*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*"భగవంతునితో వ్యాపారము తగదు.*
*భగవంతుడు వ్యాపారస్తుడు కాదు.*
*ఈనాడు భక్తులు భగవాంతునితో బేరాలాడుతున్నారు.*
*తమ బాధలను నివృత్తి చేస్తే సుంకం చెల్లిస్తామని, కష్టాలు నివారణ అయితే మ్రొక్కుబడులు చెల్లిస్తామని భగవంతుని ఉపయోగించుకొంటున్నారు.*
*నీవు కొట్టే కొబ్బరికాయలు భగవంతునికి అవసరమా? నీవు ఇచ్చే ముడుపులు భగవంతుని వద్ద లేకనా?*
*భగవంతునికి ఈయవలసినవి నిశ్చల హృదయం, నిర్మలభావము, నిస్వార్ధ చర్య , పవిత్రమైన ప్రేమ మాత్రమే.*
*ఇవే స్వామి కోరేవి. వీటిని సమర్పించినప్పుడే స్వామికి ప్రీతి. మిగిలినవి ఎన్ని సమర్పించినా అవి నిరర్ధకములే."*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి