5, నవంబర్ 2025, బుధవారం

బుధవారం*🌷 *🪷05నవంబర్2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌷 *బుధవారం*🌷 

 *🪷05నవంబర్2025🪷*    

    *దృగ్గణిత పంచాంగం* 

              

          *ఈనాటి పర్వం*     

         *జ్వాలాతోరణం*

          *కార్తీక పౌర్ణమి* 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు*

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి  : పౌర్ణమి* ‌సా 06.48 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం  : అశ్విని* ఉ 09.40 వరకు ఉపరి *భరణి*

*యోగం : సిద్ధి* ఉ 11.28 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : భద్ర* ఉ 08.44 *బవ* సా 06.48 ఉపరి 

 *బాలువ* (06) తె 04.51 ఆపైన *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *రా 02.23 - 03.47*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : ఉ 06.09 - 07.33 & సా 06.01 - 07.25*

*దుర్ముహూర్తం  : ప 11.28 - 12.14*

*రాహు కాలం   : ప 11.51 - 01.17*

గుళికకాళం      : *ఉ 10.25 - 11.51*

యమగండం    : *ఉ 07.33 - 08.59*

సూర్యరాశి : *తుల                        

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.16*

సూర్యాస్తమయం :*సా 05.43*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.06 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.42*

మధ్యాహ్న కాలం    :    *10.42 - 01.00*

అపరాహ్న కాలం    : *మ 01.00 - 03.18*

*ఆబ్ధికం తిధి         : కార్తీక పౌర్ణమి*

సాయంకాలం        :  *సా 03.18 - 05.35*

ప్రదోష కాలం         :  *సా 05.35 - 08.06*

రాత్రి కాలం           :*రా 08.06 - 11.26*

నిశీధి కాలం          :*రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.27 - 05.17*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🔯శ్రీ సరస్వతీ కవచం🔯*


*ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై* 

*స్వాహా మాం వారుణేఽవతు*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

    🌹🌷🪷🌷🌷🪷🌹

పదకొండు ఇంద్రియాలు

 పదకొండు ఇంద్రియాలు

సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు.


ఆ పదకొండులో....


1. అయిదు జ్ఞానేంద్రియాలు,

2. అయిదు కర్మేంద్రియాలు, మనసు ఉన్నాయి.


1.శ్రోత్రం (చెవి),

2.త్వక్‌ (చర్మం),

3.చక్షుషీ (కన్నులు),

4.జిహ్వా (నాలుక),

5.నాసికా (ముక్కు) అనేవి జ్ఞానేంద్రియాలైతే,


1.పాయు (మలద్వారం),

2.ఉపస్థ (మూత్రద్వారం),

3.హస్త (చేతులు),

4.పాద (కాళ్లు),

5.వాక్‌ (మాట) అనేవి కర్మేంద్రియాలు.

ఈ పదింటికి చివర మనసు.


ఇదీ ఇంద్రియ సమూహం.

ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి.

ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి.

ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య.

ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని,

కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.


1.మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.

2.చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.

3.కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.

4.నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.

5.ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.

6.మల, మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి.

7.కాళ్లూ చేతులూ హింసను ఆచరిస్తాయి.

8.మాట అదుపు తప్పుతుంది. ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,

9.మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.

అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే.

మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.

అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.

చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం.

ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే.

అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు. 

ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు.

కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం.

లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి.

ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు.

ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి.

పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది.

ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం. 

అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది.   

మెదడును చక్కగా ఉంచుకోవడానికి ‘ఆయుర్వేదం’ ఇలా మార్గోపదేశం చేస్తోంది-


’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’ 

ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే!

4, నవంబర్ 2025, మంగళవారం

కార్తీకపురాణం - 14 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

  🍁 _*మంగళవారం*_🍁

🕉️ *నవంబర్ 4, 2025*🕉️


*కార్తీకపురాణం - 14 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️

               

(ఆబోతును అచ్చుబోసి వదులుట {వృషోత్సర్గము} )

```

వశిష్ఠుల వారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి..


“ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానముచేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు. వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమం దెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు.


ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును.


కావున ప్రతిసంవత్సరం కార్తీక మాసమున తనశక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆరాత్రియంతయు జాగారముండి మరునాడు తమశక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములననుభవింతురు.

```


*కార్తీకమాసములో విసర్జింపవలసినవి:*

```

ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు. తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారమునాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు.


కార్తీకమాసమున నెలరోజులూ కూడా కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు.


కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.


ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.```


శ్లో!! గంగే యమునే చైవ గోదావరి సరస్వతీ

నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధింకురు!!```

అని పై తెలిపిన శ్లోకం పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయం కాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను.

```

కార్తీక మాస శివపూజాకల్పము:```

1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి


2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి


3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్నసింహాసనం సమర్పయామి


4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి


5. ఓం లోకేశ్వరానమః - ఆర్ఘ్యం సమర్పయామి


6. ఓం వృషభవాహనాయనమః - స్నానం సమర్పయామి


7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి


8. ఓం జగన్నాథాయనమః - యజ్ఞోపవీతం సమర్పయామి


9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి


10. ఓం సంపూర్ణ గుణాయనమః - పుష్పం సమర్పయామి


11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్‌ సమర్పయామి


12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి


13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి


14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి


15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి


16. ఓం శంకరాయనమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి


17. ఓం భవాయనమః - ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి


ఈప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తనశక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను.


ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారధన చేసిన ఎడల, వారికీ, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును.


శక్తి కలిగియుండికూడా యీ వ్రతము నాచరించనివారు వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోకతముగా ఆచరించిన యెడల పదిహేను జన్మలయొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*


  *పద్నాల్గవ అధ్యాయము*  

      _*పద్నాల్గవ రోజు*_ 

 *పారాయణము సమాప్తం*


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

ఏకాదశ రుద్రులు

 1 *కోనసీమలో కొలువైన ఏకాదశ రుద్రులు* 🙏


*🕉️శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తారు🕉️*

.

*”🕉️విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమ:” అని రుద్రనమకంలో చెప్పబడినది.*


*🕉️దీనిప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు –

 1. విశ్వేశ్వరుడు 

2.మహాదేవుడు

3. త్రయంబకుడ 

4.త్రిపురాంతకుడు 

5.త్రికాగ్నికాలుడ

6.కాలాగ్నిరుద్రుడు

7. నీలకంఠుడు, 

8,మృత్యుంజయుడు

9.సర్వేశ్వరుడు 

10. సదాశివుడు

11. శ్రీమన్మహాదేవుడు* 


*🕉️ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొనివున్నారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు సమావేశమవుతారు. అలా సమావేశమైన ఏకాదశ రుద్రులను ఒకేచోట చూస్తే మంచిదనే విశ్వా సంతో వేలాదిమంది భక్తులు విచ్చేస్తారు*.


*1. 🕉️విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం. (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వరస్వామి): పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివ లింగరూపాన్ని పొందిందని కథ. వ్యాఘ్రము శివునిగా అవతరించు టచే వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను*


*2. 🕉️మహాదేవరుద్రుడు- కె.పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి): విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళ డానికి ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అపుడు శివుని ప్రార్ధించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకు ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపుమనెను. మేనక ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి)లో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడెను*.

 

*3. 🕉️త్రయంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి): రావణుని సంహరించిన తరువాత శ్రీరామ చంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండ గా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచి పోయింది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించెనని కథ కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందు కు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనంద రామేశ్వ రుడని పిలువబడెను.*

 

*4. 🕉️త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వే శ్వరస్వామి): తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సం#హ రింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామం లో శివలింగరూపంలో ఆవిర్భవించెనని కథ. అపుడు ఆ గ్రామపు బ్రాహ్మ ణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను..*


*5. 🕉️త్రికాగ్నికాలరుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి): మూడు అగ్నుల యందు హోమం చేసిన ద్రవ్యా లను స్వీకరించి శివుడు లింగ రూపాన్ని పొందుటచే త్రికాగ్నికాలునిగా పిలువబడి అగస్త్య మహర్షిచే నేదునూరులో ఈ శివలింగం ప్రతి ష్ఠింపబడి నది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వరస్వామిగా కొలువబడుచున్నాడు*.

 

*6. 🕉️కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ రాఘవేశ్వరస్వామి): రావణ సంహారం తరు వాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రాలను, ఖడ్గం ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింప బడుట వల్ల రాఘవేశ్వరస్వామి అని, పాండవ వనవాసంలో శివుడు అర్జు నుని పరీక్షింపదలచి కిరాతుని వేషంలో అర్జునుని ధైర్యపరా క్రమాలను చూచి పాశుపతాస్త్రం ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరొక కథ* .


*7. 🕉️నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి): దేవతలు- రాక్షసులు క్షీరసాగర మధన సమయం లో వెలువడిన విషవాయువులను శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసికొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంత భోగాలను అందించేవాడు, అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించిన వాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను*.

 

*8. 🕉️మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి): శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యు ముఖము నుండి రక్షించి, యముని జయించి ”మృత్యుంజయుడు” అయ్యె ను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించి చెన్న మల్లేశ్వ రస్వామిగా పిలువబడెను.*


*9. 🕉️సర్వేశ్వర రు ద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి): దక్షుని యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్ప డిన అగ్నిజ్వాలల్లో కాలి బూడిద అయినపుడు శివుడు ఆగ్రంహంచి ఉగ్రరూపుడై నృత్యము చేసి తన జటాజూట ములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీర భద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసాడు. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారంలో వేదపండి తు లైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను*.

 

*10. 🕉️సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీచెన్నమల్లేశ్వర స్వామి): పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరు గొప్ప వారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు. అపుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణు వును తన పాదాలను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదాలను కను గొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడకపోయినను ఒక ఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆ లింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను*.


*11. 🕉️శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు): పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆ మహాదేవు డు పుల్లేటికుర్రు గ్రామంలో లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి ”పుండరీకపురము” అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీ కము అనగా వ్యాఘ్రము (పులి) అని అర్ధం. వ్యాఘ్రేశ్వరరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుటచేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను*. 


*🕉️సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు.🕉️*

అగ్గిపెట్టె ఫోను (చిన్ననాటి జ్ఞాపకాలు)

 

అగ్గిపెట్టె ఫోను (చిన్ననాటి జ్ఞాపకాలు)

మనలో అగ్గిపెట్టె ఫోను గురించి తెలియని వాళ్ళు ఎందరు వున్నారు చెప్పండి. ఈ రోజుల్లో పిల్లకు ఆడుకోవటానికి అనేకమైన ఆట వస్తువులు మార్కెట్లో దొరుకుతున్నాయి.  అంతే కాక వాటిని కోనేటంత ఆర్థికస్తోమత ఈ నాటి తల్లిదండ్రులకు వుంటున్నది. చిన్నపిల్లల చేతుల్లో కూడా సెల్ఫోనులు, టాబిలెట్లు, లాప్టాప్లు ఉండటం చేత వాళ్లకు వాళ్ళ తెలివితేటలతో ఆటవస్తువులను చేసుకొని ఇతర స్నేహితులతో కలిసి ఆడటానికి తగిన సమయంలేదు అంతే కాకుండా వాళ్లకు తెలియనుకూడా తెలియదు. అన్నీ ఆధునికమైన ఆటవస్తువులే వాటి ఖరీదులు ఆకాశాన్ని అంటుతున్నా కూడా తల్లిదండ్రులు కొనక మానటం లేదు.  కానీ పూర్వకాలంలో అట్లా కాదు ఒక ఇంట్లో ఐదు నుండి పదిమంది పిల్లలు ఉండేవారు ఒకడు హైస్కూలు చదువు చదువుతుంటే ఇంకొకడు ప్రేమారి స్కూల్లో ఇక చిన్నది లేక చిన్నవాడు అమ్మ వడిలో బడినుంచి వచ్చిన పిల్లలకు ఇంట్లోకి రాగానే తన తమ్ముడు లేక చెల్లెలిని ఎత్తుకొని ఆడించే పని ఉండేది అమ్మా వీడు ఏడుస్తున్నాడు. వీడు ఉచ్చపోశాడు, దొడ్డికి పోయాడు అని తల్లితో చెపితే వంట చేసుకుంటున్న తల్లి తన చేతిని పవిట కొమ్ముకు తుడుచుకొంటూ ఏరా తమ్ముడిని చూసుకోలేవా ప్రతిదానికి నన్ను పిలవాలా అవతల పోపు మాడిపోతున్నది, దోశ కాలిపోతుంది అని విసుకు కుంటూ వచ్చి చంటి పిల్లవాడిని చూసుకుంటుండేది.  మరి ఇప్పుడు యెడ పిల్లలకు చంటిపిల్లలను చూసుకునే ప్రేమ, భాద్యత లేదు. అందుకే పిల్లలకు వాళ్ళ తోబుట్టువులమీద తల్లిదండ్రులమీద ప్రేమ సన్నగిల్లుతుంది. అవునా కాదా. ఇంట్లో చంటివానికి విరోచనాలు అయ్యాయి అంటే ఇంటిల్లపాతి మేలుకొని ఉండేవారు.  భగవంతుడా మా తమ్ముడికి విరోచనాలు తొందరగా తగ్గించేయి   అని . విజ్ఞేశ్వర నీకు 11 గుంజిళ్లు తీస్తాను అని మరీ మొక్కుకునేవారు. అది అన్నా లేక అక్కల ప్రేమ తల్లులు పిల్లలను కంటే అక్కలు వాళ్ళను సాకేవారు. పోత పాలమీద వున్న పిల్లలైతే పాలు పట్టటం కూడా అక్కల పనే .  సీతా  రా ఆడుకుందాము అంటే ఉండేవే మా తమ్ముడికి పాలు పట్టి వస్తా అనే సీతలు లక్స్మీలు నాగమణిలు ఎంతమందో మీకు జ్ఞాపకం ఉందా, తొక్కుడుబిళ్ల, దాగుడు మూతలు, గుంజిళ్ళు ఆడుతూ ఆడపిల్లలు వీధులలో ఉండేవారు. మరి ఇప్పుడు చూద్దామన్నా ఒక్కళ్ళు కూడా లేరు. వీధిలో ఆడుకునే పిల్లలతో తండ్రిగారి స్నేహితులు ఎమ్మా మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా అంటే ఒక్కొక్కసారి వున్నారని లేకపోతె ఆటలో నిమగ్నులైన పిల్లలు ఆదమరచి మా నాన్నగారు ఇంట్లో లేరు అంటే మరుసటిరోజు ఆయన వచ్చి ఏమండీ సీతారామయ్యాగారు నిన్న మీరు ఇంట్లో లేరా ఎక్కడిపోయారు అని అడిగితె అప్పుడు నాన్నగారు నేను ఎక్కడి వెళ్ళాను ఇంట్లోనే కదా వున్నాను, అంటే మీ అమ్మాయి సీత మీరు ఇంట్లో లేరని అన్నదే అంటే ఎమ్మా నేను లేనని అన్నవా మామయ్యతో అని అడిగితె ఏమో నాన్న  నాకు జ్ఞాపకం లేదు అనే అమ్మాయిలు కోకొల్లలు. నిజానికి తోటి స్నేహితులతో ఆటలాడే పిల్లలకు వారి లోకమే వేరు వారికి ఇల్లు, తల్లిదండ్రులు మదిలో వుండనే వుండరు. అది కదా బాల్యం అంటే. ఇట్లా చెప్పుకుంటూ వెళితే అనేకమైన విషయాలు ఉంటాయి. ఇక విషయానికి వద్దాం. 

చిన్నప్పుడు స్వయంగా చేసుకొని ఆదుకునే ఒక ఆట టెలిఫోను ఆట. ఆ రోజుల్లో గడ్డఫోను (P&T ) ఫోన్ ఏ కొంతమంది ధనవంతులకు మాత్రమే వుండెది ఎప్పుడైనా ఏ పిల్లవాడో అరే నేను హైదరాబాదులో  మా మామయ్యా వాళ్ళ ఇంట్లో ఫోనులో మాట్లాడాను తెలుసా అని ఒక రమణారావు అంటే వాడి చుట్టూ తోటి స్నేహితులందరూ చేరి అరె ఫోను యెట్లా ఉంటుంది అందులో మాటలు యెట్లా వస్తాయి ఆ హ్యాండిల్ యెంత బరువు ఉంటుంది. నీవు మాట్లాడింది నల్ల ఫొనేనా లేక అది ఇంకో రంగులో ఉందా అని అనేక ప్రశ్నలతో ముంచెత్తు తారు . వాళ్ళ ప్రశ్నలకు ఓపికగా సమాదానాలు చెప్పే రమణారావు తన తోటి స్నేహితులకన్నా తానూ ఎంతో గొప్ప పని చేసినట్లు బిల్డప్ చేసి వాళ్ళతో ప్రవర్తించటం. చాలామందికి  గతంలో వున్న అనుభవమే. 

పిల్లలలో కొంత తెలివితేటలు ఎక్కువ వున్న వాళ్ళు అగ్గిపెట్టి ఫోను చేసేవారు.  దానిని తోటి స్నేహితులు ఒకరి తరువాత ఒకరుగా మాట్లాడే వారు. అరే నేను ముందు అంటే నేను ముందు అని పోట్లాడుకునే వారు. ఈ ఫోను తయారీకి రెండు అగ్గి పెట్టలను తీసుకొని వాటిలొని లోపలి అరలను తీసుకొని ఫై కేసును పారేసి అరలమధ్యన ఒక పిన్నీసుతో చాలా  జాగ్రత్తగా ఒక సన్నని రంధ్రాన్ని చేసి దానిలోకి దారాన్ని పంపి ఆ దారానికి ఒక చిన్న చీపురు పుల్లను కట్టాలి. దారం ఒక 10 నుంచి 20 అడుగులు తీసుకొని దాని రెండొవ కొసకు కూడా ఇదేవిధంగా అగ్గిపెట్టె అరను కట్టాలి. ఇక మీ ఫోను సిద్ధం. ఈ ఫోను తయారు చేయటానికి నైపుణ్యం వున్న బాలునికి ఒక పది నిముషాలు చాలు. ఒక వైపు వున్న  అగ్గిపెట్టను (అరను) నోటి ముందు పెట్టుకొని మాట్లాడితే రెండవ వైపు అగ్గిపెట్టెను అవతలి వాడు చెవిలో పెట్టుకొని వింటే మాట వినపడుతుంది. తరువాత రెండవ వాడు తన అగ్గిపెట్టెను నోటిముందు పెట్టుకొని మాట్లాడితే మొదటివాడు తన అగ్గిపెట్టను చెవిలో పెట్టుకొని వినవచ్చు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మైక్రోఫోనుగా స్పీకర్ గా  ఒకే అగ్గిపెట్టి పని చేస్తుందన్నమాట. ఇట్లా మాట్లాడేటప్పుడు రెండు విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి దారం సాధ్యమైనంత గట్టిగ ఉండాలి. రెండు. ఆ దారాన్ని ఎవ్వరు తాకకూడదు. మొదటి వాడు అగ్గిపెట్టి ముందు మాట్లాడితే ఆ శబ్ద తరంగాలు అగ్గిపెట్టి లోపలి కాగితాన్ని తాకి శబ్ద తరంగాలకు అనుగుణంగా అది కదిలి ఆ తరంగాలను దారం ద్వారా రెండవ అగ్గిపెట్టి లోపలి కాగితాన్ని కదిలించి మరలా శబ్దాన్ని పుట్టిస్తుంది. ఇది అది పనిచేసే విధానం. నిజానికి ఇందులో పూర్తిగా ఫిజిక్స్ వున్నది.  కానీ ఏ మాత్రం శాస్త్రీయ పరిజ్ఞానం లేని ఆ వయస్సులో అది తయారుచేయటం. దానిని ఉపయోగించి ఆడుకోవటం నిజంగా ఒక ఆనందదాయకమైన విషయం కదా. మీరేమంటారు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ

 


  

3, నవంబర్ 2025, సోమవారం

కార్తీకపురాణం - 13 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

    🕉️ _*సోమవారం*_🕉️

🌹 *నవంబర్ 3, 2025*🌹


*కార్తీకపురాణం - 13 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️

           

        *కన్యాదాన ఫలం*```

                

“ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము..

       

కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును.

            

ఈవిధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినయెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, యెంతటి దుష్కృత్యములు చేసియున్ననూ, యెంతటి వ్యభిచారం చేసియున్ననూ, అ పాపములన్నియూ పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము జేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు.

           

అంతకన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసినయెడల తను తరించుటయేగాక తన పితృదేవతలను కూడ తరింప జేసిన వాడగును. ఇందుల కొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము..

```


*సువీర చరిత్రము:*``` ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన ‘సువీరు’ డను ఒక రాజుండెను. అతనికి రూపవతి యను భార్యకలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన హీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను.

           

కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతి గారాబముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను.

               

దినములు గడచినకొలదీ, బాలికకు నిండు యౌవన దశ వచ్చెను. ఒకదినము వనప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు “ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్ట దరిద్రములు అనుభవించు చున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నాకుమారై నిచ్చి పెండ్లి చేతు” నని చెప్పగా తన చేతిలో రాగి పైసా యైననూ లేక పోవుటచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను.

              

రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి, తనకుమారైను మునికుమారునికిచ్చి పెండ్లిచేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించు చుండెను.

              

సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖంగా వుండెను. 


అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. అ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.

               

ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని “ఓయీ! నీవెవ్వడవు? నీముఖ వర్చస్సుచూడ రాజవంశము నందు జన్మించినవానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?” అని ప్రశ్నించగా, సువీరుడు “మహానుభావా! నేను వంగదేశమునేలు చుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువు లాక్రమించుటచే భార్యా సమేతముగా 

నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటె కష్టమేదియునూ లేదు. పుత్ర శోకము కంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటిలేదు. అందుచే రాజ్య భ్రష్ఠుడనయినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను.

నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి, వాని వద్ద కొంతధనము పుచ్చుకొంటిని. దానితోనే యింతవరకు కాలక్షేపము చేయుచున్నాను” అని చెప్పగా, “ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించినవారు “అసిపత్ర వన” మను నరక మనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృ దేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకమనుభవించును. కన్యావిక్రయము జేసినవారికి యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున, రాబోయే కార్తీకమాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధిగలవానికి కన్యాదానము చేయుము. అటులచేసిన యెడల గంగాస్నానమొనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగి పోవును” అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి..

“ఓ మునివర్యా! దేహ సుఖము కంటె దాన ధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడువమంటారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరుకాని ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్కచిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు, కాన, నా రెండవ కుమర్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యా దానము మాత్రము చేయను” అని నిక్కచ్చిగా నుడివెను. 


ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.

       

మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవన మను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తి యను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.

             

అంతట శ్రుతకీర్తి “నేనెరిగున్నంతవరకును యితరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?” నని మనసున అనుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజుకడకేగి, నమస్కరించి “ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటి నంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు” అని ప్రాధేయ పడెను. 


అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి, “శ్రుతకీర్తీ! నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనేవారి పూర్వీకులు యిటు మూడు తరాలవారు అటు మూడు తరాల వారున్నూ వా రెంతటి పుణ్యపురుషులైననూ నరక మనుభవించుటయే గాక, నీచ జన్మ లెత్తవలసి యుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును గాన, నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదమువలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము.అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకేగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివాహ మొనర్చినను కన్యాదానఫలమబ్బును.

కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యమువలన నీ పితృగణము తరింతురు. పొయి రమ్ము!” అని పలికెను.


శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీక మాసమున సువీరుని రెండవ కుమారైను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక బ్రాహ్మణ యువకునికిచ్చి అతివైభవంగా వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ లోకములో నున్న పితృ దేవతలను కలిసికొనెను.


కన్యా దానము వలన మహా పాపములు కూడా నాశన మగును. 


వివాహ విషయములో ఎవరికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షబూని ఆచరించినవాడు విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమున కేగును.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*


  *పదమూడవ అధ్యాయము*  

     _*పదమూడవ రోజు*_ 

 *పారాయణము సమాప్తం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

      *🕉️సోమవారం🕉️*

 *🌹03నవంబర్2025🌹*

     *దృగ్గణిత పంచాంగం* 

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి  : త్రయోదశి* రా 02.05 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : ఉత్తరాభాద్ర* మ 03.05 వరకు ఉపరి *రేవతి*

*యోగం : హర్షణ* రా 07.40 వరకు ఉపరి *వజ్ర*

*కరణం  : కౌలువ* మ 03.40 *తైతుల* రా 02.05 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : *ఉ 10.41 - 12.09*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.14*

*వర్జ్యం    : రా 01.50 - 03.16*

*దుర్ముహూర్తం  : మ 12.14 - 01.00 & 02.32 - 03.18*

*రాహు కాలం   : ఉ 07.32 - 08.58*

గుళికకాళం      : *మ 01.17 - 02.43*

యమగండం    : *ఉ 10.25 - 11.51*

సూర్యరాశి : *తుల*                      

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.15* 

సూర్యాస్తమయం :*సా 05.44*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.06 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.42*

మధ్యాహ్న కాలం    :    *10.42 - 01.00*

అపరాహ్న కాలం    : *మ 01.00 - 03.18*


*ఆబ్ధికం తిధి         : కార్తీక శుద్ధ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 03.18 - 05.36*

ప్రదోష కాలం         :  *సా 05.36 - 08.06*

రాత్రి కాలం           :*రా 08.06 - 11.26*

నిశీధి కాలం          :*రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.26 - 05.16*

******************************

         🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*క్షంతవ్యో మేఽపరాధః శివ* 

*శివ శివ శంభో శ్రీమహాదేవ శంభో*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

నేడుతులసి వివాహం

 *నేడుతులసి వివాహం, ఈ పండుగ ప్రాముఖ్యత, పూజా విధులు..* 


🌸తులసి పూజ మనము ప్రతి సంవత్సరం ఈ పండుగను కార్తీక మాసంలో శుక్లపక్ష నాడు జరుపుకుంటారు. 


🌿ఈ రోజున  తులసి ఉసిరి చెట్టుకు వివాహం జరిపిస్తారు. ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు ? ఎవరితో వివాహం జరిపిస్తారు ? ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో ఈ కథలో తెలుసుకుందాం..


🌹 హిందూ పురాణాల ప్రకారం.. 🌹


🌸హిందూ పురాణాలలో తులసి దేవిని బృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది.


🌿శివుడి మూడో కన్ను నుండి పుట్టిన అగ్నిలో నుండి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధరునికి దేవుళ్లంటే అసహ్యం. కానీ దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తు ఉంటాడు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు.


🌹 పెళ్లి తర్వాత పెరిగిన శక్తి.. 🌹


🌸ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి , పవిత్రత వల్ల జలంధరుడికి శక్తి మరింత పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు.


🌿అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని కలలు గంటాడు. ఈ సమయంలో దేవుళ్లందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు. విష్ణుమూర్తి బృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు.


🌸కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం వల్ల విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.


🌹 జలంధరుని రూపంలో విష్ణువు 🌹


🌿పరమ శివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా, విష్ణువు బృంద వద్దకు జలంధర రూపంలో వస్తాడు. ఆమె అతన్ని గుర్తు పట్టలేక అతడే జలంధర్ అని భావిస్తుంది. కానీ అతను ఆమె తాకగానే తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రత నిష్ట భగ్నం అవుతుంది.


🌸వెంటనే జలంధరుడు బలహీనుడు అవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె మహావిష్ణువు నిజ రూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలుసుకుని బాధపడుతుంది.


🌹 బృందకు శాపం.. 🌹


🌿శ్రీ మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని , తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు.


🌸ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ , తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది.


🌹 లక్ష్మీదేవి విజ్ఞప్తి 🌹


🌿మహా విష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకొని శాపం ప్రభావాన్ని ఆపమని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది.


🌸అయితే విష్ణువు యొక్క సాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంతమవుతుందని చెబుతుంది. దీని తర్వాత ఆమె సతిగా మారుతుంది. (ప్రాచీన కాలంలో హిందూ వితంతువులు చేసిన స్వీయ - ప్రేరణ చర్య).


🌿ఆమె దేహం పూర్తిగా కాలిపోయిన తర్వాత తులసి మొక్క బూడిద నుండి పుట్టిందని పురాణాల ప్రకారం తెలిసింది.


🌹 తులసి పూజా విధానం.. 🌹


🌸తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి. మండపం చుట్టూ ఎర్రటి చీరతో కట్టండి. అలాగే తులసి మొక్కను లేదా చెట్టును కూడా ఎర్రటి వస్త్రంతో చుట్టవచ్చు.


🌿ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులతో అలంకరించండి. విఘ్నేశ్వరుడు మరియు ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి. అప్పుడు సాలిగ్రామ్ ను కూడా ఆరాధించండి.


🌸తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ , చక్కెర బొమ్మలు , ఐదు రకాల పండ్లను ఉంచండి. అనంతరం హారతి ఇచ్చి తులసి మరియు లార్డ్ సాలిగ్రామ్ జపిస్తూ ప్రార్థించండి.


🌹 పండుగ యొక్క ప్రాముఖ్యత.. 🌹


🌿తులసి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


🌸ఈ పండుగ వివాహ సంబంధిత సమ్యలను తొలగిస్తుందని చెబుతారు.


🌹 ద్వాదశ దీపాలు.. 🌹


🌿క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో హిందువుల ఇళ్లలో తులసి మొక్క , లేదా తులసి చెట్టు దగ్గర ధాత్రి (ఉసిరి మొక్కను) ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు.


🌸అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంటా దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతాయి.


🌹 తులసి మొక్కను గౌరీదేవిగా 🌹


🌿తులసి మొక్కను గౌరీదేవిగా , ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజింపడం వల్ల , గౌరీ పూజ చేయడం వ్లల ఆర్థిక బాధలు తొలగి , సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి , స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ ఉంటుంది.


🌸లక్ష్మీ ఉంటే కరువు అనేది ఉండదు , కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది..స్వస్తి..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

భజగోవిందంలో

 


కాతే కాంతా కస్తే పుత్రః సంసారో య మతీయ విచిత్రః, కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదియ భ్రాతః


భజగోవిందంలో శంకరాచార్యులు చెప్పిన ఈ శ్లోకంలో అర్థం కంటే అంతరార్థం చాలా గొప్పది. భార్య ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అది తెలియదు. పోనీ పుత్రులు ఎక్కడి నుంచి వచ్చారు? అదీ తెలియదు.


భార్యాబిడ్డలే సంసారంగా భావిస్తారు కదా! ఈ జీవయాత్ర ఎప్పటికి ముగుస్తుంది? ఎన్నాళ్ళీ ప్రయాణం? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే.. తల్లి గర్భం నుంచి వచ్చానంటావు. అంతకంటే ముందు ఎక్కడున్నావు? ఎన్నాళ్లీ ప్రయాణం, ఎప్పటికి ఈ యాత్ర ఆగుతుంది- ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. ఈ జీవన సత్యాలు గ్రహించగలిగితేనే ఈ జన్మలో కాకున్నా.. తర్వాతైనా ఈశ్వర సన్నిధికి చేరుకోగలుగుతాం. శరీరంతో వచ్చిన సంబంధాలన్నీ ఆ దేహంతోనే అంతమవుతాయి.


కాలానికి ఉన్న గుణం.. నశింప చేయడమే!


శంకరులవారు- 'జగద్భక్షకః కాలం' అన్నారు. కాలం జగత్తును పుట్టిస్తుంది, తినేస్తుంది. కనుక కాలం ముందు తల వంచక తప్పదు. అయితే ఈ శరీరం ఉండగానే బ్రహ్మపదం పొందడానికి ప్రయత్నించాలి. కాలాన్ని గెలిచినవారు లేరు. కాలం ఈశ్వర స్వరూపమై చేసే హెచ్చరికలను జాగ్రత్తతో వ్యవహరిస్తూ గ్రహించాలి.

2, నవంబర్ 2025, ఆదివారం

సైకాలజిస్ట్ తన కొడుకుకు

 ఓ సైకాలజిస్ట్ తన కొడుకుకు రాసిన మార్గదర్శక లేఖ… 


1.నీకు నచ్చని వారి పట్ల పగ పెంచుకోకు….


నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు, మీ అమ్మ కు నాకు తప్ప. నీతో మంచిగా ఉన్నవారికి, విలువ నివ్వు. వారితో కృతజ్ఞతతో ఉండు, ,


అడవిలో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. సమాజములో అన్ని లక్షణాలున్న వారు ఒకేలా ఉంటారు… ఒక వ్యక్తి నీకు మంచిగా ఉన్నప్పుడు, అతను మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడని అర్థం కాదు. నీవు జాగ్రత్తగా ఉండాలి, తొందరపడి అతన్ని నిజమైన స్నేహితుడిగా పరిగణించవద్దు.


2. Learn detachment… నీవు ఇష్టపడేదాన్ని ఇష్టపడే మనిషిని కోల్పోయినప్పుడు నీవు కృంగి జీవితాన్ని కష్టము చేసుకోవద్దు… అన్నీ సృష్టిలో భాగమే. జరిగే వన్నీ మంచికే నని భావించు


3. జీవితం చాలా చిన్నది. ఏ రోజు నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు ఆ రోజు తిరిగి రాదు .ఎంత త్వరగా నీ జీవితాన్ని విలువైనదిగా భావిస్తావో, అంత త్వరగా జీవితాన్ని ఆనందిస్తావు… విలువయినదిగా చేసుకొంటావు…


4. ప్రేమ అనేది ఒక అస్థిరమైన అనుభూతి, ఈ అనుభూతి కాలంతో పాటు మరియు ఒకరి మానసిక స్థితితో పాటు మారుతూ ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే, ఓపికపట్టండి, కాలం మీ బాధను విచారాన్నీ సమాధానం ఇస్తుంది.. ప్రేమ యొక్క అందం మరియు మాధుర్యాన్ని అతిగా ఊహించుకొవద్దు బాధలను అతిగా ఊహించు కోవద్దు .


5. విజయవంతమైన వ్యక్తులు మంచి విద్యను పొందలేదు, కష్టపడి చదవకుండా మీరు విజయం సాధించగలరని దీని అర్థం కాదు! మీరు ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నారో అది జీవితంలో మీ కొక ఆయుధం. దానితో నీ జీవితాన్ని సుఖ వంతము నేసుకొ..పేదరికం నుండి ఐశ్వర్యానికి వెళ్ళవచ్చు, జీవితంలో చాలా వాటిని జీరో .నుంచే ప్రారంభించాలి!


6. వృద్ధాప్యంలో మీరు నాకు ఆర్థికంగా మద్దతు ఇస్తారని నేను ఆశించను, అలాగే మీ జీవితమంతా ఆర్థికంగా మద్దతు నేను ఇవ్వను. మీరు పెద్దయ్యాక నా మద్దతు బాధ్యత ముగుస్తుంది. ఆ తర్వాత, మీరు సైకిలు మీద ప్రయాణిస్తారా లేక కారులో ప్రయాణించాలా పేదవారుగా బ్రతకాలా లేక ధనవంతులుగా బ్రతకాలా నీ ఇష్టం


7. మీరు మీ మాటలను గౌరవిస్తారు, కానీ ఇతరులు అలా ఉండాలని ఆశించకండి. మీరు ప్రజలకు మంచిగా ఉండవచ్చు, కానీ ప్రజలు మీకు మంచిగా ఉండాలని ఆశించవద్దు. మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే, మీరు అనవసరమైన ఇబ్బందులకు గురవుతారు.


8. లక్కీ డ్రాలు లేదా లాటరీలను నమ్మవద్దు. అంటే ధనవంతులు కావాలంటే కష్టపడాల్సిందే! విజయాలకు రాచబాట కాని దగ్గరి బాట కాని ఉండదు. అందరు నడిచే దారిలో నడవకు నీ కంటూ ఒక మార్గాన్ని అన్వేషించుకో…


9 మనం కలిసి గడిపిన సమయాన్ని విలువైనదిగా భావిద్దాం…. మరో జన్మ ఉంటుందో లేదో. అన్నీ ఈ జన్మ లోనే అనుభవిద్దాము. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో తెలియదు…

Panchaag

 


స్త్రీలు శివలింగమునకు

 శ్రీమాత్రేనమః 


ఈ విషయంలో పూర్వసంప్రదాయాన్ని అనుసరించి చెప్పాలంటే...


స్త్రీలు శివలింగమునకు పూజచేయరాదు. శివుని భార్య అయిన శ్రీ గౌరీదేవికి, ఇంకా ఆమె రూపాలైన అన్నివిధములైన అమ్మవారి రూపాలనూ పూజించాలి. 


వివాహంలో కూడా వధువుచేత గౌరీపూజ చేయిస్తారు. ఈ విషయానికి ఇదే ప్రమాణం. 


స్త్రీలు తాకకూడనివి/ధరించకూడనివి....

రుద్రాక్షలు 

పగడాలు (ముత్యాలు కలపకుండా)

సాలగ్రామాలు 

తులసి చెట్టు యొక్క అగ్రాలు 

శివాభిషేకం 


ఇవన్నీ స్త్రీలకు నిషేధించబడినాయి. వీటి స్పర్శ వలన వైధవ్యం కలుగుతుందని చెబుతారు. 


అంతే కాకుండా... స్త్రీపురుషులకు వస్త్రాలను పెట్టే సందర్భాలలో... స్త్రీలు స్త్రీలకు, పురుషులు పురుషులకు బొట్టు పెట్టి వస్త్రాలను పెట్టాలి. ఏవో కారణాల వలన పురుషులే దంపతులిద్దరికీ వస్త్రాలను సంకోచంలేకుండా పెడుతున్నారు. ఇది తప్పు. 


కొన్ని చోట్ల నేను గమనించాను. ఆ విధంగా పురుషులు స్త్రీలకు వస్త్రాలను సమర్పించిన తరువాత ఆ ఇంట్లో అనర్థాలు జరిగాయి. నేను గమనించాను. 


కాని, నేడు ప్రవచనాలను చెప్పేవారిలో కొందరు... ఈ నిషేధం లేదని, వీటిని ధరించవచ్చని చెబుతున్నారు. ఇది సరైనది కాదని నా అభిప్రాయము.

*~శ్రీశర్మద*

క్షీరాబ్ధి ద్వాదశి వ్రతానికి

 


శ్రీభారత్ వీక్షకులకు కార్తిక మాస శుభాకాంక్షలు 🌹

     కార్తిక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి వ్రతానికి, ఆ రోజున చేసే తులసీ దామోదర పూజకు చాలా ప్రత్యేకతలున్నాయి. అసలు తులసి చెట్టు ఎలా పుట్టింది, దానికి అంతటి పవిత్రత ఎలా వచ్చింది, ఉసిరి మొక్కతో తులసికి పెళ్లి చేయడమేమిటి! వాటి వెనుక గల విశేషాలేమిటో వివరంగా తెలిపారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి.. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

అనుబంధం

🔔 *అనుబంధం* 🔔

*భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు:*
                  
సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం “కుటుంబం”

నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వు యే రంగంలోనూ రాణించలేవు.

తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.

అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే.

ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే 
ఇదే మధురమైన బంధం.

భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం.. బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.!

సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.

ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క !

అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది “మాంగల్య బంధం!”

బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. 
కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B

నీ సంతోషం నేను కాకపోయినా 
నా చిరునవ్వు మాత్రం నువ్వే.
నీ ఆలోచన నేను కాకపోయినా 
నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని “వివాహం” అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం “కుటుంబం”

గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

కలిమి లేములతో.. కలసిన మనసులతో... కలివిడిగా మసలుకో.. కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!

బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.

ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు.

భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు.

మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు. ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.✍️```

చిరునవ్వులతో కూడిన దంపతులారా 
మీ అందరికీ శుభాకాంక్షలు.!
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

మర్మకళ

 మర్మకళ - శరీరం నందు ఉండు మర్మస్థానములు  

        

మర్మ కళ అనే యుద్ధవిద్య భారతీయ ప్రాచీన రహస్య యుద్ధవిద్యలలో ఒకటి. ఈ యుద్దవిద్య ఎక్కువుగా కేరళలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ విద్యకు మూలపురుషుడు పరమశివుడు . దీనికి వర్మ కళ అని మరొక పేరుతో కూడా వ్యవహరిస్తున్నారు.

            

మనిషియొక్క శరీరంలో ప్రాణశక్తి అనేది శరీరములో గల పది మార్గాలనుంచి పైనుంచి క్రిందకి , క్రింద నుంచి పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ మార్గాలను "దశ నాడులు " అని పిలుస్తారు . ఈ ప్రాణశక్తి ప్రవహించే మార్గాలలో ఎటువంటి అడ్డు ఏర్పడినపుడు మనుష్యునికి రోగాలు సంభవిస్తాయి. శరీరములో రక్తం ప్రవహించుటకు రక్తనాళాలు ఎలా ఉన్నాయో అదేవిధముగా వాయువు శరీరం అంతా పరిభ్రమించుటకు కొన్ని ప్రత్యేక మార్గాలు కలవు. ఈ మార్గాలనే నాడులు అని పిలుస్తారు . ఈ నాడులు లో వాయవు ఉంటుంది. పైన చెప్పిన ప్రాణశక్తి అనేది వాయవు రూపంలో ఉంటుంది.

            

మర్మస్థానం గురించి వివరించాలి అంటే అదొక ట్రాఫిక్ జంక్షన్ లాంటిది. జంక్షన్ లో సమస్య లేనంతవరకు వాహనాలు ఎటు వెళ్ళేవి అటు ప్రశాంతముగా వెళ్తాయి. ఏదన్నా సమస్య వస్తే ఒకదానివెంట ఒకటి ఆగి సమస్య ఎలా వస్తుందో అదేవిధముగా మర్మస్థానము పైన దెబ్బ తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా మార్పు వస్తుంది . అవయవాలు చచ్చుబడుట , కోమాలోకి వెళ్లడం , మరణించడం ఈ మూడు రకాల సమస్యలు సంభంవించును. ఏ సమస్య అనేది మర్మస్థానం మరియు మర్మస్థానం పైన దెబ్బ ఎంత బలంగా తగిలింది అనేదానిని బట్టి ఉంటుంది.

         

    మనుష్య శరీరములోని సిరలు గురించి చెప్పాలంటే వాత , పిత్త , కఫ , రక్త వాహకాలు అని నాలుగు రకాలుగా ఉంటాయి.ఇవి మొత్తం 700 సిరలు శరీరం నందు ఉండును. ఈ సిరలును ఆశ్రయించి మర్మస్థానాలు ఉంటాయి. ఈ మర్మ స్థానముల యందు దెబ్బ తగిలినప్పుడు లేదా గాయం అయినపుడు ప్రాణానికి ముఖ్యమైన రక్తం అధికంగా స్రవించును . రక్తము వలనే మిగిలిన ధాతువులు అన్నియు వృద్ధిచెందుతూ ఉండును. గాయం వలన రక్తం అధికంగా పోయినచో శరీరం నందలి మిగిలిన ధాతువులు క్షీణించును. ఎప్పుడైతే ధాతుక్షయం జరిగినదో వాతం ఒక్కసారిగా వృద్దిచెంది తేజోరూపమైన పిత్తమును ప్రేరణ చెందించును. దీనివల్ల దెబ్బ లేదా గాయం అయిన మర్మస్థానం నందు మిక్కిలి తీవ్రమైన మంట, పోటు మున్నగు బాధలు కలుగును. తీవ్రమైన దప్పిక , శోష , భ్రమ కలుగును. ఆ తరువాత శరీరం పైన తీవ్రంగా చెమట పట్టి అవయవాలు చచ్చుబడుతూ నరకాన్ని అనుభవిస్తూ మరణిస్తాడు. పైన చెప్పిన లక్షణాలన్నీ మర్మస్థానం పైన దెబ్బ తగిలినప్పుడు సంభంవించును. ఈ అత్యంత ప్రాచీన రహస్యమైన మర్మకళ ని సంపూర్ణంగా అభ్యసించిన వ్యక్తికి మాత్రమే మనుష్య శరీరంలో మర్మ స్థానాలు ఎక్కడ ఉంటాయో చక్కగా తెలుస్తుంది. ఈ మర్మస్థానాలనే మన తెలుగుభాషలో ఆయువుపట్లు అంటాము.

                          

    ఇప్పుడు మీకు మర్మస్థానముల గురించి వివరిస్తాను. మనుష్య శరీరం మొత్తం మీద 107 మర్మస్థానాలు ఉండును. నాకున్న పరిధినిబట్టి కొంత సమాచారం మాత్రం మీకు వివరిస్తాను. తొడలు ,చేతులు ఈ నాలుగు అంగముల యందు ఒక్కోదానియందు 11 మొత్తము 44 . ఉదర భాగము నందు 3 , రొమ్ము భాగము నందు 9 , వీపున 14 , కంఠము పై భాగము నందు 37 ఉండును. ఇవ్వన్ని కలిపి మొత్తం 107 మర్మములు ఉండును.

          

       ఆయా భాగములలోని మర్మస్థానాలలో దెబ్బలు గాని గాయాలు గాని సంభవించినపుడు కలుగు విపరీత పరిస్థితుల గురించి మీకు వివరిస్తాను. కాలు యందు ఉండు పదకొండు మర్మస్థానములలో ఒకటి నడిమివేలికి అభిముఖంగా , పాదమధ్య భాగము నందు తల హృదయమును మర్మస్థానం ఉండును. ఈ స్థానము నందు దెబ్బ తగిలినచో తీవ్రమైన నొప్పి కలిగి వెంటనే మరణం సంభంవించును. బొటనవేలికి మరియు మిగిలిన వేళ్ళకి మధ్య క్షిప్రం అను మర్మస్థానం ఉండును. ఈ ప్రదేశము నందు దెబ్బ తగిలినచో అవయవాలు చచ్చుబడి మరణం సంభంవించును. క్షిప్ర మర్మస్థానము నకు రెండు అంగుళాల పైభాగము నందు కూర్చమ్ అను మర్మస్థానం ఉండును. దీనిపైన దెబ్బ తగిలినచో పాదము నందు వణుకు పుట్టును .

           

      కీలు భాగము నందు ఉండు మర్మలో దెబ్బ తగిలినచో నొప్పి కలిగి కీలు యొక్క గమనం మందగించును. పిక్క మధ్యభాగము నందలి దెబ్బ తగిలి రక్తం వెడలి ఎక్కువ మోతాదులో బయటకి పొయినచో ఆ వ్యక్తికి మరణం తప్పదు. కావున గాయం అయిన వెంటనే రక్తం బయటకి పోకుండా జాగ్రత్త పడవలెను. పిక్కకి మరియు తొడ మధ్యభాగము నందు ఉండు కీలు నందు జాను అను మర్మస్థానం ఉండును. అక్కడ దెబ్బ తగిలినచో మరణించును. ఒకవేళ చికిత్స ద్వారా కాపాడబడినను కుంటితనం సంప్రాప్తిస్తుంది.

       

        పైన చెప్పిన విధముగా అనేక మర్మస్థానములు మన యొక్క శరీరం నందు ఉండును. వాటిలో కొన్నిస్థానాల పైన దెబ్బలు తగిలితే వెంటనే మరణం సంభంవించును. మరికొన్ని స్థానాలలో దెబ్బలు తగిలితే కొన్నిరోజుల సమయంలో హఠాత్తుగా మరణించటం జరుగును. మరికొన్నిసార్లు శాశ్వత అంగవైకల్యం లేదా తాత్కాలిక అంగవైకల్యం సంప్రాప్తినిచ్చును . ఈ మర్మస్థానం ల యందు దెబ్బలు తగలడం వలన వచ్చు జబ్బులకు 

అత్యంత కష్టసాధ్యముతో నయం చేసినప్పటికీ దానిప్రభావం మాత్రం పోదు .

            

        మర్మకళ ని నేర్చుకోవాలి అనుకునే వ్యక్తికి చాలా అత్యంత కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. ఈ విద్య అందరికి లభించదు. మనస్సుపైన , తన యొక్క భావావేశాలును అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే ఈ విద్య నేర్చుకోగలుగుతాడు .

      

           చివరగా చిన్న విషయం చిన్నపిల్లల తలపైన మొట్టికాయలు వేయడం ప్రమాదకరం ఆ స్థలములో కూడా మర్మస్థానాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ స్థానాల్లో దెబ్బ తగలడం వలన విపరీత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

     

       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  


గమనిక -

           


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034