ఋతుశూల హరించుటకు నేను ప్రయోగించిన సులభ ఔషధ యోగం -
ఈ ఋతుశూల అనునది చాలామంది స్త్రీలలో కనిపిస్తుంది. దీనిని ముట్టునొప్పి అనికూడా అంటారు. ఇది చాలా భయంకరమైన నొప్పితో కూడుకొని ఉంటుంది. ఇది కేవలం బహిష్టు సమయంలో వస్తుంది. కొంతమంది తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడతారు. మరికొంతమందికి ఈ ముట్టునొప్పి ఉండటం వలన సంతానం ఉండదు.
ఇప్పుడు మీకు నేను చెప్పబోయే చికిత్స నా అనుభవపూర్వకం . మరియు అతి సులువు అయినది. దీనిని ఉపయోగించి చాలమంది సమస్య నివారించగలిగాను .
ముట్టునొప్పి ఉన్నవారు తెల్లజిల్లేడు పాలు 5 చుక్కలు చక్కెరకేళి అరటిపండులో గుంటలా చేసి అందులో వేసుకొని ఉదయం పూట మాత్రమే 4 రోజులు సేవించినచో ఋతుశూల తగ్గిపోవును .
మరియొక నా అనుభవ యోగం -
ముదురు చింతచెట్టు బెరడు తెచ్చుకొని ఆ బెరడుని కాల్చి బూడిద చేయవలెను. వేరే కర్రపుల్లలు వాడరాదు . ఆ బూడిదని జల్లించి ఆ పొడిని భద్రపరచుకొని ఇంకో రెండు రోజుల్లో బహిష్టు అవుతారు అనగా ఆ బూడిదని ఒక గ్రాము మోతాదుగా ఉదయం పూట కొంచెం నిమ్మరసంలో కలిపి తీసికొనవలెను . మరలా సాయంత్రం పూట ఒక గ్రాము తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి . బహిష్టు మూడు రోజులు కూడా ఇలాగే సేవించాలి . దీనివల్ల ముట్టునొప్పి పూర్తిగా తగ్గును. సంతాన యోగ్యత కలుగును.
పైన సూచించిన రెండు యోగాలతో చాలా మందికి చికిత్స చేశాను . వీటిలో మీకు ఏది సులభంగా అనిపిస్తే దానిని పాటించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి