2, జూన్ 2023, శుక్రవారం

తెలంగాణా పోరు - హోరు.

 తెలంగాణా పోరు - హోరు.


నాడొక తెలంగాణ పోరు

నేడొక తెలంగాణ జోరు

స్వీయస్వపరి పాలన కోరు

ఆత్మ బలిదానాల హోరు.


రగిలే మంటలు జ్వాలలై

పిడికిలి బిగించి చైతన్యమై

దశాబ్దాల సాగే పోరాటమై

నవ తెలంగాణ సాకారమై..


ఢిల్లిపాలనపై కత్తెత్తిన యోధ

సర్దార్.పాపన్నగౌడ్ ధీరుడై

భువనగిరిన రాజ్యమేలి

గొల్కొండన తలన వ్రేలాడే.


తెలంగాణ తొలి యోధుడు

భావి తరానికి ఊపిర్లూడి

స్వేచ్ఛ విప్లవాగ్ని రగిలించి 

తానొకసమిధైన ధీరుడు.


తొలి దశపు పోరాటాలు

యువకుల ఆత్మార్పణలు

రగిలించే నిప్పుల కెరటాలు

స్వతంత్ర రాష్ట్ర భావుకలు.


పాలకులు వేసిన పాచికలు

ఉద్యమం చతికిల పడంగా

చాపకింద నీరులా సాగేను

మూడు దశాబ్దాల మౌనం.


రాజకీయ చిత్రం మారే

ఓ నిప్పు కణిక రాజేసే

తెలంగాణ స్వరం పెరిగే

పరాయి పాలన కాదనే.


మా నిధులు మానీళ్ళంటూ

మానియామకాలు అంటూ

తెలంగాణ రణ నినాదాలు

పదు నాల్గేళ్ళ పోరాటాలు.


పోరాట సమితి పేరుతో

తెలంగాణ పోరు మొదలై 

స్వరాష్ట్ర ఏర్పాటుకాంక్షించి

సంకల్పించేను తెలంగానం.


కేసిఆర్ చేసే నిరాహార ధీక్ష

సకల జనులు చేసిన సమ్మె

ఉద్యోగి విద్యార్ధి కలిసి జేసే

ప్రజల పోరు ఉద్యమించే.


యాదగిరి, శ్రీకాంత చారీ

చేసిన ఆత్మ బలిదానాలు

జనం చేసిన పోరాటాలు

రహదారుల దిగ్బంధాలు.


కేంద్రమే దిగి వొచ్చేను

జనం కోరికను తీర్చేను

తెలంగాణ రాష్ట్రమొచ్చె

స్వతంత్ర పాలన తెచ్చే.


యేలు బంగారు తెలంగాణ

జేయు కోటిఎకరా మాగాణ

నేటి పాలన చేయు గణన

స్వేచ్చా గొంతు ప్రాంగణాన.


తెలంగాణ పోరాట యాదిలో

నాటి పోరు దశాబ్దాల చరితం 

నేడు స్వయంపాలన  దశాబ్ది ఉత్సవం



శుభాకాంక్షలు.



అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

కామెంట్‌లు లేవు: