ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
15, అక్టోబర్ 2025, బుధవారం
13, అక్టోబర్ 2025, సోమవారం
12, అక్టోబర్ 2025, ఆదివారం
పరమాత్మ తత్త్వాన్ని
🌞 🌞
భాగవత పురాణంలోని తొలి పది శ్లోకాలు సృష్టి, భక్తి, జ్ఞానం, మరియు పరమాత్మ తత్త్వాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. ఇవి మన ఆధ్యాత్మిక యాత్రకు పునాది లాంటివి. శ్రీమద్భాగవతం ప్రారంభమయ్యే మొదటి శ్లోకం “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనేది సర్వ సృష్టికి మూలమైన వాసుదేవుని స్మరణ. వేదమూలమైన ఈ మంత్రం మనసుకు శాంతి, ఆత్మకు ఆహ్లాదం, భక్తికి ఆరంభం. వాసుదేవుడు అనగా సర్వవ్యాపకుడైన సత్యస్వరూపుడు. ఈ శ్లోకం మనసు, వాక్కు, కర్మలను శుద్ధి చేసే పరమమంత్రం.
రెండవ శ్లోకం “ధర్మః ప్రోజ్ఝితకైతవో ‘త్ర” అనేది కపటధర్మాన్ని త్యజించి, నిజమైన భక్తిని స్వీకరించమని చెబుతుంది. కర్మ ఫలాలకోసం చేసే ఆచారాలు, స్వార్థ యజ్ఞాలు, యాగాలు కలుషితం. నిజమైన ధర్మం అనేది స్వార్థరహితమైన భగవత్ సేవ. భాగవతం మనసును పావనంగా చేసి, జీవన ప్రయోజనాన్ని తెలియజేస్తుంది.
మూడవ శ్లోకం “నిగమ కల్పతరోర్గలితం ఫలం” వేదాలు కల్పవృక్షమైతే, భాగవతం వాటి మధుర ఫలం అని చెప్పుతుంది. ఈ ఫలం అమృతమయం. భాగవతం విన్నవారు పాపపరంపర నుండి విముక్తి పొందుతారు. ఇది వేదాంతసారాన్ని సులభమైన భక్తి మార్గంలో అందిస్తుంది.
నాలుగవ శ్లోకంలో నైమిషారణ్యంలోని ఋషులు శౌనకముని నేతృత్వంలో సత్ప్రశ్నలు అడుగుతారు. వారు ధర్మం క్షీణిస్తున్న కలియుగంలో మానవజాతికి శ్రేయస్సు కలిగించే మార్గం ఏదో తెలుసుకోవాలని ఆశించారు. ప్రశ్నల ద్వారా ఆధ్యాత్మిక మార్గం సులభమవుతుంది. జ్ఞానం పొందే మొదటి అడుగు — శ్రద్ధతో అడిగిన ప్రశ్న.
ఐదవ శ్లోకం “ఏతద్వ్యసనమున్యే నారాయణకథాసుధా” లో నారాయణకథా శ్రవణం మనుషుల పాపాలను నశింపజేస్తుందని చెబుతుంది. భగవంతుని లీలలు వినడం, ఆయన నామస్మరణ చేయడం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. ఇది కలియుగంలో మోక్షానికి సులభమైన మార్గం.
ఆరవ శ్లోకంలో “స ఉవాచ” అంటూ సూతమహర్షి ప్రవేశిస్తాడు. ఇది గురుపరంపర సంప్రదాయానికి నిదర్శనం. గురువు ద్వారా జ్ఞానం శిష్యునికి ప్రసాదమవుతుంది. సూతుడు భగవత్ తత్త్వాన్ని వినయపూర్వకంగా వివరిస్తాడు. గురువుతోనే భక్తి జ్ఞానం సమగ్రంగా అవుతుంది.
ఏడవ శ్లోకం “యస్యావతారోపి సంహారకార్యం” భగవంతుడు అవతారాలు ఎందుకు అవతరిస్తాడో తెలియజేస్తుంది. అధర్మం పెరిగినప్పుడు ఆయన ధర్మాన్ని స్థాపించేందుకు అవతరిస్తాడు. ఇది కర్మసిద్ధాంతానికి దివ్యమైన వివరణ. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలు భక్తుల రక్షణ, దుష్టుల నాశనం కోసం అవతరించారు.
ఎనిమిదవ శ్లోకం “సత్యం పరమ ధీమహి” భాగవత గాయత్రి శ్లోకం. ఇది పరమసత్యమైన భగవంతుని ధ్యానించే మంత్రం. ఈ ధ్యానం మనసును శాంతింపజేసి, భగవంతుని సాక్షాత్కారం దిశగా నడిపిస్తుంది. సత్యమయమైన పరబ్రహ్మలో లీనమవ్వడం ఆధ్యాత్మిక జీవితానికి శ్రేష్ఠమైన ఫలం.
తొమ్మిదవ శ్లోకం “ధర్మః సవర్ణస్త్వమేవ నారాయణః” ద్వారా సూతమహర్షి ధర్మం అనేది నారాయణుడే అని పేర్కొంటాడు. భగవంతుని చిత్తం అనుసరించడం ధర్మం. ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా నడచడం అధర్మం. కర్మలు, యజ్ఞాలు భగవత్ స్మరణ లేకుండా నిష్ప్రయోజకాలు.
పదవ శ్లోకం “కలిమలమశనమ్ పుణ్యశ్రవణకీర్తనః” కలియుగంలోని పాపమలను తుడిచివేసే మంత్రం. భగవంతుని నామం శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా మనిషి పాపాల నుండి విముక్తి పొందుతాడు. కలియుగంలో నామస్మరణమే పరమపథం. ఇది సులభమైనా, అత్యంత శక్తివంతమైన సాధన.
ఈ పది శ్లోకాలు కలిపి భగవత్ భక్తి, ధర్మం, జ్ఞానం, మరియు మోక్షం యొక్క సమ్మిళిత సారాన్ని మనకు బోధిస్తాయి. వాసుదేవుని స్మరణతోనే జీవితం పవిత్రమవుతుంది. నామస్మరణ, కీర్తనం, భాగవత శ్రవణం — ఇవే కలియుగ ధర్మం.
భాగవతంలోని ఈ ప్రారంభ శ్లోకాలు మన హృదయాన్ని శాంతితో నింపుతాయి. ప్రతి శ్లోకం ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి, మనసుకు వెలుగు. వేదాంత సారాన్ని సులభమైన భక్తి రూపంలో అందించే ఈ భాగవతం మానవజీవితానికి మార్గదర్శనం.
“భాగవత శ్రవణమే మోక్షద్వారం,
వాసుదేవ స్మరణమే జీవిత పరమార్థం.”
🌞 మీకు శుభ ఆదివారం — భగవత్కథా స్మరణతో హృదయం పవిత్రం కావాలి. 🙏
కొంపెల్లి లింగం గౌడ్
11, అక్టోబర్ 2025, శనివారం
యాపిల్ తినడం వలన
యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు -
యాపిల్ లో మంచి విటమిన్స్ ఉన్నాయి . ఒక యాపిల్ లో ఒక మిల్లీగ్రాము ఇనుము. పద్నాలుగు మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ , పది మిల్లీగ్రాముల కాల్షియం మరియు A విటమిన్ కూడా ఉన్నది. ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు.
* యాపిల్ రక్తక్షీణతని నివారిస్తుంది. రక్తక్షీణత కలవారు రోజుకి మూడు యాపిల్స్ తీసుకొవడం చాలా మంచిది.
* మలబద్దకం నివారణ అవుతుంది. శరీరంకి కావలసినంత బలం ని ఇస్తుంది.
* రక్త,బంక విరేచనాలు అవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకొవడం వలన అందులో ఉండే పిండిపదార్ధాలు విరేచనాలు లొని నీటిశాతాన్ని తగ్గించడం వలన విరేచనాలు తగ్గుతాయి . యాపిల్ ముక్కలని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది.
* చంటిపిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు ఒక చెంచా యాపిల్ జ్యూస్ ఇవ్వడం వలన విరేచనాలు కట్టుకుంటాయి.
* యాపిల్ జ్యూస్ లో యాలుకలు , తేనే కూడా కలుపుకుని తీసుకుంటూ ఉంటే కడుపులో మంట ప్రేగుల్లో పూత , అజీర్తి , గ్యాస్ట్రబుల్ , పుల్లనితేపులు , గుండెల్లో మంట నివారించబడును.
* యాపిల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన మరియు పొటాషియం ఎక్కువుగా ఉండటం వలన బీపీ తో పాటు అన్ని హృదయవ్యాధులు , మూత్రపిండాల వ్యాధులు నివారించబడతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు రోజు యాపిల్ జ్యూస్ తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి .
* తరచుగా యాపిల్ తింటూ ఉంటే తరచుగా వచ్చే జ్వరాలు అరికడతాయి.
* పక్షవాతం , నాడీసంబంధ వ్యాధులు కలవారికి మెదడు వ్యాధులు కలవారికి యాపిల్ చాలా మేలు చేస్తుంది .
* రోజు యాపిల్ జ్యూస్ సేవించడం వలన కడుపులో మంట, మూత్రంలో మంట ఉండదు.
* కామెర్ల వ్యాధి సోకినప్పుడు వీలయినంత ఎక్కువ యాపిల్ రసాన్ని తాగుతుంటే లివర్ ని సంరక్షిస్తుంది.
* యాపిల్ కి కఫాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. జలుబు , దగ్గు , ఆయాసం వీటిని నివారిస్తుంది.
* యాపిల్ జ్యూస్ లైంగిక శక్తిని పెంచుతుంది . నీరసాన్ని , అలసటని రానివ్వదు.
* యాపిల్ ముక్కలుగా కోసి ఉడికించి రోజు తింటూ ఉంటే బొల్లిమచ్చలు నివారణ అవుతాయి. శరీరం కాంతివంతం అవుతుంది.
* యాపిల్ చెట్టు యొక్క వ్రేళ్ళ రసాన్ని తాగితే కడుపులో ఏలికపాములు నివారణ అగును.
గమనిక -
షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం యాపిల్ తీసుకోరాదు .
. మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034
ఇంగ్లేషు స్వతంత్రమైన భాషయా?
ఇంగ్లేషు స్వతంత్రమైన భాషయా?
======================
కాదు. సంస్కృతానికి తల్లి అయిన గీర్వాణమే ఇంగ్లేషుకు కూడా తల్లి. నిరూపణ ఇది :
సంస్కృత వాక్యం: రామః సీతాయై కోదండాత్ బాణేన రాక్షసస్య లంకే రావణం హంతి.
తెలుగు సేత :రాముడు సీత కొఱకు కోదండము నుండి బాణముతో రాక్షసుల యొక్క లంక యందు రావణుని చంపెను.
ఈ వాక్యాన్ని అర్ధం చేసుకోవడానికి మాత్రమే కాదు, ఏర్పరచడానికి కూడా వ్యాకరణ జ్ఞానం కావాలి.
----------
ప్రశ్న 01:కో హంతి? (ఎవడు చంపెను?)
జవాబు :రామః హంతి. (రాముడు చంపెను)
ఫలితం :రామః అనేది కారకము. క్రియతో ఆ పదానికి ఉన్న సంబంధం కర్త. తెలుగు వ్యాకరణంలో ప్రధమ విభక్తి అవుతుంది. ఇంగ్లేషులో దీన్ని subject case అంటారు.
ప్రశ్న 02:కిం హంతి? (ఎవడిని చంపెను?)
జవాబు :రావణం హంతి. (రావణుణ్ణి చంపెను)
ఫలితం : రావణం అనేది కారకము. క్రియతో ఆ పదానికి ఉన్న సంబంధం కర్మ. తెలుగు వ్యాకరణంలో ద్వితీయ విభక్తి అవుతుంది. ఇంగ్లేషులో దీన్ని object case అంటారు.
ప్రశ్న 03:కేన హంతి? (దేని ద్వారా చంపెను?)
జవాబు :బాణేన హంతి. (బాణముతో చంపెను)
ఫలితం :బాణేన అనేది కారకము. క్రియతో ఆ పదానికి ఉన్న సంబంధం కరణం. తెలుగు వ్యాకరణంలో తృతీయ విభక్తి అవుతుంది. ఇంగ్లేషులో దీన్ని instrument case అంటారు.
ప్రశ్న 04:కస్మయి హంతి? (ఎవరి కొఱకు చంపెను?)
జవాబు :సీతాయై హంతి. (సీత కొఱకు చంపెను)
ఫలితం :సీతాయై అనేది కారకము. క్రియతో ఆ పదానికి ఉన్న సంబంధం సంప్రదానం.తెలుగు వ్యాకరణంలో చతుర్ధ విభక్తి అవుతుంది. ఇంగ్లేషులో దీన్ని gift case అంటారు.
ప్రశ్న 05:కస్మాత్ హంతి? (దేని నుండి చంపెను?)
జవాబు :కోదండాత్ హంతి. (కోదండము నుండి చంపెను)
ఫలితం :కోదండాత్ అనేది కారకము. క్రియతో ఆ పదానికి ఉన్న సంబంధం అపాదానం. తెలుగు వ్యాకరణంలో పంచమి విభక్తి అవుతుంది. ఇంగ్లేషులో దీన్ని seperation case అంటారు.
ప్రశ్న 06:కస్మిన్ హంతి? (ఎచ్చట చంపెను?)
జవాబు :లంకే హంతి. (లంక వద్ద చంపెను)
ఫలితం :లంకే అనేది కారకము. క్రియతో ఆ పదానికి ఉన్న సంబంధం అధికరణం. తెలుగు వ్యాకరణంలో సప్తమి విభక్తి అవుతుంది. ఇంగ్లేషులో దీన్ని location case అంటారు.
ప్రశ్న 07:కస్య లంకా? (ఎవరి యొక్క లంక?)
జవాబు: రాక్షసస్య లంకా. (రాక్షసుల యొక్క లంక)
ఫలితం: రాక్షసస్య అనేది కారకము కాదు. క్రియతో ఆ పదానికి సంబంధం లేదు. క్రియ కాక వాక్యంలోని ఇతర పదాలతో్ సంబంధం ఉంటుంది కాబట్టి సంబంధ కారకం అనే ప్రత్యామ్నయం ఉన్నది.తెలుగు వ్యాకరణంలో షష్టి విభక్తి అవుతుంది. ఇంగ్లేషులో దీన్ని attachment case అంటారు.
----------
ఇప్పుడు పైన ఇచ్చిన వాక్యాన్ని తెలుగు విభక్తుల వరసలో కూర్చి చూపిస్తాను:
రామః రావణం బాణేన సీతాయై కోదండాత్ రాక్షసస్య లంకే హంతి.
తెలుగుకి వ్యాకరణం ఏర్పరచిన నన్నయ్య గారు విభక్తులకు సంఖ్యమానం ఉపయోగించి స్వతంత్రత చూపించారు.కానీ english grammer 01.కర్త కారకం =subject case, 02.కర్మ కారకం = object case, 03.కరణ కారకం = instrument case, 04.సంప్రదాన కారకం = gift case, 05.అపాదాన కారకం = seperation case, 06.సంబంధ కారకం = attachment caae, 07.అధికరణ కారకం = location case అని సంస్కృత వ్యాకారణాన్ని మక్కీకి మక్కీ అనుసరించింది.అంతే కాదు బ్రదర్స్, మానవ జాతి మొట్ట మొదట మాట్లాడినది - వేదాన్ని మనకు చెప్పిన సృష్టికర్త యొక్క మాతృభాష అయిన గీర్వాణ భాషనే.
జై శ్రీ రామ్!
10, అక్టోబర్ 2025, శుక్రవారం
వేదాల సారం పురాణాలలో
శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹మన సనాతన సంప్రదాయాల గురించి తెలుసుకోవలసినవి ఎన్నో.. ఎన్నెన్నో. వేదాల సారం పురాణాలలో ఉంటే, ఆ పురాణాల సారం శ్రీభారత్ ఛానల్ లో ఉంటుందన్నట్లుగా ప్రతివారం ఆ పురాణ కథలు మీ ముందుకు తెస్తున్నాం. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఆ కథలను అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
శుక్రవారం🌹*_ *10అక్టోబర్2025* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
_*🌹శుక్రవారం🌹*_
*10అక్టోబర్2025*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సంకష్టహర చతుర్థి*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరత్ఋతౌః*
*ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం*
*తిథి : చవితి* రా 07.37 వరకు ఉపరి *పంచమి*
*వారం : శుక్రవారం* ( భృగువాసరే )
*నక్షత్రం : కృత్తిక* సా 05.31 వరకు ఉపరి *రోహిణి*
*యోగం : సిద్ధి* సా 05.31 వరకు ఉపరి *వ్యతీపాత*
*కరణం : బవ* ఉ 09.14 *బాలువ* రా 07.37 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.30 - 10.30 సా 04.30 - 05.30*
అమృత కాలం : *సా 03.22 - 04.48*
అభిజిత్ కాలం : *ప 11.31 - 12.18*
*వర్జ్యం : ఉ 06.47 - 08.12*
*దుర్ముహూర్తం : ఉ 08.21 - 09.08 మ 12.18 - 01.05*
*రాహు కాలం : ఉ 10.25 - 11.54*
గుళికకాళం : *ఉ 07.28 - 08.57*
యమగండం : *మ 02.52 - 04.21*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం :*ఉ 06.08*
సూర్యాస్తమయం :*సా 05.57*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.59 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.43*
మధ్యాహ్న కాలం : *10.43 - 01.05*
అపరాహ్న కాలం : *మ 01.05 - 03.27*
*ఆబ్ధికం తిధి : ఆశ్వయుజ బహుళ చవితి*
సాయంకాలం :*సా 03.27 - 05.50*
ప్రదోష కాలం : *సా 05.50 - 08.15*
రాత్రి కాలం :*రా 08.15 - 11.30*
నిశీధి కాలం :*రా 11.30 - 12.19*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.10*
******************************
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*
*ఇచ్ఛారూపాం భగవత*
*స్సచ్చిదానందరూపిణీమ్*
*🪷ఓం శ్రీ🪷*
*🌷మహాలక్ష్మీయై నమః🌷*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
అంశం.. వర్షం (బాల గేయం)
అంశం.. వర్షం (బాల గేయం)
శీర్షిక.. చిటపట చినుకులు!
బాలల్లారా రారండి
ఉరకులు వేసే ఉత్సాహంతో
పరుగులు తీస్తూ రారండి
చిటపట చినుకుల్లో చిందులు వేయగా రారండి..
నింగికి నేలకు నిచ్చెన లేస్తూ
మబ్బులు పందిరి వేసాయండీ
చల్లని గాలులు వీచాయండి
చిటపట చినుకుల్లో చిందులు వేయగ రారండి..
ముత్యాల తలంబ్రాలు చల్లాయండీ
మట్టిని మాణిక్యంలా చేస్తూ
సిరి సౌభాగ్యాలను పండించేందుకు
శ్రీరస్తు శుభమస్తని దీవించాయండీ..
కురిసాయండీ వానజల్లులు
చెట్టూ చేమా పులకించగా
విరుల హరివిల్లులు వికసించగా
పైరూ పంటలు సయ్యాటలు ఆడగా..
ఏరులు సెలయేరులు ఝరులై పొంగగా
నదులు అలలతో కిలకిలలాడగా
ప్రకృతి కన్నియ పైయెద ఉప్పొంగగా
ఆనందాలు చిగురులు వేయగా..
చిందులు వేద్దాం చిటపట చినుకులతో
గెంతులు వేద్దాం వానా వానా వల్లప్పతో
జోరుగా కురిసే వానలో హుషారుగా
కిలకిల కలకల నవ్వుల నదిలో ఆటలు ఆడేద్దాం..!
*******
ఇది నా స్వీయ బాలగేయం
మహిత మార్గ శీర్షం
ఓం శ్రీ మాత్రే నమః
9-10-25
మహిత మార్గ శీర్షం
(అవధాన పుష్కరిణీ అంతర్జాల మాస పత్రికార్థం)
(కవితా ఖండిక)
డా.రఘుపతి శాస్త్రుల
మాసములందు మార్గ శిర మాసమె శ్రేష్ఠ మటంచు చెప్పె వి
శ్వాసము గూర్చు నట్లు భగవానుడు కృష్ణుడు వర్షమందు నీ
మాసపు ధ్యాన సంపదలు మానిత సత్ఫలితార్థ సిద్ధితో
భాసిత రీతులన్ సుగతి వర్ధిల గూర్చుచు నుండు నెప్పుడున్
స్కందుడు షష్ట మాతృకల సంపదగా జననమ్మునందె యీ
సుందరమైన షష్టిని, సుశోభిత రీతుల నొప్పు పూజలా
నందము తోడ గైకొను సనాతన దైవము, భక్తి చిత్తమం
దొంద, ననుగ్రహమ్మును యథోచిత రీతుల గూర్చు నీశుడున్
గీతాచార్యుని కృష్ణునిన్ జగతి సంక్షేమ ప్రదానార్థమౌ
గీతార్థమ్ము స్మరించినన్ సుమతితో కీర్తింప ప్రద్యుమ్నుడున్
చేతోమోదమునందు మాసమిదియే శీఘ్రమ్ముగా స్తోత్రముల్
ప్రీతిన్ గాంచుచు సద్గతుల్ గనగ సంవేద్యుండు గూర్చున్ సదా
దత్తాత్రేయుడు దివ్య రూపుడు భువిన్ తత్త్వార్థ త్రైలోక్య సం
పత్తిన్ గాంచిన మాసమిద్ది తలపన్ వైవిధ్యమౌ రీతులన్
దత్తోపాసన జేయగల్గినను ప్రత్యక్ష స్తుతిన్ పూర్ణిమన్
బత్తిన్ సాధన జేయువారలిలలో వర్ధిల్లగన్ సాధ్యమౌ
సమశీతోష్ణపు శోభలం గనుచు ప్రాశస్త్యమ్ముగా పృథ్వియున్
తమికాన్పించుచు వేడ్క చేయు నెదకున్ తాల్మింగనన్ కర్షకుల్
తమదౌ త్యాగము వర్ధిలన్ కృషిని సంధానింప నీ నేలయున్
రమణీయమ్మగు సంపదన్ హరిత సామ్రాజ్యంపు సొంపొప్పెడిన్
నమస్సులతో
డా.రఘుపతి శాస్త్రుల
హైదరాబాద్
రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
మూత్రపిండాలు-Kidneys*
*మూత్రపిండాలు-Kidneys*
➖➖➖✍️
*Kidneys : ఈ తప్పులు చేశారంటే.. మూత్రపిండాలు దెబ్బ తింటాయి జాగ్రత్త..!*
```
మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో మూత్ర పిండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మూత్ర పిండాలు నిరంతరంగా పని చేస్తూనే ఉండాలి. శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను వడబోసి మూత్ర పిండాలు వాటిని బయటకు పంపిస్తాయి. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది మూత్రాశయ సంబంధిత సమస్యలు, మూత్ర పిండాలలో రాళ్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం, తాగే నీటి శాతంపై ఆధారపడి ఉంటుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండడానికి మనం పాటించాల్సిన సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
*1. మద్యపానం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. మద్యం మూత్ర పిండాలపై ఒత్తిడిని కలిగించి అవి దెబ్బ తినేలా చేస్తుంది. కనుక మద్యపానం చేయకపోవడమే ఆరోగ్యానికి చాలా మంచిది.
*2. మనలో చాలా మంది మూత్రం వచ్చినప్పుడు వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మూత్రపిండాలకు ఎంతో హాని కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. మూత్రం వచ్చిన వెంటనే పోసేయాలి.
*3. మనం రుచి కోసం వంటల్లో ఉపయోగించే ఉప్పు కూడా మూత్రపిండాల పని తీరును దెబ్బ తీస్తుంది. ఉప్పును అధికంగా వాడడం వల్ల అధిక రక్త పోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రోజుకి 5 గ్రాముల కంటే అధికంగా ఉప్పును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
*4. పంచదార అధికంగా కలిగిన పదార్థాలను, పానీయాలను తీసుకోవడం వల్ల కూడా మూత్ర పిండాలలో రాళ్లు వస్తాయి. కనుక వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది.
*5. శరీరానికి తగినంత నిద్ర లభించక పోతే మూత్రపిండాలు అనారోగ్యాలకు గురవుతాయి. కనుక రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు అయినా సరే నిద్రపోవాలి.
*6. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి అధికంగా పడి మూత్ర పిండాలు త్వరగా దెబ్బ తింటాయి. కనుక ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.
7. శరీరంలో విటమిన్స్, మినరల్స్ లోపం వల్ల కూడా మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. విటమిన్ బి6, విటమిన్ ఎ, మెగ్నిషియం అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మూత్ర పిండాల పనితీరు మెరుగుపడడమే కాకుండా మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
*8. మనం తాగే నీరు మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రాధాన పాత్ర పోషిస్తుంది. మనం రోజుకి కనీసం 6 నుండి 7 గ్లాసుల నీటిని తీసుకోవడం వల్ల మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ నియమాలను పాటించడం వల్ల మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే మూత్ర పిండాలలో రాళ్లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.✍️```
-సేకరణ.
మన గ్రూప్ లోవచ్చే ఆర్టికల్స్
కేవలం గ్రూప్ సభ్యుల అవగాహన కోసం మాత్రమే!
మీ అన్ని ఆరోగ్య సమస్యలకు మీమీ డాక్టర్ గారి సలహాలను పాటించండి 🙏
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
9, అక్టోబర్ 2025, గురువారం
Panchaag
శత విహాయ భోక్తవ్యం సహస్రం స్నాన మాచరేత్ లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్యా హరిం భజేత్!!
వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి.
వేయి పనులు విడిచి స్నానం చేయాలి .
లక్ష పనులు విడిచి దానం చేయాలి. కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి.
7, అక్టోబర్ 2025, మంగళవారం
వాల్మీకి జయంతి
ఓం శ్రీ మాత్రే నమః
7-10-25
వల్మీకమ్మున పుట్టి నట్టి ఘను సంపద్రాజ సన్మార్గమున్
తాల్మిన్ సృష్టిని జేసినట్టి ఋషికిన్ ధర్మార్థ కామమ్ములన్
కల్మిన్ తీర్చిన రామచంద్ర వినుతున్ కావ్యాత్మ రామప్రభున్
వాల్మీకిన్ వినుతింతు సన్నుతుల నొప్పన్ రామ సంకీర్తనన్
శ్రీ మద్రామాయణ కావ్య శిల్పి ఆది కవి వాల్మీకి జయంతి సందర్భంగా ఆ మహర్షిని సంస్మరించుకుంటూ నమస్సులతో
డా. రఘుపతి శాస్త్రుల




