ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరిక్ష గురించి సంపూర్ణ వివరణ - 4 .
అంతకు ముందు పోస్టులలో అష్టమస్థాన పరీక్షలలో ప్రధమం అయిన నాడీ పరీక్ష గురించి వివరించాను. ఇప్పుడు మిగిలిన వాటిగురించి వివరిస్తాను.
* స్పర్శ పరీక్ష -
స్పర్శ అనగా రోగిని తాకి పరీక్షించడం . రోగిని తాకి చల్లదనము , గరుకుదనము , చమట , ఆవిరి మున్నగు వాటిచే వ్యాధులను గుర్తించుట .
వాతము -
వాతము నందు శరీరము యొక్క స్పర్శ ఆరిపోయి చల్లదనం కమ్ముచుండును.
పిత్తము -
పిత్తము నందు శరీరము వేడిగా ఉండును .
శ్లేష్మము -
శ్లేష్మము నందు శరీరము చల్లగా ఉండును.
జ్వరము నందు శరీరము పోగలుగా , తాపము చెంది ఉష్ణముగా మరణముగా ఉండును. చనిపోవు వానికి శరీరము కొయ్యబారి పోవును .
* రూపము -
రోగి యొక్క శరీర స్థితిని బట్టి రోగ కారణము నిర్ణయించు పద్దతి. రోగి వాత సంబంధ దోషము కలిగి ఉన్న శరీరము నలుపురంగుతో , పిత్తము నందు పసుపుపచ్చ , శ్లేష్మము నందు తెలుపు వర్ణములు కలిగి ఉండును. ఆయా వ్యాధులను బట్టి రోగి యొక్క ఆకారము తెలుపు మున్నగు రంగులను కలిగి ఉండును. పాండు వ్యాధి నందు శరీరం తెల్లగా పాలిపోయి ఉండును. క్షయరోగము నందు ఆరిపోవును . శరీరము నందు కొవ్వు శాతం తగ్గిపోవును . కామెర్ల వ్యాధి నందు శరీరం పచ్చగా ఉండును. ఇలా వ్యాధిని బట్టి తెలుసుకొనవలెను .
* శబ్దము -
శబ్దము అనగా రోగి యొక్క మాట్లాడు ధ్వనిని బట్టి రోగనిర్ధారణ చేయుట . వాతము నందు శబ్దము హెచ్చుతగ్గులతో నిలకడలేకుండా ఉండును. పిత్తము నందు అధికంగా ఉత్సహముగా ధ్వని ఉండును. శ్లేష్మము నందు హీనస్వరము కలిగి ఉండును. భ్రమ , అపస్మారము , పైత్యజ్వరము , సన్నిపాతము మున్నగు వ్యాధులలో రోగి అతిగా ధ్వని కలిగినవాడై ఉండును. వికృతముగా అరుచును. రహస్యములు పైకి చెప్పువాడై ఉండును. కఫము నందు భయము , సిగ్గు , దుఃఖం మున్నగు వాటి యందు శబ్దము క్షీణించి ఉండును.
పైన చెప్పినవిధముగా వాత, పిత్త , కఫ దోషాల గురించి తెలుసుకోవచ్చు . మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు.
తరవాతి పోస్టు నందు అష్టమస్థాన పరీక్ష యందలి మిగతావిషయాల గురించి వివరిస్తాను .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి