25, సెప్టెంబర్ 2025, గురువారం

చతుర్ధావస్థ

చతుర్ధావస్థ  

మోక్షార్ధులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది. ప్రతి సాదారణ మానవుడు తన దైననందికే జీవితంలో మూడు అవస్థలలో జీవితాన్ని గడుపుతాడు.కేవలం జ్ఞాని మాత్రం నాలుగవ అవస్థను పొందగలుగుతాడు దానిని తురీయావస్థ లేక సమాధి స్థితి అని అంటారు. ముందుగా  ఈ మూడు అవస్థలలో ఆత్మ జీవునితో (మానవునిలో) ఎలా ఉంటుంది.అది చూద్దాము  అవి ఏమిటంటే 

1) జాగ్రతావస్థ 

మనం నిత్యం నిద్రలేచినప్పడి నుండి మరల నిద్రించే వరకు ఈ స్థితిలోనే ఉంటాము జాగ్రత్తావస్థలో ఆత్మా శరీరంలో ఉంది ఈ చరాచర జగత్తుతో సంచరిస్తూ ఉంటుంది. దశ ఇంద్రియాలు (5 జ్ఞానేంద్రియాలు, 5కర్మేంద్రియాలు) తేజోమయంగా (active )గా ఉండి ఐహిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. అంటే కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, చర్మం స్పర్శ కలిగి ఉంటుంది. జిహ్వ రుచుల చూస్తూ ఉంటుంది. అంటే దాని అర్ధం అవి అన్ని ఒక్కసారి వాటి పనులు చేస్తాయి అని కాదు. వీటి అవసరం వచ్చినప్పుడు అవి చురుకుగా వాటి పనులు నిర్వహిస్తూ వున్నాయి అన్న మాట. ఒక దృశ్యాన్ని చూడాలంటే కళ్ళు చూడగలవు.  అవి చుసిన విషయాన్నీ మనస్సు ద్వారా చెతన్య స్వరూపమైన ఆత్మకు చేరవేయగలవు. అనుకుంటే తాత్కాలికంగా కళ్ళు మూసుకొని కొంత సమయం చూడటం అనేది చేయకుండా ఉండవచ్చు. మరల కావాలంటే కళ్ళు తెరుచుకొని చూడగలవు. అంటే పాటిది మనస్సు నిర్వహించగలదు. అలాగే ముక్కు, చెవి కూడా చేయగలవు. అలాగే కర్మేంద్రియాలు కూడా వాటి వాటి కర్మలను అంటే ఇవి కూడా  ఐదు రకాలు:అవి  వాక్కు (మాట్లాడటం), పాణి (చేతులు), పాదం (కాళ్లు), పాయువు (మలద్వారం), మరియు ఉపస్థ (అంగం). జ్ఞానేంద్రియాల వలె కాకుండా, కర్మేంద్రియాలు మన పనులు, కదలికలు, మరియు శారీరక కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ఈ పది ఇంద్రియాలు జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఈ అవస్థను జాగ్రదావస్థ అని పేర్కొన్నారు. జాగ్రత్తవస్థలో వున్న ఆత్మ మొదటి పాదంగా తెలియవడుతున్నది దీనికి వైశ్వానరుడు లేక విసుడు అని పేరు ఎందుకంటె ఇక్కడ ఆత్మ విశ్వముతో సంయమం కలిగి ఉన్నందున ఈ పేరు వచ్చింది

2) నిద్రావస్థ లేక సుషుప్తావస్థ 

జాగ్రత్తవస్థలో  రోజంతా శారీరిక వ్యాపారాలు చేసిన ఆత్మా విశ్రాన్తి తీసుకునే అవస్తే నిద్రావస్థ లేక సుషుప్తావస్థ ఈ స్థితిలో మనస్సు లయమై ఉంటుంది. నిద్రలో చాలామటుకు శరీరం చేష్టలు లేకుండా ఉంటుంది. అంటే ఇంద్రియాలు వాటి పనులు చేయవు. కానీ ఆత్మ మాత్రం జాగృతంగానే ఉంటుంది ఈ స్థితిలో వున్నా ఆత్మ పాదాన్ని ప్రాజ్ఞుడు గా పేర్కొన్నారు.  

ప్రాజ్ఞుడు అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు...
(i) ప్ర+అజ్ఞ = ప్రాజ్ఞ : అంటే గొప్ప అజ్ఞానం అని. ఈ సుషుప్తిలో ఏమీ తెలియదు. నీవెవరో తెలియదు. ఎక్కడున్నావో తెలియదు, నీ భార్యబిడ్డలు ఎవరో తెలియదు. అసలు నీవున్నావో లేవో తెలియదు. అందుకే గొప్ప అజ్ఞానం అనే అర్థం బాగా సరిపోతుంది.
(ii) ప్రా+జ్ఞ = నిరుపయోగమైన జ్ఞానం అని. జ్ఞానం అనేది బయటి ప్రకృతి నుండి జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సుకు చేరుతుంది. తర్వాత బుద్ధికి చేరుతుంది. ఇది జాగ్రదవస్థలో సర్వసాధారణం. అయితే సుషుప్తిలో ఈ జ్ఞానం అనేది మనోబుద్ధుల నుండి, ఇంద్రియాల నుండి ఉపసంహరించబడుతుంది. అంటే అవి జ్ఞానంతో పనిచేయవు. ఏమైందీ జ్ఞానం.. అది మూటగట్టబడి, సీల్ వేసి ఒక మూలన పెట్టినట్లు అవుతుంది. అందువల్ల ఇది నిరుపయోగంగా ఉన్న జ్ఞానం అవుతున్నది. అందుకే ప్రా+జ్ఞ అనేది సరిపోతుంది.
ఇంతకీ ఈ ప్రాజ్ఞుడెవరు? ఆత్మయే - జీవుడే. ఆత్మయా? జీవుడా? ఆత్మయే ఇంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యంలో ఉన్నంత కాలం ఆత్మను జీవుడు అంటారు. ఆ జీవుడే జాగ్రదవస్థలో విశ్వాన్ని చూచే విశ్వుడు. . ఆ జీవుడే సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉన్న ప్రాజ్ఞుడు. 
3) స్వప్నావస్థ  
మానవుడు నిద్రావస్థలో వున్నప్పుడు నిద్రలో కొంత సమయం స్వప్నాన్ని కంటాడు. ఈ స్వప్నం అనేది జీవుడు సృష్టించుకున్న ఒక అవస్థ ఈ అవస్థలో ఇంద్రియాలు పనిచేయవు కానీ ఇంద్రియ వ్యాపారాలు గోచరిస్తాయి అదెలా అంటే తన స్వప్నంలో ఒక సుందరమైన దృశ్యాన్ని చూస్తాడు ఒక చక్కటి ఉద్యానవనంలో పూల సుగంధాన్ని అనుభవిస్తాడు, చక్కటి భోజనాన్ని ఆరగించి వాటి రుచులు అనుభవిస్తాడు. అన్ని ఇక్కడ పంచేంద్రియాలు లేవు కేవలం అనుభూతి మాత్రమే వున్నది. ఈ సుషుప్తిలో జీవుడు ఎక్కడ ఉండి తన కార్యకలాపాలు సాగిస్తాడు.. అంటే హృదయస్థానంలో ఉండి. విత్తనంలో కొమ్మలు, పూలు కనిపించకుండా ఉన్నట్టు సుషుప్తిలో జగత్తు కనిపించకుండా ఉంటుంది.ఆ జీవుడే స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్న తైజసుడు..
మనం ఇక్కడ ఆత్మను మూడు అవస్థలాల్లో మూడు రకాలుగా అంటే  వైశ్వానరుడు, ప్రాజ్ఞుడు, తైజసుడు. అని మూడు ఆత్మలుగా ఉన్నాయా అంటే కనే కాదు. కానీ ఇవి మూడు వేరు వేరు పాదాలుగా చెపుతున్నాము. అది ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక ఉదాహారణ చూద్దాము. ఒక మనిషి తన భార్యకు భర్త అంటే తానూ ఇంట్లో వున్నప్పుడు ఒక భర్తగా తన భార్యను చూసుకుంటాడు. అదే మనిషి ఆఫీసులో ఒక ఆఫీసరుగా తన భాద్యతలను నిర్వహిస్తాడు. మరి తన పిల్లల ముందు ఒక తండ్రిగా తన భాద్యతలను నిర్వహిస్తాడు నిజానికి అతను ఒక సాధారణ మానవుడు కానీ ఒక్కొక్కళ్ళ వద్ద ఒక్కొక్క బాధ్యత నెరవేరుస్తూ జీవితాన్ని గడుపుతాడు. అదేవిధంగా ఆత్మ ఒక్కొక్క అవస్తలో ఒక్కొక్క పాదాన్ని కలిగి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. 
4)  తురీయ అవస్థ
ఇప్పటివరకు చెప్పిన అవస్థలు సాధారణముగా మన అందరికి అనుభవంలో వున్నవి. కానీ చెతుర్ద అవస్థ మాత్రం  కేవలము జ్ఞానులు మాత్రమే పొందగలరు. దీనిని తురీయ అవస్థ లేక సమాధి స్థితి అని అంటారు. నిద్రావస్థలో స్వప్నావస్త వస్తుందని నాకు తెలుసు. అదేవిధంగా ఈ తురీయ అవాస్ట్ జాగ్రదావస్థలోనే వస్తుంది. అంటే ఇక్కడ ఆత్మ ఆత్మలో సంయమం చెంది ఉంటుంది. అంటే జాగ్రదావస్తలో వున్నా కూడా ఆత్మ విశ్వనరుడుగా ప్రవర్తించాడు అంటే బాహ్య ప్రపంచ జ్ఞానం కలిగి ఉండదు. మెలకువతో వున్నా కూడా ఈ ప్రపంచంతో సంబంధము లేకుండా సాధకుడు ఉంటాడు. ఒక అద్వితీయమైన అనుభూతితో వుంది ఆత్మానుభవం కలిగి ఉంటాడు. అట్టి స్థితే మోక్ష స్థితి. అది కేవలం ఎంతో సాధనచేసి ఆత్మ పరిపక్వత సిద్దించుకుంటే మాత్రమే కలుగుతుంది. ఈ స్థితిలో ఆత్మ నాలుగవ పాదమైన తూరీయుడుగా పిలువబడతాడు. ప్రతి సాధకుడు అత్యంత కఠోర సాధన చేసి చివరకు ఈ స్థితిని చేరుకుంటాడు. 
మనకు అత్యంత శక్తివంతమైన సూక్ష్మమైన జ్ఞానాన్ని ప్రసాదించిన మహర్షులు సదా స్మరణీయులు.

 



ఎంతటిపుణ్యమో

 శు భో ద యం 🙏


"ఎంతటిపుణ్యమో శబరియెంగిలిఁగొంటివి వింతగాదె నీ

మంతన మరయఁగా,యుడుత మైని కరాగ్రనఖాంచలమ్ములన్

సంతసమందఁజేసితివి;సత్కులజన్మములేమిలెక్క?వే

దాంతముగాదె,నీమహిమ!దాశరధీ కరుణాపయోనిధీ!

- కంచెర్ల గోపన్న.


    భగవంతుని లీలలు అనుాహ్యములు.శబరి భిల్లకాంత,పండుముదుసలి.ఆమెయొసగిన యెంగిలి పండ్లను ముదమారగ నారగించి ఆమెకు మోక్షము నొసంగెను.

  సేతుబంధనసమయమున ఉడుత చేయు సాయమును పరికించి పులకితుడై దానివీపున తనకరాగ్రముననిమిరెను.కరుణార్ద్రములైన స్వామి చేతిచిన్నెలు ముచ్చటగొలుపు చారలుగా నాజాతికి దఖలు పడినవి.

     ఏమిది?స్వామి తనభక్తులపట్ల చూపు కారుణ్యమునకు హద్దులులేవు.చిన్నపెద్దలను తారతమ్యములు లేవని తెలియజెప్పుటగదా?

       రామా! నీమహిమ వేదాంతమయ్యా!మాటలకందదు.

                   స్వస్తి!!!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నవరాత్రి వేడుకలు

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹విజయ దశమికి ముందు పది రోజుల పాటు ప్రతి ఇల్లు అమ్మవారి ఆలయంలా మారిపోతుంది. అన్ని ఇళ్లు ఆ జగన్మాత అర్చనలతో కళకళలాడుతూంటాయి. హైదరాబాద్ గాంధీ నగర్ లోని శ్రీమతి దేవులపల్లి దుర్గ గారి మిత్రబృందం నిర్వహించిన నవరాత్రి వేడుకలు ఈ ఎపిసోడ్ స్పెషల్. అమ్మవారి స్తోత్రాలు వీనుల విందుగా ఆలపించారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🌹

23, సెప్టెంబర్ 2025, మంగళవారం

ఏడువారాల నగల గురించి

 ఏడువారాల నగల గురించి సంపూర్ణ వివరణ -


 *  ఆదివారమునకు సూర్యుడు అధిపతి. అతని లోహము బంగారము , రత్నము మాణిక్యం. మాణిక్యమును శిరోభూషణములలో తప్పక పొదుగుదురు. తిరుపతి వేంకటేశ్వరునకు బొడ్డునందు మాణిక్యం ఉండును.

       

.  ఈనాడు రవ్వలు పొదగని శుద్ద స్వర్ణాభరణములు లేదా నిజమైన మాణిక్యములు దొరుకుట దుర్లభము కనుక లేత ఎరుపు గల రవ్వలు తాపడం చేసిన ఆభరణములు ధరింపవలెను.


 *  సోమవారమునకు చంద్రుడు అధిపతి. అతని లోహం వెండి , రత్నము ముత్యం కనుక సోమవారంనాడు చంద్రహారముతో పాటు ముత్యాలదండలు , శంఖం మరియు ముత్యపు చిప్పలతో చేసిన నగలు , వెండి తీగలతో అల్లిన తావళములు , వెండి దండ కడియములు , ముంజేతి కడియములు ధరించవలెను .

 

*  మంగళవారమునకు కుజుడు అధిపతి. అతని లోహం రాగి , రత్నము పగడము కనుక ఈనాడు పగడాల దండ , ముదురు ఎరుపురంగు గల రవ్వలు పొదిగిన తాటంకములు , పతకములు మెదలైనవి. రాగితీగలతో అల్లిన ఆభరణములు , రాగి కడియాలు ధరించవలెను .

 

*  బుధవారమునకు బుధుడు అధిపతి. అతని లోహము కంచు. రత్నము పచ్చ. పచ్చలలో ఆకుపచ్చ , చిలకపచ్చ అని రెండు రకములు కలవు. వానిలో దేనినైనా ధరించవచ్చు . పూర్వము పచ్చలదండలు ప్రసిద్ది. వెండిలేదా బంగారంతో వేపకాయ పూసలు చేయించుకుని వానిని పచ్చల నడుమ గ్రుచ్చుకొని ప్రతివారు ధరించేవారు.

              

. ఈనాడు కంచు పూసలు , కడియములు , ఉంగరములు లేదా పచ్చలు పొదిగిన పోగులు , పతకాలు , కడియాలు ధరించవచ్చు .


 *  గురువారమునకు బ్రహస్పతి అధిపతి. అతని లోహము ఇత్తడి , రత్నము పుష్యరాగం . గురువారం నాడు ఇత్తడి లేదా వన్నె తక్కువ బంగారంతో చేసిన కడియంలు , ఉంగరములు , పూసలు మొదలైన నగలు లేదా పుష్యరాగములు పొదిగిన ఆభరణములు ధరించవలెను .

 

*  శుక్రవారమునకు శుక్రుడు అధిపతి. ఇతని లోహం తగరం , రత్నం వజ్రం  . శుక్రవారం నాడు తగరముతో పూసలు , గజ్జెలు మొదలైనవి ధరించవలెను . వెండితో చేసినవి అయినను ధరించవచ్చు . ఆర్ధికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారు వజ్రములు పొదిగిన ఆభరణములు ధరించవచ్చు .


 *  శనివారమునకు శనైచ్ఛరుడు అధిపతి. అతని లోహము ఇనుము , రత్నము నీలము . ఇనుమును ఆభరణాలకు ఉపయోగించరు కాని కొందరు కడియాల రూపములో ధరిస్తారు. నీలములలో రెండు రకములు కలవు. ఒకటి నీలం రెండొవది ఇంద్రనీలం . నీలము నలుపు రంగులో ఉండును. ఇంద్రనీలం బ్లూ రంగులో ఉండును. ఇందులో ఏదైనను ధరించవచ్చు . నీలాల ను చెవిపోగులలో , ముక్కెరలలో పొదుగుదురు .

          

.  స్త్రీలు ఆభరణములను ఈ విధముగా వారమును అనుసరించి గ్రహావివేకము కలిగి ఆయా లోహములతో చేసినవి గాని , ఆయా రత్నములు తాపడం చేసినవిగాని పుష్పములతో పాటు ధరించిన యెడల ఆయా గ్రహముల యొక్క క్రూరదృష్టి నుండి తొలగినవారై సుఖమును పొందుదురు.

                      

. గ్రహబలం చాలనప్పుడు ఆయా గ్రహములకు సంబంధించిన రత్నములను , లేదా జన్మరాశిని అనుసరించిన గ్రహములకు సంబంధించిన రత్నములను గాని ఉంగరము లేదా లాకెట్టుల యందు శాశ్వతముగా ధరించుట మంచిది . స్త్రీలకు ఎప్పుడైనను రంగురంగుల వస్త్రములు ఇష్టపడుచుందురు. కనుక వారు వారములను అనుసరించి ఆది , మంగళవారముల యందు ఎరుపు రంగు , సోమ , శుక్రవారముల యందు ఆకుపచ్చ రంగు , గురువారం నాడు పసుపురంగు , శనివారం నాడు నలుపు లేదా నీలపు రంగు గల చీరలను ధరించిన యెడల వారు ఆయా గ్రహములను ఆరాధించినట్టుగా అగును. ఆ రోజుల్లో చీర అంతయు ఆరంగు లేకున్నను దాని అంచు అయినను ఆ రంగు కలదిగా చూచుకొని ధరించుట మంచిది . అదేవిధముగా గృహము వాకిళ్ళలో కూడా వారమును అనుసరించి ఆయా రంగులతో ముగ్గులను వేయుచున్న ఆ గృహమునకు శోభ కలుగును.  


. సంపూర్ణం 



 మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 



గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*

 *ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*



బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు

తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి

శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.

లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం.

మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా

పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు.

ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు.

అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి..

నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు,

అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు

తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో

*నాన్నగారూ..నాన్నగారూ* అంటూ పిలిచాడు.

సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా..

*మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది*

అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి..

ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో

ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం

వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో

శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి,

శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు..


*మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా*

*నియమిస్తున్నాము* అని నియామక పత్రాన్ని

ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు

వాటి వంక చూశాయి..కళ్ళనుంచి

నీళ్లు కారుతున్నాయి.పెదాలు వణుకుతున్నాయి.

ఏవో మాటలు వినిపిస్తున్నాయి.

ఏదీ అర్ధం కావడం లేదు.

ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది..


*స్వామీ! ఇన్నాళ్లకు నా మీద దయకలిగిందా?*

అంటూ..తన చేతనున్న వాటిని తడుముకుంటూ..

అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తూన్నాడు.

స్వామి వారి కరుణ లభించింది.ఇక తన

జీవితానికి విముక్తి లభించిందన్నట్లు మరో

పది నిముషాల తరువాత....

*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రాణాలు*

*అనంత వాయువుల్లో కలిసిపోయాయి!*

*అందరికీ అదో అద్భుతం,అనిర్వచనీయం!*


*ఎవరీ...రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*


శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు

30 వేలకు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు

అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై

చెక్కించారు. వాటిని స్వామి వారి ఆలయంలో

నిక్షిప్తం చేశారు. 20 శతాబ్దంలో ఆలయ

నిర్వహణప్పుడు..ఇవి బయటపడ్డాయి.

ఆ తాళపత్రాలను గ్రంధ రూపంలోకి తెచ్చి,..

"జో అచ్యుతానంద..జోజో ముకుందా"

అని మనం పాడుకోగలుగుతున్నామంటే..

ఆ కృషికి కారకులు.. *వేటూరి ప్రభాకర శాస్త్రి* 

*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు!*


ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక..

అన్నమాచార్య ప్రాజెక్ స్పెషల్ ఆఫీసర్

కామిశెట్టి శ్రీనివాసులు..ప్రసాద్ గారితో..

*సర్! రేపు మీరు బెంగుళూరు వెళుతున్నారు.*

*రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం*

*అక్కడే ఉన్నారు. అన్నమయ్య కీర్తనలను*

*జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి*

*ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన*

*సమకాలికులకు అన్ని గుర్తింపులు లభించాయి.*

*కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది.*

*ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది!* అన్నారు.


పివిఆర్కే ప్రసాద్ చాలా సేపు ఆలోచించి

ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈ.ఓ.ని పిలిచి..

*ఉదయానికల్లా..రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని*

*ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం,*

*శ్రీవారి గోల్డ్ డాలర్,శాలువా, ప్రసాదం*

*అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు!*

డెప్యూటీ ఈ.ఓ.అవాక్కయ్యాడు.

*సర్! అలా నియమించే అధికారం మీ పరిధిలోనిది కాదు.బోర్డు ఓ కమిటీని* *నియమించి, ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే*

*బోర్డు నియమిస్తుంది. రూల్స్ కు విరుద్ధంగా అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. అవసరమైతే*

*మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు*

అన్నాడు..


అయినా ప్రసాద్ గారు వినలేదు.

*వెంటనే నేను చెప్పినట్లు చేయండి!* అన్నారు!

అలాగే అన్నీ సిద్ధం అయిపోయాయి.

అవి తీసుకుని బెంగుళూరు బయలుదేరారు

పివిఆర్కే ప్రసాద్ గారు. బెంగుళూరులో ఆఖరు

క్షణాలలో..వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం.

దాని కోసమే ఆయన ఎదురుచూస్తున్నట్లుగా..

ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన

స్వర్గస్థులవడం జరిగిపోయాయి!


టిటిడి బోర్డు మీటింగ్ హాలు..వాతావరణం

సీరియస్ గా వుంది. జరిగిందంతా చెప్పి

ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు.

*ప్రసాద్ గారూ - మీరు చేసినది చాలా పెద్ద తప్పిదం. రూల్స్ కు విరుద్ధం* అన్నాడో సభ్యుడు.

*మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడానికి ఇక బోర్డు ఎందుకు?* అన్నారు మరొకరు.

ఎవరికి తోచింది వారు మాట్లాడారు. చివరిలో

అందరూ చైర్మన్ నాగిరెడ్డిగారి వంక చూశారు.

ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు!

*స్వామి వారికి బోర్డు చైర్మన్ నుండి..సాధారణ యాత్రికుడి వరకూ అందరూ *సమానం. ఆయన సమస్త జీవరాసులను సమానంగా ప్రేమిస్తాడు.*

*ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఆదుకోవాలో అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు. ఆయన లీలలు అలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని*

*జీవన చరమాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్*

*గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు*

*పంపించాడేమో? అని నేను భావిస్తున్నాను.*


*ఈ రూల్సు అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు.*

*రాళ్లపల్లివారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం*

*అప్పుడు జరగలేదు.ఇప్పుడు మనకు భగవంతుడు*

*కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను!*

*ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను!*

అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డిగారి

తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.


ఎన్నో చిత్రాలలో..కథలను మలుపులు తిప్పి,

ఉత్కంఠ రేకెత్తించి, ముగింపులో ఓ సందేశంతో

ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత

నాగిరెడ్డిగారు..ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో

ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మనసులోనే

కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు!


*(నాహం కర్తా హరిః కర్తా నుంచీ...వేంకటేశ్వరార్పణమ్)*

కావమ్మ మొగుడు

 *_“కావమ్మ మొగుడు.. అంటే కామోసు అనుకున్నాను... 😁😁😁”_*

_(భలే సరదాగా ఉంటుంది.. చదవండి)_

*=================*


*దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో CM NTR ‌ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ:*


*ఒక ఊళ్ళో వైశ్య దంపతులు తమ కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడి రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు.*


*రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్‌ తో సహ సభ్యులందరూ నవ్వారు. తరువాత ఎన్‌టిఆర్‌ తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు.*


*మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్‌ గ్రోత్‌ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు– నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు... అని ముక్తాయించారు రోశయ్య.*


*ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది.*


*పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?. దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు.*


*అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం.🤝*

*_{ఇదిసేకరణే : --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

22, సెప్టెంబర్ 2025, సోమవారం

తండ్రిని పూజించే(గౌరవించే) కొడుకు,



               మానవజీవన సాఫల్యానికీ, వైఫల్యానికీ, అతనిననుసరించే వారిసహకారంమేకారణమౌతుంది. యెలాంటివారుమనకుచేరువగాఉంటే మేలో అలాటివారుదొరకాలంటే యేంచేయాలోవివరించాడు, భర్తృహరి యనేముని. విందాంయేమంటాడో! 


చ: జనకుని పూజలం గడు బ్రసన్నుని జేయునతండు బుత్రు, డే

     వనిత మెలంగు భర్తృవశవర్తినియై యది సత్కళత్ర , మే

      జనుడు విపత్తి సౌఖ్య సదృశక్రియు డాతడు మిత్రు,డీత్రయం

       బును లభియించు లోకమున పుణ్యము జేసిన యట్టి వారికిన్;


               తండ్రిని పూజించే(గౌరవించే) కొడుకు, చెప్పినమాటవినేభార్య,కష్టసుఖాలలో ఒక్కటిగా పరిగణించిమనవెంటనడచేమిత్రుడు.ఈమూడులోకంలోపుణ్యంచేసికొన్నవాడికిలభిస్తాయట!


                 తండ్రంటేగౌరవంలేనికొడుకు కుటుంబానికిచేటు.యెడ్డెమంటే తెడ్డెమనే భార్యఉంటే ఆయిల్లుప్రత్యక్ష నరకమే, నిత్యంకలహాలకాపురమే,కాబట్టి చెప్పినమాటవినేభార్య లభించటం అదృష్టమే! ఉన్నప్పుడుమనతోసుఖాలనుభవించి,మనంకష్టాలలోఉంటేదూరంనుండేతొలగిపోయేమిత్రుడుమిత్రుడుకాడు.అలాకాక కష్టసుఖాలలోపాలుపంచుకుంటూనిరంతరం మనవెంటనుండేమిత్రుడుంటే, యింక లోటేముంటుంది? కానీవీరుదొరికేదెలా? సహృదయంతోనీవుమెలగుతూ లోకానికిమేలుచేసేపనులనాచరిస్తే, (అదేపుణ్యం)మనకివారుకోరకుండానే లభిస్తారు.జీవితంహాయిగా నడుస్తుంది.

                       స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సోమవారం🕉️* *🌹22సెప్టెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

      *🕉️సోమవారం🕉️*

 *🌹22సెప్టెంబర్2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం*                    


             *ఈనాటి పర్వం*

  *🌷దేవీ శరన్నవరాత్రులు🌷* 

              *ప్రారంభం*```

    (కలశ స్థాపనకు)``` *ఉదయం* 05.56 - 08.22 & 11.36 - 12.24

*సాయంత్రం*: 06.04 -  

08.26 మంచి సమయాలు)```


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరత్ఋతౌః*

*ఆశ్వయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి  : పాఢ్యమి* రా 02.55 వరకు ఉపరి *విదియ*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : ఉత్తర* ప 11.24 వరకు ఉపరి *హస్త*

*యోగం : శుక్ల* రా 07.53 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : కింస్తుఘ్న* మ 02.06 *బవ* రా 02.55 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 06.00 - 07.00 & 10.30 - 12.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు* 

అభిజిత్ కాలం  : *ప 11.36 - 12.24*

*వర్జ్యం      : రా 08.36 - 10.21*

*దుర్ముహూర్తం  : మ 12.24 - 01.13 & 02.50 - 03.38*

*రాహు కాలం   : ఉ 07.27 - 08.58*

గుళికకాళం       : *మ 01.31 - 03.02*

యమగండం     : *ఉ 10.29 - 12.00*

సూర్యరాశి : *కన్య*                              

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.05* 

సూర్యాస్తమయం :*సా 06.12*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

*సంగవ కాలం*         :     *08.22 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.13*

అపరాహ్న కాలం    : *మ 01.13 - 03.38*

*ఆబ్ధికం తిధి         : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం        :*సా 03.38 - 06.04*

ప్రదోష కాలం         :  *సా 06.04 - 08.26*

రాత్రి కాలం           :*రా 08.26 - 11.36*

నిశీధి కాలం          :*రా 11.36 - 12.24*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*

*****************************

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*నో తప్తం గాంగతీరే* 

*వ్రతజపనియమైః* 

*రుద్రజాప్యైర్న జప్తం*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం -‌ ప్రతిపత్ - ఉత్తరాఫల్గుణి -‌‌ ఇందు వాసరే* (22.09.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

21, సెప్టెంబర్ 2025, ఆదివారం

Panchaag


 

వ్యాధులు కావు,

 చాలా *వ్యాధులు* వ్యాధులు కావు, కానీ *సాధారణ వృద్ధాప్యం*. 

బీజింగ్‌లోని ఒక ఆసుపత్రి డైరెక్టర్ వృద్ధులకు ఐదు సలహాలు ఇచ్చారు: మీరు అనారోగ్యంతో లేరు, మీరు వృద్ధాప్యం అవుతున్నారు.. మీరు వ్యాధులు కాదని భావించే అనేక *వ్యాధులు*, *శరీరం వృద్ధాప్యం అవుతోందని* సూచిస్తాయి. 

1. *జ్ఞాపకశక్తి తగ్గడం* అల్జీమర్స్ వ్యాధి కాదు, కానీ వృద్ధుల మెదడు యొక్క స్వీయ-రక్షణ యంత్రాంగం. *మిమ్మల్ని మీరు భయపెట్టవద్దు*. ఇది మెదడు వృద్ధాప్యం అవుతోంది, వ్యాధి కాదు. మీరు మీ కీలను ఎక్కడ ఉంచారో మర్చిపోతే, కానీ మీరు వాటిని మీరే కనుగొనగలిగితే, అది చిత్తవైకల్యం కాదు. 

2. *నెమ్మదిగా నడవడం* మరియు కాళ్ళు మరియు కాళ్ళు అస్థిరంగా ఉండటం' పక్షవాతం కాదు, కానీ కండరాల క్షీణత. దీనికి పరిష్కారం మందులు తీసుకోవడం కాదు, *కదలడం*. 

3. *నిద్రలేమి* ఒక వ్యాధి కాదు కానీ మెదడు దాని లయను సర్దుబాటు చేసుకుంటోంది. ఇది నిద్ర నిర్మాణంలో మార్పు. విచక్షణారహితంగా నిద్రమాత్రలు తీసుకోకండి. నిద్ర మాత్రలు మరియు నిద్రపోవడానికి ఇతర మందులపై దీర్ఘకాలికంగా ఆధారపడటం వల్ల పడిపోవడం, అభిజ్ఞా బలహీనత మొదలైన ప్రమాదం పెరుగుతుంది. *వృద్ధులకు ఉత్తమమైన నిద్ర మాత్ర* పగటిపూట *ఎక్కువ ఎండలో ఉండటం మరియు క్రమం తప్పకుండా షెడ్యూల్ నిర్వహించడం. 

4. *శరీర నొప్పులు* రుమాటిజం కాదు, కానీ నరాల వృద్ధాప్యానికి సాధారణ ప్రతిచర్య. 

5. చాలా మంది వృద్ధులు ఇలా అంటారు: నా చేతులు మరియు కాళ్ళు ప్రతిచోటా బాధిస్తాయి. ఇది రుమాటిజం లేదా ఎముక హైపర్‌ప్లాసియానా? ఎముకలు వదులుగా మరియు సన్నగా మారుతాయి, కానీ 99% 'శరీర నొప్పి' ఒక వ్యాధి కాదు, కానీ నెమ్మదిగా నరాల ప్రసరణ, ఇది నొప్పిని పెంచుతుంది.

దీనిని *సెంట్రల్ సెన్సిటైజేషన్* అంటారు, ఇది వృద్ధులలో ఒక సాధారణ శారీరక మార్పు. అనాల్జెసిక్స్ పరిష్కారం కాదు. *వ్యాయామం మరియు ఫిజికల్ థెరపీ* అనేవి సర్దుబాటు పద్ధతులు. మీరు 'పాదాల స్నానం , పడుకునే ముందు వేడి కంప్రెస్ , తేలికపాటి మసాజ్'ని సిఫార్సు చేయవచ్చు, ఇది ఔషధం తీసుకోవడం కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. 

6. అసాధారణ శారీరక పరీక్ష' అనేది ఒక వ్యాధి కాదు, కానీ సూచిక ప్రమాణాలు నవీకరించబడలేదు. 

7. ప్రపంచ ఆరోగ్య సంస్థ వృద్ధుల శారీరక పరీక్ష సూచికలను *సడలించాలి* అని సిఫార్సు చేస్తోంది. కొలెస్ట్రాల్ విషయంలో కూడా ఇది నిజం. వృద్ధులకు కొంచెం ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ వారు ఎక్కువ కాలం జీవిస్తారు. కొలెస్ట్రాల్ హార్మోన్లు మరియు కణ త్వచాలను సంశ్లేషణ చేయడానికి ముడి పదార్థం కాబట్టి, చాలా తక్కువ స్థాయి రోగనిరోధక శక్తిని సులభంగా తగ్గిస్తుంది. చైనాలో *అధిక రక్తపోటు నివారణ మరియు చికిత్స* కోసం మార్గదర్శకాలు' కూడా వృద్ధులకు రక్తపోటు తగ్గింపు లక్ష్యం <150/90 mmHg, యువకుల ప్రమాణం <140/90 కాదు అని స్పష్టంగా ఎత్తి చూపాయి. *వృద్ధాప్యం* ను *అనారోగ్యం* గా పరిగణించవద్దు మరియు *మార్పు* ను *గాయం* గా పరిగణించవద్దు 

8. వృద్ధాప్యం ఒక వ్యాధి కాదు, ఇది ఒక అవసరమైన మార్గం. వృద్ధులకు మరియు వారి పిల్లలకు కొన్ని మాటలు చెప్పాలి: మొదట, *గుర్తుంచుకోండి, అన్ని అసౌకర్యాలు ఒక వ్యాధి కాదు*. రెండవది, వృద్ధులు 'భయపడటానికి' ఎక్కువగా భయపడతారు. శారీరక పరీక్ష నివేదికను చూసి భయపడకండి లేదా ప్రకటనలను చూసి మోసపోకండి.

మూడవది, *పిల్లలకు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారి తల్లిదండ్రులను ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్లడం కాదు*, వారితో పాటు నడక, సూర్య స్నానం, భోజనం, మాట్లాడటం మరియు బంధం ఏర్పరచుకోవడం. *వృద్ధాప్యం శత్రువు కాదు* ఇది జీవించడానికి మరొక పదం .. కానీ స్తబ్దత శత్రువు! *ఆరోగ్యంగా ఉండండి* ☘️

పంచాంగం 21.09.2025

 ఈ రోజు పంచాంగం 21.09.2025

Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి భాను వాసర పూర్వఫల్గుని నక్షత్రం శుభ యోగః చతుష్పాత్ తదుపరి నాగవం కరణం



రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 



నమస్కారః , శుభోదయం

20, సెప్టెంబర్ 2025, శనివారం

Panchaag


 

పొరుగింటి పుల్లకూర

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. అలాగే తెలుగు వారికి పొరుగు భాషా పదాలన్నా ఎంతో రుచి. ఉర్దూ, హిందీ, పార్శీ, మధ్య మధ్యలో అరబిక్ పదాలను కలగలిపి మాట్లాడుతూంటాం. ఇంగ్లీషు, సంస్కృతం సరేసరి. అలా ఎన్నెన్ని 

 మాట్లాడుతూంటామో చక్కగా వివరించారు ప్రముఖ సాహితీవేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ముక్కు మీద చక్కని పద్యం !

 శు భో ద యం 🙏


ముక్కు మీద చక్కని పద్యం !


             శా: నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే

                    లా న న్నొల్ల దటంచు ? 'గంధఫలి ' బల్కాకం దపంబంది ,యో

                     షా నాసాగ్రము బూని , సర్వ సుమనస్సౌరభ్య సంవాస మై ,

                    పూనెం బ్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ .


                          వసు చరిత్రము 2 ఆశ్వాసము- రామ రాజ భూషణుడు. 


                               ప్రబంధకవులు చిత్ర విచిత్రమైన వర్ణనలు చేశారు. కావ్యనాయిక సోందర్య మాధారంగా, వారు (ప్రబంధనాయిక)

అంగాంగ సౌందర్యమును పనిగట్టుకు వర్ణించారు. ఉపమలతో ఉత్ప్రేక్షలతో అతిశయోక్తులతో, అప్పటి ప్రభువుల, ప్రజల అభిరుచులు

అలా ఉండేవన్నమాట. 


                    వసుచరిత్రలో నాయిక గిరిక ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ కృతికర్త రామ రాజ భూషణుడు. ముక్కుపై నొక చక్కని పద్యం వ్రాశాడు. అదే పైపద్యం. 


                            " గంధఫలి"- అంటే సంపెంగ పూవు. ( ఈసంపెంగలు రెండురకాలు 1 తుప్ప సంపెంగ 2 చెట్టు సంపెంగ. దీనినే మనవారు "సింహాచలం సంపెంగ"- అంటారు. అదే ముక్కును పోలియుంటుంది. ఇప్పుడు దాన్ని గురించే మనం చెప్పుకోబోయేది) 

ఆసంపెంగకు తుమ్మెదలపై కోపం వచ్చిందట. ఎందుకు? నానాసూన వితాన వాసనల నానందించు సారంగము(తుమ్మెద) యేలానన్నొల్లదని. అనేక పుష్పాలపైవ్రాలి మకరందం జుర్రుకునే తుమ్మెద నాదగ్గరకు రాదేం? అని దానికి కోపం! యెలాగైనా పట్టుబట్టి సాధించాలిగదా! అందుకనే అది తపస్సు చేసింది. ఆతపః ఫలంగా గిరిక ముక్కుగా నవతరించి ,సకల పుష్పముల సువాసనలను పుణికి పుచ్చుకొని తన ముఖానికిరువైపులా చూపులనే (కన్నులనే) రెండుగండు తుమ్మెదలను కదల కుండా కట్టేసిందట! 


                   ఇంతకీ యిక్కడో విషయం చెప్పుకోవాలి. ఏవిటది? తుమ్మెదలకు సంపెంగికి యెందుకు విరోధం? ఏమో అది ప్రకృతిగతమైనది.సంపెంగ వాసన తుమ్మెదకు పడదు. ఆవాసకది తలదిరిగి పడిపోతుంది. అందుకని అది సంపెంగ దరిదాపులకు రాదు.

దాని నాధారంగా కవి యొక కథనల్లాడు. అదే "తుమ్మెదపై సంపెంగ అలక" 


                గతంలో సంపెంగ గా ఉండటంతో తుమ్మెదలు దరికి రాలేదు. ఆరువాత తపస్సుచేసి గిరిక ముక్కుగా అవతరించింది. ఇక అప్పుడు తుమ్మెదకు తప్పలేదు. అదిగూడా అందమైన ఆమెకన్నుల వలెమారిపోయింది. అదీ సంగతి!


                    ఇంతకీ గిరిక ముక్కు సంపెంగి వలె, కన్నులు తుమ్మెదల వలె నున్నాయని చెప్పటమన్నమాట. 


               ఇంతకీ యీముక్కుపద్యం కర్తృత్వం వివాదాస్పదమైంది. అప్పటికీ యిప్పటికీ ఆవివాదం తెగలేదు. ఈపద్యం నంది తిమ్మన గారిదనీ, ముక్కుమీద పద్యంవలననే ఆయనకు ముక్కు తిమ్మన యనే వ్యవహార నామం వచ్చిందనీ కొందరివాదన.దాన్ని రామరాజభూషణుడు వెలగొని తనగ్రంథంలో వాడుకున్నాడని దానికి సమర్ధింపుగా చెప్పారు.కానీ తిమ్మనగారి పారిజాతాప హరణంలో ఈపద్యం కనిపించదు. కాబట్టి ఈవాదంలో పస గనిపించదు.


                     మొత్తానికి ముక్కు మీద కూడా ప్రబంధకవులు పద్యాలల్లినది యదార్ధం!


                                                                     స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷