ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
20, డిసెంబర్ 2024, శుక్రవారం
పంచాంగం 20.12.2024 Friday,
ఈ రోజు పంచాంగం 20.12.2024 Friday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష పంచమి తిథి భృగు వాసర: మఘ నక్షత్రం నిష్కంభ యోగః: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
విస్తరిస్తుంది
శ్లోకం:☝️
*యః పఠతి పరిపృచ్ఛతి*
*పండితానుపాశ్రయతి |*
*తస్య విస్తారితా బుద్ధిః*
*తైలబిన్దురివామ్భసి ।।*
భావం: చదివేవాడు, (వ్రాసేవాడు,) ప్రశ్నించేవాడు, పండితులను ఆశ్రయించేవాడు, అతని తెలివి నీటిపై (త్వరగా) వ్యాపించే నూనె బిందువులా విస్తరిస్తుంది.
19, డిసెంబర్ 2024, గురువారం
హోటల్ కమ్ సత్రం
GRT వారు కాశి/వారణాసిలో హోటల్ కమ్ సత్రం ప్రారంభించింది.
దక్షిణ భారత ఆహారాన్ని అందిస్తారు. గది అద్దెలు నామమాత్రం. ఆహారం ఉచితం.
మిత్రులు ఇటీవల వారణాసికి వెళ్లి GRT నిర్మించిన సత్రంలో బస చేశారు ....
పేరు మాత్రమే సత్రం, కానీ గదులు అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఉన్నాయి, మీకు ఎక్కడా లభించదు.
గరిష్టంగా ముగ్గురు ఒక గదిలో ఉండగలరు... వారు ఉదయం కాఫీ, టిఫెన్, లంచ్, సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం అందిస్తారు. ... రూమ్ సర్వీస్ లేదు... అన్ని ఆహారాలు ఉచితంగా మరియు అపరిమితగా...అమావాస్య రోజున వారు ఉల్లిపాయలు & వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని అందిస్తారు.
GRT హోటల్..కాంటాక్ట్ నెం.7607605660.
వసతి కోసం వారి వెబ్‌సైట్‌ని సందర్శించండి...
grtkasichatram.com లేదా GOOGLE IT మరియు లాగిన్ అవ్వండి.
ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్.
కాశీని సందర్శించాలనుకునే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. 👍🏻
ఓం నమః శివాయ 🌹🙏🌹
grtkasichatram.com
మనుషులు రాక్షసులవుతున్నారు
🙏🕉️శ్రీ మాత్రేనమఃశుభోదయం🕉️🙏 🌹సమాజం మారిపోతోంది మనుషులు రాక్షసులవుతున్నారు.. అని బాధపడుతుంటారు.. కానీ చుట్టూ అంతా రాక్షస ఆలోచన మనుషులు ఉన్నా స్థిమితంగా మంచి మనసుతో, మంచి ఆలోచనలు చేయగలిగే వ్యక్తిని ఏ రాక్షస ఆలోచనల వ్యక్తుల ప్రభావం మన మీద ప్రభావితం చేయదు.. పెదాలపై ఎల్లప్పుడూ చిరునవ్వు, నిరంతరం ప్రశాంతంగా ఉండే మనస్సుపై ఏవిదమైన రాక్షస ప్రభావం చూపలేదు🌹అనుకున్న పనిని ఆపేస్తాం..వద్దనుకున్నది చేసేస్తాం.. అనుకోలేదు కానీ ఆకస్మాత్తుగా అనేసాం.. ఎంతగా అనుకున్న చేయలేక పోయాను..ఇవన్నీ ఆత్మ విశ్వాసం లోపించిన్నప్పుడు మనసులో విలువడే శబ్దాలు..ఖర్చు లేదు కదా అని మనసులో ఇష్టం వచ్చినట్లు విపరీత ఆలోచనలు చేసేయడం, ఇతరుల అవగుణాలను పరిశీలించి ఆ చెత్త చేదారాన్ని అపురూపమైన సున్నిత మనసులో నింపేయడం.. ఇవన్నీ ఆత్మ విశ్వాసం తరిగి పోవడానికి తగిన కారణాలు🌹జీవితం ఒక పెయింటింగ్ లాంటిది.. ఆశ అనే గీతలు గీసుకుంటూ వెళ్ళాలి.. దాని నుండి లుపాలను సహనంతో మంచి ఆలోచనలతో తొలిగించాలి🌹🌹మీ అల్లం రాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజెన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి 9440893593 9182075510 మందులు అయిపోయిన వారు లేదా కొత్త వారికి రాలేని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును* 🙏🙏🙏
తెలుగు సామెతలు
⚡ *మరుగున పడుతున్న కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం!*
1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు….
18, డిసెంబర్ 2024, బుధవారం
శీతాకాలపు అయనాంతం
*8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి!*
డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు పగలు ఉండనుంది. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెలుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని 'శీతాకాలపు అయనాంతం' అని అంటారు.
పురోహితుడు (ఒక్కరు ) కావలెను.
*ఓం నమో వేంకటేశాయ*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ వారి P.V. కాలనీ నందు గల శ్రీ పద్మావతీ గోదాదేవి సమే త వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు నిత్య పూజాదికములు నిర్వహించుటకు పురోహితుడు (ఒక్కరు మాత్రమే) కావలెను.
*అర్హతలు*
1. 35 సంవత్సరములు పైబడి వివాహితుడై యుండవలెను.
2. స్మార్త, వైఖానస, ఆగమ శాస్త్ర విజ్ఞానం కలిగియుండి, ఆయా శాస్త్ర పద్ధతుల ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.
3. ఏవిధమైన దురలవాట్లు లేకుండా ఉండాలి
*జీత భత్యములు*
1. నెలకు రూ.18,000/- లు జీతముగా చెల్లించ బడును.
2. నిత్య మహా నైవేద్యం నిమిత్తం రూ.5,000/- లు అదనంగా చెల్లించ బడును.
3. నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితముగా ఇవ్వబడును.
4. రెండు పడక గదుల నివాసము ఆలయము పక్కనే ఉచితముగా ఇవ్వబడును.
5. కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయం
6. పిల్లలు ఉంటే వారికి ఉచిత విద్య
7. ఉచిత మంచినీరు, ఉచిత విద్యుత్తు
పైన తెలిపిన అర్హతలు, జీత భత్యములకు ఇష్టమున్న వారు మీ మీ దరఖాస్తులను మీకు సంభందించిన అన్ని వివరములతో ఈ క్రింద తెలుపబడిన చిరునామాకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జత పరచి ఈ నెల 30 వ తేదీ లోగా పంపవలెను. అన్ని దరఖాస్తులను పరిశీలించిన మీదట మీతో ముఖా ముఖి సంభాషణ జరుపు తేదీని మీ చరవాని నంబరుకు రెండు రోజుల ముందుగా తెలియ జేస్తాము. ప్రత్యక్ష ముఖా ముఖి అయిన తరువాత మీ మీ ప్రజ్ఞా పాటవాలను బట్టి మిమ్ములను ఎంపిక చేయడం జరుగుతుంది.
*మీ దరఖాస్తులు పంపవలసిన చిరునామా*
Dr. P. Seshagiri Rao,
Medical Superintendent,
Area Hospital, S.C.Co.Ltd.,
MANUGURU- 507117
Bhadradri -Kothagudem (Dt)
Mobile No. 9440367890
*18, డిసెంబర్, 2024*🌷
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🪷 *బుధవారం*🪷
🌷 *18, డిసెంబర్, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సంకష్టహర చతుర్థి*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - కృష్ణపక్షం*
*తిథి : తదియ* ఉ 10.06 వరకు ఉపరి *చవితి*
*వారం : బుధవారం*(సౌమ్యవాసరే)
*నక్షత్రం : పుష్యమి* రా 12.58 వరకు ఉపరి *ఆశ్లేష*
*యోగం : ఐంద్ర* రా 07.34 వరకు ఉపరి *వైధృతి*
*కరణం : భద్ర* ఉ 10.06 *బవ* రా 09.58 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.30 - 08.30 మ 01.30 - 05.00*
అమృత కాలం : *సా 06.30 - 08.07*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : ఉ 08.49 - 10.26*
*దుర్ముహూర్తం : ప 11.42 - 12.27*
*రాహు కాలం : మ 12.04 - 01.28*
గుళికకాళం : *మ 10.41 - 12.04*
యమగండం : *ఉ 07.53 - 09.17*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం :*ఉ 06.30*
సూర్యాస్తమయం :*సా 05.39*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.30 - 08.44*
సంగవ కాలం : *08.44 - 10.57*
మధ్యాహ్న కాలం :*10.57 - 01.11*
అపరాహ్న కాలం : *మ 01.11 - 03.25*
*ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ చవితి*
సాయంకాలం : *సా 03.25 - 05.39*
ప్రదోష కాలం : *సా 05.39 - 08.13*
రాత్రి కాలం : *రా 08.13 - 11.39*
నిశీధి కాలం :*రా 11.39 - 12.30*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.47 - 05.39*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷సరస్వతీదేవి🪷*
*అవతార అంతరార్థం*
*ఈమె బ్రాహ్మీముహూర్తం (సూర్యోదయం కంటే ముందున్న అరుణోదయం) నుండి మధ్యాహ్నకాలం వరకు ఆవిర్భవించిన సమయముగా చెబుతారు. సరస్వతి ప్రకాశమయ రూపము కలిగి ఉంటుంది కావున ఈమెను "తార'' గా వ్యవహరిస్తారు.*
*హిరణ్య గర్భః సమవర్తతాగ్రే*
*భూతస్య జాతః పతిరేక ఆసీత్*
*సదాధార పృధ్వీం ద్యాముతేమామ్*
*కస్మై దేవాయ హవిషావిధేమ*
*ఇది హిరణ్యగర్భుడైన బ్రహ్మస్తుతి. విశ్వాధిష్టాత అయిన ఈ హిరణ్యగర్భుని శక్తిని తార లేదా సరస్వతిగా వ్యవహరిస్తారు.*
*ప్రకాశసమయంలో అవతరించిన తల్లి కావున తార అని అంటారు. జ్ఞానానికి, ఆనందానికి, ఉనికికి, సరస్వతి మూలం కావున ఈమెను మూలా నక్షత్రం నాడు ఆరాధిస్తారు.*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌷🌷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🪷🪷🪷🪷🌷🌹
సర్దుకుపోవడం
సర్దుకుపోవడం మౌనంగా ఉండడం కోపాన్ని అణచుకోవడం ఇవన్నీ ఎలా సాధ్యం
ఓ దంపతులు చాలా అన్యోన్యతకు రూపంగా ఉన్నారు. 50 ఏళ్ల వారి దాంపత్య జీవితంలో ఎటువంటి పొట్లాటలు లేవు. వినగానే ఆశ్చర్యం వేసినా నమ్మకం కలగలేదు.
భార్య తీవ్ర అనారోగ్యంతో తన తనువు చాలించే సమయంలో భర్త ఆమెను ఒక్క ప్రశ్న అడిగాడు.
కోకిలా ఇన్నేళ్ల మన జీవితంలో నాపైన ఎప్పుడూ కోపం రాలేదా అని.
ఆమె ఆ అటక పైన ఓ పెట్టె ఉంది తీసుకోండి అంది. మన పెళ్ళైన కొత్తలో మీనుండి ఓ మాట తీసుకున్నాను. ఎటువంటి పరిస్థితిలోనూ ఈ పెట్టే మీరు తెరవకూడదు అని. మీరు నా మాటను ఇప్పటివరకు పాటిస్తూ వచ్చారు. ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను.
ఇప్పుడు ఆ పెట్టెను తెరవండి అని అడిగింది కోకిల. భర్త ఆ పెట్టెను తెరిచాడు అందులో రెండు నూలు బొమ్మలు ఉన్నాయి.
మా అమ్మ ఈ పెట్టెను మన పెళ్లి అప్పుడు ఇచ్చారు. నీ భర్త పైన ఎప్పుడు కోపం వచ్చినా ఆయన పైన కోపాన్ని ప్రదర్శించకు. ఇలా బొమ్మలు వేసిపెట్టు అన్నారు అని చెప్పింది.
భర్తకు ఒకటే ఆనందం కోకిలా అంటే ఇన్నేళ్ల మన కాపురంలో నీకు నాపైన రెండు సార్లేనా కోపం వచ్చింది అని అడిగితే ఆమె అందులో ఉన్న ఒక మూటను విప్పి అక్షరాల రెండు లక్షల రూపాయలు అతడి చేతిలో పెట్టి,
నేను వేసిన బొమ్మలన్ని అమ్మేస్తే వచ్చిన డబ్బులు అవి ఇదిగో నీ జీవితాన్ని ఇక కొనసాగించుకో అన్నది.
అరిచి విడిపోవద్దు
అహంతో కొట్టుకోవద్దు
ఆవేశం కోపం వచ్చినప్పుడు
వాటిని ఎలా ఆపుకోవాలో తెలిస్తే బంధాలతో శాశ్వతంగా ఉంటాము అని చెప్పింది కోకిల.🍎🍑🍅🍅🍓🍇👍👍రాళ్లభండి చంద్రశేఖర్ శాస్త్రి 👏👏
తిరుప్పావై మూడవ రోజు
🔱ఓం నమః శివాయ🔱:
_*🚩తిరుప్పావై మూడవ రోజు పాశురం🚩*_
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*3. పాశురము*
*ॐॐॐॐॐॐॐ*
ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
తీఙ్గిన్ఱి నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
వాఙ్గ- క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.
*భావము:-*
ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే! ఐనా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు.
ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే - దుర్భిక్షమసలు కలుగనే కల్గదు. నెలకు మూడు వర్గాలు కురుస్తాయి.
పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి.
ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే - కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోద!
*3 వ మాలిక*
ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీని నాచరించుటవలన వ్రతాన్నాచరించనవారికే కాక లోకమునకంతకును లాబించుము. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మకదా!
మరి విశేషంగా ఆరాధించిన వారికేకాక లోకానికంతకూ కల్యాణాన్ని కల్గించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.
*(మోహనరాగము - ఆదితాళము)*
ప. హరి తిరువడులను కొలిచెదము
తిరు నామములనె పాడెదము
అ.ప.. పెరిగి లోకముల గొలిచిన పాదము
పరసాధనమని తెలిసి పాడుదము
1 చ. వ్రతమును చేయగ స్నానమాడెదము
ప్రతి నెల ముమ్మరు కురియు వర్షములు
వితత సస్యముల నెగయు మీనములు
మత్తిలి కలువల సోలు భ్రమరముల
2 ఛ. బలసిన గోవుల పొదుగుల తాకగ
కలశముల క్షీరధారలు కురియగ
శ్రీలెయెడతెగని ప్రసారములో యన
ఇల సిరులదూగు చేతుము వ్రతమును.
🕉🌞🌎🌙🌟🚩
*తిరుప్పావై 3పాశురము.... ఓఙ్గియులగళన్ద తెలుగు అనువాద పద్యము*
సీ.పరమాత్ము సేవించు భాగ్యంబు మాదని
తరలి వెళ్ళెడు జన్మ ధన్యమయ్యె
వామన రూపుడై బలిచక్రవర్తికి
మూడవ యడుగుతో మోక్షమిచ్చె
ఈతి బాధలు లేక సిరులతో నిండును
భువిలోని ప్రజలకు పోవుబాధ
గోవిందు పూజలు గోక్షీర వృద్ధియు
పైరులు పంటలు బాగుపడును
వర్షదారలు పడి వరదలు పారెను
వరదుని సేవకై వచ్చునటుల
తే.గీ. సిరులు సంపదలు కలిగి ధరణినిండి
సంతసంబుగ జీవించి స్వామి సేవ
భాగ్యమయ్యెను మాకంచు ప్రాణులెల్ల
పశువు పైరులు జనులెల్ల వశులు యగును
శ్రద్ధభక్తిని కల్గించి బుద్ధినిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
*ఆండాళ్ తిరువడిగలే శరణం*
*3-పాశురము*
*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి*
*నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్*
*తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు*
*ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ*
*పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప*
*తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి*
*వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్*
*నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్*
విభవం
(అవతారములు):-
ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహము లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.
"ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామం కు ఒంగి ఉంటాడు.
ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.
ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు!
ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు.
ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు. మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు.
మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.
వ్రత ఫలితములు:-
ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు. పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు.
మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక యంత్రాలు,వాహనాలు ఉంటే సుఖమా! లేక సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా!
మనిషికి ఉండటానికి నీడ అవసరం -అది ప్రశాంతం గా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం- అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దోంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.
మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలం గా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు.
మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు. అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.
ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది.
ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి.
సకల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.
ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం, అజ్ఞాతవసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా!
దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామత్రం ఉపాసన చేసిన మహనీయులు కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు.
అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి.
"నాంగళ్" ఏం కోరిక లేని "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది "చ్చాత్తి నీర్ ఆడినాల్" వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే.
"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి "ఊడు కయల్ ఉగళ" ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి.
"పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప" అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్" పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయు.
భావం:--
ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే ! దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన కృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది, ఆకాశమంత ఎత్తు ఎదిగి, మూడులోకాలను కొలిచాడు.
ఆ పరమానందమూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్ని ఆచరిస్తే, దుర్భిక్షము అసలు కలుగనే కలుగదు. నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలే ఆకాశమంత ఎత్తుకి ఎదిగి - ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరి ... భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి.
ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక, గోవుల పొదుగులను తాకగానే -- కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైస్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తున్నది గోదాదేవి.
అవతారిక:--
ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీనినాచరించుట వలన -- వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకమునకంతకును లాభము కల్గును. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మ కదా !శాస్త్రోక్తములగు నియమములను పాటించాలి. అలా పాటించనివారు ఇహపర లోకాలలో సుఖమునొందజాలరు అని కృష్ణపరమాత్మా తెలియచేస్తున్నారు.
🕉🌞🌎🌙🌟🚩
పంచాంగం 18.12.2024 Wednesday,
ఈ రోజు పంచాంగం 18.12.2024 Wednesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష తృతీయ తిథి సౌమ్య వాసర: పుష్యమి నక్షత్రం ఇంద్ర యోగః: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
17, డిసెంబర్ 2024, మంగళవారం
జగన్నాధ పండితరాయల గురించి
ఇది సేకరించి పంపబడినది 👇
*జగన్నాధ పండితరాయల గురించి తెలుసుకుందాము*
ఆయన యింటి పేరును గురిచి పండితులు వేరు వేరు గా చెప్పారు.ఒకరు ముక్కామల అనీ,యింకొకరు నడిమింటి వారనీ,తరువాత ఆయన యింటి పేరు 'ఉపద్రష్ట' అని అందరు పండితులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఆయన ఆంధ్రుడు అనేది నిర్వివాదాంశం వేగినాటి బ్రాహ్మణుడు, ముంగండ ' గ్రామ వాసి.ఆయన తండ్రి పేరు పేరు లక్ష్మీకాంత భట్టు ,తల్లి పేరు మహాలక్ష్మి,భార్య పేరు కామేశ్వరి.ఆయన గురువు పేరు పేరిభట్టు(తండ్రే).
ఆయనదగ్గర వేదాంతము,మహేంద్రుడు అనే ఆయన దగ్గర న్యాయ,వైశేషికాలు,ఖండదేవుని వద్ద జైమినీయం
శేష శ్రీకృష్ణ పండితుని దగ్గర వ్యాకరణము నేర్చుకున్నాడు.పేరిభట్టు కేవలం పండితుడే కాక మహా కవి కూడా
ఆయన రాళ్ళనుంచి అమృతం చిందేట్టు కవిత్వము చెప్పగల సమర్థుడట.అంటే ఆయన కవిత్వం అంత మధురంగా వుటుందన్న మాట.ఈ విషయాన్ని జగన్నాధ పండిత రాయలు తన 'రసగంగాధరము'లో ఈ శ్లోకం ద్వారా తెలియ జేస్తున్నారు.
శ్రీమత్ జ్ఞానేంద్ర భిక్షో రథిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః
కాణాదీ రాక్ష పాదీ రపి గహన గిరోయో మహేంద్రా ద వేదిత్
దేవాదే వాద్య గ్రీష్మ స్మరహర నగరే శాసనం జైమినీయం
శేషాంక ప్రాప్త శేషామల భణితి రభూ త్సర్వ విద్యా ధరోయః
పాషాణాదపి పీయూషం స్యందతేయస్య లీలయా
తం వందే పేరు భట్టాఖ్యం లక్ష్మీకాంతం మహాగురుం
తన తండ్రిని 'మహాగురువు ' అంటాడు పండితరాయలు జగన్నాథ పండిత రాయలు హయగ్రీవోపాసకుడు. దానికి ఆయన 'రసగంగాధారం'లో వ్రాసిన శ్లోకం.
శ్లోకం:-అపివక్తి గిరాంపతి: స్వయం యది తాసా మధిదేవతా పినా
అ యమస్మి పురోహ యావన స్మరణో ల్లంఘిత వాగ్మయాం బుధి:
మహాపండితుడు ఎలా వుంటా డంటే, ఆ బృహస్పతే వచ్చి మాట్లాడుతాడో.ఆ సరస్వతీదేవి స్వయంగా వచ్చి మాట్లాడుతుందో రమ్మనండి.యిదిగో 'హయగ్రీవ మంత్ర స్మరణం చేత వాగ్మయాంబుధి దాటి నేను వచ్చి ఎదురుగా నుంచున్నాను రమ్మనండి అన్నట్టు ఉంటాడట.
బ్రాహ్మణుల యింట్లో పిల్లల్ని ఆ కాలంలో ఎంతో కట్టుదిట్టంగా పెంచే వారు.అటువంటి కట్టుదిట్టాల్లో
పెరిగారు.పండితరాయలు.అన్ని శాస్త్రాలు,సంగీతము కూడా నేర్చుకున్నారు.
ఆయన వివాహము అప్పటి ఆచారాల ప్రకారం చిన్నతనం లోనే ముంగండ లోని కామేశ్వరి అనే అమ్మాయితో జరిగింది.
పండితరాయలు క్రీ.శ 1600 ప్రాంతం లో పుట్టాడు.1628లో షాజహాను కొలువులో చేరాడు.అంతకు ముందే కాశీలో విద్యాభ్యాసం చేశాడు.అప్పుడే అరబ్బీ,పార్సీ భాషలు నేర్చుకున్నాడు.హిందూస్తానీ సంగీతం కూడా నేర్చుకున్నాడు.తన సంగీతం,తో షాజహానును మెప్పించాడట.అరబ్బీలో.పార్సీ లో అద్భుతమైన కవిత్వం చెప్పి షాజహాన్ ను మెప్పించాడని చెప్తారు.షాజహాను ఆయనకు 'పండిత' అనే బిరుదు యిచ్చి గౌరవిం చాడట.ఆయన ఆగ్రాలోనూ,ఉదయపూరు లోనూ.మథురలొను నివాసమున్నాడట.షాజహాను కొలువు లోని విద్వాంసులను,అరబ్బీ,పార్సీ భాషలలో వాదించి గెలిచాడట.
అప్పటి ఉత్తర భారత దేశీయులు మన ఆంధ్రులను మీరు ఆంధ్రులా అని అడిగేవారు కాదట. మీరు జగన్నాథ పండితులవారి దేశము వారా?అని అడిగే వారట.మనవాళ్ళను వీళ్ళు పండితరాయల దేశం వారట అని
గొప్పగా పరిచయం చేసేవారట ' ఏ పండిత్ రాజ్ కే దేశ్ వాసీ హై'అనే వారట .అంత గొప్పకీర్తి సంపాదించారు జగన్నాధ పండితులు.తెలుగు వారికి అంతటి గౌరవం తెచ్చిన ఘనత ఆయనదే.
కాశీలోనూ,హరిద్వార్ లోను జగన్నాధ పండిత రాయలు వ్రాసిన 'గంగాలహరి'శ్లోకాలను
ఈనాటికీ గంగకు సాయింత్రం నీరాజనం యిస్తూ పాడే హారతి పాట అదే.
ఆయన పై మెట్టుమీద నిల్చుకొని ఆ పాట
పాడుతూ వుంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కోమెట్టు చొప్పున గంగ పైకి వచ్చేదట.
చివరికి మథురలో ఆయన యిలా చెప్పుకున్నాడు.
"శాస్త్రాలు చదివాను,నిత్య విధులన్నీ యథా తథంగా నిర్వర్తించాను.డిల్లీ వల్లభుని పాణి పల్లవాలతో యవ్వనమంతా గడిపినాను,హరిని సేవిస్తూ ఈ మథురా నగరిలో చివరి దశ వెళ్ళదీసు కుంటున్నాను.
నాకేమి కావలెను నేను అన్నింటినీ లోకాధికంగానే సాధించాను"
అనుకోని ఆత్మతృప్తి పొందిన వాడు.పుట్టినందుకు అన్ని విద్యలను నేర్చి,అన్ని వున్నతులను,సాధించి,
అమృతం చిందే కవిత్వం చెప్పాడు.గొప్పగానంవినిపించాడు,శ్రుతి ప్రమాణార్థం విడమరిచి కవులకు,అలంకారికులకు
సాహిత్యవేత్తలకు చెప్పాడు.యిక చేయ వలిసినదేమీ లేదని అరిపండిత భయంకరుడుగాబ్రతికినన్నాళ్ళూ
బ్రతికి చివరికి మహా యోగిగా మథుర లో ఆయన 74 వ ఏట కన్నుమూశారు.
ఆయన మహా జ్ఞాని ఆయనకు 35,40 ఏళ్ళ మధ్యలోనే భార్యా వియోగము సంభవించింది.
మలయానిల కాలకూటమో రమణీ కుంతల భోగి భోగ్యయో:
శ్వపచాత్మ భువో నిరంతరా మమ భూయాత్పర మాటమర స్థితి:
అర్థము:మలయా నిలయమునందు,కాలకూట విషము నందు,ఆడవారి వెంట్రుకల యందు,భోగియోక్క భోగములయందు,చండాలురయందు,మన్మథ భావముల యందు,నిరంతరము నాకొక్కటే పరమాత్మ
బుద్ధి అమరుగాక!అందరిలో పరమాత్ముని దర్శించాలని కోరుకుంటున్నానుఈ శ్లోకమే .ఆయన గొప్ప జ్ఞాని అనడానికి నిదర్శనము.
అంత కీర్తి సంపాదించిన వారంటే మిగతా పండితులకందరికీ అసూయ సహజంగా వుంటుంది. ఆయన మీద బురద చల్లే ప్రయత్నమూ చేశారు. షాజహానుబిడ్డ అయిన లవంగి తో ఆయనకు సంబంధం అంటగట్టారు. (దాదాపు 20 సంవత్సరాలు చిన్నది లవంగి ఆయనకంటే)ఆయనకు చిన్నతనము లోనే కామేశ్వరి అను కన్యతో వివాహమైంది.
వాళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా వుండేవాళ్ళని ఆయన వ్రాసుకున్న శ్లోకాలద్వారా తెలుస్తున్నది. తనభార్యను గూర్చి చాలా గొప్పగా వ్రాసుకున్నారు ఆయన.
వాటిని తర్వాతి భాగములో వివరిస్తాను.
ఆయన మహాజ్ఞాని.ఆయన వ్రాసిన కావ్యాలు కూడా అటువంటివే.ఆయన వ్రాసిన మొదటి కావ్యాలు ఐదు. అమృతలహరి, యిది యమునా స్తుతి, రెండవది కరుణాలహరి, యిది విష్ణు స్తుతి, మూడవది లక్ష్మీలహరి.లక్ష్మీ స్తుతి. ఇది బీజాక్షర సహితంగా కూర్చబడింది.
భారతీయులీనాటికీ దీనినెంతో పవిత్రంగా భావిస్తారు.లక్ష్మీ మంత్రం జపించిన,పారాయణం చేసినవారికి ఫలితం వుంటుందని పండితులు సైతం అంటూ వుంటారు. నాలుగవది సుధాలహరి, ఇది సూర్యస్థుతి. అయిదవది గంగాలహరి. గంగ ఒడ్డున పై మెట్టు మీద నిలబడి యేబదియేడు శ్లోకాలతో గంగను స్థుతించ్చాడనీ ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిందనీ చెప్తారు.
జగన్నాధ పండితరాయలను షాజహాన్ పిలిపించాడో మరి ఈయనే వెళ్ళాడో తెలియదు.
షాజహాన్ కొలువులో చేరి అధికారిగా, షాహజాహాన్ చక్రవర్తికి ఆంతరంగిక సలహాదారుగా
యిష్ట సఖుడుగా వుండేవాడు. రాజ్య విషయాలలో కానీ మతవిషయాలలో కానీ చక్రవర్తి
ఆయన సలహాలనే తీసుకునే వారని ప్రతీతి. చక్రవర్తిని నొప్పించకుండా ఆయనకు విజ్ఞానాన్ని అందిస్తూ వుండేవాడు. చక్రవర్తిని కల్పవృక్షముతో పోలుస్తూ
ఔదార్యం భువనత్రయేపి విదితం సంభూతిరంభోనిధే
వాసోనందన కాననే పరిమళో గీర్వాణ చేతో హరః
ఏవం దాతృ గురోద్గుణా: సురతరో: సర్వేపిలోకోత్తరా:
స్యాదర్థి ప్రకారార్తి తర్పణ విధావేకో యది
దేవలోకములోని నందనవనంలో కల్పవృక్షము అడిగినవారి కోరికలన్నీ తీరుస్తుంది. దాని పరిమళము దేవతలమనస్సును హరిస్తుంది. దానిదాతృ గుణము లోకోత్తరమైనది.
కానీ చక్రవర్తికి అర్థులకోరికలు తీర్చడం లో వివేకం అవసరము. అంటే పాత్రాపాత్ర
వివేకము అవసరమని హెచ్చరిక. చక్రవర్తి చేసే పనులలో లోపం కనిపించినప్పుడు ఆ లోపం సరిదిద్దడానికి ఏదో విధంగా ఆయన నొచ్చుకోకుండా యిలా సలహా చెప్పేవాడు
అనుకోవచ్చు.
చక్రవర్తిని ఆశ్రయించి కొందరు దుర్మార్గులున్నారు, వారికి భయపడి మంచివారు ఆయన దరి చేరడానికి భయపడుతున్నారు. ఆ విషయము చక్రవర్తికి ముక్కుకు సూటిగా చెప్పాడు.
యైస్త్వం గుణగణ వాన పి
సతాం ద్విజి హ్వాయి ర సేవ్యతాం నీతః
తానపి వాహసి పటీరజ
కిం కథ యామస్త్వదీయ మౌన్నత్యం
అది ఒక చందనపు చెట్టట ఓసీ! చందనమా! నీ గొప్పతనం యేమని చెప్పను? నీకు అపకీర్తి తెచ్చే నాగు పాములను కూడా భరిస్తూనే వున్నావు. అని చెప్పాడు.
కానీ చక్రవర్తికి అర్థులకోరికలు తీర్చడం లో వివేకం అవసరము. అంటే పాత్రాపాత్ర
వివేకము అవసరమని హెచ్చరిక. చక్రవర్తి చేసే పనులలో లోపం కనిపించినప్పుడు ఆ లోపం సరిదిద్దడానికి ఏదో విధంగా ఆయన నొచ్చుకోకుండా యిలా సలహా చెప్పేవాడు
అనుకోవచ్చు.
పండితరాయలు అంతటి సమర్థుడు,చతురత గలవాడు కాబట్టే షాజహాను అయన యోగ్యతకు తల వంచాడు.ఆయన విలువ గ్రహించి తన అరచేతులతో పెట్టుకొని కాపాడుకున్నాడు.భారతదేశ చరిత్రలో విశేషమైన గౌరవాలను పొందిన కవిపండితులు ముగ్గురే కనబడతారు ప్రాచీనులలో.వారిలో మొదటివాడు కాళిదాసు, భోజుడతణ్ణి ప్రాణాధికంగా కాపాడుకున్నాడంటారు.
రెండవవాడు అల్లసాని పెద్దన్న,'ఎదురేగినంతనే తన మదకరీంద్రము" దిగివచ్చి ఆయనను ఆహ్వానించేవాడట,రాయలవారు.మూడవ వాడు జగన్నాధ పండితరాయలు.ఒక విధంగా చూస్తే వారందరికన్నా ఈయనే మిన్న.
భోజుడు,రాయలు హిందూ రాజులు.ఇక్కడ షాజహాన్ ముస్లిం .అన్యమత ప్రభువు.
ఆ చక్రవర్తి ఆయనను అంత ఆదరించబట్టి ఒకసారి యిలా అంటాడు.
ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా
మనోరథాన్ పరిపూరయితం సమర్థ:
అన్యై: నృపాలై: పరదీయమానం
శాకాయ వాస్యా ల్లవణాయ వాస్యాత్
నాకోరికలు తీర్చాలంటే ఢిల్లేశ్వరుడైనా తీర్చాలి జగదీశ్వరుడైనా తీర్చాలి.వారిద్దరే అందుకు సమర్థులు. ఇతర రాజులు నాకు ఉప్పుకు, కూరకు మాత్రమే యివ్వగలరు.
అంటే అంత తక్కువ ఇస్తారని.
జగన్నాథ పండితరాయలు మహా కవి,పండితుడు,అలంకారికుడు,బహుగ్రంథ కర్త,మన ఆంధ్రుడు.తన కవిత్వం తో
గంగామాతను తన వద్దకు రప్పించుకొని ఆమెలో ఐక్యమై తన
పవిత్రతను నిరూపించుకొని,ఈర్షాళువు లైన పండితమ్మన్యులకు బుద్ధి చెప్పాడు.
ఆయన వద్దకు ఎంతోమంది కవి పండితులు వచ్చి,తమ కవిత్వాన్ని వినిపిస్తూ వుంటారు.
కొందరి కవిత్వం లో కావ్యత్వం వుండదు.పదాల పొందిక మాత్రం వుంటుంది,గణముల
కూర్పు మాత్రం వుంటుంది,అలాంటి వారి తో విసిగి పోయి యిలా అంటున్నారు.
శ్లోకం:- నిర్మాణే యది మార్మికోసి,నితరాం అత్యంత పాకద్రవన్
మృద్వీ కామధుమాధురీ మదపరీహారో ద్దురాణాం గిరాం
కావ్యం తర్హి సఖేసుఖేన కథయ,త్వాం సమ్ముఖే మాదృశామ్
నోచేత్ దుష్కృత మాత్మనా కృతమివ స్వామ్ తాత్ బహిర్మా కృథా!
ఓ మిత్రమా!నీవు కావ్య నిర్మాణం లో సిద్ధహ స్తుడవైతే అత్యంత రసవంతమైన స్వారస్యం
జాలువారే విధంగా ద్రాక్ష,తేనెల యొక్క మాధుర్యాన్ని,మదాన్ని హరింపజేసే మాటలతో
హాయిగా కష్టం లేకుండా ఏదైనా కావ్యం వ్రాసి మా వంటి వారికి వినిపించవయ్యా!లేదా
నా చేత పాపం చేయబడింది,చేయరాని పని చేయబడింది అనుకుంటూ నీ మనస్సు లోనుంచి ఆ పదాలను బయటకి రానీయకు.అని హెచ్చరిస్తున్నాడు.
కవిత్వం అంటే రసం జాలువారాలి,మనసు కరగాలి.రమణీయార్థ ప్రతిపాదన మవ్వాలి.
చమత్కారం వుండాలి .అలాంటి ఒక శబ్దం వున్న అది కవిత్వమనిపించుకుంటుంది.
అది లేని కవిత్వాలు గుట్టలు గుట్టలు గా వ్రాసినా ఎందుకూ ఉపయోగ పడవు.
అని జగన్నాథుని భావన. ఇది మనకందరకూ ప్రామాణికం,.


