2, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఏది శాశ్వతం

 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘


      _*👌*మనిషి జీవితంలో ఏది శాశ్వతం. నీవు సంపాదించిన ఆస్తి పాస్తుల, ధనధాన్యాల, సిరిసంపదల, నీ ఇల్లా, చివరికి నీ శరీరమా? మరి ఏది శాశ్వతము. ఒకసారి పరిశీలిద్దామా..*_👌


     _**సమయం ఉదయం ఎనిమిది గంటలు, సుబ్బారావు తన ఇంటిముందు వసారాలో కూర్చొని ప్రస్తుతం వాడి వేడిగా నడుస్తున్న రాజకీయ ఎత్తుగడల గురించి న్యూస్ పేపర్ లోని వార్తలను ఆసక్తిగా చదువుతున్నాడు. ఇంతలో గేటు దగ్గర ఒక బిచ్చగాడు నిలబడి, "భవతీ భిక్షాందేహి " అంటూ కేక వేశాడు. వార్తలు చదవడంలో మునిగి తేలుతున్న సుబ్బారావు ఆ కేక విని చిరాకు పడుతూ, "ఇదేమైనా సత్రం అనుకున్నావా ! పొద్దున్నే తగలడ్డావ్, నీకింకేమ్ పని పాట లేవా.. వెళ్ళవయ్యా వెళ్ళు ..ఛీ.. ఛీ.. ఏదైనా పని చేసుకొని చావొచ్చు కదా అవతలికి పో..పో.." అంటూ చిరాకు పడ్డాడు.*_


     _**అప్పుడా బిచ్చగాడు చాలా శాంతంగా సుబ్బారావుతో అయ్యా కొంచెం మీతో మాట్లాడొచ్చా అని అడుగగా సుబ్బారావు ఏ విషయం గురించి అన్నాడు. అయ్యా "ఈ ఇంటిని ఎవరు కట్టించారు స్వామీ !" అని అడిగాడు బిచ్చగాడు. సుబ్బారావు "ఇది నా ముత్తాతల ఇల్లు. నా తాత తరువాత మా నాయన, ఇప్పుడు నేను నివసిస్తున్న ఇల్లు ఇది. ఇప్పుడు మాత్రం ఇది నా ఇల్లే " ఇప్పుడు ఇది నాకు శాశ్వతం అని చాలా గర్వంగా అన్నాడు.*_


     _**అప్పుడు బిచ్చగాడు.. "మీ తాత తానున్నంతకాలం ఈ ఇల్లు నాది నాది అన్నాడు. తరువాత మీ నాన్న తానున్నంతకాలం ఈ ఇల్లు నాది నాది అన్నాడు. ఇప్పుడు నీవు ఈ ఇల్లు నాది నాది అంటున్నావు. మీ వారందరూ కొంతకాలము ఇది నా ఇల్లు నా ఇల్లు " అని చెప్పుకొని, తరువాత ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు కదా.. రేపు నువ్వు పోతే కూడా నీ కొడుకు ఇది నా ఇల్లు నా ఇల్లు అంటాడు కదా.. మరి ఈ ఇంట్లో ఎవరు కూడా శాశ్వతంగా ఉండలేరు కదా.. చివరికి ఎవరు శాశ్వతం, ఏది శాశ్వతం. ఏది శాశ్వతం కాదు. రేపు నీవు చనిపోతే నీ శరీరం కూడా నీది కాదు, ఈ నీ ఇల్లు, నీ శరీరం, నీ భార్య, పిల్లలు ఎవరూ కూడా నీ వెంట రారే. అటువంటప్పుడు ఈ కట్టడము నీకెలా శాశ్వతం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఒక 'సత్రం' కాక మరేమిటి " అని ప్రశ్నించాడు.*_


      _**ఈ జగత్తులో ఏది శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతంగా ఉండరు. మన కంటికి కనపడే ఈ జగత్సంబధమైన విషయములు అన్నీ కూడా తాత్కాలికములే.. శాశ్వతమైనది ఒక్కటే.. అదే "భగవంతుని సాన్నిధ్యం". అందుకే ఆయన సన్నిధికి చేరుకొనే మార్గాన్ని మనం తెలుసుకొని దాన్నే ఎంచుకొని అనుసరించాలి. ఆ మార్గమే "మానవ సేవే మాధవ సేవ ". చివరికి నిన్ను ఆ భగవంతుడి సన్నిధికి చేరవేసేది ఇతరులకు నీవు చేసిన మేలు, సహాయమే. అందుకే ఆకలై నీ ఇంటి ముందుకొచ్చిన అన్నార్తుల ఆకలిని తీర్చాలి. సహాయం కోరి నీ ఇంటి ముందుకొచ్చిన వారికి నీ చేతనైనంత సహాయం చేయాలి. చేయూతనిచ్చి వారికి ఉపశమనం కలిగించాలి.*_


      _**చూడండి మనిషి జీవితాన్ని కన్నీళ్లతో భాగిస్తే, మిగిలేవి బాధలు భయాలే. భవిష్యత్తును ఊహలతో కూడితే, వచ్చేది మొత్తం కలతలే. ఆఖరికి కొస ప్రాణాలను చివరి కోరికతో గుణిస్తే, దక్కేది శ్మశానమే. అందుకే జీవించే కొద్దికాలం సేవాభావంతో ఇతరులకు నీ చేతనైన సహాయం చేస్తూ జీవించాలి. భగవంతుడు మనిషికి ప్రత్యేకంగా తెలివిని, మంచి బుద్ధిని, ప్రేమను పంచే హృదయాన్ని ఇచ్చాడు. వీటికి విజ్ఞత, విద్య, వినయం, సేవాతత్పరత తోడైతే వాళ్ళ జీవితం కళ్యాణమయమే. పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ, విలువలు, వ్యక్తిత్వం, సేవా దృక్పథం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు దయామయుడుగా ఉండడమే నీవు నీ జీవితంలో సాధించ గలిగే గొప్ప విజయం.*_


    _**కాబట్టి ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేస్తున్న బిచ్చగాడిని చులకనగా చూడకండి. ఎందుకంటే.. ఆ బిచ్చగాడు మనకు ఒక హెచ్చరికను చేస్తూనే ఉంటాడు. అదేమిటంటే, "నేను పూర్వజన్మమున ఎవరికీ బిచ్చము పెట్టక, ఈ జన్మమున ఇటుల భిక్షగాడినయ్యాను. నా వలెనే మీరూ అవకండి అని.. కాబట్టి అందరూ దానధర్మాలు చేయండి " అని అంటూ గృహస్థులను మేలు కొలుపు తుంటాను అన్నాడు ఆ బిచ్చగాడు..*_

 

     _**ఇదంతా నోరెళ్ళబెట్టి వింటున్న సుబ్బారావు వెంటనే లోపలి కెళ్ళి దోసిటితో బియ్యాన్ని తెచ్చి ఆ బిచ్చగాడి జోలెలో వేసి అతడికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. కాబట్టి మిత్రులారా ! అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే "మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నీవు సంపాదించిన ధనధాన్యాలు, సిరిసంపదలు, ఆస్తి పాస్తులు, నీ ఇల్లు, నీ శరీరం ఇవేవీ శాశ్వతం కాదు. ఇతరులకు నీవు చేసే మేలు, సహాయం, సేవలు ఇవి మాత్రమే శాశ్వతం అని తెలుసుకొన్నారు కదా.. కాబట్టి మీరందరూ కూడా సేవా దృక్పథంతో, మీకు చేతనైనంత దానధర్మాలు చేస్తూ ఆ భగవంతుడి కృపకు పాత్రులై ఆయన సన్నిధికి చేరుకొంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్..*_👌


_*🤘*లోకాసమస్తాసుఖినోభవన్తు**_🤘


_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘


       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌


      

                   


                                         _

కామెంట్‌లు లేవు: