21, నవంబర్ 2022, సోమవారం

_ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం_*

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸



*_ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం_*


సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన 

అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. 


ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి 

చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. శివ భక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు.


ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల.. 

శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. 


అంతేకాదు శివ భక్తులు వీలైనప్పుడల్లా 

ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ ఉంటే.. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..


వాస్తవాలు


ఓం నమః శివాయ అనే మంత్రంలో న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాలున్నాయి. 

ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి.


స్మరణ


యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు.


ప్రయోజనాలు


ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, 

నిర్మలంగా ఉంటుంది. జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది.


అనుకూల పరిస్థితులు


ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అనుకూల పరిస్థితులు ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి. దుష్టశక్తులు దరిచేరకుండా కాపాడుతుంది.


తీవ్రమైన మానసిక ఒత్తిడి


ఈ మంత్రాన్ని క్రమంతప్పకుండా స్మరించడం వల్ల మెదడు, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే డిప్రెషన్, నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఒత్తిడి తగ్గించి, ప్రశాంతత కలిగిస్తుంది.


108 సార్లు


ప్రతి రోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు స్మరించడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయి. జీవితంలో ప్రశాంతత పొందుతారు.


ఎప్పుడు స్మరించాలి?


ఓం నమః శివాయ మంత్రం స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వేకువ జామున స్నానం చేసి, కాళ్లు ముడుచుకుని, నిటారుగా కూర్చోవాలి. కళ్లు మూసుకుని జప మాల తీసుకుని ఓం నమః శివాయ మంత్ర జపం మొదలుపెట్టాలి. 


ఒకవేళ జపమాల లేకపోతే.. వేళ్లతో లెక్కపెట్టుకోవచ్చు.


ధ్యానం


108 సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత అలాగే.. కొన్ని నిమిషాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది.


సర్వే జనాః సుఖినో భవంతు


అన్యధా శరణం నాస్తి,త్వమేవ | శరణం మమ, తస్మాత్కారుణ్య భావేనా || రక్షరక్ష మహేశ్వరా...


స్వస్తి..



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కామెంట్‌లు లేవు: