12, నవంబర్ 2022, శనివారం

శివుని పశ్చిమ ముఖమును నమస్కరించుచున్నాను.🙏

 శ్లోకం:☝️

*ప్రాలేయాచల చంద్రకుంద*

  *ధవళం గోక్షీరఫేన ప్రభం*

*భస్మాభ్యక్తమనంగదేహ*

  *దహన జ్వాలావళీలోచనం l*

*బ్రహ్మేంద్రాది మరుద్గుణై స్తుతి*

  *పరై రభ్యర్చితం యోగిభి*

 *వందేహం సకలం కళంకరహితం*

  *స్థాణోర్ముఖం పశ్చిమం ll*

 - సద్యోజాత ముఖధ్యానం


భావం: హిమవత్పర్వతం, చంద్రుడు, మొల్లపూవు.. వీటి వలే తెల్లనిది, ఆవు పాల మీద నురుగు వలే తెల్లని కాంతి కలది, విభూతి పూయబడినదీ, మన్మథుని శరీరాన్ని దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలది, బ్రహ్మేంద్రాది దేవ సమూహాల చేత, యోగుల చేత శ్రద్ధతో అర్చింపబడుతున్నదీ, నిర్మలమైన నిండు వదనముతో కనబడుచున్నదీ అయిన శివుని పశ్చిమ ముఖమును నమస్కరించుచున్నాను.🙏

కామెంట్‌లు లేవు: