30, అక్టోబర్ 2025, గురువారం

పురుషుడు భార్యని

 *పురుషుడు భార్యని ఎలా* 

                                    *చూసుకొవాలి?*


* *స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చేసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహుతురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మిoచి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుది.*


* *అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.*


* *భార్య వడ్డించిన పదార్ధాలను తినకుండా విమర్శించరాదు.*


* *ఇంటిని భార్య జైలులా భావించే పరిస్తితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బైటికి తీసుకెళ్ళాలి.*


* *పిల్లలతొ సరళ సంభాషణలు* *చేయాలి.*


* *పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు.* 


* *ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి.*


* *భార్యకి ఎంతో కొంత ఆర్ధిక స్వేచ్హ ఇవ్వాలి.*


* *ఆమె అభిప్రాయలను గౌరవించాలి.*


* *భార్యను పరులముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు.*


* *భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గాని, అనుమానించే వ్యక్తిగా చూడగూడదు.*


* *భర్త తను తుదిశ్వాస వదిలేవరకు, భార్యను కంటికి రెప్పలాగ, సంతొషంలోనూ, బాధలలోను చేదొడువాదోడుగా ఉండాలి.*


* *భర్త తను మరణించిన తరువాత గూడ, భార్య ఇతరుల మీద ఆధారపడకుండా, కష్ఠాలు పడకుండా ముందు జాగ్రతలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాది కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయలి...*

వంకాయ కూర

 వంకాయ కూర 

అబ్బో వంకాయ కూర అనగానే మీకు నోరూరుతుంది కదా అవును నాకు తెలుసు వంకాయ కూరను  తినమనే వారు   ఇష్టపడని  వారు ఉండరన్నది అందరు ఎరిగిన సత్యమే. మీ ఇంట్లో ఏం చేశారు అని ఎవరినైనా అడిగితె వాడు కనుక వంకాయకూర అని అన్నాడా అబ్బా వీడు నన్ను కూడా భోజనానికి పిలిస్తే ఎంతబాగుండును అని అనుకోని వారు ఎంతమంది వుంటారు చెప్పండి. ఇంకా కొంతమంది సిగ్గు విడిచి అరె ఇవాళ మీ ఇంటికి భోజనానికి వస్తారా అని మరి వాళ్ళ ఇంటికి వెళ్లి వంకాయ కూరను ఆరగించి వచ్చేవారు ఎంతమంది లేరు చెప్పండి. అందుకే కొంతమంది ఇవాళ మీ ఇంట్లో ఏమి చేశారు అని అడిగితె ఏరా నీవు భోజనం చేశావా అని అడిగి వాడు తిన్నాడని నిర్ధారణ చేసుకున్న తరువాత చిన్నగా అప్పుడు చెపుతాడు మా ఇంట్లో వంకాయ కూర అని. అబ్బా ఈ విషయం కొంచం ముందు చెపితే నేను కూడా మీ ఇంట్లోకి భోజనానికి వచ్చేవాడిని కదరా అని అప్పుడు నాలుక కరుచుకుంటాడు. ఇట్లా ఎన్నో సంగతులు వంకాయ కూర మీద ఉంటాయి. వంకాయ కూర రుచిని ఆస్వాదించి ఆనందించి సంతృప్తి చెందిన ఒక కవిగారు ఊరుకొక ఇలా ఒక చక్కని కంద పద్యాన్ని వ్రాసాడు అది మనందఱకు తెలిసిందే 

"వంకాయ వంటి కూరయు, 

పంకజముఖి సీత వంటి భామామణియున్, 

శంకరుని వంటి దైవము, 

లంకాధిపు వైరివంటి రాజును గలడే?" 

ఇందులో కవిగారు ఏమంటారంటే , "వంకాయలాంటి కూర, తామరపుష్పం వంటి ముఖం కల సీత వంటి భార్య, శివుడి వంటి దేవుడు, రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు" వంటివి ఉన్నాయా అని అంటున్నాడు. ఇది అక్షర సత్యం ఒక వంకాయ కూరను సాక్షాత్తు లోకమాత అయిన సీతాదేవితోటి శ్రీ రామచంద్రునితోటి మరియు పరమ శివునితోటి పోల్చి చెప్పాడంటే ఆ కవిగారు వంకాయకూరను తిని పొందిన అనుభూతి  ఎంతదో చెప్పకనే చూపుతున్నది. ఇదండీ ఒక కవిగారి ఆనందంతో తన కలంనుండి జాలువారిన అమృత కవితా ధార . 

ఇక వంకాయకూర గురించి చెప్పాలంటే వంకాయ కూర ఒక కూర కాదండి అది ఒక కూరల సంపుటి. వంకాయలను తరిగి, తరిగిన ముక్కలను నీళ్లలో వేసి పోపు చేసి ముక్కలను వేసి అల్లం పచ్చిమిరపకాయ ముక్కలను వేసి చేసే కూర సాదారణ కూరే కానీ దాని రుచి మాత్రం అమోఘం. ఇది అతి సాధారణంగా చేసే వంకాయకూర 

ఇంకా పల్లీల పొడి ధనియాలపొడి, శనగపిండి, వాము జీలకర్ర పొడులు అన్నే కలిపి పొడుగాటి వంకాయలను తీసుకొని దానిని నిలువుగా నాలుగు పాయలుగా తరిగి మధ్యలో ఈ మసాలాను నూరి గిన్నెలో నూనె వేసి దానిలో వేసి వేయించి తీసిన గుత్తివంకాయ కూర రుచి అద్భుతం , అద్వితీయం. దీనిని తింటూవుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లు ఉండదా చెప్పండి. 

ఇదికాక ఇటీవల కాలంలో అనేక విధాలైన వంకాయ కూరలు మన పాక శాస్త్రజ్ఞులు కనుగొన్నారన్నది అతిశయోక్తి  కాదు. వంకాయ గ్రేవీ కూర వంకాయ కారం కూర, వంకాయ మసాలా చల్లిన కూర అదోరకం కూర ఇదోరకం కూర అని అనేక అనేక కూరలను చేస్తున్నారు టీవీలలో చూపిస్తున్నారు. యూట్యూబులల్లో చూస్తూ చేస్తున్నారు కూడా 

వంకాయకూరకు దాసుడైన ఒక సినిమా దర్శకుడు తన సినిమాలో ఒక పాటను వంకాయమీద పెట్టి హీరో హీరోయిన్లతో నాట్యం చేయించిన విషయం తెలియని తెలుగువారు లేరు. 

వేద వ్యాసుడు మన తెలుగువారికి సరిగా న్యాయం చేయలేదు అని ఒక సుబ్బారావు ఒక రామారావుతో అన్నాడు. అదేమి పాపం వ్యాస భగవానులు వేదాలను విభజించి వేద వ్యాసుడుగా పేరొందారు, అష్టాదశ పురాణాలను వ్రాసారు, మహా భారతాన్ని రచించారు ఇంకా అయన చేయకుండా మిగిలింది ఏమిటి. ఇప్పటికి పండితులు వ్యాస ఉత్తిష్టం కానిది లేదంటుంటే  మీరు ఇంకా వ్యాసులవారు ఏదో వ్రాయలేదని అంటారేమిటని రామారావు అన్నాడు. దానికి సుబ్బారావు నీకు తెలియదా వంకాయ కూరను వ్యాసులవారు ముట్టుకోలేదు అని అసలు విషయం తెలిపాడు సుబ్బారావు. బలే వున్నది సుబ్బారావుగారు అయితే మీరు భారతం పూర్తిగా చదివినట్లు లేదు అని అన్నాడు రామారావు. భారతంలోనా ఎక్కడ చెప్పండి అన్నాడు. నేను చెప్పేది ఏముంది చాలా బాగా సుస్పష్టంగా వ్యాస భగవానులు వంకాయ కూరను వ్రాస్తేను అని అన్నాడు. అప్పుడు అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం సుబ్బారావుకు కలిగింది. అయితే చెప్పండి మహాప్రభూ ఆ కథను అని అన్నాడు. 

అప్పుడు రామారావు సాక్షాతూ శ్రీ కృష్ణ భగవానుడిలాగా ఫోజు పెట్టి అర్జనునికి గీతను బోధిస్తున్నట్లుగా సుబ్బారావుకు చెప్పటం మొదలు పెట్టాడు. నాయనా లక్క  గృహ దగ్డం అయిన తరువాత కుంతీమాతతో సహా పాండవులు ఏకచ్చేక్రపురం అనే గ్రామంలో తలదాచుకున్నారు కదా అవును తెలుసు అన్నాడు అప్పుడు జరిగింది ఏమిటో తెలుసుకదా తెలుసు పాండవులు వున్న ఇంటివాని కుమారుని బకాసురునికి ఆహారంగా పంపటానికి ఆ తల్లిదండ్రులు బాధ పడుతూ బండిమీద బాలుని సాగనంపుతుంటే అవును సాగనంపుతుంటే కుంతీ మాత ఆ తల్లిదండ్రులకు ఊరట కలిగించి ఆ బాలునికి బదులుగా తన కుమారుని పంపుతానని భీముని పంపింది ఇందులో వంకాయ కూర ప్రసక్తి ఎక్కడవుందని సుబ్బారావు అన్నాడు. 

అప్పుడే నాయనా వంకాయకూర వచ్చింది అని రామారావు ఇలా చెప్పాడు. ఆ క్రితం రోజు ఊరివారంతా సమావేశమై బకాసురిని బారి నుంచి తప్పించుకోవటం మన వల్ల కాదు కనీసం వాడిని సమ్మోహితుణ్ణి అయినా చేసి కొంతకాలం వాడు మన ఊరివైపు రాకుండా చేద్దామని అందరు కలిసి వారిలో చక్కగా వంకాయ కూర వండగల సమర్థులను ఎంచుకొని ఒక బాండీ నిండా వంకాయ కూరను వండి మరుసటి రోజు బకాసురిడికి విందుగా పంపే బండిలోకి ఎక్కించారు. నిజానికి తల్లిగారు చెప్పినా బకాసురిడి వద్దకు వెళ్ళటానికి ఇష్టపడని భీముడుగారు ఆ వంకాయ కూర  ఘుమ ఘుమలు ఉరిస్తూవుంటే దానిని సంతృప్తిగా ఆరగించాలని తాను బకాసురిని వద్దకు వెళ్ళాడు. బకాసురుడు చూస్తూఉండగా ఆ కూరను అన్నంలో కలుపుకొని తింటూ వాడిని కూడా ఊరించాడని వాడు అది చూసి సహించక ఓరి మానవ నాకు ఆహారంగా తెచ్చిన వంకాయ కూరను నీవు ఆరగిస్తావా, తిని తిను నీవు తిన్నతరువాట్ నిన్ను నీ కడుపులోని వంకాయకురాను తినేది నేనే కదా అని హా హా కారాలు చేస్తూ భీముని మీద లంకిస్తే ఆకలితో వున్న బకాసురుని వంకాయ కూరను ఆరగించిన భీమసేనుడు అతి సునాయాసంగా  మట్టు పెట్టిన సంగతి అత్యంత రసవత్తరంగా వ్యాసభగవానులు వ్రాసారని దానిని నన్నయ భట్టారకుడు హ్రుద్యంగగా తెలుగించిన విషయం నీకు తెలియదటోయ్ అని సుబ్బారావుతో రామారావు అనేసరికి రామారావు నోరెళ్లపెట్టాడు. అవునండి మీరు చెప్పింది నిజమే వ్యాసభగవానులు వంకాయకూరకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చారు అని ఏదో కొత్త విషయం తెలుసుకున్నట్లుగా మొహం పెట్టి చెప్పాడు. దీనిని  బట్టి తెలిసేది యేమిటంటే వంకాయకూర ఈ నాటిది కాదు ఇతిహాసాల నాటిదని అర్ధమవుతుంది. అని అన్నాడు సుబ్బారావు.

అంతే కాదు సుబ్బారావు వంకాయకూర గురించి కధ ఒకటి అక్బర్ బీర్బలులది కూడా వున్నది అది నీకు తెలియదా అని ఆంటీ చెప్పు చెప్పు అని చెవులు నిక్కపొడుచుకొని వినటానికి సంసిద్దుడైనాడు  ఆ కధ ఏమిటంటే అని చెప్పసాగాడు రామారావు  ఒకసారి చక్కటి వంకాయకూరతో విందు భోజనం చేసిన అక్బరు బాదుషా ఆ ఆనందాన్ని తట్టుకోలేక బీర్బల్ తో బీర్బల్ వంకాయ కూర ఎంతరుచిగా ఉందొ తెలుసా వంకాయ కూర తినని వాడి జన్మ జన్మే కాదు అని అన్నాడట దానికి మన బీర్బల్ జహాపనా మీరు చెప్పింది నిజం వంకాయను కూరలలో రాజు అని పేరు.   అందుకే భగవంతుడు వంకాయను ప్రత్యేకంగా చూసాడు అంతేకాదు దాని తలమీద కిరీటాన్ని పెట్టాడు అని అన్నాడట. అట్లానా  అని బాదుషా బీరుబలును, వంకాయను మెచ్చుకున్నాడట.

సుబ్బారావూ  వంకాయకూర గురించి చెప్పాలంటే ఎంతసేపైనా పడుతుంది. నీకు తెలుసుకదా మన బెజవాడ బెంజ్ సర్కిలులొ వంకాయ విలాస్ అనే ఆంధ్రభోజాన హోటలు వుంది అది వంకాయ కూరకు పెట్టింది పేరు. ఆ హోటల్లో భజనం చేయని బెజవాడ వాస్తవ్యుడు లేదంటే నమ్మండి. ఇంట్లో భార్య వంట సరిగా చేయకపోతే వెంటనే వంకాయ విలాసకు వెళ్లి భోజనం చేసే పురుషపుంగవులు ఎంతమందో నీకు తేలుసా.   ఇటీవల భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకొవటంతో వాళ్లకు దొరికినప్పుడల్లా వంకాయ విలాస్ హోటలు నుంచి భోజనము తెప్పించుకొని తింటూవున్నారు. అందుకే ఇప్పుడు జొమాటో, స్విగ్గి లాంటి సంస్థలు తమ తమ వ్యాపారాలని వృద్దిచేసుకుంటున్నాయంటే దానికి కారణము వంకాయ కూర అంటే నమ్మండి అని అన్నాడు. . హైదరాబాదు నుండిబెజవాడమీదుగా తిరుపతి పెళ్లే యాత్రికులు ఒక పూట బెజవాడలో దిగి వంకాయ విలాసులో వంకాయ కూరతో భుజించి వెళ్ళటం పరిపాటి.  ఇటీవల బెజవాడ వంకాయ విలాస్ హోటలు వాళ్ళు హైదరాబాదులో డిలీషకానగరులో ఒక బ్రాంచి తెరిచారు.  అంతేకాదు మండపేటలో చాలా చోట్ల వీధి బండ్లమీదఁ వంకాయలో మసాలా పెట్టివంకాయ బాజ్జెలు చేస్తారు అవి ఒకసారి తింటే చాలు మళ్ళి మళ్ళి  తినాలనిపిస్తుంది.

మా వూళ్ళో నాగభూషణం అనే వకీలు ఒక ఆయన  అయన దగ్గరికి విడాకులు తీసుకోవటానికి వచ్చే దంపతులకు సర్దిచెప్పి భార్యకు వంకాయకురా మహత్యం చెప్పి చక్కగా వంకాయకూర చేయటం నేర్పించి అది వాళ్ళ భర్తలకు తినిపించమని సలహా ఇచ్చేవాడట అట్లా చేయటం వలన భార్య చేతి వంకాయ కూర తిన్న భర్త భార్యమీద ప్రేమను పెంచుకొని ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారని. ఇలా సలహా ఇచ్చినందుకు ఆయన వసులు చేసిన పీజులతో ఒక మూడు అంతస్తుల భవనం నిర్మించాడని దానికి వంకాయ నివాస్ అని పేరు పెట్టాడని చెపుతారు. ఈ విషయం తెలుసుకున్న అనేకమంది భార్యలు తమ తమ భర్తలను వశం చేసుకోవటానికి చక్కగా వంకాయ కూర చేయటం నేర్చుకొని వాళ్ళ భర్తలకు తినిపించి భర్తలను కొంగుకు కట్టుకుంటున్నారని ఒక వదన్తి. 

వకీళ్ళకే కాదు డాక్టర్లకు కూడా వంకాయ కూర కల్పవృక్షం లాంటిది అని రామారావు అన్నాడు అది యెట్లా అన్నాడు సుబ్బారావు నాకు తెలిసిన డాక్టరును నేను నీ ప్రాక్టీస్ ఇంత బాగా వృద్ధిలోకి రావటానికి కారణమ్ ఏమిటని అడిగాను.  దానికి ఆయన నీవు ఎవ్వరికీ చెప్పానంటే చెపుతాను అని నాతొ ప్రామిస్ చేయించుకొని మరి చెప్పాడు అది వంకాయ కూర అని అన్నాడు. అదేమిటి వంకాయ కూరకు నీ ప్రాక్టీసుకు ఏమిటి సంబంధం అని నేనన్నాను. వంకాయ కూర అందరు ఇష్టంగా తింటారా లేదా చెప్పు అన్నాడు తింటారు అని అన్నాను నేను. . అప్పుడేమవుతుంది, ఏమవుతుంది వంట్లో వాతం కఫం అజీర్తి పిత్తం అన్నే ముదిరి సంపూర్ణ ఆరోగ్యంగా వున్న వాడు కాస్త అడ్డం పడతాడు. వాళ్ళ వాళ్ళ వయసుని పట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వారి వారి రోగాలు ఆధారపడతాయి. ఇక యెంత చెట్టుకు అంత గాలి అన్నట్లు యెంత రోగానికి అంత ఫీజు నేను వసులు చేస్తాను అని ఆ డాక్టరుగారు చెప్పారు. పేషంటు రాగానే వెంటనే సెలైన్ పెట్టి ముప్పైఆరు రకాల టెస్టులు చేయించి నలభై రకాల మందులు వ్రాసి నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని వేలు లక్షలలో ఫీజులు గుంజి వదిలి పెడతాను అని తన వృత్తి రహస్యం చెప్పాడు డాక్టరుగారు. ఎవ్వరికీ చెప్పనని ప్రమాణం చేసాను కాబట్టి నీకు మాత్రమే నేను చెపుతున్నాను అని అన్నాడు రామారావు.  

రామారావు  అంతటితో ఆగలేదు ఇంకా ఇట్లా చెప్పటం మొదలు పెట్టాడు. పెండ్లి చూపుల్లో పిల్లవాడి తల్లి అమ్మాయితో నీకు వంట వచ్చా సంగీతం వచ్చా, డాన్సు వచ్చా టైపింగ్ వచ్చా కంప్యూటర్ వచ్చా అని సవాలక్ష ప్రశ్నలు వేస్తూ వుంటారు కానీ సమర్థురాలైన పిల్లవాని తల్లి ఒకే ఒక ప్రశ్న వేస్తుంది. అదేమిటంటే అమ్మాయి నీకు వంకాయ కూర వండటం వచ్చా వస్తే వంకాయను ఎన్ని రకాలుగా వండుతారు చెప్పమని అడుగుతుంది. అని అన్నాడు. 

ఆ తరువాత రామారావు సుబ్బారావుని నీకు వంకాయలలో రకాలు తెలుసా అని అడిగాడు.  నాకు తెలియదు. అయితే విను మాములుగా మనకు తెలిసిన వంకాయ వంకాయ రంగు వంకాయలు అవి పొడుగుగా ఉంటాయి. అవి కాక గుండ్రటి వంకాయలు, తెల్ల గుండ్రటి వంకాయలు, చారల గుండ్రటి వంకాయలు, తెల్ల వంకాయలు, బొండం వంకాయలు, బజ్జే వంకాయలు ఇంకా కొన్ని కొత్త వంగడాలను మన శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారని చెప్పాడు. 

పాఠక మిత్రమా ఇదండీ వంకాయ చెరిత్ర. ఇంకా ఈ రచయితకు తెలియని వంకాయ కూర గురించి మీకు తెలిస్తే చెపితే ఇంకా విస్తృతంగా ఈ రచను చేయగలడు. 

గమనిక: వంకాయను తప్ప ఇతర కూరలను నిందించటం ఈ రచయితా ఉద్దేశ్యం కాదు. కేవలం వంకాయ కూర ప్రాముఖ్యాన్ని తెలపటం మాత్రమే అని తెలుసుకోగలరు.  

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ వంకాయ కూర ప్రియుడు. 

చేరువేల భార్గవ శర్మ 





శుక్రాచార్యుడు

 రాక్షస గురువు శుక్రాచార్యుడు, అతను చెడును కదా ప్రోత్సహించేవాడు,మరి బృహస్పతి వంటి గురువుల కోవలోకి ఎలా చేర్చారు?


~~ జ్ఞానం మరియు తపస్సు :


~ శుక్రాచార్యుడు భృగు మహర్షి కుమారుడు. ఆయన బ్రహ్మ మానసపుత్రుడైన భృగువు వంశంలో జన్మించారు.


~ ఆయన వేదాలు, ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు, రాజనీతి మరియు అనేక శాస్త్రాలలో అపారమైన పరిజ్ఞానం కలిగిన మహాజ్ఞాని. బృహస్పతి కూడా ఇదే విధంగా జ్ఞాన సంపన్నుడు.


~ అపారమైన తపస్సు చేసి, శివుని నుండి మృత సంజీవని విద్యను పొందారు. ఈ విద్య ఆయన గొప్ప శక్తికి, తపస్సుకు నిదర్శనం.


~ రాక్షసులకు గురువుగా ఉన్నప్పటికీ, ఆయన వారికి కేవలం యుద్ధ విద్యలను మాత్రమే కాకుండా, ధర్మాన్ని, రాజనీతిని బోధించారు. కొన్ని సందర్భాలలో, రాక్షసులు ధర్మం తప్పినప్పుడు వారిని మందలించడం లేదా శపించడం కూడా చేశారు ఉదా: యయాతి కథలో శాపం.


~~ గురువుగా అతని స్థానం - దైవత్వం:


~ హిందూ పురాణాలలో గురువు అనే పదానికి వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా విద్య, జ్ఞానం బోధించే పవిత్రమైన స్థానం ఉంది. శుక్రాచార్యుడు, బృహస్పతి ఇద్దరూ తమ శిష్యులయిన దేవతలు లేదా ఆసురులకు అత్యున్నతమైన జ్ఞానాన్ని బోధించారు, కాబట్టి వారిద్దరూ గురు పీఠానికి అర్హులే.


~ నవగ్రహాలలో, శుక్రుడు అంటే శుక్రాచార్యుడు మరియు గురుడు అంటే బృహస్పతి అత్యంత ముఖ్యమైన స్థానాలను కలిగి ఉన్నారు. శుక్రుడు సంపద, ఐశ్వర్యం, కళలు, ప్రేమకు అధిపతి. బృహస్పతి జ్ఞానం, బుద్ధి, శుభాలకు అధిపతి. ఇద్దరూ దైవత్వాన్ని పొందినవారు, అత్యున్నత శక్తి సంపన్నులు.


~~ రాక్షసులకు గురువుగా మారడానికి గల కారణం:


~ శుక్రాచార్యుడు మొదట్లో దేవతలకు లేదా మరే ఇతర పక్షానికి వ్యతిరేకి కాదు. ఆయన గురువైన అంగీరస మహర్షి తన కుమారుడైన బృహస్పతి పట్ల పక్షపాతం చూపించారనే భావనతో కలత చెందారు.


~ ముఖ్యంగా, విష్ణుమూర్తి ఒకానొక సందర్భంలో శుక్రాచార్యుని తల్లియైన కావ్యమాతను లేదా ఉశనస భార్యను చంపడం జరిగింది. ఆ పగతోనే శుక్రాచార్యుడు దేవతలపై కోపంతో అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే, ఆయన వైరాగ్యానికి, అసురులకు మద్దతుగా నిలవడానికి వ్యక్తిగత కారణాలు, వైష్ణవంతో వచ్చిన విభేదాలు ఉన్నాయి, కానీ ఆయన స్వతహాగా "చెడు"ను ప్రోత్సహించేవారు కాదు, జ్ఞానాన్ని బోధించే గురువు.


~ శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉన్నప్పటికీ, తన శిష్యుడైన కచుడికి ( బృహస్పతి కుమారుడు, దేవతల పక్షం ) కూడా పవిత్రమైన మృత సంజీవని విద్యను బోధించారు. ఇది ఆయనలోని గురు ధర్మానికి నిదర్శనం.


~~ ధర్మ పరిరక్షణ :


కొన్ని సందర్భాలలో, శుక్రాచార్యుడు శిష్యులకు పక్షపాతం చూపినా, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేశారు. ఉదాహరణకు, కచుడిని చంపి, మదిరలో కలిపి త్రాగడం ద్వారా జరిగిన అనర్థాన్ని గ్రహించి, ఆపైన రాక్షసులకు సురాపానాన్ని (మద్యం సేవించడాన్ని) నిషేధించారు. అలాగే, మహాబలి చక్రవర్తి వామనుడికి దానం చేసేటప్పుడు, ఆ దానం చేయడం సరైనది కాదని తెలిసినా, ధర్మబద్ధమైన దానం చేయడాన్ని ఆపడానికి యత్నించడం ఆయన రాజనీతిజ్ఞతను తెలియజేస్తుంది.


ముగింపులో,,,,, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువైనప్పటికీ, ఆయన ఒక మహర్షి, అపారమైన జ్ఞాని, తపశ్శక్తి సంపన్నుడు. ఆయనలోని 'అసుర గురు' అంశం కేవలం దైవ-దానవ యుద్ధంలో ఒక పక్షాన్ని ఎంచుకోవడం వల్ల వచ్చింది తప్ప, ఆయన గురుత్వం లేదా జ్ఞానం తక్కువైనది కాదు. అందుకే, బృహస్పతి వలె ఆయన కూడా గురు పరంపరలో అత్యున్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారు.

29, అక్టోబర్ 2025, బుధవారం

విభూతి ధారణ

 విభూతి ధారణ ప్రాముఖ్యత


విభూతిని ధరించి నప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణవలన తొలగి మన బాధలు నశిస్తాయి.


కనుక ప్రతివాడు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాలభాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం, దేవతారాధనచేసి ఈశ్వరకృపకు పాత్రుడై దినచర్యలకు సమాయత్తం కావాలి.


విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపజేస్తుంది.


""విభూతిర్భూతిరైశ్వర్యమ్‌''


విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగాన్నుండి వెలువడే ఆవుపేడతో విభూతి తయారు చేసికోవాలి. లక్ష్మీ గోవు యొక్క పృష్ఠభాగంలో వున్నట్లే ఇతరదేవతలు కూడ గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో వుంటారు. కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యం వున్నది. దానినుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం.


లక్ష్మీ ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తుంది. గోవు యొక్క పృష్ఠభాగం, వివాహిత స్త్రీ యొక్క పాపటభాగం, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వదళాలు.


“వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయా ! పూజితో పి మహాదేవో నా భీష్ట ఫలదాయక!!


భస్మం నొసట మూడు రేఖలు ధరింపనిదే .రుద్రాక్ష మాలను కంతమున ధరింపనిదే శంకరుని పూజించినను భక్తుల కోరికలు నెరవేరవు.


అమరేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి ధార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి, ఎవరైతే శివప్రీతికరమైన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటి ఉంటుందంటారు.


విభూతి - భసితరి, భస్మ, క్షారము రక్షక పర్యాయ వాచక పదాలు. ఆణిమ, మహిమ, గరిమ, లఘుమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం, వశిత్వం అనే అష్టసిద్దులను బాసింపచేస్తుంది. కనుక భసితమైందనీ, పాపాలను భజించడంవల్ల భస్మమైంది. ఆపదల నుండి కాపాడడంవల్ల క్షారమైంది. భూత, ప్రేత పిశాచాది గ్రహ బాధల నుండి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయ్యింది. ‘విభూతి’ని శరీరంపై పూసుకోవటంవల్ల తిర్వక్త్రిపుండ్రం పెట్టుకోవడంవల్ల స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణముండడంచే సదానొసట విభూతిని ధరించి తీరాలని, మనం పూజా కార్యక్రమాలాంటివి చేయకపోయినా నిత్యం విభూతి ధరిస్తే శివపూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి.


విభూతి ధారణవల్ల అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి విద్యా స్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెల్పితే, విభూతి ధరించేవారు దీర్ఘవ్యాధులు లేకుండా పూర్ణాయుర్దాయ వంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని, దుఃఖాలు, రోగాలు, తొలగి శుభాలను కల్గిస్తుందని పురాణాల ద్వారా మనకు విదితవౌతుంది.


విభూతి మూడు విధాలు. ‘శ్రౌతము’ అంటే చెప్పబడిన విధి విధానంతో, అంటే వేదములలో నిర్ణయింపబడినట్లుగా యజ్ఞ యాగాదులు చేసి, ఆ హోమాదులవల్ల ఏర్పడిన భస్మం. ‘స్మార్తము’ అంటే నిత్యాగ్ని హోత్రాదులు చేయగా ఏర్పడిన భస్మం. ‘లౌకికము’ ఆవు పేడను కాల్చడం ద్వారా తయారైన భస్మము. ఇలా మూడు విధాలైన భస్మములను పవిత్రమైన ‘విభూతి’గా భావిస్తారు.వైరాగ్యమునకు, నిర్లిప్తతకు ప్రతీకగా భస్మమును భావించి త్రిపుండ్ర ధారణ చేయుట సర్వోత్తమము.


సర్వసృష్టికి హేతుభూతమైన నిత్యచైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతిధారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతివిషయం శివమయమని, అదేమనకు అంతిమలక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే, అది ముందు నల్లగా మారుతుంది. దానినింకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దాన్ని ఇంకాకాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్నిరకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిద మాత్రమే. కనుక భౌతికరంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్యస్థితి కల్గియున్నది. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతివస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.

తానికాయ గురించి

 తానికాయ గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

 

తానికాయని విభీతక , విభీతకి , కర్షఫల అని సంస్కృతంలో అంటారు.


  తానికాయ ఉపయోగాలు -

    

 * తానికాయ కారముగా , చేదుగా , వగరుగా ఉండును. 


 * తానికాయ వేడితత్వం కలది. కఫాన్ని హరించును . 

 

* నేత్రములకు మేలు చేయును . 

 

* వెంట్రుకలు ఆకాలంలో తెల్లబడుటను నిరోధించును. 


 * మధురాపక్వముగా , తేలికగా ఉండును. 


 * గొంతుబొంగురును పొగొట్టును. 


 * ముక్కురోగాలను నివారించును.


 * రక్తదోషమును నివారించును.


 * కంఠరోగమును పోగొట్టును .


 * బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్న దగ్గు తగ్గును.


 * క్రిమి రోగాన్ని హరించును .


 * క్షయరోగాన్ని నివారించును .

 

* కుష్టురోగాన్ని హరించును .


 * తానికాయలోని పప్పు వెంట్రుకలకు అమిత హితమైనది.


 * తానిచెట్టు నుంచి తీసిన కల్లు కొంచం వేడి చేయును . కొంచం మత్తు కలిగించును. తేలికగా ఉండును. వ్రణరోగులు , పాండురోగులు , కుష్టురోగులు కి అనుకూలమైనది.

 

* తానికాయలో పప్పు దాహమును , వాంతిని , కఫమును హరించును .

 

* శరీరముకు తేలికగా ఉండును. వగరు కలిగి ఉంటుంది.

 

* తానికాయ తైలం మధురముగా ఉండును. శరీరముకు చలవ చేయును .

 

* తానికాయ తైలం ధాతువులను వృద్దిచేయును . కఫాన్ని పెంచును. వాతాన్ని, పిత్తాన్ని హరించును .

    

ఈ తానిచెట్టు చాలా పెద్ద వృక్షము . దీని ఆకులు ఇప్ప ఆకుల కన్నా కొంచం చిన్నవిగా ఉండును. పూలు గుత్తులుగా పూచి వేలాడుతుండును. కాయ ఆకారం పైన డిప్పవలవని జాజికాయ మాదిరిగా ఉండును.ఈ కాయలు ఫాల్గుణ మాసం మొదలు పండుట ఆరంభించును. చైత్రమాసంలో సంగ్రహించిన బాగుగా పండి సారవంతంగా ఉండును.బాగుగా పెరిగి పండిన కాయ ఒక తులము వరకు బరువు ఉండును. వాడుక యందు ఈ కాయ పైన బెరడు ఉపయోగిస్తారు. ఇది అరణ్యములలో ఉండును. గింజ లోపలి పప్పు నేత్రములకు అద్భుతంగా పనిచేయును .

   

*********** సమాప్తం ************* 


  మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

28, అక్టోబర్ 2025, మంగళవారం

Panchaag


 

వేద పండితులు

 వేద పండితులు, ఆవులు కనిబడితే వదలకండి కనీసం ఒక పండైనా ఇచ్చి నమస్కరించండి.

 అందరూ వేదసభలు చేస్తూ వేద పండితుల ఆశీర్వాదములను తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే వేదపండితులు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి యొక్క స్వరూపం కాబట్టి.

"వేదపండితులను సేవించడం" అనేది భగవత్ భక్తిలో అత్యున్నత పుణ్యకార్యాలలో ఒకటి. వేదాలు అపౌరుషేయాలు.వేదాలు సాక్షాత్ పరమాత్ముని ఉచ్చ్వాస నిశ్వాసలుగా భావింపబడతాయి; ఆ వేదాలను అధ్యయనం చేసి, ఆచరిస్తూ, ధర్మాన్ని నిలబెట్టే వారు వేదపండితులు ( బ్రాహ్మణులు, శ్రోత్రియులు, వేదవేత్తలు).

అటువంటి వేదపండితులను సేవించడం అంటే — వేదమాతను, పరబ్రహ్మను సేవించినట్లే.


ఇప్పుడు దీనికి సంబంధించిన ఫలితాలను వేద, పురాణ, స్మృతి ఆధారంగా లోతుగా చూద్దాం 👇


🌿 1. వేదపండిత సేవా ఫలితం — వేదమూల మహాపుణ్యం


🕉️ మహాభారతం (శాంతి పర్వం 234.17)


“బ్రాహ్మణానాం ప్రియో యస్తు వేదశాస్త్రార్ధతత్త్వవిత్।

తస్య పుణ్యం సమం నాస్తి త్రిభిర్లోకై స్సహస్రశః॥”


అర్థం:

వేదం చదువుకుని వేదార్థాన్ని తెలుసుకుని, ధార్మిక జీవితమునే ఆచరిస్తున్న బ్రాహ్మణుడిని సంతోషపరిచినవారికి మూడు లోకాలలో సమానమైన పుణ్యం మరెక్కడా లేదు.

అంటే — వేదపండితులను సేవించడం ద్వారా కలిగే పుణ్యం అనేక యజ్ఞాలు చేసిన ఫలితానికంటే గొప్పది.


🌿 2. వేదపండిత భోజనం — అన్నదానమందు శ్రేష్ఠం.


🕉️ గరుడ పురాణం


“బ్రాహ్మణేభ్యో హి యద్దత్తం దశజన్మఫలప్రదమ్॥”


అర్థం:

వేదవేత్త బ్రాహ్మణునికి ఇచ్చిన దానం లేదా సేవ పది జన్మల పాపాలను హరించి, దశ జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది.


అంటే వేదపండితునికి భోజనం పెట్టడం, దక్షిణ ఇవ్వడం, గౌరవించడం వలన ఎన్నో జన్మల పాపములు తొలగి అపార పుణ్యం లభిస్తుంది.


🌿 3. వేదపండిత సేవ — గురు సేవా ఫలితం


వేదపండితుడు గురువులాంటి వాడు. వేద జ్ఞానం ద్వారా భగవత్పథం చూపుతాడు. కాబట్టి వేదపండితుని సేవ = గురు సేవ =  దైవసేవ.


🕉️ మానవ ధర్మశాస్త్రం 2.232:


“గురు శుష్రూషయా విద్యా పుణ్యమాప్తం సుభావతా॥”


అర్థం:

గురువును సేవించినవారికి జ్ఞానం, పుణ్యం రెండూ సులభంగా లభిస్తాయి.


🌿 4. వేదపండిత సేవ వల్ల లభించే ఫలితాలు


 • 🔸 పాప విమోచనం – గతజన్మలలో చేసిన పాపాలు నశిస్తాయి.


 • 🔸 కులపవిత్రత – వేదపండిత సేవ వల్ల ఏడు తరాల పితృదేవతలు సంతృప్తి చెందుతారు.


 • 🔸 ధర్మస్థిరత – ఇంటిలో ధర్మం నిలుస్తుంది; దురదృష్టం, వ్యాధులు దూరమవుతాయి.


 • 🔸 భగవత్ కృప – వేదపండితుడు భగవంతుని ప్రతినిధి కాబట్టి, ఆయన ఆశీర్వాదం దైవానుగ్రహముగా మారుతుంది.


 • 🔸 జ్ఞానప్రాప్తి – భక్తి, వివేకం, శాంతి స్వయంగా వస్తాయి.


 • 🔸 మోక్షప్రాప్తి – వేదపండితుల ఆశీర్వాదం వలన చిత్తశుద్ధి కలిగి, చివరికి ముక్తి లభిస్తుంది.


🌿 5. సంస్కృత సుభాషితం


“విప్రసేవా పరా పూజా పుణ్యానాం సముచ్చయః।

వేదపండితసేవాసు న త్ర్రైలోక్య మీదృశమ్॥”


భావం:

వేదపండితుని సేవ చేయడం అన్నది పుణ్యకార్యాలలో శ్రేష్ఠమైనది. మూడు లోకాలలో దానికి సమానమైన పూజ లేదు.


🌿 6. చిన్న ఉదాహరణ


భగవాన్ శ్రీరాముడు తాను అరణ్యంలో ఉన్నప్పుడు అగస్త్య మహర్షిని సేవించాడు. పాండవులు దుర్వాస మహర్షులను గౌరవించారు.

అటువంటి సేవ ద్వారానే వారికి దేవానుగ్రహం లభించింది. ఇది వేదపండిత సేవ యొక్క శక్తి.


🔔 సారాంశం


వేదపండితులను గౌరవించడం అంటే వేదమాతను గౌరవించడం,

వేదపండితులకు భోజనం పెట్టడం అంటే యజ్ఞం చేయడంతో సమానం,

వేదపండితులను సేవించడం అంటే పరమాత్మునికి సేవ చేయడం.


అందుకే పూర్వకాలం నుండి “బ్రాహ్మణసేవా పుణ్యం” అనేది ముక్తిమార్గానికి సర్వోత్తమమైన దారి అని పేర్కొన్నారు.


   మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి.పుట్టినరోజులలో, పెళ్లిరోజులలో, వివాహం, గృహప్రవేశం ఇలాంటి అనేక శుభకార్యాలలో, కార్తీక పౌర్ణమి, ఏకాదశి, మహాశివరాత్రి, ఉగాది ఇటువంటి పర్వదినాలలో వేద పండితులను ఆహ్వానించి సత్కరించి ఆశీర్వచనాన్ని అందుకోవడం చేత 33 కోట్ల దేవతలతో కూడిన కాశీ విశ్వనాథుడి ఆశీర్వచనాన్ని అందుకున్న ఫలితాన్ని పొందుతారు, అనేక శుభపులితాలు తప్పక కలుగుతాయి. జైశ్రీరామ్.

ఉపనిషత్తుల వెలుగు*

 *

*ఉపనిషత్తుల వెలుగు*


ప్రపంచం ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా, మనిషి అంతరంగంలో మాత్రం శాంతి కోసం అన్వేషణ ఆగలేదు. 


ఆధునికత, భౌతిక సుఖాలు పూరించలేని ఏదో ఒక శూన్యం మనిషిని నిరంతరం వెన్నాడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలోనే, మన పూర్వీకులు అందించిన ఉపనిషత్తుల జ్ఞానం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.


మన నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన తాత్విక పునాదిని ఉపనిషత్‌ (గురువు దగ్గర కూర్చుని తెలుసుకోవడం అని అర్థం) గ్రంథాలు అందిస్తాయి. 


నవజీవనాన్ని నిర్మించుకోవడానికి ఉపనిషత్తుల సమన్వయం ఎంతో ఉపకరిస్తుంది. 


నేటితరం ఎక్కువగా బాధపడేది అనిశ్చితి, ఒత్తిళ్లతోనే. ఆ దిశగా ఉపనిషత్తులు మనకు అతి ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తాయి. 


బాహ్య రూపం, పదవులు, ఆస్తులు తాత్కాలికమని, మనలో ఉన్నది శాశ్వతమైన, శక్తిమంతమైన ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. 

ఒత్తిడికి విరుగుడు ఇదే. 


శ్రీరాముడికి వశిష్ఠుడు ఉపదేశించినట్లుగా, ‘నువ్వు’ శరీరం కాదు, మనసు కాదు. కేవలం సాక్షి అనే జ్ఞానం స్థిరపడినప్పుడు చిన్న చిన్న వైఫల్యాలు, నిరాశలు మనల్ని కదిలించలేవు. ఒత్తిడికి లొంగిపోకుండా, నిజమైన అంతర్గత శక్తితో పనిచేయడం అలవడుతుంది. 


ఛాందోగ్యోపనిషత్తులోని ‘తత్త్వమసి’ (ఆ సత్యమే నువ్వు) అనే మహా వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఆధునిక సమాజానికి ఎంతో అవసరం. 


స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, సర్వజీవులలోనూ ఒకే చైతన్యం ఉందని, మనలో ఉన్న పరమాత్మే ఎదుటివారిలోనూ ఉందని గుర్తించడం మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈ భావన మనలో సహానుభూతి, కరుణలను పెంచుతుంది. 


ఇతరుల పట్ల ద్వేషం, అసూయ లేకుండా ప్రేమతో మెలిగే గుణాన్ని అలవరుస్తుంది.


ఈశావాస్యోపనిషత్తు చెప్పే ప్రధాన సూత్రం- ఫలితం ఆశించకుండా కర్మ చేయమని. ఉపనిషత్తుల అధ్యయనం మనకు పని పట్ల కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. 


శ్రద్ధ మాత్రమే మన చేతిలో ఉందని, ఫలితం దైవ సంకల్పం లేదా ప్రకృతి నియంత్రణలో ఉందని తెలుస్తుంది. ఫలితంపై అధికారం లేదని గ్రహించినప్పుడు, భయం తగ్గి, మనం చేయగలిగే పనిపైనే దృష్టి ఉంటుంది. ఇది వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. 


మన జాతీయ చిహ్నంపై ఉన్న ‘సత్యమేవ జయతే’ అనే వాక్యం ముండకోపనిషత్తు నుంచి తీసుకున్నది. జీవితంలో స్థిరమైన పునాది ఉండాలంటే, అది కేవలం సత్యం, ధర్మం మీదే ఆధారపడాలి. విలువలు లేని విజయం తాత్కాలికం. ఎన్ని ప్రలోభాలు ఉన్నా, సత్య మార్గాన్నీ, ధర్మబద్ధమైన జీవితాన్నీ ఎంచుకున్న వ్యక్తి ఎప్పుడూ పతనమవ్వడు. 


నిజాయతీ, నైతికతలతో కూడిన వ్యాపారాలు, వృత్తులే దీర్ఘకాలికంగా మనుగడ సాగిస్తాయి.


ఉపనిషత్తులు కేవలం గ్రంథాలు కావు, అవి జీవన సూత్రాలు. అవి మనకు కొత్త లోకాన్ని చూపించవు, కానీ ఉన్న ప్రపంచాన్ని సరికొత్తగా, లోతుగా చూసే జ్ఞానాన్ని అందిస్తాయి. అప్పుడు ఆ ఉపనిషత్తుల వెలుగులో మన ప్రతి అడుగు మరింత దృఢంగా పడుతుంది

27, అక్టోబర్ 2025, సోమవారం

తెలియని వన్ని తప్పులని

 తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్

పలుకగ కాదు రోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ

పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా

రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!

(".... భావ్యమెరుంగవు ... నిరసింతువా..." అని పాఠాంతరం)

Panchaag


 

తేనె గురించి

 తేనె గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

      

     తేనె వలన మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి తేనె మన ఆహారంలో భాగం అయినది. ఈజిప్టు పిరమిడ్లలో 

మమ్మీల పక్కన తేనెతో కూడినటువంటి పాత్రలు కనుగొన్నారు. ఎంతకాలం ఉన్నను చెడిపోనటువంటి ఒకేఒక ఆహారపదార్ధం తేనె . ఆయుర్వేద ఔషధాలలో తేనెని విరివిగా వాడటం జరుగుతుంది. తేనె జీర్ణక్రియతో సంబంధం లేకుండా గ్లూకోజ్ మాదిరి సరాసరి రక్తంలో కలియును. కావున వెంటనే శక్తిని కలిగించును.

         

         ఇప్పుడు మీకు తేనె గురించి సంపూర్ణంగా వివరిస్తాను.

 

° తేనె ఉత్పత్తి -

        

     తేనె వివిధ పుష్పముల నుంచి తేనెటీగల ద్వారా సేకరించబడును. ఇది ఎక్కువుగా అడవుల్లో చెట్లకు , గుట్టలు కు దొరుకును. తేనెటీగలు వివిధ పుష్పములనుంచి సేకరించిన తేనెను చెట్లకు గాని గుట్టలకు గాని తెట్టెలుగా చేసుకుని అందులో భద్రపరుచుకొనును. అట్టి తెనే తెట్టలకు జాగ్రత్తగా పొగపెట్టి తేనెటీగలు ను పారదోలి తేనెతెట్టలను సేకరించెదరు . కాని తెట్టలను తేనెటీగ గుడ్లతో మరియు ఈగలతో సహా పిండెదరు ఇలా సేకరించి సేవించిన తేనె ఆరోగ్యానికి చాలా హానికరం. కావున తేనెటీగలు గుడ్లు పుట్టకముందు తేనెని సేకరించాలి. ఇటువంటి తేనె ఆరోగ్యానికి హానికరం మరియు మధురంగా ఉండును. దీనిని నిలువ కూడా చేసుకోవచ్చు. కాని గుడ్లతో ఉన్న తెట్టల నుంచి తీసిన తేనె కొద్దిరోజుల్లోనే పులిసిపోవును. అందువలనే దాని రంగు , రుచిలో మరియు వాసనలో తేడా వచ్చును. కావున తేనెని సంగ్రహించేప్పుడు తగు జాగ్రత్త వహించవలెను.

 

     స్వచ్చమైన తేనెని పరీక్షించు విధానం -

       

       తేనె వివిధ రుతువులలో వివిధ రంగులుగా ఉండును. అదేవిధంగా దాని సాంద్రత , రుచి కూడా వేరువేరుగా ఉండును. కొన్ని తేనెలు ఎర్రగాను , కొన్ని తేనెలు తెల్లగాను , కొన్ని తేనెలు కొంచం నల్లగాను ఉండును. కొన్ని తేనెలు పలుచగాను , కొన్ని తేనెలు చిక్కగాను ఉండును. అనగా తేనె ఒకే రంగు , ఒకే రుచి , ఒకే వాసన ఎప్పుడూ ఉండదు కావున అది స్వచ్ఛమైనదా లేక నకిలీదా అన్నది గుర్తించడం చాలా కష్టం. కాని ఎల్లప్పుడూ తేనె వాడువారు గుర్తించగలరు.

  

 తేనెని పరీక్షించు విధానం -

        

       స్వచ్చమైన తేనె పైన ఈగ వాలినను దానికి అంటకుండా లేచిపోతుంది. అదేవిధంగా తేనెని ఒక కాగితం పైన వేసిన కిందిభాగం తడి కాదు అదే కల్తీ తేనె అయినచో కాగితం కింది భాగం తడిచిపోవును. 

      

           వీలుంటే మీ కళ్ళముందే తేనె తుట్టెని పిండించుకోండి .

 

 తేనెలో రకాలు -

      

         తేనెలో వివిధ రకాలు కలవు. కాని అందులో రెండు ముఖ్యమైనవి అవి.

                  

                 * చిన్న తేనె * పెద్ద తేనె                                  

          

       చిన్న తేనెటీగలు చాలా వాడిగా , చురుకుగా ఉండును. అవి కుట్టినచో చాలా మంట పుట్టును. ఈ తేనె చాలా తక్కువుగా అరుదుగా లభించును.

            

        పెద్ద తేనె ఇది చెట్లకు , గుట్టలకు చాలా ఎక్కువుగా లభించును.మరియు ఇది అన్ని ఋతువుల్లో లభించును.

 తేనె ఉపయోగాలు -

 

* మలబద్దకం కలవారు ఉదయమున గోరువెచ్చని నీటిలో రెండుచెంచాలు తేనె వేసుకొని తాగినచో సుఖవిరేచనం అగును.

 

* అతిసారం వల్ల నీళ్ల విరేచనాలతో భాధపడువారు రెండు చెంచాల తేనె రోజుకు మూడుసార్లు తీసుకున్నచో అతిసారం తగ్గును.పొట్ట నొప్పి మరియు గ్యాస్ నివారణ అగును.

 

* గ్రహణి రోగం అనగా బంకవిరేచనాలతో బాధపడేవారు తియ్యని మజ్జిగలో రెండు చెంచాలు తేనె కలుపుకుని త్రాగినచో రెండుమూడు రోజుల్లొ తగ్గును.


 * అమీబియాసిస్ సమస్యతో ఇబ్బంది పడువారు నీళ్లలో తేనె కలుపుకుని తాగుచున్న బలహీనత తగ్గును.శక్తి వచ్చును.రోగనివారణ అగును.

 

* దగ్గు, అలర్జీ , ఆస్తమా ఉన్నవారు ఉదయం , సాయంత్రం వేడినీటిలో రెండు చెంచాలు తేనె వేసుకొని తాగినచో వ్యాధి నివారణ అగును. తేనె కఫమును నివారించును.


 * జ్వరం , టైఫాయిడ్ , మలేరియా , మశూచి , ఆటలమ్మ మొదలగు వ్యాధులలో నీళ్లతో కలిపి తేనెని తీసుకోవడం వలన మంచి శక్తి వచ్చును. జ్వరమును తగ్గించును .

 

* గుండెజబ్బులు కలవారు తేనెని వాడటం వలన గుండెజబ్బులు నివారణ అగును. కొలెస్ట్రాల్ తగ్గించును .

 

* బలహీనంగా ఉండువారుకి తేనె అత్యద్భుతమైన ఔషధం , వీర్యవృద్ధిని కలిగించును.

 

* మధుమేహ సమస్యతో ఇబ్బంది పడువారు కూడా తేనెని వాడవచ్చు. మధుమేహరోగులు స్వచ్ఛమైన తేనె వాడవచ్చు . తేనె వాడితే షుగరు పెరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే . రక్తమును శుద్ది చేయును కావున ముత్ర విసర్జన సక్రమముగా జరుగును.

 

* చర్మవ్యాధులు , మొటిమలు , పుండ్లు , గాయాలు , కాలినపుడు , క్యాన్సర్ కణితులకు కూడా తేనె రాసిన నివారణ అగును.

 

* వాంతులు , వెక్కిళ్లు, వేవిళ్లు అగుచున్నప్పుడు రెండు చెంచాలు తేనె తిన్నచో నివారణ అగును.

 

* గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ ఉదయం రెండు చెంచాలు తేనె మంచినీటిలో కాని , కుంకుమపువ్వుతో కాని తీసుకున్నచో మంచి ఎరుపు , తెలుపు కలిగిన ఆరోగ్యవంతమైన శిశువు జనించును.

 

* ప్రతిరోజు రెండుసార్లు చిన్నపిల్లలకు తేనె తాగించినచో వారికి మలబద్దకం , అజీర్ణం , కడుపునొప్పి , అతివిరేచనములు వచ్చే అవకాశం ఉండదు.


 * ప్రతినిత్యం స్త్రీ , పురుషులు ఇరువురు ఉదయాన్నే కాఫీ, టీ లకు బదులు నిమ్మకాయ , తేనె కలిపి తాగినచో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

         

         తేనెలో ఉండు ఔషధ గుణాలు అన్నియు ఆ తేనెటీగలు తిరిగే స్థలంలో ఉండు మొక్కలపై అధారపడి ఉండును. అవి తిరిగే స్థలం నందు ఔషధ మొక్కలు ఎక్కువ ఉన్నచో ఆ తేనె యందు ఔషధ విలువలు ఎక్కువుగా ఉండును.

                       

             

         ******* సమాప్తం ********


 మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  

గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

26, అక్టోబర్ 2025, ఆదివారం

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝     *సంపదః స్వప్రసంకాశాః*

            *యౌవనం కుసుమోపమ్|*

            *విధుఛ్చచంచలమాయుష్యం*

            *తస్మాత్ జాగ్రత జాగ్రత||*


తా𝕝𝕝 *మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది... ఈ జీవితమూ మెరుపు వలె క్షణ భంగురము.. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము....*


✍️💐🌸🌹🙏

Panchaag

 


జ్ఞానము

 *జ్ఞానము అనంతము 5*


సభ్యులకు నమస్కారములు.


11) *పంచాగ్ని విద్య* :- ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనేవి పంచాగ్నులు. వీటి యందు శ్రద్ధ, సోమ, వృష్టి, అన్నము, రేతస్సు అను పంచ ద్రవ్యములను లేక పంచ ఆహుతులను హోమము చేయగా ఉదకములు (వృష్టి) పురుష రూపము చెందుతున్నవి. జీవుడు శరీర బీజములైన సూక్ష్మ బీజములలో చేరి క్రమముగా ఆకాశము మీద శ్రద్ధా రూపంలో చేరి, వర్ష రూపంలో భూమిపై పడి అన్నం రూపంలో పురుషునిలో చేరి, రేతస్సు రూపంలో స్త్రీ గర్భం యందు ప్రవేశించి, అక్కడ పురుషుడుగా వ్యక్తమగుచున్నాడు. శ్రద్ధ అనగా జీవుడు జీవ రూపంలో ఉండుట ధర్మము.

12) *దహార విద్య* :- బ్రహ్మ రంధ్రము నుండి చిన్న కమలము. ఆ కమలము మధ్యన సూక్ష్మమైన శూన్య స్థానము. ఆ శూన్యమే *దహరాకాశ* మనబడును. దీనిని తెలుసుకున్న వాడు బ్రహ్మను తెలుసుకొనగలుతాడు. 

ఈ విద్యనే *దహర* 

విద్య లేక *ప్రాణ* 

విద్య అందురు. జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు,హృదయంలో పుండరీకాక్షుని  రూపంలో స్వామిని ఉపాసన చేస్తారు. ఇది *దహర* విద్య కారణంగానే సాధ్యము.

13) *సంవర్గ - వాయు సంవర్గ విద్య* :- వాయువు ఆనగా హిరణ్యగర్భుడు. ఇతడితోనే ప్రపంచ మంతా పుట్టి, స్థితిని, కల్గి లయించుచున్నది. . సంవర్గమనగా ప్రవిలయము. అనగా అతడి (సృష్టి, స్థితి, లయకారుడు) లో చేరి ఉండుట. సకల దేవతలు, జీవులు, జడ ప్రకృతి అంతా ప్రళయ కాలములో చేరి ఈ వాయువుగా వ్యక్తమగుచున్నవి. ఇట్టి వాయు సంవర్గమును ఉపాసన చేయుచు, తాను గూడా లేనివాడుగా అవ్యక్తమగుటను వాయు సంవర్గ విద్య అందురు. 

14) *మధు విద్య*;-

 సర్వ దేవతలలో ఉండే దైవత్వమును మధువు అందురు. త్రిగుణాత్మకమైన నామ, రూప, క్రియా నటనలను వదిలి, అందలి సారమైనటువంటి ఆత్మ చైతన్యమును గ్రహింపజేయునది మధు విద్య. ఆ సారమే దైవత్వము లేక మధువు లేక అమృతము.  మధు విద్యోపాసకులకు  బ్రహ్మానందము సిద్ధించును.

15) *అపర విద్య* :- 

గడ్డి పరక మొదలు సృష్టి కర్తవరకు గల ప్రకృతి  గుణములను వివేకంతో సరిగ్గా గ్రహించి కార్యసిద్ధిబడయుట.  ధర్మాధర్మములను తెలుసుకొనుట. ఈ రెండింటికి సంబంధించిన విద్యనే అపర విద్య.


శ్లో! *అభ్యసేన క్రియా: సర్వా: !అభ్యాసాత్ సకలా: కళా! అభ్యాసాత్ ధ్యాన మౌనాది: కిమభాసస్య దుష్కరమ్* 


భావం:- అభ్యాసంతో అన్ని పనులు సాధ్యమవుతాయి. అభ్యాసంతో సకల కళలు సాధించవచ్చు. అభ్యాసంతోనే  ధ్యానం, ఆలాగే మౌనం సాధ్యం. అసలు అభ్యాసంతో సాధ్యం కానిదేమిటి. అభ్యాసం మానవుడిని పరిపూర్ణుడిని చేస్తుంది.


ధన్యవాదములు.

*(స్వస్తి)*

శివస్తుతి

 *శివస్తుతి - కార్తికమాసం-విశ్వావసు*


సీ॥

తలపైన గంగమ్మ తాండవంబాడగా 

ఉలుకకుందువు నీకు నోర్పు మెండు 

నాగులెన్నియొ మీద నర్తించి తిరుగాడ 

భూషలందువు గొప్ప పోడిమౌర! 

వ్రేలు పుఱ్ఱెలదండ ప్రీతిగా తలుతువు 

వైరాగ్య మెంతగా ప్రబలెనయ్య! 

వటవృక్షమూలాన వరలు ధ్యానముతోడ 

నిత్యతపము సల్పు నియతి నీది 

తే.గీ.

జాయ పార్వతి తగ్గదై సహకరించ

లోటు లేదయ్య విశ్వేశ లోకములను 

ప్రోచి పాలించు నిన్నేను మ్రొక్కి గొలుతు 

మోక్ష మీయవె దయతోడ వ్యోమకేశ! -6

===========

పోడిమి=ప్రవర్తన

*~శ్రీశర్మద*