17, సెప్టెంబర్ 2023, ఆదివారం

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-49🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-49🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*సుప్రభాత సమయం, క్రమం :*

 

ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే 'సన్నిథిగొల్ల' దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి వెళ్తారు. వారు కూడా స్నానసంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తిచేసుకుని సన్నిథిగొల్ల రాకకోసం ఎదురు చూస్తుంటారు. 


సన్నిథిగొల్ల శ్రీవారి ఆలయానికి విచ్చేయమని ఆయన్ను స్వాగతిస్తారు. అప్పుడు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే 'కుంచెకోల' అనే సాధనాన్ని తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిథిగొల్లని అనుసరిస్తూ మహాద్వారం వద్దకు చేరుకుంటారు. 


    అర్చకస్వాములు మహాద్వారం వద్దకు రాగానే 'నగారా' మండపంలోని నౌబత్ ఖానా (పెద్ద పలకగంట)ని హెచ్చరికగా మోగిస్తారు.


    ఆ ఘంటారావం తర్వాతే ముఖద్వారాన్ని తెరుస్తారు.    సన్నిథిగొల్ల వెంట నడుస్తున్న అర్చకులు ప్రధాన ద్వార దేవతా గణానికి మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయం లోపలికి ప్రవేశిస్తారు.


    తమ వద్ద ఉన్న 'కుంచెకోల'ను, తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు.


    వారు క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి, బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు.


    సన్నిథిగొల్ల అర్చకులను అక్కడే వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్తారు.


     ఆ సమయానికి జియ్యంగారు కానీ వారి పరిచారకుల్లో ఎవరైనా ఏకాంగి కానీ సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని తోడ్కొని సన్నిథిగొల్ల ఆలయానికి వెళ్తారు.


    సరిగ్గా ఆ సమయానికి ఆలయ అధికారి పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు అందరూ బంగారు వాకిలిముందు సిద్ధంగా ఉంటారు.


    తాళ్ళపాక అన్నమయ్య వంశం వారిలో ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు.

  

      సుప్రభాత సేవ కోసం రుసుం చెల్లించిన భక్తుల్ని అప్పుడు బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు. పైన పేర్కొన్న వారందరి ముందు అర్చకులు తమ దగ్గరున్న తాళం చెవితో గడియకు వేసిన తాళాన్ని తీస్తారు.


    సన్నిథిగొల్ల పేష్కారు వద్దనున్న సీలువేసిన చిన్న సంచిలో ఉన్న తాళం చెవులతో, సీలువేసి ఉన్న మూడు పెద్ద తాళాలను తీస్తారు. తీసే సమయంలో అక్కడున్న అందరికీ చూపించడం ఆనవాయితీ.


    తాళాలు తీసిన తర్వాత సన్నిథిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంలో "కౌసల్యా సుప్రజా రామా ...'' అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు.


    ఆ తర్వాత మహంతు, మఠం వారు తెచ్చిన 'పాలు, చక్కర, వెన్న, తాంబూలం' ఉన్న పళ్లెరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకొని వెళ్తారు.    వారటు లోనికి వెళ్ళగానే బంగారు వాకిలిని దగ్గరకు వేస్తారు.


    బంగారు వాకిలి ముందునున్న వేదపండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనాను కొనసాగిస్తారు.


    సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు.

 

     సన్నిథిగొల్ల వద్దనున్న దివిటీ వెలుగులో అర్చకులందరూ రాములవారి మందిరానికి వేసిన తలుపు తాళాలను తీసి శయన మండపంలో పానుపుపై ఉన్న భోగ శ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు.


    దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిథిగొల్ల 'కులశేఖర పడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు.   ఆ తరువాత అర్చకులు, ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు.


    తరువాత సన్నిధిలోని దీపాలను వెలిగిస్తారు. అర్చకులు శ్రీవారికి పాద నమస్కారం చేస్తారు.


    తరువాత శయన మండపంలో బంగారుపట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు.


    ఆపైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో ... మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు.

 

     ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు. 


   మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి, స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు.


    బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు (సుప్రభాతం) మంగళా శాసనాన్ని ముగిస్తూ ఉండగా, లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు. 'నవనీత హారతి' అంటే నివేదనాంతరం ఇచ్చే కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు.


    అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని 'విశ్వరూప సందర్శనం' అని భక్తితో పిలుస్తారు.


    ఈ హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, శఠారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జియ్యంగారికి, ఎకాంగికి ఇస్తారు. 


సన్నిథిగొల్లకు కూడా తీర్థం, శఠారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు. 


 దీని తరువాత జియ్యంగారు, ఏకాంగి, సన్నిథిగొల్ల బంగారు వాకిలి వెలుపలకు వస్తారు. దేవస్థానం పరిచారికలు లోపలికి వెళ్ళి శ్రీవారి పాన్పును, మంచాన్ని బయటగల 'సబేరా' గదిలోకి తీసుకు వెళ్తారు.   


 సుప్రభాతం పఠించిన వేదపండితులు, అన్నమాచార్య వంశీయులు, మహంతు, మైసూరు సంస్థానం తరపు వారు ఇంకా స్వామి వారి కైంకర్యంలో పాల్గొన్న స్థానీయులు స్వామి వారి సన్నిధికి వెళ్ళి హారతి, తీర్థం, చందనం, శఠారి మర్యాదలు పొందుతారు. వీరందరికీ శ్రీవారికి నివేదించిన చందనం, వెన్న ప్రసాదంగా ఇస్తారు.


    ఆ తరువాత ఆలయాధికారులు, సర్కారు (దేవస్థానం) వారి హారతి జరిపి తీర్థచందన నవనీత ప్రసాదం స్వీకరిస్తారు.    


స్వామివారి సుప్రభాత సేవకోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం, శఠారులను స్వీకరిస్తారు


*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 24*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 24*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


        *జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే*

        *తిరస్కుర్వ న్నేతత్స్వమపి వపురీశ స్తిరయతి |*

        *సదాపూర్వ స్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివః*

        *తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయోర్భ్రూ లతికయోః||*


ఈ శ్లోకం లోనూ తరువాతి శ్లోకంలోనూ అమ్మవారు సర్వ దేవతాగణములను ఏ విధంగా నిర్వహిస్తారో చెప్తున్నారు.


అందరు దేవతల శక్తి అమ్మవారిలో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే అమ్మవారి నామాల్లో సర్వ దేవతల నామాలూ వస్తాయి. ఇప్పుడు అమ్మవారి  ఆజ్ఞననుసరించి..


జగత్సూతే ధాతా = బ్రహ్మ జగత్తును సృష్టిస్తున్నాడు.


హరి రవతి = విష్ణువు రక్షిస్తున్నాడు.


రుద్రః క్షపయతే = రుద్రుడు క్షయింపజేస్తున్నాడు.


తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశ స్తిరయతి = మహేశ్వరుడు  జగత్తునంతటినీ మరుగుపరుస్తూ తానూ మరుగవుతున్నాడు.


సదాపూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివః = సదాశివుడు మళ్ళీ సృష్టి కలిగేటప్పుడు జగత్తును బయలుపరుస్తున్నాడు.


తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూ లతికయోః = నీ ఆజ్ఞను స్వీకరించి నీ కనుబొమల కదలికల సంజ్ఞలతో పంచకృత్యములను నిర్వహిస్తున్నారు వీరంతా. (కనుబొమల మధ్య 'ఆజ్ఞా' చక్రము కదా!)


ఇక్కడ రుద్రుడు,  మహేశ్వరుడు, సదాశివుడు, అంటున్నారు.అందరూ ఒకరే కాదా అనే సందేహం కలుగుతుంది. మొదట్లోనే చెప్పుకున్నట్లు ఈశ్వరుడు ఒక్కడే, శక్తీ ఒక్కటే. వివిధ కర్తవ్యాల నిర్వహణకు వివిధ రూపాలు, నామాలు. *ఏకం సత్ విప్రా: బహుథా వదంతి* అన్నది వేదం.


ఈ పంచకృత్యాలు ఏమిటో మరొక్కసారి చెప్పుకుందాం.


సృష్టి = కల్పారంభ సృష్టి. 

మన లౌకిక వ్యవహారంలో ఉదయం నిద్ర లేవటం.


స్థితి = జగద్రక్షణ. 

మన విషయంలో రోజంతా మన కార్యనిర్వహణ.


లయ = కల్పాంత ప్రళయం. మనకు రాత్రి నిద్ర.


తిరోధానము = ప్రళయకాలంలో జగత్తును మరుగు పరచటం. 

మనం, నిద్రలో మన వ్యవహారాలన్నీ మరవటం.


అనుగ్రహం = తిరిగి నూతన కల్పారంభ సృష్టి. 

మనం నిద్రనుండి లేవగానే, నిద్రలో మరుగుపడిన అన్నివ్యవహారాలు తిరిగి జ్ఞప్తికి రావటం.


ఇవన్నీ అమ్మ ఆజ్ఞ మేరకు జరిగేవే.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వ్యసనపరుడు

 

వ్యసనపరుడు

ఏదైనా దుర్వ్యసనాలకు ఒక మనిషి బానిసగా మారితే అతనిని వ్యసనపరుడు అనడం మన మెరుగు దముఒక మనిషి రోజు మద్యం సేవిస్తూ, ఉన్న సంపాదన, ఆస్తి అంతా ఖర్చుపెట్టి భార్యా బిడ్డలను పట్టించుకోకుండా వుండే వారిని మనం సమాజంలో అక్కడక్కడ చూస్తూ ఉంటాంఅతని భార్యను చూసి నలుగురు అయ్యో పాపం తల్లి జన్మలో పాపం చేసుకుందో ఇటువంటి వ్యసనపరుడికి భార్యగా వచ్చింది అని ముక్కు మీద వేలు వేసుకుని అంటూ ఉంటారు. తల్లి తల్లిదండ్రులు బాద్యతపరులు అయితే ఆమెను ఆమె పిల్లలను పుట్టింటికి తీసుకొని తన కూతురు మనవలు మనవరాళ్ల బాధ్యత తీసుకుంటే సరి అదే వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలివేస్తే కుటుంబం పరిస్థితి చాలా హృదయ విదారకంగా మారుతుంది. పిల్లలు దొంగలుగా, మోసకారులుగా రౌడీలుగా మారి అక్రమ సంపాదన చేస్తూ సమాజానికి చీడపురుగులుగా మారుతారు. .  మనం కొన్ని సందర్భాలలో అటువంటి పిల్లలను చూస్తూ ఉంటాంవారిని చూసి జాలి కూడా పడలేము ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి సంరక్షణ ఉండదో అప్పుడు పిల్లలు తెగించి జీవిస్తారు దాని పర్యవసానమే వారి దుష్టత్వం.

తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో, బాధ్యతతో పెంచితే పిల్లలు సమాజానికి ఎంతో ఉపయోగపడే వారుగా తయారవుతారు. మనం సాధారణంగా ఎవరైనా సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటే అతను తల్లి కన్న బిడ్డో చూడు ఎంత పెద్దవాడు అయ్యాడు అని అతని తల్లిదండ్రులను తలుచుకుంటాము. అందుకే సంతానం ఉంటే తల్లిదండ్రుల పేరుని  నిలపెట్టేవారుగా  వుండాలని అంటారుఅదే ఒక దుర్మార్గుడిని గురించి సమాజం వీడిని పాపిష్టి తల్లి కన్నదో అని అనవసరంగా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని కూడా దూషించటం పరిపాటి.

వ్యసనపరుడికి సమాజంలో తన భార్య పిల్లలు ఏమైపోయినా పట్టదు, తన గురించి సంఘం ఏమనుకుంటున్నాదో అది కూడా పట్టదు. కేవలం అంటే కేవలం అనుక్షణం సారా మత్తులో మునిగి తేలుతూ వుంటారు. వారు వీధులలో తాగి పడిపోయి నిద్రించటం కూడా మనకు అప్పుడప్పుడు గోచరిస్తుంది. అంటే వారికి తన గురించి తన కుటుంబం గురించి అంతేకాక సమాజం గురించి కూడా ఏమి పట్టి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు నిత్యానంద స్వరూపులు అదేమిటి అలా అంటున్నావు అని నీవు అనవచ్చు కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం సదా సారా మత్తులో జీవితాన్ని గడపడమే వారి జీవన లక్ష్యం.

ఇదేమిటి భార్గవ శర్మ కి ఏమైంది తాగి ఇది వ్రాస్తున్నాడా అని మీకు అనిపించవచ్చుకానీ నిజానికి ఒక ఆధ్యాత్మిక విషయం చెప్పాలంటే సమాజంలో ఉన్న ఏదో ఒక ఉపమానంతో చెబితే కానీ అది మనస్సుకు హద్దుకుని సాధకుని తన సాధనలో ముందుకు తీసుకొని వస్తుందని భావించి చెప్పడం జరుగుతున్నది.

మనం భగవంతుని కేవలం ఒక పది నిముషాలో లేక ఒక అర్ధగంటో ప్రార్ధిస్తే కలిగే ప్రయోజనం కేవలం స్వల్పంగా ఉంటుందిఅదే ఒక తాగుబోతు లాగా అనుక్షణం భగవంతుని జాసలో గడిపిన అప్పుడుగాని జీవన్ముక్తి అంటే మోక్షం లభిస్తుంది. ఒక తాగుబోతు ఉపమానం నీచంగా కనిపించవచ్చు కానీ నిజానికి అదే సరైన ఉపమానం తాను తన జీవిత లక్ష్యమైన మధుపానం కోసం సంఘములో తన మర్యాదను, తన భార్య పిల్లలను చివరకు తన ఆరోగ్యాన్ని సహితం పణంగా పెట్టి తన వ్యసనానికి బానిస అయ్యాడుమరి ముముక్షువు అని చెప్పుకునే నీవు నిజంగా సంఘంలో నీ  మర్యాదను, నీ భార్యాపిల్లలను పణంగా పెట్టి ధ్యానం చేస్తున్నావా అంటే లేదంటే లేదనే చెప్పాలి. ప్రతి క్షణం దేహ వ్యామోహంతో కొట్టుమిట్టాడుతూ నాకు మోక్షం కావాలని అనుకోవడం కేవలం అందని ద్రాక్ష కోసం ఆరాట పడటమే

ప్రతి సాధకుడు ముందుగా తెలుసుకోవలసింది తన శరీరం తనకు భగవంతుడు ప్రసాదించిన ఒక పరికరం లాంటిదే అని భావించి శరీర ఫై మొహం లేకుండా అంటే శరీరాన్ని అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని భావిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా కేవలం శరీర శుభ్రత పాటిస్తూ పూర్తిగా మానసిక శుద్ధికి మాత్రం ప్రయత్నించాలి. మనస్సు పరిశుభ్రంగా లేకుండా శరీరం ఎంత పరిశుభ్రంగా ఉన్నాకూడా భగవంతుని చేరుకోలేము.

సాధకుడు శరీరానికన్నా మనస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలిసదా మనస్సును శుద్ధిగా ఉంచుకోవాలినిత్యం అనుక్షణం ద్యాస భగవంతుని మీదనే ఉంచాలి ఎలా అయితే వ్యసనపరుడు నిత్యం మత్తులో మునిగి ఉంటాడో అలాకానీ భార్య పిల్లలను విడనాడాల్సిన పనిలేదు. సంసారాన్ని కేవలం ఒక బాధ్యతగా భావించి జీవనం చేయాలి. భార్యాపిల్లలకు  భగవంతుని పట్ల ప్రేమ, భక్తిని పెంపొందించే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. తాను మాత్రం నిత్యం భగవంతుని ధ్యానంలో గడపాలి, తన కేశాలు ఎలా ఉన్నాయి, దుస్తులు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద పూర్తిగా శ్రద్ధను వదలాలి, ఒక మాటలో చెప్పాలంటే ఒక సాధకునికి అడ్డంపడే విషయాలు ఏమిటంటే అవి అరిషడ్వార్గాలు అందులో ప్రతి ఒక్కటి దాని దాని ప్రభావం కలిగి సాధకుని సాధనలో ముందుకు వెళ్లకుండా ఆపుతుందిఎప్పుడైతే సాధకుడు వాటిని అధిగమిస్తాడో అప్పుడే సాధనలో ముందుకు వెళ్లగలుగుతాడుముందుగా జయించాలసింది మొహాన్ని మొహం అనేది దేహ వ్యామోహంతో మొదలవుతుందిదేహం అందంగా వున్నది అనే భావనే మొహానికి మొదటి మెట్టుకాబట్టి భావనను విడనాడాలంటే ముందుగా కేశాలను నిర్ములించాలి అంటే ముండనం చేయించుకోవాలిఅప్పుడు సాధకుడు తనను తానూ అద్దంలో చూసుకొని నేను అందంగా లేను అనే భావం కలిగివుంటాడు దానివలన శరీర మొహం కొంతవరకు తగ్గుతుందిసాధకుడు ఎట్టి పరిస్థితిలోను కేశాలకు రంగు వేయరాదుఇలా చేసాడంటే వాడు జన్మలో సాధనకు పనికి రాడు .

తానూ పరిస్థితిలో వున్నా అంటే స్నానమాచరిస్తూవున్న, మల మూత్ర విసర్జన చేస్తూ వున్నా భగవంతుడి ధ్యానం నుండి విడివడకూడదు. ఎందుకంటే మనకు ఈ జన్మలో వున్న సమయం చాలా కొద్దిది సమయాన్ని మనం మంచి ముహూర్తం అని పరిశుభ్రం అని ఇంకా ఏదో ఏదో అని వ్యర్థం చేస్తే మన జీవిత లక్ష్యం ఆయిన మోక్షాన్ని చేరుకోలేముసాధకుడు సదా పరిశుద్ధుడేఎందుకంటె సాధకుని మనస్సు ఎల్లప్పుడూ శుద్ధిగానే ఉంటుంది. కాబట్టి సాధక ఇంకా ఆలస్యం చేయక ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు మోక్షార్థివి కమ్ము.

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు

మీ భార్గవ శర్మ