తరతరాల వారసత్వ ధార్మిక జీవన వ్యవస్థ మనది ! కోటానుకోట్ల వత్సరాల అత్యద్భత చరిత భరతఖండపు సొంతం ! ఈ పుణ్య స్థలిపై అపౌరుషేయంగా ఆవిష్కరించబడ్డ వేద సంస్కృతి ! భారతీయ సనాతన ధర్మపు మూల స్థంభమై నిలిచిన సంస్కృత భాష ! ప్రతి పదమందున, ఆ భాషా సౌలభ్యం, " సుమైత్రీ భావనాత్మకతా వికాసం, సజ్జన సాంగత్యపు ఆవశ్యకతా నిర్దేశనం ", మన భరత జాతికి గొప్ప వరం ! వేద విజ్ఞానం అనాదిగా నేర్పెడి సఖ్యత, సారూప్యత, విశ్వ ప్రశాంతతకు వెన్నుదన్నై నిలచు ! భారత దేశం, నేటికీ, ఏనాటికీ సకల విశ్వ జీవజగతి శ్రేయోదాయక మార్గగామి ! శ్రుతుల, స్మృతుల, ఉపనిషత్ కథల రూపాన అనుక్షణం వేద సంస్కృతి, సకల లోక స్నేహ చైతన్య స్ఫూర్తి ! వసుధైక కుటుంబక ఆవిష్కరణకు ఏనాటికైనా వలసిన ధర్మం, సుమైత్రీ భావనాత్మకత ! ఆది నుండి ఈ పవిత్ర పృధ్విపై చక్కని కుటుంబ వ్యవస్థకు మారుపేరై నిలిచిన మన భారత దేశం ! ప్రజాస్వామిక వ్యవస్థ మూలాలకు ఆస్కారం, చక్కని సయోధ్య, సుహృద్భావం ! ఈ ధర్మ పద్ధతి విశ్వ వ్యాప్తంగ సదా సర్వదా ఆచరణీయం, అనుసరణీయమన్న సత్య దార్శనికత ! దురదృష్టకరం, నేటి విశ్వ వ్యాప్త దుర్భర స్థితిగతులు, ఈ ధర్మాన్ని అతిక్రమించడం బహు శోచనీయం ! నేటి విశ్వ విద్వేషాలు, అనుమానవమానాలు తేలేవెన్నటికి సుహృద్భావ, సువ్యక్తిత్వ సానుకూల స్థితిగతులను ఈ ఇలపై ! రానురాను క్రూరత్వం, ఆపై ఉగ్రవాద స్వభావం, విశ్వ వ్యాప్తంగ పెచ్చుమీరుతున్న దుస్థితి ! మానవ సంబంధాలు గతి తప్పుతున్న నేపథ్యంలో నేటి విశ్వ వ్యాప్త జీవన గమనం ! నేటి విశ్వ మానవాళి నందు, సుమనోవిజ్ఞాన స్ఫూర్తితో, సుసంపన్నమైన సమైక్య భావనాత్మక మైత్రి నెలకొనాల్సిన తరుణమిది ! వారి మనమున, " జీవకారుణ్యతా సహృదయ చైతన్య భావన ", ఆవిష్కృతమవాల్సిన నేపథ్యం ! పవిత్ర భారతీయ సనాతన ధర్మపు మూల సూత్రం, " బ్రతుకు, బ్రతకనివ్వు, అనెడి సానుకూల సముచిత సమైక్య చింతన ", మన వేద విజ్ఞానం నేర్పెడి ధర్మబద్ధ జీవన పద్ధతి ! ప్రాతఃకాలపు కుక్కుట నాద మైత్రీ భావనాత్మక స్ఫూర్తి, అనాదిగా ప్రకృతి ఈ విశ్వ జీవజగతికి మార్గదర్శి ! సుస్నేహ సానుకూల సుహృద్భావ మైత్రీ బంధం, ఈ పవిత్ర పృధ్విపై ప్రశాంత జీవన సోపానం ! బ్రహ్మ దేవునిచే ప్రత్యేక విధాన సృష్టించబడ్డ మానవ జాతి, సకల విశ్వ జీవజగతి ప్రశాంత జీవన గమన ఆశాజ్యోతి ! " యద్భావం తద్భవతి "
సర్వే భవంతు సుఖినః !
సర్వే సంతు నిరామయా !
సర్వే భద్రాణి పశ్యంతు !
మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ ! 🙏
సహనావవతు ! సహ నౌ భునక్తు !
సహవీర్యం కరవావహే ! తేజశ్వి నావధీతమస్తు ! మా విద్విషావహై !
ఓం శాంతి శాంతి శాంతిః ✍️
గుళ్లపల్లి ఆంజనేయులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి