21, డిసెంబర్ 2024, శనివారం

వేదాంత వ్యాసం

 వేదాంత వ్యాసం 

                         మొదటి భాగం 

బ్రహ్మ : 

గొప్పదానికంటే గొప్పది, దానికంటె గొప్పది మరొకటి లేదో అది బ్రహ్మము. సర్వ కారణము, సర్వాధారము, సృష్టిలో వ్యాపించి యున్నది. పొందదగినది, సత్‌చిత్‌ ఆనంద లక్షణమై యున్నది. జీవులలో 'నేను' అను దానికి అనుభవముగా ఉండగలది. సృష్టిలో సగుణము. సృష్టికి పూర్వము నిర్గుణము. ఏ బ్రహ్మ సంకల్పముననుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుచున్నవో ఆ బ్రహ్మమే సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులకు ఆధారమై యున్నది.


పరబ్రహ్మ : 

బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ, అవ్యక్తము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సృష్టి స్థితి లయములకు సంబంధము లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది. శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. మాయావరణ లేనిది. బ్రహ్మ లక్షణములకు అతీతమై విలక్షణమై యున్నది. బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుజ్య ముక్తికి ధామమైనది.

         ఏ నిర్గుణ బ్రహ్మ సగుణమగుటకు ఆస్కారమో, అట్టి పరబ్రహ్మ మాత్రము సృష్టికి బీజ ప్రదాత, సాయుజ్య ముక్తికి ధామము కాదు.


అచల పరిపూర్ణ పరబ్రహ్మ : 

శాశ్వత నిర్వికల్పము. త్రిగుణ రహితము. సగుణ నిర్గుణా తీతము. సృష్టి స్థితి లయ పద్ధతికి ఎట్టి సంబంధము లేనిది. సృష్టికి బీజ ప్రదాత కానిది. శాశ్వతముగా కదలనిది. అచలము. ఉన్నదున్నట్లున్నది. దేశ కాలాదులకు మూలము కానిది. దానినుండి ఏదీ పుట్టదు. అది దేనినీ తనలోనికి లయము చేసుకొనదు. అన్నిటికీ నిరాధారమైనది. దానినుండి సంకల్పము పుట్టదు. వ్యక్తావ్యక్తములు కానిది. సర్వకాలాలలో, సర్వ దేశాలలో అచలమై అద్వయమై, ముల్లు గ్రుచ్చ సందు లేక నిబిడీకృతమై యున్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది. దీనిని బయలని, బట్టబయలని, పరమపదమని అచల పరిపూర్ణమని, అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు.


పరిపూర్ణము : 

పరిపూర్ణము నిర్వికారము. దానినుండి, దానికి సంబంధము లేకనే, ఆనందము అనే స్పందన దానికదే కలిగెను. ఈ ఆనంద స్పందనమే మూలావిద్య. ఈ ప్రథమ స్పందనకు మూలావిద్య కారణము గాని, పరిపూర్ణము కారణము కాదు. జీవ ఈశ్వర జగత్తులు మూడూ మూలా విద్యకారణముగా తోచెను గనుక జీవేశ్వర జగత్తులు మాయా కల్పితములు. లోకములు, లోకేశులు, లోకస్థులు కూడా మాయా కల్పితములే. అవన్నీ భ్రాంతియే. పరిపూర్ణము భ్రాంతి రహితము, త్రిగుణ రహితము, నిర్వికారము, శాశ్వతము, అచలము. ఉన్నదున్నట్లున్నది. పరిపూర్ణమనగా అచల పరిపూర్ణము, అచల బ్రహ్మము. అచల పరిపూర్ణ పరబ్రహ్మము.


ఇహరూపము : 

ఎదురుగా ఇంద్రియ గోచరముగా నున్న దృశ్య జగత్తునకు అంతర్గతమైనది ఇహ రూపము. ఇది మధ్యలోనే వచ్చి, మార్పు చెందుచూ మధ్యలోనే పోయే స్వభావము కలది. ఆది అంతములు, ఉత్పత్తి నాశములు, చావు పుట్టుకలు కలది. ప్రాకృతము, పాంచభౌతికమైనది. మానసిక రూపమును సంతరించుకొన్నది. ఇహ అనగా ఇక్కడి సంగతి, ఇక్కడి సందర్భము, ఇక్కడి సంబంధము కలిగినది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేదు. లేకనే ఉన్నట్లు కల్పించబడినది. పైగా బాధించేది. ఇంద్రజాలము వంటిది. మిథ్య. మాయా కల్పితము, త్రిగుణాత్మకము, స్వప్నతుల్యము, మేల్కొంటే లేనిది. స్వస్వరూపమందు లేనిది. ఊహామాత్రము. భావనామాత్రము. యత్భావంతద్భవతి. అభావమందు లేనిది. మృతరూపము. తనకు తానే తోచినది. పరజ్ఞానమందు తోచినది ఇహరూపము.


పరరూపము : 

ఈ దృశ్య జగత్తుకు ఆవలనున్నది. ఇహరూపమునకు పరము, అతీతము గనుక పరరూపము అని పేరు. పరరూపుడు ఇహమునకు సాక్షిరూపుడు. ఇక్కడి వ్యవహారము అంతా భావనారూపమని తెలిసి, శరీర లక్షణమునకు, సర్వమునకు ఆధారము, అవస్థా సాక్షిరూపము, మార్పు చేర్పులకు అతీతమైనది. ప్రేరణ రూపమైనది. ధారణా రూపమైనది. కాని అమృత రూపము, జీవేశ్వర జగత్తుల యొక్క అఖండ సారమైనది. స్వతఃసిద్ధమై యున్నది. శాశ్వతము, నిర్వికారము, నిర్వికల్పము అయినది పరరూపము

                             సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గురించి👇*



 *👆బ్రహ్మశ్రీ*

*శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గురించి👇*


పండితులు 

వేదమూర్తులు 

ఏక సంథాగ్రాహులు

విశిష్ట ప్రవచనకారులు

అఖండ ప్రజ్ఞావంతులు 

 వర్తమానాంశ విశ్లేషకులు 

అష్టాదశ పురాణ జ్ఞానులు 

అత్యున్నత పేరు ప్రఖ్యాతులు 

*శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు!.*

 

గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం!.

 

 ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో, 

కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. 

సునాయాసంగా బయటపడ్డ ధీమంతులు. 


శ్రీ చాగంటి వారు 

1. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. 

2. వీరి భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. 

3. ఏ ఛానెల్లో ఐనా, సోషియల్ మీడియాలో ఐనా, దేవాలయ మైకుల్లో ఐనా వారి ప్రవచనాలు కని/వినిపిస్తుంటాయి. 

4. అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు.

5. కాకినాడలోని ఒక దేవాలయంలోకి ఛానెల్స్ వారు వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.

6. చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు.

7. ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. 

8. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే, ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. 

9. వారికున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు మాత్రమే. 

10. ఇంతవరకు ఆయనకు కారు లేదు. 

11. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. 

12. ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు.

13. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు. 

14. వారికి ఆరేడేళ్ల వయసులో- జనకులు గతించారు.

15. వారికి ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.

16. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. 

17. నిరుపేద కుటుంబం కావున సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు' అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. 

18. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. 

19. వేదాగ్రణి ఆయన నాలుకమీద తిష్టవేసుకుని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

20. ఈవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు. 

21. వాటిపై ఆయన కృషి పెద్దగా లేదు. 

22. అవన్నీ వారికి పూర్వజన్మ సుకృతంగా లభించినవి.

23. అది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం.

24. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం. 

25. ఆయన ఉద్యోగంలో చేరాక, తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. 

26. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే, తన సంపాదనతో వివాహాలు చేశారు. 

27. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. 

28. తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్' లేదంటే నమ్ముతారా?.

29. అప్పుడపుడు కాకినాడలో "అయ్యప్ప దేవాలయంలో" సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. 

30. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు.

31. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు. 

32. శ్రీ పీ.వీ. నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో' ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిసినప్పుడు *"మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను"* అన్నారు.

33. చాగంటి వారు నవ్వేసి *"మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే' తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు."* అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు. 

34. ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!.

35. చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు.అది తప్పుడు భావన.

36. ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం' వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక, ప్రారంభించారు.

37. చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా శ్రీ సరస్వతిమాత కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.....


మిత్రమా !.,

దుర్మార్గులను ఖండించక పోవుట ఎంతటి తప్పో, 

ఇట్టువంటి మహాత్ములను ప్రశంసించక పోవడం గూడా అంతే తప్పు ఔతుంది.

కనుక,*మీ మీ watsapp గ్రూపులకు & మిత్రులకు share చెయ్యండి.*

ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం, 

పదుగురికీ తెలియజేస్తున్నందులకు మీ మహోన్నత వ్యక్తిత్వానికి మా ప్రశంసలు!. 

మీకు బహు ధన్యవాదములు!.🙏


🙏

పుస్తకాలకు ఇక నిజంగా పండుగే

 ❗పుస్తకాలకు ఇక నిజంగా పండుగే!❗


✍️వెంకట్ శిద్దారెడ్డి,రచయిత, ప్రచురణకర్త


ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సంఖ్య దాదాపు పదికోట్లు. తెలుగులో ఒక మంచి పుస్తకం వస్తే అది కొనేవారి సంఖ్య మాత్రం వెయ్యికి అటూఇటూ. కాకపోతే ఇది అయిదేళ్ల నాటి సంగతి. మరిప్పుడో..? దేశంలోనే అత్యధిక ప్రతులు అమ్ముడైన ఘనత ఒక తెలుగు (అమ్మ డైరీలో కొన్ని పేజీలు) పుస్తకానిదే! ఇంతలో అంత మార్పు ఎలా సాధ్యమైందంటే...


అయిదేళ్ల క్రితం వరకూ పుస్తక ప్రచురణ అంటే- రచయితలు తమ సొంత డబ్బుతో రచనలను ప్రచురించుకుని, బంధుమిత్రులకు పంచుకునేవారు. పుస్తకాల షాపుల్లో ఇవ్వగా మిగిలినవి అటకమీద దుమ్ము కొట్టుకుపోయేవి. కొద్దిమంది పేరున్న రచయితలను మినహాయిస్తే మిగిలిన వారందరిదీ ఇదే పరిస్థితి.పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో పరిస్థితి ఇంత దారుణంగా లేదు. తెలుగులోనే ఈ దుస్థితి ఎందుకొచ్చిందంటే- గత పాతికేళ్లలో ప్రధాన ప్రచురణ సంస్థలు, వాటితో పాటే పుస్తకాల షాపుల్లో అనేకం తెరమరుగయ్యాయి. ఈ పరిణామానికి కారణం- తెలుగులో పుస్తకాలు చదివేవాళ్లు తగ్గిపోవడం. 2000 కి పూర్వం,తెలుగు వారిలో పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువే. టీవీ, ఓటీటీలు వచ్చాక పుస్తకాలు చదవడం మానేశారనుకుంటే, ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామమే తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన సమస్య కాదు. ఎందుకో మరి, తెలుగువాళ్లు మాత్రం పుస్తకాలు చదవడం దాదాపుగా మానేశారు. ఫలితంగా తెలుగు ప్రచురణరంగం కుదేలైంది.


➡️" అలవాటు అక్కడి నుంచే!"


అచ్చులో పుస్తకాలు చదవడం ప్రపంచ వ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టిందన్నది నిజమే మొబైల్ ఫోన్,టాబ్లెట్లలో చదువు కునేలా ఈ బుక్స్, వినగలిగేలా ఆడియో బుక్స్ రావడం ఒక కారణం. అలాగని తెలుగు పాఠకులు కూడా అచ్చు పుస్తకాలు వదిలేసి ఈ-బుక్స్ వైపు వెళ్లారా అని చూస్తే, వాటిని అమ్మే అమెజాన్, కిండిల్ లాంటి సంస్థలు తెలుగు పుస్తకాలు తాము అమ్మబోమనీ, తెలుగులో చదివేవాళ్లే లేరనీ తేల్చి చెప్పేశాయి. ఏమైపోయారు మరి తెలుగు పాఠకులు? ఒక మంచి కదో, కవితో, నవలో చదవాలనే కనీస ఆసక్తి లేకుండా బండబారి పోయిందా తెలుగు వారి మనసు... అని సాహిత్యాభిమానులకు అనిపించిన మాట వాస్తవమే. కాకపోతే తెలుగువాళ్లు మరీ అంతగా తెలుగు సాహిత్యాన్ని వదిలెయ్యలేదు.వాళ్లకు కావాల్సిన దానికోసం వెతుక్కుంటూనే ఉన్నారు. ఉదాహరణకు పదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రతిలిపి' అనే ఆన్లైన్ ప్లాట్ పామ్లో ఎవరైనా కదలు రాయొచ్చు.చదువు కోవచ్చు. ఇక్కడ ఎందరో తెలుగువాళ్లు తమ కథలు, కవితలు,నవలలు ప్రచురించారు. వాటిని లక్షలాది పాఠకులు చదివారు అంటే,తెలుగువాళ్లు చదువు తున్నారు. కానీ వాళ్లకి కావాల్సిందేదో ప్రచురణకర్తలు, రచయితలు అందించడం లేదు. ఇందుకు మరో ఉదాహరణ- తెలుగు పుస్తకాలను పీడీఎఫ్ గా పంచే టెలిగ్రాం గ్రూపులు, ఇక్కడ కూడా వేలాది సాహిత్యాభిమానులు పాత తెలుగు పుస్తకాలను ఇచ్చిపుచ్చుకుంటూనే ఉన్నారు.


ఇంట్లో అమ్మోనాన్నో పుస్తకం చదువుతుంటే చూసిన పిల్లలు అనుకరిస్తారు. ఆ ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు పిల్లలకు పనికొచ్చే కథల పుస్తకాలు కొనిపెడతారు. అలా మొదలుపెట్టి క్రమంగా తన కంటూ ఒక అభిరుచిని ఏర్పరచుకుని తయారయ్యే పాఠకుడు తనకు కావాల్సిన సాహిత్యాన్ని తాను వెతుక్కుంటాడు. పాతికేళ్ల క్రితం వరకూ ప్రతి ఇంట్లోనూ ఒక యండమూరో, యద్దనపూడో పుస్తకంగా ఉండే వారు. లేదా ఒక చందమామో, బాలమిత్రో ఉండేది. కనీసం నానమ్మో, తాతయ్యో చెప్పే కథలైనా వినపడేవి. ఈ పాతికేళ్లలో ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ, కొత్తగా చదవాలనుకునేవాళ్లు మొదటి పుస్తకంగా ఏం చదవాలీ అనడిగితే చివరికి మిగిలేది'. 'అసమర్ధుడి జీవయాత్ర, మైదానం', 'మహాప్రస్థానం' లాంటి క్లాసిక్సే చదవాలనే వారు, అలాగే రాసేవాళ్ల మీదా రచయితగా గుర్తింపు పొందాలంటే సమాజాన్ని మార్చే, సమాజాన్ని ప్రశ్నించే కథలే రాయాలనే ఒత్తిడి కనిపించేది. ఫలితంగా యువ పాఠకులు క్లాసిక్స్ ని చదివి అర్ధం చేసుకోలేకో, ఇప్పటి జీవనశైలికి చెందని విషయాలను జీర్ణించుకోలేకో, ఇది మనకు సరిపోయేది కాదులే అని మొత్తంగా పుస్తకానికి దూరమయ్యారు. ప్రపంచం, సమాజం సంగతి తరవాత... ముందు నేనంటూ ఒకణ్ని ఉన్నాను. నాకంటూ ఒక బాధుంది. నా ప్రేమ విఫలమైంది. ఆ బాధను చెప్పుకోడానికి ఒక కథ రాయకూడదా? అని ఒక ఔత్సాహిక రచయిత అనుకుంటే చుట్టూ పరిస్థితేమో అందుకు భిన్నంగా ఉంది. రచయితలంతా ప్రపంచ బాధలను తమ బాధలుగా చేసుకుని రచనలు చేస్తున్నారు. దాంతో ఇలానే రాయాలేమో అనుకుని ఔత్సాహికులు మొత్తానికి రాయాలనే ఆసక్తినే చంపేసుకున్నారు.


➡️మలుపు తిప్పిన కొత్తనీరు


అలాంటి నేపథ్యం నుంచి గత అయిదారేళ్లలో తెలుగు ప్రచురణరంగం కొత్త మలుపు తిరిగింది. ఇవాళ ఒక మంచి పుస్తకం ఒక్కరోజులోనే వెయ్యి కాపీలు అమ్ముడవడం చూస్తున్నాం.ఈ మధ్యకాలంలో దేశంలోనే అత్యధిక ప్రతులు అమ్ముడైంది ఒక తెలుగు పుస్తకం కావడం... మార్పులో భాగమే పుస్తక ప్రదర్శన జరుగుతున్న ఈ నెలలోనే దాదాపు మూడొందల దాకా కొత్త పుస్తకాలు ప్రచురితం ఆయ్యుంటాయని అంచనా.ఈ సంవత్సరం పదివేలకు పైగా అమ్ముడైన తెలుగు పుస్తకాలు కనీసం ఏడైనా ఉంటాయి.


ఒకరిద్దరి వల్ల వచ్చిన మార్పు కాదిది. పాతికేళ్లుగా తగ్గుతూ వస్తున్న పాఠకుల సంఖ్యను పెంచాలన్న, తెలుగు వారిలో సాహిత్యాభిమానాన్ని తట్టిలేపాలన్న సదుద్దేశంతో పలువురు కృషి చేశారు. వారి శ్రమ ఫలితాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాం.


➡️మంచి రచనలను వెతికి...


కలం పక్కన పెట్టేసిన రచయితలు కూడా ఇప్పుడు మళ్లీ ఉత్సాహంగా రచనలు చేస్తున్నారంటే దానికి కారణం- కొత్తగా వచ్చిన ప్రచురణ సంస్థలే. ఆస్వీక్షికి, అజు, అనల్ప, ఛాయ, కథాప్రపంచం, ఎలమి, రేగిల చ్చులు, జేవీ, ఝాన్సీ, ప్రభవ పబ్లికేషన్స్ లాంటి పాతికకు పైగా ప్రచురణ సంస్థలు సాహసోపేతమైన ప్రాజెక్టులు చేపట్టి తెలుగు సాహిత్య రంగం కాస్త కోలుకునేలా చేశాయి.సరికొత్త తెలుగు రచనలనే కాక వివిధ భాషల్లో వచ్చిన మంచి రచనలను వెతికి అనువాదం చేయించి తెలుగు పాఠకులకు అందిస్తున్నాయి.అలాగే కథకు, కవితకు పరిమితమై పోయిన తెలుగు సాహిత్యాన్ని నవలవైపు మళ్లించాయి. ఒక్క ఆస్వీక్షికి సంస్థే ఏడాదిలో దాదాపు నలభై నవలలు ప్రచురించింది.ఈ అయిదేళ్లలో కనీసం లక్షమంది కొత్త తెలుగు పాఠకులు తయారవడానికి కారణం కొత్త ప్రచురణ సంస్థలేనంటే అతిశయోక్తి కాదు, సోషల్ మీడియా కూడా తెలుగు సాహిత్య ప్రచారానికి తనవంతు తోడ్పాటు నందిస్తోంది. మొత్తా నికి తెలుగు ప్రచురణ రంగంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నా యన్నదీ తెలుగు సాహిత్యానికి అభిమానం దక్కుతోందన్నదీ నిర్వివాదాంశం. ఇది ఎవరూ ఊహించని, చరిత్రాత్మకమైన మలుపు


➡️యువ రచయితలదే హవా!


ఒకప్పుడు ఏటా ఇచ్చే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి 35 ఏళ్ల లోపు రాసేవాళ్లు తెలుగులో ఎవరున్నారని వెతుక్కునే పరిస్థితి ఉండేది.ఇప్పుడు ఇంతమందిలో ఎవరికివ్వాలి! అని ప్రశ్నించుకునే పరిస్థితి గత అయిదేళ్లలోనే చాలామంది యువ రచయితలు కలంపట్టారు. వారు రాసిన పుస్తకాలు రెండో సారి, మూడోసారి ముద్రణలకు వెళ్తున్నాయి. వచ్చే సంవత్సరంలో వందమంది దాకా కొత్త రచయితలు నవలలు రాయడానికి సిద్ధ మవుతున్నారన్నది ప్రచురణ రంగంలోని వారి మాట.


@ఈనాడు దినపత్రిక నుండి సేకరణ

20, డిసెంబర్ 2024, శుక్రవారం

Panchaag


 

Panchang


 

పంచాంగం 20.12.2024 Friday,

 ఈ రోజు పంచాంగం 20.12.2024 Friday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష పంచమి తిథి భృగు వాసర: మఘ నక్షత్రం నిష్కంభ యోగః: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.



శుభోదయ:, నమస్కార:

విస్తరిస్తుంది

 శ్లోకం:☝️

*యః పఠతి పరిపృచ్ఛతి*

 *పండితానుపాశ్రయతి |*

*తస్య విస్తారితా బుద్ధిః*

 *తైలబిన్దురివామ్భసి ।।*


భావం: చదివేవాడు, (వ్రాసేవాడు,) ప్రశ్నించేవాడు, పండితులను ఆశ్రయించేవాడు, అతని తెలివి నీటిపై (త్వరగా) వ్యాపించే నూనె బిందువులా విస్తరిస్తుంది.

19, డిసెంబర్ 2024, గురువారం

హోటల్ కమ్ సత్రం

 GRT వారు కాశి/వారణాసిలో హోటల్ కమ్ సత్రం ప్రారంభించింది.


దక్షిణ భారత ఆహారాన్ని అందిస్తారు. గది అద్దెలు నామమాత్రం. ఆహారం ఉచితం.


మిత్రులు ఇటీవల వారణాసికి వెళ్లి GRT నిర్మించిన సత్రంలో బస చేశారు ....

పేరు మాత్రమే సత్రం, కానీ గదులు అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఉన్నాయి, మీకు ఎక్కడా లభించదు.


గరిష్టంగా ముగ్గురు ఒక గదిలో ఉండగలరు... వారు ఉదయం కాఫీ, టిఫెన్, లంచ్, సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం అందిస్తారు. ... రూమ్ సర్వీస్ లేదు... అన్ని ఆహారాలు ఉచితంగా మరియు అపరిమితగా...అమావాస్య రోజున వారు ఉల్లిపాయలు & వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని అందిస్తారు.



GRT హోటల్..కాంటాక్ట్ నెం.7607605660.


వసతి కోసం వారి వెబ్‌సైట్‌ని సందర్శించండి...

grtkasichatram.com లేదా GOOGLE IT మరియు లాగిన్ అవ్వండి.

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్.


కాశీని సందర్శించాలనుకునే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. 👍🏻


ఓం నమః శివాయ 🌹🙏🌹


grtkasichatram.com

మనుషులు రాక్షసులవుతున్నారు

 🙏🕉️శ్రీ మాత్రేనమఃశుభోదయం🕉️🙏        🌹సమాజం మారిపోతోంది మనుషులు రాక్షసులవుతున్నారు.. అని బాధపడుతుంటారు.. కానీ చుట్టూ అంతా రాక్షస ఆలోచన మనుషులు ఉన్నా స్థిమితంగా మంచి మనసుతో, మంచి ఆలోచనలు చేయగలిగే వ్యక్తిని ఏ రాక్షస ఆలోచనల వ్యక్తుల ప్రభావం మన మీద ప్రభావితం చేయదు.. పెదాలపై ఎల్లప్పుడూ చిరునవ్వు, నిరంతరం ప్రశాంతంగా ఉండే మనస్సుపై ఏవిదమైన రాక్షస ప్రభావం చూపలేదు🌹అనుకున్న పనిని ఆపేస్తాం..వద్దనుకున్నది చేసేస్తాం.. అనుకోలేదు కానీ ఆకస్మాత్తుగా అనేసాం.. ఎంతగా అనుకున్న చేయలేక పోయాను..ఇవన్నీ ఆత్మ విశ్వాసం లోపించిన్నప్పుడు మనసులో విలువడే శబ్దాలు..ఖర్చు లేదు కదా అని మనసులో ఇష్టం వచ్చినట్లు విపరీత ఆలోచనలు చేసేయడం, ఇతరుల అవగుణాలను పరిశీలించి ఆ చెత్త చేదారాన్ని అపురూపమైన సున్నిత మనసులో నింపేయడం.. ఇవన్నీ ఆత్మ విశ్వాసం తరిగి పోవడానికి తగిన కారణాలు🌹జీవితం ఒక పెయింటింగ్ లాంటిది.. ఆశ అనే గీతలు గీసుకుంటూ వెళ్ళాలి.. దాని నుండి లుపాలను సహనంతో మంచి ఆలోచనలతో తొలిగించాలి🌹🌹మీ అల్లం రాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజెన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి 9440893593 9182075510 మందులు అయిపోయిన వారు లేదా కొత్త వారికి రాలేని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును* 🙏🙏🙏

తెలుగు సామెతలు

 ⚡ *మరుగున పడుతున్న కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం!*


1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు….

18, డిసెంబర్ 2024, బుధవారం

Panchang


 

శీతాకాలపు అయనాంతం

 *8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి!*


డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు పగలు ఉండనుంది. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెలుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని 'శీతాకాలపు అయనాంతం' అని అంటారు.

పురోహితుడు (ఒక్కరు ) కావలెను.

 *ఓం నమో వేంకటేశాయ*


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ వారి P.V. కాలనీ నందు గల శ్రీ పద్మావతీ గోదాదేవి సమే త వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు నిత్య పూజాదికములు నిర్వహించుటకు పురోహితుడు (ఒక్కరు మాత్రమే) కావలెను.


*అర్హతలు*


1. 35 సంవత్సరములు పైబడి వివాహితుడై  యుండవలెను.

2. స్మార్త, వైఖానస, ఆగమ శాస్త్ర విజ్ఞానం కలిగియుండి, ఆయా శాస్త్ర పద్ధతుల ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.

3. ఏవిధమైన దురలవాట్లు లేకుండా ఉండాలి


*జీత భత్యములు*


1. నెలకు రూ.18,000/- లు జీతముగా చెల్లించ బడును.

2. నిత్య మహా నైవేద్యం నిమిత్తం రూ.5,000/- లు అదనంగా చెల్లించ బడును.

3. నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితముగా ఇవ్వబడును.

4. రెండు పడక గదుల నివాసము ఆలయము పక్కనే ఉచితముగా ఇవ్వబడును.

5. కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయం

6. పిల్లలు ఉంటే వారికి ఉచిత విద్య

7. ఉచిత మంచినీరు, ఉచిత విద్యుత్తు


పైన తెలిపిన అర్హతలు, జీత భత్యములకు ఇష్టమున్న వారు మీ మీ దరఖాస్తులను మీకు సంభందించిన అన్ని వివరములతో ఈ క్రింద తెలుపబడిన చిరునామాకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జత పరచి ఈ నెల 30 వ తేదీ లోగా పంపవలెను. అన్ని దరఖాస్తులను పరిశీలించిన మీదట మీతో ముఖా ముఖి సంభాషణ జరుపు తేదీని మీ చరవాని నంబరుకు రెండు రోజుల ముందుగా తెలియ జేస్తాము.  ప్రత్యక్ష ముఖా ముఖి అయిన తరువాత మీ మీ ప్రజ్ఞా పాటవాలను బట్టి మిమ్ములను ఎంపిక చేయడం జరుగుతుంది.


*మీ దరఖాస్తులు పంపవలసిన చిరునామా* 

Dr. P. Seshagiri Rao,

Medical Superintendent,

Area Hospital, S.C.Co.Ltd.,

MANUGURU- 507117

Bhadradri -Kothagudem (Dt)

Mobile No. 9440367890

*18, డిసెంబర్, 2024*🌷

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🪷 *బుధవారం*🪷

🌷 *18, డిసెంబర్, 2024*🌷  

       *దృగ్గణిత పంచాంగం*


          *ఈనాటి పర్వం*  

       *సంకష్టహర చతుర్థి* 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - కృష్ణపక్షం*


*తిథి     : తదియ* ఉ 10.06 వరకు ఉపరి *చవితి*

*వారం : బుధవారం*(సౌమ్యవాసరే) 

*నక్షత్రం  : పుష్యమి* రా 12.58 వరకు ఉపరి *ఆశ్లేష*


*యోగం  : ఐంద్ర* రా 07.34 వరకు ఉపరి *వైధృతి*

*కరణం  : భద్ర* ఉ 10.06 *బవ* రా 09.58 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 06.30 - 08.30  మ 01.30 - 05.00*

అమృత కాలం  : *సా 06.30 - 08.07*

అభిజిత్ కాలం  :  *ఈరోజు లేదు*


*వర్జ్యం         : ఉ 08.49 - 10.26*

*దుర్ముహూర్తం  : ప 11.42 - 12.27*

*రాహు కాలం  : మ 12.04 - 01.28*

గుళికకాళం     : *మ 10.41 - 12.04*

యమగండం    : *ఉ 07.53 - 09.17*

సూర్యరాశి : *ధనుస్సు* 

చంద్రరాశి : *కర్కాటకం* 

సూర్యోదయం :*ఉ 06.30* 

సూర్యాస్తమయం :*సా 05.39*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 06.30 - 08.44*

సంగవ కాలం    :    *08.44 - 10.57*

మధ్యాహ్న కాలం :*10.57 - 01.11*

అపరాహ్న కాలం : *మ 01.11 - 03.25*


*ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ చవితి*

సాయంకాలం  :  *సా 03.25 - 05.39*

ప్రదోష కాలం    :  *సా 05.39 - 08.13*

రాత్రి కాలం      :  *రా 08.13 - 11.39*

నిశీధి కాలం      :*రా 11.39 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.47 - 05.39*

________________________________

         🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


       *🪷సరస్వతీదేవి🪷*    

     *అవతార అంతరార్థం*


*ఈమె బ్రాహ్మీముహూర్తం (సూర్యోదయం కంటే ముందున్న అరుణోదయం) నుండి మధ్యాహ్నకాలం వరకు ఆవిర్భవించిన సమయముగా చెబుతారు. సరస్వతి ప్రకాశమయ రూపము కలిగి ఉంటుంది కావున ఈమెను "తార'' గా వ్యవహరిస్తారు.*


*హిరణ్య గర్భః సమవర్తతాగ్రే*

*భూతస్య జాతః పతిరేక ఆసీత్‌*

*సదాధార పృధ్వీం ద్యాముతేమామ్‌*

*కస్మై దేవాయ హవిషావిధేమ*


*ఇది హిరణ్యగర్భుడైన బ్రహ్మస్తుతి. విశ్వాధిష్టాత అయిన ఈ హిరణ్యగర్భుని శక్తిని తార లేదా సరస్వతిగా వ్యవహరిస్తారు.*


           *ప్రకాశసమయంలో అవతరించిన తల్లి కావున తార అని అంటారు. జ్ఞానానికి, ఆనందానికి, ఉనికికి, సరస్వతి మూలం కావున ఈమెను మూలా నక్షత్రం నాడు ఆరాధిస్తారు.*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🪷🪷🪷🪷🌷🌹

సర్దుకుపోవడం

 సర్దుకుపోవడం మౌనంగా ఉండడం కోపాన్ని అణచుకోవడం ఇవన్నీ ఎలా సాధ్యం


ఓ దంపతులు చాలా అన్యోన్యతకు రూపంగా ఉన్నారు. 50 ఏళ్ల వారి దాంపత్య జీవితంలో ఎటువంటి పొట్లాటలు లేవు. వినగానే ఆశ్చర్యం వేసినా నమ్మకం కలగలేదు.

భార్య తీవ్ర అనారోగ్యంతో తన తనువు చాలించే సమయంలో భర్త ఆమెను ఒక్క ప్రశ్న అడిగాడు.

కోకిలా ఇన్నేళ్ల మన జీవితంలో నాపైన ఎప్పుడూ కోపం రాలేదా అని.


ఆమె ఆ అటక పైన ఓ పెట్టె ఉంది తీసుకోండి అంది. మన పెళ్ళైన కొత్తలో మీనుండి ఓ మాట తీసుకున్నాను. ఎటువంటి పరిస్థితిలోనూ ఈ పెట్టే మీరు తెరవకూడదు అని. మీరు నా మాటను ఇప్పటివరకు పాటిస్తూ వచ్చారు. ఆ  విషయంలో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను.


ఇప్పుడు ఆ పెట్టెను తెరవండి అని అడిగింది కోకిల. భర్త ఆ పెట్టెను తెరిచాడు అందులో రెండు నూలు బొమ్మలు ఉన్నాయి.

మా అమ్మ ఈ పెట్టెను మన పెళ్లి అప్పుడు ఇచ్చారు. నీ భర్త పైన ఎప్పుడు కోపం వచ్చినా ఆయన పైన కోపాన్ని ప్రదర్శించకు. ఇలా బొమ్మలు వేసిపెట్టు అన్నారు అని చెప్పింది.


భర్తకు ఒకటే ఆనందం కోకిలా అంటే ఇన్నేళ్ల మన కాపురంలో నీకు  నాపైన రెండు సార్లేనా కోపం వచ్చింది అని అడిగితే ఆమె అందులో ఉన్న ఒక మూటను విప్పి అక్షరాల రెండు లక్షల రూపాయలు అతడి చేతిలో పెట్టి, 


నేను వేసిన బొమ్మలన్ని అమ్మేస్తే వచ్చిన డబ్బులు అవి ఇదిగో నీ జీవితాన్ని ఇక కొనసాగించుకో అన్నది.


అరిచి విడిపోవద్దు

అహంతో కొట్టుకోవద్దు

ఆవేశం కోపం వచ్చినప్పుడు

వాటిని ఎలా ఆపుకోవాలో తెలిస్తే  బంధాలతో శాశ్వతంగా ఉంటాము అని చెప్పింది కోకిల.🍎🍑🍅🍅🍓🍇👍👍రాళ్లభండి చంద్రశేఖర్ శాస్త్రి 👏👏