✍🏼💧
_మనిషి శరీరం కూడా ఒక కురుక్షేత్రం లాంటిదే, అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యం అయితే, దుర్మార్గముతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు, వాటి మధ్య జరిగే ప్రతి ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామంతో సమానం_
_అసలు మనిషి పుట్టగానే మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది, పెరిగి పెద్ద అయ్యేకొద్దీ, ఇది నాది, అది నీది అనే స్వార్ధము, నీవు వేరు, నేను వేరు అనే భేదబుద్ధి, ఇది అంతా నాకే కావాలి, నీకు ఇవ్వను అనే లోభత్వము, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము, నీకు అంత ఉంది, నాకు ఇంతే ఉంది అనే అసూయ, క్రమక్రమంగా మనసులను, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తుంది_
_ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి మంచి గెలుస్తుంది, మరో సారి చెడు గెలుస్తుంది, దాని వలన సుఖము, దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి, ఈ సంసార సాగరము నుండి బయటపడాలంటే సత్పురుషుల మార్గదర్శనంలో సత్ప్రవర్తనతో, సత్సంగం అనే పడవలో ప్రయాణం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూఉండాలి_
☝ *మిలింద్ కుమార్* ☝
*9440603399*
🌳🌳🌳💎🌳🌳🌳
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి