*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*981వ నామ మంత్రము* 27.8.2021
*ఓం జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్యై నమః*
ఇక్కడ జ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానము. పరమేశ్వరి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. అలాగే జ్ఞేయ అనగా జ్ఞానముచే (ఆ తల్లి అనుగ్రహము) పొందదగినది. గనుక అమ్మ వారు జ్ఞానము మరియు ఆ జ్ఞానముచే పొందదగినది. గనుకనే ఆ అమ్మ *జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ* యని అనబడినది. ఆ తల్లియొక్క స్థూలరూపాన్ని మనోనేత్రాలతో తిలకించితే ఆ సుందరదరహాస వదనంలో ఆ అమ్మవారి జ్ఞానస్వరూపం కనిపిస్తుంది. అలా మనోనేత్రాలతో చూడాలంటే మనంకూడా జ్ఞానము కలిగినవారిగా, శ్రీవిద్యా తత్త్వమును తెలిసినవారిగా ఉంటే ఆ సుందరదరహాస వదనం మనను అనుగ్రహిస్తున్నట్లు కనబడుతుంది. అందుకనే అమ్మవారు జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. అమ్మవారిని అంతర్ముఖంగా స్మరిస్తూ, పరిశుద్ధమైన మనసుతో ఉన్న భక్తులకు ఆ తల్లి జ్ఞానజ్ఞేయస్వరూపిణిగానే గోచరిస్తుంది. అమ్మవారు *అంతర్ముఖ సమారాధ్య* అంతేగాని బహిర్ముఖ సమారాధ్యకాదు.
చేరవలసిన గమ్యము అమ్మవారే. అనుసరించ వలసిన మార్గముకూడా అమ్మవారే. గనుక ఆ తల్లిని *ఓం జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్యై నమః* అని స్మరిస్తూ నమస్కరించవలయును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి