతో అది నిలబడుతుంది, దాని స్వరూపం ఎలా ఉంటుంది. అది జీవుల మానసిక మాలిన్యాన్ని ఎలా రూపుమాపగలుగుతుంది అనే విషయాలను పరీక్షిత్తు ప్రశ్నలకు జవాబుగా వివరించాడు శుకుడు.*


'పండితుడైన వాడు ప్రాణవాయువులను బిగబట్టి శ్వాసను జయించాలి. సర్వమయుడైన విరాట్పురుషుడి విగ్రహంతో మోక్షగామి (ముముక్షువు) తన మనస్సును సంధానించాలి. బుద్ధిమంతుడు వాసుదేవుడిని సేవించాలి. విష్ణువును స్మరించని వాడు మత్తులో ఉన్నవాడితో సమానం. పరమేశ్వరుడిని మనస్సులో ధారణతో నిలుపుకోవాలి. ఆయన ప్రతి అవయవాన్నీ ఒక్కటొక్కటిగా అనుక్షణమూ ధ్యానించాలి. పరిపూర్ణమైన నిశ్చలబుద్ధి కుదిరేదాకా ఆ భగవత్ చింతనాసక్తి తోనే ఉండాలి. శరీరాన్ని విడిచి పెట్టే సమయంలో ఇంద్రియ సాంగత్యాన్ని వదలిపెట్టాలి. ఇలా బ్రహ్మలోకానికి పోవాలనుకున్న యోగి ఆకాశమార్గంలో పోతుంటాడు. పోయి, పోయి విష్ణువు స్థానమైన శింశుమార చక్రం చేరుకుంటాడు. విష్ణు లోకానికి వెళ్లినవాళ్లు విష్ణు పదాన్ని పొంది ప్రకాశిస్తుంటారు'.```


ఇలా చెప్పిన శుకుడు పరీక్షిత్తుకు భక్తి మార్గమే ముఖ్యమని అంటాడు. 'జగన్నాథుడైన శ్రీహరి సర్వ ప్రాణుల్లో ఆత్మరూపంలో ఉంటాడు. నిత్యం నమస్కరించతగినవాడు, ఎల్లకాలం భక్తుల పట్ల వాత్సల్యం కలవాడు, ఆత్మరూపి, ఇలాంటి శ్రీమహావిష్ణువు కథాసుధను సంతృప్తిగా ఆస్వాదించే భక్తులు పుణ్యాత్ములు. 

ఆ లక్ష్మీనాయకుడి కథలు అమృతోపమానాలు. అవి విన్నవారికి వీనుల విందుగా ఉంటుంది. విష్ణు గాథలు, కీర్తనలు వింటూ కాలాన్ని వెళ్ళబుచ్చేవాడి ఆయువు గట్టిది. హరినామ సంకీర్తనలు వినని చెవులు కొండలలో గుహల లాంటివి' అని చెప్పాడు శుక మహర్షి.


చనిపోవడం అనే భయం ఏమాత్రం లేకుండా, ధర్మార్థ కామాలను మూడింటినీ మానుకుని, ఆ పురుషోత్తముడి మీదనే మనస్సును నిలుపుకుని, అంత్యకాలం గడపాలనే అభిప్రాయానికి వచ్చాడు. పరీక్షిత్తు.


                *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


        *రచన:శ్రీ వనం* 

 *జ్వాలా నరసింహారావు* *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మంగళవారం🍁* *🌹29 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

   *🌹29 జూలై 2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం*  

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : పంచమి* రా 12.46 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : ఉత్తర* రా 07.27 వరకు ఉపరి *హస్త*

*యోగం : శివ* రా 03.05 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : బవ* మ 12.00 *బాలువ* రా 12.46 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*మ 12.00 - 01.00 సా 04.00 - 06.00*           

అమృత కాలం  : *ప 11.42 - 01.25*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.40*

*వర్జ్యం      : రా 04.42 - 06.28 తె*

*దుర్ముహూర్తం  : ఉ 08.22 - 09.13 రా 11.07 - 11.52*

*రాహు కాలం   : మ 03.27 - 05.04*

గుళికకాళం       : *మ 12.14 - 01.50*

యమగండం     : *ఉ 09.00 - 10.37*

సూర్యరాశి : *కర్కాటకం*  

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.55*

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.47 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.06*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ పంచమి*

సాయంకాలం        :*సా 04.06 - 06.40*

ప్రదోష కాలం         :  *సా 06.40 - 08.54*

రాత్రి కాలం           :*రా 08.54 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.19 - 05.03*

****************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🚩శ్రీ ఆంజనేయ స్తోత్రం🚩*


*మహాబలాయ వీరాయ* 

*చిరంజీవిన ఉద్ధృతే*

*హారిణే వజ్రదేహాయ* 

*చోల్లంఘిత మహాబ్దయే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

28, జులై 2025, సోమవారం

సోమవారం🕉️* *🌹28 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

 *🌹28 జూలై 2025🌹*        

   *దృగ్గణిత పంచాంగం*  

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : చవితి* రా 11.24 వరకు ఉపరి *పంచమి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : పుబ్బ* సా 05.35 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం : పరిఘ* రా 03.03 వరకు ఉపరి *శివ*

*కరణం  : వణజి* ఉ 10.57 *భద్ర* రా 11.24 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.00 - 12.30 సా 05.00 - 06.30*           

అమృత కాలం  : *ఉ 10.52 - 12.33*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.40*

*వర్జ్యం      : రా 01.21 - 03.04*

*దుర్ముహూర్తం  : మ 12.40 - 01.31 & 03.14 - 04.06*

*రాహు కాలం   : ఉ 07.24 - 09.00*

గుళికకాళం       : *మ 01.51 - 03.27*

యమగండం     : *ఉ 10.37 - 12.14*

సూర్యరాశి : *కర్కాటకం*

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 05.54*

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.47 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.06*

*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ చవితి*

సాయంకాలం        :*సా 04.06 - 06.41*

ప్రదోష కాలం         :  *సా 06.41 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.18 - 05.03*

****************************

         *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*నానీతా పద్మమాలా సరసి* 

*వికసితా గంధపుష్పైస్త్వదర్థం*

*క్షంతవ్యో మేఽపరాధః శివ*  

*శివ శివ శంభో శ్రీమహాదేవ శంభో*


     *🕉️ఓం నమః శివాయ🕉️*


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

శీర్షిక.... భోజన ప్రియులు

 శీర్షిక.... భోజన ప్రియులు 


తిండికి లేక కండలు కరిగిస్తూ 

ఒకవైపు 

కండలు పెంచుతూ తినడమె

పనిగా, అదేపనిగా బ్రేవో అని తేన్చేదాకా!


*తిండి కలిగితే కండ కలదోయ్*

ఆనాడు అన్నారు గురజాడ 

నేడు తిండితో కండలు కొండలుగా పెంచేస్తూ 

సిక్స్ ప్యాక్ బాడీలు పెంచుతూ 

ఊపిరితిత్తుల శ్వాసకు ఎసరు పెడుతున్నారు 

గుండె జబ్బులతో మజా మజాగా..


తినడం తాగడం తొంగోవడం 

పౌరాణిక చారిత్రక గాథల్లో 

ప్రసిద్ధి పొందారు తిండిబోతులు 

రుచులు మరిగిన వారలు 

బద్ధకంతో మొద్దు నిద్రతో కాలం వెళ్లబుచ్చేస్తారు

వృధాగా, బేఫికర్ గా 

తినడం లోనె ఆనందాన్ని అనుభవిస్తుంటారు 

అప్పనపు పప్పన్నం బ్రతుకులు..


అన్నమో రామచంద్రా! అల్లాడే ఆకలికి 

దొరకవు పట్టెడు మెతుకులు 

విందులు వినోదాలతో దర్జాలు చేస్తూ

పొట్ట పెంచుకుంటున్న ధనికులు అజీర్తి రోగాలకు 

శరీరాన్ని అనారోగ్యం పాల్జేస్తూ..


మితాహారం.. సమతుల ఆహారం 

ఆరోగ్యానికి చిట్కాలు 

హితసూత్రాలు ఇంటికీ--ఒంటికీ

వంటింటికీ..ఇంటావిడవికీ 

నిండా ఆయుష్ఫుతో నూరేళ్ళ పండుగ ప్రాణానికి..


నీతి ః--

*బతకడానికి తినండి.. తినటానికి బ్రతుకు వద్దండి*

ంంంంంంంంంంంంంంంంంం

ఇది నా స్వీయ కవిత 


ంంంంంంంంంంంంంంం

ఎవరి తప్పులు వారికి

 శు భో ద యం 🙏


ఎవరి తప్పులు వారికి తెలియవుగదా?


నరసింహ శతకం - శేషప్ప కవి   

      

పసరంబు ప0జైన పశులకాపరి తప్పు 

ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు 

భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు

తనయుండు దుష్టైన తండ్రి తప్పు 

సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు 

కూతురు చెడుగైన మాత తప్పు 

అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు 

దంతి దుష్టైన మావంతు తప్పు 

ఇట్టి తప్పు లెఱు౦గక నిచ్చవచ్చి

నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు 

భూషణవికాస! శ్రీ ధర్మపురనివాస! 

దుష్టసంహార! నరసింహ! దురితదూర!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కోరికలకోసమే దేవుని పూజించడం

 కోరికలకోసమే దేవుని పూజించడం సరికాదు 


“ఎన్ని సౌకర్యాలు ఉన్నా మాకు అవసరం లేదు. భగవంతుని సాక్షాత్కారం కావాలనేది మన పూర్వీకుల ఆశయం. అలాగే వారు 24 గంటలూ భగవంతుని పాదాలనే ఆశ్రయించేవారు, ఆయననే ధ్యానించేవారు. ఈకాలంలోమనం కూడా ధ్యానం చేస్తాం. దేని మీద?

  *ద్యతం విద్మహర్నిజం*

 24 గంటలు, “డబ్బును ఎలా సంపాదించాలి? ఆ సంపాదించిన దాన్ని ఎలా రెట్టింపు చేయాలి? ” అనే డబ్బు గురించే నిత్యం ధ్యానం చేస్తున్నాము. ఈ కారణాల వల్ల మన పూర్వీకులు పొందిన ప్రయోజనాలను మనం పొందకుండా మనమే మన తృష్ణతో, ఆశతో అడ్డుకుంటున్నాము .

*దత్తత్కర్మ కృతం యదేవ I* *మునిపిష్ఠైర్పలైర్వఞ్చితః ॥*

 మన సాధనాలకూ వారి మార్గాలకూ ఎంత తేడా! కాబట్టి మనం వారి మార్గాన్ని అనుసరించాలి. మనసులోని కోరికల కోసం దేవుడిని పూజించడం సరికాదు. కోరికలను వదిలించుకోవడం ద్వారా మాత్రమే నిజమైన ఆనందం లభిస్తుంది. తలెత్తే కోరికలను పరిష్కరించే ప్రయత్నంలో మనం విజయం సాధించలేము. కోరికలు తరగనివి. అందుకు పశ్చాత్తాపం మాత్రమే మిగిలి ఉన్నది. కోరిక ఎవరికీ ఆనందాన్ని కలిగించదు.అనేది తెలిసిన రోజున మీలో నిజమైన భక్తి జనిస్తుంది.


*-జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

శ్రావణశ్రీలక్ష్ముల నోములు*

 *శ్రావణశ్రీలక్ష్ముల నోములు*


ఉ॥

శ్రావణలక్ష్మిపాదముల స్వచ్ఛమనమ్మును నిల్పి పూజలన్ 

పావనభక్తి సంచితపుపాపనివృత్తియవంగ వేడుచున్ 

నీవిఁక నాకు దిక్కు మరి నేఁ దలబెట్టను కిల్బిషమ్ములన్ 

కావవె యీయవే తిరముగాగ సుమంగళిభాగ్యమమ్మరో ! -1


కం॥

ఉత్తమగుణాఢ్యుడై వర

సత్తముడై మహితబుద్ధి సన్నుతమతియై 

చిత్తస్థిరత్వయుతుడై 

బత్తికి లోబడెడువాని భర్తగనిమ్మా! -2


కం॥

సుగుణోపేతులు కుదురగు 

నగణితధీశ్రీకుశలురు నమృతమూర్తుల్ 

పొగరెరుగని సంతానము 

తగ నీవిం జెలగు వారిఁ దయతో నిమ్మా! -3


కం॥

అని వేడంగవలయు శ్రా 

వణమాసపునోములందు మహిళామణులున్ 

మన గౌరియె శ్రీలక్ష్మియ 

మన భక్తియ పుష్పమౌను మంత్రము మాటౌన్ -4


కం॥

నోములు నోచెడి మహిళలు 

కామిత వరముల దలచుక కరుణను బ్రోవన్ 

లేమగు లక్ష్మినిఁ బూజల 

ధీమతులై గొల్వవలయుఁ దేజశ్శాలిన్ -5


కం౹

వరముల నిమ్మా కొమ్మా! 

సురవరుడౌ నీశుపత్ని! శోభితగౌరీ! 

యరమరికలు లేనట్టుల 

మురిపెముతో జూడు మనుచుఁ బూజలఁ జేయన్ -6


కం॥

కనికరమునుఁ జూపించును 

ననితర భక్తికి తనియుచు కామితమిచ్చున్ 

ఘనులగు భర్తల పుత్రుల 

పెనుసంతోషముల నిచ్చు వేలుపు తుదకున్ -7


కం॥

ఈ యింటికి నా యింటికి 

సాయంవేళల పడతులు సందడితోడన్ 

పాయక పేరంటములన్ 

వాయనముల నందఁ బోవ వారే లక్ష్ముల్ -8


తే.గీ.

పట్టుపరికిణీలనుగట్టి పైటవైచి 

పసుపు పాదాల మెడనిండ పసిడిఁబెట్టి 

వీథులందునఁ దిరుగాడు పేరటాళ్ళు 

భువిని శ్రీలక్ష్ము లనఁ జెల్లు ముదము గలుగ -9

*~శ్రీశర్మద*

శ్రీ దుర్గా బారి మందిర్

 🕉 మన గుడి : నెం 1185


⚜ నాగాలాండ్ : కోహిమా


⚜ శ్రీ దుర్గా బారి మందిర్ 


 

💠 కోహిమా నాగాలాండ్‌లోని ఒక సాంస్కృతిక నగరం. 

వివిధ నాగ సమాజాల సంస్కృతికి చెందిన ఆనవాళ్లను కోహిమాలో చూడవచ్చు. 

కోహిమా జాతిలో వివిధ తెగలు మరియు ఉప తెగలు ఉన్నాయి, వీరు పురాతన కాలం నుండి ఇక్కడ నివసిస్తున్నారు. కోహిమా ప్రజలు ప్రధానంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు మరియు ఈ ప్రాంతంలో నివసించే ఇతర సమాజాలు హిందూ మతం మరియు ఇస్లాం రెండింటినీ అనుసరిస్తాయి.


💠 నాగ వారసత్వం చాలా గొప్పది మరియు ఇది వివిధ రకాల ఆచారాలు మరియు పండుగలను కలిగి ఉంటుంది, ఇది కోహిమాలో ఇప్పటికీ వారి అసలు సంప్రదాయాలు మరియు ఆచారాలను కాపాడుతుంది. 

నేటికీ, కోహిమా అంతటా చాలా సామాజిక-జాతి సమాజాలు కనిపిస్తాయి, అవి వాటి స్వంత సామాజిక మరియు సాంస్కృతిక గుర్తింపును కలిగి ఉన్నాయి.



💠 కోహిమాలోని దుర్గాబారి మందిరం అనేది నాగాలాండ్‌లో ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి ఒక ఉత్కృష్టంగా నిలుస్తున్న ఒక గౌరవనీయమైన హిందూ దేవాలయం. 

ఈ ప్రశాంతమైన ఆలయం దుర్గాదేవికి అంకితం మరియు భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. 


💠 పచ్చని కొండల నేపథ్యంలో ఉన్న ఈ ఆలయం ధ్యానం మరియు ప్రతిబింబానికి అనువైన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. సందర్శకులు దాని అద్భుతమైన వాస్తుశిల్పంతో మంత్రముగ్ధులవుతారు, ఇది అద్భుతమైన శిల్పాలు మరియు శక్తివంతమైన అలంకరణలను ప్రదర్శిస్తుంది, ఇది ఈ ప్రాంతం గొప్పది కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 


💠 ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; ఇది ఒక సాంస్కృతిక కేంద్రం, ఇక్కడ వివిధ స్థానిక పండుగలను గొప్పగా జరుపుకుంటారు, నాగ ప్రజల శక్తివంతమైన సంప్రదాయాలను సంగ్రహావలోకనం చేస్తుంది. 


💠 దుర్గాబారి మందిరాన్ని సమీపించేటప్పుడు, ప్రకృతి యొక్క ప్రశాంతమైన శబ్దాలు మరియు గాలిలో వెదజల్లుతున్న ధూపం సువాసన మిమ్మల్ని స్వాగతిస్తుంది. 

ఆలయ ప్రాంగణం బాగా నిర్వహించబడుతుంది, సందర్శకులు అన్వేషించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. 


💠 పవిత్ర స్థలం పట్ల గౌరవం చూపించడానికి సందర్శించేటప్పుడు నిరాడంబరంగా దుస్తులు ధరించడం మంచిది. 

ఆలయం సాపేక్షంగా నిశ్శబ్దంగా ఉంటుంది, ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయేలా చేస్తుంది. 


💠 కోహిమాలోని పచ్చదనం మరియు విశాల దృశ్యాలు మొత్తం అనుభవాన్ని మరింత పెంచుతాయి కాబట్టి, పరిసరాలను ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించండి. 

స్థానిక సంస్కృతిని లోతుగా అర్థం చేసుకునే వారికి, ఆలయ పూజారులు మరియు స్థానిక భక్తులతో నిమగ్నమవ్వడం ఇక్కడ నిర్వహించే ఆచారాలు మరియు వేడుకలు ప్రాముఖ్యత గురించి అంతర్దృష్టులను అందిస్తుంది. 

సమీప ప్రాంతాలను అన్వేషించడానికి ఈ ఆలయం ఒక సరైన ప్రారంభ స్థానం, ఇది కోహిమాలోని ఏ పర్యాటకుడైనా తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మారుతుంది. 

 

💠 కోహిమాలో ఉన్న దుర్గా బారి మందిర్ దుర్గాదేవికి అంకితం చేయబడిన ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయంలో కాళి మాత మరియు శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి.



💠 కోహిమాలోని హిందూ నివాసితుల ఉమ్మడి కల సాకారం కావడమే దుర్గాబారి కోహిమా.

 కోహిమాలో హిందూ సమాజం యొక్క ప్రార్థనా స్థలం మరియు సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాలను నిర్మించడానికి ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉన్న మరియు పాల్గొన్న అనేక మంది ప్రముఖుల అవిశ్రాంత కృషి ఫలితం ఇది.


💠 గణేశ పూజ, దుర్గా పూజ, జగన్నాథ స్నానం, జగన్నాథ రథయాత్ర ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగల


💠 ఉదయం పూజ మరియు హారతి ఉదయం 07:30 నుండి ప్రారంభమవుతాయి.

ఉదయం 06:00 నుండి రాత్రి 09:00 వరకు



Rachana

©️ Santosh Kumar

18-61-గీతా మకరందము

 18-61-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఈశ్వరుడు తనమాయచే సమస్తభూతములను కీలుబొమ్మలను వలె త్రిప్పుచున్నారని తెలుపుచున్నారు – 


ఈశ్వరస్సర్వభూతానాం 

హృద్దేశేఽర్జున! తిష్ఠతి | 

భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా|| 


తా:- ఓ అర్జునా! జగన్నియామకుడు పరమేశ్వరుడు (అంతర్యామి) మాయచేత సమస్తప్రాణులను యంత్రము నారోహించినవారిని వలె(కీలుబొమ్మలను వలె) త్రిప్పుచు సమస్తప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు.


వ్యాఖ్య:- ఈశ్వరు డెచట నున్నారు? ఏమి చేయుచున్నారు? అను ప్రశ్నలకిచట సమాధానము చెప్పబడినది. ఈశ్వరుడు (భగవంతుడు) దూరముగనే యున్నాడని తలంచుట వెఱ్ఱి. వారు జీవులకు, అతిసమీపమున హృదయమందుగూడ (ఆత్మరూపమున) అధివసించుచున్నారు. కనుకనే "సర్వభూతానాం హృద్దేశే” - అని చెప్పబడినది. కావున భగవత్సాన్నిధ్యమును ఎల్లపుడు ననుభవించుచు, పాపాచరణములేక, భక్తియుతులై మెలగవలెను. జీవులుచేయు సమస్తకార్యములను, సంకల్పించు సమస్త సంకల్పములను ఈశ్వరుడు సాక్షిమాత్రుడై సదా వీక్షించుచునేయుండునని ఎవరును మఱవరాదు. ఈశ్వరుడనగా ప్రభువు, శాసకుడు, నియామకుడు. రాజు ప్రజలను శాసించునట్లు వారు సమస్తప్రాణికోట్లను శాసించుదురు. వారివారికి కర్మానుకూలముగ ఫలముల నొసంగుదురు. రాజాజ్ఞను మీరినచో జనులకెట్లు దండనము లభించునో అట్లే ఈశ్వరుని ఆజ్ఞయగు ధర్మము నుల్లంఘించినచో మనుజుడు వారిచే శిక్షితుడై, తన దుష్కర్మఫలితమగు ఫెూరదుఃఖము ననుభవించును. కావున హృదయమున, బాహ్యమున, సర్వత్ర ఈశ్వరసన్నిధిని సదా భావించుచు ధర్మమును, సత్యమును, ఎవరును ఉల్లంఘించరాదు


         భగవంతుడు ఏ ప్రదేశమందుండును? వైకుంఠమందా? కైలాసమందా? పాతాళమందా? ఇతరలోకమందా? వారెల్లెడల వసించుచుందురు. అతిసమీపమునగల హృదయప్రదేశమందును ఉందురు. కావున అట్టి పరమాత్మను సదా భక్తితో గొల్చుచుండవలెను. "సర్వభూతానామ్" అని చెప్పుటవలన ఏ ఒకానొక ప్రాణియందో కాదనియు సమస్త జీవకోట్లయందును భగవానుడు వెలయుచుండుననియు స్పష్టమగుచున్నది. కాబట్టి చీమయందును, దోమయందును, పశువునందును, చండాలునియందును కూడ వారు నివసించుచున్నారు. కాని ఎవని చిత్తము నిర్మలముగా నుండునో ఆతనియందు లెస్సగ భాసించుచు, వ్యక్తమగును.

యన్త్రారూఢాని - ఈశ్వరుడు మాయద్వారా సమస్తజీవులను సంసారరూపయంత్రమున త్రిప్పుచున్నాడు. యంత్రముయొక్క పెద్దచక్రములపై చిక్కుకొనిన చీమగాని పురుగుగాని, ఆ చక్రముతో బాటు తిరుగుచునేయుండును. అట్లే జీవులున్ను (ఈశ్వరునిచే మాయద్వారా త్రిప్పబడుచున్న) ఈ సంసారచక్రమున తగుల్కొని, ఆ చక్రముతో బాటు వివశులై తిరుగుచున్నారు. దానినుండి తప్పించుకొనుట కుపాయము రాబోవు శ్లోకమున తెలుపబడును. ఆ యంత్రమును త్రిప్పుచున్నవానిని (భగవంతుని) ఆశ్రయించుటయే ఆ యుపాయము.

'మాయయా" అని చెప్పుటవలన ఈశ్వరుడు ఈ సంసారచక్రమును త్రిప్పుచున్నప్పటికిని మాయద్వారా ఆ పరిభ్రమణమును గావించుటవలన వాస్తవముగ వారికేమియు కర్తృత్వము లేకయేయున్నది. వారు సాక్షిమాత్రులై వర్తించుచున్నారు.


ప్ర:- ఈశ్వరుడు ఎచట నివసించుచున్నాడు?

ఉ:- సమస్తప్రాణికోట్ల హృదయమందు.

ప్ర:- ఏమిచేయుచున్నాడు?

ఉ: - ఈ సంసారచక్రమున తగుల్కొనియుండు జీవులందఱిని త్రిప్పుచున్నాడు.

ప్ర:- దేనిద్వారా?

ఉ:- మాయాశక్తి చేత.

ప్ర:- ఏ ప్రకారముగ?

ఉ:- యంత్రమందు తగుల్కొనియుండు పురుగులవలె.

【 కనుక వివేకవంతుడు పరమాత్మను భక్తిశ్రద్ధలతో ఆశ్రయించి దుఃఖవిముక్తిని, పరమశాంతిని పొందవలసియున్నాడు】.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము*


*450 వ రోజు*

*ప్రధమాశ్వాసం*


వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారతకథను సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుడిని చూసి " మహాత్మా ! తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయుడి ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏమి చేసాడు. హస్థినకు వెళ్ళిన రధికత్రయం ఎవరిని కలుసుకున్నారు. తరువాత ఎక్కడకు వెళ్ళారు. అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళిన పిదప కృపాచార్యుడు, కృతవర్మ ఎక్కడకు వెళ్ళారు. మహావిజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు "అని ఆడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.


*కుమారుల మరణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు*

తన నూరుగురు కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు మొదలు నరికిన వృక్షంలాగా కూలి పోయాడు. భరించరాని దుఃఖంలో మునిగి పోయాడు. అతడి హృదయం కకావికలైంది. దుఃఖభారంతో తనలో తానే కుమిలి పోతున్న సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! ఏమిటీ వెర్రి. ఎవరి కొరకు దుఃఖ పడుతున్నావు ? నీశోకానికి అంతు లేదా ! దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహినుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్ర రాజులు, సామంత రాజులు నీ కోసం మరణించారు కదా ! వారికిదహన సంస్కారాలు చేయాలి కదా ! పద యుద్ధభూమికి వెళదాము " అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు కదలలేదు తల బాదుకుంటున్నాడు. " సంజయా ! నా కొడుకులంతా చచ్చారయ్యా ! నా వైభవమంతా నశించిందయ్యా ! అతిదీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు. ఒకరి దయాభిక్ష మీద బ్రతకడానికా ! నాదీ ఒక బ్రతుకేనా ! బ్రతికి నేను సాధించేది ఏముంది?.


*ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము*


సంజయా ! కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చచెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు నా హితవు కోరి చెప్పారు. పరశురాముడు లాంటి మహా మునులు ఎందరో బుద్ధిమతి చెప్పారు. నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టాను. పాండవులకు రాజ్యభాగం ఇవ్వ నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను. కొడుకులను పోగొట్టుకున్నాను. బంధుమిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు. దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయా ! రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వ లేదు. కనుక నా అనే వారందరిని పోగొట్టుకున్నాను. సంజయా ! నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక వేరు కాదు. అయినా ధర్మరాజు ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు ? నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*