19, ఫిబ్రవరి 2024, సోమవారం

మనసు లేని మనుషులు

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*మనసు లేని మనుషులు (మంచి నీతికథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

*************************** 

ఒక రైతు దగ్గర ఒక కుక్క వుండేది. అది చానా ముసలిదైపోయింది. గమ్మున పెట్టింది తిని ఏదో ఒక మూలన పడుకొని నిద్ర పోయేది. చురుకుదనం బాగా తగ్గిపోయింది. అది చూసి ఆ రైతు పెళ్ళాంతో "ఏమే... ఈ కుక్క చానా ముసలిదై పోయింది. కాపలా కూడా సరిగా కాయడం లేదు. ఇది వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక దీనికి తిండి పెట్టడం పెద్ద దండగ. కాబట్టి తీసుకపోయి ఎక్కడైనా దూరంగా పక్కనున్న అడవిలో వదిలేసి వస్తా" అన్నాడు. ఆమె 'సరే' అని తలూపింది.

ఆ మాటలు ఆ కుక్క వినింది. దానికి చానా బాధ వేసింది. అది చిన్న పిల్లగా వున్నప్పుడు వాళ్ళ అమ్మ నుంచి విడదీసి ఎత్తుకొచ్చి, బైటికి పోకుండా ఇంట్లో కట్టేశారు. అమ్మ కనపడక, ఎక్కడ వుందో తెలియక కొద్ది రోజులు కళ్ళ నీళ్లు పెట్టుకున్నా... చివరికి ఇక వీళ్ళనే అమ్మానాన్నలనుకొని వాళ్లు పెట్టింది తింటూ, రాత్రింబవళ్ళూ ఇంటికి కాపలా కాసింది. మాంసం మొత్తం వాళ్ళు తిని ఉత్త ఎముకలు వేసినా ఏమీ అనుకోలేదు. ఉడుకుడుకు అన్నం వాళ్లు తిని చద్దన్నం, పాసిపోయిన అన్నం పెట్టినా బాధ పడలేదు. చల్లని చలికాలం వాళ్లంతా ఇండ్లలో తలుపులు మూసుకొని రగ్గుల మీద రగ్గులు కప్పుకొని పడుకున్నా... వణుకుతూనే ఇంటికి కాపలా కాసింది గానీ ఒక్కమాటా తిట్టుకోలేదు. పొలంలోకి పశువులు రాకుండా, పంటను దొంగలు ఎత్తుకుపోకుండా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపలా కాసింది. అలాంటిదాన్ని పట్టుకొని అంత మాట అనడంతో దాని మనసు కలుక్కుమంది.

"ఛ... ఛ... ఇలాంటి యజమాని దగ్గర ఉండడం కన్నా ఏ పాడుబడిన బావిలోనో పడి చావడం మేలు. నన్ను వీళ్లు వదిలేయడమేంది నేనే వీళ్లను వదిలేసి వెళ్ళిపోతా" అనుకుంటా అది పక్కనే వున్న అడవిలోకి బయలుదేరింది. అక్కడ తనలాగే ఇంటిలోంచి గెంటివేయబడ్డ ఇంకో ముసలికుక్క తోడైంది. రెండూ కలసి దొరికినప్పుడు తింటూ, దొరకనప్పుడు ఉత్త నీళ్లు తాగుతూ... ఎప్పుడు ఏ క్రూర జంతువు మీదపడి చంపుతుందో అని బెదపడుతూ భయంభయంగా బతకసాగాయి.

ఆ రైతుకు ఒక పాప వుంది. ఆ పాప పెళ్లి వయసుకు వచ్చింది. దాంతో ఈడు జోడు సరిపోయే ప్రాయం పిల్లోని కోసం చుట్టుపక్కలంతా వెతుకుతా వుంటే ఒక మంచి సంబంధం ఎదురుపడింది. అబ్బాయి చానా మంచోడు. ఎటువంటి చెడు అలవాట్లు లేనోడు. పెద్దలంటే భయభక్తులు వున్నోడు. బాగా చదువుకున్నోడు. ఎలాంటి గలాటాలకు పోనోడు. ఎవ్వరిని అనవసరంగా నోరెత్తి ఒక్క మాట అననోడు. 'అలాంటి వాని చేతిలో కూతురిని పెడితే కలకాలం పిల్లాపాపలతో చల్లగా పెదాలపై చిరునవ్వు తొలగిపోకుండా బ్రతుకుతుంది కదా' అని ఆశపడ్డాడు. ఇద్దరినీ కిందికి మీదికి ఒకటికి పదిసార్లు చూసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు "ఈ జంట చేతికి వచ్చిన పచ్చని పంటలా వుంది. నుదిటికి తిలకంలా, ముక్కుకు ముక్కెరలా ముచ్చటగా ఉన్నారు. సంబంధం వదులుకోకండి" అన్నారు. పెళ్ళికొడుకు వాళ్లు కూడా ఆ పాపను చూసి "అబ్బ... ఇంటి ముందేసిన చక్కని చుక్కల ముగ్గులా ఎంత పొందిగ్గా వుందీ పిళ్ళ" అని సంబరపడ్డారు. రైతుతో "మేమేమీ కోటలు కోరం. వాటాలు అడగం. పాపకు పది తులాల బంగారు పెట్టి పంపించండి చాలు. పెళ్లి ఖర్చులు అన్నీ మేమే పెట్టుకుని చుట్టుపక్కల పద్నాలుగు ఊర్లలో వున్న బంధువులనంతా పిలుచుకొని బ్రహ్మాండంగా అరవయ్యారు వంటలతో పెళ్ళి చేస్తాం" అన్నారు.

రైతు ఆ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక 'సరే' అన్నాడు. కానీ పది తులాలు అంటే మాటలు కాదు కదా. అలా అని చెప్పి కన్న కూతురి పెదాలపై చిరునవ్వు కంటే ముఖ్యమైనది ఈ లోకంలో ఎవరికీ ఏదీ లేదు కదా... అందుకని తనకున్న పది ఎకరాల్లో సగం అమ్మేశాడు. ఆ డబ్బు తీసుకొని కూతురిని పిలుచుకొని నగలు కొందామని అడవికి పక్కనుండే నగరానికి చేరుకున్నాడు.

ఆ నగల దుకాణానికి కొంచెం దూరంలో ఒక దొంగ కాపు కాసి వచ్చీపోయే వాళ్ళని గమనించసాగాడు. వాని కన్ను వీళ్ళ పైన పడింది. రైతుకు ఇది తెలియదు కదా... దాంతో వున్న సొమ్మంతా ఇచ్చి, కూతురికి నచ్చిన నగలు కొనుక్కొన్నాడు. వాటిని శుభ్రంగా ఒక పాత సంచీలో చుట్టి, ఎవరికీ కనపడకుండా అంగీ లోపలి జేబులో భద్రంగా దాచిపెట్టుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. దొంగ అది గమనించాడు. దూరం నుంచే వాళ్లను వెంటాడుతా అదను కోసం ఎదురు చూడసాగాడు.

అట్లా ఒక గంట గడిచాక దారిలో జనం బాగా పలుచనయ్యారు. ముందూ వెనుక కనుచూపుమేరలో ఎవరూ కనబడ్డం లేదు. ఇదే సమయం అనుకోని కత్తి తీసుకొని ఎగిరి వాళ్ళ ముందుకు దూకాడు. "నీ లోపలి జేబులో వున్న బంగారు నగలు వెంటనే తీసివ్వు. లేదంటే ఇక్కడికిక్కడే నిన్ను కసుక్కున పొడిచి పాడేస్తా" అంటూ గట్టిగా అరిచాడు. దొంగను చూస్తానే రైతు కూతురు భయపడి "కాపాడండి... కాపాడండి..." అంటూ గట్టిగా అరిచింది. అది చూసి దొంగ కోపంతో కత్తి తీసుకొని ఆ అమ్మాయిని పొడవబోయాడు. రైతు అదిరిపడి చేయి అడ్డం పెట్టాడు. కత్తి చేతికి గుచ్చుకొని రక్తం కారసాగింది. "బాబూ... నీకు కావాల్సింది నగలే కదా. తీసుకో. చిన్నపిల్ల దానినేమీ చేయకు" అంటూ నగలు తీసి వాని ముందు పెట్టాడు.

ఆ పాప గట్టిగా 'కాపాడండి... కాపాడండి...' అంటూ అరిచింది కదా. ఆ అరుపు అడవిలో దూరంగా ఒక చెట్టు కింద పడుకున్న ముసలి కుక్కకు వినిపించింది. అదిరిపడి లేచి కూర్చుంది. ఆ గొంతు తన యజమాని కూతురుది. వెంటనే మిత్రునితో "అడవిలో రైతు కూతురికి ఏదో ఆపద కలిగినట్లుంది దా పోదాం" అంది. దానికి ఆ రెండవ కుక్క "నీ యజమాని ఎప్పుడైతే నిన్ను కాదనుకున్నాడో అప్పుడే నీకూ వానికీ బంధం తెగిపోయింది. ఎవరు ఎట్లా చస్తే మనకేమి. హాయిగా పడుకో. అసలే ముసలిదానివి. ఎందుకొచ్చిన గొడవ. వాళ్ళ సంగతేదో వాళ్లే చూసుకుంటారులే" అంది.

కానీ ఆ ముసలి కుక్కకి మనసు ఒప్పుకోలేదు. చిన్నప్పటినుంచి తన ముందు తిరిగి పెరిగిన పిల్ల... తనతో పాటు ఆడుకుంటూ అన్నం తిన్న పిల్ల... అది గుర్తుకు వచ్చి రెండవ కుక్కతో "తిట్టినా కొట్టినా వెళ్ళగొట్టినా బంధం బంధమే. అది ఎప్పటికీ తెగిపోదు. మనుషులకు బుద్ధీ జ్ఞానం లేకపోయినా కనీసం జంతువులం మనకన్నా వుండాల కదా. ఆపదలు వచ్చినప్పుడు అనవసరమైన ఆలోచనలు, చర్చలు, వాదోపవాదాలు చేస్తూ కూర్చుంటే అసలుకే మోసం వస్తుంది. పద పద" అంటూ లేచి అరుపులు వినబడిన వైపు ఉరికింది.

అప్పటికే దొంగ రైతు దగ్గర నగలు తీసుకొని ఆ అమ్మాయి మెడలోని గొలుసు కూడా లాక్కుంటున్నాడు. వాని చేతిలో కత్తి తళతళ మెరుస్తా వుంది. కుక్క అదేమీ పట్టించుకోలేదు. రైతు చేతినుండి కారుతున్న రక్తం, అమ్మాయి కళ్ళలోంచి కారుతున్న కన్నీరు చూడగానే దాని హృదయం బద్దలైంది. ఆవేశంతో ఎగిరి ఆ దొంగ మీదికి దుంకింది. వాడు తిరిగి చూసేలోగా కాలిపిక్క పట్టుకొని కండ వూడి వచ్చేలా గట్టిగా ఒక పెరుకు పెరికింది. దొంగ ఆ నొప్పికి తట్టుకోలేక చేతిలోని కత్తితో దాని కడుపులో కసుక్కున పొడిచాడు. రక్తం సర్రున ఎగజిమ్మింది. అయినా అది వెనుకడుగు వేయలేదు. ఆగలేదు. వాన్ని కొరికినచోట కొరకకుండా ఎక్కడబడితే అక్కడ పెరకసాగింది.

రెండవ కుక్క తన స్నేహితుని కడుపులో రక్తం కారుతుంటే చూడలేకపోయింది. ఒక్కసారిగా ఎగిరి కత్తి పట్టుకున్న ఆ దొంగ చేయి పట్టుకొని గట్టిగా కొరికింది. దాంతో వాని చేతిలోని కత్తి జారి కింద పడిపోయింది. అది చూసి రైతుకు ధైర్యం వచ్చింది. వెంటనే పక్కనే వున్న కట్టె తీసుకొని ఎగిరి వాని తల మీద ఒక్కటి వేశాడు. ఒక వైపు కుక్కలు మరొకవైపు రైతు దాడి చేసేసరికి దొంగకు దిక్కు తోచలేదు. ఎక్కడి నగలు అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటా పారిపోయాడు.

కుక్క కొద్ది రోజులుగా సరైన తిండి లేక చానా బలహీనంగా వుంది. అదీగాక శరీరంలో అప్పటికే రక్తం చానా కారిపోయింది. దాంతో అడుగు ముందుకు వేయలేక ఒకవైపుకు తూలి పడిపోయింది. దాన్ని చూడగానే రైతు కళ్ళల్లో నీరు కారాయి. ఒక్కుదుటన వచ్చి దాన్ని పైకి ఎత్తుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వైద్యుని కోసం పరుగులాంటి నడకతో ఊరి వైపుకు బయలుదేరాడు. కానీ కొంచెం దూరం పోయాడో లేదో పాపం అది అతని ఒడిలోనే ప్రాణాలను కోల్పోయింది. రైతు కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. "ముసలిదానివి అయిపోయావు. నీకు తిండి దండగ అని వదిలించుకోవాలనుకున్నాను. కానీ నీవు నీ చివరి రక్తపు బొట్టు వరకు మా కోసమే బ్రతికావు. విశ్వాసం లేనిది, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేది నాలాంటి మనుషులే గాని మీలాంటి జంతువులు కాదు. నీ పట్ల జాలీ దయా చూపకపోయినా ఈరోజు నా కూతురి జీవితం నిలబెట్టావు" అనుకుంటూ దాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. కన్న కొడుకులాగా దానికి గౌరవంగా అంత్యక్రియలు చేసి తన ఇంటి ముందే సమాధి నిర్మించాడు. అడవిలోని రెండవ ముసలి కుక్కను ఇంటికి తీసుకువచ్చి సొంత మనిషిలా చివరి వరకూ చూసుకున్నాడు.


డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

Mamidikona sivaalaym


 

No flight zone


 

Four wheelers


 

Ship in antartka


 

Agriculture tools



 

science in History*

 *science in History*

      🙏🙏🙏


         🔥🔥🔥

1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : *భీష్ముడు జననం.*

          🐢🐍🦎

2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి *టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.*

         🦆🪿🦇

*3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :*

పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..

          🐗🐴🦄

4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : *టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక* ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..

          ☀️🌤️💥

5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి *సూపర్ నాచురల్ ప్రొటెక్షన్* తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..

        🌞🌞🌞

6. అగ్ని నుంచి వచ్చే *తేజస్సు* తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..

        🌎🌏🌍

*7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం* : భీముడు +  హిడింబి = ఘటోత్కచుడు..


8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి *gender transformation.*

         💧💦❄️

*9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..*

          🌟⭐💥

*10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..*

        🙈🙉🙊


ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?


      🌼🌻🌞

ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా *లక్షల సంవత్సరాల క్రితమే* మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?

              🪷🌺🌸

 ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది  *ఫేక్ అని కొట్టి పడేస్తారు*..కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ *ఊహ* గొప్పదే కదా?

         💐🌷🌹

ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..

        🦚🦜🦤

కాబట్టి మనం పూజించే *ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము*. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని *existency ఉండి తీరుతుంది..*

       🎄🌲🌳

ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, *అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం*, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..


     👍👍👍

 *భారతీయులారా  మిత్రులారా  మీకు ఇవి తెలుసా?*

      🙏🙏🙏

*👉భూమి గోళాకారంలో* ఉందని మొదట చెప్పింది  మనమే (ఆర్యబట్ట)


*👉భూమికి గురుత్వాకర్షణ శక్తి* ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)


👉ప్రపంచంలో మొట్టమొదటి *శస్త్ర చికిత్స* చేసింది మనమే (సుశ్రుతుడు)


*👉 విద్యుత్* మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)


*👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)*


*👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన  వరాహమిహిరుడు మనవాడే*


*👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన*


*వాల్మీకి మహర్షి మనవాడే*


*👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు*


*👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు*


*👉అణువులు గురించి వివరించిన కణాదుడు*


*👉DNA గురించి చెప్పిన బోధిధర్మ*

*👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి*


👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన *ఉత్సమధుడు*


👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన *స్వాతి ముని*


ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  -‌ దశమి -  మృగశిర -‌ ఇందు వాసరే* *(19-02-2024)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/cyRZxDnjQL0?si=-MrDCwFFxUdymdqx


🙏🙏

17, ఫిబ్రవరి 2024, శనివారం

Purity of thirtha


 

Tharmal switch


 

Iron tape only


 

ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ

 ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!


పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు.... 

ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు......

ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు.....

వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు..... 

కానీ ప్రస్తుతం కొందమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు.... 

అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న..... 

అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం...... 

ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే..... ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది...... 

ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది.... దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు.....

అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది.... అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.....అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది.....


అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు.....

ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది..... 

సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది..... 

అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు....

(ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.....) 

ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం.

ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి


శ్లో. భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా , ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా. వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ. భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్.


ఆదివారంనాడు రాత్రింబగళ్ళు సప్తమినాడుపగటిపూట ఉసిరికపచ్చడి ని తిన్నచో అలక్ష్మీకుడగును,, కనుక నిషేధము.


పైశ్లోకం ప్రకారం

వీర్యహాని

యశోహాని

ప్రజ్ఞాహాని కూడా పొందుతారు నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే..

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం -

 శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం - 


      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి బాగా నీరు కలిపి కొంచం ఉప్పు చేర్చుకొని ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 


              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 80ml అలోవెరా జ్యూస్ కి 160 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 


 గమనిక - 


    మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్, 

ఎండలో అతిగా తిరగడం , ఎక్కువ దూరం నడవడం , అతిగా శ్రమ చేయుట , పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం భుజించటం , నువ్వులు , వెల్లుల్లి , మినుములు , అవిసె ఆకు , కొత్త నీరు , పులిసిన గంజి , వేడి నీరు , గో మూత్రము , తాంబూలం , పెరుగు , రేగిపళ్ళు , నూనె వేపుళ్లు , చింతపండు , కోడిమాంసం , చేదు , లవణ , ఆమ్ల రసాల గల పదార్దాలు నిషిద్దం .


  పైన చెప్పిన ఔషధ యోగాన్ని పాటిస్తూ పథ్యం చేసిన త్వరగా సమస్య నుంచి బయటపడతారు . ఈ ఆహార పథ్యం మీ శరీరంలో వేడి తగ్గేవరకు పాటించి ఆ తరువాత మోతాదులు తగ్గించి తీసుకోవలెను 


  అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మాఘ పురాణం - 5 వ అధ్యాయము🌹*

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*🌺మాఘ పురాణం - 5 వ అధ్యాయము🌹*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


 *కుక్కకు విముక్తి కా విలుగుట*


*దిలీప మహారాజా!*

సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమేపి సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీ మన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి -


"నాధా! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రత విధానమెట్టిదో, యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని" కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నదిఒడ్డునగాని, ఇంటివద్ద కాని, మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి, అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనౌంచి, ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి, లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి, ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.


తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని, క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని, లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని, చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమమహర్షి, ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుణ్గవులతో యిష్టాగోష్ఠులు జరుపు కొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి, తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి


శ్లో. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే |

     అగ్రతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః ||


అని రావిచెట్టుకు నమస్కరించి, ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశామినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు, బొట్లుపెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు 


ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి, రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందునా, అది మాఘమాసము అయివున్నందునా అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. "ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించెను.


"మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నాపేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను, దానధర్మములనిన నాకు అతిప్రేమ, నేను అనేక దానాలు చేసియుంటిని, గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను, ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను.


అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములునునెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.


ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన, ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, 'రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును, ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధ్లతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ, అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.


ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి, దానధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు, అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. అయ్యా! మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును, అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేనుయే మాఘమాసములు చేయుటకాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికికోపము వచ్చినది, ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా, యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను, ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని, తరువాత నాకు వరుసగా యేడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.


ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.


నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని, పక్షికాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను 

కొట్టబోవుటచే పారిపోయి, నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము  కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట.


ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి, పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి, గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి, అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి  మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి, గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని 'అమ్మాయీ! నీ వెవ్వరిదానవు? నీ నామధాయమేమి? నీ వృత్తాంతము  యేమి?' అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.          *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *సాంఖ్య యోగము*

.                  *శ్లోకము 23*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*నైనం ఛిందంతి శస్త్రాణి* *నైనం దహతి పావకః ।*

*న చైనం క్లేదయంత్యాపో న* *శోషయతి మారుతః ।।*



*భావము:* 

ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి అరిపోవునట్లు చేయలేదు.

 

*వివరణ:* 

ఆత్మ యొక్క లక్షణం అయిన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు, కానీ ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది, కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగా, గాలి ఆత్మను ఎండబెట్టలేదు, నీరు తడపలేదు లేదా అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు.


సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹