*నాకు నచ్చిన పుస్తకం*
*గీతా రహస్యం_బాలగంగాధర తిలక్*
శ్రీమద్ భగవద్గీతా రహస్యం గీతారహస్యం అనే పేర్లతో ప్రసిద్ధమైన గ్రంథం గీతారహస్యం.
కర్మయోగ శాస్త్రం అని కూడా ప్రసిద్ధి పొందిన అద్భుత గ్రంథం.
భారత సామాజిక సంస్కర్త మరియు స్వాతంత్ర్యోద్యమాన్ని ఉర్రూతలూగించిన గొప్ప దేశభక్తులు బాల్ గంగాధర్ తిలక్ గారు బర్మాలోని 1915 లోమాండలే జైలులో ఉన్నప్పుడు మరాఠీ భాషలో రాసిన గ్రంథమిది.
కర్మ యోగాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే తిలక్ మహాశయుని గీతారహస్యాన్ని చదవాల్సిందే.
వారేమంటారంటే భగవద్గీత అందించే నిజమైన సందేశం కర్మ సన్యాసం (చర్యలను త్యజించడం) కాదు. నిష్కామ కర్మయోగాన్ని (నిస్వార్థ కర్మ) అర్థం చేసుకోవాలంటారు.
ఆది శంకరాచార్యుల తరువాత అంత గొప్పగా భగవద్గీత ను వ్యాఖ్యానించింది తిలక్ మహాశయులే. మీమాంసా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వారి విశ్లేషణ సాగుతుంది.
ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం తాత్వికత తో నిండి మన ఆలోచనలను లోలోతుల్లోకి ప్రయాణింపజేస్తుంది.
ఇక రెండవ భాగం గీతయొక్క అనువాదంతో పాటు అద్భుతమైన వ్యాఖ్యానాన్ని కలిగి ఉంటుంది.
1908 నుండి 1914 వరకు మాండలే జైలులో ఖైదు చేయబడినప్పుడు తిలక్ తన చేతివ్రాతతో పెన్సిల్‌తో ఈ పుస్తకాన్ని వ్రాసాడు. 400 కంటే ఎక్కువ పేజీల స్క్రిప్ట్ నాలుగు నెలల కన్నా తక్కువ వ్యవధిలో వ్రాయబడింది మరియు అందువల్ల దీనిని "గొప్ప సాధన" గ్రంథంగా భావిస్తారు ".
ఆ తరువాత ఆయన పూనాకు తిరిగి వచ్చినప్పుడు 1915 లో ఈ పుస్తకం ప్రచురించారు.
క్రియాశీల జీవనసూత్రం, క్రియాత్మక నైతిక బాధ్యతను ఆయన సమర్థించారు.
కర్మ నిస్వార్థంగా , వ్యక్తిగత ఆసక్తి లేకుండా ఉండాలంటారు.
వారి గీతారహస్యాన్ని చదివిన తరువాత వేలాదిమంది స్వాతంత్ర్యోద్యమంలో క్రియాత్మక భాగస్వామ్యాన్ని అందించారు. అతివాదులకు, మితవాదులకు సమానమైన స్ఫూర్తినిచ్చిన అద్భుతమైన గ్రంథం గీతారహస్యం.
గీతారహస్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత
ఒక రైతు గొప్ప వ్యవసాయదారుడౌతాడు. ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడవుతాడు. వ్యాపారి సమాజ హిత వాణిజ్యం చేస్తాడు. ఉద్యమకారుల ఉత్సాహాన్ని ఉపిరిపోస్తుంది ఈ గ్రంథం.
మానవ సంబంధాలు మహనీయంగా మారుతాయి.
ఇంగ్లీషు తో పాటు భారతీయ భాషలన్నింటిలో అనువదించబడ్డ గీతారహస్యం తెలుగు అనువాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు.
నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనువాదం గ్రాంథికమైనా తిలక్ గారి ఆత్మను ప్రకటిస్తుంది.
భగవాన్ శ్రీకృష్ణుడు చూపిన మార్గంలో నడిపిస్తుంది.
*నంది శ్రీనివాస్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి