2, జూన్ 2023, శుక్రవారం

ఈ రోజు పద్యము:

 178వ రోజు: (భృగు వారము) 02-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


గొప్ప వారలైన తప్పులు చేయుట 

సహజమగును చూడ జగతిలోన 

తప్పు దిద్దుకొనెడి తత్వమ్ము  మంచిది 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


ఈ ప్రపంచములో అందరు ఏ సమయములోనైనను ఏదో ఒక తప్పు తెలిసి కాని తెలియక కాని చేస్తూ ఉంటారు. కాని ఆ తప్పును ఎదుటి వారు తెలియజేసినపుడు దానిని సరి చేసుకొని తగు రీతిలో ప్రవర్తించుట మంచిది.  అంతే కాని తమ తప్పును ప్రకటించిన వారిపై క్రోధావేశములు, శతృత్వ భావము చూపరాదు. 

 

ఈ రోజు పదము. 

ఉడుత (Squirrel): ఉఱుత, చమరపుచ్ఛము, చిక్రోడము, వృక్షమర్కటిక, వృక్షశాయిక.

కామెంట్‌లు లేవు: