ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
16, నవంబర్ 2025, ఆదివారం
బొమ్మలు
ఈరోజు సాయంత్రం బెంగళూరులో సిద్దయ్య పురానిక్ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతూ ఉంటే నాకు ఒక రోడ్డు ప్రక్కన బొమ్మలు చేసే వాడు కనబడ్డాడు ఆ బొమ్మలు చూస్తే చాలా చక్కగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండం లాగా అనిపించింది అవి వినాయకుడికి చెందిన బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి. అట్లనే వేరే బొమ్మలు కూడా ఉన్నాయి అయితే విశేషం ఏంటంటే మనం వాటిని చూస్తే ఒక మట్టితోటో లేకపోతే వేరే ఏదైనా ఒక పదార్థం తోటో చేసిందనుకుంటాం కానీ నిజానికి అవి తయారు చేసింది కొబ్బరి బోండాలతోటి కొబ్బరి బోండాల్ని ఒక పదునైన చాకుతో వలచి తోలాచి చేసినటువంటి కళాఖండాలు ఆ ఫోటో ఇక్కడ పెడుతున్నాను చూసి ఆనందించండి నిజంగా రోడ్డుపక్క ఎంతోమంది కళాకారులు తమ జీవనాన్ని గడుపుతున్నారంటానికి ఇదే ప్రభల నిదర్శనం
డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ
#డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ
#జనసేన అధినేత #పవన్ కళ్యాణ్.
విన్నపం.
1.ఈ భూమిపై మరో జన్మ పొందటానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి.
2. నడవడానికి 2 సంవత్సరాలు.
3. స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు,
4. ఓటు హక్కు కై 18 సంవత్సరాలు,
5. ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు,
6. పెళ్ళికోసం 25నుండి 30 సంవత్సరాలు... ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్) వేచి ఉంటాము.
కానీ..
ఓవర్ టేక చేసే సమయంలో.. వాహనాలు నడుపుతున్నపుడు, 30 సెకన్లు కూడా ఆగలేక పోతున్నాము.
తర్వాత తప్పిపోయి ఏమన్నా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో గంటలు, రోజులు, వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి..
కొన్ని సెకన్ల గడబిడ ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారో ఆలోచించండి.
దయచేసి సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ..హెల్మెట్ వాడుతూ.. వాహనాలు నియంత్రణలో ఉంచుకొని నడపండి. మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి..
మీ కోసం, మీ యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు మీ ఇంటి వద్ద ఎదురు చూస్తుంటారని మరవకండి..
జాగ్రత్తగా వెళ్ళండి.
ఉపవాసం లోని రకాలు - ఉపయోగాలు .
ఉపవాసం లోని రకాలు - ఉపయోగాలు .
ఉపవాసం అనగా ఏమి తినకుండా కేవలం మంచినీరు తాగి ఉండటమే ఉపవాసం . దీర్ఘ ఉపవాసం చేయువారు రసాహారము తీసికొనవలెను. కొందరు దేవునికి ఒకపొద్దు ఉంటున్నాం అని ఆ తరువాత అరడజను అరటిపళ్ళు, 10 ఇడ్లిలు, అరకిలో ఉప్మా లాగించేస్తారు . అన్నం మాత్రం తినరు.బహుశా వారి దృష్టిలో ఇదో రకం ఉపవాసం కావొచ్చు.కాని అలా చేయడం ఉపవాసం అనిపించుకోదు.
ఉపవాసం చేయడం వలన ముఖ్య ఉపయోగం శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపచేసి వ్యాధి నిర్మూలనం అవుతుంది. పొట్ట , కన్ను, వ్రణములు , జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు . లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.
ఉపవాసంలో 4 రకాలు ఉన్నాయి అవి
1 - నిర్జలోపవాసం .
2 - జలోపవాసం .
3 - రసోపవాసం .
4 - ఫలోపవాసం .
* నిర్జలోపవాసం -
మంచినీరు కూడా ముట్టకుండా చేయు ఉపవాసమును నిర్జలోపవాసం అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువ చేరినప్పుడు అనగా శరీరం వాచినప్పుడు రెండు లేదా మూడు దినములు ఈ ఉపవాసం చేయవలెను . మూడురోజులకు మించి ఈ ఉపవాసం చేయరాదు .
* జలోపవాసం -
కేవలం మంచినీరు మాత్రమే తాగి చేయు ఉపవాసమును జలోపవాసం అందురు. దీనిని మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చేయవలెను . అంతకు మించి చేయరాదు . శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవలెను. అనగా సుమారు రెండులీటర్లు మంచినీరు త్రాగించవలెను.
* రసోపవాసం -
ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును రసోపవాసం అంటారు. ఈ ఉపవాసం వారం రోజులు మొదలుకుని నెలరోజులు వరకు కూడా చేయవచ్చు . రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం , పలుచని నారింజరసం , బత్తాయిరసం , కమలారసం , తేనెనీరు, కొబ్బరినీరు , బార్లినీరు మొదలగునవి రోజుకు మూడుసార్లు నుండి అయిదుసార్లు లోపలికి తీసుకోవచ్చు .
* ఫలోపవాసం -
ఉపవాసం చేయలేనివారు ఫలోపవాసం చేయవచ్చు . కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసికొనవలెను . అరటిపండు తీసుకోకూడదు . ఎక్కువ బత్తాయి, నారింజ, కమలా , ద్రాక్షా, అనాస , దానిమ్మ, మామిడి, పుచ్ఛ మొదలగు పండ్లు తినవచ్చు .
ఈ ఉపవాసం రోగిని అనుసరించి పది నుంచి నలుబది రోజుల వరకు అనుసరించవచ్చు.
* ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు -
జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అగును.
మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బాక్టీరీయా నాశనం చేయబడును.
మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు బహిష్కరింపబడును.
ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగును.
గుండెచుట్టు , లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును. గుండెజబ్బులలో రసోపవాసం మంచిది.
లివర్ మరియు స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి చక్కగా పనిచేయాలి. ఈ ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అగును.
శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉండును. ఉపవాసం చేయుట వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గును.
కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును.
నాడీమండలం శుభ్రపరచబడును.
జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలు అన్ని పోవును .
చర్మం కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కటిరంగు వచ్చును.
మనస్సు ప్రశాంతంగా ఉండి కోపం వంటివి మన అదుపులో ఉండగలవు.
* ఉపవాసం చేయకూడని వారు -
చాలా బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు , బాలురకు, వృద్దులకు గర్భిణీస్త్రీలకు , బాలింతలకు , క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు , మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు .
* ఉపవాసం చేయదగిన వారు -
స్థూలకాయులు , ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు,చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయుట మంచిది.
ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు . ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం , మసాలా పదార్దాలు , పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు , వాంతులు , కడుపులో మంట, నొప్పి కలుగును.
13, నవంబర్ 2025, గురువారం
జీవనోపాధి
జీవనోపాధి
ఇప్పుడు మనము తెలుసుకొని పోయేటువంటి జీవనోపాధి మధ్యతరగతి లేక దిగువ మధ్యతరగతి యువతులు తమ భర్తలకి అండగా ఉండి కొంత సంపాదన చేయాలి అనేటువంటి కాంక్ష ఉన్న వాళ్ల కోసం కేటాయించుకున్నటువంటిది
తక్కువ పెట్టుబడితో చేసుకునేటువంటి ఒక చిరు వ్యాపారం దీనికి ప్రారంభంలో ఒక వెయ్యి లేక రెండు వేల లోపు గానే ఖర్చవుతుంది కావాల్సింది ఏమిటి ఎలా చేయాలి ప్రతిదీ వివరంగా తెలుసుకుందాం
ఈ రోజుల్లో ప్రతివారు ఉదయం పూట ఏదో ఒక ఫలహారం చేస్తూ ఆఫీసుకు లేక తమ తమ వ్యాపారాలకు వెళ్లడం కద్దు చాలా మటుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్లు లేక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు వాళ్ళ పని సమయాలను బట్టి ఇంట్లో ఫలహారాలు చేసుకోవటం కొంతమందికి చాలా కష్టంగా పరిణమిస్తున్నది అందుకనే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అని ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అర్రులు చాస్తూ ఉన్నారు కొంతమంది తాము సొంతంగా ఫలహారాలు చేసుకోలేక పోవటం చేత దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్లి ఫలహారాలని ప్యాక్ చేసుకొని తెచ్చుకొని తింటున్నారు ఇంకా కొంతమంది ఓపిక చేసుకొని ఇంట్లోనే దోశల పిండి ఇడ్లీ పిండి తయారు చేసుకుని రెండు మూడు రోజులు దోసెలు లేక ఇడ్లీలు చేసుకోవటం మనందరికీ తెలిసినదే ఇంట్లో దోసెలు లేక ఇడ్లీలు చేసుకుంటే బయట ఫలహారసాల నుండి తెచ్చుకున్న ఇడ్లీలు లేక దోసెల కన్నా చాలా తక్కువ ఖరీదుకే చేసుకోవచ్చు కాకపోతే అది కొంత శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఈరోజుల్లో దోసెలు చేసుకోవటానికి కానీ ఇడ్లీలు చేసుకోవటానికి గాని అప్పటికప్పుడు రెడీమేడ్ గా రుబ్బినటువంటి పిండి మనకు కొన్ని ప్రదేశాలలో జరుగుతున్నా యి నాకు తెలిసినంత మటుకు హైదరాబాదులో సూపర్ మార్కెట్లలో ఈ పిండ్లు జరుగుతున్నట్లు సమాచారం ఈరోజు నేను బెంగళూరులో ఒక మహిళ ఇడ్లీ పిండి అమ్మడం చూసి ఈ పోస్టు పెడుతున్నాను ఆమె రెండు మూతలు ఉన్నటువంటి బకెట్లను తీసుకొని వాటిని రెండు లాస్టిక్ స్టూళ్లమీద పెట్టుకొని ఒక స్టీలు డబ్బా మరియు ఒక కొల పాత్ర కొన్ని ప్లాస్టిక్ సంచులు అంటే కవర్లు పెట్టుకొని ఉన్నది ఒక కుల పాత్రడు పిండి ఆమె 50 రూపాయలకి అమ్ముతున్నది దానికి కొంచెం నీళ్లు కలుపుకొని దోశల పిండి లాగా చేసుకుని దోసెలు చేసుకోవచ్చు లేదా ఆ పిండిని అదే విధంగా ఇడ్లీల పాత్రలో వేసుకొని ఇడ్లీలు చేసుకోవచ్చు ఇక్కడ మన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం సహజంగా చేసుకునేటువంటి ఇడ్లీ పిండి మినప పిండిని రుబ్బుకొని అందులోపడా ఇడ్లీ రవ్వని కలుపుకొని తయారు చేసుకుంటాం కానీ ఇక్కడి వాళ్ళు అట్లా కాకుండా మినప్పప్పు నీ నానబెట్టి దానికి ఇడ్లీ బియ్యం అని ప్రత్యేకంగా కొంచెం లావుగా ఉండే బియ్యం దొరుకుతాయి వాటిని కలిపి అవి కూడా నానబెట్టి రెండిటిని కలిపి మిషన్ లో రుబ్బుతారు అట్లా రుబ్బిన పిండిని అటు ఇడ్లీలు తయారు చేసుకోవటానికి ఇటు దోసెలు తయారు చేసుకోవడానికి ఉభయాత్ర ఉపయోగిస్తారు
ఆమె తీసుకున్నా రెండు మూత ఉన్న బకెట్లలో ఒక బకెట్లో చాలా చిక్కగా ఉన్నటువంటి పిండి ఉన్నది రెండవ బకెట్లో నీళ్లు కలిపి జావగా చేసి ఉన్నటువంటి పిండి ఉన్నది అంటే ఆ పిండి అమ్మటానికి సిద్ధంగా ఉన్న పిండి అన్నమాట ఈ బకెట్లో ఉన్న పిండి పూర్తిగా అమ్మిన తర్వాత చిక్కగా ఉన్న పిండిలో నీళ్లు కలిపి మళ్ళీ ఈ రెండో బకెట్లోకి మార్చి ఇది కూడా అమ్మటం చేస్తుంది అంటే దాన్ని బట్టి నాకు తెలిసిందేమిటంటే చిక్కగా ఉన్న పిండిని నీళ్లు కలపటం వల్ల ఒక బకెట్ పిండి రెండు లేక అంతకన్నా ఎక్కువ బకెట్ల పిండిగా తయారవుతుందన్నమాట అంటే ఆమె ఒక కుల పాత్రను పట్టుకొని దానిని ఆ పిండి నిండా నింపుకొని ఒక స్టీల్ గిన్నెలో ప్లాస్టిక్ కవర్ పెట్టి ఆ కవర్ లోపల పిండిని పెట్టి ప్యాక్ చేసి ఇస్తున్నది ఒక పాత్రడు పిండి 50 రూపాయలని ముందే చెప్పుకున్నాం. అట్లా ఆ రెండు బకెట్లలో పిండి అమ్ముతే ఆమెకు దాదాపు ఒక 50 లేక అంతకన్నా ఎక్కువ కొలపాత్రలపిండి అవుతుండవచ్చు అంటే 50 రూపాయలు ఇంటూ 50 అంటే మనకు 2500 నుంచి 3000 రూపాయల దాకా ఆ పిండి అమ్మడం వల్ల లభించవచ్చు అని అంచనా వేసుకోవచ్చు
పిండి తయారు చేసుకోవడానికి కావలసిన ముడి సరుకులు మినప్పప్పు లేక మినప గుండ్లు ఒక రెండు కిలోలు ఒక మూడు లేక నాలుగు కిలోల ఇడ్లీ బియ్యం కావాలి
కిలో మినప గుండ్లు 150 రూపాయల చొప్పున లెక్కిస్తే రెండు కిలోలకి 300 రూపాయలు అవుతాయి అదే విధంగా కిలో ఇడ్లీ బియ్యం 70 రూపాయలు చొప్పున చూసుకుంటే నాలుగు కిలోలకి 280 రూపాయలు బియ్యం ఖర్చు అవుతాయి వెరసి ఒక 700 రూపాయలు దాకా ముడి సరుకు ఖర్చవుతుంది ఒక రవంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ రుబ్బినందుకు మొదట్లో రుబ్బుడు మిషన్ ఉండకపోయినా పర్వాలేదు ఈరోజుల్లో ప్రతి కాలనీలో రుబ్బుడు మిషన్ అద్దెకు దొరుకతున్నాయి
మరింత సమాచారం కోసం క్రింది యూట్యూబ్ లింకును క్లిక్ చేయండి
https://youtu.be/3a0d7fKUgYc?si=COKFZ9u7F93xOLLU
12, నవంబర్ 2025, బుధవారం
హోదా Vs జ్ఞానం*
హోదా Vs జ్ఞానం*
*🚗ఒక* కారు* తయారీ కంపెనీ యజమాని తన కంపనిలోని ఒక ఇంజనీర్ కు " ఒక మంచి కారును డిజైన్ చేసి తయారు చేయుమని" ఒక పని అప్ప చెప్పాడు.
👤ఆ *ఇంజనీర్* " ఒక అద్భుతమైన కారును "తయారుచేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురుపెట్టాడు.
*👨🎨యజమాని* వచ్చి ఆ కారును చూసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేయడంతోపాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు.
🚗ఆ *కారును* కంపెనీ తయారు ప్రదేశం నుండి షోరూంకు తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు ఒక్క అంగుళం ఎత్తుగా ఉంది.
*🚗కారును* తయారు చేసేముందు ఈ విషయం గమనించలేక పోయినందుకు *ఇంజనీర్ లోలొపల చింతించి*
తయారీ ప్రాంతం నుంచి వెలుపలకు కారును ఎలా తీసుకోవాలో ఆ యజమానితో కలిసి ఆలోచించసాగాడు.
అక్కడే ఉన్న *"పెయింటర్"* కారును అలాగే బయటకు తీసుకు వద్దాం! కారు టాప్ పైన కొన్ని గీతలు.. నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు!! అని సలహా ఇచ్చాడు.
*"👊ప్రవేశ ద్వారం* పగులగొట్టి కారు బయటకు తీసుకువద్దాం! తర్వాత ద్వారాన్ని రిపేర్ చేయిద్దాము! " అని అసెంబ్లింగ్ అసిస్టెంట్ ఆ ఇంజనీరుకు సలహా ఇచ్చాడు.
ఈ *రెండు* సలహాలు విని *యజమాని* కన్విన్స్ కాలేక పోయాడు. ఎందుకంటే అలా కారుకు *నొక్కులూ, గీతలు పడడం* కానీ, ద్వారాన్ని పగలగొట్టడం కానీ మంచి శకునంగా అతడు భావించలేకపోయాడు.
*👁 జరుగుతున్న* విషయమంతా చూస్తున్న అక్కడే ఉన్న👮♀ *"వాచ్ మెన్ "* భయం భయంగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని " ఒక చిన్న సలహా సార్! "అన్నాడు.
*👪అక్కడున్నవాళ్ళు* " నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్ మెన్ ఏమిస్తాడా? " అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా..
👮♀ఆ *వాచ్ మెన్* ఇలా అన్నాడు.~ *🚗కారును* బయటకు తీసుకురావడం చాలా ఈజీ సార్! కారు, ద్వారం కన్నా ఒక ఇంచే ఎత్తు ఉందికదా సార్!!!
కారు టైర్లలోని "గాలి" కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారుటైర్లలో గాలినింపితే సరి!!" అన్నాడు.
👮♀ *వాచ్ మెన్* సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు.
*👤కాబట్టి* ,కేవలం నిపుణుల అభిప్రాయం తీసుకుని మాత్రమే సమస్యలను విశ్లేషించవద్దు!!
👳ఒక్కోసారి చదువుకోని తాతనో, నానమ్మనో, అమ్మమ్మనో వంటి తాము సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా... *"ఎంతో కష్టం అని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు.!"*
ఈ కథలో నేర్చుకోవలసిన మరో *నీతి* కూడా ఉంది.
🕺మిత్రులతోనో, బంధువులతోనో.. గొడవ వల్లనో మరే కారణం వల్లనో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కారులా మనం *ఎత్తుగా (ఉన్నతంగా అనుకొని)* వారి ఇంటి ప్రవేశ ద్వారం చిన్నగా ప్రవేశించలేనిదానిలా కనిపిస్తుంది.
అప్పుడు ఈ కథలోని వాచ్ మెన్ సలహా పాటించాలి!!
👍కొంత *గాలి (ఇగో)* తీసివేసి..తగ్గి ఉండాలి.! 🙇
*ఎత్తును(ప్రవర్తనను)* అడ్జెస్ట్ చేసుకోవాలి.
🕊నిజానికి మనమందరం ఆనంద స్వరూపమైన *"ఆత్మ"* గలవారము!!
కానీ,
""🤦♀ *అనవసరమైనవి జమ చేస్తూ ఉంటే అశాంతితో బరువెక్కిపోతాము!!!!!*
*ఈ చెత్తనంతా తొలగించుకుంటున్నకొద్దీ ఆనందంతో తేలికైపోతాము!!!!
కోపము – శిక్ష*
ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
74d2;1311e2; నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀🌼P0398.పరమాచార్య పావన గాధలు…
*కోపము – శిక్ష*
➖➖➖✍️
```
అది ఎన్నికల సమయం. కాంచీపురం జిల్లా కలెక్టరు గారే స్వయంగా చీఫ్ ఎలెక్షెన్ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున కార్యాలయంలో మొత్తం అందరూ ఎన్నికల నిర్వహణలో తలమునకలయ్యారు. ఎల్లుండే ఎన్నికలు జరిగే రోజు.
ఢిల్లీ నుండి ఇద్దరు ముగ్గురు ఐ.ఎ.యస్ అధికారులు జరగబోయే విధానసభ లోకసభ ఎన్నికల పర్యవేక్షణకై కంచికి వచ్చారు. అందులో ఒకరు చాలా నిఖార్సైన వ్యక్తిత్వం కలవారు మరియు చాలా కోపిష్టి కూడా. వారు వేరే రాష్ట్రంవారు కావడం వల్ల వారికి తమిళం రాదు.
నేను తహసీల్దార్ కావడం చేత వారి బస మరియు బాగోగులు చూడటం నా కర్తవ్యం. వారిని కలిసిన కొద్దిసేపటికే వారి గుణగణాలను అంచనా వెయ్యగలిగాను. ఆయన భార్యా పిల్లలతో సహా రావడం చేత వారికి ప్రభుత్వ ట్రావెలర్స్ బంగ్లాలో సకల సౌకర్యాలతో విడిది ఏర్పాటు చేసాము. వారి మనసు పాడుకాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవల్సిందని నాకు పై అధికారుల నుండి వచ్చిన ఆదేశం యొక్క సారం.
వారికి కొన్ని తమిళ పదాలు తెలుసని కూడా నాకు తెలిసింది.
వారు కుటుంబ సమేతంగా పరమాచార్య స్వామివారిని చూడాలని నాకు చెప్పారు.
నేను వారిని కంచి శ్రీమఠానికి తీసుకుని వెళ్ళాను. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి స్వామివారు జపం చేసుకుంటున్నారు. శ్రీమఠం సేవకులొకరు అక్కడ నేలపైన ఒక జమఖానం పరిచి ఉంచారు. ఆ అధికారి కుటుంబ సమేతంగా దానిపైన కూర్చున్నారు. నేను వారి పక్కనే నిలబడి ఉన్నాను.
స్వామివారు దర్శనం ఇవ్వడం మొదలుపెట్టగానే నేను వారినందరిని స్వామి వద్దకు తీసుకుని వెళ్ళాను.
మహాస్వామివారు ఒక చిన్న గదిలో చెక్క కుర్చీపై కూర్చుని ఉన్నారు. గది తలుపు ఇవతలి నుండి మేము స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆరోజు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. చేతిసైగలతోనే కొన్ని ప్రశ్నలను అడిగి ఆ ఆఫీసరు కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారు.
సరిగ్గా అదే సమయంలో కోపిష్టి యువకుడైన ఒక మఠం ఉద్యోగి అరవడం మొదలుపెట్టాడు. “వాడు ఎవడైతే ఏంటి! వాడేమైనా పెద్ద పోటుగాడా! రాస్కెల్ నా జమఖాణం మీద కూర్చోవడానికి వాడికి ఎంత ధైర్యం? మఠం పవిత్రత అంతా పోయింది. ఇప్పుడే రాష్ట్రపతికి టెలిగ్రాం చేస్తాను”
అతను అలా అరవడం మాకు అవరోధంగా మారింది. నాకు చాలా బాధకలిగింది. పరమాచార్య స్వామివారి సమక్షంలో ఒక వ్యక్తి ఇలా అరవడం మఠాన్ని,స్వామివారిని అవమానించినట్టే కదా? అతను ఇలా అరవడానికి కారణం తను జమఖాణం పైన కూర్చోవడమే అని ఆఫీసరుకు తెలిస్తేదాని పర్యవసానం మా పనిమీద కూడా పడుతుంది కదా!
ఒక పదిహేను నిముషాలు అలా అరిచి అతను వెళ్ళిపోయాడు. నేను స్వామివారిని మనస్సు లోనే ప్రార్థిస్తున్నాను “స్వామీ ఆ యువకుడు అరుస్తున్నది తను జమఖాణం పైన కూర్చున్నందువల్లే అని ఆ ఆఫీసరుకు తెలియకుండా చూడు” అని.
దర్శనం ముగించుకుని మేము మఠం నుండి బయటకు రాగానే ఆఫీసరు అడగనే అడిగాడు. “ఎవరతను? ఎందుకు అలా అరుస్తున్నాడు? అది కూడా మహాత్ములైన స్వామివారి ముందు”
నేను తెలివిగా చిన్న అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. “ఈరోజు పౌర్ణమి కదా. ఆ యువకుడికి కొంచం చిత్తభ్రమ ఉంది. కాబట్టి అతను అలా ఎవరో ఒకరిపై అరుస్తూ ఉంటాడు” అని.
“ఓహ్ అలాగా! నువ్వు ఈ విషయం ముందే చెప్పిఉంటే అతనికోసం కూడా మనం స్వామివారిని ప్రార్థించేవారం కదా” అని తన ఔదార్యాన్ని చాటుకున్నాడు ఆఫీసరు.
క్రమశిక్షణకి కట్టుబాట్లకి మారుపేరైన మహాస్వామివారు ఈ అరుపులు విన్నారు. ఆరోజు దర్శనానికి వచ్చిన వారందరూ వెళ్ళిపోగానే ఆ యువకుడిని పిలిచి మందలించడమే కాకుండా మూడురోజులపాటు మఠంలోనికి రాకూడదని చెప్పారు.
వేరొక సేవకుని ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. తప్పుచేసినవాడు ఎంతటి మేధావి, భక్తుడు అయినా అనాగరికులుగా కోపంతో ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు.✍️
- టి.యస్.కోదండరామశర్మ, మహాపెరియవళ్–దరిశన అనుభవంగళ్
జయజయ శఙ్కర హరహర శఙ్కర```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
నిను సేవింపగ
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ, జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!
ఈశ్వరా! నేను నిన్ను సేవిస్తుండగా, నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అవుతాయి. నీ పాదసేవ చేస్తున్న నాకు అన్నీ నీ అనుగ్రహములు గానే కనిపిస్తాయి.
రాయలసీమ పౌరుషపు గడపల్లో
*రేనాటి పౌరుషం కుందూ నది…*
*(కుందూ నది గీతం)*
రాయలసీమ పౌరుషపు గడపల్లో
ఎర్రమల కనుమల సానుల్లో
ఉప్పలపాడలో జన్మించే చిన్న నీటి బుగ్గ
తన దారిని మళ్లించి పెనమ్మతో కలిసే..
సీమలో సిరుల తల్లి కుందూ మాత
సరసరా నీటి సవ్వడితో కదులుతూ
కృష్ణమ్మ చెంత ఉన్నా అటు చూడక
పెన్నమ్మతో మైత్రి బంధానికి కదిలే…
పురాతన నామం కుముద్వతి
ప్రస్తుతం కుందూ నదిగా రూపాంతరం
రేనాటి సీమకు పౌరుషం పోసి
శత్రువులను జయించే బలాన్ని సమకూర్చే..
ఆదిమానవుడి ఆనవాళ్లకు సాక్ష్యంగా
రాతి వనాలలో నీటి పంటగా
ఎర్రమల కొండల్లో కోనేటి రూపంగా
గిరులల్లో వంపులో ప్రాకింది సొంపుగా..
కొండ ప్రాంతాల్లో నది రాతివనంగా
సున్నపురాళ్ల శిలలను అడుగున కలిగి
నేలలో నీళ్ళు ఇంకక నేలపై పొర్లుతూ
తాన ప్రత్యేకతను చాటుకొని ప్రవహించే..
అపారమైన ధైర్యాన్ని నీళ్లతో అందించి
లేత మీసాలకు కూడా రోషాన్ని రప్పించి
రేనాటి గడ్డలో గుండె ధైర్యాన్ని నూరిపోసి
సీమ పౌరుషంలో చిరస్థాయిగా నిలిచింది..
ఈ నీటిలో కత్తులే కడిగిన పదును పెరిగే
గుక్కెడు నీళ్లు తాగితే గుండె ధైర్యం వచ్చే
పగోడు చిక్కితే పరలోకానికి పంపే
రోషం గౌరవం కుందూ నీటిలోని గొప్పతనం..
నది తీరాన మొలిచిన గడ్డి కూడా అస్త్రమే
ఇక్కడి ప్రజల మాటల్లో మాధుర్యమే
కవనమల్లిన కవి పుంగవులు ఎందరో
కలం గళం విప్పిన ముద్దు బిడ్డలందరు..
పుష్కర నది కాకపోయినా
కుందూ నది స్నానం పుణ్యప్రదానం
పవిత్రమైన గంగతో సమానం
తీరం వెంబడి ప్రజలకు విలవేల్పు కుందూ..
రేనాటి భూముల్లో నీటి కుండల కనిపించే
పెరిగిన పంటల్లో పసిడిగా నవ్వుల నివసించే
రైతన్నల కళ్ళల్లో ముత్యంలా మురిసే
నాగేటి సాలులో గలగల దొర్లి పోయే..
కుందూ అన్నది కుందేరుగా మారుతూ
పెద్దెరుగా నంద్యాల్లో పరవళ్ళు తొక్కుతూ
నంది మండలంలో నవధాన్యాలు పండించే
సీమలో సిరుల పంటలకు ప్రాణము పోసే..
చినుకు చినుకు ఒడిసి పట్టుకొని
వాగును వంకను ప్రేమతో కలుపుకొని
చిరుధార మహోగ్రరూపమై కదిలి
సీమ ముఖాల్లో చిరునవ్వులే చిందించే…
అడుగుపెట్టిన గ్రామాల్లో ఆనందమే
ప్రకృతి ఒడిలో పరవళ్ళు తొక్కుతూ
సూర్యోదయ సూర్యాస్తమయాల్లో వెలుగుల్లో
సుందర కన్యలా వయ్యారంగా సాగిపోయే..
సీమ నేలలో ఒంపులెన్నో తిరుగుతూ
నీటి బిందువులతో నడకలెన్నో సాగిస్తూ
కొండల్లో కోనల్లో ముచ్చట్లెన్నో చెప్పుతూ
సీమ అంచుకు పచ్చని హారాన్ని సమకూర్చే..
బహుశా ఏ కవి కంట పడలేదేమో
ఈ అపురూప సౌందర్య నది ప్రవాహం
గలగల పారుతున్న శబ్ద సౌందర్యం
బిరబిర ఉరికే మహోగ్ర స్వరూపం…
దారిలో దాయాదులను కలుపుకుంటూ
గాలేరు పాలేరు నిప్పుల వాగు సంకలగుతో
తోడబుట్టినోళ్లను సంకలో ఎత్తుకుంటూ
నల్లమల నీటిని అంగిట్లో నిలుపుకుంటూ..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి పౌరుషం
బుడ్డా వెంగల్ రెడ్డికి దాన గుణం
రేనాటి పాలెగాళ్లకు వీరత్వాన్ని అందించే
కుందూ ప్రవాహము లోనే కలిసే రోషం ..
అప్పుడప్పుడు ఉగ్రరూపం దాల్చుతూ
అపర గంగై శివతాండవం చేస్తూ
ఆవేశము తగ్గి మరలా ఆశీర్వదించే
పతిత పావనిలా సీమ సిగలో మిగిలే..
*🖊️కొప్పుల ప్రసాద్*
నంద్యాల
9885066235
రాక్షస సంహారం
*ఈ రాక్షస సంహారం అంతం ఎప్పుడు..?*
ఎర్రకోట సాక్షిగా చిమ్మింది రక్తం
త్రివర్ణముపై చీకటి నీడలా కమ్ముకుంది
ఏ మాశించింది ఈ ఘోర నిప్పురవ్వలతో
భీతావహ దృశాలతో మనసు మండుతుంటే..
స్వార్థపు పొరల్లో ఇంకిపోయి
మతమైకములో విచ్చలవిడిగా తిరుగుతూ
అంధత్వం ఆవహించినట్లు నటిస్తూ
నడిరోడ్డుపై అక్రమ వలల్లో బంధిస్తున్నారు..
సరిహద్దు రేఖలను తుంచుకుంటూ
చీకటి లోకములో రంగులను పులుముకుంటూ
అర్థము లేని ప్రశ్నలతో సతాయిస్తూ
కూర్చున్న కొమ్మలను నిలువునా నరుకుతున్నారు..
ఎంత విజ్ఞానం వికసిస్తే నేమి
మూఢత్వానికి మూర్ఖత్వాన్ని జోడిస్తూ
నరమేధాన్ని నడివీదుల్లో ప్రదర్శిస్తూ
సామాన్యులను బలిగోరే మూర్ఖపు చర్యలు..
ఏం ఆశిస్తుంది ఈ అజ్ఞానము ప్రపంచం
తోటి మనిషిని చంపి పిశాచిలా విహరిస్తూ
ఉనికి కోసం రక్తపుటేరులను పారించుట
మతోన్మాదమ మత్తులో తూగుట న్యాయమా..
ఏ పవిత్ర గంధం బోధించింది
మనిషిని మనిషిని చంపుకొనే సిద్ధాంతాన్ని
ఏ భగవంతుడు ప్రబోధించాడు
రక్తపు మడుగులలో స్నానాన్ని ఆచరించమని..
విజ్ఞాన ఫలం విశ్వంలో సూర్యోదయం చేస్తుంటే
ఇంకా అజ్ఞానపు చీకట్లో ముష్కర యుద్ధాలు
ఉగ్రవాదుల ఉగ్రరూపం లో మారణ హోమాలు
ఇంకెప్పుడు అంతం ఈ రాక్షస సంహారం..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
ప్రాభాతమ్మున సూర్యతేజము
శా॥
ప్రాభాతమ్మున సూర్యతేజము ధరన్ వారించు ధ్వాంతప్రభల్
ప్రాభాతమ్మున సూర్యతేజము హృదిన్ రావించు చైతన్యమున్
ప్రాభాతమ్మున సూర్యతేజము వెసన్ ప్రాణమ్మగున్ జీవికిన్
ప్రాభాతామలసూర్యదేవుడిని సంభావింతు కైమోడ్పులన్
*~శ్రీశర్మద*
11, నవంబర్ 2025, మంగళవారం
రక్తం వృద్ది అవుటకు
శరీరం నందు రక్తం వృద్ది అవుటకు సులభ యోగాలు -
* బూడిద గుమ్మడికాయ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది . రోజుకు ఒక కప్పు బూడిద గుమ్మడి కాయ రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచిరక్తం వృద్ది అగును. బూడిద గుమ్మడి కాయలోని గుజ్జుని గట్టి గుడ్డలో వేసి బాగా పిండితే రసం కారుతుంది. దానిని కప్పులో వేసుకొని తాగవచ్చు .
* కిసీమిస్ లేదా ద్రాక్షా పండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ది అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు.
* రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష కాయలు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి పిండి ఆ పిప్పి పారవేసి ఆ గ్లాసు నీటిని తాగవలెను .అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే మంచిరక్తం వృద్ది అవుతుంది.
* ఎండు ఖర్జూరాలని కూడా పైన చెప్పిన విధముగా చేసి ఆ నీటిని తాగుచున్న రక్తం వృద్ది అగును.
* శనగలు గుప్పెడు రాత్రి సమయంలో నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ది అయ్యి శరీరం పుష్టి అగును. వ్యాయమం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది .
. పైవిధంగా నానబెట్టిన గింజలు మొలకెత్తిన తరువాత తింటూ ఉంటే ఇంకా అద్బుత ఫలితాలు వస్తాయి .
* కుంకుమపువ్వు ప్రతినిత్యం తీసుకుంటున్నా కూడా రక్తం వృద్ది అగును.
* అంజీర్ పండ్లు అత్తి పండ్లతో కలిపి తింటున్నా రక్తం వృద్ది అగును.
* లేత కొబ్బరి నీరు మరియు లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ది అగును.
రక్తవృద్ది కొరకు నేను ప్రయోగించిన అద్బుత యోగం -
ప్రతి రోజు రెండు పూటలా ఒక గ్లాసు దానిమ్మ రసం నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి లొపలికి తాగించాను . అదే విధంగా మధ్యాహ్నం ఒక యాపిల్ పండు భోజనానికి గంటన్నర ముందు తినిపించాను .
కేవలం నెలరోజుల్లో రక్తం యొక్క శాతం పెరిగింది.
గమనిక -
గోదుమగడ్డి చూర్ణం wheet gross powder ఆయుర్వేద మందుల దుకాణాల్లో లభ్యం అగును.
గమనిక -
. నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034



