🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పురుష ప్రయత్నం!*
➖➖➖✍️
*జీవితంలో పురుషప్రయత్నం ప్రాధాన్యం గురించి రామకృష్ణ పరమహంస చక్కని దృష్టాంతాన్ని చెబుతారు.*
* మైదానంలో తాడుతో కట్టేసిన ఆవును ఉదాహరణగా చూపుతూ వివరిస్తారు. *
*మెడకు కట్టిన తాడు ఆ గోవు స్వేచ్చకు ప్రతిబంధకమే! దాని కదలికలకు అది పరిమితిని విధిస్తుంది.*
*తొలుత అంత వరకే తన స్వతంత్రేచ్ఛ (ఫ్రీవిల్) అనుకొని ఆ గంగిగోవు కూడా తనను తాను సమాధాన పరుచుకుంటుంది.*
*అందుకే తన పరిధి మేరకు గడ్డి మేస్తూ కాలం గడిపేస్తుంది. *అక్కడ ఇక తనకు గ్రాసం లభించదని రూఢి అయ్యాక దూరంగా ఉన్న గడ్డిపైకి దృష్టి మళ్లిస్తుంది. మెడకు కట్టిన తాడును విదిలించుకొని ఆ పచ్చిక వైపు పరుగులు తీసేందుకు పరిపరివిధాలా ప్రయత్నిస్తుంది.*
* అప్పుడు ఆ మూగజీవి తపనను యజమాని గమనిస్తాడు. అది తాడును వదిలించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు అతడు గుర్తిస్తాడు.*
* ఆ ఆవు ఆరాటాన్ని అర్థం చేసుకొని దాని మెడకు కట్టిన తాడును విప్పేసి మైదానంలోకి వదులుతాడు.*
* ఆ గోవుకు కట్టిన బంధనం లాంటిదే మన తలరాత. తెంచుకోవాలని ప్రయత్నించడమే పురుషార్థం. ఆ యజమానే భగవంతుడు.*
* విధికి దీటుగా మనిషి ఎంత తీవ్రంగా పోరాడితే, అంత త్వరగా ఆ శృంఖలాల నుంచి బయటపడగలడు.*✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి