21, మే 2022, శనివారం

భగవంతుని సృష్టి

 **సర్వం భగవంతుని సృష్టి...కానీ మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో వున్నాయి. వాటిలో రాగిపాత్రల విశిష్టత గురించి తెలుసుకుందాము.**

                       ***

**మందిరాల్లో మరియు నిష్టాగరిష్టులైన మహానుభావుల ఇళ్ళలోనూ పూజా సమయాల్లో రాగిపాత్రలనే వాడుతుంటారు.* *ఇది మన నిత్యానుభవంలోని విషయం,వెండి, బంగారు పాత్రలను వాడగలిగే ధనవంతులు సైతం ఈ రాగి పాత్రలనే వాడటంలో గల మర్మం ఏమిటి?*

*ఈ విషయమై మహావిష్ణువును ప్రశ్నించింది భూదేవి.*

*బంగారు, వెండి, కంచు మొదలైన పాత్రలతో కాక రాగి పాత్రలతో కర్మానుష్టానం చేస్తే నేను సంతోషిస్తాను. ఏడువేల యుగాల క్రితం నామాయ కారణంగా ఈతామ్రం (రాగి) పుట్టింది.* 

*'గుడాకేశుడనే' అసురుడు తామ్రరూపంతో నన్నారాధిస్తుండేవాడు.*

 *ఒకసారి నేనాతని ఆశ్రమానికి వెళ్ళాను. అద్భుతంగా ఉందా ఆశ్రమం సంతోషించాను.  అతడు నన్నారాధించాడు. తృప్తిపడ్డాను . కావలసిన వరంకోరుకొమ్మన్నాను . సుదర్శన చక్రంతో తనను వధించమని కోరాడు. తన అవయవాలన్నీ తామ్రరూపం దాల్చాలనీ, భగవదారాధనకు ఆపాత్రలనే వాడాలనీ సవినయంగా కోరాడు 'గుడాకేశుడు'.* *ఒకశుభముహూర్తంలో వైశాఖ శుక్ల ద్వాదశినాడు గుడాకేశ సంహారం జరిగింది. అతని కోరిక నెరవేరింది. ఈ విధంగా ఆనాటి నుండి మనకు తామ్ర పాత్రలు ప్రాప్తించాయి.*

                       ***

 ""పవిత్రాణాం పవిత్రం చ మంగళానాం చ మంగళమ్

విశుద్ధానాం శుచిశ్చైవ తామ్రం సంసార మోక్షణమ్""

                       *** 

*రాగి అత్యంత పవిత్రమైనదే గాక ఈ సంసారబంధం నుంచి ముక్తి నివ్వగలదు.*

                        ***

            **ఇదం న మమ**

        **శుభప్రదమైన రోజు**

కామెంట్‌లు లేవు: