ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
11, సెప్టెంబర్ 2023, సోమవారం
⚜ శ్రీ దేవుర్ శివాలయం
🕉 మన గుడి : నెం 175
⚜ ఛత్తీస్‌గఢ్ : గండాయి ( రాజ్‌నంద్‌గావ్ జిల్లా)
⚜ శ్రీ దేవుర్ శివాలయం
💠 గండాయి శివాలయం భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని గండాయి పట్టణంలో ఉన్న శివుని దేవాలయం . ఈ ఆలయాన్ని దేవర్ శివమందిర్ అని కూడా పిలుస్తారు .
ఛత్తీస్‌గఢ్‌లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన రక్షిత స్మారక కట్టడాలలో ఈ ఆలయం ఒకటి.
💠 ఈ ఆలయాన్ని 13 వ - 14 వ శతాబ్దంలో కలచూరి రాజవంశం నిర్మించింది .
💠 ఇది తూర్పు ముఖంగా ఉన్న ఆలయం.
ఈ ఆలయం నాగరా శైలి నిర్మాణ శైలిని అనుసరిస్తుంది.
ఆలయం త్రిరథం ప్రణాళికలో ఉంది. గర్భాలయానికి అభిముఖంగా నందిని చూడవచ్చు.
💠 ఈ ప్రదేశంలో భోరమ్‌దేవ్ సమకాలీన పురాతన శివాలయం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 41 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రదేశంలో పురాతన శివాలయం ఉందని కూడా ఎవరికీ తెలియదు.
భూమిలో సమాధి అయిన ఈ ఆలయం 1979లో గుట్ట తవ్వకం ద్వారా వెలుగులోకి వచ్చింది.
అయితే వందల ఏళ్లుగా భూమిలో పాతిపెట్టి ఉండడంతో ఆలయంలోని చాలా విగ్రహాలు విరిగిపోయాయి.
💠 గండాయిలోని ఈ అందమైన పురావస్తు ఆలయం కాకుండా, గంగై మాత ఆలయం అని పిలువబడే మరొక ఆలయం ప్రసిద్ధి చెందింది, గంగై మాత కారణంగా ఈ నగరానికి గండాయి అని పేరు వచ్చిందని చెబుతారు.
💠 ఈ ఆలయంలో ముఖ్యంగా మహాశివరాత్రిలో, ఈ ఆలయానికి చేరుకోవడానికి చాలా మంది రద్దీ ఉంటుంది.
💠 ఈ ఆలయం రాజ్‌నంద్‌గావ్ నుండి 73 కి.మీ దూరంలో ఉంది.
ఇది బిలాస్పూర్ నుండి 153 కి.మీ దూరంలో ఉంది.
జలగలు ఆయుర్వేద వైద్యం
ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -
జలము ఆయువుగా కలవి కావున జలాయుకములు అనియు , జలము నివాసస్థానం కలవి కావున జలౌకలని మరియు జలగలు అని పిలవబడుతున్నవి. ఇవి 12 విధములు గా ఆయుర్వేదం విభజించింది. ఇందు విషము కలిగినవి నల్లటి రంగులోని బేధము వలన 6 విధములు . అందు కృష్ణ అనునది కాటుక రంగు పెద్ద శిరస్సు గలది. కర్బూర అనునది బొమ్మిడ అను చేప వంటి ఆకృతి కలిగి ఒకచోట చిన్నగా , మరొకచోట పెద్దగా ఉండు పొట్ట కలిగి ఉండును. కలగర్ద అనునది ముడుతలతో కూడి ఉండి పెద్ద పార్శ్వములతో కలిగిన ముఖం
ఉండును. ఇంద్రాయుధ అనునది ఇంద్రధనస్సులోని నానారంగులు గల నీలపు చారలతో కూడుకుని ఉండును. సాముద్రిక అనునది కొద్దిగా నలుపు , పసుపు రంగులతో ఉండి అనేక ఆకృతులుగల తెల్లని మచ్చలతో కూడుకుని ఉండును. గోచందనం అనునది ఆంబోతు బుడ్డ వలే పొట్ట యందు ఒక గీత కలిగి సన్నని ముఖం కలిగి ఉండును.
పైనచెప్పిన 6 రకాల జలగలు విషము కలిగి ఉంటాయి. ఇవి కరిచినచో కాటునందు వాపు , మిక్కిలి దురద, మూర్చ, జ్వరం, తాపము , వాంతి కలుగును.
ఇప్పుడు మీకు విషము లేని జలగలు గురించి వివరిస్తాను. విషములేని జలగలు మొత్తం 6 రకాలు . అందులో కపిల అనునది ప్రక్కల యందు మనశ్శిలతో రంగు వేసినట్లు ఉండి వీపున నిగనిగలాడుచూ పెసలవలే ఆకుపచ్చ రంగు కలిగి ఉండును. పింగళి అనునది కొంచం ఎరుపు రంగు గుండ్రని శరీరం పచ్చని రంగు ఉండి వేగముగా కదులును. శంఖముఖి అనునది యకృత్ వలే ఎరుపు నలుపు రంగులు కలిగి శీఘ్రముగా రక్తమును తాగే స్వభావం పొడవైన వాడి అయిన ముఖం కలిగి ఉంటుంది. మూషిక అనునది ఎలుక వంటి ఆకారం , రంగు , దుర్వాసన కలిగి ఉంటుంది. పుండరీకం అనునది పెసల వలే పచ్చని రంగు , పద్మముల వలే విశాలమైన ముఖం కలిగి ఉండును. సావరిక అనునది నిగనిగలాడుచూ తామరాకు వంటి రంగు కలిగి 18 అంగుళముల పొడవు కలిగి ఉండును. ఇది ఏనుగులు, గుఱ్ఱములకు చికిత్స చేయుటలో మాత్రమే వాడవలెను .మనుష్యులకు పనికిరాదు. వీటిని నిర్విష జలగలు అందురు.
ఈ విషము లేనటువంటి జలగలు లభించు ప్రదేశాలు ముఖ్యంగా ఢిల్లీకి పశ్చిమ దిశలోను , సహ్యాద్రి పర్వతాలు అనగా నర్మదా నది ప్రవహించు పర్వత ప్రాంతాలలోను, మధురా ప్రాంతంలోనూ ఈ విషము లేనటువంటి జలగలు ఉండును. ఈ ప్రదేశాలలో లభించు జలగలు పెద్ద శరీరం కలిగి మంచి బలముతో ఉండి శీఘ్రముగా రక్తమును పీల్చెడి స్వభావం ఎక్కువుగా ఉండి విషము లేకుండా ఉండును.
విషముతో కూడిన చేపలు , పురుగులు , కప్పలు , మూత్రపురీషములు క్రుళ్ళుట చేత పుట్టిన జలగలు మరియు కలుషిత జలము నందు పుట్టిన జలగలు, నీటిలోని పద్మములు కుళ్లుటచేత పుట్టిన జలగలు విషపూరితంగా ఉండును. శుద్ధజలము నందు పుట్టిన జలగలు విషం లేకుండా ఉండును.
ఇప్పుడు జలగలను పట్టే విధానం వాటిని పోషించే విధానం మీకు తెలియచేస్తాను .
రక్తముతో కూడిన తోలు , జంతుమాంసం , వెన్న , నెయ్యి, పాలు మొదలగు వాటితో కూడిన అన్నమును జలగలు ఉన్న ప్రదేశంలో వేసినచో అవి పైకి వచ్చును. అప్పుడు వాటిని పట్టుకొని మంచి కుండలో చెరువునీటిని , బురదని పోసి అందులో ఉంచవలెను. వాటికి తిండి కొరకు నాచు, ఎండిన మాంసము , నీటిలో పుట్టే దుంపల చూర్ణం ఇవ్వవలెను. అవి నిద్రించుటకు గడ్డి, నీటి యందు పుట్టే పచ్చి ఆకులను ఆ కుండ నందు వేయవలెను . రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కుండ యందలి నీటిని తీసివేసి కొత్తనీటిని పోసి ఆహారం కూడా కొత్తదానిని వేయవలెను . ప్రతి ఏడు రోజులకు ఒకసారి కుండను మార్చవలెను . ఈ జలగలను శరత్కాలం పట్టుకొనుట మంచిది .
జలగలను వైద్యంలో ఎలా ఉపయోగించాలో మీకు వివరిస్తాను.
జలగలచే పోగొట్ట తగిన రోగము కలిగిన వానిని కూర్చుండబెట్టి కాని , పడుకోపెట్టి కాని జలగ పట్టించవలసిన ప్రదేశములో వ్రణము లేనిచో ఆ ప్రదేశంలో ఎండించిన ఆవుపేడ చూర్ణం , మన్ను కలిపి మర్దన చేయవలెను . ఆ తరువాత జలగలను తీసుకుని ఆవాలు , పసుపు కలిపి నూరి కలిపిన నీటిలో ముంచి వేరొక మంచినీటి పాత్రలో ముంచి వాటిని రోగమున్న ప్రదేశములో పట్టించవలెను. ఆ తరువాత ఆ జలగకు మంచి కాటన్ గుడ్డ ముక్కతో ముఖము విడిచి శరీరం అంతయు కప్పవలెను. అప్పుడు ఆ జలగ రోగ స్థానమును పట్టును . అలా పట్టనిచో ఆ రోగస్థానం పైన పాలచుక్క గాని రక్తపుచుక్క గాని వేయుట లేక కత్తితో గీయుట చేసినచో జలగ వెంటనే రోగస్థానమును పట్టును . అప్పుడు కూడా జలగ పట్టనిచో దానిని వదిలి వేరొక జలగ పట్టించవలెను .
జలగ ఎప్పుడూ తన ముఖమును గుర్రపుడెక్క వలే విస్తరించి స్కంధమును పైకెత్తి రోగస్థానమును తగులుకొనునో అప్పుడు అది రక్తమును పీల్చుతుంది అని అర్ధంచేసుకొనవలెను వెంటనే దానిని తడిగుడ్డతో కప్పి మధ్యమధ్యలో తడుపుచుండవలెను . అలా చేస్తున్నచో రక్తం బాగుగా పీల్చును. ఆ పీల్చుటలో ముందుగా దుష్టరక్తమునే పీల్చును .
జలగ రక్తం పీల్చుతూ ఉన్నప్పుడు కొంత సమయం తరువాత పోటు , దురద మొదలగుచున్న అప్పటివరకు అది దుష్టరక్తం పీల్చి ఆ తరువాత మంచిరక్తం పీల్చడం మొదలు అయినది అని అర్థం . ఆ తరువాత వెంటనే జలగను తీసివేయవలెను . రక్తం యొక్క రుచి మరిగి ఆ జలగ రానిచో దాని ముఖము పైన సైన్ధవ లవణము వేసినచో విడిచివేయును .
చెడు రక్తం పీల్చిన జలగను శుద్దిచేయు విధానం గురించి మీకు తెలియచేస్తాను.
పైన చెప్పినట్టు రోగస్థానమును విడిచిన జలగకు శరీరం పైన బియ్యపు పిండిని పూసి ముఖం నందు నూనె, ఉప్పు కలిపి రాసి ఎడమచేతితో తోకను పట్టుకొని కుడిచేతితో ముఖము వరకు ఆవుపాలు పితికినట్లు చేయవలెను . ఈ విధంగా చేస్తూ తాగిన రక్తమును బయటకి కక్కునట్టు చేయవలెను . ఆ తరువాత ఆ జలగను శుభ్రపరచి మంచినీటితో కూడిన పాత్ర యందు ఉంచవలెను. అప్పుడు అది ఉత్సాహముగా సంచరించును. అలా సంచరించకుండా కదలక మొద్దుగా ఉన్నచో చెడురక్తం దాని శరీరం నుంచి పూర్తిగా బయటకి పోలేదు అని గ్రహించి మరలా కక్కించు ప్రయత్నం చేయవలెను . కక్కించాక మరలా కుండ నందు భద్రపరచవలెను.
జలగతో రోగనివారణ క్రియ చేశాక చేయవలసిన విధి గురించి వివరిస్తాను.
జలగ ద్వారా చెడు రక్తం తీసాక ఆ గాయమునకు ఔషదాలు కలిపిన ఆవునెయ్యి పూయవలేను . కొందరికి తేనె కూడా పూయవచ్చు.
పైన చెప్పిన జలగతో చెడు రక్తాన్ని తీయు విధానాన్ని రక్తమోక్షణం అంటారు. ఈ క్రియను రోగి యెక్క బలం, రోగం యొక్క బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే అంచనా వేసుకొని చేయవలెను .
********** సంపూర్ణం ************
మరెంతో విలువైన మరియు అతి సులభ యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
సంప్రదాయ పచ్చళ్ళు*
*SP PICKLES*
*సంప్రదాయ పచ్చళ్ళు*
*బ్రాహ్మణ సంప్రదాయ పద్దిలో బ్రాహ్మణ మహిళలతో తయారుచేయబడిన పచ్చళ్ళు*
**మాదగ్గర తయారు చేసిన అన్ని పచ్చళ్ళు పొడులు సంప్రయం పద్దతిలో కలర్స్ ప్రిసర్వేటివ్స్ లేకుండా క్వాలిటీ పదార్ధాలతో తయారుచేస్తాము**
*పచ్చళ్ళు*: *1kg cost*
చింతకాయ తొక్కు450/-
ఉసిరి తొక్కు450/-
ఉప్పు గోంగూర 550/-
పులిహోర గోంగూర 750/-
పండుమిర్చి గోంగూర 650/-
పండుమిర్చి 550/-
ఉసిరికాయ 550/-
దబ్బకాయ 550/-
నిమ్మకాయ 550/-
ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా) 600/-
బెల్లం ఆవకాయ 600/-
పెసర ఆవకాయ 600/-
మెంతి ఆవకాయ 600/-
నువ్వు ఆవకాయ 600/-
కాలి్ఫ్లవర్ ఆవకాయ 600/-
పనసపోట్టు ఆవకాయ 750/-
పచ్చఆవకాయ 850/-
దోసవకాయ. 600/-
మాగాయ 600/-
*వంకాయ నిల్వ పచ్చడి* 750/-
అల్లం పచ్చడి 650/-
మామిడి అల్లం పచ్చడి 650/-
టొమోటో పచ్చడి 550/-
మునక్కాయ టమోటా 650/-
*పచ్చిమిరప ఆవకాయ* 600/-
*పొడులు* : *1kg cost*
కంది పొడి 550/
నువ్వులపొడి 500/-
ధనియాల పొడి 500/-
పప్పులపొడి 500/-
కరివేపాకు కారప్పొడి 550/-
అవిశగింజల పొడి 600/-
కొబ్బరి పొడి 550/-
రసం పొడి 500-
సాంబారు పొడి 650/-
నల్లకారం 600/-
పుదీనా కారపోదడి 750/-
మునగాకుపోడి 2000/-
మునగాకు కారపోడి 650/-
*వడియాలు* & *అప్పడాలు*:
సగ్గుబియ్యం వడియాలు 1kg - 500/-
పెసర అప్పడాలు 650/-
మినప అప్పడాలు 650/-
మిర్చి 850/- *soldout*
గుమ్మడి వొడియలు 850/-
మినపిండి వోడియలు 600/-
*మాదగ్గర ఇంకా*
*చిట్టెంటాపోటు* *పాల ఇంగువ* *లభించును*
*మేము అన్నిరకాల పచ్చళ్ళు పొడులు AS బ్రాండ్ పప్పునూనెతో మాత్రమే తయారు చేస్తాము*
*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*
*అందరికీ నమస్కారం. మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి *
*దయచేసిమీకుతెలిసిన
బ్రాహ్మణ గ్రూపులలో
ఈ మెసేజ్ ని పంపవలసినదిగా
కోరుకుంటునను*
*జలసూత్రం పల్లవి*
*విజయవాడ*
*సంప్రదించండి* : *7981370664**Gp number*
*08662533848*
*7382665848* Gp or Pp number
శ్రీ దేవుర్ శివాలయం
🕉 మన గుడి : నెం 175
⚜ ఛత్తీస్‌గఢ్ : గండాయి ( రాజ్‌నంద్‌గావ్ జిల్లా)
⚜ శ్రీ దేవుర్ శివాలయం
💠 గండాయి శివాలయం భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని గండాయి పట్టణంలో ఉన్న శివుని దేవాలయం . ఈ ఆలయాన్ని దేవర్ శివమందిర్ అని కూడా పిలుస్తారు .
ఛత్తీస్‌గఢ్‌లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన రక్షిత స్మారక కట్టడాలలో ఈ ఆలయం ఒకటి.
💠 ఈ ఆలయాన్ని 13 వ - 14 వ శతాబ్దంలో కలచూరి రాజవంశం నిర్మించింది .
💠 ఇది తూర్పు ముఖంగా ఉన్న ఆలయం.
ఈ ఆలయం నాగరా శైలి నిర్మాణ శైలిని అనుసరిస్తుంది.
ఆలయం త్రిరథం ప్రణాళికలో ఉంది. గర్భాలయానికి అభిముఖంగా నందిని చూడవచ్చు.
💠 ఈ ప్రదేశంలో భోరమ్‌దేవ్ సమకాలీన పురాతన శివాలయం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 41 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రదేశంలో పురాతన శివాలయం ఉందని కూడా ఎవరికీ తెలియదు.
భూమిలో సమాధి అయిన ఈ ఆలయం 1979లో గుట్ట తవ్వకం ద్వారా వెలుగులోకి వచ్చింది.
అయితే వందల ఏళ్లుగా భూమిలో పాతిపెట్టి ఉండడంతో ఆలయంలోని చాలా విగ్రహాలు విరిగిపోయాయి.
💠 గండాయిలోని ఈ అందమైన పురావస్తు ఆలయం కాకుండా, గంగై మాత ఆలయం అని పిలువబడే మరొక ఆలయం ప్రసిద్ధి చెందింది, గంగై మాత కారణంగా ఈ నగరానికి గండాయి అని పేరు వచ్చిందని చెబుతారు.
💠 ఈ ఆలయంలో ముఖ్యంగా మహాశివరాత్రిలో, ఈ ఆలయానికి చేరుకోవడానికి చాలా మంది రద్దీ ఉంటుంది.
💠 ఈ ఆలయం రాజ్‌నంద్‌గావ్ నుండి 73 కి.మీ దూరంలో ఉంది.
ఇది బిలాస్పూర్ నుండి 153 కి.మీ దూరంలో ఉంది.
బసవ పురాణం - 28 వభాగము
🎻🌹🙏 బసవ పురాణం - 28 వభాగము ...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ఈమె శివాపచారం చేసింది కదా!’ అన్నాడు పూజారి బాలుడు భయపడుతూ.పూజారీ! నీవు తప్పే చేశావు.
🌿ఆమె శివపూజా ద్రవ్యాన్ని ముక్కుతో వాసన చూడకుండా చేతితో కదా పుష్పాన్ని అందుకున్నది. కాబట్టి ముందుగా తప్పు చేసింది చెయ్యి ముక్కు కాదు.
🌸అందుకని చేతిని నరకకుండా ముందు ముక్కునెందుకు నరికావు?’ అని నరసింగ నయనారు పెద్ద కత్తితో పట్టమహిషి చేతిని నరికివేశాడు. జనం దిగ్భ్రాంతులైనారు.
🌿మరుక్షణమే శివుడు ప్రత్యక్షమై పట్టమహిషికి ముక్కునూ చేతినీ ప్రసాదించాడు. నరసింహనాయనారుకు సామీప్య ముక్తిని ఇచ్చాడు.
🌸కొట్టరువుచోడని కథ
(శివుడు సిరియాలునికి చెప్పినది)
పూర్వం ఒక చోడరాజు పట్టమహిషి గర్భిణీ అయి వుంది. శివనైవేద్యానికై వండిన పదార్థాన్ని నోరూరి నివేదనకు ముందే ఆమె ఆరగించింది.
🌿అది తెలిసి కొట్టరువు చోడడు కోపగించి ‘శివ నైవేద్యం కాకుండా శివునికై వండిన పదార్థం నీ గర్భంలో ప్రవేశించింది కాబట్టి ఈ గర్భం అపవిత్రమైంది’
🌸అని ఆమె కడుపును కోయడానికి ప్రయత్నించాడు. వివుడు వెంటనే ప్రత్యక్షమై వాని భక్తికి మెచ్చి మోక్షమిచ్చాడు.
🌿హలాయుధుని కథ
పూర్వం హలాయుధుడనే రాజు ఉండేవాడు. శివుడు, సిరియాలుడు భక్తవేషాలతో హలాయుధుని నగరానికి పోయారు.
🌸హలాయుధుడు మహేశ్వరులకు మ్రొక్కి అర్చించాడు. అప్పుడు హలాయుధుడు సిరియాలుని భక్తి కథను విన్పించాడు. హలాయుధుడది విని కోపించి ‘ఇది భక్తి కాదు దారుణం.
🌿శివుడేమి రాక్షసుడా నరభక్షణ చేయడానికి? భక్తుడైన ఆ శిశువును చంపిన తండ్రి, సిరియాలుడేమి మనిషి? అని నిందించాడు.
🌸అది విని శివుడు సిరియాలుని ఘనతను భక్తి కూటములు పాటలుగా కట్టి పాడుతున్నారు. కవులు గద్య పద్య కావ్యములు వ్రాస్తున్నారు.
🌿సాంగ భాషాంగ క్రియాంగ నాటకములుగా ఆడుతున్నారు. అలాంటిదినువ్వువిమర్శిస్తున్నా వేమిటి? అని ప్రశ్నించాడు. దానికి హలాయుధుడు కోపించి ఇలాఅన్నాడు.
🌸శివుడు దేవుడైతే మాంసం ఎందుకడిగాడు? సిరియాలుడు భక్తుడైతే భక్తుడైన కొడుకును ఎందుకు చంపాడు? సిరియాలుడు కోమటి.
🌿కోమటి బుద్ధి పోనిచ్చుకున్నాడు కాడు. ముక్తిమీద ఆశతో కొడుకును కూడా చంపాడు. పోనీ శివుడైనా ఏమి బుద్ధిమంతుడు? పరీక్షకే అనుకుంటే సిరియాలుడు కత్తి ఎత్తగానే ఇక చాలు అని ఆపి వుండవలసింది.
🌸అట్లా కాక చంపనిచ్చి ఆ మాంసం కూడా వడ్డింపమన్నాడు. సిరియాలుడు అంత గొప్పవాడైతే తనను తాను వండుకొని ఎందుకు సమర్పణ చేసుకోలేదు? కాబట్టి సిరియాలునీ, శివుణ్ణీ నేను వెలివేస్తున్నాను.
🌿అంతేకాదు, వారిని గూర్చిఎవరు ముచ్చటించినా వారికి అస్పృశ్యత వస్తుంది అని హలాయుధుడు వెలిబెట్టాడు.అది విని కైలాసంలోని పార్వతీదేవి వణికిపోయింది.
🌸సంగళవ్వను వెంటబెట్టుకొని పరుగు పరున వచ్చి మా భర్తలపై వెలిని తీసివేయమనిప్రార్థించింది.హలాయుధుడు దయతో సిరియాలునికీ శివునికీ పెట్టిన వెలిని తీసివేశాడు.
🌿హలాయుధుని భక్తి ప్రమథులంతా కీర్తించారు. శివుడు హలాయుధుణ్ణి దివ్యవిమానంలోకైలాసానికితీసుకొనిపోయాడు.
🌷మిండనైనారు కథ
🌸(చతుర్థ - మాచయ్య బసవనికి చెప్పినది)పూర్వం మిండనయనారు అనే భక్తుడు ఉండేవాడు. ఆయన శివరాత్రి నియమం పన్నెండు సంవత్సరాలు వరుసగా కలిపి
పదమూడవ సంవత్సరంలో తిరువాలూరులోని
🌿వాల్మీకేశుని గుడికి వె ళ్లి జా గారం చేసి సద్భక్తసమూహంతో గోష్ఠిలో ఉన్నాడు.అప్పుడు ఒడయనంబి అనే పాలకుడు వందిమాగధులు పొగుడుతుండగా వాల్మీకేశుని గుడికి వచ్చాడు.
🌸అయితే అక్కడ కూర్చున్న భక్తులనెవరినీ గౌరవించలేదు. అది చూచి మిండనయనారు ‘వీడెవడు? భక్తులంటే గౌరవం లేదు అని కోపగించు కున్నాడు. అమ్మా!ఆయనను ఏమీ అనకండి.
🌿వాల్మీకేశుడు ఈయన భక్తికి పాటకూ మెచ్చి నిత్యపడి వేయి మాడలు ఇస్తుంటాడు. అంతటి గొప్పవాడు’’ అని ఒడయనంబి గూర్చి అక్కడివారు చెప్పారు.
🌸అది విని మిండనయనారు కోపించి ఇంతటి గర్విష్ఠిని గౌరవించిన ఆ వాల్మీకేశుడెంతటి పనికిమాలినవాడు? ఈ క్షణంనుంచి నేను వాల్మీకేశునికీ ఒడయనంబికి వెలిపెట్టుతున్నాను’ అని గంట వాయించాడు.
🌿మిండనయనారు గొప్పతనం సమాజానికి ప్రదర్శింపదలచి వాల్మీకేశుడు సాకారుడై గుడినుండి పారిపోయాడు. ఒడయనంబి ఇదేమిటని అడిగితే ఆభక్తునికి నేను ప్రాణం...ఇంకా ఉంది....🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿







