25, ఆగస్టు 2025, సోమవారం

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 25.08.2025

Monday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష ద్వితీయ తిథి ఇందు వాసర ఉత్తరఫల్గుని నక్షత్రం సిద్ధ యోగః కౌలవ తదుపరి తైతుల కరణం



రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు. 




నమస్కారః , శుభోదయం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం -‌ ద్వితీయ - ఉత్తరాఫల్గుణి -‌‌ ఇందు వాసరే* (25.08.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

24, ఆగస్టు 2025, ఆదివారం

Panchaag


 

మహాకవి భారవి 🙏

 🙏మహాకవి భారవి 🙏

             మొదటి భాగము 

మహాకవి భారవిచే రచింపబడిన ప్రసిద్ధ శ్లోకం యొక్క వృత్తాంతం చూద్దాము. తరువాత భాగాల్లో అతని కాలము కావ్యాలు పరిశీద్దాము 

సహసా విదధీత న క్రియా మవివేకః పరమపదాం పదమ్

వృణుతే హి నిమృశ్యకారిణో గుణ లుబ్ధా: స్వయమేవ సంపదః

అర్ధం 

తొందరపడి ఏ పనీ చేయకూడదు. అవివేకమున్నచోట ఆపదలు కాపురముంటాయి.

సంపదలకు సుగుణాలంటే యిష్టం.కనుక ఆలోచించి పనులు చేసేవారిని స్వయంగా సంపదలు వరిస్తాయి. అని దాన్ని భావం.ఈ శ్లోకం వెనుక ఒక కథవున్నది.


భారవి మహా కవి. చిన్నప్పటినుంచే కవిత్వం వ్రాస్తూ కొన్ని గ్రంథాలు రచించాడు.ఊళ్లోని వాళ్ళందరూ భారవి తండ్రితో నీ కొడుకు మహాఘటికుడయ్యా.చాలా మంచి కవిత్వం వ్రాస్తున్నాడు అనేవారు. 


అలాగ వాళ్ళన్నప్పుడు భారవి తండ్రి వాడింకా చిన్నవాడు.వాడికేమి తెలుసు?ఇంకా నేర్చుకోవాలిసినది చాలావుంది. అనేవాడు. నలుగురు తనను మెచ్చుకుంటూ ఉంటే తండ్రి మాత్రం వాడికేమీ తెలియదు చిన్నవాడు అనడం భారవికేమాత్రం నచ్చలేదు.తనను మెచ్చుకోక పోగా తేలికగా తీసి పారెయ్యడం చాలా చిన్నతనంగా భావించాడు. 


రోజు రోజుకూ తండ్రి మీద కోపం పెరిగి కసిగా మారింది. తండ్రి నెలాగైనా చంపాలనుకుని, రాత్రి ఆయన వంటింటిలో భోజనం చేస్తుండగా పెరట్లో ఒక పెద్ద రాయితో కాచుకొని కూర్చున్నాడు చెయ్యి కడుక్కుందుకు పెరట్లోకి వస్తే తండ్రిని ఆ బండతో కొట్టి చంపెయ్యాలనుకున్నాడు. భారవి తల్లి భర్తకు వడ్డిస్తూ ఎందుకండీ మీరు అందరిముందూ వాడిని చిన్నబుచ్చి మాట్లాడుతారట.వాడు అంతబాగా కవిత్వం వ్రాస్తూంటే మెచ్చుకోకపోగా వాడికేమీ తెలియదని అంటున్నారట. వాడు చాలా బాధపడుతున్నాడు. అని అంటూంది. దానికి భారవి తండ్రి నవ్వి పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?పిల్లలను తండ్రి పొగిడితే వాళ్లకి ఆయుక్షీణమంటారు.పైగా నేనుకూడా పొగిడితే వాడికి తనకన్నీ తెలుసనీ గర్వము వచ్చేస్తుంది.అది వాడి అభివృద్ధికి మంచిది కాదు.అని అంటున్నాడు. వారి సంభాషణ విన్న భారవి తాను చేయబోయిన పని తలుచుకుంటే సిగ్గేసింది ఇలాటి తండ్రినా తాను చంపాలనుకుంది అని పశ్చాత్త్తాపం తో రగిలి పోయాడు.వెంటనే ఆ బండరాయిని అక్కడే పడవేసి,తండ్రిదగ్గరికి వెళ్లి తనను క్షమించమని కాళ్ళమీద పడ్డాడు.తాను చేయబోయిన పనికి తనకు ఏదైనా శిక్ష వెయ్యమని ప్రాధేయ పడ్డాడు.తండ్రి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం వేరే లేదు పరవాలేదులే యని ఊరడించాడు. లేదు నాన్నగారూ నాకు శిక్ష పడి తీరవలిసిందే. అని పట్టు బట్టాడు.


 అప్పుడు తండ్రి సరే అయితే నీ భార్య పుట్టింట్లో వుంది కదా! నీవు అక్కడికి వెళ్లి ఎవరికీ 

 నీ భార్యకు కూడా ఏమీ చెప్పకుండా ఆరునెలు వుండి రా అదే నీకు శిక్ష అన్నాడు.  

ఇంత చిన్న శిక్షనా? అని అడిగాడు. ఆయన నవ్వి అది చాలులే వెళ్ళు అన్నాడు.

 భారవి కవి తన తండ్రి తనకు వేసిన శిక్ష ప్రకారం


అత్తవారింట్లో ఆరునెలలుండడానికి వెళ్ళాడు. అక్కడ అత్తవారింట్లో కొన్నాళ్ళు అల్లుడు వచ్చాడని రోజుకొక రకం పిండివంట చేసి పెట్టారు. ఎన్నాళ్ళకీ అల్లుడు కదలక పోయేసరికి అన్ని మర్యాదలూ పోయి పొలం పనులకు కూడా పంపేవారు.భారవి అవమానాలన్నీ భరిస్తూ వుండి పోయాడు. ఇంతలో శ్రావణమాసం వచ్చింది. భారవి భార్య

మంగళగౌరీ వ్రతం చేసుకుందా మని వ్రతానికి కావాల్సిన సరుకులకు తల్లినడిగింది.

తల్లి ఈసడింపుగా నీమొగుడు ఒక మహాకవి గదా! సరుకులకు డబ్బులిమ్మని ఆయన్నే అడుగు అని అంది.ఆమె బాధపడుతూ భర్తతో ఆ విషయము చెప్పింది. భారవి బాధపడి


ఒక తాటాకుమీద పై శ్లోకం వ్రాసి యిది నేనిచ్చానని అంగడివానికిచ్చి సరుకులు తెచ్చుకోమని చెప్పాడు. ఆమె ఆశ్లోకం ఆ వర్తకుడికిచ్చింది. అతను బాగా చదువుకున్నవాడు. ఆ శ్లోకం చదివి సంతోషించి కావలిసిన సరుకులిచ్చి పంపాడు.ఆ తాటాకును పటము కట్టి గోడకు తగిలించుకున్నాడు.


తరువాత కొన్నాళ్ళకు ఆ వర్తకుడు వాణిజ్యం చేయుటకు విదేశాలకు వెళ్ళాడు.అప్పుడు


అతనికి 12 ఏళ్ళ కొడుకున్నాడు. విదేశాలకు వెళ్లి 5 ,6 ఏళ్లకు తిరిగి వచ్చాడు. అతను వచ్చేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. భార్యను లేపడమెందుకని పెరటివైపు గోడ దూకి యింట్లోకి ప్రవేశించాడు. 


గదిలోకి వెళ్లి చూసేసరికి తనభార్య పక్కన ఒక యువకుడు పడుకొని ఉండడం చూశాడు. నేను లేకపోయే సరికి యిది ఎవరినో బాగా మరిగింది అనుకొని మొలలో వున్న కత్తి తీసి భార్యను పొడవబోయాడు. ఆకత్తి గోడనున్న పటానికి తగిలింది. అప్పుడు అతను ఆ శ్లోకం చదివి తొందరపడకూడదని కత్తి మొలలో దోపి

భార్యను లేపాడు. ఆమె లేచి భర్తను చూసి ఆశ్చర్య పోయింది. 


ఇతడెవరని ఆ యువకుని చూపించి అడిగాడుఆ వర్తకుడు . దానికి ఆమె మన కుమారుడే నండీ రాత్రి కొంచెం సుస్తీ చేస్తే మందు రాస్తూ యిక్కడే పడుకుండి పోయాను అన్నది. 


అతడు తప్పిన ప్రమాదానికి సంతోషించి భారవి వ్రాసి యిచ్చిన శ్లోక వల్ల కదా యింత ప్రమాదం తప్పిందనుకొని భారవిని అపార ధనరాసులతో సత్కరించాడు.


 భారవి తన తండ్రి పెట్టిన గడువు పూర్తయినందున అత్తవారి దగ్గర సెలవు తీసుకొని, భార్యతోనూ,తనకు లభించిన అపారసంపదతోనూ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.త్వరలోనే దేశమంతా ఆ శ్లోకమున్న కిరాతార్జునీయమనే కావ్యముద్వారా అతనిని మహాకవిగా గుర్తించింది.


     అది భారవి పేర పంచమహా కావ్యాల్లో నాల్గవదిగా గుర్తింపు పొందింది.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఆదివారం 24 ఆగస్టు 2025🌞*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌞ఆదివారం 24 ఆగస్టు 2025🌞*

                       4️⃣1️⃣

                   *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


         *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


*సప్త ద్వీపాల, సప్త సముద్రాల ఆవిర్భావం: భూమి నైసర్గిక స్వరూపం*

                 

```

స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు, బ్రహ్మ ఆదేశానుసారం, తనకు మనస్సులో తపస్సు చేయాలని కోరిక ఉన్నప్పటికీ, రాజ్యపాలన చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా సుఖంగా రాజ్యపాలన చేస్తూ, విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల సంతానం-పదిమంది కొడుకులను, ఒక కూతురును పొందాడు. రాజ్యపాలన చేస్తున్న రోజుల్లో ఒకనాడు, సూర్యుడు మేరుపర్వతానికి ఒకవైపున చీకటి కలిపించే సందర్భంలో, ఆ చీకటిని పోగొట్టడానికి, సూర్యుడి రథంతో సమానమైన వేగం, తేజస్సు కలిగిన రథాన్ని ఎక్కి, రాత్రులను పగలుగా చేస్తానని ఏడు రోజులపాటు రెండో సూర్యుడిలాగా రథాన్ని పోనిచ్చాడు. రథ చక్రం తాకిడికి భూమ్మీద గోతులు ఏర్పడ్డాయి. అవే సప్తసముద్రాలయ్యాయి. ఆ సముద్రాల మధ్య భాగం ఏడు దీపాలయ్యాయి. మేరుపర్వతం చుట్టూ ప్రియవ్రతుడు తన రథంతో ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు కాబట్టి సముద్రాలు, ద్వీపాలు సప్త సంఖ్యలో వచ్చాయి.


ఆ సప్త ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం. వీటిలో జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమితి కలది. అక్కడి నుండి ఒక్కొక్క ద్వీపం ముందుదాని కంటే తరువాతది రెండు రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక సప్త సముద్రాలు ఇవి: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత(నేటి) సముద్రం, పాల సముద్రం, దధి (పెరుగు) సముద్రం, జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగడ్తల లాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఇంకొకటి కలిసి పోకుండా, సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా ఏర్పడడం చూసి, సకల జీవులూ విస్తుపోయాయి.


ఈ భూమి ఒక పద్మం. దానికి మధ్యన జంబూద్వీపం ఉన్నది. దీని పొడుగు లక్ష యోజనాలు. వెడల్పు లక్ష యోజనాలు. ఇది తామర ఆకులాగా గుండ్రంగా ఉంటుంది. ఈ ద్వీపంలో వర్షాలు అనే విభాగాలున్నాయి. ఇవి తొమ్మిది. ఒక్కొక్క వర్షానికి వైశాల్యం తొమ్మిది వేల యోజనాలు. ఈ వర్షాలను విభజిస్తూ ఎనిమిది పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. తొమ్మిది వర్షాలలో మధ్యదాని పేరు ''ఇలావృతం'. దీనికి మధ్యభాగంలో బంగారు రంగుతో 'మేరు పర్వతం' ఉంది. భూమి అనే పద్మానికి నడుమ మేరు పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అది పద్మానికి మధ్యన ఉండే బొడ్డులాగా శోభిస్తూ ఉంటుంది. మేరువు కులపర్వతాలకు రాజు లాంటిది. దాని స్థితి దేవతలకే అర్థంకాకుండా, అంతుపట్టకుండా, విడ్డూరం కొల్పుతూ ఉంటుంది.


(ఇలావృతం అంటే భూమి చేత ఆవరించబడ్డదని. భూగోళానికి నడిమి భాగం నాభి. ఇది భూగర్భానికి, భూమధ్యరేఖకు సూటిగా ఉంటుంది. మేరువు అంటే ఇరుసు, అంటే భూపరిభ్రమణానికి కేంద్రం, అని అర్థం. దేవతలు కూడా మేరువు మహిమకు ఆశ్చర్యపడతారంటే, భూపరిభ్రమణం ఎలా జరుగుతుందో ఎవ్వరికీ అంతుచిక్కని పరమేశ్వరుడి లీల).


 *భూమి నైసర్గిక స్వరూపం* 


మేరు పర్వతం ఎత్తు లక్ష యోజనాలు. దాని శిఖరం ఎత్తు పదహారువేల యోజనాలు. ఈ శిఖరం భూమిలోకి కూడా పదహారువేల యోజనాల లోతుకు చొచ్చుకుని ఉంటుంది. ఈ శిఖరం వైశాల్యం 32 వేల యోజనాలు. మేరువుకు ఉత్తరం వైపు నీలం, శ్వేతం, శృంగవత్తుఅనే పర్వతాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇవి రెండు వేలయోజనాల విస్తీర్ణం ఉంటాయి. ఇవి తూర్పు పడమరలకు, దక్షిణ ఉత్తరాలకు విస్తరించి ఉన్నాయి. ఇదొక రమ్యమైన దృశ్యం! ఈ 'నీలశ్వేతశృంగవత్తు' పర్వతాలనే సరిహద్దు పర్వతాలని కూడా అంటారు. వీటికి తూర్పున, పడమరన, చిట్టచివర, ఉప్పు సముద్రాలు తాకుతూ ఉంటాయి. అంటే, తూర్పు పశ్చిమాల వైపు ఉప్పు సముద్రాలు తాకేవరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయన్నమాట. ఇవి ఉత్తరం వైపు ఒకదానికంటే మరొకటి పదవ వంతు పొడుగు తగ్గుతూ ఉంటాయి. వీటి మధ్య ప్రదేశంలో రంయకం, హిరణ్మయం, కురు అనే పేర్లుకల వర్షాలున్నాయి. అవి తొమ్మిదివేల యోజనాల మేర విస్తరించి ఉన్నాయి. ఉప్పు సముద్రాల దాకా ఇవి వ్యాపించి ఉన్నాయి. 'నీలశ్వేతశృంగవత్తు' పర్వతాల మధ్యనున్న కొలతలలో సరిపడి ఉంటుంది ఈ వర్షాల విస్తీర్ణం.


ఇలావృత వర్షానికి దక్షిణం వైపున నిషధం, హేమకూటం, హిమవంతం అనే పర్వతాలున్నాయి. అవి సరిహద్దు పర్వతాలు. తూర్పు నుండి పడమరకు పొడవుగాను, ఉత్తరంనుండి దక్షిణానికి వెడల్పుగాను నీలాది పర్వతాల మాదిరిగానే ఇవీ నెలకొని ఉంటాయి. ఈ పర్వతాల మధ్య ప్రదేశంలో మూడు వర్షాలున్నాయి. కింపురుష వర్షం, హరి వర్షం, భరత వర్షం ఆ మూడిటి పేర్లు. ఇలావృత వర్షానికి పడమట మాల్యవంత పర్వతం, తూర్పున గంధమాదన పర్వతం సరిహద్దు గిరులు. ఈ పర్వతాలు రెండూ, ఉత్తరం వైపు నీలం, దక్షిణం వైపు నిషధం అనే పర్వతాల వరకు పొడవుగా ఉంది. రెండువేల యోజనాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఆ మాల్యవంత, గంధమాదన గిరులు కేతుమాల వర్షానికి, భద్రాశ్వ వర్షానికి హద్దును నిర్దేశిస్తున్నాయి.


మేరు పర్వతానికి నాలుగు దిక్కులలో నాలుగు పర్వతాలున్నాయి. అవి: తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పశ్చిమంలో సుపార్శ్వ పర్వతం, ఉత్తరంలో కుముద పర్వతం. ఇవి ఒక్కొక్కటి పదివేలయోజనాల ఎత్తు, పదివేలయోజనాల వైశాల్యం కలిగి ఉన్నాయి. ఇవి మధ్యలో ఉన్నతంగా, స్తంబంలా ఉన్న మేరువుకు చుట్టూ నాలుగు చిన్న స్తంబాలలో ఉంటాయి. ఈ నాలుగు పర్వతాలలో (మందరం) మామిడి, (మేరువు) నేరేడు, (సుపార్శ్వం) కదంబ, (కుముదం) మర్రి చెట్లు బాగా ఎత్తుగా పెరిగి పతాకాలలా ఉంటాయి. ఈ చెట్లు పదకొండు యోజనాల ఎత్తు,అంతే వైశాల్యంతో ఉంటాయి. ఈ పర్వతాల శిఖరాలమీద నాలుగు మడుగులున్నాయి. మందర పర్వత శిఖరం మీద పాలతో నిండిన మడుగు, మేరువులో తేనె నిండిన మడుగు, సుపార్శ్వంలో చెరకు రసం నిండిన మడుగు, కుముదంలో మంచినీళ్లు నిండిన మడుగు ఉన్నాయి. వాటిల్లో నిష్టగా స్నానం చేసినవారు సహజమైన సిద్ధుల వైభవాన్ని పొంది ఉంటారు. ఈ పర్వత శిఖరాల మీద నాలుగు ఉద్యానవనాలున్నాయి. ఇవి దేవోద్యానాలు, నందనం, చైత్రరథం, వైభ్రాజికం, సర్వతోభద్రం అని ఆ వనాల పేర్లు. వీటిలో దేవతా శ్రేష్ఠులు అప్సరసలతో కలిసి, గంధర్వ గానాన్ని వింటూ విహరిస్తారు.


మందర పర్వతం చివరనున్న మామిడి చెట్ల పళ్లు కొండమీద రాలి, చితికి, వాటి రసం అద్భుతమైన నదీ ప్రవాహంగా మారింది. దాని పేరు అరుణోదం లేదా అరుణోనది. ఆ నదిలో పార్వతీదేవికి అనుచరులైన పుణ్యస్త్రీలు స్నానం చేస్తారు. మేరు పర్వతాల మీద ఉన్న నేరేడు చెట్ల జంబూఫలాలు మగ్గి వాటంతట అవే రాలిపోయి, చిట్లి, ఆ రసం అమృత ప్రవాహంలాగా పారుతుంది. ఆ జంబూ ఫలాల రస ప్రవాహమే జంబూ నది. ఇది ఇలావృత వర్గానికి దక్షిణాన భూముల్లో ప్రవహిస్తుంది. ఆ నదీజలాల ఇసుక జంబూ నదీ రసంతో తడపబడి సూర్య కిరణాలకు, గాలికి బంగారంగా మారుతుంది. అందుకే స్వచ్ఛమైన బంగారానికి 'జాంబూనదం' అన్న పేరు వచ్చింది. దేవతలలో ముఖ్యులు ఈ జాంబూనదాన్ని ఆభరణాలుగా ధరిస్తారు. ఈ బంగారం మంచి వన్నె కలది. సుపార్శ్వ పర్వతం పైకొన నుండి ఐదు తేనె ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఐదు ముఖాలుగా ఆ ప్రవాహం సాగుతుంది. ఈ ధారలు ఇలావృత వర్షం పడమటి భాగాన్ని తడుపుతూ వుంటాయి. కుముద పర్వత శిఖరం మీద పుట్టిన ఒక పెద్ద మర్రిచెట్టు (శతవల్మ) కొమ్మల నుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం, విశిష్టమైన అన్నం కిందకు ఇలావృత వర్షం మీదకు జారుతాయి. అలాగే మానవుల కోర్కెలు తీర్చడానికి, బట్టలు, మంచాలు, ఆసనాలు, నగలు మొదలైన వస్తువులు ఇలావృత వర్షం మీద కుముద పర్వతం నుంచి వచ్చి పడతాయి.


మేరు పర్వతానికి చుట్టూ కురంగ, కురర, కుసుంభ, వైకంకత, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, శితివాస, కపిల, శంఖ (వైదూర్య, చారుది, హంస, విహంగ, ఋషభ, నాగ, కాలంజర, నారదాది) పర్వతాలుంటాయి. తూర్పు వైపున జఠరం, దేవకూటం అనే పర్వతాలున్నాయి. పశ్చిమాన పవన, పారియాత్రాలనే పర్వతాలున్నాయి. ఇవి ఒకదానికొకటి పద్దెనిమిది వేల యోజనాలు దక్షిణం నుండి ఉత్తరానికి పొడవుగా వ్యాపించి ఉంటాయి. తూర్పు నుండి పశ్చిమానికి రెండువేల యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. మేరువుకు దక్షిణ భాగంలో కైలాస, కరవీర పర్వతాలున్నాయి. ఉత్తర భాగంలో త్రిసృంగ, మకర పర్వతాలున్నాయి. వీటి పొడవు వెడల్పులు కూడా పై పర్వతాల ప్రమాణంలోనే ఉంటాయి. మేరునగానికి ఇలా ఎనిమిది పర్వతాలూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ఉంటాయి. మేరు శిఖిరంలో మధ్య భాగాన పదివేల యోజనాల వెడల్పు, అంతే ప్రమాణం పొడవు ఉండి (సమచతురస్రంగా) బంగారుమయమైన ఒక పట్టణం ఉంది. దాని పేరు బ్రహ్మ పురం లేదా శాతకౌంభి. ఈ బ్రహ్మ పురానికి ఎనిమిది దిక్కుల్లోనూ 280 వేల యోజనాల లోకపాలకుల పురాలున్నాయి. వాటి పేర్లు: అమరావతి, తేజోవతి, సంజ్ఞమణి, కృష్ణాంగన, శబ్దావతి, గంధవతి, మహోదయ, యశోమతి.


బ్రహ్మ పట్టణంలో పూర్వం హరి వామనావతారం ఎత్తి ఎదిగినప్పుడు ఆ త్రివిక్రముడి కాలిగోటి దెబ్బకు ఉర్ద్వందం పగిలిపోయింది. ఇలా పగిలిన బ్రహ్మాండం పై భాగంలో కన్నం పడి నీటిధార అండంలోకి ప్రవేశించింది. ఆ జలదార శ్రీహరి కాలిని తాకడం వల్ల సకల జనుల పాపాల్ని నశింప చేస్తూ,'భగవత్పది' (విష్ణుపది) అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఆ పుణ్యధార చాలాకాలం స్వర్గంలో విహరించింది. అదే విష్ణుపదం (ఇది ద్యులోకం). ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు ఉండే మండలం అదే. భగవత్పది ధ్రువమండలం చేరి కొన్ని యుగాలయింది. ధ్రువమండలానికి కింద సప్తర్షిమండలం ఉంది. సప్తర్షులూ ఆకాశగంగను తమతమ జటాజూటాలలో ధరిస్తూ ఉంటారు. ఆ నది అక్కడ నుండి అసంఖ్యాకమైన విమానాలు ఆవరించి, కిక్కిరిసి ఉన్న మార్గాల గుండా వచ్చి, విశాలమైన దేవయాగ మార్గం ద్వారా చంద్ర మండలాన్ని చుట్టి, తడిపి, మేరు పర్వత శిఖరమందున్న బ్రహ్మలోకం మీద పడుతోంది. అక్కడ నాలుగు ద్వారాలలోనూ నాలుగింటిగా విడిపోతుంది. విష్ణుపదికి ఇక్కడా నాలుగు పేర్లున్నాయి. అవి: సీత, అలకనంద, చక్షువు, భద్ర. ఈ నాలుగు నదులూ దీర్ఘంగా ప్రవహించి ఉప్పు సముద్రంలో కలుస్తాయి. ఇలా ప్రవహిస్తోంది విష్ణుపది.


నాలుగింటిగా విడిపోయి ప్రవహిస్తున్న ఈ నది పాయలలో సీతానది తూర్పు వైపు ప్రవహిస్తుంది. బ్రహ్మసదనం నుండి కేసర పర్వత శిఖరాలమీద పడి కిందకు పారి, గంధమాదన పర్వతం శిఖరాల పైభాగంలో పడి భద్రాశ్వవర్షాన్ని ఏలుతూ తూర్పున ఉప్పు సముద్రంలో ప్రవేశిస్తోంది. చక్షువు అన్న పేరుతో ప్రసిద్ధి పొందిన నది పశ్చిమ ద్వారం నుండి వచ్చి మాల్యవత్పర్వతం మీద పడి, అటునుండి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి పడమటి లవణ సాగరంలో కలుస్తుంది. భద్ర నది తన సాటిలేని ప్రవాహంతో ఉత్తరద్వారం నుండి వచ్చి కుముద, నీల శ్వేతాఖ్య పర్వత శిఖరాల మీద క్రమంగా ప్రవహించి, శృంగపర్వతానికి వచ్చి, మానసోత్తరాలైన కురు భూములను పవిత్రం చేస్తోంది. అలా వచ్చి ఉత్తరపు ఉప్పు సముద్రంలో లీనమవుతున్నది. అలకనంద నది బ్రహ్మ సదనం నుండి దక్షిణంగా ప్రవహిస్తోంది. వెళ్లడానికి అసాధ్యమైన పర్వతాల మీదకు పోతుంది. హేమకూట, హిమకూట పర్వత శిఖరాలను త్రుళ్లి పడుతూ తాకి, మహావేగంతో కర్మ క్షేత్రమైన భారత వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి దక్షిణపు లవణ సముద్రంలో కలుస్తున్నది. అలా లోకంలో మేరువు మొదలైన పర్వతాలకు పుత్రికలై జన్మించిన పుణ్యతీర్థాలు (నదులు) వేలాదిగా ఉన్నాయి.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


         *రచన: శ్రీ వనం* 

  *జ్వాలా నరసింహారావు*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఆదివారం*🌞 *🌹24 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞

  *🌹24 ఆగస్టు 2025🌹*      

     *దృగ్గణిత పంచాంగం* 

               

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి  : పాడ్యమి* ప 11.48 వరకు ఉపరి *విదియ*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : పుబ్బ* రా 02.05 వరకు ఉపరి *ఉత్తరఫల్గుణి (ఉత్తర)*

*యోగం : శివ* మ 12.30 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : బవ* ప 11.48 *బాలువ* రా 12.07 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.30*

అమృత కాలం  : *రా 07.22 - 09.03*

అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.35*

*వర్జ్యం      : ఉ 09.18 - 10.59*

*దుర్ముహూర్తం  : సా 04.46 - 05.36*

*రాహు కాలం   : సా 04.52 - 06.26*

గుళికకాళం       : *మ 03.18 - 04.52*

యమగండం     : *మ 12.10 - 01.44*

సూర్యరాశి : *సింహం*           

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 06.01*

సూర్యాస్తమయం :*సా 06.36*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 05.53 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.54*

మధ్యాహ్న కాలం    :     *10.54 - 01.25*

అపరాహ్న కాలం    : *మ 01.25 - 03.56*


*ఆబ్ధికం తిధి         : భాద్రపద శుద్ధ విదియ*

సాయంకాలం        :  *సా 03.56 - 06.26*

ప్రదోష కాలం         :  *సా 06.26 - 08.44*

రాత్రి కాలం           :*రా 08.44 - 11.47*

నిశీధి కాలం          :*రా 11.47 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.07*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞* 


*ఓం అగ్నితేజోజ్జ్వల* 

*జ్వాలామాలినే* 

*మణికుంభాయ*

*హుం ఫట్ స్వాహా ।*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

23, ఆగస్టు 2025, శనివారం

పోలాల అమావాస్య

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 పోలాల అమావాస్య రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకొనే పెద్ద పండుగ. పోలాలమ్మ దేవత వ్రతం చాలా మంది ఆచరిస్తారు. అసలు పోలాల అమావాస్య అంటే ఏమిటి, ఆ వ్రతం చేస్తే వచ్చే ఫలితమేమిటో వివరంగా తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. శ్రావణ మాసంలో ఇది చివరి పండుగ. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

పోతన అక్షర చిత్రం! శ్రీమన్నారాయణుని వైభవం!

 శు భో ద యం 🙏


పోతన అక్షర చిత్రం!

శ్రీమన్నారాయణుని వైభవం!

   

       ఆంధ్రవాఙ్మయప్రపంచంలో విచిత్రాలేన్నో? అందులో ఇదియొకటి.

సహజ పాండిత్యమండితుడైన పోతన

మహాకవి భాగవతానువాదమున చిత్రించిన శబ్దచిత్రాలెన్నో? అవిగాక ఇదియొకటి.

          శ్రీమన్నారాయణుని మహిమాభిరామమైన విశ్వరూపసందర్శనా చిత్రమును ప్రదర్శంచినాడు.నారాయణ శతకమున సూక్ష్మముగాపరిశీలించిన నిది శ్రీమన్మారాయణసూక్త ప్రదర్శనమే!!

సకలభువన సమన్విత చరాచర ప్రకృతి 

యంతయు నతనిసామ్రాజ్యమే!గదా!

పరికింపుడు.


"ధరసింహాసనమై,నభంబుగొడుగై,తద్దేవతల్ భృత్యులై/

పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండమాకారమై/

సిరిభార్యామణియై, విరించికొడుకై,శ్రీగంగ సత్పుత్రియై/

వరుసన్నీఘనరాజసంబుదెలుపన్ వర్ధిల్లు నారాయణా!"

--నారాయణశతకం:బమ్మెఱపోతన;


     అత్యద్భుతమైన యీపద్యం శ్రీ మన్నారాయణుని యనంత వైభవానికి అద్దంపడుతోంది.

         చక్రవర్తిత్వసూచకంగా సింహాసనం, ఛత్రం. మహారాణి ,పరివారం, వందిమాగధులు,

భృత్యకోటి, మొదలైనవి రాజలాంఛనాలు. అవన్నీ ఈచిత్రంలో నారాయణునకు పొందుపరిచాడు కవి.

ఇగో ఇలాగ,


        "సర్వభూతధాత్రి ధరిత్రి సింహాసనము, నిర్గుణపరబ్రహ్మ స్వరూపమైన ఆకాశము ఛత్రము. , దేవతలందరూ సేవకులుకాగా, విరించి ముఖోధ్భూతములగుచున్న వేదములే వందిగణములు(పొగడువారు)కాగా, చరాచర ప్రపంచమంతయూ స్వరూపమైయొప్పారగా , సకలసంపదలకాణాచి శ్రీలక్ష్మి మహారాణియైసహపీఠమునలంకరింప సకలజీవులసృష్టికికారకుడగు విధాత పుత్రుడై విలసిల్లగా, పరమపునీత గంగ సత్పుత్రియై , యాతని ఘనమైన వైభవమును వెల్లడించుచుంగా శ్రీమన్నారాయణుడున్నాడట!. ఆహా ఏమావైభవము!!


              మహనీయమైన ఇట్టిచిత్రరాజమును చిత్రింపగలవారెవ్వరు?ఆఘనత పోతనకేదక్కినది.మిత్రులారా! మనలోచనములతోగాక ,ఆలోచనాలోచనాలతో నాలోకింపుడు.కవియూహకు అబ్బురపాటుకలుగకమానదు.అదే రసానందము.అదే రసౌవైసః అన్నవేదసిధ్ధాంతరహస్యము.

                                  స్వస్తి!


🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

విశ్వేశ్వరా

 శు భో ద యం 🙏


విశ్వేశ్వరా!!


శా.

నీ విన్నాణము చిత్రమే, మకుటరత్నీభూతజైవాతృకా!/

గ్రైవేయీకృతకాద్రవేయ! గళరుద్రాక్షీభవద్బాడబా!/

సేవాస్వీకృత భూత రాక్షస పిశాచీప్రేత! నేత్ర ప్రభా/

శ్రీవిన్యస్త కృశాను! పార్వతమృగాక్షీదార! విశ్వేశ్వరా!

23

     -కవిసామ్రాట్. విశ్వనాధసత్యనారాయణ.


        మనం నేడు విశ్వనాధ వారి విశ్వేశ్వర శతకంలోని ఈపద్యం పరిశీలిద్దాం

       చిత్రవిచిత్రమైన ఊహలకు వ్యంగ్య

మర్యాదలకు ఆటపట్టైన శతక మిది.

విశ్వప్రతిభకు ముకురాయమానం.

          

               "కిరీటంలో తురాయిగా చంద్రుని అలంకరించుకోవటం.కంఠ హారంగా వాసుకిని అలంకరించుకోవటం,

మెడలో రుద్రాక్షగా గరళాన్ని నిలుపుకోవటం, సేవక సముదాయంగా

భూతప్రేత పిశాచములను నియమించటం, తృతీయ నేత్రంగా ఫాలభాగాన అగ్నినిధరించటం, కోయపిల్ల పార్వతిని భార్యగా స్వీకరించటం, ఏవిటయ్యా?ఈతిక్కపనులు?

        అంటూ హేళన జోడించి వ్యంగ్యంగా విశ్వరుని మహిమలను నుతించటం ,విశ్వనాధకుదక్క ,మరెవరికి సాధ్యం?

    మహాకవీ! నీకూ, నీప్రతిభకూ,

శత సహస్ర వందనాలు!!


                       స్వస్తి !!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శనివారం 23 ఆగస్టు 2025🍁*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁శనివారం 23 ఆగస్టు 2025🍁*

                      4️⃣0️⃣

                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


         *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


        *పిండోత్పత్తి క్రమం*                

```

జీవుడికి పూర్వ జన్మలో చేసుకున్న కర్మానుసారం తిరిగి పునర్జన్మ ఇచ్చే మహానుభావుడు ఈశ్వరుడు మాత్రమే!! కాబట్టి జీవుడు దేహ సంబంధాన్ని పొందే క్రమంలో పురుషుడి వీర్యంగా మారి స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి 'కలిల'మై (శుక్ర-శోణిత సంయోగం), అయిదు రాత్రులకు 'బుద్బుద' మై (బుడగ), పదవ దినానికి రేగు పండంత అయ్యి. ఆ పైన మాంస పిండమై, ఆపై గుడ్డు ఆకారాన్ని పొందుతాడు. ఆ మీద నెలకు శిరస్సు, రెండు నెలలకు కాళ్లు - చేతులు పుడతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు కలుగుతాయి. నాల్గవ నెలకు రసం, రక్తం, మాంసం, మేధస్సు, ఆస్థి, మజ్జ అనే సప్త ధాతువులు ఏర్పడుతాయి. అయిదవ నెలకు ఆకలి దప్పికలు కలుగుతాయి. ఆరవ నెలలో మావి చేత కప్పబడి తల్లి కడుపులో కుడి భాగాన తిరుగుతూ, తల్లి తిన్న అన్నపానాదుల వల్ల తృప్తిని పొందుతాడు.


ఇక అక్కడి నుండి ధాతువులు (వాత, పిత్త, శ్లేష్మాలు) కలిగి, సూక్ష్మ జీవులతో నిండిన మలమూత్రాదుల గోతులలో తిరుగుతూ, క్రిములు పాకి భాద పెటుతుంటే మూర్చలో మునిగిపోతాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రమైన రసాలతో బాధపడుతున్న శరీరావయవాలు కలవాడై మావితో కప్పబడి, బయటకు ప్రేగులతో కప్పబడి, మాతృగర్భంలో శిరస్సు వంచుకుని, వంగి పడుకుని ఉంటాడు. తన అవయవాలు కదల్చలేక పంజరంలో చిక్కుకున్న పక్షిలాగా ఉంటాడు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో పూర్వ జన్మలలో చేసిన పాపాలను తలచుకుని దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ, కొంచెం సుఖం కూడా లేకుండా ఉంటాడు.


ఏడవ నెలలో జ్ఞానం కలిగి, కదలికలు ప్రారంభమై, మలంలోని క్రిములతో కలసి ఒక్క దిక్కున ఉండకుండా, గర్భంలో సంచరిస్తూ, ప్రసూతి వాయువులకు కంపించిపోతూ ఉంటాడు. అప్పుడు దేహాత్మ దర్శనం కలిగి, తిరిగి గర్భవాస దుఃఖానికి చింతిస్తూ, బంధన రూపములైన సప్త ధాతువులతో బద్దుడై, రెండు చేతులు జోడించి, దీనవదనుడై, జీవుడు తాను ఎవ్వనిచే గర్భవాసవ క్లేశాన్ని అనుభవించడానికి నియమించబడ్డాడో ఆ సర్వేశ్వరుడిని స్తుతిస్తాడు. ఇలా స్తుతిస్తూ, స్వచ్చమైన జ్ఞానం కలవాడైన జీవుడు గర్భం నుండి బయటకు రాకుండా తొమ్మిది మాసాలు గడుపుతాడు. ఆ తరువాత పదవ మానం రాగానే జీవుడు అధోముఖుడై ఉచ్చ్వాస నిస్స్వాసాలు లేకుండా దుఃఖంతో బాధపడుతూ, జ్ఞానాన్ని కోల్పోయి, రక్తసిక్తమైన శరీరంతో క్రిమిలాగా నేలమీద పడి ఏడుస్తూ జ్ఞానహీనుడై జడుడి లాగా అయిపోతాడు. తన భావాన్ని అర్ధం చేసుకోలేని ఇతరుల వల్ల పెంచబడుతూ, తన కోరికలను చెప్పుకోలేక, అనేక పురుగులతో కూడిన ఒక పక్కమీద పడుకుంటాడు. అవయవాలలలో ఎక్కడ దురద వేసినా గోక్కోలేక, కూర్చోలేక, లేవలేక, నడవలేక, ఓపిక చాలక, జనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రకారం శైశవంలో ఆ అనుభవాలను పొందుతూ పెరుగుతుంటాడు జీవుడు.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన: శ్రీ వనం*

    *జ్వాలా నరసింహారావు*

  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శనివారం🚩* *🌹23 ఆగస్టు 2025🌹*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 
       *🚩శనివారం🚩*
 *🌹23 ఆగస్టు 2025🌹*      
    *దృగ్గణిత పంచాంగం*                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 
*దక్షిణాయనం - వర్షఋతౌః* 
*శ్రావణమాసం - కృష్ణపక్షం*

*తిథి  : అమావాస్య* ప 11.35 వరకు ఉపరి *భాద్రపద మాసం ప్రారంభం*
*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )
*నక్షత్రం   : మఖ* రా 12.54 వరకు ఉపరి *పూర్వఫల్గుణి (పుబ్బ)*
*యోగం : పరిఘ* మ 01.20 వరకు ఉపరి *శివ*
*కరణం  : నాగ* ప 11.35 *కింస్తుఘ్న* రా 11.37 ఉపరి *బవ*

 *సాధారణ శుభ సమయాలు:*
       *— ఈరోజు లేవు-—*
అమృత కాలం  : *రా 10.27 - 12.05*
అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.35*
*వర్జ్యం      : మ 12.35 - 02.14*
*దుర్ముహూర్తం  : ఉ 05.53 - 07.33*
*రాహు కాలం   : ఉ 09.01 - 10.36*
గుళికకాళం       : *ఉ 05.53 - 07.27*
యమగండం     : *మ 01.44 - 03.18*
సూర్యరాశి : *సింహం*                 
చంద్రరాశి : *సింహం*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం :*సా 06.37*
*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం          :  *ఉ 05.53 - 08.24*
సంగవ కాలం         :     *08.24 - 10.54*
మధ్యాహ్న కాలం    :     *10.54 - 01.25*
అపరాహ్న కాలం    : *మ 01.25 - 03.56*

*ఆబ్ధికం తిధి         : భాద్రపద శుద్ధ పాడ్యమి*
సాయంకాలం        :*సా 03.56 - 06.27*
ప్రదోష కాలం         :  *సా 06.27 - 08.44*
రాత్రి కాలం           :*రా 08.44 - 11.47*
నిశీధి కాలం          :*రా 11.47 - 12.33*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.07*
******************************
        *🌷ప్రతినిత్యం🌷*
        *_గోమాతను 🐄 పూజించండి_* 
        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*🙏!!.శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి.!!🙏*

*స్వామిన్ సుశీల సుల* 
*భాశ్రిత పారిజాత*
*శ్రీవేంకటేశచరణౌ* 
*శరణం ప్రపద్యే ॥* 

*🌹ఓం నమో వేంకటేశాయ🌹*
*****************************

*🍁శ్రీఆంజనేయ స్తుతి🍁*

*నమో ఆంజనేయం* 
*నమో దివ్య కాయం*
*నమో వాయుపుత్రం* 
*నమో సూర్యమిత్రం*

             🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹

🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><

          🌷 *సేకరణ*🌷
      🌹🌿🍁🍁🌿🌹
        *న్యాయపతి వేంకట*
       *లక్ష్మీ నరసింహా రావు*
      🌷🍃🍁🍁🍃🌷
 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మేఘసందేశం కాళిదాసు 🙏 రెండవ భాగము

 🙏మేఘసందేశం కాళిదాసు 🙏

                       రెండవ భాగము 

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞానశాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).


శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 


త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః

ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।

కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం

న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥


అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  


గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం

రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।

సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం

తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥


అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.


తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం

శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।

ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః

ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః 


అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - శ్రావణ మాసం - కృష్ణ పక్షం -‌ చతుర్థశి - ఆశ్రేష -‌‌ భృగు వాసరే* (22.08.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

21, ఆగస్టు 2025, గురువారం

మకార పంచకం

 మకార పంచకం అంటే ?

బలిమాం సాది పూజేయం విప్రవర్జా మయేరితా అని చండీ సప్తశతి వాక్యం 

పరమేశ్వరి అర్చనలో మకార పంచకము తప్పనిసరిగా ఉండాలి. మకారపంచకము అంటే తంత్రశాస్త్రాలలో


"మద్యం మాంసం తథా మత్స్యం ముద్రా మైధున మేవ చ శక్తిపూజా విధానాద్యైః పంచతత్త్వః ప్రకీర్తితః"


ఈ మకార పంచకాన్ని వాడేటప్పుడు వాచ్యార్ధిని బట్టి వస్తువులను వాడరాదు.అజ్ఞానులు బాహ్యార్ధాన్ని గ్రహించి జుగుప్సాకరము, హింసాత్మకము అయిన పనులుచేస్తున్నారు. దానివల్ల భ్రష్టులవుతారు. శక్తి సంగమతంత్రంలో


బెల్లపు పానకము - మద్యము


తెలకపిండి, గారెలు - మాంసము


వెల్లుల్లి, తిత్తిడిపదార్ధాలు - మత్స్యము


గోధుమలు మినుములచే చేయబడిన పదార్దాలు - ముద్ర


భక్ష్యభోజ్యముల కలయికే - మైధునము


అని చెప్పబడింది. ఇది కౌళాచారము మహానిర్వాణ తంత్రంలో


న మద్యం మాధవీ మద్యం, మద్యం శశికిరణ రసోద్భవం కర్మాకర్మ పశూన్ హత్వా జ్ఞానఖడ్గేన చేశ్వరీ

మనోమీనం తృతీయే చ హత్యాసంకల్ప వాసనః

భక్ష్యభోజ్యాన్నం భక్ష్య మింద్రియనిగ్రహః తాం చతుర్థాం విజానీయాత్ హంసఃసోహం శివః శక్తి శ్చైవ ఆనందనిర్మలః పంచమీంతాం విజానీయాత్


1.చంద్రబింబము నుంచి జాలువారు అమృతమే మద్యము.


2. కర్మాకర్మలను పశువులను జ్ఞానఖడ్గంతో సంహరించటమే మాంసము. 


3. మనస్సే మత్స్యము దాని సంకల్పవాసనలను హరించుటయే మత్స్య సమర్పణ.


4.ఇంద్రియ నిగ్రహమే భక్ష్యభోజ్యాలు .ఇది ముద్ర


5. హంసస్సోహం అనే మంత్రార్థమయిన శివశక్తుల కలయికే మైదునము.


ఇది సమయాచారము. అయితే జ్ఞాని అయినవాడు పరమేశ్వరిని పంచ పుష్పాలతో పూజిస్తాడు. అవి


అహింసా ప్రథమం పుష్పం పుష్ప మింద్రియనిగ్రహః దయాక్షమాజ్ఞానపుష్పం పంచపుష్పం తతః పరమ్ ॥


పరమేశ్వరిని అర్చించేవాడు సత్త్వగుణాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. అహింస, ఇంద్రియ నిగ్రహము. దయ, క్షమ, జ్ఞానము అనే ఐదు పుష్పాలతోను దేవిని అర్చించాలి. ఈ విషయాలు తెలుసుకుని పరమేశ్వరిని అర్చన చేసిన వాడికి ముక్తి లభిస్తుంది.అటువంటి సాధకుడికి మాత్రమే అమ్మ అనుగ్రహం కలుగుతుంది 

శ్రీ మాత్రే నమః

20, ఆగస్టు 2025, బుధవారం

పోతన

 🙏పోతన విశ్వ రూప సందర్శనము🙏

వామనుడు త్రివిక్రముడైన విధానం వర్ణించిన తీరు అద్భుతం. ఇది మూలంలో లేదు. పోతన మహాశయుడు సొంతంగా రచించి మనలకు కన్నులకు కట్టాడు.ఆ పద్యరాజములను చూద్దాము

.

శా. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

      నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

      నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై

      నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై!!

ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద – కనీసం మొదటి లైను ఐనా – నిలిచిపోయింది ఈ పద్యం. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన.  చేతులతో అభినయంచకుండా ఈ పద్యం బోధించలేము.చేతులతో చూపిస్తూ ముఖం ఆకాశము వైపు ఎత్తవలసినదే.

ఇంతైనాడు, మరిం తైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుని దాటి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినాడు, చూస్తుండగానే సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా బ్రహ్మాండ భాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి పూర్వం కండ్లముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పద పదానికీ పెరుగుతూపోయే క్రమతను రూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి. ఈ పద్యం మనసున పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక గ్రాఫిక్ దృశ్యం కండ్లముందు నిలిచిపోతుంది. నిజం చెప్పాలంటే 

కెమెరాలో చిత్రించి చూపించాడు. ఇంతటితో సంతృప్తి చెందలేదు. ఇంకా వివరించాలి అనుకున్నాడు 

ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, కంఠా భరణంగానూ, బంగారు భుజ కీర్తులు లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.ఈ పద్యం లో మన దృష్టి సూర్యునిపై కేంద్రీకరింప జేశాడు మీరు సూర్యుణ్ణే చూడమన్నాడు సూర్య బింబము ఎలా మారుతోందో చక్కగా చిత్రీకరించాడు 

రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై

ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్

మహానుభావుడు పోతన. భగవంతుని లీలలను వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనకి ఒళ్ళు తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు గుండెలను పట్టుకునేవిగా రూపొందుతాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవ్వన్నీ అలవోకగా జేరిపోయి ఒక మహాభక్తుని ఆంతరంగ పారవశ్యం వాటిల్లో పొంగిపొరలుతూ వుంటుంది. భాగవతంలోని అనేక ఘట్టాలు – ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షము, రుక్మిణీ కళ్యాణము, కృష్ణ లీలలు, అంబరీషోపాఖ్యానము లాంటివి – దీనికి తిరుగులేని సాక్ష్యాలు. భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ