5, అక్టోబర్ 2025, ఆదివారం

కైలాసం కావాలా?*

 


*కైలాసం కావాలా?*

               *వైకుంఠం కావాలా?*

                ➖➖➖✍️

```

ఓసారి భక్తతుకారామ్ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ, స్మరణ చేస్తూ వెళ్తున్నాడు.


అపుడు ఒకడు ఎదురు వచ్చాడు. “నువ్వు ఈ నామాన్ని ఇలా స్మరిస్తున్నావ్ కదా? ఏమి కోరుకుంటున్నావ్. నీకు కైలాసం కావాలా? వైకుంఠం కావాలా? స్వర్గం కావాలా?” అని తుకారాంని అడిగేడు.


ఆ ప్రశ్నకి తుకారాం అంటాడు- “అయ్యా! నాకు కైలాసం, వైకుంఠం అంటే అర్థం కాదు. ఇక స్వర్గమంటారా? ఈ నామస్మరణ చేస్తున్నపుడు నేను అనుభవించేదే, అనుభవిస్తున్నదే ‘స్వర్గం “ అని బదులిస్తాడు. 


భగవన్నామం హృదయంలో నినదిస్తే, నినాదాలు చేస్తే అదే స్వర్గం.


నామస్మరణ మనసు పడే ఆరాటాన్ని, ఆందోళనని, అశాంతిని అణచివేస్తుంది.


ఓ ఇనుప ముక్కను ఓ రాయిమీద రాస్తూ రాస్తూ పోతే వేడి పుడుతుంది.


భగవన్నామం అనే ఇనుప ముక్కతో, రాయిలాంటి మనసుని అటు ఇటు అనంతంగా, అఖండంగా రాస్తూ పోతే, 'భక్తి’ అనే వేడి పుడుతుంది.


పుట్టిన భక్తి అనే వేడి, పరమాత్మునికి ఉండే వెన్నలాంటి హృదయాన్ని కరిగిస్తుంది, కదిలిస్తుంది.


నారదుని ఉపదేశ కారణంగా రత్నాకరుడు రామనామాన్ని స్మరించిన కారణంగా శ్లోకదాతగా మారాడే.


వాల్మీకి మహర్షియై రామాయణ మహాకావ్యానికి సృష్టికర్తయ్యాడు.


అయితే నామస్మరణ, దైవచింతన అని రెండు ఉన్నాయి.


నామాన్ని జపించటం నామస్మరణ. ఆ నామం చేసిన లీలలను మహిమలను, మననం చేసుకోవటమే చింతన.


కృష్ణా కృష్ణా అని జపించటం స్మరణ. ఆ కృష్ణుడే ఎపుడో చేసిన లీలను మహిమలను మనం ఇపుడు మననం చేసుకోవటం చింతన.


నామాన్ని మనోభావంగా ఉచ్ఛరించాలి! పెదవులనుండి కాక హృదయంలోంచి ఉచ్ఛరించాలి.


ఆర్తితో ఉచ్ఛరించాలి.


అనుభవిస్తూ ఉచ్ఛరించాలి.


అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉచ్ఛరించాలి.


మనసనే సరస్సులో నామం ఓ తామరపూవు.


తామరపూవులోని మకరందాన్ని త్రాగడానికి భక్తులు ఐహిక భావనలు వదిలి తుమ్మెదలవలె పరుగుతీయాలి.


హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే భగవంతుడు మన పూజ గది ముందు దాసుడిగా వేచి ఉంటాడు.. నిజమే కదా...✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

అంతరంగం

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 శ్లో𝕝𝕝 *నారికేళ సమాకారా*

*దృశ్యంతే హి సుహృజ్జనాః* | 

          *అన్యే బదరికాకారా*

 *బహిరేవ మనోహరాః* ||

               

*తా𝕝𝕝 సజ్జనుడు కొబ్బరికాయవలె పైకి కఠినంగా కనపడతాడు..... కానీ, కఠినమైన కొబ్బరికాయ లోపల రుచికరమైన కొబ్బరి, తియ్యని నీరు ఉన్నట్లే, సజ్జనుని కఠినత్వం వెనుక అతని మృదువైన మంచి మనసు దాగి ఉంటుంది, దుర్జనుడు మాత్రం పైకి చాలా మృదువుగా ఆకర్షణీయంగా రేగిపండు లాగా కనబడతాడు..... కానీ, మృదువైన రేగిపండు లోపల కఠినమైన గింజ ఉన్నట్లు, దుర్జనుడి మృదుత్వం వెనుక కఠినమైన అతని అంతరంగం ఉంటుంది*.


 ✍️🌸🌹💐🙏

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 05.10.2025

Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి భాను వాసర శతభిషం నక్షత్రం గండ యోగః తైతుల తదుపరి గరజి కరణం


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 



నమస్కారః , శుభోదయం

Panchaag



 

3, అక్టోబర్ 2025, శుక్రవారం

తత్త్వ విధిజ్ఞుల్.

 కం. అనుపమ నియమాన్వితులై 

యనూన దక్షిణల గ్రతు సహస్రంబులు సే

 సిన వారి కంటె నక్రో 

ధనుడు గరంబధిక మండ్రు తత్త్వ విధిజ్ఞుల్. 

నన్నయ భట్టారకుని శ్రీ మదాంధ్ర మహాభారతము ఆది పర్వము -3-143

Panchang



 

రాజ పరమేశ్వరుడు కూడా

 ప్రాప్య ప్రమాణ పదవీం,కో నామాస్తి,తులే! అవలేపః -తే?


నయసి గరిష్ఠ మధస్తాత్-,లఘుతర ము చ్చయిస్తరం కురుషే 


అర్థము:--ఓ! త్రాసా! అధికారయుతమైన పదవిని చేరిన నీకు ఏమిటి యింత గర్వం? బరువైన దానిని క్రిందకు తోస్తున్నావు, అతి తేలిక పదార్థానికి యెంతో ఉచ్ఛ స్థాయి .


కల్పిస్తున్నావు తర్వాత యింకా నిర్మొహమాటంగా మరో శ్లోకం చెప్పాడు.


యస్యాస్తి సర్వత్ర గతి: స కస్మాత్ స్వదేశ రాగేణ హి యాతి భేదం 


తాతస్య కూపోయ మితి బ్రువాణాః క్షారం జలం కే పురుషా: పిబంతి


అర్థం:-- ఎక్కడికైనా పోగల శక్తి కలవాడు,స్వదేశమనే అనురాగం తో ఎందుకు దుఖాలు అనుభవిస్తాడు?


మా నాన్నగారి బావి యిది అని చెప్పుకొని ఆ బావి లోని ఉప్పు నీళ్ళే ఎవరు త్రాగుతారు?ఈ మాటలు చెప్పి కాళిదాసు రాజాస్థానం వదిలి వెళ్ళిపోయాడు.


అవజ్ఞా స్ఫుటితం ప్రేమ సమీకర్తుం క ఈశ్వరః?


సంధిం న యాతి స్ఫుటితం లాక్షా లేపేన మౌక్తికం 


అర్థము:--అవమానంచేత విరిగి పోయిన స్నేహాన్ని తిరిగి కలిపేందుకు ఈశ్వరుడు మాత్రం సమర్థుడా? 


ముత్యం పగిలి పోతే లక్క పూసి దాన్ని అతికించ గలమా?


కాళిదాసు రాజభవనానికి రావడం మానేశాడు.దాంతో భోజరాజుకు మనశ్శాంతి కరువైంది.యిన్ని సంవత్సరాల స్నేహం తర్వాత ఆ మహా కవితో మాటలే లేకుండా కాలం గడపటం ఆయన వల్ల కావడం


లేదు.ఎప్పుడూ ఏదో పరాకుగా,చిరాకుగా వుంటున్నాడు.


ఏమయింది స్వామీ! మీరెందు కిలా యెప్పుడూ అశాంతిగా.అన్యమనస్కంగా వుంటున్నారు?అని ఒక నాడు అడిగింది భార్య లీలావతి.దానికి కారణం కాళిదాసు తనకు దూరమవడమే అన్నాడు రాజు.అప్పుడు లీలావతి యిలా అనింది.స్వామీ మీకు అన్ని విషయాలూ తెలుసు.


.


స్నేహోహి వర మఘటితః, న వరం సంజాత విఘటిత స్నేహః 


హృత నయనో హి విషాదీ,న విషాదీ భవతి స ఖలు జాత్యన్దః 


అర్థము:--కుదిరి బెడిసిన స్నేహం కన్నా స్నేహం కుదరకపోతేనే నయం, పుట్టుగుడ్డి వాడికి విషాదం వుండదు.మధ్యలో కళ్ళు పోగొట్టుకున్న వాడికే విషాదం.


ఏమయినా కాళిదాసు పుంభావ సరస్వతి. సరస్వతీ దేవి పురుషావతారం.ఆయన్ని యితర  


విద్వాంసుల కన్నా మిన్నగా గౌరవించ వలిసిందే చూడండి.


దోషాకరోపి,కుటిలోపి,కళంకితోపి,


మిత్రావసాన సమయే విహితోచ్చయోపి 


చంద్రః, తథాపి, హర వల్లభతాం ఉపైతి!


నైనాశ్రితేషు గుణదోష విచారణ స్యాత్ 


అర్థము:--చంద్రుడు దోష-ఆకరుడు=దోషాలకు నెలవు.రాత్రి చీకట్లోనే ఆయనకు నెలవు,చంద్రుడు 


కుటిలుడు అంటే వంకర బుద్ధి కలవాడు,(వంకరగా వుంటాడు కదా! ). కళంకితుడు,మచ్చ గలవాడు. ఎన్నో పాపాలు చేసినవాడు,మిత్రుడి (సూర్యుడి)అవసాన సమయం లో తాను వృద్ధి పొందుతాడు ,అయినా అతడు శివుని సాన్నిహిత్యాన్ని పొందే వున్నాడు.ఆశ్రితుల పట్ల గుణ దోష విచారణ వుండదు.


మనసుకు నచ్చేట్టుగా భార్య చెప్పిన సలహా విని రాజు ప్రియా!నీవు చెప్పినది నిజమే రేపే కాళిదాసును 


పిలిపిస్తాను అన్నాడు.మరుదినం రాజు కొలువు తీరాడు.సేవకుడిని పంపి కాళిదాసును తీసుకొని రమ్మని పంపించాడు.కాళిదాసు చాలా రోజుల తర్వాత రాజాస్థానం లోకి పునః ప్రవేశం చేశాడు.భోజుడు సింహాసనం నుంచి దిగి వచ్చి మహాకవికి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి చేయి పట్టుకొని తెచ్చి సభలో కూర్చుండ బెట్టాడు.అది చూసి బాణుడు ఈ శ్లోకం చెప్పాడు.


భోజః కళావిత్- రుద్రో వా కాళిదాసస్య మానవాత్ 


విబుధేషు కృతో రాజా, యేన దోషాకరోప్యసౌ 


అర్థము:--భోజరాజు కాళిదాసును గౌరవించటం చేత రసిక రాజులలో పరమేశ్వరుడని పించుకున్నాడా?


ఆ రుద్రుడు దోషాకరుడైన(రాత్రి రాజు)చంద్రుడిని,విబుధులలొ(దేవతల లో )వుత్తముడిగా  


చేశాడు.ఈ రాజ పరమేశ్వరుడు కూడా దోష-ఆకరుడైన కాళిదాసును విబుధుల లో(కవి,పండితులలో)రాజును చేశాడు.

                           

కె.వి.రమణ మూర్తి .

2, అక్టోబర్ 2025, గురువారం

అమ్మవారి చిరునామా

 https://youtu.be/huQ257jjvvI?si=3dN2k-oidKzyJoly

శ్రీభారత్ వీక్షకులకు విజయ దశమి శుభాకాంక్షలు 🌹 అమ్మవారు అంటే దుర్గాదేవి ఎక్కడ ఉంటుంది! ఫలానా గుడిలో ఉంటుందని చాలా మంది జవాబిస్తారు. ఏవో కొన్ని స్తోత్రాలు చదివితే దానినే భక్తి అనుకుంటారు. కానీ అమ్మవారి చిరునామా తెలుసుకోవాలంటే ఏం చేయాలో వివరంగా చెబుతున్నారు ప్రముఖ ప్రవచన వేత్త జి. శివప్రసాద శాస్త్రి గారు. గొప్ప విషయాలు తెలుసుకోవడం, పాటించడం ప్రతి వ్యక్తీకి చాలా అవసరం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

1, అక్టోబర్ 2025, బుధవారం

హరియను రెండక్షరములు

 హరియను రెండక్షరములు

హరియించును పాతకములు అంబుజనాభా

హరినీనామ మహత్యము

హరిహరి పొగడంగవశమె హరిశ్రీకృష్ణా



భావం:-

హరి అనే రెండు అక్షరాలు అన్నిపాతకాలూ పూర్తిగా కరిగించి మాయంచేస్తాయి.బొడ్డుయందు కలువగలవాడా(బ్యహ్మకుతండ్రి)కృష్ణా! హరి అనేనీపేరు యొక్క మహత్యాన్ని పొగడడం నాకుశక్యమా?

ఈ పద్యం గుర్తున్నదా చేతులారంగ శివుని బూజింపడేని నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని గలుగనేటికి తల్లుల కడుపు చేటు!

 ఈ పద్యం గుర్తున్నదా

చేతులారంగ శివుని బూజింపడేని

నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని

దయయు సత్యంబులోనుగా తలపడేని

గలుగనేటికి తల్లుల కడుపు చేటు!

Panchaag



 

30, సెప్టెంబర్ 2025, మంగళవారం

మూత్రం బిగించి మృత్యువుకి దగ్గర్లో ఉన్న రోగిని కాపాడే సిద్ద యోగం -

 మూత్రం బిగించి మృత్యువుకి దగ్గర్లో ఉన్న రోగిని కాపాడే సిద్ద యోగం - 

   

*. కొండపిండి మొక్క సమూల చూర్ణం , చిన్న యాలుకల పొడి , శుద్ది చేసిన కర్పూర శిలాజిత్ పొడి , దోరగా వేయించిన పిప్పిళ్ళ పొడి సమభాగాలు గా కలిపి ఉంచి రెండు పూటలా పూటకు అర టీ స్పూన్ పొడి అర గ్లాస్ బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగుతూ ఉంటే మూత్రం వెంటనే బయటకు వచ్చి చావుకి దగ్గరగా వెళ్లిన రోగి కూడా జీవించే అవకాశం ఉంది.

     

*. తమలపాకులు కి ఆముదం రాసి మంట దగ్గర కొంచం వేడి చూపించి పొత్తి కడుపు మీద వేస్తే కొంచం సేపట్లో పొత్తికడుపు ఉబ్బు పోయి బంధించిన మూత్రం బయటకి వచ్చి రోగి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. ఇది నా అనుభవపూర్వకం . 



 మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 



గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

చక్కని పద్యం

 అపురి బాయకుండు, మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా

షాపరశేషభోగి , వివిధాధ్వ రనిర్మలధర్మకర్మ దీ

క్షాపరతుంత్రు డంబురుహ గర్భకులాభరణం, బనారతా

ధ్యాపనతత్పరుండు, ప్రవరాఖ్యుడలేఖ్య తనూ విలాసుఁడై

29, సెప్టెంబర్ 2025, సోమవారం

Panchaag


 

27, సెప్టెంబర్ 2025, శనివారం

పరిమళ ద్రవ్యముల చరిత్ర

 ఆయుర్వేదము నందలి భాగమైన పరిమళ వైద్యము గురించి సంపూర్ణ వివరణ -

     

పరిమళ ద్రవ్యముల చరిత్ర అత్యంత పురాతనమైనది. రమారమి మూడువేల సంవత్సరాల క్రితమే వేదములలో వర్ణింపబడిన  " పరోమ" విధానమున పరిమళ పుష్పముల యొక్క మరియు సుగంధద్రవ్యముల యొక్క ప్రస్తావన కలదు.  ఋషులు పరిమళభరితమైన ధూపము దేవతలను ఆవాహనకు ఉత్తమ సాధనగా భావించిరి. ఆనాడు హోమధూపమును వాతావరణము నందలి కల్మషము ప్రక్షాళణ చేయుటకు , దుర్గన్ధమును , రోగాసాంక్రమిక క్రిములను పారద్రోలుటకు సాధనాభూతముగా ఉపయోగించేవారు. 

              

వరాహమిహిరుడు తన బృహత్సంహిత నందు పరిమళ ద్రవ్యముల గురించి వివరించెను. ఆనాడు శ్రీగంధం ఎక్కువుగా వాడుక నందు ఉండేది. జాజి , దవనం , మరువం , కస్తూరి , కర్పూరం , కుంకుమపువ్వు మున్నగు వస్తువులు కూడా ఉపయోగించేవారు .

     

.  ప్రముఖ మరాఠ కవి గంగాధరుడు  "గంధసార - గంధపాత" అను గ్రంథముల యందు పరిమళ ద్రవ్యముల గురించి తెలుపుచూ వాని తయారీ మరియు వినియోగించే విధానం గురించి వివరించాడు. దాదాపు 1500 సంవత్సరముల నాటి పంచతంత్రమున విష్ణుశర్మ సుగంధద్రవ్యముల వర్తకము , బంగారు వర్తకము కంటే లాభసాటిది అని చెప్పుటను గమనిస్తే ఆకాలము నందు వాటిపై ప్రజలకు గల ఇష్టాన్ని మనం గమనించవచ్చు .

         

ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ దేశము నందలి కుమ్రాన్ గుహలలో తవ్వకాలు జరిపినపుడు పురాతన శాస్త్రవేత్తలకు ఒక పాతనూనె సీసా కనిపించింది. ఆ సీసాను పరిశోధించినప్పుడు అది 2000 సంవత్సరాల పూర్వమునకు చెందినది అని తేలింది . అప్పటి మహారాజులు పరిమళద్రవ్యముగా ఆ సీసా నందలి తైలమును వాడేవారు అని బయటపడినది. ఇన్ని సంవత్సరాలు గడిచినను ఆ సీసా నందలి పరిమళద్రవ్యము ఘుమఘుమలాడుచుండెను. 

                   

ప్రాచీన కాలము నందు భారతదేశము , పర్షియా , ఈజిప్టు సుగంధద్రవ్యముల తయారీలో అగ్రగాములుగా ఉండెను . వారు ఆకులు , పువ్వులు , వ్రేళ్లు దంచి చమురులో నానబెట్టి పరిమళద్రవ్యములు తయారుచేసెడివారు. పరిమళ వస్తువులు రోగనివారణలో ప్రముఖ పాత్ర వహించునని ఆయుర్వేద తంత్రకర్త చరకుడు తన చికిత్సాసారమున తెలిపి గంధము , గోరింట , వట్టి వేళ్లు , తామర , కలువలు మున్నగు వానితో సిద్ధము చేసిన తైలములతో చికిత్స చేయు విధానమును వివరించెను. 

                   

"సుఖాంతి' అను పుష్ప పరిమళము నిర్ణీత సమయమున నిత్యం వాసన చూసుట వలన ఉబ్బసం వంటి శ్వాశకోశ వ్యాధులు నయం అగును. చంద్రమోహ పుష్పముల సుగంధము మానసిక వ్యాధులకు విరుగుడుగా పనిచేయును . పవనాలి అనే పుష్పముల సుగందము రక్తపోటుకు విరుగుడుగా పనిచేయును . ఈ పువ్వులన్నియు హిమాలయముల యందే లభించును. కొన్ని రకాల పుష్ప సుగంధములను లోపలికి పీల్చుట చేత తలనొప్పి నుండి గుండెపోటు వరకు అనేక రోగములను నయం చేయవచ్చు . 


. ఇప్పుడు మరికొన్ని మూలికా సువాసనల ఉపయోగాలు తెలుసుకుందాము.


 * పుదీన -

       

. కొన్ని ఆకులను నలిపి వాసన చూసిన యెడల అరుచి , అగ్నిమాంద్యము , నోటి దుర్గంధం , శిరోభారం , దగ్గు , జలుబు నశించును. దీనిని కూరలలో , పచ్చళ్లలో వాడినయెడల రుచిని పెంచును.

 

 * కొత్తిమీర -

       

. దీని వాసన చూచినయెడల వాంతులు అరికట్టును. మనసుకు శాంతముగా ఉండును. తలనొప్పి నివారణ అగును. 


 * దాల్చినచెక్క - 

        

. శ్రీలంక యందు దీని చెట్లు ఉండును. దీని ఆకులను లేదా చెక్క నుంచి తీసిన తైలము నందు నయుజినాల్ , సిన్నామిక్ , అల్దేహైడ్ , పప్పెన్ , ఆల్కాల్సు , బెంజిల్ బెంజోయెట్ సాపరోర్ , ఫర్ ఫ్యులాల్ ఓనోవ్ మున్నగు రసాయనాలు ఉండును. ఇది వాసన చూసినను లేదా తలకు రాచుకొనుచుండిన యెడల దీర్ఘకాలంగా వేధిస్తున్న తలనొప్పి , జలుబు , పొడిదగ్గు నివారించబడును. కడుపులొకి వాడుచున్న కడుపునొప్పి , కడుపుబ్బరం , అతిసారం , రక్తపిత్తము , తెల్లకుసుమ తగ్గును. పాము కరిచినప్పుడు రక్తం పిండి దీని అరుకు అంటించిన యెడల విషము హరించును .

 

 మత్తెక్కించే సువాసనలు -

 

* గోరింట పువ్వుల గుత్తులను వాసన చూచుచుండిన లేదా తలకింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .

 

* వెలగ చెట్టు ఆకు వాసన చూచిన యెడల వాంతులు నిలుచును . తలగడ కింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .

 

* గసగసాలు ఒక స్పూన్ తీసుకుని నాలుగు చుక్కలు ఆవునెయ్యి వేసి ఒక ఇనప గంటెలో వేయించి పలచటి బట్టలో వేసి వాసన చూస్తున్న యెడల గాడనిద్ర పట్టును .


 * దవనం , మరువం , జాజి , జాపత్రి , యాలుకలు , చందనం , కురువేరు వంటి ఔషధ తైలాలు గాడనిద్రను కలుగచేయును .

          

. పైన చెప్పిన గాడనిద్రను కలుగచేయు యోగాలను నిద్రపట్టక ఇబ్బంది పడువారు తప్పక ఉపయోగించుకొని సమస్యల నుంచి బయటపడవచ్చు.

                       


. సంపూర్ణం 



మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034