23, సెప్టెంబర్ 2023, శనివారం

శర్మ స్ బ్రాహ్మణ భోజనం& కేటరింగ్

 ఆల్ ఓవర్ ఇండియా

శర్మ స్ బ్రాహ్మణ భోజనం& కేటరింగ్ 



మీ ఇంట జరిగే శుభకార్యాలకి అన్ని కార్యక్రమాలకి వేద పండితులకి,మడితో రుచిగా శుభ్రంగా (ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా)  మీరు కోరుకున్న విధంగా బ్రాహ్మణ క్యాటరింగ్ చేయబడును దూరప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులకు,శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములకు, భవానీలకు, వేద పండితులకు కూడా భోజనం టిఫిన్స్ అందజేస్తాం దయచేసి ఒకరోజు ముందు రోజు తెలియజేయగలరు🙏 ప్రసాదాలు కూడా ఇవ్వబడును


విజయవాడ సాయిశర్మ 7396881404

విజయవాడ మధువని 9182554800

విజయవాడ పవన్ శర్మ 79896 44180

సికింద్రాబాద్ శ్రీ రామ క్యాటరింగ్090329 10106

సికింద్రాబాద్ రవి కిరణ్ శర్మ7842413139

సికింద్రాబాద్ కళ్యాణ్ శర్మ9885785556

వైజాగ్ సాయి శర్మ 7032324851

బెంగళూరు బాలసుబ్రమణ్యం శర్మగారు9986119510

తిరుపతి హేమంత్ శర్మ9959859227

నెల్లూరు భార్గవ శర్మ+91 93469 43145

కాకినాడ హరి శర్మ

08142729222

సామర్లకోట శర్మ గారు

9182285617

గుంటూరు సాయి శర్మ7989585295

కడప మురళీ శర్మ

9866261232

చెన్నై శ్రీనివాస్ శర్మ7395932954

కేరళ శర్మ9447136023

ముంబై శివరామన్ శర్మ+91 74484 08447

మధురై నారాయణ శర్మ9842191826

అరుణాచలం లక్ష్మీకాంత శర్మ88702186

Photo








 

Music


 

Janpriya food distribution


 

J


 

Women


 

⚜ శ్రీ హత్నికల మందిర్

 🕉 మన గుడి : నెం 187


⚜ ఛత్తీస్‌గఢ్ : ముంగేలి





⚜ శ్రీ హత్నికల మందిర్ 



💠 ఛత్తీస్‌గఢ్‌లోని హత్నికల ఆలయం

 మతపరమైన ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, ఈ ప్రదేశం పర్యాటకానికి సాటిలేని ఉదాహరణ.  దీన్ని చూసేందుకు ఏడాది పొడవునా పర్యాటకులు, భక్తుల రద్దీ నిరంతరం ఉంటుంది.  ఈ ఆలయం చుట్టూ పచ్చని చెట్లు మరియు మొక్కలు ఉన్నాయి.


💠 ఆలయ ప్రాంగణంలోకి రాగానే పెద్ద మైదానంలా కనిపిస్తుంది.

ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించబడిన మా దుర్గాదేవి యోక్క ఎనిమిది చేతుల విగ్రహం సజీవంగా కనిపిస్తుంది.



💠 ఆలయ నిర్మాణం: 

1972లో, హత్నికాల గ్రామానికి చెందిన మల్గుజార్ దివంగత రోహన్ సింగ్ రాజ్‌పుత్ అన్ని మతాల ప్రజల సహకారంతో మా దుర్గా ఆలయాన్ని నిర్మించారు.  

దివంగత రోహన్ సింగ్ రాజ్‌పుత్ విగ్రహం తోటలోనే ఉంది.  

ఆలయాన్ని నిర్మించేటప్పుడు, అతను ఆలయ వైభవాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాడు.  మాత విగ్రహాన్ని 30 సెప్టెంబర్ 2006న ఆవిష్కరించారు.


💠 చైత్ర మాసం మరియు నవరాత్రి సమయంలో, దుర్గాదేవి దర్శనం కోసం భక్తులు మరియు భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.  

ఈ కారణంగా, ఇక్కడ రెండు ప్రవేశ ద్వారాలు చేయబడ్డాయి.  

ఇక్కడ అనేక చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇందులో పురాతన శివాలయం కూడా ఉంది.


💠 ముంగేలిలోని హత్నికళ ఆలయానికి చేరుకునే భక్తులు ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. 

 

💠 ఇక్కడ రాత్రి వేళల్లో అమ్మ పాదాల కంకణ స్వరం వినిపిస్తోంది.


💠 ఒకనాడు రాత్రి తలుపు తెరిచి ఉండగా ఒక వ్యక్తి ఇక్కడకు వచ్చాడు.  తలుపు తెరిచి ఉండడంతో గుడి లోపలికి వెళ్లాడు.  

సింహం విగ్రహం ఉన్న స్థలంలో సింహం విగ్రహం అక్కడ లేకపోవడాన్ని గమనించాడు.

 ఇదంతా గ్రామస్తులకు చెప్పాడు.  

అయితే ఉదయానికి సింహం విగ్రహం తిరిగి యథాస్థానానికి చేరుకుంది.  

అప్పటి నుంచి ఆయన గుర్తింపు మరింత పెరిగింది. 

ఈ ఆలయంలో సింహం విగ్రహం నోట్లో చెయ్యిపెట్టి కోరికలు కోరుకుంటే అవి తప్పక నెరవేరుతాయి అని స్థానికుల ప్రగాఢ విశ్వాసం.


💠 ఈ ఆలయం ఇసుకరాయి మరియు పాలరాయితో నిర్మించిన అందమైన, ఆకట్టుకునే నిర్మాణం.  

ఇది ఛత్తీస్‌గఢ్‌లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి మరియు ప్రతి సంవత్సరం అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది


💠 ఈ ఆలయంలో దుర్గ, విష్ణు, బ్రహ్మ, కుబేరుడు మరియు ఇంద్రుడితో సహా అనేక ఇతర దేవాలయాలు మరియు వివిధ దేవతల విగ్రహాలు ఉన్నాయి. 

  

💠 ఆలయం తెరిచే సమయం 

ఉదయం 5:00 నుండి రాత్రి 9:00 వరకు.  నవరాత్రుల సమయంలో ఇది రాత్రంతా తెరిచి ఉంటుంది.



💠 బిలాస్పూర్ రైల్వే స్టేషన్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది

Left Side Sleeping

 Left Side Sleeping : ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం. మనం శరీరానికి తగినంత నిద్ర పోతేనే ఆరోగ్యంగా, చురుకుగా ఉండగలం. లేదంటే మనల్ని అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

నిద్ర ఎలా అయితే మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుందో అలాగే మనం నిద్రించే భంగిమ కూడా మన ఆరోగ్యం పై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రభావం మన మెదడు, జీర్ణాశయం మీద ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి నిద్ర మన శరీరానికి శక్తిని, చురుకుదనాన్ని ఇస్తుంది. 


ఒక గాఢ నిద్ర వల్ల మనం రోజంతా అలసట లేకుండా చురుకుగా పని చేసుకోవచ్చు. మంచి నిద్ర ఎంత ఆరోగ్యానికి ఎంత అవసరమో మనం నిద్రిచేటప్పుడు మన శరీరం ఉండే స్థితి కూడా మన ఆరోగ్యానికి అంతే అవసరం. 


మనలో చాలా మందికి అసలు ఎలా నిద్రించాలో కూడా తెలియదు. సరైన స్థితిలో నిద్రించకపోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అలాగే తరచూ మెలుకువ వస్తూ ఉంటుంది.


అలాగే నిద్రలో మెడ, భుజాలు నొప్పి పెడుతూ ఉంటాయి. అలాగే మనం నిద్రించే భంగిమ మన జీర్ణాశయంపై కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఉదయం లేచిన వెంటనే చాలా బద్దకంగా ఉంటుంది. 


అలాగే పొట్ట కూడా పూర్తిగా శుభ్రం కాక మనం ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. మనం ఏ భంగిమలో నిద్రిస్తే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. 


ఇది చాలా ప్రమాదకరమైన భంగిమ. ఇలా అస్సలు నిద్రించకూడదు. ఆస్థమా ఉన్న వారు ఇలా అస్సలు నిద్రించకూడదు. ఇలా నిద్రించడం వల్ల ఊపిరితిత్తుల మీద అలాగే పొట్ట మీద ఎక్కువగా, వెన్ను పూస ఎముకల మీద ఒత్తిడి పడుతుంది. దీంతో మనం నిద్రపోయేటప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.


Left Side Sleeping


ఇలా బోర్లా పడుకోవడం వల్ల నడుము నొప్పి అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా కొందరు కుడి చేయివైపు తిరిగి పడుకుంటారు. ఇలా నిద్రించడం కూడా అస్సలు మంచిది కాదు. ఇలా నిద్రించడం వల్ల మన జీర్ణాశయంపై చెడు ప్రభావం పడుతుంది. 


ఇలా నిద్రించడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, పుల్లటి త్రేన్పులు, మలబద్దకం, కడుపుఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఇక కొందరు ఎడమ చేతి వైపు తిరిగి పడుకుంటారు. ఇలా నిద్రించడం అన్నింటి కంటే ఉత్తతమమైనది. 


ఎడమ చేతి వైపు నిద్రించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా నిద్రించడం వల్ల మన శరీరంలో అవయవాలు సహజంగా శుభ్రపడతాయి. వ్యాధులు, అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. 


ఎడమ చేతివైపు తిరిగి నిద్రించడం వల్ల రక్తంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. జీర్ణాశయం చక్కగా పని చేస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇలా నిద్రించడం వల్ల మనం తిన్న భోజనం చాలా సులభంగా పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది.


ఇలా నిద్రించడం వల్ల ఉదయం పూట పొట్ట చాలా సులభంగా శుభ్రపడుతుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు, గర్భిణీ స్త్రీలు ఎడమ వైపు తిరిగి నిద్రించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


 గ్యాస్, ఎసిడిటీ, కడుపు సంబంధిత సమస్యలతో బాధపడే వారు, నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి నొప్పులతో బాధపడే వారు ఎడమ వైపు తిరిగి నిద్రించడం ఆయా సమస్యలు రాకుండా ఉంటాయి. 


ఇలా నిద్రించడం వల్ల ఎక్కువ సమయం నిద్రించవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు, ఎక్కువగా గురకపెట్టే వారు ఎడమ వైపు చేతి వైపు తిరిగి నిద్రించడం మంచిది. ఎడమ చేతి వైపు తిరిగి నిద్రిస్తే మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఇలా నిద్రించడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పంచాంగం 23.09.2023 Saturday,

 ఈ రోజు పంచాంగం 23.09.2023 Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: అష్టమి తిధి స్థిర వాసర: మూల నక్షత్రం సౌభాగ్య యోగ: బవ తదుపరి బాలవ కరణం ఇది ఈరోజు పంచాంగం 

అష్టమి మధ్యాహ్నం 12:13 వరకు.

మూల మధ్యాహ్నం 02:51 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:08

వర్జ్యం : మధ్యాహ్నం 01:17 నుండి 02:50 వరకు తిరిగి రాత్రి 11:57 నుండి 01:28 వరకు.

దుర్ముహూర్తం : ఉదయం 06:08 నుండి 07:44 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30  వరకు.


యమగండం : మద్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

Jokes







 

Panchaag


 

వినాయక చవితి సందేశాలు ----------------------- సందేశం - 8/11

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 8/11



ఓమ్ (ॐ) - వినాయకుడు



ఓమ్ (ॐ)    


    వేదాలను త్రయీ అంటారు. గద్య మంత్ర గాన భాగాలుగా అవి మూడు.

    మొదటి దానిలో తొలిమంత్రం "అగ్నిమీళే పురోహితమ్". అందులో మొదటి వర్ణం "అ".

    రెండవదానిలో మధ్యమంత్రం "యో నిస్సముద్రో బంధుః". అందులో మధ్య అక్షరం "ఉ".

    మూడవదానిలో చివరి మంత్రం "అసమానాంతరమ్". దానిలో చివరి వర్ణం "మ్".


      ఈ మొదలు, మధ్య, చివరలలోని అ + ఉ + మ్ = ఓమ్ అయింది.

      దీన్ని మనం "ॐ" గా వ్రాస్తాం కదా! ఇది వినాయకుని రూపమే!            


     ఈ ॐ లో


1. "3" లా కనిపించే భాగం ఉంది. ఆ 3 అనే అంకె కూడా అడ్డంగా సరిసమానంగా కాక, పై భాగం చిన్నగానూ, క్రింది భాగం పెద్దగానూ కన్పిస్తుంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే - చిన్నగా కనిపించే ఆ పైభాగం వినాయకుని "శిరస్స"నీ, క్రింద పెద్దగా కనిపించే భాగం ఆయన "బొజ్జ" అనీ తెలుస్తుంది.


2. ఆ శిరస్సూ బొజ్జా కలసిన భాగం నుండి - మనకి కుడివైపునా, ఆ దేవునికి ఎడమవైపునా - ప్రక్కగానూ, వంకరగానూ కనిపించే భాగం ఆయన "తుండం".


3. ॐ కి తలమీద ఉన్న అర్ధ చంద్రాకారపు భాగం - ఆయన శిరస్సుమీద ఉండే "చంద్రవంక".

       అందుకే 'నుదిటిపై చంద్రరేఖ గలవాడు' అనే అర్థం వచ్చే "ఫాలచంద్రః" అనేది కూడా వినాయకుని పేర్లలో ఒకటి.


4. విద్యలన్నిటికీ మూలమూ, విజ్ఞాన సర్వస్వం "వేదం". వేదపఠనం ప్రారంభించేముందు పండితులు 

      "శ్రీ మహాగణాధిపతయే నమః - శ్రీ గురుభ్యో నమః - హరిః ఓమ్" - అని పలికి ఆ మీదటే వేదాన్ని వినిపిస్తారు.

      ఏది వ్రాయాలన్నా - వేదాధినేత వినాయకుని ధ్యానించి, వినాయక రూపాన్ని ॐ అని వ్రాసి, ప్రారంభిస్తాం కదా!


5. ప్రాణాయామం

       ముమ్మార్లు ॐ పలకడంద్వారా ప్రాణాయామం చేసి, ధ్యానార్చనాది ఏ భగవత్కార్యమైనా మొదలుపెడతాం కదా!

     ప్రణవంతో ప్రాణాయామం చేస్తే, మెదడులో - ఆలోచనకి కేంద్రస్థానమైన "పిట్యూటరీ" గ్రంధి ఉత్తేజితమౌతుంది. 


పరమాత్మకు కల మూడు పేర్లు 


   "ఓమ్ ఖమ్ బ్రహ్మ" అని వేదం చెబుతుంది. అందులో మొదటిది,


"అవతీతి ॐ" 

   - రక్షిస్తుంది కాబట్టి "ॐ" అని పేరు. 

    మనం జ్ఞానం చేత రక్షింపబడతాం. ఆ జ్ఞానం వేదం ద్వారా పొందగలుగుతాం. 

   "ॐ" ఉచ్చరించడం ద్వారా మెదడులోని "పిట్యూటరీ"గ్రంథి ఉత్తేజితమై ఆలోచన సక్రమంగా ఉండడమూ, 

    "ॐ" రూపంలోని "వినాయకుడు" సకల విద్యలూ అనుగ్రహించడమూ జరుగుతుంది. 


    దీన్నిబట్టీ "కోరిన విద్యలకెల్ల ఒజ్జ" - వేదస్వరూపమూ - ప్రణవస్వరూపంగా ఆరాధింపబడేది "వినాయకుడే" అనేది తెలుస్తోంది కదా!


                    =x=x=x=


    — రామాయణం శర్మ

            భద్రాచలం

సృష్టి రహస్య విశేషాలు.

 🚩🚩🚩సృష్టి రహస్య విశేషాలు..!!🚩🚩🚩

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾


1 *సృష్టి * ఎలా ఏర్పడ్డది

2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది

3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి


( సృష్ఠి ) ఆవిర్బావము.

1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది

2 శివం యందు శక్తి

3 శక్తి యందు నాధం

4 నాధం యందు బిందువు

5 బిందువు యందు సదాశివం

6 సదాశివం యందు మహేశ్వరం

7 మహేశ్వరం యందు ఈశ్వరం

8 ఈశ్వరం యందు రుద్రుడు

9 రుద్రుని యందు విష్ణువు

10 విష్ణువు యందు బ్రహ్మ

11 బ్రహ్మ యందు ఆత్మ

12 ఆత్మ యందు దహరాకాశం

13 దహరాకాశం యందు వాయువు

14 వాయువు యందు అగ్ని

15 ఆగ్ని యందు జలం

16 జలం యందు పృథ్వీ. 

17. పృథ్వీ యందు ఓషధులు

18. ఓషదుల వలన అన్నం

19. ఈ అన్నము వల్ల...... నర , మృగ , పశు , పక్షి ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.


( సృష్ఠి ) కాల చక్రం.

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.

ఇప్పటివరకు ఎంతో మంది శివులు  

ఎంతోమంది విష్ణువులు  

ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 

ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.

ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.


1 కృతాయుగం

2 త్రేతాయుగం

3 ద్వాపరయుగం

4 కలియుగం


నాలుగు యుగాలకు 1 మహయుగం.

71 మహ యుగాలకు 1మన్వంతరం.

14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)

15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)

1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  

1000 యుగాలకు ఒక రాత్రి (ప్రళయం.)

2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.


ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.

1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.

7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.

14 మంది మనువులు.

ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 

శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.


5 గురు భాగాన కాలంకు 60 సం

1 గురు భాగాన కాలంకు 12 సం

1 సంవత్సరంకు 6 ఋతువులు.

1 సంవత్సరంకు 3 కాలాలు.

1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి

1 సం. 12 మాసాలు.

1 సం. 2 ఆయనాలు

1సం. 27 కార్తెలు

1 నెలకు 30 తిధులు

27 నక్షత్రాలు - వివరణలు

12 రాశులు

9 గ్రహాలు

8 దిక్కులు

108 పాదాలు

1 వారంకు 7 రోజులు


పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.


సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.

దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.

1 సత్వ గుణం 

2 రజో గుణం

3 తమో గుణం


( పంచ భూతంలు ఆవిర్భావం )

1 ఆత్మ యందు ఆకాశం 

2 ఆకాశం నుండి వాయువు

3 వాయువు నుండి అగ్ని

4 అగ్ని నుండి జలం

5 జలం నుండి భూమి అవిర్బవించాయి.


5 ఙ్ఞానేంద్రియంలు

5 పంచ ప్రాణంలు

5 పంచ తన్మాత్రలు

5 ఆంతర ఇంద్రియంలు

5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు


1 ( ఆకాశ పంచికరణంలు )

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )

ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )

ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )

ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )

ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి


2( వాయువు పంచీకరణంలు )

వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)

వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )

వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )

వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )

వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.


3 ( అగ్ని పంచీకరణములు )

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )

అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )

అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )

అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )

అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టెను.


4 ( జలం పంచికరణంలు )

జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )

జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )

జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )

జలం - జలంలో కలవడంవల్ల ( రసం )

జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టెను.


5 ( భూమి పంచికరణంలు )

భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )

భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )

భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )

భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )

భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టెను.


( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానేంద్రియంలు

1 శబ్ద

2 స్పర్ష

3 రూప

4 రస

5 గంధంలు.


5 ( పంచ తన్మాత్రలు )

1 చెవులు

2 చర్మం

3 కండ్లు

4 నాలుక

5 ముక్కు


5 ( పంచ ప్రాణంలు )

1 అపాన 

2 సామనా

3 ప్రాణ

4 ఉదాన

5 వ్యాన


5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మేంద్రియంలు )

1 మనస్సు

3 బుద్ది

3 చిత్తం

4 జ్ఞానం

5 ఆహంకారం


1 వాక్కు

2 పాని

3 పాదం

4 గుహ్యం

5 గుదం


6 ( అరిషడ్వర్గంలు )

1 కామం

3 క్రోదం

3 మోహం

4 లోభం

5 మదం

6 మాత్సర్యం


3 ( శరీరంలు )

1 స్థూల శరీరం

2 సూక్ష్మ శరీరం

3 కారణ శరీరం


3 ( అవస్తలు )

1 జాగ్రదావస్త

2 స్వప్నావస్త

3 సుషుప్తి అవస్త


6 ( షడ్బావ వికారంలు )

1 ఉండుట

2 పుట్టుట

3 పెరుగుట

4 పరినమించుట

5 క్షిణించుట

6 నశించుట


6 ( షడ్ముర్ములు )

1 ఆకలి

2 దప్పిక

3 శోకం

4 మోహం

5 జర

6 మరణం


.7 ( కోశములు ) ( సప్త ధాతువులు )

1 చర్మం

2 రక్తం

3 మాంసం

4 మేదస్సు

5 మజ్జ

6 ఎముకలు

7 శుక్లం


3 ( జీవి త్రయంలు )

1 విశ్వుడు

2 తైజుడు

3 ప్రఙ్ఞుడు


3 ( కర్మత్రయంలు )

1 ప్రారబ్దం కర్మలు

2 అగామి కర్మలు

3 సంచిత కర్మలు


( మానవ దేహంలో 14 లోకాలు ) పైలోకాలు 7

1 భూలోకం - పాదాల్లో

2 భూవర్లలోకం - హృదయంలో

3 సువర్లలోకం - నాభీలో

4 మహర్లలోకం - మర్మాంగంలో

5 జనలోకం - కంఠంలో

6 తపోలోకం - భృమద్యంలో

7 సత్యలోకం - లాలాటంలో


అధోలోకాలు 7

1 ఆతలం - అరికాల్లలో

2 వితలం - గోర్లలో

3 సుతలం - మడమల్లో

4 తలాతలం - పిక్కల్లో

5 రసాతలం - మొకాల్లలో

6 మహతలం - తోడల్లో

7 పాతాళం - పాయువుల్లో


( మానవ దేహంలో సప్త సముద్రంలు )

1 లవణ సముద్రం - మూత్రం

2 ఇక్షి సముద్రం - చెమట

3 సూర సముద్రం - ఇంద్రియం

4 సర్పి సముద్రం - దోషితం

5 దది సముద్రం - శ్లేషం

6 క్షీర సముద్రం - జోల్లు

7 శుద్దోక సముద్రం - కన్నీరు


( పంచాగ్నులు )

1 కాలాగ్ని - పాదాల్లో

2 క్షుదాగ్ని - నాభిలో

3 శీతాగ్ని - హృదయంలో

4 కోపాగ్ని - నేత్రంలో

5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో


7 ( మానవ దేహంలో సప్త దీపంలు )

1 జంబుా ద్వీపం - తలలోన

2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన

3 శాక ద్వీపం - శిరస్సుపైన

4 శాల్మల ధ్వీపం - చర్మంన

5 పూష్కార ద్వీపం - గోలమందు

6 కూశ ద్వీపం - మాంసంలో

7 కౌంచ ద్వీపం - వెంట్రుకల్లో


10 ( నాధంలు )

1 లాలాది ఘోష - నాధం

2 భేరి - నాధం

3 చణీ - నాధం

4 మృదంగ - నాధం

5 ఘాంట - నాధం

6 కీలకిణీ - నాధం

7 కళ - నాధం

8 వేణు - నాధం

9 బ్రమణ - నాధం

10 ప్రణవ - నాధం



సేకరణ 👈

🌟🌟లోకా సమస్తా సుఖినోభవంతు.🌟🌟

   🌺🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🌺

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

శ్రీరామనామమహిమ

 🕉️🕉️  *శ్రీరామనామమహిమ* 🕉️🕉️


వనేచరామః వసుచాహరామః

నదీంతరామః నభయంస్మరామః

ఇతీరయంతోపి వనేకిరాతాః

ముక్తింగతాఃరామపదానుషంగాత్‌


 వనేచ"రామః"(అడవిలో సంచరిస్తూ ఉంటాము) వసుచాహ"రామః" ( అడవిలోని సంపదలను తెచ్చుకుంటూ ఉంటాము ) నదీంత"రామః" (నదిని దాటుతూ ఉంటాము) న భయం స్మ"రామః" ( భయం అనే మాటే మాకు తెలియదు) అంటూ తమకు తెలియకుండానే రామనామాన్ని పలికిన అడవిలోని వేటగాళ్ళకే ముక్తికలిగితే భక్తితో శ్రీరామనామాన్ని పఠిస్తే వచ్చేఫలితం చెప్పటం ఎవరితరం?

సాయిబాబా

 *సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు..*


1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ?

2.ఆయన రామాయణం,భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా ?

3.వేదాలు,ఉపనిషత్తులు చదివారా ?

4.పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ?

5.స్వాతంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐన ఆయన స్వాతంత్రం కోసం ఏమి చేశారు ?

6.ఆయన వేషధారణ సూఫీ ముస్లిం ని ఎందుకు పోలి ఉంది ?

7.ఆయన అస్తమానూ "అల్లా" ని మాత్రమే ఎందుకు తలచారు ?

8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేశారు ?

9.ముస్లిమ్స్ ఎందుకు సాయిని దేవుడిగా ఒప్పుకోరు ?

10.సూఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ?

11.హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోకకల్యాణం కోసమే ఎత్తబడ్డాయి,కానీ సాయి వల్ల ఏ లోకకల్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ?

12.ఖురాన్ కాకుండా ఆయన చదివిన గ్రంధాలు ఏమిటి ?

13."అల్లా ఒక్కడే దేవుడు "అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ ముస్జిద్ లలో పెట్టుకోరు ?

14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్ధించరు ?

15.హిందువులు సాయిని దైవంగా చూడటానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి ?

16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు,కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ?

17.సాయి ఏ విధమైన గురువు ?

18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం ...అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ?

ఇవి నాకు తెలియని విషయాలు ,మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి,కానీ అదీ హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే అయివుండాలి.


Forward message

Disclaimer. Bloger is not responsible for the content