9, ఆగస్టు 2025, శనివారం

గతంలో

 గతంలో సంసారం 'చీకట్లోనే' జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి, నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి....


కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ, చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు...🤦‍♂


నాడు కొందరికే మందు, విందు అలవాటు 

నేడు కొందరే వీటికి దూరం..


నాడు కష్టమొస్తే, కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు,

నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమౌతున్నారు..


నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం,

నేడు కదల కుండా కూర్చుని సంపాదిస్తూ....

 తిన్నది అరగడానికి వాకింగు శ్రమిస్తున్నాం,


నాడు పండ్లు, పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించాము..

ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మింగుతున్నారు..

ఇంక పిల్లలెక్కడ🙆‍♂

అందుకేగా అన్ని చోట్లా

సంతాన సాఫల్యకేంద్రాలు...


గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే.. మనసు మాత్రం సాఫ్టు

ఇప్పుడు అంతా

 'సాప్ట్ వేర్ ఇంజనీర్లే' మనసు మాత్రం హార్డు!!!!


అప్పుడు వైద్యుడు ఇల్లిల్లూ తిరిగి వైద్యం చేసేవాడు, అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి!

ఇప్పుడు తలకాయనొప్పికే ఇళ్ళమ్ముకునేంత ఖర్చు ఔతోంది!!


నాడు దొంగలు 'నట్టింట్లో' పడి దోచుకెళ్ళేవారు,

నేడు దొంగలు దొరల్లాగా 'నెట్ ఇంట్లో' దోచేస్తున్నారు....


ఒకప్పుడు చదువులేనోడు దొంగగా మారేవాడు గతిలేక ..

ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువు తున్నారు సైబరు నేరగాళ్ళు....


అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడే వాళ్ళం, 

ఇప్పుడు క్రెడిటు కార్డు మీద అప్పుతో కొనుక్కోడమే క్రెడిటు గా ఫీలౌతున్నాం..


ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి, సొమ్ము చేయలేక తాగేవాళ్ళం..

ఇప్పుడు రెడీ మేడు చపాతీలు , పొంగలి దాంటో కూరతో సహా కొనుక్కొచ్చుకొని తింటున్నాం...


చైనా నుండి ఒకనాడు పింగాణీ వస్తువు లొచ్చేవి....

  నేడు తినే కంచం నుంచి దాంట్లోకి ప్లాస్టిక్ బియ్యం తో సహా అక్కడినుంచే...


ఇది మనం సాధించిన పురోగతా............?

లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా....?


ఈ పోస్ట్ కి మనకి సంబంధం ఏంటిలే అనుకోకు... 

ఇలా ఉన్న వాళ్ళ మధ్యలోనే కదా మనం బతుకుతోంది... కాస్త ఆలోచించండి మీ మంచికే !

7, ఆగస్టు 2025, గురువారం

కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం!*

 ⚡ *మరుగున పడుతున్న కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం!*


1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు….

అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను

 అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను


'అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే బ్రహ్మను, నేను ఏం చేసిన అది బ్రహ్మాజ్ఞ అంటే కుదరదు!


మనం చేసేది మనసా, వాచా, కర్మణా అంతరాత్మ చెప్పిందే అయితే నిశ్చయంగా మనం 'బ్రహ్మమే"! దీని ప్రకారం బ్రహ్మ ఎవరో కాదు, నేనే అని ఈ ఉపనిషత్తు వాక్యం చెబుతుంది. ఇక మరో మహావాక్యం తత్వమసి. తత్వం అంటే నువ్వు, నువ్వు కూడా బ్రహ్మవే అని దీని అర్థం.


సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన వాక్యం ఇది. మరో మహత్తర వాక్యం 'అయమాత్మా బ్రహ్మ'. అంటే ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం.


అధర్వణవేదంలోని ముండకోపనిషత్తు నుంచి ఈ వాక్యం వచ్చింది. ఈ మహత్తర వాక్యాల సారాన్నంతా మళ్లీ ఒకే వాక్యంలో చేర్చి చెప్పటం జరిగింది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు!ఈ వాక్యాల సారం అర్థమయితే చాలు, భగవంతుడు మరెక్కడో లేడు-మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ ఉన్నాడనే భావన వస్తుంది.


మన అంతరంగంలో అన్వేషిస్తే దీనికి సరైన సమాధానం లభిస్తుంది. బయట వెతికితే ఏమీ లభించదు .శంకరులు "అహం బ్రహ్మస్మి" అన్నారు. వెంటనే శిష్యులు కూడా "అహం బ్రహ్మస్మి" అన్నారు. మరి కొందరు అహంకారులు "అహం పరబ్రహ్మస్మి" అన్నారు.


ఇంకా కొందరు అహంకారులు "అహం పరాత్పర బ్రహ్మస్మి" అన్నారు. అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరి కొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్న అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పర బ్రహ్మము కన్న ఇంకా అధికమగు పరాత్పర బ్రహ్మమనియు అన్నారు. బ్రహ్మమగు శంకరులు చెప్పిన విషయాన్నిఎవరూ గ్రహించలేక పోయారు! ఈ తత్వసారాన్ని తెలుసుకోవాలంటే అహంకారాన్ని పూర్తిగా వదలివేయాలి! చాలా మంది అహంకారం, గర్వం ఒకటే అని అనుకుంటారు . గర్వం వేరు, అహంకారం వేరు. 'అహం' అన్నది 'నేను' అనే వ్యక్తిత్వ భావన ఎక్కువైతే వచ్చేది.


'నేను' కు మూలంలోకి వెళ్ళితే తప్ప 'అహం' అసలు స్వభావం తెలియదు.


' అహం బ్రహ్మస్మి ' అన్నారు పెద్దలు.' అహం ' అంటే 'ఆత్మ' అని వారి భావన. నిర్గుణబ్రహ్మస్థితి కలిగి 'సోహం' మంత్రమును శ్వాస, నిశ్వాసాల ద్వారా నిరంతరము జపించేవారికి ఆత్మతత్త్వము తెలుస్తుందని కొందరి అభిప్రాయం. 'సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యానికి ఇది మంత్రరూపం. ఇది ప్రతివ్యక్తిలోను వారికి తెలియకుండా ఉఛ్వాసలో 'సో' అని, నిశ్వాసలో 'హం' అని నిత్య సాధన జరుగుతుంటుంది. దీన్నే'అజపాగాయత్రి' అని అంటారు.


పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు. అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మాడు. ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు


ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మాడు. గ్రీక్ తత్వవేత్త ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మాడు.


పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు. "తానూ, దైవమూ ఒక్కటేనని, అలాంటి ప్రజ్ఞ కలిగినప్పుడు ఆ మనిషి దివ్యాత్మని అనుభవిస్తాడనే " ఆత్మ జ్ఞానాన్ని మహనీయులు కొందరు చెప్పారు..


ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు "అహం బ్రహ్మస్మి" అని !కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సాధన చేసి అంధకారాన్ని పారద్రోలాలి! శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. ఆత్మ నాశనం కానిదని, శస్త్రం ఏదీ ఛేదించలేనిదని , అగ్ని దహించలేనిదని, నీరు తడపలేనిదని, వాయువు ఆర్పలేనిదని అని వివరించాడు.


అహం అనే మాటని "నేను" గా అనువదిస్తే వచ్చే అర్ధం నేను బ్రహ్మని (ఇక్కడ బ్రహ్మ అనే మాట త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు, పరమ చైతన్యం) అని అర్ధం! కాబట్టి ప్రతి ప్రాణి ఆ చైతన్యమే! దేవుడు మనలోనే ఉన్నాడు, మనం దేవుడిలో ఉన్నాం. ఆ దివ్య చైతన్యంలో మనం కూడా భాగం అవ్వటం గురించి సాధన చేయాలి.


ఆత్మ ఒక్కటే. అది పరిమితమైతే అహంకరణం, పరిమితం కానప్పుడు అది అనంతము, సత్యమూనూ అని శ్రీ రమణులు చెప్పారు. ''నేనెవ్వరు?'' అన్న విచారణా మార్గం సాధకులకు తెలియాలి. శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు. శివుడు అవసరమైతే విషం పుచ్చుకుంటాడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చినవాడే, పార్వతిని వివాహమాడి


సంసారి అయ్యాడు.


మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు. ఈ భిన్న తత్వాల ఏకత్వమే అర్థనారీశ్వర తత్వం. శివుడు తన దేహాన్ని (ప్రకృతిని) ఆలిగా చేసుకున్నాడు. శివపార్వతుల (దేహత్మల) కలయికే మానవుడు. అంతా నేనే అయినపుడు, ఇతరులను హింసించడమంటే, నన్ను నేను హింసించుకోవడమే అవుతుంది!


పూర్ణ మదం: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమే వా వశిష్యతే. 


సాధనాత్ సాధ్య తే సర్వం

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

గురు భక్తియా ఈశ్వర భక్తియా*

 *గురు భక్తియా ఈశ్వర భక్తియా*


గురు భక్తి వల్ల కలిగే లాభాలు


ఒక ప్రశ్న రావచ్చు — సర్వశక్తిమంతుడైన, నిష్కల్మషుడైన ఈశ్వరుడు ఉన్నప్పుడు, ఆయనకు నేరుగా సేవనం చేయకుండా, మనుషులులాగే కొన్ని లోపాలతో ఉన్న గురువు ద్వారా ఎందుకు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి. 


ఇందుకు సమాధానంగా, గురు భక్తి వల్ల కలిగే కొన్ని లాభాలను ఇప్పుడు వివరిస్తాను.  


ఈశ్వరుడు మన కళ్లకు కనిపించడు కానీ గురువు మాత్రం మనకు కనిపిస్తాడు. మనం ఆయనతో కలిసి తిరగవచ్చు, మాట్లాడవచ్చు. ఈశ్వరుడు మనకు నేరుగా ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పడు. కానీ గురువు మాత్రం అన్ని విధాలుగా ప్రయత్నించి మనకు మంచిచెడ్డలు తెలుపుతాడు. మనకు ఏదైనా సందేహం వస్తే, అది చేయవచ్చా లేదా అని గురువును అడిగి మార్గదర్శనం పొందవచ్చు. అలాంటి భక్తి, శ్రద్ధ మనకు ఈశ్వరునిపై ఉన్నదా?


ఇంకా, ఈశ్వరుడు మనకు అందని చోట ఉన్నాడు. మనం ఆయనతో కలిసి తిరగలేం. కానీ ఆయన మన ఇంద్రియాలకు అందని వాడైనా, మన చర్యలన్నింటినీ గమనిస్తుంటాడు.అయినా మనం ఆయన మనకు శిక్ష విధిస్తాడన్న భావనలో ఉండం. మనం మంచి చేసినా ఆయన వెంటనే ఆశీర్వదిస్తాడనే నమ్మకం కూడా ఉండదు.


మనపై ఆయన ఎప్పుడూ నజరే పెట్టుకున్నాడన్న విషయం మనకు తెలియకపోవడం వల్ల, మనసు చెప్పినట్లు ప్రవర్తిస్తాం. శిక్ష, భయం లేకపోవడం వల్ల తప్పులు చేస్తాం. మానవ శరీరమూ, ధనం ద్వారా ఏదైనా మంచి చేయాలన్నా, దానిలో త్యాగం ఉండాలి కాబట్టి చేయక పోతాం.


ఒక సామెత ఉంది — రాజు వెంటనే శిక్షిస్తాడు, దేవుడు సమయం వచ్చినప్పుడు శిక్షిస్తాడు. ఇది శిక్ష విషయంలోనే కాదు, బహుమతి విషయంలో కూడా రాజు వెంటనే ఇవ్వగలడు. కానీ దేవుడు అప్పుడే బహుమతి ఇవ్వడని అనిపిస్తుంది.


ఈశ్వరుని పాలనలో మన పూర్వ జన్మల పుణ్యాలు, పాపాలు అన్నింటి ఫలితాలను కలిపి చూసి ఫలితాలు ఇస్తాడు. అందుకే పాపం చేసిన వెంటనే దాని ఫలితం రాకపోవడం వల్ల మనం తప్పు చేయడంలో భయం అనుభవించం. మంచి చేయడానికి ఉత్సాహం కూడా ఉండదు.


కానీ గురువు ఎలా ఉంటాడు? మనం తప్పు చేస్తే వెంటనే గుర్తించి గట్టిగా స్పందిస్తాడు. మన తప్పును మనకు అర్థమయ్యేలా మందలిస్తాడు. మనం తప్పు చేయబోతున్న సందర్భాల్లో, ఇది గురువు చెవికి చేరితే ఏమవుతుంది? అనే ఆలోచన మనల్ని ఆపుతుంది.


గురువుకి ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటే, మనం ఎక్కడైనా చేసిన తప్పును ఆయనే తెలుసుకోగలడు. అటువంటి గురువులు ఉన్నా, తాము ఆ శక్తిని బయటకు చూపించరు. అయినా, గురువుకి ఆ శక్తి లేకపోయినా, మన తప్పు ఎవరో చెప్పే అవకాశం ఉండడం వల్ల, మనం తప్పు చేయకుండా ఉంటాం.


మంచి పని చేసినప్పుడు కూడా గురువుకి తెలిసేలా మనమే ప్రయత్నిస్తాం లేదా ఇతరుల ద్వారా అది ఆయనకు తెలుస్తుంది. అప్పుడు గురువు మనకు ఆశీర్వదించి, ఇంకా మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తాడు. ఒకవేళ గురువు శిష్యుడు అభిమానం పెంచుకోకూడదని భావించి, మంచి పనులకు బహిరంగంగా ప్రశంసించక పోయినా, అంతర్గతంగా ఆనందాన్ని తెలియజేస్తూ దీవిస్తాడు.


మన పాపాలు తగ్గి, పుణ్యాలు పెరగకపోతే మన విమోచనం ఎలా సాధ్యం? గురువు నిర్ణయాల ద్వారా మంచి చెడు కర్మలకు తక్షణ ప్రభావాలు తెలుస్తాయి. కానీ ఇశ్వరుని తీర్పులో అది వెంటనే కనిపించదు.


ఇన్నింటికంటే ముఖ్యంగా, మన మనస్సును మనం శుభ్రం చేసుకోవడం కన్నా గురువు చాలా సమర్థంగా శుద్ధి చేస్తాడు. ఆయన మన పాపాలలో కొంత భాగాన్ని తనపై తీసుకుంటాడు. మన కోసం ఈశ్వరునితో ప్రార్థిస్తూ, స్నేహంగా ఆయనను ఆజ్ఞాపిస్తాడు, తర్కించడానికీ వెనకాడడు — ఇదే నేను చెప్పిన విషయం.


అందుకే గురువుకి ఉన్న స్థానం చాలా గొప్పది. ఆయన లోపాలు ఉన్నా పూజించాల్సిందే అని చెప్పబడుతుంది. దీనినే ఉత్తర భారతదేశంలో "గురు వాద్" అంటారు.


గురువుపై అపారమైన విశ్వాసం, ప్రేమ ఉన్నవారు గ్రహిస్తారు — గురువుని ధ్యానించడం అనేది, ఈశ్వరుని ధ్యానించడాన్ని మించిపోయే శాంతిని ఇస్తుంది. దీన్ని నేను వివరంగా చెబుతాను.


భగవంతుడు మన ప్రార్థనలు వింటాడో లేదో, మన మంచి చెడ్డను గమనిస్తాడో లేదో అనుమానం ఉండే స్థితిలో, ఆయన తప్పకుండా మన విమోచన చేస్తాడు అన్న ధృఢ విశ్వాసంతో కలిగే ఆత్మశాంతి ఎలా వస్తుంది? మనసు ఎప్పటికప్పుడు అనుమానంతో ఉంటుంది. అందువల్ల భయమేమిటి, ఆయన ఉన్నారు, అంతా చూస్తారు అన్న నిశ్చలమైన విశ్వాసంతో వచ్చే శాంతి మనకు దక్కదు. కొన్నిసార్లు అలాంటి శాంతి లభించినా, అది అనుమానం, భయం వల్ల మాయమవుతుంది.


కానీ గురువుకే తన జీవితం అర్పించినవారు మాత్రం భయం, అనుమానం లేకుండా, ఆయన అన్నిటినీ చూసుకుంటాడు అన్న భావనతో శాంతిగా ఉంటారు.అవునా.

Panchaag


 

6, ఆగస్టు 2025, బుధవారం

కథ

 



♥️ *కథ*-*181*♥️



మీరు ఎప్పుడైనా భగవంతుని చూశారా? చూడటానికి ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఉనికిని అనుభూతి చెందడానికి మనకు ఏమి అవసరమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?



 *ప్రార్థన* *యొక్క* *శక్తి*



 ఒక వృద్ధురాలు కూరగాయల దుకాణానికి వెళ్ళింది. కానీ కొనడానికి ఆమె వద్ద డబ్బు లేదు. కూరగాయలు అప్పుగా ఇవ్వమని దుకాణదారుని అభ్యర్థించింది, కానీ దుకాణదారుడు నిరాకరించాడు. ఆమె పదే పదే అడుగగా, దుకాణదారుడు "నీ వద్ద ఏదైనా విలువైన వస్తువు ఉంటే, ఈ త్రాసుపై ఉంచు. దాని బరువుకు సమానమైన కూరగాయలు ఇస్తాను", అని చెప్పాడు.


 వృద్ధురాలు కాసేపు ఆలోచించింది. ఆమె వద్ద అలాంటిదేమీ లేదు. కాసేపు ఆలోచించిన తర్వాత, ఒక కాగితం తీసి, దానిపై ఏదో రాసి, త్రాసుకి ఒక వైపు ఉంచింది.


 అది చూసి దుకాణదారుడు నవ్వడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ, కొన్ని కూరగాయలను తీసి, త్రాసులోని ఒక తక్కెడలో పెట్టి ఆశ్చర్యపోయాడు! కారణం, కాగితం ఉన్న తక్కెడ దిగువకు, కూరగాయల తక్కెడ పైకి కదిలింది. అప్పుడు అతను మరిన్ని కూరగాయలను వేసాడు, కాని కాగితం ఉన్న తక్కెడ పైకి రాలేదు. ఇప్పుడు దుకాణదారుడు మరికొన్ని కూరగాయలను ఉంచాడు, కాని కాగితం ఉన్న తక్కెడ మాత్రం ఇప్పటికీ క్రిందకే ఉంది.


ఎన్ని కూరగాయలు వేసినా, కాగితం ఉన్న తక్కెడ పైకి లేవకపోవడంతో, దుకాణదారుడు విసుగు చెంది, కాగితం తీసుకుని దాని మీద ఏమి వ్రాసిఉందో చదివాడు.


 కాగితంలో ఇలా రాసి ఉంది,

 *" ఓ భగవంతుడా, నన్ను చూసుకునే బాధ్యత నీదే, ఇప్పుడు ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంది."* 


ఇది చదివి దుకాణదారుడు చాలా ఆశ్చర్యపోయి, తన కళ్లను తానే నమ్మలేక ఆ కాగితాన్ని మళ్లీ మళ్లీ చదివాడు. కానీ ఏమీ అర్థం కాలేదు, ఏమీ మాట్లాడకుండా కూరగాయలు వృద్ధురాలికి ఇచ్చాడు.


 అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న మరొక వ్యక్తి, "ఆశ్చర్యపోవద్దు ! ఆ ముసలావిడ ఈ కాగితంపై హృదయపూర్వకంగా ప్రార్థన వ్రాసింది, ప్రార్థన విలువ ఆ భగవంతునికి మాత్రమే తెలుసు" అని దుకాణదారునికి వివరించాడు.


 మనం భగవంతుని ప్రార్థించాలి, మన జీవితంలో ఆయన ఉనికిని అనుభవించడంలో సహాయం చేయమని ఆయనను అభ్యర్థించాలి.

ఒక గంటైనా, నిమిషం అయినా సరే, ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తే, భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ కథలో కూరగాయల అమ్ముకునేవాడు, కొంటున్న వృద్ధురాలి ప్రార్థన రూపంలో భగవంతుని ఉనికిని అనుభవించాడు.


 మనం భగవంతుని ప్రత్యక్షంగా చూడలేం, కానీ చాలా సూక్ష్మ ప్రకంపనల ద్వారా ఆయన ఉనికిని అనుభూతి చెందగలం. ఆయన మాట వినడానికి మనం మౌనం పాటించాలి... 

ఎందుకంటే భగవంతుని భాష నిశ్శబ్దం, అది దానికి అదే సంపూర్ణమైనది.


నిజానికి, మనం చేసే ప్రతి పనిలో భగవంతుడిని భాగస్వామిగా చేసుకోవాలి. మనం ఆయన గురించి ఆలోచించినప్పుడు, మన సమస్యలపై మన దృక్పథం కూడా మారడం మొదలవుతుంది.



                          ♾️



 ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. 🌼

 

*బాబూజీ*







 హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌



HFN Story team

పోతన గారి సరస్వతి

 🙏పోతన గారి సరస్వతి ప్రార్ధన🙏

ఈ పద్యం చదివితే సరస్వతి కటాక్షం తప్పక కలుగుతుంది.

 క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర

శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,

వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

ణి అక్షరం అనేక పర్యాయాలు ఆవృత్తి అయింది.ఇది ఒక అద్భుతం.ణ అంటే మంత్రశాస్త్రం లో జ్ఞానం అని అర్ధం. జ్ఞాన ప్రదాయిని కాబట్టి ణి ఆవృత్తి చేశారు.

 క్షోణితలంబునన్ = నేలకు; నుదురు = లలాటము; సోఁకఁగన్ = ఆనేలా; మ్రొక్కి = నమస్కరించి; నుతింతున్ = స్తుతిస్తాను; సైకత = ఇసక తిన్నెల లాంటి; శ్రోణి = పిరుదులు గలామె; కిన్ = కు; చంచరీక = తుమ్మెదల; చయ = గుంపు లాంటి; సుందర = అందమైన; వేణి = జుట్టు గలామె; కిన్ = కు; రక్షిత = రక్షింప బడే; అమర = దేవతల; శ్రేణి = సమూహము గలామె; కిన్ = కి; తోయజాతభవ = నీటిలో పుట్టిన (పద్మం) దానిలో పుట్టిన వాని (బ్రహ్మ) యొక్క; చిత్త = మనసును; వశీకరణ = వశీకరించు కోగల; ఏక = అసహాయ శూర; వాణి = వాక్కు గలామె; కిన్ = కి; వాణి = సరస్వతీదేవి; కిన్ = కి; అక్ష = స్పటికముల; దామ = మాల; శుక = రామ చిలుక; వారిజ = తామర పువ్వు; పుస్తక = పుస్తకము; రమ్య = అందంగా; పాణి = చేత ధరించి నామె; కిన్ = కి.

భావము:- నేలకు నెన్నుదురు తాకేలా సాగిలపడి మ్రొక్కి, సైకత శ్రోణీ, చదువులవాణీ, అలినీలవేణీ ఐన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని; కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని; ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ తల్లిని సదా సంస్తుతిస్తాను.


పోతనామాత్యుల యొక్క సరస్వతీ భక్తిని ఎంత కొనియాడినా తక్కువే,ఎప్పుడు ఆయన సరస్వతీ స్తుతి చేసినా అమోఘం అద్భుతం అనితర సాధ్యం అన్నట్టు ఉంటాయి పద్యాలు.ఆ పద్యాలు చదువుకున్నప్పుడల్లా ఆ పద్యాల లో ఉండే భక్తిభావం, వారు చేసిన అమ్మవారి దర్శనం ఎటూ నావంటి అల్పునకు అసంభవం కానీ , కనీసం వాటి గురించి మట్లాడడానికి కైనా నాకున్న అర్హత ఏమిటి అనిపిస్తుంది ? మహాత్ములు , మహాభక్తులైన వారి భక్తికి ప్రణమిల్లి వారుచూపిన బాటలో వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి .

 

సరే ఇహ ఈ పద్యం యొక్క భావానికి వద్దాం.

 అసలు ప్రారంభం చేస్తూనే “నా నుదురు నేలకి తాకించి నమస్కరిస్తున్నాను” అంటూ ప్రారంభంచేసారు పోతనామాత్యులు.ఎవరికి చేస్తున్నారయ్యా అటువంటి నమస్కారం ? అంటే,ఆయనే చెప్తున్నారు , నల్లని అందమైన శిరోజములు కలిగి,అక్షమాల(రుద్రాక్షమాల),చిలుక,పద్మము మరియు పుస్తకములను చేతుల యందు ధరించు తల్లికి , వాణికి ,దేవతలను రక్షించు తల్లికి,చతుర్ముఖ బ్రహ్మగారి హృదయేశ్వరికి ,సరస్వతీ దేవికి నా నుదురు నేలకి తాటించి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను అంటూ చెప్పుకొని పొంగిపోయాడు ఆ మహానుభావుడు.

మధుర భాగవత మహాకావ్యకర్త బమ్మెర పోతనామాత్య కృత సరస్వతీ దేవిస్తవం ఇది. చదువుల తల్లిని కావ్యారంభాన స్మరించాడు. నమస్కార స్మరణలో ఎన్ని విశేషాలో!

(ఇక్కడ పాఠాతరం ఉన్నది అందుకే పద్యం మళ్ళీ వ్రాశాను)

క్షోణితలంబు నెన్నుదురు సోకగమ్రొక్కి నుతింతు సైకత

శ్రొణికి జంచరీకచయసుందరవేణికి రక్షితామర

శ్రేణికి దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్

వాణికి నక్షదామశుకవారిజ పుస్తకరమ్యపాణికిన్


నెన్నుదురు సోక అంటే నిండైన నుదురు భూమికి తాకించి మొక్కుతానన్నాడు. ఇది సాష్టాంగ నమస్కారం. కరచరణ యుగము నురము నొసలు, భుజములు, ధరణి సోక మొక్కగ లేదా!” అని అష్ట అంగములను త్యాగరాజస్వామి నమస్కార సమయాన భూమికి తాకించాలన్న సంప్రదాయం జ్ఞప్తిచేసాడు. సైకత శ్రోణి మరొక విశేషణం. ఇసుక తిన్నెల వంటి పిరుదులని. విశాల జఘనములని. ఇది విజ్ఞాన సంకేతం. విజ్ఞానం విశాలం, గోపనీయం, ఎంత ఎరిగినా ఒదిగి ఉండటం గోపనీయత. చంచరీక చయ అనగా తుమ్మెద సమూహం వంటి అందమైన కురులు కలది. తుమ్మెదలు పువ్వు పువ్వుకు తిరిగి మకరందం సాధించినట్టు జ్ఞానతృష్ణతో గ్రంథాలు శోధించమని సంకేతం. శిరోజాలు తలలోని విజ్ఞానానికి పుట్టిన ఆలోచనలకు సంకేతం. స్థూలదృష్టిలో స్త్రీ సౌందర్యం. సూక్ష్మదృష్టికి విజ్ఞాన సంకేతాలవి.


రక్షిత + అనత శ్రేణికి = వినయంతో ఒదిగి ఉండి చదివే విద్యార్థినీ విద్యార్థి సమూహానికి రక్షకురాలు. తోయజాత భవ చిత్తునకు వశీకరణ చేయగల ఏకవాణి. అనగా వశీకరణ చేయగల ఏకైక వాక్కు కలదని, తన వాక్యాలతో బ్రహ్మను వశం చేసుకోగలదని. బ్రహ్మను అనగా భగవంతుని వశం చేసుకోవడం వాక్కుకుసాధ్యం కాదు కదా! “యతో వాచో నివర్త్యంతే అప్రాప్య మనసాసహ” (వాక్కు, మనస్సు భగవంతుని, బ్రహ్మమును, పొందలేక తిరిగి వచ్చాయి) అని కదా ఉషనిషత్సూక్తి! కాని ఇక్కడ విజ్ఞానరూపిదేవిని మనం వశం చేసికొంటే బ్రహ్మ వశమవుతాడని. అంటే అర్థమవుతాడని, పొందగలమని అంతరార్థం. వాక్కుతో సభ వశీకరణమవుతుంది కదా! సమాజం వశమవుతుంది కదా!


వాణికి అంటే సరస్వతీదేవికి వాగ్రూపియైన దేవతకని సంకేతార్థమే.


అక్షదామం (స్ఫటిక జపమాల), శుక = చిలుక, వారిజ = పద్మం, పుస్తక = గ్రంథం చేతిలో గల రమ్యపాణి = అందమైన చేతులు కలది, లేదా పై వాటిని పట్టుకోవడంతో చేతులు అందమైనాయని, ‘పుస్తకం హస్త భూషణం” అని ఆర్యోక్తి కదా!


అమ్మ చతుర్భుజి. నాలుగు చేతులు నాలుగు ఋగ్యజుస్సామా ధర్వణాలు. తల్లివేద స్వరూపిణి. వేదస్థాపిత బ్రహ్మమును అర్థం చేసికొనే విద్యాధిదేవత అని సంకేతం. ఒకచేత పుస్తకం. ఇది ధర్మానికి సంకేతం. ధర్మానికి గ్రంథాలుగా ఉంటాయి. పూర్వవుజులు ఆచరించిన, నిశ్చయించిన, లిఖించినట్టివి. శుకం మరోచేత ఇది కామానికి సంకేతం. సౌందర్యవతి


స్త్రీ శుకరూపం. శుకం మన్మథవాహనం. భోగానికి గుర్తు. వారిజం మరోచేత. ఇది అర్థ సంకేతం. లక్ష్మీదేవి వారిజభవ. అక్షదామం (స్ఫటిక) శుద్ధమోక్షానికి సంకేతం. మోక్షార్థులు జపనిష్టులు. జపనం, భగవన్నామాధ్యానైక చిత్తానికి సోపానం, జపగణనకు అక్షమాల. ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు దేవి సంకేతరూపం. ఉపాసనా రూపం.

ఆ అర్థాలే పద్యం నిండా పరచుకొన్నాయి. పోతన్నవాణి సుమధుర, అష్ట ‘ణ’ కారయుత శోభిత అనుప్రాస ప్రియకవిత

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ప్రతి స్మృతి*

 *ప్రతి స్మృతి*


ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో ఒకనాడు వ్యాసులవారు ధర్మరాజు వద్దకు వచ్చి వారికి *ప్రతిస్మృతి* విద్యను నేర్పించారని, దానిని అర్జునునికి తెలియపరిస్తే వారికి దివ్య అస్త్రాలు సాధించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 


ఆశ్చర్యకరంగా, వ్యాసుల వారు ప్రతిస్మృతి శాస్త్రం గురించి ఏమీ వెల్లడించలేదు, అది అర్జునుడి కోరికను నిజం చేసుకోవడానికి సహాయపడుతుందని మాత్రమే చెప్పారు. ఇంతకు మించి ఆ సందర్భంలో ఎటువంటి వివరాలు కానరాదు. 


నేను స్వయాన అనుకోవడం *ప్రతిస్మృతి* అంటే ఒక వ్యక్తి గతంలో తెలుసుకున్న లేదా అనుభవించిన విషయాలను మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం లేదా జ్ఞాపకం చేసుకోవడం, ఆ జ్ఞాపకశక్తిని ఉపయోగించడం. మహాభారతంలో, ప్రతిస్మృతి అనేది ఒక ప్రత్యేకమైన జ్ఞానమని, దీని ద్వారా అర్జునుడు తన గత అనుభవాలు, జ్ఞానాన్ని ఉపయోగించి దేవుళ్ళను మెప్పించడానికి ప్రయత్నించాడని విదితమవుతుంది. ఇది మన అవగాహనే కాని వ్యాసులవారు ప్రతి స్మృతి గురించిన మరిన్ని వివరాలు ఇచ్చినట్టు మహాభారతంలో ఎక్కడా పేర్కొనబడలేదు.


ధర్మరాజు వ్యాసులవారు చెప్పినట్టే దాన్ని అర్జునుడికే బోధించారు. అర్జునుడు ప్రతిస్మృతి సహాయంతో హిమాలయాలలో తపస్సు కోసం బయలుదేరి, కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడని, ఆ సమయంలో అతను శివుడి నుండి అంతిమ 'పాశుపత' అస్త్రాన్ని, మిగిలిన దేవతల నుండి దివ్యాయుధాలను పొందాడని మనందరికి తెలిసిన విషయమే. 


ఇక్కడ నా సందేహం ఏంటంటే ప్రతిస్మృతి ఏంటన్న విషయాన్ని పక్కన ఉంచినా (ఎవరికైనా ఈ వివరాలు తెలిస్తే ఇంకా గొప్ప విషయమే), వ్యాసులవారు ఆ విద్యను నేరుగా అర్జునునికే ఉపదేశించవచ్చును కదా, మధ్యన ధర్మరాజుకు చెప్పడం దేనికి? ఏవైనా protocol పాటించాలన్న అవసరం ఉన్నదా, లేదే మరి. ఇంకెందుకు అలా జరిగిందని. 


ఏదైనా సూక్ష్మమైన ఉపపత్తి (కారణం) కలదా, మరోటి, ఏవైనా కొత్త ప్రయోగం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు దాని వివరాలను ముందుగా చర్చించాలి కదా, వాటిని మరుగున పెట్టాల్సిన అవసరం ఏంటి, సంస్కృత మూలంలో ఈ విషయాన్ని ఎలా తెలియబరిచారో మరి.

జీవిత సత్యం*

 🙏 *


        🤘 *జీవిత సత్యం*👌


         మిమ్మల్ని బలవంతుల్ని చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతీ ఆలోచననూ తిరస్కరించండి.


 🏹 *నిత్య సత్యం* 🏑


        ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి..

మహాకవి బమ్మెర పోతనామాత్య*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🪷బుధవారం 6 ఆగస్టు 2025🪷*

                     2️⃣3️⃣

                 *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


   *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


          *చతుర్థ స్కంధం*

               

```

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. చతుర్థ స్కంధాన్ని డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారు అనువదించారు. చతుర్థ స్కంధంలో మైత్రేయుడు విదురుడికి స్వాయంభువ మనుపుత్రికల వంశ క్రమాన్ని తెలపడం దగ్గరనుంచి, నారదుడు ఉపదేశంతో ప్రచేతసులు ముక్తి పొందడం వరకు 30 అంశాలున్నాయి. క్లుప్తంగా ఆ 30 అంశాల వివరాలు వివరంగా:


మైత్రేయుడు విదురుడికి స్వాయంభువ మనుపుత్రికల వంశ క్రమాన్ని తెలపడం, స్వాయంభువ మనువుకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియ్యవతుడు, ఉత్తానపాదుడు అనేవాళ్లు జన్మించడం, వాళ్ళలో ఆకూతిని 'రుచి' అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం, ఆ రుచి ప్రజాపతికి ఆకూతి గర్భంలో విష్ణుమూర్తి అంశతో యజ్ఞుడు జన్మించడం, లక్ష్మి అంశతో 'దక్షిణ' అనే కన్య కలగడం, మనువు కుమార్తె దేవహూతిని కర్దముడికి ఇవ్వడం, ప్రసూతిని దక్షప్రజాపతికి ఇవ్వడం, దక్షప్రజాపతి సంతతి, ప్రసూతి-దక్షుల వల్ల ప్రజాపరంపరలు కలగడం, కర్ణమప్రజాపతి సంతతి, కర్ణమ ప్రజాపతి తన పుత్రికలను క్షత్రియులకు, బ్రహ్మర్షులకు ఇవ్వడం, కర్దముడి కూతురైన కళ వల్ల మరీచికి కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టడం పూర్ణిమకు గంగ అనే కూతురు, విరజుడు అనే కొడుకు కలగడం ఉన్నాయి.


ఇంకా: కశ్యప ప్రజాపతి వల్ల కలిగిన ప్రజా పరంపరల చేత మూడు లోకాలు నిండి పోవడం, అత్రి మహాముని తపస్సు, ఆయనకు త్రిమూర్తులు ప్రత్యక్షం కావడం, అనసూయాదేవి పాతివ్రత్య మహాత్మ్యం వల్ల ఆమెకు త్రిమూర్తుల అంశతో చంద్రుడు, దత్తాత్రేయుడు దుర్వాసుడు జన్మించడం, దక్షుడి కుమార్తెల జననం, భృగువుకు ఖ్యాతికి శ్రీమహాలక్ష్మి జన్మించడం, సత్రయాగంలో దక్షుడు శివుడిని నిందించడం ఉన్నాయి.


ఇంకా: ఈశ్వరుడికి-దక్షప్రజాపతికి విరోధం కలగడం, దక్షప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు దాక్షాయణి అక్కడికి వెళ్లడం, శివుడు వీరభద్రుడి ద్వారా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయించడం, అక్కడ నుండి పరాజితులైన దేవతలు బ్రహ్మకు విన్నవించడం, బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుడైన ఈశ్వరుడుని స్తుతించడం, ఈశ్వరుడు దక్షుడుని అనుగ్రహించడం, దక్షాదులు విష్ణువును స్తుతించడం, సతీదేవి హిమవంతుడికి జన్మించి శివుడిని చేరడం. ఉత్తానపాదుడి వృత్తాంతం ఉన్నాయి.


ఇంకా: ధ్రువోపాఖ్యానం, ధ్రువుడు నారదుడి ఉపదేశాన్ని గైకొని తపస్సు చేయడం, సాక్షాత్కరించిన భగవంతుడిని ధ్రువుడు స్తుతించడం, శ్రీహరి అతడి మనోరధాన్ని నెరవేర్చడం, ధ్రువుడు మళ్లీ తన పురానికి రావడం, ధ్రువుడు కుబేరుడి అనుచరులైన గుహ్యకులతో యుద్ధం చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ రాజ్యభోగాల పట్ల విరక్తి పొంది ఉల్యుడికి పట్టాభిషేకం చేసి ధ్రువుడు అంతరిక్షంలో నిలవడం, ఉల్కలుడు వత్సారుడు అనే కొడుకుకు పట్టం కట్టి హరిణి చేరడం, వత్సరుడి వంశపరంపర, అంగపుత్రుడు వేనుడి చరిత్ర, అర్చి పృథుల జననం, పృథు చక్రవర్తి గోరూపంలో ఉన్న భూమి నుండి ఓషధులను పితకడం, పృథు చక్రవర్తి అశ్వమేధం చేస్తుండగా ఇంద్రుడు అశ్వాన్ని అపహరించడం, ఆయనకు శ్రీహరి ప్రత్యక్షం కావడం, ఆధ్యాత్మ విద్యను ప్రభోదించడం ఉన్నాయి.


ఇవికాకుండా: నారాయణుడు ప్రసన్నుడై పృథు చక్రవర్తిని అనుగ్రహించడం, పృథు చక్రవర్తి సభాసదులకు సధర్మాలను ఉపదేశించడం, పృథు చక్రవర్తి దగ్గరకు సనకాదులు రావడం, పృథు చక్రవర్తి జ్ఞాన వైరాగ్యవంతుడై ముక్తిని పొందడం, రుద్రుడు ప్రచేతనులకు యోగాదేశం అనే స్తోత్రం చెప్పడం, రుద్రగీత-రుద్రుడు శ్రీహరిని స్తుతించడం, నారదుడు ప్రాచీనబర్తికి జ్ఞానమార్గాన్ని తెలియచేయడం, పురంజనోపాఖ్యానం, ప్రచేతసుల తపస్సుకు భగవంతుడు మెచ్చి వరాలివ్వడం, ప్రచేతసులకు మారిష వల్ల దక్షుడు జన్మించడం, నారదుడి ఉపదేశంతో ప్రచేతసులకు ముక్తి కలగడం ఈ చతుర్థ స్కంధంలో ఉన్నాయి.


ఇవన్నీ చదవగలగడం పూర్వజన్మ సుకృతం.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన:శ్రీ వనం* 

  *జ్వాలా నరసింహారావు*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷``


 *🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

బుధవారం🌷* *🪷06 ఆగస్టు 2025🪷*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌷బుధవారం🌷*

   *🪷06 ఆగస్టు 2025🪷*   

     *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : ద్వాదశి* మ 02.08 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : మూల* మ 01.00 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : వైధృతి* ఉ 07.18 వరకు ఉపరి విష్కుంబ 

*కరణం  : బాలువ* మ 02.08 *కౌలువ* రా 02.22 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*    

అమృత కాలం  : *ఉ 06.10 - 07.52*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం      : ప 11.17 - 01.00 & రా 11.00 - 12.40*

*దుర్ముహూర్తం  : ప 11.48 - 12.39*

*రాహు కాలం    : మ 12.13 - 01.49*

గుళికకాళం       : *ఉ 10.37 - 12.13*

యమగండం     : *ఉ 07.25 - 09.01*

సూర్యరాశి : *కర్కాటకం*  

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 05.57*

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.49 - 08.23*

సంగవ కాలం         :     *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.04*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 04.04 - 06.37*

ప్రదోష కాలం         :  సా *06.37 - 08.52*

రాత్రి కాలం           :*రా 08.52 - 11.51*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.05*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ సరస్వతీ కవచం🪷*


*ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై*

*స్వాహా చోష్ఠం సదాఽవతు.*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

   🌹🌷🪷🌷🪷🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - శ్రావణ మాసం - శుక్ల పక్షం -‌ ద్వాదశి - మూల -‌‌ సౌమ్య వాసరే* (06.08.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

5, ఆగస్టు 2025, మంగళవారం

శ్రీ వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

 🌸🌸🌸🌸🌸

శ్రీ వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి


పసుపు

కుంకుమ

గంధం

విడిపూలు

పూల మాలలు

తమలపాకులు 30

వక్కలు

ఖర్జూరములు

అగర్బత్తి

కర్పూరము

చిల్లర పైసలు Rs. 30/- ( 1Rs coins )

తెల్ల టవల్

బ్లౌస్ పీసులు

మామిడి ఆకులు

అరటిపండ్లు

ఇతర రకాల పండ్లు

అమ్మవారి ఫోటో

కలశానికి చెంబు

కొబ్బరి కాయలు 3

తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం

స్వీట్లు

బియ్యం 2 kg

కొద్దిగా పంచామృతం లేదా ఆవు పాలు

ఇంట్లో ఉండే పూజా సామాగ్రి కూడా సిద్దం చేసుకోవాలి

దీపారాధన కుందులు

గంట

హారతి

ప్లేటు

స్పూన్స్

ట్రేలు

నూనె

వత్తులు

అగ్గిపెట్టె

గ్లాసులు

బౌల్స్

తెనాలి రామకృష్ణుని కీర్తివైభవం!!

 శు భో ద యం 🙏


తెనాలి రామకృష్ణుని కీర్తివైభవం!!


లింగనిషిధ్ధుకల్వలచెలింగని,మేచకకంథరున్ త్రిశూ

లింగని సంగతాళిలవలింగని,నీలకచన్విధాతృనా

లింగని,కృష్ణదేవునిహలింగని,కర్దమదూషితన్ మృణా

లింగని, 'రామకృష్ణకవిలింగని కీర్తి'హసించు దిక్కులన్;

                             - చాటువు.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నల్లనయ్యకై గోపికల యన్వేషణము

 శు భో ద యం 🙏


నల్లనయ్యకై గోపికల యన్వేషణము


          

 ఉ: నల్లనివాఁడు పద్మ నయనంబులవాఁడు కృపారసంబు పై


                 జల్లెడువాఁడు మౌళి పరిసర్పిత ఫింఛమువాఁడు నవ్వురా


                జిల్లెడు మోమువాఁడొకఁడు చెల్వల మాన ధనంబుఁదెచ్చె నో


                మల్లియలార ! మీ పొదల మాటున లేఁడు గదమ్మ! చెప్పరే?


                   భాగవతము-- దశమస్కంథము--1010 వ:పద్యం: బమ్మెఱ పోతన మహాకవి.


                     


                          భక్తిని శృంగారాన్ని మిళితం చేసి ,దానికి 'మధుర భక్తి ' యనేసంకేతాన్ని పొందేలా మనోజ్ఙంగా మధుర మధురంగా గోపికా కృష్ణుల ప్రణయాన్ని చిత్రించాడు పోతన కవి. ఏమా కృష్ణుడు? ఒకచో తుంటరి .మరియొకచో భక్త రక్షణాపరాయణుడు.కొండొకచో దుష్ఠ సం హారి.వేరొచోరాసవిహారి. అతనిలీలలనుపమానముములు.


                         పాపమామా వెర్రిగొల్ల పడుచులు ఆయన ప్రేమలో చిక్కుకున్నారు. తలస్పర్శిప్రణయమున మునిగిన వారికి కృష్ణయ్య యెడబాటు. మిగుల దుర్భరమైనది. కంసుని పనుపున కృష్ణుడు మధురకేగినాడు. వచ్చుటకు తడవైనది. ఆవిరహమునోర్వజాలక గోపికలు బృందావనమునకు బరువెత్తినారు. కృష్ణుడెందైన దాగియున్నాడేమోనని వారిభ్రమ. చెట్టును పుట్టను గుట్టను కృష్ణుని జాడదెలుప గోరుచున్నారు. 


                                ఆసందర్భములోనిది యీపద్యరత్నము! ఎవరిజాడ గోరెదరో వారిరూపురేఖలను చెప్పవలసియుండునుగదా!

గోపికలు మల్లెపొదల కడకేగి ఆపనియే చేయుచున్నారు.


                         " ఓమల్లియలారా! నల్లనిమేనివాడు .తామరలవంటి విశాలనేత్రములుగలవాడు ,దయావర్షమునుగురియు వాడు ,నెమలిపింఛమును శిరమున ధరించువాడు, నగుమోముతో నొప్పువాడు.అగు దొంగయొకడు వనితామానధనమును కొల్లగొని

యిటువచ్చినాడు. వాడేమైన మీపొదల మాటున లేడుగదా! చెప్పుడు? -- అంటున్నారు. 


                    అసలు చెట్లనడగటం యేమిటి? ఉన్మాదం. విరహంలోకూడా ఉన్మాదం వస్తుంది. అదిగో విరహాధిక్యతచే వారంతా ఉన్మాదులయ్యారు. అందుచేత వారికి యెవరిని యడుగు చుంటిరో తెలియుపరిస్థితికాదు. అయినను కృష్ణుని ఆకారమును గుణములను చక్కగాచెపుతున్నారు. ఇదినిరంతరము కృష్ణదర్శనముచేత వారికి గలిగిన జ్ఙానము. 


                            నీలమేఘ శ్యాముడై విశాలనేత్రుడై దయాప్రవర్షియై శిఖిపింఛమౌళియై సుందర దరస్మిత వదనుడై యొప్పు నల్లనయ్య గోపవనితా మానస చోరుడగుట విచిత్రముగదా!చివరకు గోపికలకడ నతడు దొంగయైనాడు. ఆహా !కృష్ణయ్యా! ఏమినీమాయ? ఏమినీలీలలు? విన్నంతనే పులకితులమగుచుంటిమే , నిను గని నీసన్నిధి ననుభవించిన గోపిక లెంతధన్యలో?

మనసార నిను వర్ణించిన మాపోతనకవీంద్రుడు ధన్యతముడనుటయదార్ధమే!


                                                                      స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷