3, జూన్ 2021, గురువారం

పరమేశ్వర శక్తిని సంబోధన

 జగత్భద్రాయమాణోదయా అని పరమేశ్వర శక్తిని సంబోధన.దీనినే ఋగ్వేదం అణో భద్రా సూక్తము వివరించింది. భద్రం అనగా చాలా అర్దములు కలవు. జాగ్రత్త, వ్యవహారిక క్రియ నామమే. అనగా వాడు

కలో చేసే పనులలో జాగరూకులుగా వుండమని. కర్మలను ఆచరించునప్పుడు జాగ్రత్త లేనియెడల ఆ కర్మ ఫలం వేరుగా యుండును. ఫలం వలన కర్మ ఫలితం గుణం అనుభవించిన గాని అది మంచి చెడ్డలు యనే ఙ్ఞానం కలుగదు. అది ఎవరికి వారికి అనుభవముచే వారి వరకే ఆ కర్మ, లేదా యితరులు కూడా దాని వలన నష్టం సంభవించును.యితరులను నష్టపరచే హక్కు నీకు లేదు. ఎవరి కర్మ ఫలం వారే అనుభవం. అందువలన కర్మ నీకే పరిమితం. వేరొక పరిశీలనలో జగత్తు భద్రం అనే గుణం కలిగియున్నది. జగత్తు అనగానే చైతన్యమైనదే కాని అదీ ప్రకృతి వలననే. దాని లక్షణము దర్శించుటకై. కొన్ని కంటికి కనబడవు. కరోనాలాగానే. కంటికి కనపడకపోతే దాని నిర్ణయం లక్షణము ద్వారానే తెలియును గాని లేదని ఎలా చెప్పుట. అనుభవం వలన తెలియుట. జగత్తు భద్రం అయితే అనగా భూమి ప్రకాశవంతమైన యెడల దానికి మూలము అణోదయా. అణువు ఉదయించుట.అణువు వుదయించుట యనగా శక్తి చైతన్యమైనదే. నిద్ర లేచుట యనగా అణువు వికశించుటయనగా, ఆత్మ చైతన్యం నిద్రలో చైతన్య లక్షణము ప్రాకృతింకంగా తెలియదు. ప్రకృతి లక్షణము నిద్రలో తెలియనట్లు చీకటి యనే అఙ్ఞానంలో అనగా తమస్సునుండి జ్యోతి లోనికి వెళ్లుట. సాధన వలననే. తమలోనన్న తన జ్యోతి ఉష్ణ రూపంగా.ఉష్ణమునువచైతన్యపరచిన౭ాని దాని లక్షణము తెలియనట్లు. దీనికి ఆత్మను జాగరూకతతో క్రమ పధ్దతిలో  నీవు ఎంచుకున్న మార్గము అదియేదైనాగాని కర్మ ఫలమును స్థిరమైన చలనములో చైతన్యపరచుటయే దీని పరిశీలన, అనగా సాధన. జగత్ భద్రాయం అణోదయా. ఆణో భద్రాయం సూక్తం వివరణ యిదియే. యింత అనంతమైన ఙ్ఞానం నేను అనే  ప్రకృతిని దాని సూత్ర కారకుడైన విష్ణు పరమైన ఈశ్వర శక్తియేయని తెలియవలెను. దానిని మామూలు దృష్టికి అందనిది. సూక్మరూపంగా నిశిత పరిశీలన ఆత్మతో అనుసంధానము చేసిన గాని దానిగురించి సత్య దర్శనం కాదు. దీనినే భవాయచ అని భవాయచ, రుద్రం  వ్యాప్తి వలన భవాయచ  భవానీ అయి రూపం దాల్చినది.యిక్కడ భవానీ అనగా రూపం తెలిసినది. పదార్థ లక్షణము తెల్సిన తదుపరి పదార్థమని తెలిసినది.యివి అన్నియు శక్తి యెుక్క వ్యాప్తమునకు సూత్రములు యని తెలియవలెను. సమస్త అనంతమైన ప్రకృతి శక్తి కాంతి లక్షణము ప్రయెూగ శాలలో శోధించుట కాని పని. ప్రత్యక్షంగా కంటికి పదార్ధరూపంలో ప్రకృతిగా కనబడుచున్నది. పదార్ధ లక్షణము కూడా తెలుస్తూనే వున్నది అనుభవ పూర్వకంగా.తెలుసుకుంటూనే వూందాం. ఆచరిస్తూనే వూందాం.

కామెంట్‌లు లేవు: