31, ఆగస్టు 2025, ఆదివారం

సోమవారం 25 ఆగస్టు 2025🕉️*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🕉️సోమవారం 25 ఆగస్టు 2025🕉️*

                        4️⃣2️⃣

                    *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


         *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


*జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి*             

```

వర్షాలన్నింటిలోను భారత వర్షమే కర్మక్షేత్రం. ఏ వర్షంలో ఎవరు ఎలాంటి సుఖదుఃఖాలను అనుభవించినా దానికి కారణాలైన పుణ్యకర్మలనీ, పాప కర్మలనీ ఆచరించే స్థలం భారత వర్షం. మిగతా ఎనిమిది వర్షాలు పుణ్యకర్మలను అనుభవించే స్థానాలు, పుణ్యకర్మలను అనుభవించే స్థానానికి స్వర్గం అని పేరు. ఆ కర్మలో కొంతమేరకు కర్మఫలాన్ని అనుభవించి, మిగులు ఉండగా జీవులు భూమిని చేరుతూ ఉంటారు. అలా చేరి, మిగిలి ఉన్న పుణ్యఫలాలను అనుభవిస్తారు. వాటిని భౌమ స్వర్గాలని అంటారు. అలాంటి భౌమ స్వర్గాలు ఎనిమిది వర్షాలు. దానికి మూలమైన పుణ్యాన్ని ఆచరించే స్థానం భారత వర్షం. ఇక శ్రేష్టమైన భారత వర్షం కథ ఏమిటంటే:


స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు అనే కొడుకు జన్మించాడు. అతడికి అగ్నీధ్రుడు అనే కుమారుడు పుట్టాడు. అతడికి నాభి అనే వాడు పుట్టి బలి చక్రవర్తితో స్నేహం చేశాడు. సమస్త భూమండలాన్ని పాలించాడు నాభి అతడికి ఋషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడి కొడుకుల్లో పెద్దవాడైన భరతుడు ఘోరమైన తపస్సు చేసి, మనస్సును సంసార బంధాల నుండి మళ్లించి చివరకు వాసుదేవుడిని చేరుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతడి పేరుమీద 'భారతవర్షం' అని ఏర్పడి, క్రమేపీ జగత్వసిద్ధం అయింది.


ఇలావృతం మొదలుగా గల తొమ్మిది వర్గాలలోనూ భగవానుడైన నారాయణుడు అవతరించి, నిత్యం లోకాలను అనుగ్రహిస్తూ, లోకులందరికీ జ్ఞానం ఇస్తాడు. ఇలావృత వర్గానికి అధిపతి త్రిపురాలను హరించిన రుద్రుడు. భద్రాశ్వ వర్షానికి అధిపతి భద్రశ్రవుడు. హరి వర్షానికి అధిపతి నరసింహస్వామి. కేతుమాల వర్షంలో భగవానుడు కామదేవుడు (ఈయన్నే ప్రద్యుమ్నుడు అని అంటారు) అనే పేరుతో లక్ష్మీదేవికి ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. ఈ వర్షానికి అధిపతులు ప్రజాపతైన సంవత్సురిడి కుమార్తెలు, కుమారులు. కొడుకులు పగళ్లు, కూతుర్లు రాత్రులు. రమ్యక వర్షానికి అధిదేవత మత్స్యరూపంలో ఉంటాడు. అతడు హరే! ఈ వర్షాధిపతి మనువు. ఇతడు మత్స్యమూర్తిని ఆరాధిస్తుంటాడు. ఇక హిరణ్మయ వర్షం అధినేత కూర్మావతార రూపుడైన పద్మగర్భుడు శ్రీమహావిష్ణువు. పితృదేవతల అధిపతియైన అర్యముడు హిరణ్మయవర్ష పాలకుడు. ఉత్తర కురు భూములకు వరాహదేవుడు అధిపతి. భూదేవి అతడికి పూజ చేస్తుంటుంది. కింపురుష వర్షానికి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామభద్రుడు అధిపతి. భారత వర్గానికి అధిపతి నారాయణుడు. బదరికాశ్రమంలో నరుడితో కలిసి తపస్సు చేశాడు. భారత వర్షంలో ఎన్నో పుణ్యశైలాలు, గంబీరంగా ప్రవహించే అనేక నదులు ఉన్నాయి. అవి...


పుణ్యశైలాలు: మలయ పర్వతం, మంగళ ప్రస్థం, మైనాకం, ఋషభం, కూతకం, కొల్లకం, సహయం, వేదగిరి, ఋష్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రం, వారిధరం, వింధ్యపర్వతం, శుక్తిమత్పర్వతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణపర్వతం, చిత్రకూటం, రైవతకం, కుకుభం, నీలగిరి, గోకాముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి.


 *పవిత్ర నదులు:* పైన చెప్పిన పర్వతాలకు పుత్రికలైన పుణ్యనదులు: చంద్రపట, తామ్రపర్ణి, కృతమాల, వైహాయాసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ఠి, తాపి, రెవ, సురస, చర్మణవతి, వేదస్మృతి, ఋషికుల్వ, త్రిసోమ, కౌశికి, మందాకిని, యమునా, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషోమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వరుథ, వితస్త, అసిక్ని, విశ్వ అనే మహానదులు. నర్మదానది, సింధువు, శోణ అనే నదాలు భారత వర్షంలో ప్రవహిస్తున్న మహా ప్రవాహాలు. వీటిల్లో పవిత్రంగా స్నానాలు చేస్తే మానవులు ముక్తిని పొందుతారు.


భారత వర్షం ఎంతో ఉత్తమమైనదని మహాపురుషులు స్తుతిస్తారు. భారత వర్షంలో జన్మించిన వారి భాగ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. భారత వర్షంలో శ్రీహరి ఎన్నో అవతారాలను ఎత్తి, జీవులకు తత్త్వం ఉపదేశించాడు. అందువల్ల భారత వర్షంలోని జనులకు సాధ్యం కానిదేదీ లేదు. నారాయణుడిని స్మరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి. భారత వర్షంలో ఒక్క క్షణకాలం మనఃపూర్వకంగా సర్వ సంగ పరిత్యాగం చేస్తే, అతడు పురుష శ్రేష్ఠుడు అవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత వర్షం మోక్షాన్ని పొందడానికి అనువైన కర్మ భూమి, యజ్ఞాభూమి.


జంబూ ద్వీపానికి చుట్టూ లక్ష యోజనాల మేర ఉప్పు సముద్రం చుట్టి ఉన్నది. ప్లక్ష ద్వీపానికి చుట్టూ చెరకు రసం నిండిన సముద్రం ఉన్నది. అది రెండు లక్షల యోజనాల మేర చుట్టి ఉన్నది. ద్వీప మధ్య భాగంలో పక్షం అనే జువ్వి చెట్టు ఉన్నది కాబట్టి ఈ ద్వీపానికి ప్లక్ష ద్వీపం అన్న పేరు వచ్చింది. అగ్నిదేవుడు దీనికి అధిపతి. (ప్రియవ్రతుడి కొడుకు ఇధ్మజిహ్వుడు దీని పాలకుడు). ఈ ప్లక్ష ద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించడం జరిగింది. అవి శివ, యశస్య, సుభద్ర, శాంత, క్షేమ, అమృత, అభయ అనేవి.


ఈ సప్త వర్షాలకు సప్త కుల పర్వతాలున్నాయి. వాటి పేర్లు: మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం. ఈ వర్షాలకు సప్త మహానదులున్నాయి. అవి: అరుణ, నృష్ణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంబర, సత్యంభర అనేవి. ప్లక్ష ద్వీపానికి ముందు, జంబూద్వీపానికి మధ్య లవణ సముద్రం ఉన్నట్లే, ప్లక్ష శాల్మలీ ద్వీపాలకు మధ్యలో ఇక్షురస జలంతో నిండిన ఇక్షురస సముద్రం ఉన్నది. ఇది రెండు లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్షురస సముద్రానికి రెట్టింపు వైశాల్యం కలిగినది శాల్మలీ ద్వీపం.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


        *రచన: శ్రీ వనం*

  *జ్వాలా నరసింహారావు*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*                           

            🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

రాధాదేవి

 *రాధాదేవి.....* ( రాధాష్టమి సందర్భంగా]


*బృందావనంలో 'భక్తి' విశ్వరూపాన్ని చూడవచ్చు. బృందావనవాసులు కృష్ణుణ్ని తమ ఇంటిలో సభ్యుడిగా భావిస్తారు. బృందావనంలో శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతి గృహంలో పూజా మందిరంలో గాక, నట్టింట్లో ఉంటుంది. బృందావనం రాధాకృష్ణుల విహారభూమి.*


*ఈ 'రాధ' ఎవరు?- ఈ ప్రశ్నకు భాగవతంలో సమాధానం కనిపించదు. ప్రజభాగవతం రాధ కథను రసరమ్యంగా రమణీయంగా అభివర్ణిస్తుంది. 'బృందావనంలో ఇప్పటికీ రాధాదేవి నామం అన్ని సందర్భాల్లో అందరి నోటా వినిపిస్తుంది. బండి తోలేవాళ్లు సైతం అడ్డువచ్చే జనాన్ని పక్కకు తొలగమని చెప్పడానికి 'రాధే రాధే' అంటారు. తమ ఇంటిలో దేవుడున్నాడనిగాక, దేవుడి ఇంటిలో తామున్నామని భావించుకుంటారు. భక్తిరసం ప్రతి ఇంటా పొంగుతుంది.*


*లాక్షణికులు రసాలు తొమ్మిది అని పేర్కొన్నారు. వాటిలో భక్తిని రసంగా ఎవరూ చెప్పలేదు. భాగవతం విన్నవారు భక్తిరసాన్ని ఆస్వాదిస్తారు. పోతనామాత్యుడి భాగవతం* *చదివినవారెవరైనా భక్తిని రసంగా అంగీకరిస్తారు.*


*రాధాకృష్ణుల విహారభూమి బృందావనం 'ధామం' దేవతల నివాస భూమిని ధామం అంటారు. బృందావనంలో మనం సంచరించేటప్పుడు మారుమూల ప్రదేశాల్లో సైతం రాధాకృష్ణ కీర్తనం వినిపిస్తుంది. శ్రీకృష్ణుడు పూర్ణావతారమని చెబుతూ, ఆ స్వామి లీలావతారమని, ఆయనను సంకీర్తనం చేయడం ద్వారా మనకు విజయం కలుగుతుందని చైతన్య మహా ప్రభువు పలికాడు. అటువంటి కృష్ణుని చేరే మార్గం ఏది ? కృష్ణుడే స్వయంగా ఆ మార్గాన్ని చెబుతాడు- 'రాధను ధ్యానం చేయకుండా ఎవరూ నా కృపను పొందడం జరగదు... ఇది ముమ్మాటికీ నిజం'!*


*రావల్ గ్రామం బృందావన సమీపంలో ఉంది. కీర్తిదేవి వృషభానులకు రాధాదేవి కుమార్తె భాద్రపద శుద్ధ అష్టమినాడు ఈ బాలిక పుట్టినప్పుడు ఆ దివ్య బాలికను చూసి నారదుడు స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి వచ్చిన తరవాత తాను చూస్తున్నది "గోలోక నాయిక" అని గుర్తించాడు. నారదుడు రాధను స్తుతించి, ఆమె తల్లిదండ్రులను దీవించాడు. పుట్టినప్పుడు రాధకు చూపు లేదు. ఆ బిడ్డను చూడాలని బంధుమిత్రులు ప్రతిదినం వెళ్తూ ఉండేవారు. బాలకృష్ణను చంకనవేసుకొని యశోదమ్మ కూడా వెళ్లింది. యశోదమ్మ చిన్ని కన్నయ్య అమ్మ చంకలో ఉండే రాధను చూశాడు. రాధ కన్నులు తెరిచింది. ఆ గోలోక దేవత భూమిపైకి వచ్చిన తరవాత మొదటగా కృష్ణుణ్ని చూడాలనే కోరిక తీరింది.*


*రాధాదేవి పెరిగి పెద్దదై మెరుపు తీగలాగా మెరిసిపోతున్నది. కృష్ణుడు పెరిగి పెద్దవాడై జగన్మోహనుడయ్యాడు. సూర్యదేవాలయంలో ఇరువురూ కలుసుకున్నారు. రాధాకృష్ణుల ప్రేమకు రాధాకృష్ణుల ప్రేమే సాటి.*


*రాధాదేవి తులసికి పంచామృతాలతో అభిషేకించి, ప్రదక్షిణ చేసింది. తులసీదేవిని మంత్రంతో జపించేది. తులసి మాత సంతోషించి రాధాదేవికి ప్రత్యక్షమైంది. 'రాధా! నువ్వు మానవజాతిలో జన్మించిన గోలోకేశ్వరివి. నీ ప్రియుడైన కృష్ణుడితో నీకు కల్యాణం తప్పక జరుగుతుంది. బ్రహ్మదేవుడి పౌరోహిత్యంలో నీకు పెండ్లి జరుగుతుంది!' అని తులసీదేవి రాధా దేవిని దీవించింది. ఆమె చెప్పినట్లుగా బ్రహ్మ దేవుడు వచ్చి వారికి వివాహం జరిపాడు.*


*తాము గోలోక నాయికా నాయకులు అన్న సంగతిని రాధాకృష్ణులు స్మరించుకున్నారు. వారి బృందం గోవులూ గోపాలురుగా జన్మలెత్తారు. రాధాకృష్ణులు విహరించే ఆ నేల పవిత్రత సంతరించుకుంది. దివ్యానంద రసానంద ప్రదాయిని రాధాదేవిని 'రసేశ్వరి'గా భావిస్తారు.*


*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*

        *ఆధ్యాత్మిక అన్వేషకులు*

🌺📿🌺 🙏🕉️🙏 🌺📿🌺

వామ‌న జ‌యంతి*

 *వామ‌న జ‌యంతి*

*2025 సెప్టెంబ‌ర్ 4 వ తేదీ,*


 భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి నాడు వామ‌న జ‌యంతి జరుపుకుంటారు.

 విష్ణువు ఐదవ అవతారం వామనుడి అవ‌తారం.

 ద‌శావ‌తారాల‌లో పూర్తి మానవుడిగా అవ‌త‌రించిన తొలి అవ‌తారం వామ‌నావ‌తారం.


 వామ‌న అవ‌తార స‌మ‌యాన్ని పోత‌న గారు ఇలా వ‌ర్ణిస్తున్నారు...


రవి మధ్యాహ్నమునం జరింప, గ్రహతారాచంద్రభద్రస్థితిన్

శ్రవణద్వాదశినాఁడు, శ్రోణ నభిజిత్సంజ్ఞాత లగ్నంబునన్

భువనాధీశుఁడు పుట్టె, వామనగతిం బుణ్యవ్రతోపేతకున్

దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్.


పుట్టిన వెంట‌నే, త‌న అవ‌తార కార్యాన్ని నెర‌వేర్చ‌డానికి, వ‌టువు రూపంలో బ‌లి చ‌క్ర‌వ‌ర్తి య‌జ్ఞం చేస్తున్న చోటుకి వెళ్లాడు వామ‌నుడు.


వామ‌నుడిని చూసి అక్క‌డి వారు,


శంభుండో ,హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో

దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ

శుంభద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ" డంచున్ విస్మయభ్రాంతులై

సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.


అని ఆశ్చ‌ర్యంతో చూస్తున్నారు.


బ‌లి చ‌క్ర‌వ‌ర్తి ఉన్న చోటుకు చేరుకుని అత‌డిని ఇలా, ఆశీర్వ‌దించాడు వామ‌నుడు.


"స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు, హాసమాత్ర వి

ధ్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం

ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ

న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్."

అన్నాడు.

అఖండ తేజోమూర్తి అయిన వామ‌నుడిని చూసి బ‌లి చక్ర‌వ‌ర్తి ఆశ్చ‌ర్యంతో అత‌ని పుట్టుపూర్వోత్త‌రాలు అడుగుతున్నాడు.

ఎవ‌రివాడ‌వు, ఎక్క‌డుంటావు, నీ నివాసం ఏమిటి అంటున్నాడు.....

*వడుగా ఎవ్వరివాడవు?*..


వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది

య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం;

గడు ధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్

గడతేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.


నీ రాక‌తో నా వంశం పావ‌న‌మైంది, ఏం కావాలో కోరుకో అంటూ వామ‌నుడిని, బ‌లి చ‌క్ర‌వ‌ర్తి అడిగాడు.


వరచేలంబులొ, మాడలో, ఫలములో, వన్యంబులో గోవులో

హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!

 

ముందుగా తాను స‌ర్వాంత‌ర్యామిన‌ని, అన్నింటా తాన ఉంటాన‌ని, త‌న‌కు ఒక‌చోటంటూ లేద‌ని అంటాడు వామ‌నుడు,


"ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు?-

  నొక చో టనక యెందు నుండ నేర్తు;

నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు?-

  నా యంతవాఁడనై నడవనేర్తు;

నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ?-

  బూని ముప్పోకల బోవ నేర్తు;

నదినేర్తు నిదినేర్తు నని యేలఁ జెప్పంగ?-

  నేరుపు లన్నియు నేన నేర్తు;


 అంతే కాదు,, నేనంద‌రి వాడ‌నే..ఒంటి వాడ‌ను ,

 చుట్టం ఎవ‌రూ లేరు అంటాడు.


నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు

నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు

సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి

సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.


అని అంటూ త‌న‌కు మూడ‌డుగులు ఇస్తే సంతృప్తి చెందుతానంటాడు వామ‌నుడు.


ఒంటివాఁడ నాకు నొకటి రెం డడుగుల

మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;

గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద

దానకుతుకసాంద్ర! దానవేంద్ర! "


అడ‌గ‌డానికి నీకు తెలియ‌క‌పోయినా, నా అంత‌టి చ‌క్ర‌వ‌ర్తిని ఇచ్చేట‌పుడు ఘ‌నంగా ఉండాలి క‌దా ఘ‌న‌మైన‌ది కోరుకో అంటాడు బ‌లి. 

దానికి వామ‌నుడు. 


తృప్తి ఎక్క‌డికి? నాకు మిద్దెలు, మేడ‌లు, ఏనుగులు ఇవ‌న్నీ ఎందుకు ? నాకు మూడ‌డ‌గులు చాలు అంటాడు. మూడ‌డ‌గులే త‌న పాలిట బ్ర‌హ్మాండం అని ప‌లుకుతాడు వామ‌నుడు. నువ్వు రాజువు అయినంత మాత్రాన నా ఆశ‌కు హ‌ద్దులుండాలి క‌దా. నాబోటి వ‌టువుకు మిద్దెలు ,మేడ‌లు, ఏనుగులు, ర‌త్నాల రాశులు ఏం చేసుకోన‌య్యా అంటాడు., తృప్తి ఉండాలి దేనికైనా అంటాడు.


గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.


వెంట‌నే దాన‌వ గురువు శుక్రాచార్యుల వారు, వ‌చ్చిన వ‌టువు విష్ణుమూర్తి అని గ్ర‌హించి, దానం ఇవ్వ‌వ‌ద్ద‌ని, బ‌లికి సూచిస్తాడు. దానం ఇస్తే దాన‌వ వంశ క్ష‌యం అవుతుంద‌ని హెచ్చ‌రిస్తాడు. ప్రాణ ర‌క్ష‌ణ సంద‌ర్భంలో ఆడిన మాట త‌ప్పినా దోషం అంట‌ద‌న్నాడు.


*వారిజాక్షులందు...*

వారిజాక్షులందు వైవాహికము లందుఁ

బ్రాణవిత్తమానభంగమందుఁ

జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు

బొంకవచ్చు నఘము పొందఁ దధిప

అని చెప్పి,బ‌లికి న‌చ్చ‌చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు.

ఎన్ని చెప్పినా,

బ‌లి తాను ఇచ్చిన మాట త‌ప్ప‌న‌న్నాడు.

ఎంత సంపాదించినా చివ‌రికి మిగిలేదేమిట‌న్నాడు.

ఎంద‌రో రాజులు ఈ భూమండ‌లాన్ని ప‌రిపాలించారు, వారంతా ఏం మూట‌క‌ట్టుకు పోయారన్నాడు.

*కారే రాజులు...*


కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!


కాబ‌ట్టి మాట‌త‌ప్పి అప‌కీర్తి పొంద‌లేన‌న్నాడు.


సాక్షాత్తు విష్ణుమూర్తి చెయ్యి కింద దాన స్వీక‌ర్త‌గా ఉండ‌గా, తన చేయి దాత గాపైన ఉండ‌డం క‌న్న ఇంకేం కావాల‌న్నాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి.


*ఆదిన్ శ్రీసతి కొప్పుపై...*


ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,

బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ

ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?


త‌న మాట‌కు తిరుగులేదంటూ , వామ‌నుడి కాళ్లు క‌డిగి,

 దానం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి.


విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వే

దప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి!" యంచుం గ్రియా

క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర

హ్మప్రీత"మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్..


అంతే, దానం ఇచ్చిన వెంట‌నే వామ‌నుడు త్రివిక్ర‌ముడైనాడు....


*ఇంతింతై వటుడింతై*

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై

నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై

నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.


రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్


అలా.....వామ‌నుడు బ్ర‌హ్మాండాన్ని ఆక్ర‌మించేసరికి, బ‌లి నిర్ఘాంత‌పోయాడు.


“దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి-

  ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు

రంత భూమియు నొక్క యడుగయ్యె నాకును-

  స్వర్లోకమును నొక్క చరణమయ్యె;

నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు-

  గడమ పాదమునకుఁ గలదె భూమి?

యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు-

  నిరయంబు బొందుట నిజముగాదె?


రెండు, అడుగులు. ఒక‌టి భూమిపైన‌, రెండోది ఆకాశానికి స‌రిపోయింది, మ‌రి మూడో అడుగు మాటేమిటని అడిగాడు విష్ణుమూర్తి .

త‌న శిర‌స్సుమీద పెట్ట‌మ‌న్నాడు బ‌లి. బ‌లి ప‌రిస్థితిని గ‌మ‌నించి బ‌లి తాత ప్ర‌హ్లాదుడు దిగివ‌చ్చి , బ‌లి గ‌ర్వం తొల‌గింద‌ని, ఇక అత‌నిని అనుగ్ర‌హించ‌మ‌ని విష్ణుమూర్తిని వేడుకుంటాడు.


భూతలోకేశ్వర! భూతభావన! దేవ-

  దేవ! జగన్నాథ! దేవవంద్య!

తన సొమ్ము సకలంబుఁ దప్పక నీ కిచ్చె-

  దండయోగ్యుఁడు గాడు దానపరుఁడుఁ;

గరుణింప నర్హుండు గమలలోచన! నీకు-

  విడిపింపు మీతని వెఱపు దీర;

తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ-

  జేరి నీ పదము లర్చించునట్టి...


ప్ర‌హ్లాదుడు త‌దిత‌రుల కోరిక మేర‌కు బ‌లి ని అనుగ్ర‌హించి అత‌నికి ప‌ర‌మ‌పథం క‌ల్పించాడు విష్ణుమూర్తి.


పోత‌న క‌లంలో వామ‌నావ‌తార ఘ‌ట్టం మ‌నోహ‌రంగా రూపుదిద్దుకుంది. 

వామ‌న జ‌యంతి సంద‌ర్భంగా పోత‌నామాత్యుడికి మ‌రొక్క‌మారు ప్ర‌ణామాలు తెలియ‌జేసుకుందాం. 

వామ‌నావ‌తార ఘ‌ట్టం ప‌ర‌మ పావ‌న ఘ‌ట్టం

*స్వ‌స్తి*

విజయం అంటే ఏమిటి*?..... 🌹🌹🌹🌹🌹🌹🌹

 *💚*...........💚* *విజయం అంటే ఏమిటి*?.....

🌹🌹🌹🌹🌹🌹🌹

మన దేశం నుండీ ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ '' విజయం అంటే ఏమిటి? '' అని అడిగితే ఒక యువతి '' విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం , '' అనింది. 

అపుడు ఆ ప్రొఫెసర్ '' అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవుంతుడు ఎవరో చెప్పండి? '' అంటే ఎవరూ చెప్పలేదు. [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి] బ్ర్తతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు. అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.   

మరో యువకుడు లేచి '' విజయం అంటే బలం / శక్తి '' అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్ , నెపోలియన్ ,ముస్సొలిని ,హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాదెన్ ... వీళ్ళంతా బలవంతులు , ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా , వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట. 

మరో యువతి '' విజయమంటే ప్రఖ్యాతి , అందం ,'' అనింది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట .   


మరోసారి మరొకరు '' విజయమంటే అధికారం '' అని అన్నారు. అయితే '' కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి '' అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు. అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట. 


చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు - '' విజయం అంటే ఏమిటి ? '' అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , '' మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా ? '' అందరూ '' తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా ? ''అని అడిగితే అయిదారుమంది ''తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా ? '' '' తెలియదు '' అన్నారు. 

అపుడు ప్రొఫెసర్ గారు '' శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , క్రీస్తు , మహమ్మద్ ప్రవక్త తెలుసా ? '' అందరూ '' ఓ , తెలుసు '' అని ముక్తకంఠం తో బదులిచ్చారు. '' మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు ? '' 

అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అనింది : '' సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే : '

 తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , *ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే* ! '' 


'' నా గురించి నేను దు:ఖించకపోవడమే నా ఆనందానికి కారణం '' అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , '' *ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క '' [ *Only they live who live for others , the others are more dead than alive] అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే.                

🌺🌺🌺🌺🌺సర్వే జనాః సుఖినోభవంతు..

తెలుగంటే

 తెలుగంటే...వేమన

తెలుగంటే...నన్నయ

తెలుగంటే...తిక్కన

తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ

తెలుగంటే...పోతన

తెలుగంటే...అల్లసాని పెద్దన

తెలుగంటే...ఆర్యభట్టు

తెలుగంటే...త్యాగయ్య

తెలుగంటే...కేతన

తెలుగంటే...అన్నమాచార్య

తెలుగంటే...త్యాగరాజు

తెలుగంటే...తెనాలి రామకృష్ణ

తెలుగంటే...పొట్టి శ్రీరాములు

తెలుగంటే...అల్లూరి సీతారామరాజు

తెలుగంటే...కందుకూరి వీరేశలింగం

తెలుగంటే... గిడుగు రామ్మూర్తి

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...శ్రీ శ్రీ

తెలుగంటే...క్షేత్రయ్య

తెలుగంటే...శ్రీనాధ

తెలుగంటే...మొల్ల

తెలుగంటే...కంచర్ల గోపన్న

తెలుగంటే....కాళోజి

తెలుగంటే...కృష్ణమాచార్య

తెలుగంటే...సిద్ధేంద్ర

తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకర్ణి

తెలుగంటే...రాణీ రుద్రమదేవి

తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు

తెలుగంటే...రామలింగ నాయుడు

తెలుగంటే...తిమ్మనాయుడు

తెలుగంటే...రామదాసు

తెలుగంటే...ఆచార్య నాగార్జున

తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం

తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి

తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి

తెలుగంటే...సింగేరి శంకరాచార్య

తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన

తెలుగంటే...విశ్వేశ్వరయ్య

తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్

తెలుగంటే...చిన్నయ్య సూరి

తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్

తెలుగంటే...పీవీ నరసింహారావు

తెలుగంటే...రాజన్న

తెలుగంటే...సుశీల

తెలుగంటే...ఘంటసాల

తెలుగంటే...రామారావు

తెలుగంటే...అక్కినేని

తెలుగంటే...సూర్యకాంతం

తెలుగంటే...ఎస్.వీ.రంగారావు

తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు

తెలుగంటే...సరోజిని నాయుడు

తెలుగంటే...పింగళి వెంకయ్య

తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు

తెలుగంటే....టంగుటూరి ప్రకాశం

తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం

తెలుగంటే...భాస్కరుడు

తెలుగంటే...దేవులపల్లి

తెలుగంటే...ధూర్జటి

తెలుగంటే...తిరుపతి శాస్త్రి

తెలుగంటే...గుఱ్ఱం జాషువ

తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ

తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య

తెలుగంటే...కోరాడ రామచంద్రకవి

తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం

తెలుగంటే...మల్లన్న

తెలుగంటే...నండూరి

తెలుగంటే...పానుగంటి

తెలుగంటే...రామానుజం

తెలుగంటే...రావి శాస్త్రి

తెలుగంటే...రవి వర్మ

తెలుగంటే...రంగనాధుడు

తెలుగంటే...కృష్ణదేవరాయలు

తెలుగంటే...తిరుపతి వెంకటకవులు

తెలుగంటే...విశ్వనాథ

తెలుగంటే...నన్నే చోడుడు

తెలుగంటే...ఆరుద్ర

తెలుగంటే...ఎంకి

తెలుగంటే...ఆదిభట్ల

తెలుగంటే...గాజుల సత్యనారాయణ

తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ

తెలుగంటే...వెంపటి చిన సత్యం

తెలుగంటే...ఉషశ్రీ

తెలుగంటే...బాపు

తెలుగంటే...రమణ

తెలుగంటే...జంధ్యాల

తెలుగంటే...ముళ్ళపూడి

తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం

తెలుగంటే...తిలక్

తెలుగంటే...అడివి బాపిరాజు

తెలుగంటే...జక్కన

తెలుగంటే...అచ్చమాంబ

తెలుగంటే...దాశరథి

తెలుగంటే...మల్లినాథ సూరి

తెలుగంటే...భవభూతి

తెలుగంటే...ప్రోలయ నాయకుడు

తెలుగంటే...రాళ్ళపల్లి 

తెలుగంటే...కట్టమంచి

తెలుగంటే....భద్రాద్రి రామన్న

తెలుగంటే...తిరుపతి ఎంకన్న

తెలుగంటే...గోంగూర

తెలుగంటే...గుత్తోంకాయ్

తెలుగంటే...కొత్తావకాయ్

తెలుగంటే...ఉలవచారు

తెలుగంటే....పెరుగన్నం

తెలుగంటే...ముద్దపప్పు

తెలుగంటే...పండుమిరప

తెలుగంటే...తాంబూలం

తెలుగంటే...పులిహోర

తెలుగంటే....సకినాలు

తెలుగంటే....మిర్చి బజ్జి

తెలుగంటే...బందరు లడ్డు

తెలుగంటే....కాకినాడ ఖాజా

తెలుగంటే.....జీడిపాకం

తెలుగంటే...మామిడి తాండ్ర

తెలుగంటే...రాగి ముద్ద

తెలుగంటే...జొన్న రొట్టె

తెలుగంటే...అంబలి

తెలుగంటే...సంక్రాంతి

తెలుగంటే...గోదారి

తెలుగంటే...గొబ్బిళ్ళు

తెలుగంటే...గోరింట

తెలుగంటే...మాగాణి

తెలుగంటే...సాంబ్రాణి

తెలుగంటే...ఆడపిల్ల ఓణి

తెలుగంటే...చీరకట్టు

తెలుగంటే...ఓంకారం

తెలుగంటే...యమకారం

తెలుగంటే....మమకారం

తెలుగంటే...సంస్కారం

తెలుగంటే...కొంచెం ఎటకారం

తెలుగంటే...పట్టింపు

తెలుగంటే...తెగింపు

తెలుగంటే....లాలింపు

తెలుగంటే...ముక్కుపుడక 

తెలుగంటే...పంచెకట్టు

తెలుగంటే...ఇంటిముందు ముగ్గు

తెలుగంటే...నుదుటిమీద బొట్టు

తెలుగంటే...ఆంధ్ర, రాయలసీమ,తెలంగాణ

తెలుగంటే...తల్లిపాలభాష

తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం

తెలుగంటే... మన సంస్కృతి, సంప్రదాయం

తెలుగంటే... మన ఆత్మగౌరవం

తెలుగంటే...నీవు నేను మనం

తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట

తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ

తెలుంగు ఆణమంటే తెలంగాణ

జై తెలుగు తల్లీ 🙏


తెలుగు భాషా పితామహుడు *గిడుగు రామ్మూర్తి పంతులు* గారికి అంజలి ఘటిస్తూ..🙏🙏🙏

తెలుగు భాషా ప్రేమికులందరికీ....

*తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు*

వాట్సాప్ లో వచ్చిన సమాచారం .నేను వ్రాసింది కాదు

Panchaag



 

30, ఆగస్టు 2025, శనివారం

శ్రీ రామేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 1218


⚜  ఒడిస్సా : భువనేశ్వర్


⚜  శ్రీ రామేశ్వర ఆలయం



💠 ఒరిస్సాలోని ప్రశాంతమైన మరియు సాంస్కృతిక వాతావరణంలో ఉన్న రామేశ్వర్ డ్యూలా, దాని ప్రసిద్ధ సమకాలీన లింగరాజ ఆలయం కంటే తక్కువగా తెలిసినా భువనేశ్వర్‌లోని ఒక గొప్ప ఆలయంగా మిగిలిపోయింది .

 ఇది అద్భుతమైన కళింగ నిర్మాణ శైలిని సూచిస్తుంది మరియు చరిత్ర ప్రియులను మరియు భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ శివుని ఆలయాలలో ఒకటి.



💠 రామేశ్వర్ ఆలయం భువనేశ్వర్‌లోని ఒక పురాతన ఆలయం. దీనిని లింగరాజ ఆలయంలోని మౌసి మా అని పిలుస్తారు. ఇది లింగరాజ ఆలయం నుండి 2 కి.మీ దూరంలో ఉంది. 


💠 రావణుడిపై విజయం తర్వాత రాముడు లంక నుండి తిరిగి వస్తున్నప్పుడు సీత శివుడిని పూజించమని కోరినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

కాబట్టి రామచంద్రుడు ఆ ప్రయోజనం కోసం ఒక లింగాన్ని నిర్మించాడు. 


💠 సాంప్రదాయకంగా చైత్రంలో రామనవమికి ఒక రోజు ముందు వచ్చే అశోకాష్టమి సమయంలో లింగరాజ స్వామి రకుణ రథం అని పిలువబడే పెద్ద రథం ద్వారా ఈ ఆలయానికి వచ్చి నాలుగు రోజులు ఉంటాడు. చారిత్రాత్మకంగా ఈ ఆలయం 9వ శతాబ్దం నాటిది.


💠 భువనేశ్వర్‌లోని దాదాపు అన్ని పాత దేవాలయాలు శివుడికి అంకితం చేయబడ్డాయి. గర్భగుడి లోపల దుర్గాదేవి ప్రతిమ ఉంది.


💠 ఆలయం ముందు, రోడ్డుకు ఎదురుగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడి ముగ్గురు సోదరులకు అంకితం చేయబడిన మూడు ఆలయాలు ఉన్నాయి. ఈ మూడు ఆలయాలు భువనేశ్వర్‌లో నిర్మించిన పురాతన ఆలయాలు. 



💠 ఈ ఆలయాన్ని 'మౌసి మా' ఆలయం అని కూడా పిలుస్తారు.  రుకున రథ జాత్ర అనేది ప్రతి సంవత్సరం మార్చి/ఏప్రిల్ నెలలో (చైత్ర మాసంలో 8వ రోజు) ఈ ఆలయంలో నిర్వహించబడే ఒక ప్రధాన పండుగ, ఇక్కడ లింగరాజు (చంద్రశేఖర్ కాంస్య విగ్రహం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు), రుక్మిణి మరియు బసుదేవులతో కలిసి లింగరాజ ఆలయం నుండి రామేశ్వర్ ఆలయానికి అత్యంత రంగురంగుల ఊరేగింపులో తీసుకువెళతారు.


💠 ఈ పండుగను అశోకాష్టమి అని కూడా పిలుస్తారు మరియు దేవతలు రామేశ్వర్ ఆలయంలో నాలుగు రోజులు ఉండి, ఐదవ రోజు వారి స్వస్థలమైన లింగరాజ ఆలయానికి తిరిగి వస్తారు. 

రథం దాని ప్రయాణంలో మలుపు తీసుకోదు కాబట్టి ఈ పండుగను అనలూత రథ జాత్ర అని పిలుస్తారు 


💠 లింగరాజు ఏకామ్ర క్షేత్రంలో కొద్దిసేపు ఉండటానికి తన వనవాస కాలంలో రాముడిని స్వాగతించాడని పురాణం చెబుతుంది. 

రాముడు నివసించిన ప్రదేశం మౌసిమా ఆలయం లేదా రామేశ్వర్. 


💠 తన కొద్దిసేపు బస సమయంలో లింగరాజ స్వామి రాముడిని పలకరించడానికి దేవి పార్వతితో పాటు రామేశ్వర ఆలయానికి వెళ్లాడు.  

ఆ సందర్భాన్ని గుర్తుచేసుకునేందుకు అశోకాష్టమి రథజాత్ర జరుపుకుంటారు.


💠 రామేశ్వర్ ఆలయం యొక్క అత్యంత అద్భుతమైన లక్షణాలలో ఒకటి దాని సంక్లిష్టమైన శిల్పాలు. ఆలయ గోడలు రామాయణం మరియు మహాభారతం సహా హిందూ పురాణాల దృశ్యాలను వర్ణించే వివరణాత్మక శిల్పాలతో అలంకరించబడ్డాయి. 

ఈ చెక్కడాలు అలంకారంగా ఉండటమే కాకుండా భారతదేశ గొప్ప పౌరాణిక వారసత్వాన్ని వివరించే కథన సాధనంగా కూడా పనిచేస్తాయి.


💠 ఆలయ ప్రవేశ ద్వారం చుట్టూ రెండు భారీ రాతి సింహాలు ఉన్నాయి, ఇది కళింగ దేవాలయాలలో ఒక సాధారణ లక్షణం, ఇది రక్షణ మరియు బలాన్ని సూచిస్తుంది. 


💠 గర్భగుడి లోపల, ప్రధాన దేవత శివుడిని లింగం రూపంలో పూజిస్తారు. ఈ లింగం క్లోరైట్‌తో తయారు చేయబడిన వృత్తాకార యోనిపిట్టలో పవిత్రం చేయబడింది, ఇది ఆలయ నిర్మాణ ప్రాముఖ్యతను పెంచే ప్రత్యేక లక్షణం.

గర్భగుడిలో దుర్గాదేవి చిత్రం కూడా ఉంది, ఇది ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది.



💠 ప్రసిద్ధ లింగరాజ ఆలయం నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరాన్ని తరచుగా మౌసిమా  ఆలయం అని పిలుస్తారు, ఇది పెద్ద లింగరాజ మందిరంతో దాని సంబంధాన్ని సూచిస్తుంది.


రచన

©️ Santosh Kumar

నెమలీకలు - జైనులు

 నెమలీకలు - జైనులు


ఢిల్లీకి చెందిన ఆర్.కె. రంగన్ పరమాచార్య స్వామికి పెద్ద భక్తుడు. దర్శనానికి వచ్చిన ప్రతిసారీ, నెమలీకలతో చేసిన విసనకర్రను తెచ్చి స్వామికి సమర్పించేవాడు. మహాస్వామివారు అప్పుడప్పుడు దోమలను ఈగలను తోలడానికి ఉపయోగించేవారు. రంగన్ ఒకసారి ఒక డజను నెమలీక విసనకర్రలను తీసుకుని వచ్చాడు. స్వామివారు వాటిని తీసుకొని మేనాలో పెట్టుకున్నారు. శిష్యులు ఈ విషయం చూసి ఆశ్చర్యపోయారు. తమకోసం వస్తువులను అలా దాచుకోవడం మహాస్వామివారు ఎప్పుడూ చెయ్యరు. 


ఒకరోజు ఉదయం మహాస్వామి వారు మేనాలో కూర్చుని జపం చేసుకుంటుండగా, పెద్ద ఈగల గుంపొకటి అటుగా వచ్చింది. స్వామివారు నెమలీకల విసనకర్రను వాడుతున్నారు వాటిని పారదోలడానికి. అప్పుడు కొంతమంది జైన సాధువులు వచ్చారు. వారి సంప్రదాయం ప్రకారం నోటి చుట్టూ తెల్లని గుడ్డ చుట్టుకొని ఉన్నారు. చాలా విషయాలపై స్వామివారు మాట్లాడుకున్నారు. 


సంస్కృత పదకోశమైన అమరకోశం రాసినవారు జైన రాజైన అమరసింహుడు. జైనులకు సంబంధించిన చాలా పుస్తకాలు సంస్కృతంలోనే ఉన్నాయి. వీటన్నిటిని విని ఆ సాధువులు చాలా సంతోషించారు. 


“మీరు ఉదయం నిద్ర లేవగానే ‘విప్రక్షయం’ ప్రార్థన చేస్తారా?” అని అడిగాఅరు మహాస్వామివారు. 


“లేదు. మా గురువుగారు ఇక దానితో పనిలేదని చెప్పారు” అని వారు బదులిచ్చారు. 


అక్కడ ఉన్న శిష్యులకి పరమాచార్య స్వామివారు అడిగిన ప్రశ్న కాని, ఆ సాధువులు చెప్పిన సమాధానం కాని ఏమీ అర్థం కాలేదు. 


మహాస్వామివారే దాని గురించి ఇలా చెప్పసాగారు. “వైదిక క్రతువులు, అగ్ని సంస్కారాలు చాలా బాగా జరుగుతున్న కాలంలో, శాస్త్రం చెప్పిన విధంగా వైదిక యజ్ఞాలలో జంతు బలులు జరిగేవి. అహింసా సూత్రం మూల సూత్రంగా గల జైన మతం ఉధృతిలోకి వచ్చాక రోజూ ఉదయం ‘విప్రక్షయం’ లేదా ‘బ్రాహ్మణులు క్షయించుగాక’ అని పఠించేవారు వైదిక మతం సమసిపోవాలని”


బహుశా స్వామివారి ఆంతర్యం గ్రహించారేమో ఆ జైన సాధువులు, “అవును, అవును. ఇప్పుడు దాదాపు బ్రాహ్మణులందరూ అగ్నికార్యం వదిలేశారు. కాబట్టి యాగాలలో జంతుబలులు జరగటం లేదు. కనుక మా గురువులు ‘విప్రక్షయం’ పఠించవలసిన అవసరం లేదని సెలవిచ్చారు” అని చెప్పారు. 


మహాస్వామివారు వారందరికి ఒక్కొక్క నెమలీక బహుమానంగా ఇచ్చారు. నెమలిని హింసించకుండా అవి వదిలిపెట్టినప్పుడు కిందపడినవి కావున వారు సంతోషంతో వాటిని స్వీకరించారు. బహుశా ఈ జైన సన్యాసులు వస్తారనే వారికి వీటీని బహుమానంగా ఇవ్వొచ్చనే మహాస్వామివారు ఆ నెమలీకలను మేనాలో దాచుకున్నారేమో. ఏమో! నెమలిపై ఎక్కి విహరించే ఆ స్మామినాథునికే తెలుసు


--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

దైవకార్యమే

 *ప్రతి పని దైవకార్యమే*

ప్రాచీన గ్రంథాలన్నీ పనిని దైవస్వరూపంగా చూడమన్నాయి. పని దైవారాధనతో సమానమని ఉపదేశించాయి. నిష్కామ భావనతో, భక్తిశ్రద్ధలతో చేసే కార్యాలన్నీ మంచి పనులేనని భగవద్గీత బోధించింది. మన సంకల్పాలన్నీ కల్యాణదాయకంగా ఉండాలని యజుర్వేదం ఆకాంక్షించింది.


మంచి పనిని వాయిదా వేయకూడదు, చెడు పనిని తలపెట్టనేకూడదని రామాయణం వివరించింది. అందుకే ఒక పని చేసేముందు వేయిసార్లు ఆలోచించాలి. పని మొదలు పెట్టాక వేయి అడ్డంకులు వచ్చినా దాన్ని నెరవేర్చాలి. శ్రద్ధాసక్తులతో కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన ఈశ్వరారాధన అంటారు స్వామి వివేకానంద. అందుకే ప్రతి వృత్తీ పవిత్రమైందిగా భావించాలి. లోకహితం కోసం చేసే పనులకు దైవమే మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడని పెద్దలు చెబుతారు. కానీ చేసే పని ఎంత చిన్నదైనా అది సమాజానికి మేలు చేసేటట్లుగా ఉండాలి. చేస్తున్న పనిపట్ల అవగాహన, ఆలోచన లక్ష్యసిద్ధికి దారితీస్తాయి. నిజానికి ఎవరికైనా మనసుకు నచ్చిన పని మీదే ఆసక్తి, మమకారం ఉంటాయి. అవే మనిషికి ప్రోత్సాహాన్నిస్తాయి. అసలు ఇష్టపడి పని చేయాలే కాని ఏదీ కష్టంగా అనిపించదు. ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా మనసుకు తృప్తినివ్వదు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నాడు వేమన. ఏ విజయానికైనా మూలం సాధన. నిరంతర సాధన వల్లే మనం కోరుకున్న పనులు పూర్తి చేయగలుగుతాం.

మనిషి ఒంటరిగా జీవించలేడు. నిత్యం పదిమందితో కలసి మెలసి ఉండక తప్పదు. అందుకే ఎవరైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించి మంచీ, చెడులను విచారించాలి. అప్పుడే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మనిషి గొప్పతనం అతడు చేసే పనిని బట్టి ఉంటుంది. ఎంత ఉన్నతుడైనా పని చేయకపోతే అతడికి విలువ ఉండదని భారతం చెబుతోంది. అందుకే ఒక పనిని సంకల్పించినప్పుడు దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించకూడదు. ఎవరు విమర్శించినా, ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా.. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి శ్రద్ధతో పనిని పూర్తి చేయాలి. అప్పుడు అది తప్పక విజయవంతమవుతుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే తగిన వ్యాయామం లభించి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అంకితభావంతో పనిచేసిన మనిషిలో అనవసరపు ఆలోచనలు ప్రవేశించవు. పనిలో ఆనందాన్ని ఆస్వాదించే అతడు కష్టసుఖాలకు అతీతంగా వ్యవహరిస్తాడు. 


చిత్తశుద్ధితో చేసే మంచి పనులకు దైవానుగ్రహం తప్పక ఉంటుంది. మంచి పనులంటే దానధర్మాలు, పరోపకారం. అనాథలకు, అభాగ్యులకు దానధర్మాలు చేస్తూ, వారి ఉన్నతికి కృషి చేసిన వ్యక్తి చిరస్మరణీయుడవుతాడు. పరోపకారం వల్ల మానసిక ఆనందంతో పాటు మనిషి జీవితం కూడా ధన్యమవుతుంది. 

~విశ్వనాథ రమ

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదకొండవ అధ్యాయం

విశ్వరూపసందర్శనయోగం:అర్జున ఉవాచ


అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః

సర్వే సహైవావనిపాలసంఘైః 

భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ

సహాస్మదీయైరపి యోధముఖ్యైః (26)


వక్త్రాణి తే త్వరమాణా విశంతి

దంష్ట్రాకరాలాని భయానకాని 

కేచిద్విలగ్నా దశనాంతరేషు

సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః (27)


ఎంతోమంది రాజులతోపాటు ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే మనపక్షానికి చెందిన ప్రముఖయోధులూ వాడికోరలతో భయంకరాలైన నీ నోళ్ళలోకి వడివడిగా ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది నీ పళ్ళసందులో ఇరుక్కుపోయి పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు.

నిను నర్థింతును సత్యధర్మముల మన్నింపంగ న్యాయమ్ము గా

 నిను నర్థింతును సత్యధర్మముల మన్నింపంగ న్యాయమ్ము గా 


నినునెల్లప్పుడు సంచరింపగను సన్మార్గంబులన్ జూపుమా 


యనుమానించుట యేల నన్ను శివ న్యాయంబౌన లోకంబునన్ 


మనగానిమ్మిక నీదె భారమిక సాంబా ! అర్ధనారీశ్వరా !

అమర చైతన్యం"*

 *"అమర చైతన్యం"* 

*( శ్రీ రమణ మహర్షి బోధనలు )*



🕉🌞🌎🌙🌟🚩


*ప్రశ్న: నేను ఆత్మనే అయితే నాకెందుకు తెలియడం లేదు.*


*జవాబు: నీ ప్రస్తుత జ్ఞానము అహానికి సంబంధించినది. సాపేక్షికమైనది. సాపేక్షజ్ఞానానికి ద్రష్ట, దృశ్యము ఉండాలి. కాని ఆత్మజ్ఞానమునకు ద్రష్ట, దృశ్యము అవసరం లేదు. ఎందుకంటే అవి పూర్ణము. జ్ఞాపకం చేసుకోవడం కూడా సాపేక్షికమైనది. జ్ఞాపకం చేసుకునే వ్యక్తి, జ్ఞాపకం చేయబడే వస్తువు ఉండాలి. రెండవ వస్తువే లేనపుడు ఎవరు ఎవరిని గుర్తు చేసుకోవాలి. జ్ఞానానికి అజ్ఞానానికి అతీతమైనది ఆత్మ.*




*ప్రశ్న: నేను ఎంతవరకు ఆత్మ విచారం చేయాలి.*


*జవాబు: నీ చివరి సందేహం కూడా (తప్పు అభిప్రాయము) పొయ్యేంత వరకు చేయాలి. ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు చెయ్యాలి.*


*సముద్రగర్భంలోనే ముత్యాలున్నాయి. వాటిని వెలికి తీయాలంటే సముద్రపు లోతుల్లోకి వెళ్ళాలి...... అలాగే ఆత్మకూడా నీలోపలికి, ఇంకాలోలోపలికి వెళితేనే, బాగా లోపలికి మునిగితేనే అనుభవానికి వస్తుంది.*

https://chat.whatsapp.com/I9GuM11QcSYCmHyQXHO5cQ?mode=ac_t

🕉🌞🌎🌙🌟🚩

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *కర్మణా జాయతే భక్తిః,*

         *భక్త్యా జ్ఞానం ప్రజాయతే l*

         *జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః*

         *ఇతి శాస్త్రార్థ సంగ్రహః ll*

            

తా𝕝𝕝 *చిత్తశుద్ధితో చేసే సత్కర్మలవలన భక్తి కలుగుతుంది, నిష్కామభక్తి వలన జ్ఞానము కలుగుతుంది. ఆధ్యాత్మికజ్ఞానం వలన మోక్షము సిద్ధిస్తుంది. ఇది శాస్త్ర నిర్ణయము.*


 ✍️🌸🌹💐🙏

రాశి ఫలితాలు

 29-08-2025 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం

సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు.

---------------------------------------

వృషభం

ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్థిరస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు.

---------------------------------------

మిధునం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. అవసరానికి ఇతరులకు ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందికి గురి అవుతారు. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------

సింహం

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు .ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

కన్య

సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి.

---------------------------------------

తుల

చిన్న నాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంబించి లాభాలు అందుకుంటారు. 

---------------------------------------

వృశ్చికం

గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇంటాబయటా పరిస్థితుల్లు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

---------------------------------------

ధనస్సు

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలు చేస్తారు. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మకరం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

కుంభం

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. సంతాన అనారోగ్యం విషయంలో జాగ్రతః వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మీనం

ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు స్వల్ప లాభలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

నిజం

 *శ్రీ కాళహస్తి శ్రీ దక్షిణా మూర్తి అద్భుత అభిషేక దర్శనం*🙏☝️


🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹


                   *నిజం*


*ఎలుక రాతిది అయితే పూజిస్తాం, మూషిక రాజా అంటూ కీర్తిస్తాం, అదే ఎలుక ప్రాణాలతో మన ఇంట్లో తిరుగుతూ ఉంటే తరిమేస్తాం.*


*పాము రాతిది అయితే నాగరాజా అంటూ పూజలు చేస్తాం, పాలు పోస్తాం.. అదే పాము ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం .*

*తల్లిదండ్రులు ఫోటోల్లో ఉంటే దండవేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో ఒదిలేస్తం .. బ్రతికున్నప్పుడు పట్టేడన్నం పెట్టడానికి ఒంతులు వేసుకుంటాము, చనిపోయాక పంచభక్ష్య పరమన్నాలు ఫోటోల ముందు పెట్టి తిను, తిను అంటూ ఏడుస్తాం.. కాదు, కాదు నటిస్తాం..*


*తోడబుట్టినోడు చనిపోతే ఈ రోజు దినం ఖర్చు నాది అని ఒకరు, పాడే ఖర్చు నాది అని ఇంకొకడు పోటీపడతారు.. అదే తోడబుట్టినోడు హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఈ రోజు హాస్పిటల్ బిల్లు నాది, నేను భరిస్తా అని ఒక్కడూ అనడు..*

*చనిపోయిన వాడికి ( శవానికి ) భుజాన్ని అందించడానికి పోటీ పడతాం, బ్రతికి ఉన్న వాడికి చేయూతను మాత్రం ఇవ్వం .*

*రాయిలో దైవత్వం వుందని తెలుసుకున్నాం . కానీ మనిషి లో మానవత్వాన్ని గుర్తించలేక పోతున్నాం . జీవం లేనివాటిపై భక్తి ఎందుకు..? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు..? నాకైతే అర్ధం కావడం లేదు..*

*సాటివాడిపై ప్రేమని పంచలేని నువ్వు దేవుడిని ఏం పూజిస్తావ్ నేస్తమా... దేవుడు ఆలయంలోనే ఉంటాడనుకునేవాడు మూర్ఖుడు.. వాడు ఏనాటికీ దైవాన్ని చూడలేడు, ఆయన కృపకి పాత్రులు కాలేడు...*


🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹


*ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, ఆ పరమాత్ముడికి నైవేద్యం నివేదించడం కన్నా ఎన్నో రెట్లు గొప్పదని గ్రహించితే మంచిది*


🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹