గురు కటాక్షం
ఒకరోజొక భక్తుడు పరమాచార్య స్వామివారితో, “గురు అనుగ్రహం ఇంకా కలగలేదు అందుకే మా అమ్మాయి పెళ్ళి ఆలస్యం అవుతోంది అని జ్యోతిష్కులు చెబుతున్నారు” అని దిగులుగా స్వామివారికి చెప్పుకున్నాడు.
శ్రీమఠం భక్తుడు తెడియుర్ వంచి అయ్యర్ అప్పుడు అక్కడే నిలబడి ఉన్నాడు. వెంటనే అతణ్ణి స్వాంతనపరుస్తూ ప్రేమతో, “నువ్వు చెబుతున్నది తప్పు. గురు కటాక్షం లభించింది. నువ్వు ప్రత్యక్ష గురు స్వరూపమైన పరమాచార్య సన్నిధికి వచ్చావు. కాబట్టి నీకు పూర్తిగా గురు కటాక్షం లభించింది. కాబట్టి ఇక ఏ అడ్డంకులు ఉండవు. మీ అమ్మాయి వివాహం త్వరలోనే జరుగుతుంది” అని చెప్పారు.
అవని మాసంలో ఇక పదిహేను రోజులే ఉన్నాయి. మరి ఈ అవని మాసం ముగిసే లోపల వివాహం ఎలా జరుగుతుంది? ఎందుకంటే తరువాత వచ్చే పురట్టాసి, ఐప్పసి, కార్తిగై(కార్తీకం), మార్గళి(ధనుర్మాసం) మాసాలు దాటిన తరువాతనే పెళ్ళి విషయాలు మాట్లడుకోగలం. ఇలా మనసులో పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నాడు అమ్మాయి తండ్రి.
పరమాచార్య స్వామివారి అనుగ్రహ వీక్షణం, సమ్మతం వంచి అయ్యర్ మాటల ద్వారా కలిగింది. అనుకోకుండా ఒకటి రెండు రోజుల తరువాత నిశ్చితార్థం జరిగింది. కొద్దిరోజులలోనే మాంగల్యధారణ వేడుక కూడా జరిగిపోయింది. కొత్త పెళ్ళి జంటను తీసుకుని వచ్చి ఆ భక్తుడు పరమ సంతోషంతో మహాస్వామి వారికి సాష్టాంగం చేసాడు.
లేచి నిలబడి స్వామివారికి నమస్కరించి, ”ఇంత త్వరగా పెళ్ళి నిశ్చయం అవ్వడం వల్ల నేనే స్వయంగా వచ్చి ఈ విషయం మీకు చెప్పలేక పోయాను పెరియవ. నన్ను క్షమించండి; కేవలం మీ కరుణాకటాక్షం వల్ల మంచి ఇంటి నుండు అబ్బాయి లభించాడు. ఇంత త్వరగా పెళ్ళి కూడా జరిగిపోయింది. . . ” అని ఆనందంతో చెప్పుకున్నాడు.
ఎప్పటిలాగే స్వామివారు చెయ్యెత్తి వారినందరిని ఆశీర్వదించి పంపారు.
--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 3
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
[23/04, 9:43 pm] +91 79892 77128: *మనకోసం మనం మారటానికి ఒక మంచి మాట.*
>>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<< *కోపం వచ్చినపుడు కళ్లనుండి కన్నీరు రానివ్వు కానీ మాటలు రానియ్యద్దు.*
*కన్నీటితో కోపంచల్లారు తుంది. కానీ, మాట జారితే ఎదురివారికి బాధ కలుగుతుంది.*
*మనం కనుక నోరు జారితే ఎదు టివారు జీవితపర్యంతంఆమాట తలుచుకుని కన్నీరు పెడతారు. అంతఅవసరమాఆలోచించండి.*
*"సాలెపురుగు ఎంతోసహనంతో గూడు కట్టుకుంటుంది ఒక్క చీపు రు దెబ్బకు మొత్తం పోతుంది. అయిన అది నిరాశ పడదు. మళ్లీ తన ప్రయత్నం మొదలు పె డుతుంది.మనంఅయినాఅంతే!.అన్నిటినీకోల్పోయినాభవిష్యత్తు యింకామిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయ త్నిస్తే విజయం మనదే!."*
*"నీకు,అబద్ధంచెప్పేవాళ్ళకి,నిన్ను కించపరిచే వాళ్ళకి, నీకు మ ర్యాద యివ్వని వాళ్ళకి, నిన్నుప ట్టించుకోని వాళ్ళకి దూరంగాఉం డాలి."*
*తాను ఏమి మాట్లాడాలో తెలిసి నవాడు తెలివైనవాడు*.
*తాను ఏమి మాట్లాడకూడదో తె లుసుకోగలిగినవాడువివేకవంతు డు. మౌనం ఆభరణం గా ఉండిఎ ప్పుడు ఏదిమాట్లాడకూడదోతెలి సిన వాడు మహర్షి.*
*"రంగులేనిపువ్వుకిఆకర్షణలేదు. అలలు లేని సముద్రానికి అందం లేదు. సూర్యుడులేని ప్రపంచానికి వెలు గు లేదు. అలాగే లక్ష్యం లేని జీవితానికి వి లువ లేదు."*
*"చేతికి నాలుగు గాజులు ఉన్న ప్పుడు చప్పుడౌతాయి. జాగ్రత్తగా కదిపితే చక్కని శబ్దం చేస్తాయి. కోపంగా విసిరితేపగిలిపోతాయి. అలాగే బంధాలుకూడాపదిలంగా చూసుకుంటే సంతోషాన్నిస్తాయి. దురుసుగా ఉంటే బాధను మిగు లుస్తాయి."*
*సర్వేషాంశాన్తిర్భవతు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి